cancellation
-
25 వేల మంది టీచర్ల నియామకాలు రద్దు
న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్లో 2016 నుంచి పనిచేస్తున్న 25 వేల మంది ఉపాధ్యాయులు, సిబ్బంది నియామకాలను సుప్రీంకోర్టు రద్దు చేసింది. ఈ మేరకు 2024లో కోల్‌కతా హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది. నియామకాల్లో భారీ అక్రమాలు, అవకతవకలకు పాల్పడిన పశ్చిమబెంగాల్ స్కూల్ సర్వీస్ కమిషన్(డబ్ల్యూబీఎస్ఎస్సీ)కు అత్యున్నత న్యాయస్థానం తలంటింది. మొత్తం 25,753 మంది ఉపాధ్యాయులు, సిబ్బంది నియామకాల్లో అవకతవకలను, లోపాలను ఉద్దేశపూర్వకంగానే కప్పిపుచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేస్తూ..మొత్తం నియామకాలు చెల్లవని తీర్పు వెలువరించింది. మళ్లీ నియామకాలు చేపట్టాలని మమతా బెనర్జీ ప్రభుత్వాన్ని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమార్ల ధర్మాసనం గురువారం ఆదేశించింది. మరికొద్ది నెలల్లో అసెంబ్లీకి ఎన్నికలు జరగనుండగా చోటుచేసుకున్న ఈ పరిణామం టీఎంసీ ప్రభుత్వానికి షాక్ వంటిదని చెబుతున్నారు. ఎంపిక ప్రతి దశలోనూ పాల్పడిన అక్రమాలను కప్పిపుచ్చుకు నేందుకు డబ్ల్యూబీఎస్ఎస్సీ చేసిన అతి ప్రయత్నాల వల్ల ప్రస్తుతం పరిశీలన, ధ్రువీకరణ అసాధ్యంగా మారాయని ధర్మాసనం వ్యాఖ్యానించింది. అవకత వకల కారణంగా మొత్తం ఎంపిక ప్రక్రియ ఉద్దేశపూర్వకంగా లోపభూయిష్టంగా మారిందని నమ్ముతున్నట్లు స్పష్టం చేసింది. కోల్‌కతా హైకోర్టు మొత్తం నియామకాలను రద్దు చేస్తూ 2024 ఏప్రిల్‌లో ఇచ్చిన తీర్పును సమర్థించింది. పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పందిస్తూ, ఒక్క వ్యక్తి చేసిన తప్పిదానికి అందరినీ ఎలా శిక్షిస్తారని ప్రశ్నించారు. మానవీయ కోణంలో ఈ తీర్పును అంగీకరించబోనంటూనే సుప్రీం ఆదేశాలను అమలు చేస్తానని, న్యాయవ్యవస్థను గౌరవిస్తానంటూ ప్రకటించారు. -
నోబెల్ గ్రహీత వీసా రద్దు
శాన్‌జోస్: నోబెల్ శాంతి బహుమతి గ్రహీత, కోస్టారికా మాజీ అధ్యక్షుడు ఆస్కార్ అరియాస్ (84) వీసాను అమెరికా రద్దు చేసింది. దీనిపై అరియాస్ ఆశ్చర్యం వెలిబుచ్చారు. రద్దుకు కారణమేమిటో తనకు తెలియదని కోస్టారికా రాజధాని శాన్ జోస్‌లో మీడియాతో అన్నారు. ‘‘వీసా రద్దు చేస్తున్నట్టు అమెరికా అధికారులు మెయిల్ పంపారు. కానీ ఈ విషయమై ఎలాంటి వివరణా ఇవ్వలేదు’’అని చెప్పారు. ‘‘అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీరును రోమన్ చక్రవర్తితో పోలుస్తూ నేను బహిరంగ విమర్శలు చేశా. నేను అధ్యక్షుడిగా ఉండగా చైనాతో కోస్టారికా దౌత్య బంధాన్ని పునరుద్ధరించా. బహుశా ఇవన్నీ కారణమై ఉంటాయి’’అని అభిప్రాయపడ్డారు. సెంట్రల్ అమెరికాలో ఘర్షణల నివారణకు చేసిన కృషికి అరియాస్కు 1987లో నోబెల్ శాంతి బహుమతి దక్కింది. ఆయన 1986–1990, 2006–2010 మధ్య ఎనిమిదేళ్లు కోస్టారికా అధ్యక్షుడిగా ఉన్నారు. రెండో పదవీకాలంలో అమెరికాతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని ప్రోత్సహించారు. 2007లో తైవాన్‌కు దూరమై చైనాతో దౌత్య సంబంధాలను ఏర్పరచుకున్నారు. కోస్టారికా అధ్యక్షుడు రోడ్రిగో చావెజ్ అమెరికా ఒత్తిళ్లకు తలొగ్గి దేశంలో 5జీ సదుపాయాల అభివృద్ధి పనుల నుంచి చైనా సంస్థలను పక్కన పెట్టారు. దీన్ని వ్యతిరేకించిన ముగ్గురు కోస్టారిక చట్టసభ సభ్యుల వీసాలను అమెరికా రద్దు చేసింది. ఈ పరిణామాలపై అరియాస్ మండిపడ్డారు. అమెరికా ఒత్తిడికి రోడ్రిగో లొంగుతున్నారని సోషల్ మీడియా వేదికగా దుయ్యబట్టారు. ‘‘ఒక చిన్న దేశం అమెరికాతో విభేదించడం సులువు కాదు. అందులోనూ అమెరికా అధ్యక్షుడు రోమన్ చక్రవర్తిలా ప్రవర్తిస్తూ మిగతా ప్రపంచానికి ఏం చేయాలో, ఏం చేయొద్దో పొద్దస్తమానం చెబుతున్నప్పుడు మరింత కష్టం’’అంటూ ఎద్దేవా చేశారు. కోస్టారికాకు చెందిన మరో ప్రతిపక్ష శాసనసభ్యురాలి వీసాను కూడా అమెరికా మంగళవారం రద్దు చేసింది. -
‘జన్మతః పౌరసత్వ రద్దు’ బిల్లు సెనేట్‌కు
వాషింగ్టన్: అక్రమంగా లేదంటే తాత్కాలిక వీసాల మీద వలస వచ్చిన వాళ్లకు అమెరికాలో పిల్లలు పుడితే వారికి సంక్రమించే జన్మతః పౌరసత్వాన్ని రద్దుచేస్తూ రూపొందించిన బిల్లును అమెరికా పార్లమెంట్ ఎగువసభ(సెనేట్)లో అధికార రిపబ్లికన్ పార్టీ సభ్యులు గురువారం ప్రవేశపెట్టారు. పుట్టే పిల్లలకు ఎలాగూ పౌరసత్వం వస్తుందన్న ఏకైక కారణంతోనే అక్రమ వలసలు విపరీతంగా పెరుగుతున్నాయని, ఇది జాతీయ భద్రతను బలహీనపరుస్తోందని ఈ బిల్లును ప్రవేశపెట్టిన రిపబ్లికన్ సభ్యులు లిండ్సే గ్రాహమ్, టెడ్ క్రజ్, కేటీ బ్రిట్‌లు సెనేట్‌లో వ్యాఖ్యానించారు. ‘‘ఇన్నాళ్లూ జన్మతః పౌరసత్వాన్ని ప్రసాదించిన ప్రపంచంలోని 33 దేశాల్లో అమెరికా కూడా ఒకటిగా కొనసాగింది. ఈ విధానం చివరకు ‘పుట్టుకల పర్యాటకం’లా తయారైంది. ఉన్నంతలో స్థితిమంతులైన చైనా, ఇతర దేశాల పౌరులు ఉద్దేశపూర్వకంగా అమెరికాకు వచ్చి ఇక్కడ పిల్లల్ని కనేసి తమ సంతానానికి అమెరికా పౌరసత్వం దక్కేలా చేస్తున్నారు. అమెరికాకు ఇంతమంది రావడానికి జన్మతః పౌరసత్వం కూడా ఒక ప్రధాన కారణం’’ అని రిపబ్లికన్ నేతలు చెప్పారు. జన్మతః పౌరసత్వాన్ని రద్దుచేస్తూ ట్రంప్ ఇచ్చిన కార్యనిర్వాహక ఉత్తుర్వును విపక్ష డెమొక్రటిక్ పాలిత రాష్ట్రాలు ఫెడరల్ కోర్టులో సవాల్ చేసి ఉత్తర్వు అమలుపై స్టే తెచ్చుకున్న వేళ రిపబ్లికన్ సర్కార్ బిల్లును ప్రవేశపెట్టడం గమనార్హం. -
డాలర్ డ్రీమ్స్‌పై మరో పిడుగు!
హెచ్–1బీ వివాదంతో సతమతమవుతున్న భారత విద్యార్థుల డాలర్ కలలపై మరో పిడుగు పడబోతుందా? విద్యార్థుల వర్క్ పర్మిట్లను రద్దు చేయాలని అమెరికాలో స్థానిక విద్యార్థులు గొంతెత్తుతుండటం ఈ అనుమానానికి తావిస్తోంది. గ్రాడ్యుయేషన్ తర్వాత అంతర్జాతీయ విద్యార్థులు అమెరికాలో పనిచేయడానికి అనుమతించే ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ (ఓపీటీ) ప్రోగ్రామ్‌ను రద్దు చేయాలని అమెరికా టెక్ వర్కర్లు, విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. ఇది అమెరికాలో అత్యధికంగా ఉండే భారతీయ విద్యార్థులపై తీవ్ర ప్రభావం చూపనుంది. గతేడాది లక్ష మంది విద్యార్థులుఅంతర్జాతీయ విద్యార్థులు, ముఖ్యంగా ఎఫ్ –1 వీసాలపై ఉన్నవారు ఓపీటీ ప్రోగ్రామ్‌ను ఎంచుకుంటున్నారు. తొలుత తాత్కాలిక నైపుణ్యాభివృద్ధి కోసం ఈ ఓపీటీ ప్రోగ్రామ్‌ను రూపొందించారు. ఈ కార్యక్రమం ఎఫ్–1 వీసాలపై ఉన్న విదేశీ విద్యార్థులు స్టెమ్ డిగ్రీ కలిగి ఉంటే మూడేళ్ల వరకు అమెరికాలో పనిచేసేందుకు అనుమతిస్తుంది. సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, గణితం (స్టెమ్) రంగాల్లోని గ్రాడ్యుయేట్లకు 36 నెలల వరకు ఈ పొడిగింపు ఉంటుంది. అమెరికా లో అత్యధి కంగా అంతర్జాతీయ విద్యార్థులైన భారతీయ విద్యార్థులు వృత్తిపరమైన అవకాశాలు, చివరికి హెచ్–1బీ వీసాల కోసం ఈ కార్యక్రమంపైనే ఎక్కువగా ఆధారపడుతున్నారు. చాలా మంది విద్యార్థులు స్టెమ్ ఓపీటీ ఎక్స్‌టెన్షన్‌ను ఉపయోగిస్తున్నారు. 2023–24 విద్యా సంవత్సరంలో సుమారు 97,556 మంది భారతీయ విద్యార్థులు ఓపీటీలో చేరారు. కోర్టు చెప్పినా... విదేశీ ఉద్యోగులను పెంచే ఓపీటీ ప్రోగ్రామ్‌ను అమెరికన్లు వ్యతిరేకిస్తున్నారు. ఇది దీర్ఘకాలిక వలసకు ఉపయోగపడుతోందని అమెరికన్లు వాదిస్తున్నారు. అమెరికన్ల నుంచి ఉద్యోగాలను దూరం చేయడమేనని యూఎస్ టెక్ వర్కర్స్ గ్రూప్స్ విమర్శిస్తున్నాయి. ఈ కార్యక్రమాన్ని సవాలు చేస్తూ 2023లో వాషింగ్టన్ అలయన్స్ ఆఫ్ టెక్నాలజీ వర్కర్స్ (వాష్టెక్) కోర్టుకెళ్లింది. అయితే, కేసును సమీక్షించడానికి అమెరికా సుప్రీంకోర్టు నిరాకరించింది. కార్యక్రమానికి ఆమోదం తెలిపే దిగువ కోర్టు తీర్పును సమర్థించింది. మరోసారి చర్చలు.. జనవరి 20న ట్రంప్ ప్రమాణ స్వీకారానికి సిద్ధమవుతున్న తరుణంలో నైపుణ్యం కలిగిన కార్మికుల వలసలపై ఈ చర్చలు తీవ్రమయ్యాయి. ‘‘ఓపీటీ ప్రోగ్రామ్ విదేశీ విద్యార్థులకు ఇంటర్న్‌షిప్ తరహాలో గెస్ట్ వర్కర్ స్కీమ్. విశ్వవిద్యా లయాలు విద్యకు బదులుగా వర్క్ పర్మిట్లను విక్రయిస్తు న్నాయి. డీఏసీఏ (డిఫర్డ్ యాక్షన్ ఫర్ చైల్డ్‌హుడ్ అరైవల్స్) తరహాలో చట్టవి రుద్ధం. ఈ పోటీ నుంచి అమెరికన్ కాలేజీ గ్రాడ్యు యేట్లను రక్షించడానికి ఈ ఓపీటీని రద్దు చేయాలి’’ అని యూఎస్ టెక్ వర్కర్స్ గ్రూప్.. ఎక్స్‌లో పేర్కొంది. కాంగ్రెస్ ఆమోదం లేకుండా సాగుతున్న ఈ కార్యక్రమం.. యూఎస్ జాబ్ మార్కెట్లలోకి దొడ్డిదారి ప్రవేశమని విమర్శించింది. ప్రశ్నార్థకంగా భవిష్యత్...అధ్యక్షుడిగా ఎన్నికైన ట్రంప్ మద్దతు దారులు సైతం.. హెచ్–1బీ వీసాలపై మండిపడుతున్నారు. హెచ్–1బీ వీసా హోల్డర్లు, ప్రధానంగా భారతీయులు అమెరికన్ కార్మికుల స్థానాన్ని భర్తీ చేస్తున్నారని, పాశ్చాత్య నాగరికతకు ముప్పుగా పరిణమిస్తున్నారని వారు వాదిస్తున్నారు. అమెరికాలో ఇంజనీర్ల కొరత నేపథ్యంలో నైపుణ్యం కలిగిన విదేశీ ప్రతిభా వంతులను ఆకర్షించాల్సిన అవసరం ఉందని ట్రంప్‌తోపాటు.. ఎలన్ మస్క్, వివేక్ రామ స్వామి వంటి ప్రముఖులు చెబుతు న్నారు. ఈ ఓపీటీ కార్యక్రమాలను వారు సమ ర్థిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓపీటీ కార్య క్రమం భవిష్యత్ ఏమిటనేది ప్రశ్నా ర్థకంగా మారింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
తిరుమలలో ‘టూరిజం’ దర్శనాలు రద్దు
తిరుమల: టూరిజం కార్పొరేషన్లకు కేటాయిస్తున్న శ్రీవారి దర్శన టికెట్లను రద్దు చేస్తూ టీటీడీ నూతన పాలక మండలి నిర్ణయం తీసుకుంది. తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనం కోసం తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవిదేశాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తిరుమలకు వస్తుంటారు. వీఐపీ దర్శనం, ప్రత్యేక ప్రవేశ దర్శనం, సర్వదర్శనం తదితర విధానాల్లో భక్తులకు టీటీడీ స్వామివారి దర్శనం కల్పిస్తుంటుంది. వీటితో పాటు వివిధ రాష్ట్రాల టూరిజం కార్పొరేషన్లకు టీటీడీ నిత్యం ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను కేటాయిస్తుంటుంది.ఇందులో ఏపీ టూరిజం, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, పుదుచ్చేరి, కేరళ, ఐఆర్టీసీల ద్వారా భక్తులకు శ్రీవారి దర్శన భాగ్యం కల్పిస్తుంటుంది. దీనివల్ల సుదూర ప్రాంతాలకు చెందిన భక్తులు తక్కువ సమయంలోనే స్వామివారిని దర్శనం చేసుకొని తిరిగి వెళ్లేవారు. కానీ టీటీడీ నూతన పాలకమండలి తొలి సమావేశంలోనే ఈ దర్శన టికెట్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఇతర రాష్ట్రాల టూరిజం కార్పొరేషన్లకు టీటీడీ రోజూ 4 వేల టికెట్లు కేటాయిస్తుండేది. ఇందులో ఏపీ టూరిజానికి 1,000, తెలంగాణకు 800 టికెట్లు, మిగతా వాటికి 500, 400 చొప్పున టికెట్లు కేటాయించేది వీరికి మధ్యాహ్నం 2 గంటల స్లాట్ ద్వారా దర్శనం కల్పించేది. అయితే ఈ టికెట్ల అవకతవకలపై ఫిర్యాదులు రావడంతో ఏడు టూరిజం కార్పొరేషన్లకు దర్శన టికెట్లను రద్దు చేస్తూ టీటీడీ నిర్ణయం తీసుకుంది. దీనివల్ల సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు తీవ్ర ఇబ్బందులు తప్పవు. తప్పు చేసిన వారిని గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలి గానీ.. ఇలా అందరికీ దర్శన టికెట్లు నిలిపివేయడం సరికాదని ఇతర రాష్ట్రాల భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
లైంగిక వేధింపుల కేసు.. రాజీ కుదుర్చుకున్నా రద్దు చేయలేం: సుప్రీం
న్యూఢిల్లీ: లైంగిక వేధింపుల కేసులో సుప్రీంకోర్టు గురువారం కీల కీలకతీర్పు వెలువరించింది. లైంగిక వేధింపుల కేసులో ఫిర్యాదుదారుల కుటుంబంతో నిందితుడు రాజీ కుదుర్చుకున్నంత మాత్రాన కేసును కొట్టివేయడం కుదరదని తేల్చిచెప్పింది. ఈ కేసులోనిందితుడికి ఉపశమనం కలిగిస్తూ రాజస్థాన్ హైకోర్టు ఇచ్చిన తీర్పుపైనా అత్యున్నత ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. దిగువ న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలను సైతం కొట్టివేసింది. 2022లో జస్థాన్‌లోని గంగాపూర్ నగరంలో లైంగిక వేధింపుల కేసు నమోదైంది. తనపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు మైనర్ బాలిక ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీని ఆధారంగా ప్రభుత్వ ఉపాధ్యాయుడిపై పోక్సో చట్టంతో పాటు ఎస్సీ, ఎస్టీ (అట్రాసిటీల నిరోధక) కేసులు నమోదు చేశారు. మైనర్ బాలిక వాంగ్మూలాన్ని కూడా నమోదు చేశారు. ఆ తర్వాత నిందితుడు విమల్ కుమార్ గుప్తా స్టాంప్ పేపర్‌పై బాలిక కుటుంబం నుంచి ఓ వాంగ్మూలాన్ని తెచ్చాడు.అందులో తాము నిందితుడిని అపార్థం చేసుకుని పోలీసులకు ఫిర్యాదు చేశామని.. ఇకపై ఉపాధ్యాయుడిపై ఎటువంటి చర్యలు తీసుకోకూడదని బాధిత కుటుంబం పేర్కొన్నట్టుగా ఉంది. పోలీసులు దీనిని అంగీకరించి కోర్టుకు నివేదిక సమర్పించారు. అయితే కింది కోర్టు ఈ చర్యను తోసిపుచ్చింది. దీంతో నిందితులు హైకోర్టును ఆశ్రయించారు. బాధిత కుటుంబం వాంగ్మూలాన్ని అంగీకరించిన హైకోర్టు.. ఎఫ్ఐఆర్ను రద్దు చేయాలని పోలీసులను ఆదేశించింది.అయితే హైకోర్టు తీర్పును రామ్‌జీ లాల్ బైర్వా అనే సామాజిక కార్యకర్త సుప్రీంకోర్టులో సవాలు చేశారు. ఈ కేసు పూర్వాపరాలు గమనించిన జస్టిస్ సిటి రవికుమార్, జస్టిస్ పివి సంజయ్ కుమార్‌లతో కూడిన ధర్మాసనం.. హైకోర్టు తీర్పును రద్దు చేసింది. రాజీ కుదుర్చుకున్నంత మాత్రాన కేసును రద్దు చేయలేమని స్పష్టం చేసింది.అలాగే ఈ కేసును తిరిగి విచారించాలని ఆదేశించింది. -
కేశవాపురం రిజర్వాయర్ కాంట్రాక్టు రద్దు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ తాగునీటి అవసరాలకు గాను గత బీఆర్ఎస్ ప్రభుత్వం తలపెట్టిన కేశవాపురం రిజర్వాయర్ పనుల ప్రతిపాదనకు రాష్ట్ర ప్రభుత్వం బ్రేక్ వేసింది. మేఘా ఇంజనీరింగ్ కంపెనీకి ఇచ్చిన కాంట్రాక్టును రద్దు చేసింది. గోదావరి ఫేజ్– 2లో భాగంగా గోదావరి జలాలను కొండపోచమ్మ సాగర్ నుంచి శామీర్‌పేట్ సమీపంలో నిర్మించే కేశవాపురం రిజర్వాయర్‌కు, అక్కడి నుంచి హైదరాబాద్‌కు నీటిని తరలించేలా గత ప్రభుత్వం డీపీఆర్ తయారు చేసింది. ఆరేళ్ల క్రితమే మేఘా కంపెనీకి కాంట్రాక్టు అప్పగించింది. అయితే పనులు ప్రారంభించకపోవడంతో ఈ కాంట్రాక్టును రద్దు చేస్తూ తాజాగా పురపాలక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే కేశవాపురం ప్రాజె క్టుకు అయ్యే రూ. 2 వేల కోట్లతోనే గోదావరి ఫేజ్–2 పథకాన్ని మల్లన్నసాగర్ నుంచి ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ జలాశయాల వరకు పొడిగించి, హైదరాబాద్‌కు తాగునీరు అందించేలా కొత్త ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు ప్రభుత్వం తెలిపింది. తాగునీటికి 10, జంట జలాశయాలకు 5 టీఎంసీలు మల్లన్నసాగర్ నుంచి తరలించే 15 టీఎంసీల జలాల్లో 10 టీఎంసీలు హైదరాబాద్ ప్రజల తాగు నీటికి, 5 టీఎంసీలు జంట జలాశయాలకు అందించనున్నారు. మల్లన్నసాగర్ నుంచి బహుళ ప్రయోజనాలుండేలా 15 టీఎంసీల నీటిని పంపింగ్ చేసే ప్రాజెక్టు చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తీసుకున్న నిర్ణయానికి ఇటీవల రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. త్వరలోనే ఈ పనులకు టెండర్లు పిలవాలని హైదరాబాద్ వాటర్ బోర్డ్ అధికారులను సీఎం ఆదేశించారు. గత ప్రభుత్వ ప్రతిపాదన ఇలా.. గత ప్రభుత్వ ప్రతిపాదన ప్రకారం.. ఎల్లంపల్లి నుంచి మిడ్‌మానేరు మీదుగా వచ్చే గోదావరి నీళ్లను మల్లన్నసాగర్ నుంచి కొండపోచమ్మ సాగర్‌కు తరలించి అక్కడినుంచి ఎత్తిపోతల ద్వారా 5 టీఎంసీల కేశవాపురం చెరువును నింపాల్సి ఉంటుంది. అక్కడి నుంచి ఘన్పూర్ మీదుగా హైదరాబాద్‌కు తాగునీటి కోసం 10 టీఎంసీలు సరఫరా చేస్తారు. అయితే ఆరేళ్లయినా ఈ పనులు ప్రారంభం కాలేదు. భూ సేకరణ చిక్కులతో పాటు అలైన్మెంట్ లోపాలతో పనులు ముందుకు సాగలేదని ప్రభుత్వం గుర్తించింది. పనులు ప్రారంభించని నిర్మాణ సంస్థ బీఆర్ఎస్ హయాంలో రిజర్వాయర్ నిర్మాణ టెండర్లను దక్కించుకున్న మేఘా ఇంజనీరింగ్ కంపెనీ వివిధ కారణాలతో పనులు ప్రారంభించలేదు. అ యితే 2017 నాటి ఎస్ఎస్ఆర్ రేట్ల ప్రకారం పను లు చేపట్టలేమని, 2024 ఎస్ఎస్ఆర్ రేట్ల ప్రకారం అంచనాలను సవరించాలని కోరుతూ ఇటీవలే ప్రభుత్వానికి లేఖ రాసింది. అయితే రేట్ల పెంపును తిరస్కరించటంతో పాటు ఇప్పటివరకు పనులు చేపట్టని కారణంగా ఆ కంపెనీకి ఇచ్చిన కాంట్రాక్టును రద్దు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కొత్త డిజైన్‌లో మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు కూడా.. కాంగ్రెస్ సర్కార్ మార్చిన డిజైన్‌లోని కొత్త రూట్ ప్రకారం.. మల్లన్నసాగర్ నుంచి ఘన్‌పూర్‌కు అక్కడినుంచి నేరుగా హైదరాబాద్‌కు నీటిని సరఫరా చేస్తారు. దీనితో పాటు మూసీ పునరుజ్జీవ పథకంలో భాగంగా జంట జలాశయాలైన ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్లకు 5 టీఎంసీలు సరఫరా చేస్తారు. ఎక్కువ శాతం నీరు గ్రావిటీతో వచ్చేలా పనులు చేపట్టాలని నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. మల్లన్నసాగర్ బెస్ట్ ఆప్షన్!కొండపోచమ్మ సాగర్‌కు 15 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యమే ఉండగా.. మల్లన్నసాగర్‌కు 50 టీఎంసీల కెపాసిటీ ఉంది. కొండపోచమ్మ సాగర్‌లో 8 టీఎంసీల నీళ్లుంటే తప్ప నీటిని పంపింగ్ చేయడం వీలుకాదు. అదే మల్లన్నసాగర్లో డెడ్ స్టోరేజీ నుంచి కూడా నీటిని పంప్ చేసుకునే వీ లుంది. అందుకే కొండపోచమ్మ సాగర్‌కు బదులు మల్లన్నసాగర్‌ను ఎంచుకున్నట్లు అధికార వర్గా లు తెలిపాయి.పాత ప్రతిపాదనలో అక్కారం, మర్కూర్, కొండపోచమ్మ సాగర్, బొమ్మరాసిపేట, ఘన్పూర్.. మొత్తం 5 చోట్ల నీటిని పంపింగ్ చేయాలి. కానీ కొత్త డిజైన్‌లో మల్లన్నసాగర్, ఘన్‌పూర్‌ల వద్ద నీటిని పంపింగ్ చేస్తే సరిపోతుంది. ప్రస్తుతం గోదావరి, కృష్ణా నుంచి హైదరాబాద్‌కు తాగునీరు అందించేందుకు ఒక కిలో లీటర్‌కు రూ.48 వరకు ఖర్చు అవుతుండగా, కొత్త ప్రాజెక్టు పూర్తయితే కేవలం రూ.4 ఖర్చవుతుందని ప్రభుత్వం లెక్కలు వేసింది. -
NEET UG Result 2024: నీట్లో ఆరుగురి ఫస్ట్ ర్యాంకు గల్లంతు!
న్యూఢిల్లీ: జాతీయ అర్హత, ప్రవేశ పరీక్ష–అండర్ గ్రాడ్యుయేట్(నీట్–యూజీ)లో కొందరు అభ్యర్థులకు కేటాయించిన గ్రేసు మార్కులను రద్దు చేస్తున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) సుప్రీంకోర్టుకు తెలియజేసిన నేపథ్యంలో టాప్ ర్యాంకర్లపై ప్రభావం పడబోతోంది. టాపర్లలో కొందరు 60 నుంచి 70 శాతం పాయింట్లు కోల్పోతారని అంచనా. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈసారి ఏకంగా 67 మంది ఫస్ట్ ర్యాంకు సాధించిన సంగతి తెలిసిందే. వీరిలో గ్రేసు మార్కులతో ఫస్ట్ ర్యాంకు పొందినవారు ఆరుగురు ఉన్నారు. గ్రేసు మార్కులను రద్దు చేస్తుండడంతో వీరు ఫస్టు ర్యాంకును కోల్పోనున్నట్లు సమాచారం. అంటే టాపర్ల సంఖ్య 61కి పరిమితం కానుందని అంచనా వేస్తున్నట్లు ఎన్టీఏ వర్గాలు వెల్లడించాయి. నీట్–యూజీలో అక్రమాలు జరిగాయని, 1,563 మందికి ఉద్దేశపూర్వకంగా గ్రేసు మార్కులు కేటాయించారని ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో అభ్యర్థుల మార్కులను ఎన్టీఏ పునర్ మూల్యాంకనం చేస్తోంది. గ్రేసు మార్కులను రద్దు చేసి, మళ్లీ ర్యాంకులు కేటాయించబోతున్నారు. గ్రేసు మార్కులు రద్దయిన వారికి ఈ నెల 23న మళ్లీ పరీక్ష నిర్వహిస్తారు. ఇదిలా ఉండగా, నీట్ పరీక్షలో ఎలాంటి అవకతవకలు జరగలేదని ఎన్ఏటీ స్పష్టంచేసింది. యథాతథంగా కౌన్సెలింగ్! నీట్ కౌన్సెలింగ్‌ను నిలిపివేయాలని, అక్రమాలపై సీబీఐ దర్యాప్తు జరిపించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు బుధవారం విచారణ చేపట్టింది. షెడ్యూల్ ప్రకారం వచ్చేనెల 6వ తేదీ నుంచి జరగాల్సిన కౌన్సిలింగ్ నిలిపివేసేందుకు నిరాకరించింది. -
NEET UG 2024: ‘నీట్’ గ్రేసు మార్కులు రద్దు
సాక్షి, న్యూఢిల్లీ: ఎంబీబీఎస్‌తోపాటు ఇతర వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన జాతీయ అర్హత, ప్రవేశ పరీక్ష–అండర్ గ్రాడ్యుయేట్(నీట్–యూజీ)–2024లో 1,563 మంది అభ్యర్థులకు కేటాయించిన గ్రేసు మార్కులను రద్దుచేసి, వారికి మళ్లీ పరీక్ష నిర్వహించడానికి సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) నియమించిన కమిటీ చేసిన సిఫార్సుల మేరకు ఆయా అభ్యర్థులకు మళ్లీ పరీక్ష నిర్వహించనున్నట్లు కేంద్రం చెప్పిన విషయాన్ని న్యాయస్థానం పరిగణనలోకి తీసుకుంది. 1,563 మంది అభ్యర్థుల ప్రస్తుత స్కోరు కార్డు రద్దుచేసి, వాస్తవ మార్కులు కేటాయించి, జూన్ 23న వారికి మళ్లీ పరీక్ష నిర్వహించి, జూన్ 30లోగా ఫలితాలు వెల్లడిస్తామన్న ఎన్టీఏ ప్రతిపాదనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎన్టీఏ కమిటీ చేసిన సిఫార్సులు న్యాయమైనవి, సహేతుకమైనవి, సమర్థనీయమైనవి అని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. మే 5న నిర్వహించిన నీట్–యూజీ పరీక్షలో వివిధ కారణాలతో 1,563 మందికి గ్రేసు మార్కులు ఇవ్వడాన్ని సవాలు చేయడంతోపాటు నీట్–యూజీ–2024ను మొత్తంగా రద్దు చేసి, మళ్లీ పరీక్ష నిర్వహించాలని కోరుతూ దాఖలైన వేర్వేరు పిటిషన్లపై జస్టిస్ విక్రమ్‌నాథ్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన సుప్రీంకోర్టు వెకేషన్ బెంచ్ గురువారం విచారణ చేపట్టింది. కేంద్ర ప్రభుత్వం తరఫున న్యాయవాది కనూ అగర్వాల్ వాదనలు వినిపించారు. 1,563 మందికి ఇచ్చిన గ్రేసు మార్కులు రద్దుచేసి, వారికి మరోసారి పరీక్ష నిర్వహిస్తామని తెలిపారు. నీట్‌కు హాజరైన అభ్యర్థుల్లో భయాందోళన తొలగించడానికి ఎన్టీఏ కమిటీ ఈ నిర్ణయం తీసుకుందని చెప్పారు. 1,563 మంది అభ్యర్థుల స్కోరు కార్డును రద్దు చేయాలంటూ కమిటీ సిఫార్సు చేసిందన్నారు. గ్రేసు మార్కులు రద్దయిన అభ్యర్థులకు మళ్లీ పరీక్ష నిర్వహించి, జూన్ 30లోగా ఫలితాలు వెల్లడిస్తామని ఎన్టీఏ తరఫు సీనియర్ న్యాయవాది నరేష్ కౌశిక్ తెలిపారు. షెడ్యూల్ ప్రకారమే కౌన్సెలింగ్ జూలై 6 నుంచి ప్రారంభమవుతుందని వెల్లడించారు. గ్రేసు మార్కులు రద్దయినవారికి రెండు ఐచి్ఛకాలు ఇస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. వారు మరోసారి పరీక్ష రాయవచ్చు లేదా గ్రేసు మార్కులు రద్దయిన తర్వాత వచ్చిన వాస్తవ మార్కులతో కౌన్సిలింగ్‌కు హాజరు కావొచ్చని వెల్లడించింది. జూలై 6న ప్రారంభం కానున్న కౌన్సెలింగ్‌ను నిలిపివేసేందుకు ప్రభుత్వం నిరాకరించింది. పిటిషన్లపై విచారణ ముగిస్తున్నాం.. ‘‘కోర్టు ముందుంచిన అన్ని అంశాలనూ పరిశీలించాం. జూన్ 12న ఎన్టీఏ కమిటీ చేసిన సిఫార్సులు న్యాయబద్ధంగా, సహేతుకంగా, సమర్థనీయంగా ఉన్నాయి. 1,563 మందికి మళ్లీ నీట్ నిర్వహించడానికి ఎన్టీఏకు అనుమతిస్తున్నాం. ఈ పిటిషన్లపై విచారణ ముగిస్తున్నాం. పరిహార మార్కులకు సంబంధించి అన్ని అంశాలను మూసివేసినట్లే. ఇతర సమస్యలకు సంబంధించి ప్రతివాదుల స్పందనకు రెండు వారాల గడువు ఇస్తున్నాం. తదుపరి విచారణను జూలై 8వ తేదీకి వాయిదా వేస్తున్నాం’’ అని ధర్మాసనం తీర్పు వెలువరించింది. అసలు ఏమిటీ వివాదం? ఈ ఏడాది నీట్–యూజీ పరీక్షకు దేశవ్యాప్తంగా 24 లక్షల మందికిపైగా అభ్యర్థులు హాజరయ్యారు. ఎన్సీఈఆర్టీ పుస్తకాలు మారడంతోపాటు మేఘాలయా, హరియాణా, ఛత్తీస్‌గఢ్, సూరత్, చండీగఢ్‌లోని మొత్తం ఆరు ఎగ్జామ్ సెంటర్లలో ఓఎంఆర్ షీట్లు చిరిగిపోవడం, ఒక పేపర్‌కు బదులు మరో పేపర్ ఇవ్వడం, తద్వారా పరీక్ష నిర్వహణలో జాప్యం వంటి కారణాలతో 1,563 మంది అభ్యర్థులకు నష్టపరిహారం కింద గ్రేసు మార్కులు ఇచ్చారు. ఈ ఏడాది మొత్తం 67 మంది ఫస్ట్ ర్యాంకు సాధించారు. వీరందరికీ 720కి 720 మార్కులు రావడం గమనార్హం. ఇలా జరగడం ఎన్టీఏ చరిత్రలో ఇదే మొదటిసారి. గత ఏడాది కేవలం ఇద్దరికే ఫస్టు ర్యాంకు వచ్చింది. ఈసారి ఫస్ట్ట్ ర్యాంకు సాధించిన 67 మందిలో గ్రేసు మార్కులతో ఫస్టు ర్యాంకు కొట్టినవారు 50 మంది ఉన్నారు. ఫిజిక్స్ ఆన్సర్ కీలో మార్పుల వల్ల 44 మంది, ఎగ్జామ్‌లో సమయం కోల్పోవడం వల్ల ఆరుగురు గ్రేసు మార్కులు పొందారు. కొందరికి ఇచ్చిన గ్రేసు మార్కుల వల్ల తాము నష్టపోతున్నామని పలువురు అభ్యర్థులు ఆరోపించారు. ఈ మార్కుల కేటాయింపులో డబ్బు చేతులు మారిందని విమర్శించారు. కోర్టును ఆశ్రయించారు. అలాగే పరీక్ష పేపర్ లీక్ అయ్యిందని, ఎగ్జామ్‌లో రిగ్గింగ్ జరిగిందన్న ఆరోపణలు కూడా వస్తున్నాయి. చివరకు ఈ వ్యవహారం రాజకీయ రంగు పులుముకుంది. నీట్‌ను రద్దు చేయాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి. అయితే, సుప్రీంకోర్టు 2018లో ఇచ్చిన తీర్పులో నిర్దేశించిన ఫార్ములా ప్రకారమే అభ్యర్థులకు గ్రేసు మార్కులు ఇచ్చామని, ఇందులో తమ సొంత నిర్ణయం ఏమీ లేదని నీట్‌ను నిర్వహించి, ఫలితాలు ప్రకటించిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ చెబుతోంది. అభ్యర్థుల్లో పోటీతత్వం పెరగడం వల్లే ఈసారి ఎక్కువ మందికి ఫస్టు ర్యాంకు వచ్చిందని, ఇందులో ఎలాంటి అక్రమాలు జరగలేదని పేర్కొంటోంది. మరోవైపు, అభ్యర్థులకు ఇచ్చిన గ్రేసు మార్కులను పునఃసమీక్షించడానికి కేంద్ర విద్యా శాఖ యూపీఎస్సీ మాజీ చైర్మన్ నేతృత్వంలో నలుగురు సభ్యులతో ఒక కమిటీని నియమించింది. -
‘ప్రజ్వల్ రేవణ్ణ దౌత్య పాస్‌పోర్టు రద్దు చేయండి’
బెంగళూరు: లైంగిక దాడి కేసు నమోదైన హసనా ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ దౌత్య పాస్‌పోర్టు రద్దు చేయమని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రధాని నరేంద్ర మోదీకి బుధవారం లేఖ రాశారు. ‘‘ప్రజ్వల్ రేవణ్ణకు సంబంధించిన అసభ్య వీడియోలు వైరల్ అయిన తర్వాత ఏప్రిల్ 27న ప్రజ్వల్ రేవణ్ణ దౌత్య పాస్పోర్టుతో దేశం వదిలి వెళ్లిపోయారు. ఇది చాలా సిగ్గు చేటు. ప్రజ్వల్ దేశం వదిలి వెళ్లిన తర్వాత కొన్ని గంటల్లోనే ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదైంది. క్రిమినల్ ప్రోసిడింగ్స్ నుంచి తప్పించుకోవడానికి ప్రజ్వల్ దౌత్య పాస్‌పోర్టును దుర్వినియోగం చేస్తున్నారు. దయచేసి ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకోవాలని కోరుతున్నా. ప్రజ్వల్ దౌత్య పాస్‌పోర్టు రద్దు చేయడానికి తగిన చర్యలు తీసుకోండి’’ అని సీఎం సిద్ధారామయ్యలో తన లేఖలో పేర్కొన్నారు. ఇక.. సిద్ధరామయ్య రాసిన లేఖపై కేంద్ర విదేశి వ్యవహారాల మంత్రి శాఖ ప్రజ్వల్ రేవణ్ణ దౌత్య పాస్‌పోర్టు రద్దు చేసే ప్రక్రియ కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. లైంగిక దాడి, అసభ్య వీడియోల కేసులో కర్ణాటక ప్రభుత్వ సమగ్రమైన దర్యాప్తు కోసం సిట్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే ప్రజ్వల్ రేవణ్ణపై సిట్ దర్యాప్తు కొనసాగిస్తోంది. ప్రజ్వల్‌పై సిట్ విచారణ అధికారులు లుక్ అవుట్, బ్లూ కార్నర్ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.అంతకుముందు ఈ కేసు విషయంలో ప్రజ్వల్‌పై అరెస్ట్ వారెంట్ ఆధారంగా దౌత్య పాస్‌పోర్ట్ రద్దు చేయాలన్న తమ అభ్యర్థనపై కేంద్రం స్పందించటల లేదని కార్ణాటక హోం మంత్రి జీ పరమేశ్వర తెలిపారు. కోర్టు అరెస్ట్ వారెంట్నపు జారీ చేసినా.. దౌత్య పాస్‌పోర్టు రద్దు విషయంలో కేంద్రం ఇంకా స్పందిచటం లేదని తెలిపారు. -
ఆ ఇద్దరి నామినేషన్లు రద్దు చేయాల్సిందే.. బీజేపీ డిమాండ్
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్లో ఒక సిట్టింగ్ ఎంపీ సహా ఇద్దరు తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థుల నామినేషన్లను రద్దు చేయాల్సిందేనని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తోంది. వారి నామినేషన్లు పత్రాల్లో తీవ్రమైన లోపాలు ఉన్నాయని ఆ రాష్ట్ర బీజేపీ ఎన్నికల కమిషన్ని ఆశ్రయించింది.బీజేపీ పశ్చిమ బెంగాల్ ప్రధాన కార్యదర్శి జగన్నాథ్ ఛటోపాధ్యాయ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ కోల్‌కతా-దక్షిణ్ నుంచి తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థి, సిట్టింగ్ ఎంపీ మాలా రాయ్ ఎంపీగానే కాకుండా కోల్‌కతా మున్సిపల్ కార్పొరేషన్ చైర్‌పర్సన్‌గా కూడా ఉన్నారని పేర్కొన్నారు. లాభదాయకమైనదిగా పరిగణించే ఆ పదవికి రాజీనామా చేయకుండానే ఆమె ఈసారి నామినేషన్ దాఖలు చేశారని చటోపాధ్యాయ చెప్పారు.మరో తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థి, ఉత్తర 24 పరగణాల జిల్లాలోని బసిర్హత్ లోక్‌సభ నుంచి పోటీ చేస్తున్న హాజీ నూరుల్ ఇస్లాం నామినేషన్‌ను కూడా రద్దు చేయాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. నూరుల్ ఇస్లాం ఇదే నియోజకవర్గం నుంచి తృణమూల్ కాంగ్రెస్ ఎంపీగా 2009 నుంచి 2014 వరకు పనిచేశారు.నామినేషన్ దాఖలు చేసేవారెవరైనా ఇంతకు ముందు ఏదైనా ప్రభుత్వ, శాసనసభ లేదా పార్లమెంటరీ హోదాలో ఉన్నట్లయితే తమ నామినేషన్‌తో పాటు గత 10 సంవత్సరాలకు ప్రభుత్వం నుంచి నో డ్యూ సర్టిఫికెట్‌ను సమర్పించాల్సి ఉంటుందని, కానీ నూరుల్ ఇస్లాం ఆ నో డ్యూ సర్టిఫికెట్‌ను సమర్పించలేదని బీజేపీ పశ్చిమ బెంగాల్ ప్రధాన కార్యదర్శి జగన్నాథ్ ఛటోపాధ్యాయ అభ్యంతరం వ్యక్తం చేశారు.బీర్భూమ్ లోక్‌సభ నియోజకవర్గానికి తమ మొదటి అభ్యర్థి, మాజీ ఐపీఎస్ అధికారి దేబాసిష్ ధర్ నామినేషన్‌ను ఇదే కారణంతో రద్దు చేశారని ఛటోపాధ్యాయ గుర్తు చేశారు. దీంతో తాము అభ్యర్థిని మార్చవలసి వచ్చిందన్నారు. రాయ్, ఇస్లాం నామినేషన్లలో ఈ లోపాలను ఎత్తిచూపుతూ ఇప్పటికే ఈసీని ఆశ్రయించామని, ఈ విషయంలో సుప్రీంకోర్టు సహా ఎంత వరకూ అయినా వెళ్తామని చటోపాధ్యాయ స్పష్టం చేశారు. దీనిపై తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థుల నుంచి ఎటువంటి స్పందన లేదు. -
పవన్ ఆపసోపాలు.. హైదరాబాద్ ఫాంహౌస్‌కు జంప్
‘‘రెండు రోజులు ప్రచారం చేయలేని వాడు ఎమ్మెల్యే అవుతాడా?. హైదరాబాద్ ఫాంహౌస్‌లకు అలవాటు పడిన వాడు పిఠాపురంలో ఇల్లు కట్టుకుంటాడా?. పార్ట్‌టైం పాలిట్రిక్స్ చేస్తే జనం నమ్ముతారా?. స్టంట్లలో డూపులను పెట్టినట్టు.. జనసేన సింబల్ కింద టీడీపీ నేతలతో పోటీ చేయిస్తావా?. ఇదేనా నిఖార్సయిన రాజకీయం?. ఇదేనా గోదావరి ప్రజల ముందుకెళ్లి తేల్చుకునే అంశం?’’ అంటూ పవన్‌కల్యాణ్‌పై సోషల్ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి. జ్వరం కారణంగా పవన్ కల్యాణ్ తెనాలి పర్యటనను రద్దు చేసుకున్నారు. హైదరాబాద్‌కు వెళ్లిపోయిన పవన్.. మూడు రోజుల పాటు విశ్రాంతి తీసుకోనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఒక్కరోజు ఎండలో తిరిగేసరికి జ్వరం వచ్చి వెంటనే ఆస్పత్రికి పరుగెత్తే పరిస్థితి వచ్చింది.. దీంతో అయన టూర్ కోసం ఈరోకు ఎదురు చూసిన జనసైనికులు.. అక్కడి ఓటర్లు అయ్యో.. సేనాని దమ్ము ఇంతేనా.. ముదురు కబుర్లు చెప్పడం.. నోటికొచ్చినట్లు అరవడం.. స్క్రిప్టెడ్ డైలాగ్స్ చెప్పడం తప్ప ఆయనకు పట్టుమని రెండ్రోజులు కూడా ప్రజల్లో ఉండే స్టామినా లేదా అని నవ్వుకుంటూన్నారు. ఇక ఈయన మిగతా నియోజకవర్గాల్లో టూర్లు చేస్తారా.. క్యాడర్ కోసం అన్ని జిల్లాలు ఈ నిప్పులుగక్కే ఎండల్లో తిరిగి ప్రచారం చేయగలరా? పిఠాపురం ఒక్కదానికే ఆయన ఆపసోపాలు పడిపోతుంటే మిగతా జిల్లాలకు వస్తారన్న నమ్మకమే పోతోంది అంటున్నారు. ఆయన్ను నమ్ముకుని టిక్కెట్లు తెచ్చుకుని డబ్బులు ఖర్చు చేసి పోటీకి దిగిన మా పరిస్థితి ఏమిటని అభ్యర్థుల్లో ఆందోళన మొదలైంది. దీంతో ఆగండాగండి రెండ్రోజులు రెస్ట్ తీసుకుని.. బ్రాయిలర్ కోడి మళ్లీ కోలుకుని కూతకు వస్తుంది అని కొందరు పంచులు వేస్తున్నారు. మరో వైపు, పిఠాపురంలో పవన్ కల్యాణ్ పిల్లి మొగ్గలు వేస్తున్నారు. గతంలో టీడీపీని గెలిపిస్తే నన్ను నా తల్లిని తిట్టారు.. టీడీపీ వాళ్ళను వదిలిపెట్టను అన్నారు. కానీ, మళ్ళీ టీడీపీతో అంటకాగుతున్నారు. ఇక ఇప్పుడు పిఠాపురంలో పోటీకి దిగిన పవన్ కళ్యాణ్‌కు ఇప్పుడు ఎన్నికలు అంటే అసలు భయం పట్టుకుని తనను తానూ ఓ యోధుడిగా భావించుకుని రాజకీయాలు చేస్తున్నారు. పవన్ గతంలో భీమవరం.. గాజువాక.. రెండుచోట్లా ఓడిపోవడంతో షాక్ తిన్నారు. దీంతో ఇప్పుడు పిఠాపురంలో ఎలాగైనా గెలిపించాలని అర్థిస్తున్నారు. సీఎం అవ్వాలనుకుంటే నన్నెవడ్రా ఆపేది అనే డైలాగ్స్ దగ్గర్నుంచి ప్లీజ్.. నన్ను గెలిపించండి.. అర్థిస్తున్నాను అనేవరకు పవన్ వచ్చారు. -సిమ్మాదిరప్పన్న -
Nitin Gadkari: విరాళాల్లేకుండా పార్టీలు మనలేవు
అహ్మదాబాద్: ఎలక్టోరల్ బాండ్ల పథకాన్ని సుప్రీంకోర్టు రద్దుచేశాక ఈ పథకంపై ప్రజాక్షేత్రంలో చర్చోపచర్చలు జరుగుతున్న వేళ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తన మనసులో మాట చెప్పారు. ‘‘ అసలు విరాళాలు తీసుకోకుండా ఏ రాజకీయ పార్టీ కూడా మనుగడ సాధించలేదు. సదుద్దేశంతోనే ఎలక్టోరల్ బాండ్ల పథకం తెచ్చాం. పథకాన్ని సుప్రీంకోర్టు రద్దుచేయకుండా అందులోని లోటుపాట్లను సరిచేయాలని సూచనలు చేస్తే బాగుండేది. సూచనల మేరకు అప్పుడు అన్ని రాజకీయ పార్టీలు కూర్చుని చర్చించుకునే అవకాశం దొరికేది. ఏకాభిప్రాయంతో సవరణలు చేసేవాళ్లం’ అని అన్నారు. శుక్రవారం గాంధీనగర్‌లోని ‘గిఫ్ట్ సిటీ’లో జరిగిన ఒక కార్యక్రమంలో గడ్కరీ మాట్లాడారు. ‘గతంలో అరుణ్ జైట్లీ కేంద్ర మంత్రిగా ఉన్నపుడు ఇలాంటి పథకం ఒకటి ఉంటే మంచిదని చర్చ జరిగినప్పుడు నేను అందులో పాల్గొన్నా. వనరులు లేకుండా రాజకీయ పార్టీల మనుగడ అసాధ్యం. కొన్ని దేశాల్లో ప్రభుత్వాలే పార్టీలకు నిర్వహణ నిధులిస్తాయి. భారత్‌లో అలాంటి పద్ధతి లేదు. అందుకే పార్టీలకు ఆర్థిక అండగా నిలబడే ఇలాంటి పథకాలను రూపొందించుకున్నాం. నేరుగా పార్టీలకు విరాళాలు చేరేలా చూడటమే ఈ పథకం ముఖ్య ఉద్దేశం. విరాళాల అందజేతకు ముందు, తర్వాత అధికారంలో ఉన్న పార్టీ మారిపోతే దాతలకు సమస్యలు వస్తాయి. అందుకే దాతల వివరాలు రహస్యంగా ఉండేలా పథకంలో నిబంధనలు పెట్టాం. ఏదైనా మీడియా సంస్థ తన ఒక కార్యక్రమానికి నిధులు అవసరమైతే స్పాన్సర్‌ను చూసుకుంటుంది. పార్టీ నిర్వహణ, కార్యకలాపాలకు నిధులు అవసరమే కదా’ అని గడ్కరీ ఉదహరించారు. ప్రతిదీ పారదర్శకంగా ఉండాలనే పార్టీలకు విరాళాలు పారదర్శకంగా వచ్చేలా చూశామన్నారు. -
AP : గ్రూప్-1 రద్దు నిర్ణయం రద్దు, హైకోర్టు స్టే
-
2018 గ్రూప్–1 మెయిన్స్ రద్దు
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) 2018లో నిర్వహించిన గ్రూప్–1 మెయిన్స్ పరీక్ష మాన్యువల్ మూల్యాంకనాన్ని హైకోర్టు చట్ట విరుద్ధంగా, ఏకపక్ష చర్యగా ప్రకటించింది. మూల్యాంకనంలో అక్రమాలు జరిగాయని తేల్చింది. అందువల్ల గ్రూప్ –1 మెయిన్స్ పరీక్ష మొత్తాన్ని రద్దు చేస్తున్నట్లు తెలిపింది. తిరిగి మెయిన్స్ పరీక్ష నిర్వహించాలని అధికారులను ఆదేశించింది. నిబంధనల ప్రకారమే సమాధాన పత్రాలను మూల్యాంకనం చేయాలని చెప్పింది. పరీక్ష నిర్వహణకు ముందు అభ్యర్థులకు కనీసం రెండు నెలల సమయం ఇవ్వాలని ఆదేశించింది. మొత్తం ప్రక్రియను ఆరు నెలల్లో పూర్తి చేయాలని ఆదేశించింది. 2022 మే 26న ఏపీపీఎస్సీ ప్రకటించిన అర్హుల జాబితాను కూడా రద్దు చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు బుధవారం తీర్పు వెలువరించారు. ‘పబ్లిక్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ప్రజల విశ్వాసాన్ని చూరగొనేలా ఉండాలి. పోస్టుల భర్తీ పారదర్శకంగా, నిష్పాక్షికంగా జరగడంపైనే అభ్యర్థుల జీవితాలు ఆధారపడి ఉంటాయి. పరీక్షల నిర్వహణ ప్రక్రియ ఎప్పుడూ స్వచ్ఛంగా ఉండాలి. ఒకసారికి మించి మాన్యువల్ మూల్యాంకనం చేసేందుకు నిబంధనలు అనుమతించకపోయినప్పటికీ, అధికారులు రెండుసార్లు మాన్యువల్ మూల్యాంకనం చేశారు. మరికొన్ని పత్రాలను మూడోసారి కూడా మూల్యాంకనం చేశారు. ఇది చట్ట విరుద్ధం. రెండు, మూడోసారి చేసిన మూల్యాంకనం మొత్తం మూల్యాంకనంపైనే అనుమానాలు రేకెత్తించింది. ఇలాంటప్పుడు అర్హులైన అభ్యర్థులు కూడా నష్టపోయే అవకాశం ఉంది. అనర్హులు లబ్ధి పొందే అవకాశం ఉంది. కోర్టు ముందున్న ఆధారాలను పరిశీలిస్తే, పరీక్ష పత్రాల మూల్యాంకనంలో అధికారులు అక్రమాలకు పాల్పడ్డారన్న విషయాన్ని పిటిషనర్లు నిరూపించగలిగారు. మూల్యాంకనంలో నిష్పాక్షికతను కొనసాగించడంలో అధికారులు విఫలమయ్యారు. మూడుసార్లు జరిపిన మూల్యాంకనంలో అక్రమాలకు పాల్పడి ఎవరు లబ్ధి పొందారన్న విషయాన్ని గుర్తించడం సాధ్యమయ్యే పనికాదు. అందువల్ల మొత్తం పరీక్షనే రద్దు చేయడం ఉత్తమం’ అని జస్టిస్ నిమ్మగడ్డ తన 85 పేజీల తీర్పులో పేర్కొన్నారు. ఇప్పటికే పోస్టింగులు తీసుకున్న అభ్యర్థులు హైకోర్టు తుది తీర్పునకు కట్టుబడి ఉంటామని, భవిష్యత్తులో మిగిలిన అభ్యర్థులతో సమానంగా ఎలాంటి హక్కులూ కోరబోమంటూ అఫిడవిట్ దాఖలు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. మూల్యాంకనంలో అక్రమాలంటూ పిటిషన్లు గ్రూప్–1 మెయిన్స్ పరీక్షా పత్రాల మూల్యాంకనంలో భారీగా అక్రమాలు చోటు చేసుకున్నాయని, అందువల్ల పరీక్షను రద్దు చేయాలని కోరుతూ పలువురు అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఆ తరువాత డిజిటల్ మూల్యాంకనంపైనా పిటిషన్లు దాఖలు చేశారు. పలు సందర్భాల్లో వీటిపై హైకోర్టు విచారణ జరిపింది. సింగిల్ జడ్జి ఉత్తర్వులపై ధర్మాసనం విచారణ జరిపింది. ఇంటర్వ్యూలకు, ఎంపిక ప్రక్రియకు అనుమతినిచ్చింది. అయితే వారి నియామకాలన్నీ కూడా అంతిమంగా సింగిల్ జడ్జి ఇచ్చే తుది తీర్పునకు లోబడి ఉంటాయని స్పష్టం చేసింది. అనంతరం సింగిల్ జడ్జి అన్ని వ్యాజ్యాలపై తుది విచారణ జరిపారు. ఇరుపక్షాల తరఫున సుదీర్ఘ వాదనలు విన్నారు. బుధవారం తీర్పు వెలువరించారు. మూల్యాంకనం విషయంలో పిటిషనర్లు లేవనెత్తిన అభ్యంతరాలు, వాదనలతో న్యాయమూర్తి ఏకీభవించారు. అక్రమాలు రుజువైనందున మెయిన్స్ పరీక్షను రద్దు చేస్తున్నట్లు తెలిపారు. -
మేమొస్తే ‘అగ్నిపథ్’ రద్దు: ఖర్గే
న్యూఢిల్లీ: తాత్కాలిక ప్రాతిపాదికన యువతను సైన్యంలో చేర్చుకునే ‘అగ్నిపథ్’ పథకాన్ని తాము అధికారంలోకి వస్తే రద్దుచేస్తామని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రకటించారు. ఈ పథకాన్ని ప్రకటించేనాటికే భర్తీ ప్రక్రియలో ఉత్తీర్ణులై నియామక పత్రాల కోసం ఎదురుచూసిన రెండు లక్షల మందికి తక్షణం ఉద్యోగాలివ్వాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఆయన లేఖ రాశారు. ‘సాయుధదళాల్లోకి శాశ్వత ప్రాతిపదికన నియామకాలు ఆగిపోవడంతో లక్షలాది మంది యువత భవితవ్యం అగమ్యగోచరంగా మారింది. అగ్నివీర్లు నాలుగేళ్ల తర్వాత ఉద్యోగాలు కోల్పోయి నడి రోడ్డుపై నిల్చుంటారు. సామాజికంగానూ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటారు’’ పేర్కొన్నారు. సైనిక అభ్యర్థుల పోరాటానికి మద్దతుగా ఉంటామని కాంగ్రెస్ నేత రాహుల్ గాం«దీ అన్నారు. సైన్యంలో చేరేందుకు యువత కన్న కలలను అగ్నివీర్ పథకంతో బీజేపీ చిదిమేసిందని ప్రియాంక గాంధీ ఆరోపించారు. ‘‘కేంద్రానికి కొంత జీతభత్యాల చెల్లింపులు ఆదా అవుతాయి తప్పితే ఈ పథకంతో ఎవరికి ఎలాంటి ఉపయోగం లేదు’’ అని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి సచిన్ పైలెట్ అభిప్రాయపడ్డారు. అగ్నివీర్ కింద సైన్యంలోకి తీసుకునే యువతలో నాలుగేళ్ల తర్వాత అత్యంత ప్రతిభ కనబరిచిన 25 శాతం మందినే 15 ఏళ్ల శాశ్వత కమిషన్‌లోకి తీసుకుంటామని కేంద్రం ప్రకటించడం తెలిసిందే. -
Income Tax Department: కాంగ్రెస్ ఖాతాల స్తంభన
న్యూఢిల్లీ: ఎలక్టోరల్ బాండ్ల విధానాన్ని రద్దుచేస్తూ సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పుతో మోదీ సర్కార్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలిన మరుసటి రోజే కాంగ్రెస్ పార్టీ బ్యాంక్ ఖాతాలను ఆదాయ పన్ను శాఖ స్తంభింపజేయడం కలకలం సృష్టించింది. 2018–19 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కేసులో ఐటీ రిటర్నుల్లో రూ.210 కోట్ల వ్యత్యాసం ఉన్న నేపథ్యంలో వాటి రికవరీ కోసం ఆయా ఖాతాలను ఐటీ శాఖ స్తంభింపజేసినట్లు వార్తలొచ్చాయి. పార్టీ ప్రధాన ఖాతాలను ఫ్రీజ్ చేయడంతో కాంగ్రెస్ వేగంగా స్పందించింది. వెంటనే ఐటీ, ఐటీ అప్పిలేట్ ట్రిబ్యునల్(ఐటీఏటీ)ను ఆశ్రయించింది. దీంతో ట్రిబ్యునల్ కాస్త కాంగ్రెస్‌కు అనుకూలంగా ఆదేశాలిచ్చింది. ఆయా ఖాతాల్లో మొత్తంగా రూ.115 కోట్లు అలాగే నిల్వ ఉంచి మిగతాది మాత్రమే విత్‌డ్రా, ఇతరత్రా అవసరాలకు వాడుకోవచ్చని సూచించింది. వెంటనే ఆయా ఖాతాలను డీ ఫ్రీజ్ చేయాలని ఐటీ అధికారులను ఆదేశించింది. ట్రిబ్యునల్ ఆదేశాలతో సంబంధిత ఖాతాలన్నీ పునరుద్ధరించబడ్డాయి. ట్రిబ్యునల్ ఈ అంశంపై బుధవారం మరోసారి వాదనలు విననుంది. ఫ్రీజ్ చేసిన ఖాతాల్లో యూత్ కాంగ్రెస్ ఖాతాలూ ఉన్నాయి. ఖాతాల స్తంభనపై మోదీ సర్కార్‌పై కాంగ్రెస్ పార్టీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది. ‘‘ 2018–19 ఆర్థికంలో ఐటీ రిటర్నులను కాస్త ఆలస్యంగా సమరి్పంచాం. ఎమ్మెల్యేలు, ఎంపీలు తమ జీతభత్యాలను పారీ్టకి విరాళాల రూపంలో ఇచ్చారు. అలాంటి కొన్ని మొత్తాలు ఐటీ రిటర్నుల్లో ప్రతిబింబించలేదు. అంతమాత్రానికే ప్రధానమైన తొమ్మిది ఖాతాలను స్తంభింపజేస్తారా?’ అని కాంగ్రెస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. దీనిపై పార్టీ కోశాధికారి అజయ్ మాకెన్ మాట్లాడారు. ‘‘ ఖాతాల్లో ఉన్న మొత్తంలో రూ.115 కోట్లే అత్యంత ఎక్కువైనది. సిబ్బంది జీతభత్యాలు, విద్యుత్ బిల్లులు చెల్లించడానికి మిగతా డబ్బు అస్సలు సరిపోదు. రాబోయే లోక్‌సభ ఎన్నికల వేళ ఇలా ఖాతాలను ఫ్రీజ్ చేస్తే ఎన్నికల్లో పార్టీ భాగస్వామి కావడం చాలా కష్టం’’ అని మాకెన్ అన్నారు. భయపడకండి మోదీ జీ: రాహుల్ ఈ వ్యవహారంపై రాహుల్ గాంధీ స్పందించారు. ‘‘ భయపడకండి మోదీ జీ! కాంగ్రెస్ ప్రజాశక్తికి కాంగ్రెస్ చిరునామా. నియంతృత్వం ముందు మోకరిల్లేది లేదు’’ అన్నారు. అధికార దాహంతో లోక్‌సభ ఎన్నికల వేళ దేశంలోని అతిపెద్ద ప్రతిపక్ష పార్టీ ఖాతాలను ప్రభుత్వం స్తంభింపచేసిందని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే దుయ్యబట్టారు. కాంగ్రెస్ ఆరోపణలను బీజేపీ తిప్పికొట్టింది. మోదీ మూడోసారి పగ్గాలు చేపట్టాక ఇలాంటి ఆరోపణలకు కాంగ్రెస్ చాలా సమయం దొరుకుతుందంటూ కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ఎద్దేవాచేశారు. -
జీఓ 46 రద్దు ఇప్పటికి లేదు
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీలో చర్చించి కేబినెట్ సబ్ కమిటీ ద్వారా జీవో46 రద్దుపై నిర్ణయం తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నిర్ణయించారు. కొత్త నోటిఫికేషన్లకు సంబంధించి జీవో 46 రద్దు సాధ్యాసాధ్యాలను పరిశీలంచాలని సీఎంకు అధికారులు సూచించడంతో రేవంత్‌రెడ్డి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. పోలీస్ నియామకాల్లో జీవో నెం.46 రద్దు సాధ్యాసాధ్యాలపై చర్చించేందుకు జూబ్లీహిల్స్ లోని తన నివాసంలో హైపవర్ కమిటీతో రేవంత్ రెడ్డి సోమవారం రాత్రి సమావేశమయ్యారు. మంత్రి శ్రీధర్ బాబు, అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి, అదనపు అడ్వకేట్ జనరల్ రంజిత్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, డీజీపీ రవిగుప్తా తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. త్వరలో కొన్ని ఉద్యోగాలకు నియామక పత్రాలు జారీ చేయనున్న నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై ఎలా ముందుకు వెళ్లాలన్న అంశంపై అడ్వకేట్ జనరల్ సలహా సూచనలను సీఎం రేవంత్‌రెడ్డి కోరారు. 15,750 పోస్టులకు నియామక పత్రాలు అందించడమే.. : పోలీస్ నియామక ప్రక్రియ పూర్తయిన 15,750 పోస్టులకు నియామక పత్రాలు అందించడం తప్ప వేరే మార్గం లేదని అడ్వకేట్ జనరల్ అధికారులు తేల్చి చెప్పారు. ’’మార్చి 2022లో పోలీసు నియామకాలకు గత ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. అక్టోబర్ 4, 2023 నాటికి 15,750 పోస్టులకు నియామక ప్రక్రియ పూర్తయినా.. కోర్టు కేసుతో ప్రక్రియ పెండింగ్ లో పడింది’’అని అధికారులు తెలిపారు. అయితే సెలక్షన్ ప్రాసెస్ పూర్తయిన పోస్టులకు నియామక పత్రాలు అందించాలని ఇటీవల హైకోర్టు తీర్పునిచ్చిన విషయాన్ని సీఎం దృష్టికి అధికారులు తెచ్చారు. సెలక్షన్ ప్రాసెస్ పూర్తయిన 15,750 పోస్టులకు నియామక పత్రాలు అందించడం తప్ప వేరే మార్గం లేదని అడ్వకేట్ జనరల్, అధికారులు స్పష్టం చేశారు. కొత్త నోటిఫికేషన్లకు సంబంధించి జీవో 46 రద్దు సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని సీఎంకు అధికారులు సూచించారు. జీఓ 46 ప్రకారం జనాభా ప్రాతిపదికన పోస్టుల కేటాయింపు ఉండడంతో హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్ల పరిధిలోనే ఎక్కువ కానిస్టేబుల్ పోస్టులు స్థానికులకు దక్కుతున్నాయనే వాదనను కొందరు వినిపిస్తున్నారు. ఫలితంగా జిల్లాల్లోని గ్రామీణ ప్రాంత నిరుద్యోగ యువతకు అన్యాయం జరుగుతోందని పోటీలో ఉన్న అభ్యర్థులు ప్రభుత్వానికి విన్నవిస్తున్నారు. అయితే నియామక ప్రక్రియ చివరి దశలో ఉన్నందున ఇప్పుడు జీఓ 46 ర ద్దు అసాధ్యం అన్న నిర్ణయానికి ప్రభుత్వం వచ్చింది. -
తెలంగాణ సర్కార్ సంచలన నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: రవాణా శాఖలో ఆన్ డ్యూటీ(OD)లను రద్దు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఎంవీఐ, ఏఎంవీఐ, హెడ్ కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లల ఓడీలను ప్రభుత్వం రద్దు చేసింది. కాగా, తెలంగాణ రవాణాశాఖలో ముగ్గురు జేటీసీలను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్ జేటీసీగా ఉన్న పాండురంగ నాయక్ అడ్మిన్‌గా బదిలీ అవ్వగా, హైదరాబాద్ జేటీసీ అడ్మిన్‌గా ఉన్న మమతా ప్రసాద్‌ను ఐటీ అండ్ వీఐజీకి బదిలీ అయ్యారు. హైదరాబాద్ జేటీసీ ఐటీ అండ్ వీఐజీగా ఉన్న రమేష్‌ను హైదరాబాద్ జేటీసీగా బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. -
‘కేడర్ వివాదం’లో కేంద్రమే నిర్ణయం తీసుకోవాలి
సాక్షి, హైదరాబాద్: ఆలిండియా సర్వీస్ (ఏఐఎస్) అధికారులను రాష్ట్రాల మధ్య కేటాయించే అప్పీలేట్ అథారిటీ బాధ్యతను కోర్టులు నిర్వర్తించనందున.. క్యాట్ ఇచ్చిన ఆదేశాలను రద్దు చేసి, కేంద్రమే నిర్ణయం తీసుకునేలా ఆదేశాలు జారీ చేస్తామని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఇరు రాష్ట్రాల మధ్య అధికారుల కేటాయింపును మరోసారి పరిశీలించి పదేళ్లకు పైగా తెలంగాణలో ఉంటున్న వారు, త్వరలో సర్విస్ ముగిసేవారికి సంబంధించి సహేతుక నిర్ణయం తీసుకుంటుందని అభిప్రాయపడింది. అయితే అలా వద్దని పిటిషన్ వారీగా విచారణ జరపాలని పిటిషనర్ తరఫు న్యాయవాది విజ్ఞప్తి చేశారు. దీంతో అధికారుల కేటాయింపునకు సంబంధించిన కేడర్ వివాదంలో వాదనలను వచ్చే నెల 2వ తేదీకి హైకోర్టు వాయిదా వేసింది. 2014 నుంచి కొనసాగుతున్న కేడర్ వివాదం 2014లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన నేపథ్యంలో కేంద్రం నియమించిన ప్రత్యూష్ సిన్హా కమిటీ నివేదిక ప్రకారం ఏఐఎస్ ఉద్యోగుల విభజన జరిగింది. నాటి నుంచి కొందరు ఐఏఎస్, ఐపీఎస్‌ల కేడర్ వివాదం సాగుతోంది. విభజన సమయంలో పలువురు అధికారులను ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించారు. అయితే వీరిలో కొందరు ఈ కేటాయింపులపై కేంద్ర పరిపాలన ట్రిబ్యునల్ (క్యాట్)ను ఆశ్రయించి.. తెలంగాణలో విధులు నిర్వహించేలా ఉత్తర్వులు పొందారు. క్యాట్ ఉత్తర్వులను కేంద్ర ప్రభుత్వం తప్పుబడుతూ.. తెలంగాణ హైకోర్టులో పలు పిటిషన్లు దాఖలు చేసింది. ఈ క్రమంలోనే గత జనవరిలో తెలంగాణ సీఎస్ సోమేశ్‌కుమార్‌ను ఏపీకి వెళ్లాల్సిందేనంటూ ఇదే హైకోర్టు సీజే ధర్మాసనం తీర్పునిచ్చింది. అయితే కేడర్, సర్వీస్ సహా ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉన్న దృష్ట్యా తమ పిటిషన్లను విడిగా విచారణ జరపాలని డీజీపీ అంజనీకుమార్ సహా ఇతర అధికారులు కోరడంతో విచారణను సీజే ధర్మాసనం మరో బెంచ్‌కు బదిలీ చేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్లపై జస్టిస్ అభినంద్‌కుమార్ షావిలీ, జస్టిస్ నామవరపు రాజేశ్వర్‌రావు ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టింది. ఓ పిటిషనర్ తరఫు సీనియర్ న్యాయవాది కె.లక్ష్మి నర్సింహ వాదనలు వినిపిస్తూ.. ధర్మాసనం అలా నిర్ణయా న్ని కేంద్రానికి వదిలేయ వద్దని విజ్ఞప్తి చేశారు. పిటి షన్ల వారీగా విచారణ చేయాలని కోరారు. ఇతర పిటిషన్ల న్యాయవాదులు కూడా దీన్ని సమరి్థంచారు. దీంతో తదుపరి విచారణ కోసం ధర్మాసనం.. విచారణను వచ్చే నెల 2కు వాయిదా వేసింది. -
కృష్ణా జలాల వివాదంపై నేటి భేటీ రద్దు
సాక్షి, అమరావతి: కృష్ణా జలాల వివాదం పరి ష్కారమే అజెండాగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలతో శుక్రవారం నిర్వహించాల్సిన సమావేశాన్ని కేంద్రం రద్దు చేసింది. మళ్లీ భేటీ ఎప్పుడన్నది తర్వాత తెలియజేస్తామని రెండు రాష్ట్రాల సీఎస్‌లకు కేంద్ర జల్ శక్తి శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ గురువారం సమాచారం ఇచ్చారు. హక్కులను కాపాడుకోవడం కోసం రాష్ట్ర భూభాగంలోని సాగర్ స్పిల్ వే, కుడి కాలువ హెడ్ రెగ్యులేటర్‌ను గత నెల 30న ఏపీ ఆధీనంలోకి తీసుకోవడంతో రెండు రా ష్ట్రాల మధ్య వివాదం ఉత్పన్నమైంది. సాగర్ వివాదంతోపాటు కృష్ణా జలాల పంపిణీ, ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, సాగర్లను కృష్ణా బోర్డుకు అప్పగించడంపై రెండు రాష్ట్రాల సీఎస్‌లతో ఈనెల 6న సమావేశం నిర్వహించాల్సి ఉండగా ఈనెల 8కి వాయిదా వేశారు. ఇక తెలంగాణలో కొత్త ప్రభుత్వం గురువారం కొలువుదీరింది. ఈక్రమంలో శుక్రవారం నిర్వహించాల్సిన సమావేశాన్ని రద్దు చేసినట్లు కేంద్రం ప్రకటించింది. -
ఆర్టీసీలో ‘మానసిక’ టెన్షన్!
ముందు రోజు రాత్రివిధులు నిర్వహించి వచ్చాడు ఆ డ్రైవర్.. మరుసటి రోజు రాత్రి విధులకు వెళ్లేలోపు కనీసం నాలుగు గంటలన్నా నిద్రపోవాలి.. కానీ దగ్గరి బంధువుల ఇంట్లో వేడుకకు వెళ్లాల్సి ఉంది, సెలవులు ఇచ్చే పరిస్థితి లేదు. దీంతో పగటి పూట వేడుకలో గడిపి, 110 కి.మీ. దూరంలోని తానుంటున్న పట్టణం నుంచి సొంత వాహనం నడుపుకుంటూ హైదరాబాద్ వచ్చి విజయవాడ బస్సు తీసుకుని బయలుదేరాడు. దారిలో ఆగి ఉన్న లారీని బస్సు ఢీకొనటంతో మృతి చెందాడు. మరో 9 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. ఆ డ్రైవర్ కొన్నేళ్లుగా కుటుంబ వివాదాలతో సతమతమవుతున్నాడు.. దాదాపు కుటుంబ సభ్యులు వెలివేసినంత పనిచేశారు.. దీంతో అతని మానసిక స్థితి అదుపు తప్పింది. దూరప్రాంత బస్సు కావటంతో ఇద్దరు డ్రైవర్లు విధుల్లో ఉంటున్నారు. మరో డ్రైవర్ నడుపుతున్నప్పుడు అతను మద్యం సేవిస్తున్నాడు. ఇటీవల ఆకస్మికంగా తనిఖీ చేయగా, ఆ రోజు అధికంగా మద్యం తాగి ఉన్నట్టు తేలి అధికారులు కంగుతిన్నారు. అప్పుడు కాని అతన్ని విధుల నుంచి తప్పించలేదు. సాక్షి, హైదరాబాద్: ఇది తెలంగాణ ఆర్టీసీలో నెలకొన్న పరిస్థితి. సగటున ఒక్కో బస్సులో 60 మందికిపైగా ప్రయాణికులు ఉంటారు. వారిని క్షేమంగా గమ్యం చేర్చేది డ్రైవరే. కానీ, ఇప్పుడు ఆర్టీసీకి డ్రైవర్లపై పర్యవేక్షణే లేకుండా పోయింది. డ్రైవర్ భద్రంగా బస్సును గమ్యం చేర్చటమనేది డ్రైవింగ్ స్కిల్స్ పైనే కాకుండా, అతని మానసిక స్థితి మీద కూడా ఆధారపడి ఉంటుంది. అందుకే గతంలో డ్రైవర్‌పై నిఘా, పర్యవేక్షణ ఉండేది. కానీ, క్రమంగా నష్టాలను అధిగమించేందుకు ఆదాయంపైనే దృష్టి కేంద్రీకరించటం మొదలయ్యాక ఇది గతి తప్పింది. ఇప్పుడు డ్రైవర్ల కొరత కూడా ఉండటంతో, కచ్చి తంగా ఉన్నంత మంది విధులకు వచ్చేలా చూడ్డానికే అధికారులు పరిమితమవుతున్నారు. వారికి గతంలోలాగా సెలవులు కూడా ఇచ్చే పరిస్థితి లేదు. దీంతో విధులు ముగిసిన తర్వాత నుంచి తిరిగి విధులకు వచ్చే వరకు ఆ డ్రైవర్ విషయాన్ని సంస్థ పట్టించుకోవటం లేదు. డ్యూటీకి వచ్చే సమయానికి అతని మానసిక స్థితి ఏంటో కూడా తెలుసుకోలేకపోతున్నారు. మద్యం తాగి ఉన్నాడా లేదా అన్న ఒక్క విషయాన్ని మాత్రమే తేల్చుకుని బస్సు అప్పగిస్తున్నారు. సెలవులు లేక.. ఒంట్లో కాస్త నలతగా ఉన్నా, విశ్రాంతి సమయంలో నిద్రపోలేని పరిస్థితిలో ఉన్నా, రకరకాల వివాదా లతో మానసికంగా ఆందోళనతో ఉన్నా.. డ్రైవింగ్ సరిగా చేయలేని పరిస్థితి ఉంటుంది. అలాంటి సందర్భంలో తనకు సెలవు కావాలంటూ డ్రైవర్లు అడుగుతారు. అయితే, సెలవు ఇస్తే డ్రైవర్ల కొరత వల్ల సరీ్వసునే రద్దు చేసుకోవాల్సి వస్తోంది. దీంతో వా రికి సెలవుల్లేక విధులకు హాజరు కావాల్సి వస్తోంది. విజయవాడ మార్గంలో జరిగిన యాక్సిడెంట్లో చనిపోయిన డ్రైవర్.. ఆ రోజు నిద్రలేమితో ఉండి కూడా సెలవుకు దరఖాస్తు చేయకుండా డ్యూటీకి హాజరయ్యాడని తెలిసింది. ఆ విధానమేమైంది..? గతంలో ప్రతి డిపోలో స్పేర్ డ్రైవర్లు ఉండేవారు. డ్యూటీ చేయలేని స్థితిలో డ్రైవర్ ఉంటే అతని స్థానంలో మరో డ్రైవర్‌ను పంపే వారు. కానీ 13 ఏళ్లుగా డ్రైవర్ల రిక్రూట్మెంట్ లేకపోవటం, రిటైర్మెంట్లు, మరణించడం, పదోన్నతులు.. వంటి కారణాల వల్ల డ్రైవర్లకు కొరత ఏర్పడింది. గతంలో డ్రైవర్ల మానసిక స్థితిని తెలుసుకునే విధానం ఉండేది. ఏవైనా కారణాలతో వారు మానసికంగా కుంగిపోతున్నారా అన్నది సంస్థకు తెలిసే ఏర్పాటు ఉండేది. ప్రతి సంవత్సరారంభంలో రోడ్డు భద్రతా వారోత్సవాలు నిర్వహించేవారు. వాటికి డ్రైవర్లు, వారి కుటుంబ సభ్యుల్లో ఒకరు పాల్గొనాల్సి ఉంటుంది. ఈ సందర్భంగా డ్రైవర్ల స్థితిగతులపై ఆర్టీసీకి సమాచారం చేరేది. డ్రైవర్లతోపాటు, వారి కుటుంబ సభ్యులకు కూడా కౌన్సిలింగ్ చేసేవారు. డ్యూటీకి–డ్యూటీకి మధ్య చాలినంత నిద్ర ఉండేలా చూడాలంటూ కుటుంబ సభ్యులకు సూచించేవారు. ఇప్పుడు ఆ వారోత్సవాలు సరిగా నిర్వహించటం లేదు. సంవత్సరంలో ఒకసారి ప్రమాదరహిత వారోత్సవాలు నిర్వహించేవారు. ఆ వారంలో ఒక్క బస్సు కూడా ప్రమాదానికి గురి కాకుండా డ్రైవర్లకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలుండేవి. ఇది కూడా వారి నైపుణ్యం, మానసిక స్థితి తెలుసుకునేందుకు ఉపయోగపడేది. ఇప్పుడు దీన్ని నిర్వహించటం లేదు. వరుస ప్రమాదాలతో.. చాలా విరామం తర్వాత మళ్లీ ఆర్టీసీ డ్రైవర్ల కుటుంబ సభ్యులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని భావిస్తోంది. ఇటీవలి వరుస ప్రమాదాలతో సంస్థలో టెన్షన్ నెలకొంది. డ్యూటీకి వచ్చేప్పుడు సరైన స్థితితో డ్రైవర్లు ఉండేలా చూడాల్సిన బాధ్యత కుటుంబ సభ్యులది అని అధికారులు చెబుతున్నారు. వారు రెస్ట్ సమయంలో తగినంతగా నిద్రపోవటం, సెల్ఫోన్లతో ఎక్కువ సేపు గడపకుండా చూడటం, అనవసర వివాదాలతో ఒత్తిడికి గురికాకుండా చూడటం.. లాంటి అంశాలపై కుటుంబ సభ్యులు దృష్టి సారించాలని చెప్పనున్నారు. కానీ, గతంలో ఉన్నట్టు పకడ్బందీ వ్యవస్థ ఏర్పాటు చేస్తే తప్ప ఇది ఫలించే సూచనలు కనిపించటం లేదు. డ్రైవర్లపై పని ఒత్తిడి తగ్గటంతోపాటు డ్రైవింగ్ చేయలేని పరిస్థితి ఉంటే సెలవు ఇచ్చే ఏర్పాటు ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. అది జరగాలంటే, తాత్కాలిక పద్ధతిలోనైనా డ్రైవర్ల రిక్రూట్మెంట్ ఉండాలని వారు పేర్కొంటున్నారు. -
సీఎం జగన్‌కు వీఆర్ఏ సంఘం నేతల కృతజ్ఞతలు
సాక్షి, అమరావతి: వీఆర్ఏ సంఘం నేతలు శుక్రవారం క్యాంప్ కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. గతంలో టీడీపీ ప్రభుత్వం వీఆర్ఏలకు ఇస్తున్న రూ.300 డీఏను రద్దు చేసింది. ఈ విషయాన్ని ఏపీజీఎఫ్ ప్రతినిధులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. దీంతో సీఎం.. డీఏను పునరుద్ధరించడమే కాకుండా డీఏను రూ.500కు పెంచుతూ ఇటీవల నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో వీఆర్ఏ సంఘం నేతలు సీఎంను కలిసి సన్మానించారు. ఏపీజీఎఫ్ చైర్మన్ కాకర్ల వెంకట్రామిరెడ్డి, వీఆర్ఏ సంఘం నేతలు ధైర్యం, సత్యరాజ్, సుధాకర్, వెంకటేశ్వర్లు ఉన్నారు. -
అధికారంలోకి రాగానే బెల్టుషాపులు రద్దు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి రాగానే బెల్టుషాపుల్ని రద్దు చేస్తామని, అక్రమ మద్యం ప్రభావాన్ని ఉక్కుపాదంతో అణచివే స్తామని కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి ప్రకటించారు. దశలవారీగా మద్యాన్ని నియంత్రిస్తామని స్పష్టం చేశారు. ప్రజల ఆరోగ్యం కంటే ఆదాయం కోసం బీఆర్ఎస్ సర్కారు గ్రామగ్రామనా ఇష్టారాజ్యాంగా బెల్టు షాపుల్ని ప్రోత్సహిస్తూ ప్రజల రక్తాన్ని తాగుతోందని మండిపడ్డారు. బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రం ఇప్పటికే దివాళా తీసిందని, మళ్ళీ ఆ పార్టీ అధికారంలోకి వస్తే తమ చేతికి చిప్ప మిగులుతుందని ప్రజలకు అర్ధం అయిందన్నారు. అందుకే కేసీఆర్ ప్రభు త్వాన్ని ఓడించేందుకు తెలంగాణ ప్రజలు పోలింగ్ కోసం ఎదురుచూస్తున్నారని చెప్పారు. గురువారం పార్టీ కార్యాలయంలో కరీంనగర్ జిల్లా మానకొండూరు మాజీ ఎమ్మెల్యే ఆరేపల్లి మోహన్, వికా రాబాద్ జిల్లా పరిగికి చెందిన వన్నె ఈశ్వరప్పతో పాటు పలువురు స్థానిక ప్రజా ప్రతినిధులు, నేతలు కిషన్ రెడ్డి, పార్టీ పార్లమెంటరీబోర్డు సభ్యుడు డా.కె.లక్ష్మణ్, జాతీయ ప్రధానకార్యదర్శి బండి సంజయ్‌ల సమక్షంలో బీజేపీలో చేరారు. వారికి పార్టీ కండువాలు కప్పి నేతలు సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్‌లో గెలిచిన ఎమ్మెల్యేలు బీఆర్ఎస్కు అమ్ముడుపోతారని ప్రజలకు తెలుసునని, 2014, 2018లో అమ్ముడుపోయిన విషయం ప్రజలకు గుర్తుందని చెప్పారు. కేసీఆర్ ఆటలో రేవంత్, హరీశ్ బలిపశువులు కేసీఆర్ ఆటలో రేవంత్, హరీశ్‌రావు బలి పశువులు కాబోతున్నారని బండి సంజయ్ వ్యాఖ్యానించారు. సీఎం వద్ద మేనిఫెస్టోపై హరీశ్, కేటీఆర్ చర్చ పెద్ద డ్రామా అని సీఎం పదవి కోసమే ఆ ఇద్దరూ కొట్టుకుంటున్నారనే టాక్ నడుస్తోందన్నారు. కేసీఆర్ ఆమోద ముద్ర పడనందునే కాంగ్రెస్ లిస్ట్ ఫైనల్ కాలేదన్నారు. ‘ౖకాంగ్రెస్ లిస్ట్ ఇంకా ప్రగతి భవన్ లో ఉంది. కేసీఆర్ స్టాంప్ పడలేదు. ఆయన 30 మంది అభ్యర్థుల పేర్లు చెప్పి ఆమోదముద్ర వేసినాక ఢిల్లీకి పోతది. పాపం రేవంత్ రెడ్డికి తెల్వదు. బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం కలిసి ఎట్లైనా అధికారంలోకి రావాలని కుట్ర చేస్తున్నయ్. ఈ మొత్తం ఎపిసోడ్ లో హరీషన్న, కాంగ్రెస్‌లో రే వంతన్న బలిపశువులు కాబోతున్నరు.’’ అని పే ర్కొన్నారు. డా. లక్ష్మణ్ మాట్లాడుతూ బీసీల ఓట్లు అడిగే నైతిక హక్కు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, కాంగ్రెస్ నేతలు రాహుల్, రేవంత్ రెడ్డిలకు లేదన్నారు. రాజకీయంగా బీసీల అభ్యున్నతికి బీజేపీనే పెద్దపీట వేసిందని గుర్తు చేశారు. -
గ్రూప్–1 అభ్యర్థుల్లో గుబులు!
సాక్షి, హైదరాబాద్: గ్రూప్–1 ప్రిలిమ్స్ పరీక్ష మరోసారి రద్దుకావడం కలకలం రేపుతోంది. ఇప్పటికే ఓసారి రద్దుకావడంతో రెండోసారి పరీక్ష రాయాల్సి వచ్చిందని, ఇప్పుడు మళ్లీ పరీక్ష రాయాలంటే ఎలాగని అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇన్నాళ్లూ కష్టపడి చదివామని, వేలు, లక్షలు ఖర్చుపెట్టి శిక్షణ తీసుకున్నామని.. ఇప్పుడంతా వృధా అయినట్లే అని ఆవేదన చెందుతున్నారు. మళ్లీ ప్రిలిమ్స్ నిర్వహించినా అది ఎప్పుడు ఉంటుందో, అప్పటికి పరిస్థితి ఎలా ఉంటుందోనని వాపోతున్నారు. లీకేజీతో ఓసారి.. నిర్లక్ష్యంతో మరోసారి వివిధ రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో 503 గ్రూప్–1 ఉద్యోగాల భర్తీకి గతేడాది ఏప్రిల్‌లో నోటిఫికేషన్ జారీకాగా.. 3,80,081 మంది దరఖాస్తు చేసుకున్నారు. టీఎస్పీఎస్సీ గతేడాది అక్టోబర్ 16న ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించింది. 1:50 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేసి మెయిన్స్ పరీక్ష తేదీలను కూడా ప్రకటించింది. కానీ టీఎస్పీఎస్సీ కార్యాలయం నుంచి ప్రశ్నపత్రాలు లీకైన వ్యవహారం బయటపడటంతో గ్రూప్–1 ప్రిలిమ్స్‌ను పరీక్షను రద్దు చేసింది. మెయిన్స్‌కు ఎంపికైన అభ్యర్థులు ఈ నిర్ణయంతో గందరగోళంలో పడ్డారు. ఆ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అందరికీ తిరిగి జూన్ 11న ప్రిలిమ్స్ పరీక్షలను నిర్వహిస్తామని టీఎస్పీఎస్సీ ప్రకటించింది. ఈ క్రమంలో రెండోసారి ప్రిలిమ్స్‌కు 3,09,323 మంది హాల్‌టికెట్లను డౌన్లోడ్ చేసుకోగా.. 2,33,248 మంది పరీక్ష రాశారు. ఈసారి ప్రిలిమ్స్ నిర్వహణ లోపభూయిష్టంగా, అక్రమాలకు తావిచ్చేలా ఉందని పలువురు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు.. రెండో ప్రిలిమ్స్‌నూ రద్దు చేయాలని సర్కారును ఆదేశించింది. రద్దయితే వచ్చే ఏడాదే? గ్రూప్–1 ప్రిలిమ్స్ రద్దు తీర్పుపై హైకోర్టు డివిజన్ బెంచ్‌లో అప్పీలు చేయాలని టీఎస్పీఎస్సీ నిర్ణయించింది. ఒకవేళ రద్దు తీర్పును డివిజన్ బెంచ్ సమర్థిస్తే.. మూడోసారి ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించాల్సి వస్తుంది. ఇదే జరిగితే ఇప్పట్లో ప్రిలిమ్స్ నిర్వహణ సాధ్యంకాకపోవచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. నిబంధనల ప్రకారం.. పరీక్ష కోసం కనీసం రెండు నెలల గడువు ఇస్తూ తేదీని ప్రకటించాల్సి ఉంటుంది. వచ్చే నెలలో రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ వస్తుందని ఎన్నికల సంఘం అధికారులు చెప్తున్నారు. ఎన్నికల షెడ్యూల్ వస్తే తర్వాత రెండు నెలల పాటు అధికార యంత్రాంగం ఎన్నికల పనిలోనే బిజీగా ఉంటుంది. ఈ క్రమంలో కట్టుదిట్టమైన భద్రత మధ్య గ్రూప్–1 ప్రిలిమ్స్ నిర్వహించడం కష్టమనే అభిప్రాయం ఉంది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత లోక్‌సభ ఎన్నికలూ జరగాల్సి ఉంది. ఈ క్రమంలో వచ్చే ఏడాది మే వరకు గ్రూప్–1 పరీక్షలు వాయిదాపడే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అభ్యర్థులు ఆగమాగం గతేడాది ఏప్రిల్‌లో గ్రూప్–1 నోటిఫికేషన్ రావడంతోనే లక్షలాది మంది అభ్యర్థులు పరీక్షలకు సిద్ధమవడంపై దృష్టిపెట్టారు. చిన్నపాటి ఉద్యోగాలు చేస్తున్నవారు అది మానేసి, కొందరు దీర్ఘకాలిక సెలవులు పెట్టి పరీక్ష కోసం శిక్షణ తీసుకున్నారు. దీనికితోడు ఏళ్లుగా పోటీ పరీక్షల కోసం సిద్ధమవుతున్నవారు మరింత ఫోకస్ పెట్టారు. పకడ్బందీగా చదువుకుని ప్రిలిమ్స్ పరీక్షలు రాశారు. కానీ లీకేజీ వ్యవహారంతో పరీక్ష రద్దుకావడంతో నిరుత్సాహానికి గురయ్యారు. అయితే టీఎస్పీఎస్సీ వేగంగా చర్యలు చేపట్టి, తిరిగి ప్రిలిమ్స్ నిర్వహించే తేదీని ప్రకటించడంతో.. అభ్యర్థులంతా ఎంతో ఆశతో రెండోసారి పరీక్ష కోసం సిద్ధమయ్యారు. అలా ఈ ఏడాది జూన్ 11న పరీక్ష రాశారు. ఫలితాల విడుదల, మెయిన్స్‌కు 1ః50 నిష్పత్తిలో ఎంపిక జాబితా కోసం ఎదురుచూస్తున్న తరుణంలో.. తాజాగా హైకోర్టు తీర్పుతో దిక్కుతోచని స్థితి లో పడ్డారు. మూడోసారి పరీక్ష కోసం చదవాల్సి రావడమేంటన్న ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మళ్లీ పరీక్ష రాయాలంటే భయంగా ఉంది గ్రూప్–1 ఉద్యోగం సాధించాలని రెండేళ్లుగా సన్నద్ధమవుతున్నాను. ప్రిలిమ్స్ రద్దు తో సమయం, డబ్బు వృథా అయ్యాయి. మరోసారి పరీక్ష రాయాలంటేనే భయం వేస్తోంది. పరీక్ష నిర్వహణలో టీఎస్పీఎస్సీ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది. ఒకసారి లీకేజీ, మరోసారి నిర్వహణ లోపాలతో రద్దు చేశారు. మొదటిసారి ప్రశ్నపత్రంలో 5 ప్రశ్నలు, రెండోసారి 7 ప్రశ్నలు తొలగించారు. ఇంత నిర్లక్ష్యమైతే ఎలా? – బి.అనిల్ కుమార్, హనుమకొండ -
పేపర్లు లీక్ చేసి రూ.వేల కోట్లకు అమ్ముకున్నారు!
సాక్షి, పెద్దపల్లి: టీఎస్పీ ఎస్సీ పరీక్ష పేపర్లు లీక్‌చేసి రూ.వేల కోట్లకు అమ్ముకున్న గజదొంగ కేసీఆర్ అని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. ఉద్యోగ నోటి ఫికేషన్ల పేరిట రాష్ట్రంలోని 30 లక్షల మంది నిరుద్యోగుల నోట్లో మట్టి కొట్టిన కేసీఆర్‌ను వచ్చే ఎన్నికల్లో ఓడించాలని పార్టీ శ్రేణులను కోరారు. శనివారం పెద్దపల్లి జిల్లా కేంద్రంలో పార్టీ ముఖ్యకార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లా డారు. జూన్ 11న టీఎస్పీఎస్సీ రెండోసారి నిర్వహించిన గ్రూప్–1 ప్రిలిమ్స్‌ను రద్దు చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పు టీఎస్పీ ఎస్సీ నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు. పేపర్ల లీకేజీ సూత్రధారులు ముఖ్యమంత్రి కార్యాల యంలోనే ఉన్నారని ఆరోపించారు. గ్రూప్–1 ప్రిలిమ్స్‌కు హాజరైన వారికంటే అదనంగా 270 ఓఎంఆర్ షీట్లు ఎలా వచ్చాయో ఆ సంస్థ చైర్మన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశా రు. చైర్మన్ జనార్దన్‌రెడ్డి, సభ్యులను తక్షణమే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దాసరి హనుమయ్య, కార్యదర్శి దేవునూరి సంపత్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రభుత్వ అసమర్థత వల్లే గ్రూప్–1 వాయిదా
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో గ్రూప్–1 పరీక్షలు మళ్లీ వాయిదా పడటంపై బీజేపీ ఆందోళన, ఆగ్ర హం వ్యక్తం చేసింది. రాష్ట్ర ప్రభుత్వ అసమర్థత కారణంగానే గ్రూప్–1 ప్రిలిమ్స్ పరీక్ష మరోసారి రద్దయిందని కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ అధ్య క్షుడు కిషన్‌రెడ్డి, పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, పార్టీ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ వేర్వేరు ప్రకటనల్లో ధ్వజమె త్తారు. సీఎం కేసీఆర్ ప్రభుత్వ అసమర్థ ప్రజాపా లన, సరైన నిర్ణయాలు తీసుకోవడంలో వైఫల్యం కారణంగానే.. వరుసగా రెండోసారి రాష్ట్రంలో గ్రూప్–1 ప్రిలిమినరీ పరీక్షలు వాయిదా పడ్డాయని కిషన్‌రెడ్డి విమర్శించారు. ఈ పరీక్షలకు దరఖాస్తు చేసుకున్న 4 లక్షల మంది యువతలో నైరాశ్యం నింపేలా కేసీఆర్ ప్రభుత్వం వ్యవహరిస్తోందని ధ్వజ మెత్తారు. ఈ మేరకు ఆయన శనివారం ఢిల్లీ నుంచి ప్రకటన విడుదల చేశారు. ఇటీవలే జరిగిన పేపర్ లీక్ ఘటన, తదనంతర పరిణామాల నేపథ్యంలోనైనా రాష్ట్ర ప్రభుత్వం కాస్త జాగ్రత్తగా వ్యవహ రిస్తుందనుకుంటే.. మళ్లీ అదే అస మర్థత, అదే నిర్లక్ష్యాన్ని ప్రదర్శించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రూప్–1 పరీక్షల నిర్వహణ విషయంలో సర్కారు నిర్లక్ష్యాన్ని కొందరు హైకోర్టు దృష్టికి తీసు కెళ్లడంతో.. పరీక్షలను రద్దుచేయ డం మినహా న్యాయస్థానం ముందు వేరే అవకాశమే లేకుండా పోయిందని పేర్కొ న్నారు. రాష్ట్రంలో యువత భవిష్యత్తుకు భద్రత, భరోసా కల్పించలేని కేసీఆర్ ప్రభుత్వానికి అధి కారంలో ఉండే నైతిక అర్హత లేదని విమర్శించారు. టీఎస్పీఎస్సీ చైర్మన్ రాజీనామా చేయాలి: అరుణ డిమాండ్ టీఎస్పీఎస్సీని వెంటనే ప్రక్షాళన చేయాలని, చైర్మ న్ ఈ ఘటనకు భాద్యత వహించి తక్షణమే రాజీ నామా చేయాలని డీకే అరుణ డిమాండ్ చేశారు. గ్రూప్ –1 పరీక్షలు రాసిన అభ్యర్థులకు ప్రభుత్వం వెంటనే నష్ట పరిహారం అందజేయాలన్నారు. కేసీ ఆర్ సర్కార్‌కు మద్యం నోటిఫి కేషన్‌పై ఉన్న శ్రద్ధ, ఉద్యోగ నోటిఫికేషన్ పై లేదని విమర్శించారు. ప్రభుత్వానికి సిగ్గుండాలి: ఈటల ధ్వజం కోర్టు తీర్పు ప్రభుత్వానికి చెంప పెట్టి లాంటిదని, ఈ ప్రభుత్వానికి సిగ్గుండాలని ఈటల రాజేందర్ ధ్వజమెత్తారు. ఎన్నికల్లో పైసలు, మద్యం పంచుడు ఇవన్నీ కాదని, ఇప్పటికైనా సీఎం కేసీఆర్ మేల్కొని పాలనపై దృష్టి పెట్టాలని డిమాండ్ చేశారు. -
హైకోర్టు తీర్పు ప్రభుత్వానికి చెంపపెట్టు
సాక్షి, హైదరాబాద్: గ్రూ ప్–1 పరీక్షలను రద్దు చేయాలంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పు రాష్ట్ర ప్రభుత్వానికి చెంప పెట్టు అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో ఉద్యోగ నియామకాలు జరగాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడమే ఏకైక మార్గమని తెలిపారు. ఈ మేరకు శనివారం సీఎం కేసీఆర్‌కు ఆయన బహిరంగలేఖ రాశా రు. ‘మీ పాలనలో వ్యవస్థల విధ్వంస ప్రతిఫ లమే ఈ దుస్థితి. మీ అన్యాయమైన, దుర్మార్గ మైన పాలనకు విద్యార్థులు, నిరుద్యోగుల చేతిలో మీకు శిక్ష తప్పదు. తెలంగాణ ఏర్పా టైన నాటి నుంచి నిరుద్యోగ, విద్యార్థులకు అడుగడుగునా పరాభవమే ఎదురవుతోంది. ఇంటర్మీడియెట్ పేపర్ల మూల్యాంకనంలో తప్పులు, సింగరేణి, ఎంసెట్ పేపర్ల లీకేజీ, విద్యుత్ సంస్థల నియామక పరీక్షలు, పదో తరగతి పరీక్షలు, ఆ తర్వాత టీఎస్పీఎస్సీ పేపర్ల లీకేజీతో మోసం పరాకాష్టకు చేరింది. ఏం జరిగినా మీరు పట్టించుకున్న పాపాన పో లేదు. లక్షలాది మంది యువత నిద్రాహారాలు మాని పరీక్షలకు సిద్ధమవుతున్నారన్న ఆలోచన మీకు ఏ కోశానా లేదు. అసలు పరీక్షలు రద్దు కాదు. మీ సర్కారును రద్దు చేస్తేనే ఉద్యోగాల భర్తీ పారదర్శకంగా జరుగుతుంది’ అని ఆ లేఖలో రేవంత్ విమర్శించారు. -
‘పాలమూరు–రంగారెడ్డి’ జీవోపై సుప్రీంకోర్టుకు ఏపీ
సాక్షి, అమరావతి: పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి 90 టీఎంసీలు కేటాయించుకుంటూ తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల(జీవో)ను రద్దు చేయాలని సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్(ఎస్ఎల్పీ) దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆ జీవోపై విచారణ చేపట్టడం తమ పరిధిలోకి రాదంటూ ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన ఇంటర్ లొకేటరీ అప్లికేషన్(ఐఏ)ను తిరస్కరిస్తూ కృష్ణా జల వివాదాల ట్రిబ్యునల్(కేడబ్ల్యూడీటీ–2) బుధవారం తీర్పు ఇచ్చింది. ఈ అంశంపై మరో న్యాయస్థానాన్ని ఆశ్రయించే స్వేచ్చ ఏపీ ప్రభుత్వానికి ఉందని స్పష్టం చేసింది. దీంతో సుప్రీంకోర్టును ఆశ్రయించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతలకు నీటి కేటాయింపుల వల్ల రాష్ట్ర హక్కులకు విఘాతం కలుగుతుందని నివేదించనుంది. ఆ జీవోను రద్దు చేయడం ద్వారా ఏపీ హక్కులను పరిరక్షించాలని సుప్రీంకోర్టుకు విన్నవించనుంది. -
నేడు వివిధ మార్గాల్లో పలు రైళ్ల రద్దు
సాక్షి, హైదరాబాద్: సాంకేతిక కారణాల దృష్ట్యా వివిధ మార్గాల్లో 20 దూరప్రాంతాల రైళ్లను, నగరంలోని వివిధ మార్గాల్లో నడిచే మరో 16 ఎంఎంటీఎస్ రైళ్లను ఈ నెల 4 నుంచి 10 వరకు రద్దు చేయనున్నట్లు దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో సీహెచ్.రాకేశ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు కాజీపేట్–డోర్నకల్, విజయవాడ–డోర్నకల్, భద్రచాలం రోడ్–డోర్నకల్, కాజీపేట్–సిర్పూర్ కాగజ్‌నగర్, బల్లా ర్ష– కాజీపేట్, సికింద్రాబాద్–వరంగల్, సి ర్పూర్ టౌన్–భద్రాచలం, వరంగల్– హైదరాబాద్, కరీంనగర్–సిర్పూర్టౌన్, కరీంనగర్–నిజామాబాద్, కాజీపేట్–బల్లార్ష, తదితర మార్గాల్లో రైళ్లు రద్దు కానున్నట్లు పేర్కొన్నారు. ఎంఎంటీఎస్‌లు రద్దు: ఈ నెల 4 నుంచి 10 వరకు లింగంపల్లి–నాంపల్లి, లింగంపల్లి–ఫలక్‌నుమా, ఉందానగర్–లింగంపల్లి, నాంపల్లి–లింగంపల్లి, తదితర మార్గాల్లో 16 సర్వీసులు రద్దు కానున్నట్లు వెల్లడించారు. -
వైద్య విద్య పీజీ ప్రవేశాల కౌన్సెలింగ్ రద్దు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో వైద్య విద్య పీజీ కోర్సుల్లో ఇప్పటికే నిర్వహించిన కౌన్సెలింగ్‌ను ప్రభుత్వం రద్దు చేసింది. ప్రవేశాల ప్రక్రియను మళ్లీ మొదటి నుంచి నిర్వహించాలని డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్య విశ్వవిద్యాలయం నిర్ణయించింది. ఈ మేరకు ఇప్పటికే కన్వినర్, యాజమాన్య కోటా సీట్లకు తొలి దశలో నిర్వహించిన కౌన్సెలింగ్‌ను రద్దు చేసినట్టు గురువారం వర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ రాధికారెడ్డి ఉత్తర్వులిచ్చారు. కర్నూలు జిల్లా శాంతిరామ్ వైద్య కళాశాలలోని పలు కోర్సుల్లో పీజీ సీట్ల పెంపుదలకు సంబంధించి నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) పేరిట ఫేక్/ఫోర్జరీ అనుమతులు వెలువడ్డాయి. ఈ అంశంపై ఎన్ఎంసీ ప్రకటన నేపథ్యంలో ఇప్పటివరకు నిర్వహించిన కౌన్సెలింగ్‌ను హెల్త్ యూనివర్సిటీ అధికారులు రద్దు చేశారు. ఫోర్జరీ అనుమతుల ఘటన వెలుగు చూడటంతో అప్రమత్తమైన అధికారులు మిగిలిన వైద్య కళాశాలల్లో పీజీ సీట్ల అనుమతులు సరిగా ఉన్నాయో, లేదో పరిశీలిస్తున్నారు. ఆయా కళాశాలలకు మంజూరైన సీట్లను, ఎన్ఎంసీ అధికారిక వెబ్సైట్లో పొందుపరిచిన సీట్లతో సబ్జెక్టుల వారీగా తనిఖీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జీఎస్ఎల్, శాంతిరామ్, మహారాజా కళాశాలల్లో అనుమతించిన పీజీ సీట్లకు, ఎన్ఎంసీ వెబ్సైట్లో చూపిస్తున్న సీట్ల సంఖ్య మధ్య వ్యత్యాసం ఉన్నట్టు గుర్తించారు. దీంతో ఈ అంశంపై వివరణ కోరుతూ అధికారులు ఎన్ఎంసీకి లేఖ రాశారు. ఎన్ఎంసీ నుంచి పూర్తి స్థాయిలో స్పష్టత వచ్చాక కొత్తగా సీట్ మ్యాట్రిక్స్‌ను రూపొందించనున్నారు. ఆ తర్వాత వెబ్ ఆప్షన్ల నమోదుకు నోటిఫికేషన్ ఇస్తామని రిజిస్ట్రార్ రాధికారెడ్డి తెలిపారు. -
జూనియర్ అసిస్టెంట్ గ్రేడ్–2 పరీక్ష రద్దు
సాక్షి, హైదరాబాద్: సింగరేణి యాజమాన్యానికి హైకోర్టు షాక్ ఇచ్చింది. గత సంవత్సరం నిర్వహించిన జూనియర్ అసిస్టెంట్ గ్రేడ్–2 పరీక్షను రద్దు చేసింది. నిర్వహణలో పలు అవకతవకల కారణంగా పరీక్షను రద్దు చేస్తున్నట్లు స్పష్టం చేసింది. అన్ని జాగ్రత్తలు తీసుకుని, నిబంధనలను కఠినంగా అమలు చేస్తూ పరీక్షను మళ్లీ నిర్వహించాలని తేల్చిం చెప్పింది. అభ్యంతరాలన్నింటినీ పరిగణనలోకి తీసుకున్న తర్వాతే తుది కీ విడుదల చేయాలని సంస్థను ఆదేశించింది. ఈ మేరకు ప్రధాన పిటిషన్‌ను అనుమతిస్తూ తుది తీర్పు వెలువరించింది. అలాగే స్టే ఎత్తివేయాలంటూ దాఖలైన మధ్యంతర అప్లికేషన్లను కొట్టివేసింది. సింగరేణి వ్యాప్తంగా 177 జూనియర్ అసిస్టెంట్ గ్రేడ్–2 పోస్టులను భర్తీ చేసేందుకు 2022, సెపె్టంబర్ 4న నిర్వహించిన పరీక్షకు 79,898 మంది హాజరయ్యారు. ఆ తర్వాత సింగరేణి ‘కీ’ని విడుదల చేయలేదు. ఈ నేపథ్యంలో పరీక్ష సందర్భంగా మాస్ కాపీయింగ్, ఇతర అవకతవకలు జరిగాయంటూ రామగుండంకు చెందిన అభిలాష్ సహా పలువురు హైకోర్టులో పిటిషన్ దా ఖలు చేశారు. దీనిపై గతంలో విచారణ జరిపిన న్యా యస్థానం, తీర్పు వెలువరించే వరకు ఫలితాలను వెల్లడించవద్దని సింగరేణి యాజమాన్యాన్ని ఆదేశించింది. ఈ పిటిషన్‌పై మరోసారి జస్టిస్ మాధవీదేవి విచారణ చేపట్టి.. తీర్పు వెలువరించారు. పరీక్షను పకడ్బందీగా నిర్వహించలేదని భావించిన న్యాయమూర్తి.. రద్దు చేస్తున్నట్లు స్పష్టం చేశారు. -
ప్రవీణ్‌కుమార్ హౌస్ అరెస్ట్
బండ్లగూడ, నాంపల్లి: అక్రమంగా అరెస్టులు చేసి తమను భయపెట్టాలని చూస్తే మరింత ఉవ్వెత్తున ఉద్యమిస్తామని బీఎస్పీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.ఎస్.ప్రవీణ్‌కుమార్ హెచ్చరించారు. గ్రూప్–2 పరీక్షలను రద్దు చేయాలని కోరతూ నిరసన చేపట్టేందుకు వెళ్తున్న ఆయనను శనివారం పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. దీంతో ఉదయమే బండ్లగూడలోని ఆయన నివాసంలో సత్యగ్రహ దీక్షకు కూర్చున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ శాంతియుతంగా దీక్ష చేస్తున్న తనను అర్థరాత్రి పోలీసులు అకారణంగా నిర్బంధించారని ఆరోపించారు. తమకు ఆదేశాలు ఉన్నాయంటూ రాద్ధాంతం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. శాంతియుతంగా నిరసన చేపట్టిన తన మాదిరిగానే రాష్ట్రవ్యాప్తంగా వేలాదిమంది బీఎస్పీ కార్యకర్తలను అరెస్టు చేశారని ఆందోళన వ్యక్తం చేశారు. సీఎం పోలీసులను నమ్ముకొని పాలన చేస్తున్నారని, భవిష్యత్‌లో ఇదే కేసీఆర్‌ను ఫామ్‌హౌజ్‌లోనే బందోబస్తు చేస్తారని ధ్వజమెత్తారు. గ్రూప్–2 ఉద్యోగాల్లో కొన్ని తమ అనుచరులకు కావాలని ముందుగానే పబ్లిక్ సర్విస్ కమిషన్‌కు చెప్పారనీ అందుకే నిరుద్యోగుల సమస్యలు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. పబ్లిక్ సరీ్వస్ కమిషన్ బోర్డులో కొంత మంది దొంగలను సీఎం నియమించారని విమర్శించారు. లీకేజీ కారకులను అరెస్టు చేయకుండా పరీక్షలు ఎలా? పేపర్ లీకేజీ కారకులను ఇంతవరకూ అరెస్టు చేయకుండా, తిరిగి వెంటనే పరీక్షలు నిర్వహించడం సరికాదని ప్రవీణ్‌కుమార్ అభిప్రాయపడ్డారు. 2014 నుంచి ఉద్యో గ నియామకాలు చేపట్టకుండా 2022లో ఒకేసారి నోటి ఫికేషన్ ఇచ్చి నిరుద్యోగులపై తీవ్ర భారం మోపారని ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం ఎన్నికల కోసమే ఆగమేఘాల మీద ఉద్యోగ పరీక్షలు నిర్వహిస్తున్నారని నిందించారు. ఇప్పటి వరకు డీఎస్సీ ఎందుకు నిర్వహించలేదని ఆయన ప్రశ్నించారు. నియంత, నిరంకుశ కేసీఆర్ వల్ల ఒక తరం నాశనం అయ్యిందని ప్రవీణ్ ధ్వజమెత్తారు. టీచర్ ఉద్యోగ పరీక్షలు రాసిన వాళ్లు గ్రూప్ పరీక్షలు రాయకూడదనేది కేసీఆర్ కుట్రగా పేర్కొన్నారు. ’’ముఖ్యమంత్రి కొడుకు, మనుమడు, ఎమ్మెల్యేలు, మంత్రులు ఎప్పుడైనా పోటీ పరీక్షలు రాశారా... ఆరునెలల్లో పరీక్ష సిలబస్ మార్చి మెటీరియల్ ఇవ్వకుండా వాళ్లు పరీక్ష రాయగలరా..’’అని నిలదీశారు. ఫేక్ యూనివర్సిటీలు యూనివర్సిటీలు బాగు చేయమంటే ఫేక్ ప్రైవేట్ యూనివర్సిటీలు ఏర్పాటు చేస్తున్నారని ప్రవీణ్‌కుమార్ ఆరోపించారు. తెలంగాణ ఉద్యమంలో పెన్ డౌన్, సకల జనుల సమ్మె, ఇలా ఎన్నో ఉద్యమాలు చేసినప్పుడు ఎలాంటి అణచివేత ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రం కల్వకుంట్ల కుటుంబంగా మారిందని విమర్శించారు. పేపర్ లీకేజీలో రమేష్, రాజశేఖర్‌రెడ్డి దొరికిన వెంటనే కేటీఆర్ దొంగ అని తేలిపోయిందనీ, అందుకే కేటీఆర్ ట్విట్టర్లో కూడా నిరుద్యోగ సమస్యలపై మాట్లాడడం లేదని ప్రవీణ్ విమర్శించారు. పేపర్ లీకేజీపై సీబీఐ విచారణ జరపాలని, విద్యార్థులపై పెట్టిన అక్రమ కేసులు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. బీఎస్పీ నేతల సత్యాగ్రహ దీక్ష భగ్నం గ్రూపు–2 పరీక్షలను వాయిదా వేయాలని డిమాండ్ చేస్తూ శనివారం ఉదయం నగరంలోని గన్‌పార్కు వద్ద సత్యాగ్రహ దీక్షకు దిగన బీఎస్సీ నాయకులు, కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. చేతుల్లో ప్లకార్డులను పట్టుకుని జైభీమ్ అంటూ పెద్ద పెట్టున నినాదాలు చేస్తూ ప్రధాన రోడ్డు నుండి గన్పార్కులోనికి పరుగులు తీసిన వారిని పోలీసులు అడ్డుకుని బలవంతంగా లాక్కెళ్లారు. గన్‌పార్కు వైపునకు వచ్చినవారిని వచి్చనట్లుగానే అరెస్టు చేశారు. అరెస్టు చేసిన వారిని ముషీరాబాదు, నాంపల్లి పోలీసుస్టేషన్లకు తరలించారు. -
పలు రైళ్లు రద్దు.. దారి మళ్లింపు
రైల్వేస్టేషన్ (విజయవాడపశ్చిమ): వర్షాల కారణంగా హసనపర్తి–కాజీపేట సెక్షన్ మధ్యలో ట్రాక్‌లపై ప్రమాదకర స్ధాయిలో నీటి ప్రవాహం చేరుకోవడంతో ఆ మార్గంలో నడిచే పలు రైళ్లను పూర్తిగాను, పాక్షికంగా రద్దు చేయడంతో పాటు మరి కొన్నింటిని అధికారులు దారి మళ్లించారు. సికింద్రాబాద్–సిర్పుర్ కాగజ్‌నగర్ (17233) రైలును ఈ నెల 27, సిర్పూర్ కాగజ్‌నగర్–సికింద్రాబాద్(17223) రైలును ఈ నెల 28న పూర్తిగా రద్దు చేశారు. సికింద్రాబాద్–ధనాపూర్ (12791)రైలును గురువారం కాజీపేట, విజయవాడ, దువ్వాడ, విజయనగరం మీదుగా దారి మళ్లించారు. చెన్నై సెంట్రల్–అహ్మదాబాద్ (12656) రైలును వరంగల్లు, సికింద్రాబాద్, వాడి, సోలాపూర్, మన్మాడ్ మీదుగా దారి మళ్లించారు. చైన్నె సెంట్రల్–మాత వైష్ణోదేవి కాత్ర రైలును గుంటూరు, సికింద్రాబాద్, మన్మాడ్ మీదుగా దారి మళ్లించారు. రామేశ్వరం–బెనారస్ (22535) రైలును విజయవాడ, దువ్వాడ, విజయనగరం మీదుగా దారి మళ్లించారు. హెల్ప్ డెస్క్‌ల ఏర్పాటు వర్షాల నేపథ్యంలో రైళ్ల సమాచారం తెలుసుకునేందుకు వీలుగా విజయవాడ, ఒంగోలు, తెనాలి, సామర్లకోట, ఏలూరు, రాజమండ్రి స్టేషన్లతో పాటు గూడురు స్టేషన్లలో హెల్ప్ డెస్క్‌లను ఏర్పాటు చేశారు. ఎమర్జెన్సీ హెల్ప్ లైన్ నంబర్లు విజయవాడ 0866–2576924, గూడూరు 7815909300 స్టేషన్లలో అందుబాటులోకి తీసుకువచ్చినట్లు సీనియర్ డీసీఎం వావిలపల్లి రాంబాబు గురువారం చెప్పారు. -
Viveka Case : సునీత పిటిషన్ జులై 3కి వాయిదా వేసిన సుప్రీంకోర్టు
సాక్షి, న్యూఢిల్లీ: వైఎస్ వివేకా హత్య కేసులో.. సునీతారెడ్డి పిటిషన్‌పై విచారణను వచ్చే నెల(జులై) 3వ తేదీకి వాయిదా వేసింది సుప్రీంకోర్టు. ఎంపీ అవినాష్‌రెడ్డి ముందస్తు బెయిల్‌ను రద్దు చేయాలంటూ సునీతారెడ్డి వేసిన పిటిషన్‌పై జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఎంఎం సుందరేష్ నేతృత్వంలోని బెంచ్ ఇవాళ(జూన్ 19, సోమవారం) విచారణ జరిపింది. సునీత తరపున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపించారు. ఈ నెలాఖరు (జూన్ 30) కల్లా వివేకా హత్య కేసుపై సిబిఐని దర్యాప్తు పూర్తి చేయమని ఇప్పటికే సుప్రీంకోర్టు గడువు విధించింది. ఈ విషయాన్ని సిద్ధార్థ లూథ్రా న్యాయస్థానానికి గుర్తు చేశారు. ఈ నెలాఖరుతో సిబిఐ దర్యాప్తు గడువు ముగుస్తున్నందున ఎంపీ అవినాష్‌రెడ్డి ముందస్తు బెయిల్‌ను వెంటనే రద్దు చేయాలని కోరారు. అయితే ఈ విజ్ఞప్తిని జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఎంఎం సుందరేష్ నేతృత్వంలోని బెంచ్ అంగీకరించలేదు. కేసు విచారణను జులై 3వ తేదీకి వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది. తదుపరి విచారణ కోసం చీఫ్ జస్టిస్ CJI బెంచ్ ముందు లిస్ట్ చేయాలని ఆదేశించింది. అలాగే ఈ కేసులో వాదనలు వినిపించాల్సిందిగా ప్రతివాదులయిన అవినాష్ రెడ్డి, CBIలకు నోటీసులు జారీ చేసింది. Supreme Court is hearing a plea by the daughter of former MP late YS Vivekananda Reddy against a Telangana High Court order granting anticipatory bail to Kadapa MP YS Avinash Reddy in connection with her father's murder.#SupremeCourt #SupremeCourtofIndia pic.twitter.com/Xs5HCAjpXz — Bar & Bench (@barandbench) June 19, 2023 పిటిషన్‌కు కాలం చెల్లే అవకాశం! వివేకా హత్య కేసులో సీబీఐ దర్యాప్తునకు ఈ నెలాఖరు సుప్రీంకోర్టు డెడ్‌లైన్‌గా విధించిన సంగతి తెలిసిందే. అలాగే సునీతా రెడ్డి పిటిషన్ ను జులై 3కు వాయిదా వేసింది. ఈ నేపథ్యంలో.. CBI చార్జిషీట్ దాఖలు చేస్తే గనుక ముందస్తు బెయిల్ రద్దు చేయాలన్న సునీత పిటిషన్ కు కాలం చెల్లిపోయే అవకాశం ఉంది. గత విచారణలో సునీత తీరుపై అసంతృప్తి వివేకా కేసుకు సంబంధించి సీబీఐ విచారణ ఎదుర్కొంటున్న అవినాష్‌రెడ్డికి మే 31వ తేదీన షరతులతో కూడిన ముందస్తు బెయిల్ ఇచ్చింది తెలంగాణ హైకోర్టు. ఈ ఆదేశాల్ని సవాల్ చేస్తూ సునీతారెడ్డి సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ వేసింది. గత విచారణ సమయంలో తెలంగాణ హైకోర్టు ఆదేశాలను రద్దు చేయాలంటూ సుప్రీంకోర్టును కోరింది సునీత. అంతే కాదు, హైకోర్టు మినీ ట్రయల్ ను నిర్వహించిందని, తమ వాదనల్లో మెరిట్ పరిశీలించకుండా బెయిల్ ఇచ్చిందని తెలిపింది. దీనిపై సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. అవినాష్ ను అరెస్ట్ చేయించాలన్న తాపత్రయం సునీతలో కనిపిస్తోందని, కేవలం ఇగో క్లాషెస్ కోసం వ్యవహరిస్తున్నట్టు కనిపిస్తోందని మొన్నటి విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. Justice Surya Kant: Returnable on 7th July. Counsel: There is a connected matter. Justice Kant: List before first bench on 3rd July 2023, after getting appropriate orders from CJI. #SupremeCourt #SupremeCourtOfIndia — Live Law (@LiveLawIndia) June 19, 2023 తన వాదనే వినాలి, తాను చెప్పిందే నమ్మాలి అన్నట్టుగా కనిపించిన సునీత తీరు ఆశ్చర్యకరంగా ఉంది. ఏ న్యాయస్థానమయినా.. ఎలాంటి అభియోగాలపైనా అయినా.. వాదనలతో పాటు దానికి సంబంధించిన ఆధారాలను పరిశీలించిన పిమ్మటే నిర్ణయం తీసుకుంటుందన్న విషయాన్ని సునీత విస్మరించినట్టు కనిపించింది. ఇదీ చదవండి: మీ తీరు పంతాలకు పోయినట్టుంది.. సునీతతో సుప్రీంకోర్టు అవినాష్‌రెడ్డి ముందస్తు బెయిల్‌కి కారణం ఇదే.. -
బ్యాంక్ అకౌంట్ క్లోజ్ చేయాలా? ఒక్క నిమిషం.. ఇవి తెలుసుకోండి!
ఆధునిక కాలంలో ఉద్యోగాలు చేసే వారికి మాత్రమే కాకుండా, సాధారణ ప్రజలకు కూడా ఒకటి కంటే ఎక్కువ బ్యాంక్ అకౌంట్స్ ఉంటాయి. అయితే తరచుగా ఉపయోగించే బ్యాంక్ అకౌంట్ కాకుండా.. నిరుపయోగంగా ఉన్న బ్యాంక్ ఖాతాలను వీలైనంత వరకు క్లోజ్ చేసుకోవడం ఉత్తమం అని నిపుణులు చెబుతున్నారు. అయితే అలాంటి బ్యాంక్ అకౌంట్స్ క్లోస్ చేసుకోవడానికంటే ముందు తప్పకుండా కొన్ని పూర్తి చేయాల్సిన పనులు ఉన్నాయి. వాటిని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ►బ్యాంక్ అకౌంట్ క్లోజ్ చేయాలనుకునే వ్యక్తి ముందుగా ఖాతాలో ఉన్న బ్యాలెన్స్ తెలుసుకోవాల్సి ఉంటుంది. ఒక వేళా అందులో ఏదైనా అమౌంట్ ఉన్నట్లయితే దానిని విత్‌డ్రా చేసుకోవడం ఉత్తమం. అంతే కాకుండా ఆ బ్యాంక్ ఖాతాకు సంబంధించిన రెండు నుంచి మూడు నెలల స్టేట్మెంట్ తీసుకోవాలి. ఇది భవిష్యత్తులో మీకు తప్పకుండా ఉపయోగపడే అవకాశం ఉంటుంది. ►ఒక వేళా మీరు మీ బ్యాంక్ అకౌంట్ క్లోజ్ చేయాలనుకున్నప్పుడు ఆ ఖాతాలో తగినంత బ్యాలెన్స్ లేకపోతే అకౌంట్ క్లోజ్ చేయడం వీలు కాదు. కావున నెగిటీవ్ బ్యాలెన్స్ లేకుండా ముందుగానే చూసుకోవాలి. బ్యాంకులో అకౌంట్ ఉన్నప్పుడు కొన్ని చార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. ఆ చార్జీలు సరైన సమయంలో చెల్లించని ఎడల బ్యాంక్ బ్యాలన్స్ మైనస్‌లోకి వెళుతుంది. కావున అకౌంట్లో మినిమమ్ బ్యాలన్స్ ఉన్నప్పుడే బ్యాంక్ అకౌంట్ క్లోస్ చేయడానికి వీలుపడుతుంది. (ఇదీ చదవండి: ఎన్ఆర్ఐ ఖరీదైన కారుకి చిన్నప్పుడు ప్రయాణించిన బస్ నెంబర్ - నెట్టింట్లో ప్రశంసలు) ►గతంలో మీరు ఏదైనా బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేసుకున్నప్పుడు నెలవారీగా మీరు చెల్లించాల్సిన ఈఎమ్ఐ, ఇతర సబ్స్క్రిప్షన్లు చెల్లించడానికి ఆటోమాటిక్ క్లియరెన్స్ ఇచ్చి ఉంటే అలాంటివి క్యాన్సిల్ చేసుకోవాలి. ఆలా చేయకపోతే మీరు సమయానికి చెల్లించాల్సిన డబ్బు చెల్లించలేరు, ఆ తరువాత అదనపు అమౌంట్ వంటివి చెల్లించాల్సి ఉంటుంది. ►ప్రస్తుతం చాలా బ్యాంకులు అకౌంట్ ఓపెన్ చేసిన ఏడాదిలోపే క్లోజ్ చేస్తే క్లోజర్ చార్జీలు విధిస్తుంది. కావున అకౌంట్ ఓపెన్ చేసిన తరువాత కనీస సంవత్సరం పూర్తయితే అప్పుడు బ్యాంకు అకౌంట్ క్యాన్సిల్ చేసుకోవచ్చు. (ఇదీ చదవండి: వారెవ్వా.. 21 నెలలు, రూ. 9000 కోట్లు - జీవితాన్ని మార్చేసిన ఒక్క యాప్!) ►ఈపీఎఫ్, ఇన్సూరెన్స్ పాలసీలు, ఇన్‌కమ్‌టాక్స్ డీటైల్స్ మీ సేవింగ్స్ అకౌంట్‌కి లింక్ అయి ఉంటే పిఎఫ్ అమౌంట్ విత్‌డ్రా చేసుకునేటప్పుడు, ఇన్‌కమ్‌టాక్స్ నుంచి రీఫండ్ వంటివి వస్తే కొంత సమస్యను ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాంటి సమయంలో మీరు వేరే అకౌంట్ లింక్ చేసిన తరువాత పాత అకౌంట్ క్లోజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది ఎట్టిపరిస్థితుల్లో మరచిపోకూడదు. -
సీనియర్ సిటిజన్లకు రాయితీల రద్దుతో.. రైల్వే శాఖకు రూ.2,242 కోట్లు
న్యూఢిల్లీ: సీనియర్ సిటిజన్ల టికెట్ రాయితీలరద్దుతో 2022–23లో అదనంగా రూ.2,242 కోట్లు ఆర్జించినట్లు రైల్వే శాఖ తెలిపింది. 58 ఏళ్లు పైబడిన మహిళలకు 50%, 60 ఏళ్లు దాటిన పురుషులు, ట్రాన్స్జెండర్లకు 40% టికెట్ ధరలో రాయితీ ఉండేది. కరోనా నేపథ్యంలో 2020 మార్చి దీన్ని నిలిపేసిన రైల్వే శాఖ ఇప్పటిదాకా పునరుద్ధరించలేదు. -
ఫ్యాబిండియా ఐపీవో రద్దు
న్యూఢిల్లీ: కళాత్మక వస్తువులు, లైఫ్‌స్టైల్ ఉత్పత్తుల రిటైల్ రంగ కంపెనీ ఫ్యాబిండియా పబ్లిక్ ఇష్యూ యోచనను విరమించుకుంది. ప్రస్తుత మార్కెట్ ఆటుపోట్ల నేపథ్యంలో ఐపీవో ద్వారా రూ. 4,000 కోట్ల సమీకరణ ప్రణాళికలను రద్దు చేసుకున్నట్లు కంపెనీ పేర్కొంది. వెరసి క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ నుంచి ముసాయిదా ప్రాస్పెక్టస్‌ను వెనక్కి తీసుకున్నట్లు వెల్లడించింది. ఇష్యూ పరిమాణంరీత్యా ప్రస్తుత మార్కెట్ పరిస్థితులు అనుకూలంగా లేనట్లు కంపెనీ ప్రతినిధి ఒకరు తెలియజేశారు. ఐపీవో ద్వారా 2.5 కోట్ల షేర్లను ఆఫర్ చేయాలని భావించింది. ప్రాస్పెక్టస్ గడువు 2023 ఏప్రిల్‌తో ముగియనున్న నేపథ్యంలో తాజా నిర్ణయాన్ని తీసుకున్నట్లు కంపెనీ వెల్లడించింది. ఎన్సీడీల స్వచ్చంద చెల్లింపులు, సాధారణ కార్పొరేట్ అవసరాలకు నిధులను వెచ్చించాలని కంపెనీ తొలుత ప్రణాళికలు వేసింది. -
పేటీఎం యూజర్లకు గుడ్‌న్యూస్ కొత్త ఫీచర్లు వచ్చేశాయ్...క్యాష్ బ్యాక్ కూడా!
సాక్షి, ముంబై: ప్రముఖ డిజిటల్ పేమెంట్ సంస్థ పేటీఎం యూజర్లకు గుడ్‌న్యూస్ చేసింది పిన్ లేకుండానే చెల్లింపులు చేసేలా పేటీఎం యాప్‌లో యూపీఐ లైట్ అనే కొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. దీంతో పేటీఎం యూజర్లు పేమెంట్ చేసిన ప్రతిసారీ పిన్‌ఎంటర్ చేయాల్సిన అవసరం లేకుండా సులభంగా పేమెంట్స్ చేసుకోవచ్చు. తద్వారా పేటీఎం వినియోగ దారులు కేవలం ఒక్క ట్యాప్‌తో రూ. 200 వరకు వేగంగా లావాదేవీలు చేయవచ్చు. రోజుకు రెండుసార్లు రూ. 2వేల వరకు లావాదేవీచేయవచ్చు. అంటే గరిష్ట పరిమితి రూ. 4 వేలు. నమ్మశక్యం కాని వేగంతో అనేక చిన్న యూపీఐ లావాదేవీలకు వీలు కల్పిస్తుందని, ఇలాంటి సౌకర్యాన్ని అందిస్తున్న ఏకైక ప్లాట్‌ఫారమ్ తమదేనని పేటీఎం పేర్కొంది. ఏ బ్యాంకుల యూజర్లకు ఈ సేవలు వర్తిస్తాయి కెనరా బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, ఇండియన్ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్‌తో సహా తొమ్మిది బ్యాంకులు ప్రస్తుతం పేటీఎం లైట్ సర్వీసులకు మద్దతు ఇస్తున్నాయి. లావాదేవీల్లో ఎలాంటి గందరగోళం లేకుండా బ్యాంకునుంచి ఎస్ఎంఎస్, పేమెంట్స్ హిస్టరీ కూడా ఉంటుందని తెలిపింది. యూపీఐ లైట్‌ని యాక్టివేట్ చేసిన వినియోగదారులకు రూ. 100 క్యాష్‌బ్యాక్‌ను అందిస్తోంది. డ్రైవ్ అడాప్షన్‌కు బ్యాలెన్స్‌గా రూ. 1,000 జోడిస్తుంది. క్యాన్సిల్ ప్రొటెక్ట్ ఫీచర్ ఈ ఫీచర్ భారతదేశంలోని ప్రజలకు డిజిటల్ చెల్లింపులను,అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యమని కంపెనీ వెల్లడించింది. తాజాగా తన యాప్‌లో ‘క్యాన్సిల్ ప్రొటెక్ట్’ అనే కొత్త ఫీచర్‌ను కూడా ప్రవేశపెట్టింది. దీనిద్వారా విమాన, బస్సు టిక్కెట్ల క్యాన్సిలేషన్‌పై 100 శాతం రీఫండ్ అందిస్తుంది. టికెట్ల క్యాన్సిల్ ప్రొటెక్ట్ కోసం కస్టమర్‌నుండి విమాన టికెట్ల బుకింగ్‌పై రూ. 149, బస్ టిక్కెట్లకు రూ. 25 వసూలు చేస్తుంది. తద్వారా షెడ్యూల్ సమయానికి కనీసం 24 గంటల ముందు షెడ్యూల్ చేసిన బయలుదేరే సమయానికి కనీసం నాలుగు గంటల ముందు క్యాన్సిల్ చేసిన బస్ టికెట్లపై 'క్యాన్సిల్ ప్రొటెక్ట్'తో 100 శాతం వాపసు క్లెయిమ్ చేయవచ్చు. క్యాన్సిల్ చేసుకున్న తక్షణమే సంబంధిత ఖాతాలోకి నగదు జమ అవుతుంది. Very proud of launching with @UPI_NPCI our latest in commitment to payments that are scalable and never fail. Upgrade your UPI experience by switching to @Paytm App ! Here payments never fail, tx are super fast and you don’t see clutter in your bank statement! All this 🚀🚀 pic.twitter.com/c1tr7J4V3A — Vijay Shekhar Sharma (@vijayshekhar) February 24, 2023 -
వచ్చే ఎన్నికల్లో ప్రధానాంశం సీపీఎస్ రద్దు
సాక్షి, హైదరాబాద్: కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం (సీపీఎస్) రద్దు అంశమే రాబోయే సాధారణ ఎన్నికల్లో ప్రధానాంశం అవుతుందని నేషనల్ మూవ్మెంట్ ఫర్ ఓల్డ్ పెన్షన్ స్కీం (ఎన్‌ఎంవోపీఎస్) సెక్రెటరీ జనరల్ గంగాపురం స్థితప్రజ్ఞ అన్నారు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఉజ్జయిని చరక్ భవన్ గ్రౌండ్లో ఆదివారం ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయుల కుంభమేళా నిర్వహించారు. కార్యక్రమంలో స్థితప్రజ్ఞ మాట్లాడుతూ ఇప్పటికే ఒక జాతీయ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో సీపీఎస్‌ను రద్దు చేసిందని, మిగిలిన అన్ని రాష్ట్రాల్లోనూ ఈ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రూ.లక్షల కోట్ల కార్పొరేట్ కంపెనీల అప్పులు రద్దు చేసినప్పుడు కలగని నష్టం.. ఉద్యోగులు, ఉపాధ్యాయులకు పాత పింఛన్ అమలు చేస్తే వస్తుందా? అని ఆయన ప్రశ్నించారు. ఈ సందర్భంగా మహాకాళుడి సాక్షిగా ఉజ్జయిని నగరంలో ‘ఓట్ ఫర్ ఓపీఎస్’ ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో విజయకుమార్ బంధు (ఉత్తరప్రదేశ్), వితీశ్ ఖండేల్కర్ (మహారాష్ట్ర), కల్వల్ శ్రీకాంత్, నరేశ్ గౌడ్ (తెలంగాణ) తదితరులు పాల్గొన్నారు. -
అమర్నాథ్ యాత్ర.. కొత్త బ్యాచ్‌లకు బ్రేక్
జమ్మూ: తీవ్ర అననుకూల వాతావరణ పరిస్థితుల కారణంగా జమ్మూ నుంచి కశ్మీర్‌లోని బేస్ క్యాంప్‌లకు చేరుకోవాల్సిన అమర్నాథ్ యాత్రికుల కొత్త బ్యాచ్‌లను రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు. శుక్రవారం అమర్నాథ్ సమీపంలో సంభవించిన ఆకస్మిక వరదల్లో 16 మంది యాత్రికులు మృతి చెందగా మరో 40 మంది వరకు జాడ తెలియకుండా పోయిన విషయం తెలిసిందే. జూన్ 30వ తేదీ నుంచి మొదలైన 43 రోజుల అమర్నాథ్ యాత్ర ఆగస్ట్ 11వ తేదీన రక్షా బంధన్ రోజున ముగియనుంది. -
పెట్రోల్‌పై ఈ రాయితీ కూడా ఎత్తేశారహో..!
న్యూఢిల్లీ: పెట్రోల్ కొనుగోళ్లకు డిజిటల్‌గా చేసే చెల్లింపులపై పంజాబ్ నేషనల్ బ్యాంకు (పీఎన్బీ) ఇంతకాలం ఇస్తున్న 0.75 శాతం రాయితీని ఎత్తివేసింది. గత నెల నుంచే ఈ ప్రయోజనాన్ని నిలిపివేసినట్టు, ప్రభుత్వరంగ చమురు మార్కెటింగ్ కంపెనీలు దీన్ని ఉపసంహరించుకోవడమే దీనికి కారణమని పీఎన్బీ తెలిపింది. ఇందుకు సంబంధించి బ్యాంకు వెబ్సైట్లో ఓ నోటిఫికేషన్ ఉంచింది. ‘‘ఇంధన కొనుగోళ్లపై అన్ని రకాల డిజిటల్ చెల్లింపులకు ఇస్తున్న 0.75 శాతం ప్రోత్సాహకాన్ని నిలిపివేయాలని ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు నిర్ణయం తీసుకున్నట్టు భారత్ పెట్రోలియం (బీపీసీఎల్) తెలిపింది’’ అంటూ పీఎన్బీ తన నోటిఫికేషన్లో పేర్కొంది. దీంతో మే నెల నుంచి డిజిటల్ చెల్లింపులపై ఈ ప్రయోజనాన్ని నిలిపివేసినట్టు పీఎన్బీ తెలిపింది. 2016 నవంబర్ 8న పెద్ద నోట్లను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం తెలిసిందే. నాటి నిర్ణయం వల్ల వ్యవస్థలో నగదుకు కొంత కాలం పాటు తీవ్ర కొరత ఏర్పడింది. దీన్ని పరిగణనలోకి తీసుకున్న కేంద్ర సర్కారు డిజిటల్ రూపంలో చెల్లింపులను ప్రోత్సహించేందుకు 0.75 శాతం రాయితీ ఇవ్వాలని ఆయిల్ కంపెనీలను కోరింది. దీంతో 2016 డిసెంబర్ 13 నుంచి ఇప్పటి వరకు క్రెడిట్, డెబిట్ కార్డు, యూపీఐ చెల్లింపులపై రాయితీ లభించింది. ఈ ప్రోత్సాహకాన్ని క్రెడిట్ కార్డులపై ముందే తొలగించారు. ఇప్పుడు మిగిలిన డిజిటల్ చెల్లింపులపైనా ఎత్తేసినట్టు అయింది. చదవండి: ధరలు పెరిగినా.. తగ్గేదేలే అంటున్నారు.. -
‘కశ్మీర్ ఫైల్స్’ మూవీ ఎఫెక్ట్.. ఢిల్లీలో కశ్మీర్ వ్యక్తికి చేదు అనుభవం..
సాక్షి, న్యూఢిల్లీ: కశ్మీర్ పండిట్లపై 1990లో జరిగిన మారణకాండ ఆధారంగా ‘ద కశ్మీర్ ఫైల్స్’ సినిమా రూపొందించిన విషయం తెలిసిందే. ఈ సినిమా అంచనాలకు మించి ఆడుతూ పలు రికార్డులను బద్దలుకొడుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా జమ్మూకశ్మీర్‌కు చెందిన ఓ వ్యక్తికి ఢిల్లీలో చేదు అనుభవం ఎదురైంది. ఐడీ ఫ్రూప్స్ ఉన్నప్పటికీ హోటల్లో అతడికి రూమ్ ఇచ్చేందుకు సదరు హోటల్ సిబ్బంది అంగీకరించలేదు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వివరాల ప్రకారం.. కశ్మీర్‌కు చెందిన ఓ వ్యక్తి ఆన్లైన్లో ఓయో ద్వారా ఢిల్లీలోని హోటల్లో రూమ్ బుక్ చేసుకున్నాడు. అనంతరం ఆ హోటల్‌కు వెళ్లాడు. ఈ క్రమంలో హోటల్ రిసెప్షన్లో ఉన్న మహిళా ఉద్యోగి అతడికి రూమ్ ఇచ్చేందుకు నిరాకరించింది. సదరు వ్యక్తి తన ఆధార్ కార్డుతో సహా మరికొన్ని ఐడీ ఫ్రూప్స్ చూపించినప్పటికీ ఆమె అతడికి రూమ్ ఇవ్వలేదు. Impact of #KashmirFiles on ground. Delhi Hotel denies accommodation to kashmiri man, despite provided id and other documents. Is being a kashmiri a Crime. @Nidhi @ndtv @TimesNow @vijaita @zoo_bear @kaushikrj6 @_sayema @alishan_jafri @_sayema @manojkjhadu @MahuaMoitra pic.twitter.com/x2q8A5fXpo — Nasir Khuehami (ناصر کہویہامی) (@NasirKhuehami) March 23, 2022 అయితే, సదరు వ్యక్తి ఆమెను ప్రశ్నించడంతో.. ఆమె తన సీనియర్ అధికారికి ఫోన్ చేసి మాట్లాడిన అనంతరం.. కశ్మీర్‌కు చెందిన వ్యక్తులకు రూమ్ ఇవ్వకూడదని ఢిల్లీ పోలీసులు చెప్పినట్టు వివరణ ఇచ్చింది. దీంతో షాకైన సదరు వ్యక్తి తనకు జరిగిన చేదు అనుభవాన్ని సోషల్ మీడియాలో వివరిస్తూ తన ఆవేదన వ్యక్తం చేశాడు. అనంతరం తాను వేరే హోటల్లో రూమ్ తీసుకున్నట్టు తెలిపాడు. A purported video is viral on social media wherein a person is being denied hotel reservation due to his J&K ID. The reason for cancellation is being given as direction from police. It is clarified that no such direction has been given by Delhi Police.(1/3)@ANI @PTI_News — Delhi Police (@DelhiPolice) March 23, 2022 ఈ నేపథ్యంలో ఈ ఘటనపై ఢిల్లీ పోలీసులు ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. జమ్మూ కశ్మీర్‌కు చెందిన వ్యక్తులకు రూమ్ ఇవ్వకూడదనే ఆదేశాలేవీ తాము ఇవ్వలేదని స్పష్టం చేశారు. పోలీసులపై ఇలాంటి తప్పడు ప్రచారాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇది చదవండి: గుడిలో దళితుడికి ఘోర అవమానం.. దేవుళ్లను కించపర్చాడని.. -
ఘోర విమాన ప్రమాదం.. చైనీస్ విమానశాఖ సంచలన నిర్ణయం
చైనా దక్షిణ గ్వాంగ్జీ ఝువాంగ్ ప్రాంతంలో సోమవారం ఘోర విమాన ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదం కారణంగా మంగళవారం షెడ్యూల్ చేయబడిన 11,800 విమానాలలో 74% రద్దు చేస్తున్నట్లు చైనీస్ విమాన శాఖ తెలిపింది. వీటిలో ఎక్కువ భాగం బీజింగ్, షాంఘై మధ్య ప్రయాణించాల్సి ఉంది. సాధారణంగా ప్రపంచంలోని అత్యంత రద్దీ దేశీయ మార్గాలలో ఇదీ ఒకటి. గతంలో కోవిడ్ పరిమితుల కారణంగా చైనీస్ విమానాలు చాలా కాలాం గాల్లో ఎగరలేదు. దీంతో చైనీస్ విమానశాఖ చాలా వరకు ఆర్థికంగా నష్టపోయింది. అయితే తాజాగా మంగళవారం చేసిన రద్దుతో ఆ నష్టం మరింత పెరగనున్నట్లు చైనీస్ ఏవియేషన్ డేటా కంపెనీ డేటా పేర్కొంది. వివరాల్లోకి వెళితే.. చైనా ఈస్ట్రన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన బోయింగ్ 737 ఎయిర్‌క్రాఫ్ట్ గ్వాంఝుకు వెళ్లేందుకు కున్మింగ్ నుంచి స్థానిక సమయం ప్రకారం మధ్యాహ్నం 1.10కి బయలుదేరరిన విమానం వుఝు సమీపంలోని టెంగ్జియాన్ కౌంటీ ప్రాంతంలోకి రాగానే కొండను ఢీకొని కూలిపోయింది. ప్రమాదంలో అంతా మరణించి ఉంటారని భావిస్తున్నారు. అందులో 132 మంది ప్రయాణికులు ఉన్నారు. 2010 తర్వాత చైనాలో జరిగిన తొలి విమాన ప్రమాదం ఇదే. చదవండి: China Flight Crash: చైనాలో ఘోర విమాన ప్రమాదం.. మొత్తం 132 మంది మృతి! -
గరిష్టానికి ఒమిక్రాన్ కేసులు.. అక్కడ ఇక మాస్కు తప్పనిసరి కాదు!
లండన్: దేశంలో కరోనా కట్టడికి అమలు చేస్తున్న నిబంధనల్లో చాలావాటిని బ్రిటీష్ ప్రభుత్వం తొలగించింది. దేశంలో ఒమిక్రాన్ కేసులు గరిష్టానికి చేరినందున (అంటే అంతకుమించి ఇక పెరగవని అర్థం) ఈ నిబంధనలు తొలగిస్తున్నామని బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ఇటీవల ప్రకటించారు. దీంతో ఇకపై ఎక్కడైన తప్పనిసరిగా మాస్కు ధరించాలన్న నిబంధన వచ్చే గురువారం నుంచి రద్దు కానుంది. అలాగే పెద్ద పెద్ద కార్యక్రమాలకు హాజరయ్యేవారు టీకా సర్టిఫికెట్ తప్పక తీసుకరావాలన్న నిబంధన కూడా కనుమరుగుకానుంది. గురువారం నుంచి పాఠశాల గదుల్లో మాస్కులు తప్పనిసరి నిబంధన కూడా తొలగించనున్నట్లు ప్రధాని చెప్పా రు. ప్రజలు వర్క్ ఫ్రం హోం చేయాల్సిన అవసరం లేదని, ఉద్యోగులు భౌతిక హాజరుపై తమ సంస్థలతో చర్చించాలని సూచించారు. అయితే కరోనా వ్యాప్తి నివారణకు తప్పనిసరి మాస్కుధారణ నిబం ధన కొనసాగిస్తామని స్కాట్లాండ్ డిప్యూటీ ఫస్ట్ మినిస్టర్ జాన్ స్విన్నీ చెప్పారు. బ్రిటన్‌లో లాగా తాము నిబంధనలు ఎత్తివేయడం లేదన్నారు. పార్లమెంట్ సూచన మేరకు నిబంధనలు కొనసాగిస్తామని, పార్లమెంట్ సూచిస్తే నిబంధనలు మారుస్తామని చెప్పా రు. పబ్లిక్ స్థలాల్లో మాస్కు ధారణ తప్పదన్నారు. ప్లాన్ బీ టు ఏ ఓఎన్ఎస్ (ఆఫీస్ ఆఫ్ నేషనల్ స్టాటిస్టిక్స్) అంచనా ప్రకారం దేశమంతా ఒమిక్రాన్ గరిష్టానికి చేరిందని హౌస్ ఆఫ్ కామన్స్‌కు ప్రధాని తెలిపారు. ఓఎన్ఎస్ డేటా ప్రకారం కొన్ని ప్రాంతాలు మినహా ఇంగ్లండ్‌లో ఇన్ఫెక్షన్ స్థాయిలు పడిపోతున్నాయని వెల్లడించారు. ప్లాన్ బీ (తీవ్ర నిబంధనలు) నుంచి ప్లాన్ ఏ (స్వల్ప నిబంధనలు)కు మరలేందుకు కేబినెట్ అంగీకరించిందని చెప్పారు.దేశంలో ఆస్పత్రిలో చేరికలు క్రమంగా తగ్గిపోతున్నాయని, ఐసీయూ అడ్మిషన్లు కూడా పడిపోయాయని వివరించారు. సెల్ఫ్ ఐసోలేషన్ లాంటి కొన్ని నిబంధనలు మాత్రం కొనసాగుతాయన్నారు. బ్రిటన్‌లో ఈ సెల్ఫ్ ఐసోలేషన్ సమయాన్ని 7 నుంచి 5 రోజులకు గత సోమవారం నుంచి తగ్గించారు. మార్చి నాటికి సెల్ఫ్ ఐసోలేషన్ నిబంధన కూడా ఎత్తివేస్తామని బోరిస్ అంచనా వేశారు. కోవిడ్ దాదాపు ఎండమిక్ దశకు చేరుతోందని, అయినా ప్రజలు అప్రమత్తంగా ఉండడం మంచిదని సూచించారు. -
‘రజా అకాడమీ’ని నిషేధించాలి
నాగపూర్/పుణే: మహారాష్ట్రలోని పలు నగరాలు, పట్టణాల్లో హింసాకాండ చోటుచేసుకోవడంపై విశ్వ హిందూ పరిషత్(వీహెచ్‌పీ) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. త్రిపురలో జరిగిన మత కలహాలను నిరసిస్తూ ఇస్లామిక్ సంఘాల ఆధ్వర్యంలో జరిగిన ర్యాలీల సందర్భంగా అల్లరి మూకలు దుకాణాలపై రాళ్లు రువ్విన సంగతి తెలిసిందే. ఈ ఘటనలను వీహెచ్‌పీ జనరల్ సెక్రెటరీ మిలింద్ పరాండే ఆదివారం ఖండించారు. అల్లర్లకు కారణమైన ‘రజా అకాడమీ’ అనే ఇస్లామిక్ సంఘాన్ని రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అల్లరి మూకలపై తాము పలు పోలీసు స్టేషన్లలో ఫిర్యాదు చేశామని అన్నారు. రాళ్లు రువ్వినవారిని గుర్తించి, చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. ఒకవేళ పోలీసులు స్పందించకపోతే తామే ఆ పని చేస్తామని హెచ్చరించారు. ఈ విషయంలో త్వరలో గవర్నర్ భగత్‌సింగ్ కోషియారీని కలుస్తామన్నారు. అల్లర్లలో నష్టపోయిన వారికి పరిహారం చెల్లించా లని మహారాష్ట్ర సర్కార్‌కి మిలింద్ పరాండే విజ్ఞప్తి చేశారు. బాలీవుడ్ నటి కంగనా రనౌత్ వ్యాఖ్యలపైనా ఆయన మాట్లాడారు. భారత్ 2014లో సాంస్కృతిక స్వాతంత్య్రం పొందిందని చెప్పారు. -
పాకిస్తాన్లో భద్రత లేదంటూ... కివీస్ పర్యటన రద్దు!
రావల్పిండి: పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ)కి భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఓ పెద్ద జట్టు మా దేశ పర్యటనకు వచి్చందన్న ఆనందం ఆవిరైంది. న్యూజిలాండ్ ఇంకాసేపట్లో తొలి వన్డే కోసం బరిలోకి దిగాల్సివుండగా... మ్యాచ్‌నే కాదు ఏకంగా సిరీస్‌నే రద్దు చేసుకుంటున్నామని ప్రకటించింది. ఈ ఊహించని హఠాత్పరిణామానికి పీసీబీ ఉలిక్కిపడింది. ఒక్కసారిగా అయోమయంలో పడింది. ఉన్నపళంగా ఈ నిర్ణయానికి గల కారణం ఏంటో చెప్పాలంది. లోపాలుంటే సరిదిద్దుకుంటామంది. భద్రత ఏర్పాట్లను మరింత పటిష్టపరుస్తామంది. అసలేం జరిగింది? శుక్రవారం మ్యాచ్ కోసం ఇరు జట్లు బస చేసిన హోటల్ నుంచి స్టేడియానికి చేరాల్సివుంది. ఆటగాళ్లేమో గదుల నుంచి బయటికి రావడం లేదు. వారి కోసం బస్సులు ఎదురుచూస్తున్నాయి. న్యూజిలాండ్ వర్గాల నుంచి ఒక ప్రకటన మాత్రం బయటికి వచి్చంది. ‘ఈ పర్యటన ఇక ఏమాత్రం ముందుకు సాగదు. మా ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ప్రస్తుత పరిస్థితుల్లో మేం ఆడటం సాధ్యపడదు. ఈ నిర్ణయం పీసీబీకి మింగుడుపడదని మాకు తెలుసు. ఘనమైన ఆతిథ్య ఏర్పాట్లు ఎన్నో చేశారు. అయితే మా ఆటగాళ్ల భద్రత దృష్ట్యానే మేం ఈ నిర్ణయం తీసుకున్నాం’ అని న్యూజిలాండ్ క్రికెట్ సీఈఓ డేవిడ్ వైట్ ఒక ప్రకటన విడుదల చేశారు. దీంతో పీసీబీ వర్గాలకు ఊపిరి ఆగినంత పనైంది. వెంటనే దిగ్గజ కెపె్టన్ అయిన పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ రంగంలోకి దిగారు. కివీస్ ప్రధాని జసిండా అర్డెర్న్‌కు ఫోన్ చేశారు. ఆటగాళ్ల భద్రతకు హామీ ఇచ్చారు. కానీ ఆమె ఆటగాళ్లను పాక్‌లో ఉంచేందుకు ససేమిరా అని చెప్పారు. 18 ఏళ్ల తర్వాత కివీస్ మూడు వన్డేలు, ఐదు టి20ల సిరీస్ కోసం పాక్ పర్యటనకు ఈ నెల 11న ఇక్కడికి వచి్చంది. ఆతిథ్య, భద్రతా ఏర్పాట్లపై సంతృప్తి వెలిబుచ్చింది. ఇంతలోనే ఏం జరిగిందో అర్థం కావట్లేదు. మూడు రోజుల క్రితమే పీసీబీ చీఫ్ పదవి చేపట్టిన రమీజ్ రాజా న్యూజిలాండ్ నిర్ణయంపై గుర్రుగా ఉన్నారు. ఐసీసీ పేషీలోనే తేల్చుకుంటామని ట్విట్టర్లో ప్రకటించారు. మేమూ సమీక్షిస్తాం: ఈసీబీ వచ్చే నెల పాక్ పర్యటనకు వెళ్లాల్సిన ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) కూడా తమ నిర్ణయాన్ని సమీక్షించుకుంటామని చెప్పింది. ‘ఒకట్రెండు రోజుల్లో చర్చించుకొని టూర్ ప్రణాళికను వెల్లడిస్తాం’ అని ఈసీబీ తెలిపింది. వచ్చే నెల 13, 14 తేదీల్లో ఇంగ్లండ్ రావలి్పండి వేదికగా రెండు టి20లు ఆడేందుకు వెళ్లాల్సివుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి–మార్చి నెలల్లో ఆసీస్ కూడా పాక్‌లో పర్యటించాల్సివుంది. కానీ అనిశి్చత పరిస్థితుల దృష్ట్యా ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. -
కోవిడ్ బూచి చూపించి టీమిండియా డ్రామాలాడింది.. అంతా ఐపీఎల్ కోసమే..!
లండన్: భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య మాంచెస్టర్ వేదికగా జరగాల్సిన చివరి టెస్ట్ కోవిడ్ కారణంగా రద్దైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టీమిండియా ఉద్దేశపూర్వకంగానే మ్యాచ్ రద్దుకు మొగ్గుచూపిందంటూ ఇంగ్లీష్ మీడియా విషప్రచారం చేస్తోంది. దీనికి ఆ దేశ మాజీ క్రికెటర్లు కూడా తోడై టీమిండియా, బీసీసీఐలపై బురదజల్లుతున్నారు. కరోనా బూచిని చూపించి టీమిండియా డ్రామాలాడిందని, ఈ తతంగమంతా ఐపీఎల్ కోసమేనని రకరకాలు కథనాలు ప్రచారం చేస్తుంది. ఆర్టీపీసీఆర్ పరీక్షల్లో రెండుసార్లు నెగిటివ్ వచ్చినా కోహ్లి సేన మ్యాచ్ ఆడేందుకు ససేమిరా అనడం, ఆపై మాంచెస్టర్ వీధుల్లో చక్కర్లు కొట్టడం, ఆ వెంటనే ఐపీఎల్ కోసం ప్రత్యేక విమానాల్లో దుబాయ్‌కు బయల్దేరడంపై ఆ దేశ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ కస్సుబుస్సులాడుతున్నాడు. కాసులు కురిపించే క్యాష్ రిచ్ లీగ్‌లో ఒక్క మ్యాచ్‌కు కూడా ఇబ్బంది కలగకుండా ఉండేందుకే భారత క్రికెటర్లు చివరి టెస్ట్ నుంచి తప్పుకున్నారని, వారికి దేశం తరఫున ఆడే టెస్ట్ మ్యాచ్ కంటే ఐపీఎల్ మ్యాచ్‌లంటేనే ముఖ్యమని ఘాటు వ్యాఖ్యలు చేశాడు. కోవిడ్ టెస్ట్ 'నెగెటివ్' రిపోర్టు వచ్చాకే యూఏఈ బయల్దేరిన కోహ్లి అండ్ కో అదే రిపోర్టుతో ఒక రోజు ఆలస్యంగా టెస్ట్ ఆడితే ఏమయ్యేదంటూ ప్రశ్నల వర్షం కురిపించాడు. ఈ టెస్ట్ సిరీస్‌లో భారత్, ఇంగ్లండ్ కాకుండా చివరకు 'డబ్బు' గెలిచిందని ఘాటుగా విమర్శించారు. టీమిండియా ఆటగాళ్లలో కరోనా సోకుతుందేమోనన్న భయం కంటే ఐపీఎల్‌కు దూరమవుతామనే ఆందోళన ఎక్కువైందని, అందువల్లే మాంచెస్టర్ టెస్ట్ రద్దయిందని నోరుపారేసుకున్నాడు. మరోవైపు వాన్.. టీమిండియా ఆటగాళ్లపై చేస్తున్న నిరాధారమైన ఆరోపణలకు ప్రముఖ వ్యాఖ్యాత ఆకాశ్ చోప్రా సైతం ఘాటుగానే బదులిచ్చాడు. డబ్ల్యూటీసీ ఫైనల్ తర్వాత భారత జట్టు నలభై రోజులు ఖాళీగా కూర్చుంది. ఆ సమయంలో టెస్ట్ సిరీస్‌ను కాస్త ముందుగా జరపమన్నా వినలేదు. పైగా పనికిమాలిన ‘హండ్రెడ్' లీగ్ కోసం రెండు, మూడో టెస్ట్‌ల మధ్య 9 రోజుల విరామం ఇచ్చారు. అలాంటిది ఇప్పుడు ఐపీఎల్‌ను విమర్శించడంలో అర్థం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. సౌతాఫ్రికా పర్యటనలో ఇంగ్లండ్ జట్టు చేసిందేంటని ప్రశ్నించాడు. ఇంగ్లండ్ జట్టులో కరోనా కేసులు లేకున్నా.. ఎందుకు ఆ సిరీస్ బాయ్‌కట్ చేసిందని నిలదీశాడు. చదవండి: ఆవేశంలో ఇంగ్లండ్ ఆటగాళ్లు.. ఐపీఎల్ బహిష్కరిస్తామని బెదిరింపులు..! -
ఆవేశంలో ఇంగ్లండ్ ఆటగాళ్లు.. ఐపీఎల్ బహిష్కరిస్తామని బెదిరింపులు..!
IND VS ENG 5th Test Cancellation: ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య మాంచెస్టర్ వేదికగా శుక్రవారం నుంచి ప్రారంభంకావాల్సిన ఐదో టెస్ట్ రద్దైన నేపథ్యంలో ఇంగ్లీష్ ఆటగాళ్లు ఆవేశంతో ఊగిపోతున్నారని తెలుస్తోంది. తమ జట్టు సిరీస్‌ను డ్రా చేసుకునే అవకాశముండటంతో టీమిండియా సభ్యులు కరోనా బూచి చూపించి కావాలనే బరిలోకి దిగేందుకు నిరాకరించారని వారు ఆరోపిస్తున్నారు. కొత్త కరోనా కేసులు నమోదవుతాయని భయపడిన టీమిండియా క్రికెటర్లు మాంచెస్టర్ వీధుల్లో తిరగడమేంటని నిలదీస్తున్నారు. ఇంతటితో ఆగని ఇంగ్లీష్ క్రికెటర్లు ఐపీఎల్ 2021 సెకెండ్ లెగ్ మ్యాచ్‌లను బహిష్కరిస్తామని హెచ్చరించారని తెలుస్తోంది. ఈ విషయమై(ఐపీఎల్ బహిష్కరణ) జానీ బెయిర్‌స్టో, డేవిడ్ మలాన్, క్రిస్ వోక్స్ ఇదివరకే నిర్ణయించుకున్నట్లు బ్రిటిష్ మీడియా కథనాలు సైతం ప్రచారం చేస్తోంది. ఐపీఎల్లో పాల్గొంటున్న ఐదుగురు క్రికెటర్లలో ఒకరు ఇంగ్లండ్ ఆటగాళ్లను రెచ్చగొట్టారని సమాచారం. ఇదిలా ఉంటే, భారత బృందంలో కరోనా కేసు వెలుగు చూడటంతో మ్యాచ్‌కు మూడు గంటల ముందు రద్దు చేస్తున్నట్లు ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) ప్రకటించింది. భారత కోచింగ్ సిబ్బంది వరుసగా వైరస్ బారిన పడడంతో భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)తో సుదీర్ఘ చర్చల అనంతరం ఈసీబీ రద్దు నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో సొంతగడ్డపై సిరీస్ కోల్పోవాల్సి వస్తుందని ఇంగ్లీష్ ప్లేయర్లు కడుపు మంటతో ఐపీఎల్ బహిష్కరిస్తామని బెదిరింపులకు దిగారని సమాచారం. చదవండి: ఆ మూడు ఐపీఎల్ జట్లకు భారీ షాక్.. ముగ్గురు స్టార్ ఆటగాళ్లు దూరం -
అడ్మిషన్లు రద్దు చేసుకుంటే పూర్తి ఫీజు ఇచ్చేయాల్సిందే
సాక్షి, అమరావతి: విద్యా సంస్థల్లో ప్రవేశాలు పొందిన విద్యార్థులు కోవిడ్ కారణంగా తమ అడ్మిషన్లను రద్దు చేసుకుంటే వారికి పూర్తి ఫీజులను వాపసు ఇవ్వాలని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) అన్ని ఉన్నత విద్యాసంస్థలను ఆదేశించింది. కోవిడ్, లాక్డౌన్ కారణంగా ఉద్యోగ, ఉపాధి కార్యక్రమాలు దెబ్బతిని పలు కుటుంబాల ఆర్థిక పరిస్థితులు ఛిన్నాభిన్నమై ఉన్నందున క్యాన్సిలేషన్ చార్జీలు వసూలు చేయకుండా వెనక్కిచ్చేయాలని కొత్త అకడమిక్ షెడ్యూల్‌తో విడుదల చేసిన మార్గదర్శకాల్లో సూచించింది. అక్టోబర్ 31లోగా అడ్మిషన్లు రద్దు చేసుకున్న వారు, లేదా మైగ్రేషన్‌పై వేరే సంస్థల్లోకి చేరే వారి నుంచి ఎలాంటి చార్జీలు వసూలు చేయకుండా ఫీజులను తిరిగి ఇచ్చేయాలని స్పష్టం చేసింది. డిసెంబర్ 31 లోపు అడ్మిషన్లు రద్దు చేసుకునే వారి నుంచి రూ.1000 వరకు క్యాన్సిలేషన్ ఫీజు వసూలు చేయాలని, అంతకు మించి వసూలు చేయరాదని పేర్కొంది. ఆఫ్‌లైన్‌లో పరీక్షల నిర్వహణ 2020–21 విద్యాసంవత్సరానికి సంబంధించి ఫైనల్ ఇయర్ విద్యార్థులకు టర్మినల్ సెమిస్టర్ పరీక్షలను పెన్ అండ్ పేపర్ ఆధారితంగా (ఆఫ్‌లైన్‌లో), లేదా ఆన్లైన్, బ్లెండెడ్ (ఆఫ్‌లైన్ ప్లస్ ఆన్లైన్) విధానాల్లో ఆగస్టు 31లోగా నిర్వహించాలని యూజీసీ పేర్కొంది. ఇంటర్ ఫలితాలు విడుదల ఆలస్యమైనందున 2021–22 విద్యాసంవత్సరానికి విద్యాసంస్థల్లో ప్రవేశాల ప్రక్రియను యూజీసీ అక్టోబర్ 1 నుం చి ప్రారంభించాలని కొత్త షెడ్యూల్లో పేర్కొం ది. ఈ విద్యార్థులకు ఫస్ట్ సెమిస్టర్ ప్రిపరేటరీ బ్రేక్, పరీక్షల నిర్వహణ అంశాలను విద్యాసంస్థలు నిర్ణయించుకోవాలని వివరించింది. -
అంతర్జాతీయ విమానాల రద్దు పొడిగింపు
-
Telangana: ఇంటర్ ఫైనల్ పరీక్షలు రద్దు?!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం వార్షిక పరీక్షలు రద్దయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ పబ్లిక్ పరీక్షల రద్దుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు సైతం రద్దు చేసే పరిస్థితి కనిపిస్తోంది. ఇంటర్మీడియట్ అకడమిక్ కేలండర్ ప్రకారం వార్షిక పరీక్షలు మే నెల మొదటి వారంలో నిర్వహించాల్సి ఉంది. కానీ కోవిడ్–19 వ్యాప్తి నేపథ్యంలో ఈ పరీక్షలను బోర్డు వాయిదా వేసింది. తిరిగి జూలైæ రెండో వారంలో నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వానికి సైతం ప్రతిపాదనలు సమర్పించింది. పరీక్షల నిర్వహణకు సంబంధించి క్షేత్ర స్థాయిలో జిల్లాల వారీగా ఏర్పాట్లు కూడా పూర్తి చేసింది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ పబ్లిక్ పరీక్షలు నిర్వహించడం సరికాదని భావించిన కేంద్ర ప్రభుత్వం వాటి రద్దుకు ఆమోదం తెలిపింది. మంగళవారం ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో జూలై రెండో వారం నుంచి నిర్వహించాలని భావించిన ఇంటర్ వార్షిక పరీక్షలపైనా సందిగ్ధత నెలకొంది. అయితే దేశవ్యాప్తంగా నిర్వహించే పరీక్షలను కేంద్రం రద్దు చేయడంతో.. రాష్ట్రంలో కూడా ఇదేతరహా నిర్ణయం తీసుకునే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇంటర్మీడియట్ బోర్డు వర్గాలు మాత్రం.. పరీక్షల నిర్వహణకు పక్కాగా చర్యలు చేపట్టినట్లు పేర్కొంటూనే ప్రభుత్వ నిర్ణయం మేరకు వ్యవరిస్తామని చెబుతున్నాయి. ప్రస్తుత విద్యా సంవత్సరంలో 4,73,967 మంది విద్యార్థులు ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలకు హాజరు కావాల్సి ఉంది. కోవిడ్ నేపథ్యంలో ఇంటర్ ఫస్టియర్ పరీక్షలను బోర్డు ఇప్పటికే రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఫస్టియర్ మార్కులే ఆధారం! పరీక్షలు నిర్వహించే పక్షంలో విద్యార్థులు సన్నద్ధం కావాల్సి ఉంటుంది. ఒకవేళ పరీక్షలు రద్దు చేస్తే మార్కులు ఎలా అనే అంశంపై కొంత గందరగోళం నెలకొంది. అయితే వీటిపై ఇప్పటికే అధికారులు ఓ ఆప్షన్‌ను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సెకండియర్ పరీక్షలు రాయాల్సిన విద్యార్థులు గతేడాది ఫస్టియర్ పరీక్షలు రాశారు. ఈ నేపథ్యంలో ఆప్పుడు వచ్చిన మార్కుల ఆధారంగా సెకండియర్‌లో మార్కులు వేసే ఆప్షన్‌ను అధికారులు ఎంపిక చేశారు. ఒకవేళ పరీక్షలు రాయకుండా గైర్హాజరైన వారికి 45 శాతం మార్కులు వేసే అవకాశం ఉంది. ఫస్టియర్ పరీక్ష రాసి ఫెయిల్ అయిన విద్యార్థుల విషయంలో కూడా ఒక అంచనాకు వచ్చారు. పరీక్ష రాసి పాసైన సబ్జెక్టు మార్కుల ఆధారంగా సెకండియర్ మార్కులు నిర్ధారిస్తారు. ఫెయిల్ అయిన సబ్జెక్టుకు 45 శాతం మార్కులు వేస్తారు. ఇక ప్రాక్టికల్స్ విషయంలో రికార్డు ఆధారంగా మార్కులు నిర్దేశించనున్నట్లు తెలుస్తోంది. -
టీ20 వరల్డ్‌కప్.. ఐసీసీ కీలక నిర్ణయం
దుబాయ్: కరోనా మహమ్మారి కారణంగా పురుషుల టీ20 వరల్డ్ కప్‌లో భాగంగా మూడు సబ్-రీజినల్ క్వాలిఫయర్ టోర్నీలను రద్దు చేస్తున్నట్లు ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) శుక్రవారం ప్రకటించింది. ఐసీసీమెన్స్ టీ20 ప్రపంచకప్ కోసం ఈ అర్హత టోర్నీలను నిర్వహిస్తున్నది. కాగా మూడు క్వాలిఫయింగ్ మ్యాచ్‌ల్లో ఎ, బి క్వాలిఫయర్స్ మ్యాచ్‌లు ఫిన్లాండ్లో జరగనుండగా, వచ్చే రెండు నెలల్లో సి క్వాలిఫయర్స్‌కు బెల్జియం ఆతిథ్యమివ్వాల్సి ఉంది. కరోనా నేపథ్యంలో అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని మూడు క్వాలిఫయర్లను రద్దు చేయడమే మంచిదని నిర్ణయించినట్లు ఐసీసీ ఒక ప్రకటనలో తెలిపింది. వీటితో పాటు టీ20 వరల్డ్‌కప్ అమెరికా క్వాలిఫయర్స్, ఆసియా క్వాలిఫయర్స్ టోర్నీలు కూడా వాయిదా పడ్డాయి. 2022లో ఆస్ట్రేలియా వేదికగా జరిగే టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనే చివరి రెండు జట్లను ఈ టోర్నీ ద్వారా ఎంపికచేస్తారు. కాగా ఈ ఏడాది అక్టోబర్‌లో భారత్‌లో జరగాల్సిన 2021 టీ20 ప్రపంచకప్ కరోనా కారణంగా యూఏఈలో జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇప్పటికే దీనిపై బీసీసీఐ ఐసీసీని సంప్రదించినట్లు సమాచారం. -
గృహ రుణాలపై ఎస్బీఐ బొనాంజా
ముంబై: గృహ రుణ వడ్డీరేట్లను 30 బేసిస్ పాయింట్లు (100 బేసిస్ పాయింట్లు ఒకశాతం) తగ్గిస్తున్నట్లు బ్యాంకింగ్ దిగ్గజం– స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) శుక్రవారం ప్రకటించింది. ప్రాసెసింగ్ ఫీజును పూర్తిగా రద్దు చేస్తున్నట్లూ వివరించింది. కొత్త గృహ రుణ వడ్డీరేట్లను సిబిల్ స్కోర్‌ను అనుసంధానిస్తున్నట్లు కూడా బ్యాంక్ విడుదల చేసిన ప్రకటన తెలిపింది. అంటే సిబిల్ స్కోర్ బాగుంటే, వడ్డీరేట్లు మరింత తగ్గించే అవకాశం కూడా ఉంటుందన్నమాట. క్తొత వడ్డీరేట్లు చూస్తే... ► రూ. 30 లక్షల వరకూ రుణాలపై వడ్డీరేటు 6.80 వద్ద మొదలవుతుంది. ► రూ.30 లక్షలుపైబడిన రుణాలపై వడ్డీరేటు 6.95 నుంచి ఉంటుంది. ► మహిళా రుణ గ్రహీతలకు 5 బేసిస్ పాయింట్ల రాయితీ కూడా లభిస్తుంది. యోనో యాప్ ద్వారా దరఖాస్తుకు 5 బేసిస్ పాయింట్ల తగ్గింపు బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ (రిటైల్ అండ్ డిజిటల్ బ్యాంకింగ్) సీఎస్ షెట్టి ప్రకటనలో పేర్కొన్న వివరాల ప్రకారం, పండుగ సీజన్లో కస్టమర్లను ఆకర్షించడం, అందరికీ గృహ సౌలభ్యం లక్ష్యంగా తాజా నిర్ణయాలను తీసుకోవడం జరిగింది. రూ.5 కోట్ల వరకూ రుణాలకు ఎనిమిది మెట్రో పట్టణాల్లోనూ 30 బేసిస్ పాయింట్ల రాయితీ లభిస్తుంది. యోనో యాప్ ద్వారా కూడా గృహ రుణ దరఖాస్తు చేసుకోవచ్చు. తద్వారా అదనంగా ఐదు బేసిస్ పాయింట్ల వడ్డీ రాయితీ పొందవచ్చు. 2021 మార్చి వరకూ తాజా రేట్లు అమల్లో ఉంటాయి. టాప్–అప్ గృహ రుణాలకు కూడా అవకాశం ఉంది. -
అంతర్జాతీయ విమాన సర్వీస్‌ల రద్దు పొడిగింపు
న్యూఢిల్లీ: నవంబర్ 30 వరకు అంతర్జాతీయ విమాన సర్వీసుల రద్దును పొడిగిస్తున్నట్లు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) అధికారులు తెలిపారు. అయితే ఎంపిక చేసిన మార్గాల్లో అంతర్జాతీయ సర్వీసుల రాకపోకలను పరిస్థితులను బట్టి సంబంధిత అధికారులు నిర్ణయిస్తారని అధికారులు తెలిపారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో మార్చి 23 నుంచి భారత్ అంతర్జాతీయ సర్వీసులను రద్దు చేసింది. మే నెల నుంచి ‘వందే భారత్’ మిషన్‌లో భాగంగా ఎంపిక చేసిన దేశాలకు, జూలై నుంచి కొన్ని ప్రత్యేక అంతర్జాతీయ విమాన సర్వీస్‌లను నడుపుతున్నారు. ఇప్పటి వరకు అమెరికా, బ్రిటన్ వంటి 18 దేశాలతో భారత్ అంతర్జాతీయ సర్వీస్‌లను నడపడానికి ఆయా దేశాలతో ఒప్పందాలు చేసుకుంది. ముంబై విమానాలను అనుమతించం: హాంకాంగ్ గత వారం ముంబై నుంచి వచ్చిన విమానంలో కొంత మంది ప్రయాణికులకు కోవిడ్ ఉన్నట్టు తేలటంతో నవంబర్ 10 వరకు ముంబై నుంచి వచ్చే ఎయిర్ ఇండియా విమానాలను అనుమతించబోమని హాంకాంగ్ ప్రభుత్వాధికారులు తెలిపారు. ప్రయాణానికి 72 గంటల ముందు కోవిడ్ నెగిటివ్ సర్టిఫికెట్తో మాత్రమే భార తీయులు హాంకాంగ్‌కి ప్రయాణిం చవచ్చునని హాకాంగ్ ప్రభుత్వం వెల్లడించింది. -
రుణాలపై చక్రవడ్డీ మాఫీ
న్యూఢిల్లీ: పండుగ సీజన్లో రుణగ్రహీతలకు ఊరట కల్పించే నిర్ణయాన్ని కేంద్రం శుక్రవారం అర్ధరాత్రి ప్రకటించింది. రూ.2 కోట్లలోపు రుణాలపై చక్రవడ్డీని రద్దు చేస్తున్నట్లు తెలిపింది. గృహ, విద్యా, ఆటో, వ్యక్తిగత, క్రెడిట్ కార్డు బకాయిలు, సూక్ష్మ, చిన్న, మధ్యశ్రేణి సంస్థల రుణాలకుగాను మార్చి 1వ తేదీ నుంచి ఆగస్టు 31వ తేదీ వరకు వాయిదాలకు ఇది వర్తిస్తుంది. కోవిడ్–19 సమయంలో ప్రకటించిన మారటోరియంను ఉపయోగించుకున్న వారితోపాటు యథాప్రకారం వాయిదాలు చెల్లించిన వారికీ ఈ నిర్ణయం వర్తిస్తుందని స్పష్టతనిచ్చింది. ఈ పథకం అమలుతో కేంద్రంపై రూ.6,500 కోట్ల మేర భారం పడనుంది. రూ.2 కోట్ల రుణగ్రహీతలకు లబ్ధి కలిగేలా సాధ్యమైనంత త్వరగా వడ్డీ మాఫీ పథకాన్ని ప్రకటించాలనీ, ‘సామాన్యుడి దీపావళి’ కేంద్రం చేతుల్లోనే ఉందంటూ ఈ నెల 14వ తేదీన సుప్రీంకోర్టు సూచించిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఆర్థిక సేవల విభాగం పలు మార్గదర్శకాలను ప్రకటించింది. ఫిబ్రవరి 29వ తేదీ వరకు రూ.2 కోట్లలోపు బకాయి ఉన్న వారికి ఈ పథకం వర్తిస్తుంది. ఫిబ్రవరి 29వ తేదీ నాటికి వాటిని నిరర్థక ఆస్తులు (ఎన్పీఏ)గా ప్రకటించి ఉండకూడదు. ఆ మొత్తాన్ని ఈ ఏడాది మార్చి 27వ తేదీన ఆర్బీఐ ప్రకటించిన మారటోరియం పథకాన్ని పూర్తిగా గానీ పాక్షికంగా గానీ వినియోగించుకున్న వారి ఖాతాల్లో రుణ సంస్థలు జమ చేయాల్సి ఉంది. మారటోరియం అవకాశాన్ని వినియోగిం చుకోని, ఎప్పటి మాదిరిగా వాయిదాలు చెల్లించే వారికి కూడా ఈ పథకం వర్తిస్తుంది. చెల్లించిన మొత్తానికి సంబంధించిన వివరాలతో ఆయా సంస్థలు కేంద్రం నుంచి రీయింబర్స్మెంట్ పొందవచ్చు. కోవిడ్–19 మహమ్మారి నేపథ్యంలో రుణాల చెల్లింపులపై కేంద్రం విధించిన 6 నెలల మారటోరియం అమలుపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతోంది. ఈ కేసుపై తదుపరి విచారణ నవంబర్ 2వ తేదీన జరగనుంది. -
యూజీసీ నిర్ణయం సరైందే
న్యూఢిల్లీ: కోవిడ్–19 మహమ్మారి కారణంగా పలు రాష్ట్రాలు ఫైనలియర్ పరీక్షలను రద్దు చేస్తున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం ప్రకటించింది. సెప్టెంబర్ 30వ తేదీ కల్లా పరీక్షలు నిర్వహించి, ఆ తర్వాతే విద్యార్థులను పై తరగతులకు అనుమతించాలన్న యూజీసీ నిర్ణయాన్ని సమర్థ్ధించింది. విపత్తు నిర్వహణ చట్టం కింద పరీక్షలను రాష్ట్రాలు వాయిదా వేసుకోవచ్చన్న అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది. కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రత దృష్ట్యా సెప్టెంబర్ 30లోగా పరీక్షలు జరపడం వీలుకాదని భావించే రాష్ట్రాలు, యూజీసీని సంప్రదించి, పరీక్షలకు ప్రత్యామ్నాయ తేదీలను ఖరారు చేసుకోవాలని స్పష్టం చేసింది. చివరి సంవత్సరం పరీక్షల నిర్వహణ విషయంలో రాష్ట్రాలు, వర్సిటీలు యూజీసీ మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలనీ, ఏవైనా మినహాయింపులు ఇవ్వాలనుకుంటే ముందుగా అనుమతి తీసుకోవాలని జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఆర్.ఎస్.రెడ్డి, జస్టిస్ ఎం.ఆర్.షాల ధర్మాసనం ఆదేశించింది. పరీక్షల ద్వారానే విద్యార్థుల ప్రతిభ బయటపడుతుందని అభిప్రాయపడింది. రాష్ట్రాలు, వర్సిటీలు ఫైనలియర్/ టెర్మినల్ పరీక్షలు చేపట్టకుండా విద్యార్థులను తదుపరి తరగతులకు ప్రమోట్ చేయజాలవని తెలిపింది. విపత్తు నిర్వహణ చట్టం–2005 చట్టం కింద.. విద్యార్థులకు ఫైనలియర్ పరీక్షలు జరపకుండా అంతకుముందు సంవత్సరం ఫలితాలు/అంతర్గత మదింపు ఆధారంగా ప్రమోట్ చేసే అధికారం రాష్ట్రాలకు లేదని తెలిపింది. పరీక్షలు తప్పనిసరి చేస్తూ జూలై 6వ తేదీన యూజీసీ ఇచ్చి న రివైజ్డు మార్గదర్శకాలు నిపుణుల సూచనల మేరకు చేసినవేననీ, చివరి సంవత్సరం పరీక్షలు నిర్వహించడం సాధ్యం కాదనడం సరికాదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. కోవిడ్‌ను కారణంగా చూపుతూ మహారాష్ట్ర, ఢిల్లీ వంటి రాష్ట్రాలు వివిధ కోర్సుల ఫైనలియర్ పరీక్షలను రద్దు చేయాలంటూ తీసుకున్న నిర్ణయం ఉన్నతవిద్యా ప్రమాణాలపై ప్రత్యక్షంగా ప్రభావం చూపుతాయని యూజీసీ తెలిపింది. ఈ చర్య రాజ్యాంగాన్ని అతిక్రమించడమేనని వాదించింది. కరోనా మహమ్మారి తీవ్రంగా ఉన్న సమయంలో పరీక్షలు నిర్వహించాలన్న యూజీసీ మార్గదర్శకాలను సవాలు చేస్తూ శివసేన పార్టీ యువజన విభాగం తదితరులు వేసిన పిటిషన్‌పై అత్యున్నత న్యాయస్థానం శుక్రవారం పై ఆదేశాలిచ్చింది. సుప్రీంకోర్టు తీర్పుపై కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్ పొఖ్రియాల్ నిశాంక్ హర్షం వ్యక్తం చేశారు. రాజకీయాలను విద్యకు దూరంగా ఉంచి, రాజకీయ అవగాహన పెంచుకుందామని పిలుపునిచ్చారు. -
వెనక్కి రావాల్సిందేనా?
సాక్షి ప్రత్యేక ప్రతినిధి: అమెరికాలో పెరిగిన నిరుద్యోగ సమస్యను అధిగమించేందుకు విదేశీ వృత్తి నిపుణులకు జారీ చేసే హెచ్1బీ సహా అన్ని రకాల వర్క్ వీసాలను తాత్కాలికంగా నిలిపేయాలని అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న నిర్ణయం వేలాది మంది భారతీయ టెకీల్లో గుబులు రేపుతోంది. అమెరికాలో ఉన్నతవిద్యను అభ్యసించిన భారతీ య గ్రాడ్యుయేట్లు సైతం నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. గ్రాడ్యుయేషన్ అయిపోగానే ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ (ఓపీటీ) వర్క్ పర్మిట్‌తో ఉద్యో గం చేస్తున్న దాదాపు 25 వేల మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఈసారి హెచ్1బీ వీసా రానిపక్షంలో స్వదేశానికి తిరుగుముఖం పట్టాల్సి ఉంటుంది. ట్రంప్ తీసుకున్న అసాధారణ నిర్ణయం వారి పాలిట అశనిపాతంగా మారబోతోంది. హెచ్1బీ సహా అన్ని రకాల వర్క్ వీసాల రద్దుపై ఒకట్రెండు రోజుల్లో ఉత్తర్వులు వెలువరిస్తానని ట్రంప్ ఓ టీవీ ఇంటర్వూ్యలో వెల్లడించడం తెలిసిందే. ఈ మేరకు ఉత్తర్వులు వెలువడితే ఓపీటీపై పనిచేస్తూ చివరి అవకాశంగా హెచ్1బీ వీసా కోసం ఎదురుచూస్తున్న దాదాపు 40 వేల మంది ఉద్యోగాలు కోల్పోనున్నారు. వారిలో ఎల్–1పై అమెరికా వెళ్లిన 15 వేల మంది ఐటీ నిపుణులు కూడా ఉన్నారు. ఎల్–1 గడువు ముగుస్తున్న దశలో ఈ ఏడాది మార్చిలో హెచ్1బీకి దరఖాస్తు చేశారు. వారి దరఖాస్తులు లాటరీలో ఎంపికై పరిశీలన దశలో ఉన్నాయి. ఇప్పుడు హఠాత్తుగా ట్రంప్ సర్కార్ తీసుకున్న నిర్ణయం వారిని చిక్కుల్లో పడేసింది. కొత్తగా వెలువడనున్న ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఎలా ఉండబోతుందన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ప్రస్తుతం అమెరికాలో హెచ్1బీ వీసాపై పనిచేస్తున్న ఐటీ నిపుణుల రెన్యువల్ దరఖాస్తుల విషయంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవని చెబుతున్నప్పటికీ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ వెలువడే దాకా చెప్పలేమని, వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ట్రంప్ ఎంతటి కఠిన నిర్ణయాలనైనా తీసుకొనే ప్రమాదం ఉందని భారతీయ ఐటీ నిపుణులు ఆందోళన చెందుతున్నారు. ఈ ఏడాది 70 వేలకు పైగా హెచ్1బీ వీసాలు... ఈ ఏడాది మార్చిలో దాదాపు 1.67 లక్షల మంది భారతీయ ఐటీ నిపుణులు హెచ్1బీ వీసాలకు దరఖాస్తు చేయగా వారిలో 70 వేల మంది లాటరీలో ఎంపికయ్యారు. వారికి వీసాలు జారీ చేసే ప్రక్రియ ఇటీవలే ప్రారంభమైంది. మామూలుగా అయితే జూన్ నుంచి లాటరీ ద్వారా ఎంపికైన వారికి హెచ్1బీ వీసాలు జారీ చేస్తారు. అయితే ఈసారి కరోనా మహమ్మారి కారణంగా అమెరికాలోని పౌరసత్వ, ఇమ్మిగ్రేషన్ కార్యాలయాలు మూతపడ్డాయి. అయినా దాదాపు 8 వేల మందికి హెచ్1బీ వీసాలు మంజూరయ్యాయి. మిగిలిన వారి దరఖాస్తులు పరిశీలిస్తున్న సమయంలో కొత్త తంటా వచ్చిపడింది. ‘లాటరీలో ఎంపికైన వారికి సెప్టెంబర్‌లోగా వీసాలు జారీ చేయడమన్నది మామూలుగా జరుగుతున్న వ్యవహారం. కానీ ఈసారి ట్రంప్ తీసుకురాబోతున్న ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లో ఏయే నిబంధనలు ఉంటాయో చెప్పలేని పరిస్థితి. అన్ని రకాల వర్క్ వీసాలు రద్దయితే లాటరీలో ఎంపికైన దరఖాస్తులను పరిశీలించే అవకాశం లేదు. అలాంటి పరిస్థితిలో ఇంకా ఓపీటీ గడువు మిగిలి ఉన్న ఇంజనీర్లకు పెద్దగా ఇబ్బంది ఉండదు. గడువు ఈ ఏడాది జూన్ ఆఖరు నుంచి డిసెంబర్‌తో ముగియబోతున్న వారు మాత్రం తాత్కాలికంగా అయినా అమెరికా వదిలిపెట్టక తప్పదు’అని అట్లాంటా కేంద్రంగా ఐటీ ఔట్సోర్సింగ్ కన్సల్టెన్సీ నిర్వహిస్తున్న భారతీయ అమెరికన్ ఒకరు చెప్పారు. రెన్యువల్ పరిస్థితి ఏమిటో? అన్ని రకాల వర్క్ వీసాలు రద్దు చేస్తూ వెలువడబోయే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లో ఇప్పటికే అక్కడ ఉద్యోగాలు చేస్తున్న హెచ్1బీ వీసాదారులకు సంబంధించి స్పష్టమైన నిబంధనలు ఉండాలి. అలా లేని పక్షంలో జూలై నుంచి రెన్యువల్ అయ్యే వారి దరఖాస్తులను పరిగణనలోకి తీసుకుంటారా లేదా అన్నది సస్పెన్స్‌గా మారింది. ‘నాకు తెలిసినంత వరకు రెన్యూవల్ ఇంజనీర్లకు ఎలాంటి ఇబ్బందులు ఉండకపోవచ్చు. వారికి కూడా వర్క్ వీసా రెన్యువల్ చేయకపోతే వచ్చే ఏడాదిలోపే అమెరికాలోని ఐటీ కంపెనీలన్నీ మూసుకోవాల్సి ఉంటుంది. కానీ ప్రస్తుతం అమెరికాలో పనిచేస్తున్న భారతీయ ఇంజనీర్లలో భయాందోళనలు తీవ్రంగా ఉన్నాయి’అని శాన్‌జోస్ కేంద్రంగా పనిచేస్తున్న టీసీఎస్ హెచ్ఆర్ విభాగం సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఒకరు అభిప్రాయపడ్డారు. -
భార్య పుట్టినరోజు.. దుకాణదారులకు అద్దె రద్దు
సాక్షి, చెన్నై : కరోనా వైరస్ లాక్డౌన్ కారణంగా తగిన ఆదాయం లేక ఇక్కట్లు పడుతున్న దుకాణదారులకు తన భార్య జన్మదినాన్ని పురస్కరించుకుని ఒక నెల అద్దె రద్దు చేసిన యజమాని ఔదార్యాన్ని అందరూ ప్రశంసించారు. చెన్నై మాధవరం నెహ్రు వీధికి చెందిన ఏలుమలై(58) మాధవరం తహసీల్దార్ మండల కార్యాలయం ఎదురుగా అతనికి సొంతంగా నిర్మించబడిన కట్టడాల్లో 14 దుకాణాలు వున్నాయి. వాటిలో టీ దుకాణం, జెరాక్స్ దుకాణం, సెలూన్ దుకాణం, ఫోటోస్టూడియో తదితర దుకాణాలు నిర్వహిస్తున్నారు. కరోనా వైరస్ కారణంగా లాక్‌డౌన్‌తో రెండు నెలలుగా దుకాణాలకు తాళం వేసి ఉండడంతో వారికి సరైన ఆదాయం లేక ఇక్కట్లు పడుతున్నారు. ఈ క్రమంలో యజమాని ఏలుమలై తన భార్య పరమేశ్వరి(49) జన్మదినాన్ని పురస్కరించుకుని దుకాణదారులకు సాయపడాలని ఆలోచనలతో వారికి ఒక నెల అద్దెను రద్దు చేస్తున్నట్లు తెలిపారు. దీని గురించి ఏలుమలై మాట్లాడుతూ దుకాణాల నుంచి తనకు ఒక నెలకు మొత్తం రూ.99,150 వస్తుందని, ప్రస్తుత కాలంలో ఏర్పడిన లాక్డౌన్ కాలంలో ఈ మొత్తం తనకు ముఖ్యమైన అవసరమే కానీ, తన భార్యకు 49వ పుట్టిన రోజు కావడంతో కష్టంలో ఉంటున్న వారికి సహాయపడాలనే ఉద్దేశంతో నెల అద్దెను రద్దు చేసినట్లు అతను తెలిపారు. కరోనా నేర్పిన గుణపాఠం అని ప్రతి ఒక్కరూ కష్టకాలంలో ఉన్న వారిని ఆదుకుంటే కరోనాను తరిమికొట్టవచ్చునని తెలిపారు. చదవండి: ఇక మరింత కఠినంగా లాక్డౌన్.. -
రోజర్స్ కప్ డబ్ల్యూటీఏ టెన్నిస్ టోర్నీ రద్దు
మాంట్రియల్: యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్‌కు సన్నాహకంగా జరిగే రోజర్స్ కప్ మహిళల టెన్నిస్ సంఘం (డబ్ల్యూటీఏ) టోర్నమెంట్‌ను ఈ ఏడాది రద్దు చేస్తున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు. నిర్ణీత షెడ్యూల్ ప్రకారం ఈ టోర్నీ ఆగస్టు 7 నుంచి 16 వరకు కెనడాలోని మాంట్రియల్లో జరగాల్సింది. అయితే కరోనా వైరస్ కట్టడి చర్యల్లో భాగంగా కెనడా ప్రభుత్వం ఆగస్టు 31 వరకు ఎలాంటి ఈవెంట్స్ నిర్వహించకూడదని ఆదేశాలు జారీ చేసింది. దాంతో ఈ టోర్నీ నిర్వాహకులు ఈ ఏడాది టోర్నీని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. -
ఆర్థికంగా నష్టపోతాం!
మెల్బోర్న్: కరోనా (కోవిడ్–19) కారణంగా ఐపీఎల్, ఆస్ట్రేలియా జట్టు ఆడే ద్వైపాక్షిక సిరీస్‌లు ఆగిపోతే తమకు భారీగా ఆర్థిక నష్టం వాటిల్లుతుందని ఆస్ట్రేలియా పరిమిత ఓవర్ల సారథి ఆరోన్ ఫించ్ ఆందోళన వ్యక్తం చేశాడు. అయినప్పటికీ తామంతా కలిసి కట్టుగా ఈ పరిస్థితిని ఎదుర్కొంటామన్నాడు. ఆసీస్ ఆటగాళ్లు ఐపీఎల్లో ఆడేందుకు క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) గతంలో నో అబ్జక్షన్ సర్టిఫికేట్ ఇవ్వగా... తాజా పరిస్థితుల్లో దానిని పునఃసమీక్షించే అవకాశం ఉందని బాంబు పేల్చింది. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం ఆస్ట్రేలియా ప్రభుత్వం సైతం విదేశీ ప్రయాణాలపై చాలా కఠినంగా ఉంది. దాంతో ఐపీఎల్ ఏప్రిల్ 15న ఆరంభమైనా ఆసీస్ ఆటగాళ్లు భారత్‌కు వచ్చే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. సీఏ ఇప్పటికే తాము ఆడాల్సిన ద్వైపాక్షిక సిరీస్‌లను రద్దు చేసుకుంది. దాంతో ఇది ఆటగాళ్ల ఆదాయంపై ప్రభావం చూపుతుంది. ఎందుకంటే సీఏ తాము నిర్వహించిన సిరీస్‌ల ద్వారా వచ్చే రాబడి లోంచి వాటాల (రెవెన్యూ షేర్ మోడల్) రూపంలో ఆటగాళ్లకు చెల్లిస్తుంది. ఇప్పుడు సిరీస్‌లు జరగనందువల్ల తమకు నష్టం జరిగే ప్రమాదం ఉందని ఫించ్ పేర్కొన్నాడు. ఇటువంటి సమయంలోనే ఐపీఎల్ కూడా జరగకపోతే మా పరిస్థితి మరింతగా దిగజారుతుందని అన్నాడు. దాదాపు 17 మంది ఆటగాళ్లు ఐపీఎల్ ప్రాంచైజీలతో కాంట్రాక్టు కలిగి ఉన్నారు. అయితే ఈ పరిస్థితులు చక్కబడతాయని ఆశిస్తున్నానన్న ఫించ్... ఎప్పుడనేది మాత్రం తాను ప్రస్తుతం చెప్పలేనన్నాడు. ‘మనం ఎప్పుడూ ఇటువంటి పరిస్థితులను చూసి ఉండం. ప్రయాణాలపై కొన్ని గంటల్లోనే నిర్ణయం తీసుకున్నారు. రెండు, మూడు వారాల్లో తిరిగి మామూలు స్థితి ఏర్పడవచ్చు. ఏ నిర్ణయం తీసుకోలేని పరిస్థితిలో ఉన్నాం. ప్రస్తుతం మనం ఈ వైరస్ కట్టడికి అందరూ తమ వంతు సాయం చేయాలి.’అని ఫించ్ పేర్కొన్నాడు. -
పర్యాటకం ఢమాల్!
న్యూఢిల్లీ: కరోనా వైరస్ దెబ్బతో దేశీ పర్యాటక రంగం కుదేలయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. నెలరోజులపాటు వీసాలు రద్దు చేయాలని ప్రభుత్వం నిర్ణయించడంతో ట్రావెల్, టూరిజం, ఏవియేషన్ రంగాలు దాదాపు రూ. 8,500 కోట్లు నష్టపోయే అవకాశాలు ఉన్నాయని పరిశ్రమవర్గాలు తెలిపాయి. కంపెనీలు.. రిక్రూట్మెంట్ నిలిపివేయడం, అంతగా అవసరం ఉండని సిబ్బందిని తొలగించడం వంటి చర్యలు తీసుకోనుండటంతో ఆయా రంగాల్లో భారీగా ఉద్యోగాల కోతలు కూడా ఉండొచ్చని ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ టూర్ ఆపరేటర్స్ (ఏఐటీవో), అసోచాం వంటి పరిశ్రమల సమాఖ్యలు పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలో వీసాలపై నెల రోజుల నిషేధాన్ని పది రోజుల తర్వాతైనా పునఃసమీక్షించాలని, కొన్ని నగరాల నుంచైనా భారత్‌కి ప్రయాణాలను అనుమతించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశాయి. కరోనా వైరస్ బైటపడినప్పటికీ ఇప్పటిదాకా ఎంతో కొంతైనా పర్యాటకం కొనసాగుతుండటం వల్ల సిబ్బందిని, ఖర్చులను కాస్తయినా నిర్వహించుకోగలుగుతున్నామని.. వీసాల రద్దుతో గట్టి దెబ్బే తగలనుందని అసోచాం టూరిజం, హాస్పిటాలిటీ కౌన్సిల్ చైర్మన్ సుభాష్ గోయల్ చెప్పారు. దేశీ ఏవియేషన్ క్రాష్: అత్యవసరంగా వెళ్లాల్సిన పనుల మీద తప్పించి.. సాధారణ ప్రయాణాలను ప్రజలు వాయిదా వేసుకుంటున్న నేపథ్యంలో దేశీ విమానయానం ఈ మధ్యకాలంలో 15% వరకు తగ్గిపోయిందని అంచనా. ముఖ్యంగా ఢిల్లీ, హైదరాబాద్, బెంగళూరు, ముంబై వంటి ప్రధాన నగరాల నుంచి రాకపోకలు గణనీయం గా తగ్గిపోయాయి. టికెట్లు బుక్ చేసుకున్న కస్టమర్లు కూడా ఆఖరి నిమిషంలో రద్దు చేసుకుంటున్నారని ఎయిర్‌లైన్స్ చెబుతున్నాయి. ఆక్యుపెన్సీ రేటు తగ్గిపోతున్న కారణంగా విమాన సేవలు నడిపేందుకయ్యే కనీస ఖర్చులు కూడా గిట్టుబాటు కావడం లేదని, ఫలితంగా ఎయిర్‌లైన్స్ ఆదాయాలు పడిపోతున్నాయని జేఎం ఫైనాన్షియల్స్ ఒక నివేదికలో పేర్కొంది. ఇదే పరిస్థితి ఇంకొన్నాళ్లు కొనసాగితే.. కరోనా వైరస్ మహమ్మారి ధాటికి బ్రిటన్‌కు చెందిన విమానయాన సంస్థ ఫ్లైబీ మాదిరిగానే ఇక్కడి సంస్థలు కూడా కుప్పకూలొచ్చని తెలిపింది. బెంగళూరు ఎయిర్‌పోర్ట్‌లో తగ్గిన ట్రాఫిక్.. బెంగళూరు విమానాశ్రయంలో అంతర్జాతీయ ప్రయాణీకుల సంఖ్య 50 శాతం తగ్గిపోయింది. కరోనావైరస్ భయాలతో పలు దేశాలు ట్రావెల్పరమైన ఆంక్షలు విధించడం, పలు ఫ్లయిట్లు రద్దు కావడం తదితర అంశాలు దీనికి కారణం. ఇటు దేశీయంగా ప్రయాణించే వారి సంఖ్య కూడా 2–4 శాతం తగ్గిందని, కరోనా కేసులు పెరిగిన పక్షంలో ఇది ఇంకా పెరగవచ్చని బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు (బీఐఏఎల్) ఒక ప్రకటనలో తెలిపింది. దేశీ విమానాశ్రయాల్లో అంతర్జాతీయ ప్యాసింజర్ల సంఖ్య గతంలో రోజుకు 70,000 స్థాయిలో ఉండగా.. ప్రస్తుతం 62,000కు తగ్గిపోయినట్లు పౌర విమానయాన మంత్రి హర్దీప్ సింగ్ తెలిపారు. ఇది 40,000కు కూడా పడిపోవచ్చన్నారు. వోల్వో బస్సు టికెట్ రేటుకే.. ఆఖరి నిమిషంలో టికెట్ల రద్దుతో నిర్వహణ ఖర్చులైనా రాబట్టుకునేందుకు ఎయిర్‌లైన్స్ ప్రయత్నిస్తున్నాయి. ఉదాహరణకు.. చెన్నై నుంచి బెంగళూరుకు వోల్వో బస్సు టికెట్ ధర రూ.1,100 ఉండగా.. ఇదే ధరకు పలు కంపెనీల విమాన టికెట్ లభిస్తోంది. ఇంకా చాలా రూట్లలో ఇదే తరహాలో విమాన టికెట్ల రేట్లు పడిపోయాయి. ‘బేర్’ గుప్పిట్లోకి.. ఈ ఏడాది జనవరిలో సెన్సెక్స్, నిఫ్టీలు ఆల్‌టైమ్ గరిష్ట స్థాయిలను తాకాయి. ఈ ఏడాది జనవరి 20న నిఫ్టీ జీవిత కాల గరిష్ట స్థాయి, 12,431 పాయింట్లకు చేరింది. ఈ గరిష్ట స్థాయిల నుంచి చూస్తే గురువారం నాడు నిఫ్టీ 22 శాతం మేర నష్టపోయింది. ఈ దృష్ట్యా చూస్తే, మన స్టాక్ మార్కెట్ బేర్ దశలోకి జారిపోయిందని నిపుణులు అందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏదైనా షేర్ గానీ, సూచీ గాని ఇటీవలి గరిష్ట స్థాయి నుంచి 20 శాతం పతనమైతే, బేర్ దశ ప్రారంభమైనట్లుగా పరిగణిస్తారు. మన మార్కెట్ బేర్ దశలోకి జారిపోవడం ఇదే మొదటిసారి కాదు. 2015లో, 2010లో కూడా బేర్ దశలోకి జారిపోయింది. ఈ బేర్ దశ చాలా కాలం కొనసాగవచ్చు. సాధారణంగా బేర్ మార్కెట్ రెండేళ్ల పాటు ఉంటుంది. 2015 బేర్ మార్కెట్ నుంచి 2017లో మన స్టాక్ మార్కెట్ కోలుకుంది. ఇక తాజా బేర్ మార్కెట్ ఎక్కువ కాలం కొనసాగకపోవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. కోవిడ్–19 వైరస్ కల్లోలం సద్దుమణగగానే మార్కెట్ మళ్లీ పుంజుకోగలదని వారంటున్నారు. -
ఖేల్ ఖతమ్...
►భారత్, దక్షిణాఫ్రికా మధ్య ఈ నెల 15, 18 తేదీల్లో రెండో, మూడో వన్డే జరగాల్సి ఉంది. లక్నో, కోల్‌కతాలో జరిగే ఈ మ్యాచ్‌లకు స్టేడియంలో ప్రేక్షకులను అనుమతించరాదని బీసీసీఐ నిర్ణయించింది. టికెట్ల అమ్మకాలు నిలిపివేశారు. ►ముంబైలో సచిన్, లారా తదితర మాజీ క్రికెటర్లతో జరుగుతున్న రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్ టోర్నీ కూడా రద్దయింది. ముందుగా ప్రేక్షకులు లేకుండా ఆడించాలని భావించినా...చివరకు నిర్వాహకులు రద్దుకే మొగ్గు చూపారు. ►రాజ్‌కోట్‌లో బెంగాల్, సౌరాష్ట్ర మధ్య జరుగుతున్న రంజీ ట్రోఫీ ఫైనల్ చివరి రోజైన నేడు మైదానంలో ప్రేక్షకులకు ప్రవేశం లేదు. ►ఇండియా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీని ప్రేక్షకులు లేకుండా నిర్వహిస్తామని భారత్ బ్యాడ్మింటన్ సంఘం (బాయ్) బుధవారం ప్రకటించినా... కేంద్ర ప్రభుత్వ తాజా వీసా నిబంధనలతో విదేశీ ఆటగాళ్లు వచ్చే అవకాశం కనిపించడం లేదు. దాంతో టోర్నీ నిర్వహణ కూడా సందేహమే. ►ప్రపంచంలోనే అతి పెద్ద, అమెరికాలోని ప్రతిష్టాత్మక నేషనల్ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ (ఎన్బీఏ) లీగ్ ఈ సీజన్‌కు సంబంధించి మ్యాచ్‌లన్నీ రద్దు చేస్తున్నట్లు ప్రకటించడం అతి పెద్ద నిర్ణయం. ►ప్రతిష్టాత్మక ఫార్ములా 1 సీజన్లో భాగంగా మెల్బోర్న్లో జరగాల్సిన తొలి గ్రాండ్‌ప్రి రద్దయింది. ముందుగా మెక్లారెన్ జట్టు సభ్యుడొకరు కరోనా బారిన పడటంతో ఆ జట్టు మాత్రమే తప్పుకునేందుకు సిద్ధమైనా... ఇతర జట్ల ఒత్తిడితో నిర్వాహకులు మొత్తంగా రద్దు చేసేశారు. ►చెన్నై, కోల్‌కతా జట్ల మధ్య ఈ శనివారం గోవాలో జరగాల్సిన ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) ఫైనల్ మ్యాచ్‌కు కూడా ప్రేక్షకులను అనుమతించడం లేదు. ►భారత దేశవాళీ ఫుట్‌బాల్ టోర్నీ ఐ లీగ్‌లో జరగాల్సిన 28 మ్యాచ్‌లను ఖాళీ స్టేడియాల్లో నిర్వహిస్తారు. ►ప్రఖ్యాత స్పానిష్ లీగ్ ‘లా లిగా’ మ్యాచ్‌లు రద్దయ్యాయి. దాంతో రియల్ మాడ్రిడ్ ఫుట్‌బాల్ జట్టు సభ్యులు బయటకు రాకుండా స్వచ్ఛందంగా ప్రత్యేక వైద్యు ల పర్యవేక్షణలోకి వెళ్లిపోయారు. రియల్ మాడ్రిడ్‌కే చెందిన బాస్కెట్ బాల్ జట్టు ఆటగాడు ఒకరికి కరోనా ఉన్నట్లు తేలింది. ఈ రెండు జట్లకు ఒకే చోట వసతి ఏర్పాట్లు ఉన్నాయి. ►ఖతార్‌లో మార్చి 26నుంచి జరగాల్సిన యూరో 2020 వార్మప్ టోర్నీ రద్దయింది. కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో ఖతార్‌లోనే త్వరలో నిర్వహించాల్సిన వరల్డ్ కప్ క్వాలిఫయింగ్ మ్యాచ్‌లను వాయిదా వేయాలని దక్షిణ అమెరికా ఫుట్‌బాల్ గవర్నింగ్ బాడీ (కాన్మెబాల్) ‘ఫిఫా’కు విజ్ఞప్తి చేసింది. ►జోర్డాన్‌లో ఒలింపిక్ క్వాలిఫయింగ్ టోర్నీలో ఆడి భారత్‌కు తిరిగి వస్తున్న మన బాక్సర్లందరూ తమ ఇళ్లకే పరిమితం కావాలని, బయటకు వెళ్లరాదని భారత బాక్సింగ్ సమాఖ్య ఆదేశించింది. ►కరోనా కారణంగానే ఈనెల 16 నుంచి జరగాల్సిన టాలెంట్ సిరీస్, చాంపియన్‌షిప్ సిరీస్, సూపర్ సిరీస్, నేషనల్ సిరీస్, ‘ఐటా’ పురుషుల, మహిళల ఈవెంట్లను రద్దు చేస్తున్నట్లు అఖిల భారత టెన్నిస్ సంఘం (ఐటా) ప్రకటించింది. -
కాన్స్ ఫెస్టివల్ క్యాన్సిల్ ?
ప్రతీ ఏడాది వేసవిలో ఫ్రాన్స్ దేశం మరింత కళకళలాడుతుంది. దానికి కారణం కాన్స్ చలన చిత్రోత్సవాలు. ఈసారి కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. ఈ ఏడాది క్యాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ మే 12 న మొదలు కావాలి. అయితే కరోనా వైరస్ కారణంగా ఈ చిత్రోత్సవాలు జరుగుతాయో లేదోననే సందేహాలు ఏర్పడ్డాయి. ‘‘మార్చి నెలాఖరులోగా కరోనా తీవ్రత తగ్గుతుందనే ఆశతో ఉన్నాం. ఒకవేళ పరిస్థితులు అనుకూలంగా లేకపోతే ఫెస్టివల్‌ను క్యాన్సిల్ చేసే చాన్స్ ఉంది’’ అన్నారు కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ ప్రెసిడెంట్ పీర్రీ లీస్కూర్. -
కో–ఆపరేటివ్‌లకూ యస్ బ్యాంక్ కష్టాలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: యస్ బ్యాంక్ ఆర్థిక సంక్షోభం ప్రభావం దేశంలోని పట్టణ సహకార బ్యాంక్‌ల మీద పడింది. యస్ బ్యాంక్ మారటోరియం నేపథ్యంలో యస్ బ్యాంక్‌తో ఒప్పందం చేసుకున్న అర్బన్ కో–ఆపరేటివ్ బ్యాంక్స్ (యూసీ బీ) చెక్ ట్రన్కేషన్ సిస్టమ్ (సీటీఎస్)లను ఆర్బీఐ రద్దు చేసింది. దేశవ్యాప్తంగా సీటీఎస్‌ల లావాదేవీల కోసం 54 యూసీబీలు యస్ బ్యాంక్‌తో ఒప్పందం చేసుకోగా.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో తొమ్మిది బ్యాంక్‌లున్నాయి. చెక్ డిపాజిట్స్, విత్‌డ్రా సేవలు నిలిచిపోవటంతో కస్టమర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తదుపరి ఉత్తర్వులు జారీ అయ్యే వరకూ సీటీఎస్ క్లియరెన్స్‌లు జరగవని ఆర్బీఐ తెలిపింది. లక్ష కంటే ఎక్కువ జనాభా ఉన్న అర్బన్, సెమీ అర్బన్ ప్రాంతాల్లో అర్బన్ కో–ఆపరేటివ్ బ్యాంక్‌ల ఏర్పాటుకు ఆర్బీఐ అనుమతులిచ్చిన విషయం తెలిసిందే. స్థానిక కమ్యూనిటీలు, వర్కింగ్ గ్రూప్‌లకు, చిన్న తరహా వ్యాపారస్తులకు, వ్యవసాయ రుణాలను అందించడమే కో–ఆప్ బ్యాంక్‌ల ప్రధాన లక్ష్యం. ఆర్బీఐ గణాంకాల ప్రకారం.. గత ఆర్థిక సంవత్సరం ముగింపు నాటికి దేశంలో 1,544 అర్బన్ కో–ఆపరేటివ్ బ్యాంక్‌లు, 11,115 బ్రాంచీలున్నాయి. డిపాజిట్లు రూ.4,84,315 కోట్లుగా, అడ్వాన్స్‌లు రూ.3,03,017 కోట్లుగా ఉన్నాయి. 54 యూసీబీల సీటీఎస్‌ల రద్దు.. దేశవ్యాప్తంగా 54 కో–ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్‌లకు యస్ బ్యాంక్ స్పాన్సర్ బ్యాంక్‌గా ఉంది. వీటి సీటీఎస్ క్లియరెన్స్‌లను రద్దు చేస్తూ గత శుక్రవారం ఆర్బీఐ ఆదేశాలు జారీ చేసింది. ఒక్క చెక్ క్లియరెన్స్ కోసం స్పాన్సర్ బ్యాంక్‌కు ఒప్పంద యూసీబీ బ్యాంక్‌లు 50 పైసల నుంచి రూపాయి వరకు చార్జీల రూపంలో చెల్లిస్తుంటాయి. వారం రోజులు గా 54 పట్టణ సహకార బ్యాంక్‌లలో సీటీఎస్ క్లియరెన్స్ జరగడం లేదని.. వీటి విలువ రూ.200 కోట్లుంటుందని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. ఇతర బ్యాంక్‌లతో ఒప్పందాలు.. కస్టమర్ల ఆందోళన నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లోని తొమ్మిది యస్ బ్యాంక్ ఒప్పందం కో–ఆపరేటివ్ బ్యాంక్‌లు సీటీఎస్ క్లియరెన్స్ కోసం హెచ్డీఎఫ్సీ, ఐడీబీఐ, యాక్సిస్ వంటి ఇతర బ్యాంక్‌లతో ఒప్పందాలు చేసుకుంటున్నాయి. గత ఐదు రోజులుగా పోచంపల్లి కో–ఆపరేటివ్ బ్యాంక్‌లో సీటీఎస్ క్లియరెన్స్‌లు జరగడం లేదని ఆ బ్యాంక్ సీఈఓ సీతా శ్రీనివాస్ తెలిపారు. కస్టమర్లకు ఆందోళన వద్దని, కొద్ది రోజుల పాటు చెక్ విత్‌డ్రా, డిపాజిట్ వంటి లావాదేవీలను వాయిదా వేసుకోవాలని కస్టమర్లకు సూచిస్తున్నామని చెప్పారు. అత్యవసరమైతే నెఫ్ట్, ఆర్టీజీఎస్ సేవలను వినియోగించుకోవాలని కస్టమర్లకు మెసేజ్, వాట్సాప్, ఈ–మెయిల్స్ ద్వారా సందేశాలను పంపిస్తున్నామన్నారు. పోచంపల్లి కో–ఆపరేటివ్ అర్బ న్ బ్యాంక్‌కు పోచంపల్లి, చౌటుప్పల్, దేవరకొండ, నల్లగొండ, హాలియా, చందూర్, సూర్యా పేట 7 బ్రాంచీల్లో 50 వేల మంది కస్టమర్లు, రూ.60 కోట్ల అడ్వాన్స్‌లు, రూ.100 కోట్ల డిపాజిట్లున్నాయి. యాదాద్రి లక్ష్మీనరసింహా స్వామి అర్బన్ కో–ఆపరేటివ్ బ్యాంక్‌లో రోజుకు రూ.10 లక్షల వరకు చెక్ లావాదేవీలు జరుగుతుంటాయని బ్యాంక్ ఎండీ చెన్న వెంకటేశం తెలిపారు. సీటీఎస్ క్లియరెన్స్‌కు హెచ్‌డీఎఫ్‌సీతో చర్చలు జరుపుతున్నామన్నారు. తెలుగు రాష్ట్రాల్లోని బ్యాంకులివే... సీటీఎస్ క్లియరెన్స్‌ల కోసం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి యస్ బ్యాంక్‌తో తొమ్మిది అర్బన్ కో–ఆపరేటివ్ బ్యాంక్‌లు ఒప్పందం చేసుకున్నాయి. తెలంగాణ నుంచి పోచంపల్లి, సెవెన్ హిల్స్ కో–ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్స్, వరంగల్ అర్బన్, భద్రాద్రి, యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి, ది సంగమిత్ర కో–ఆప్ అర్బన్ బ్యాంక్‌లున్నాయి. ది తిరుపతి కో–ఆపరేటివ్ బ్యాం క్, ది గుంటూరు కో–ఆపరేటివ్ బ్యాంక్, ది హిందుస్తాన్ షిప్‌యార్డ్ స్టాఫ్ కో–ఆప్ బ్యాంక్‌లు ఆంధ్రప్రదేశ్‌కు చెందినవి. ‘‘ఏపీలో 47 యూసీబీలు, 230 బ్రాంచీలున్నాయి. వీటి డిపాజిట్లు రూ.9,040 కోట్లు, అడ్వాన్స్‌లు రూ.6,230 కోట్లు. తెలంగాణలో 51 యూసీబీలు, 211 బ్రాంచీలున్నాయి. డిపాజిట్లు రూ.7,517 కోట్లు, అడ్వాన్స్‌లు రూ.5,592 కోట్లు. -
రేసింగ్‌కు పాల్పడితే లైసెన్స్ రద్దు!
సాక్షి, హైదరాబాద్: నగరంలో ఖరీదైన వాహనాలతో రోడ్లపై రేసింగ్, ఛేజింగ్‌లకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకునేందుకు రవాణా శాఖ సిద్ధమవుతోంది. గతంలో రాత్రి వేళల్లో మాత్రమే యువకులు రేసింగ్‌లకు పాల్పడేవారు. కానీ ఇప్పుడు ఉదయం, మధ్యాహ్నం వేళల్లోనూ రేసింగులకు పాల్పడుతున్నారు. నెక్లెస్ రోడ్డు, పీవీ ఎలివెటెడ్ ఎక్స్‌ప్రెస్ వే, ఔటర్ రింగురోడ్లపై వారు రెచ్చిపోతున్నారు. ఆదివారం ఉదయం పీవీ ఎక్స్‌ప్రెస్ వేపై 2 ఖరీదైన స్పోర్ట్స్ కార్లలో విపరీతమైన వేగంతో దూసుకుపోతున్న వారిని పోలీసులు వెంబడించి మరీ పట్టుకున్నారు. దీనిపై మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ స్పందించారు. నగరంలో ఇలాంటి వాహనాలు ఎన్ని ఉన్నాయో గుర్తించి వాటి యజమానులను పిలిపించి కౌన్సెలింగ్ నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ఒకసారి కౌన్సెలింగ్ ఇచ్చాక కూడా వాహనాలను పరిమితికి మించిన వేగంతో నడిపినట్లు తేలితే వారి లైసెన్స్ రద్దు చేసేలా చర్యలు తీసుకోనున్నారు. వాహనాలను కూడా సీజ్ చేస్తారు. -
నయా కండక్టర్లు
విచిత్రమేంటంటే అసలు విధులు కాకుండా కొసరు పనుల్లో బిజీగా ఉన్న ఈ ముగ్గురు ఉన్నది ఉప్పల్ బస్టాప్‌లోనే కావటం విశేషం. డిపోలో ఇప్పటికే ఇద్దరు కంట్రోలర్లు ఉన్నారు. వారు కాకుండా కొత్తగా ఇలా ముగ్గురొచ్చారు. ఇలా ప్రధాన ప్రాంతాల్లో కండక్టర్లు ఈ పనుల్లో దర్శనమిస్తున్నారు. అసలు పనులు వదిలి ఇలా రోడ్డెక్కటానికి కారణం ఆర్టీసీ పొదుపు చర్యల్లో భాగమే. బస్సులు గ్యారేజీకి.. వీరు బస్టాపులకు.. ఆర్టీసీ నష్టాలను తగ్గించే క్రమంలో ఇటీవల పెద్ద సంఖ్యలో సొంత బస్సులను ఆర్టీసీ ఉపసంహరించుకుంది. ఇందులో సిటీలో దాదాపు 800 ఉండగా, కొత్తగా జిల్లాల్లో 1,300 అద్దె బస్సులు వచ్చి చేరనుండటంతో అంతే సంఖ్యలో సొంత బస్సులను రద్దు చేసుకుంటోంది. దీంతో పెద్ద సంఖ్యలో కండక్టర్లు, డ్రైవర్లు మిగిలిపోతున్నారు. నగరంలో ఇప్పటికే 800 బస్సుల రద్దు అమల్లోకి వచ్చింది. దీంతో దాదాపు 1,600 మంది వరకు కండక్టర్లు మిగిలిపోతున్నారు. ఇప్పటివరకు ఉన్న ఖాళీల్లో కొందరిని సర్దుబాటు చేయగా దాదాపు వేయి మందికిపైగా మిగిలిపోయారు. డ్రైవర్లలో మిగిలిన వారిని ఇతర శాఖలకు పంపేందుకు సిద్ధపడగా, ప్రస్తుతానికి ఫైర్ సర్వీసెస్ 42 మందిని తీసుకుంది. మిగతావారిలో ఎక్కువమందిని కొత్తగా ప్రారంభిస్తున్న సరుకు రవాణా విభాగానికి పంపుతున్నారు. కండక్టర్లకు మాత్రం వేరే శాఖల్లో అవకాశం లేక ఆర్టీసీలోనే అంతర్గతంగా వినియోగించుకోవాల్సి వచ్చింది. బస్సు రాగానే మైక్ పట్టుకుని దాని వివరాలను ప్రయాణికులకు వెల్లడిస్తున్న ఈయన కూడా సీనియర్ కండక్టరే. కానీ కండక్టర్ విధులు దక్కక ఇలా అదనపు డ్యూటీలో ఉండాల్సి వచ్చింది. సరుకు రవాణా విభాగంలో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్‌గా కొందరిని తీసుకోగా, మరికొందరిని ఇలా బస్టాపుల్లో ఉంచి బస్సుల నియంత్రణ, ఆటోలు అడ్డుగా లేకుండా చూడటం, ప్రయాణికులకు సమాచారమివ్వటం లాంటి పనులకు వినియోగిస్తున్నారు. బస్టాపుల్లో ఆటోలు తిష్ట వేయకుండా కొన్ని చోట్ల హోమ్గార్డులుండేవారు. ఇప్పుడు మిగిలిపోయిన కండక్టర్లను ఆయా బస్టాపులకు పంపి హోంగార్డుల పనులు వారికే అప్పగించినట్టు సమాచారం. ఉప్పల్ బస్టాపులో హోంగార్డులు లేక ఆటోవాలాలు రెచ్చిపోతున్నారు. కండక్టర్లనే బెదిరింపులకు గురిచేస్తూ బస్సులకు అడ్డంగా నిలిపి ప్రయాణికులను మళ్లించుకుంటున్నారు. ఈయన ఆర్టీసీలో సీనియర్ కండక్టర్. ప్రస్తుతం అసలు విధులు వదిలి ఉప్పల్ బస్టాప్‌లో బస్సుల రాకకు అడ్డుగా ఉన్న ఆటోలను పక్కకు తోలే పనిలో ఇలా నిమగ్నమయ్యాడు. సిటీలో 800 బస్సుల రద్దు.. నిజానికి నగరంలో బస్సులు తగ్గిపోవటంతో ప్రయాణికులకు ఇబ్బందులు పెరిగాయి. అసలే వాటి సంఖ్య చాలక కొన్ని ప్రాంతాలకు బస్సు ట్రిప్పులను నడపలేకపోతున్నారు. ఇప్పుడు ఏకంగా 800 బస్సులను తగ్గించటంతో కాలనీలకు వెళ్లే సర్వీసులు చాలా రద్దయ్యాయి. తక్కువ దూరం తిరిగే సర్వీసులను దూరప్రాంతాలకు పొడిగించారు. ఫలితంగా బస్టాపుల్లో పడిగాపులు పెరిగాయి. ఇటు ప్రయాణికులకు అటు మిగిలిపోయిన సిబ్బందికి ఈ చర్య ఇబ్బందిగా మారింది. ఈ విషయంలో ప్రభుత్వం వాస్తవాలు గుర్తించి పునరాలోచించాలన్న డిమాండు ప్రయాణికుల నుంచి బలంగా వస్తోంది. -
జమ్మూకశ్మీర్‌లో టోల్ ట్యాక్స్ రద్దు
జమ్మూ: జమ్మూ కశ్మీర్లో టోల్ రుసుమును రద్దు చేశారు. జమ్మూ– పఠాన్‌కోట్ రహదారిలోని లఖన్‌పూర్ పోస్ట్ సహా జమ్మూ కశ్మీర్‌లోని మొత్తం టోల్ పోస్ట్‌ల వద్ద రుసుముల వసూలును జనవరి 1వ తేదీ నుంచి నిలిపివేస్తున్నామని అభివృద్ధి, పర్యవేక్షణ విభాగాల ప్రిన్స్‌పల్ సెక్రటరీ రోహిత్ కన్సల్ మంగళవారం ప్రకటించారు. రైల్వే స్టేషన్లు, విమానాశ్రయాలు సహా అన్ని టోల్ పోస్ట్‌ల్లో ట్యాక్స్ వసూలు చేయబోమన్నారు. దీనివల్ల ఖజానాకు ఏటా రూ. 1500 కోట్ల నష్టం వాటిల్లుతుంది. ఇంటర్నెట్ సర్వీసుల పునరుద్ధరణ నాలుగున్నర నెలల తర్వాత జమ్మూకశ్మీర్‌లో ఇంటర్నెట్ సర్వీసుల్ని పునరుద్ధరించారు. ప్రభుత్వ ఆసుపత్రులు, విద్యాసంస్థల్లో మంగళవారం అర్థరాత్రి నుంచి ఈ సేవలు అందుబాటులోకి వచ్చాయి. జమ్మూకశ్మీర్ స్వయంప్రతిపత్తి రద్దుకు ఒక్క రోజు ముందు ఆగస్టు 4 నుంచి ఈ ప్రాంతంలో ఇంటర్నెట్, మొబైల్, ల్యాండ్‌లైన్ సేవలను యంత్రాంగం నిలిపివేసింది. మొబైల్ వినియోగదారులందరికీ ఎస్ఎంఎస్లు పంపే సదుపాయాన్ని పునరుద్ధరించినట్టుగా అ«ధికారులు తెలిపారు. 160 మంది ఉగ్రవాదులు హతం జమ్మూకశ్మీర్‌లో 2019లో 160 మంది ఉగ్రవాదులు బలగాల చేతుల్లో హతం కాగా 102 మందిని అరెస్టు చేశామని డీజీపీ దిల్బాగ్ సింగ్ వెల్లడించారు. లోయలో ఇప్పటికీ 250 మంది ఉగ్రవాదులు చురుకుగా ఉన్నారని మంగళవారం వెల్లడించారు. -
కృష్టపట్నం పోర్టుకు ప్రత్యేక పరిమితులు రద్దు
సాక్షి, అమరావతి : కృష్ణపట్నం పోర్టుకున్న ప్రత్యేక పరిమితులను రద్దు చేస్తున్నట్లు మంగళవారం ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీంతో రామాయపట్నం పోర్టు ప్రతిపాదనకు అవరోదాలు తొలిగినట్లే కనిపిస్తుంది. గతంలో చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు కృష్ణపట్నం పోర్టుకు విశేష అధికారాలు కట్టబెట్టారు. పోర్టు పరిధిలోని 30 కిలోమీటర్ల విస్తీర్ణంలో కొత్తగా ఎటువంటి పోర్టు నిర్మాణం చేపట్టకూడదని వారు చేసుకున్న ఒప్పందంలో ప్రధాన క్లాజుగా ఉంది. దీంతో అక్కడ వేరే పోర్టులు ఏర్పాటు కాకుండా కృష్టపట్నం పోర్టు కంపెనీకి బాబు ప్రభుత్వం లబ్ధి చేకూర్చింది.తాజాగా ఒప్పందంలో ఉన్న క్లాజును రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొనడంతో రామాయపట్నం పోర్టుకు అవరోదాలు తొలగిపోనున్నాయి. -
జనరల్ నర్సింగ్ కోర్సు ఎత్తివేత
సాక్షి, హైదరాబాద్: జనరల్ నర్సింగ్ మిడ్వైఫరీ (జీఎన్ఎం) కోర్సుకు ప్రభుత్వం ముగింపు పలికింది. 2021–22 విద్యా సంవత్సరం నుంచి జీఎన్ఎం కోర్సు నిర్వహించేదిలేదని స్పష్టంచేసింది. ఈ మేరకు వైద్య విద్యా సంచాలకుడు (డీఎంఈ) డాక్టర్ రమేశ్‌రెడ్డి తాజాగా ఉత్తర్వులు జారీచేశారు. ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. రాష్ట్రంలో 138 ప్రభుత్వ, ప్రైవేటు నర్సింగ్ స్కూళ్లల్లో 6 వేలకు పైగా జీఎన్ఎం సీట్లు ఉన్నాయి. ఇన్ని వేల సీట్లను ఒకేసారి రద్దు చేస్తుండటంతో నర్సింగ్ విద్యను అభ్యసించే విద్యార్థుల సంఖ్య మరింత పడిపోయే ప్రమాదముంది. కొన్ని రాష్ట్రాల్లో జీఎన్ఎం కోర్సు రద్దు చేసినా, వాటి స్థానే బీఎస్సీ నర్సింగ్ కోర్సు నిర్వహించేందుకు అనుమతించారు. దీంతో జీఎన్ఎం సీట్లు పోయినా బీఎస్సీ నర్సింగ్ సీట్లు వచ్చాయి. కానీ మన రాష్ట్రంలో ఇప్పటివరకూ ఆ దిశగా చర్యలు ప్రారంభించలేదు. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో పనిచేస్తున్న నర్సుల్లో 80 శాతం జీఎన్ఎం అర్హత కలిగినవారే ఉన్నారు. ముఖ్యంగా ప్రైవేటు ఆసుపత్రుల్లో బీఎస్సీ నర్సింగ్ చేసిన వాళ్లకంటే, జీఎన్ఎం చేసిన వాళ్లకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. బీఎస్సీ వాళ్ల కంటే తక్కువ వేతనాలకు పని చేయడమే ఇందుకు కారణమని నర్సింగ్ ఆఫీసర్స్ అసోసియేషన్ ప్రతినిధులు అంటున్నారు. నైపుణ్యం ఉండటం లేదు.. డీఎంఈ పరిధిలోకి జీఎన్ఎం కోర్సులు వస్తాయి. కాళోజీ హెల్త్ వర్సిటీ పరిధిలోకి బీఎస్సీ నర్సింగ్ కోర్సులు వస్తాయి. జీఎన్ఎం చేసినా చాలామంది నర్సుల్లో నైపుణ్యం ఉండటం లేదన్న ఆరోపణలున్నాయి. పైగా జీఎన్ఎం డిప్లొమా కోర్సుగా కొనసాగుతోంది. ఈ కోర్సుతో నైపుణ్యం రావడం లేదన్న ఆరోపణలతోనే కోర్సు రద్దు చేయాలని ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ నిర్ణయించింది. ప్రత్యామ్నాయ ఏర్పాటు చేసుకోవాలని రాష్ట్రాలకు సూచించింది. ఇక ‘నర్సింగ్’ వైపు కష్టమే.. ప్రస్తుతం రాష్ట్రంలో నర్సుల కొరత విపరీతంగా ఉంది. కానీ రాష్ట్రంలో 80 ప్రైవేటు, 6 ప్రభుత్వ నర్సింగ్ కాలేజీల్లో కలిపి బీఎస్సీ నర్సింగ్ సీట్లు 5 వేల లోపే ఉన్నాయి. ప్రైవేటు బీఎస్సీ నర్సింగ్‌లో కన్వీనర్ కోటా సీట్లు రాని విద్యార్థులంతా జీఎన్ఎం కోర్సుల్లో చేరుతున్నారు. జీఎన్ఎం కోర్సు ఎత్తేస్తుండటంతో నర్సింగ్ చదివే విద్యార్థుల సంఖ్య మరింత తగ్గే అవకాశముందని నర్సింగ్ నిపుణులు చెబుతున్నారు. దీంతో జీఎన్ఎం కోర్సులు అందించే నర్సింగ్ స్కూళ్లను, బీఎస్సీ నర్సింగ్ కాలేజీలుగా అప్‌గ్రేడ్ చేయా లని నర్సింగ్ ఆఫీసర్స్ అసోసియేషన్ కోరుతోంది. -
గ‘లీజు’ పనులకు బ్రేక్!
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: పార్టీ జిల్లా కార్యాలయ నిర్మాణం పేరుతో ఎన్ఎస్పీ స్థలాన్ని కాజేసేందుకు టీడీపీ నేతలు చేసిన కుట్రను వైఎస్సార్ ప్రభుత్వం తిప్పి కొట్టింది. కోట్ల రూపాయల విలువ చేసే స్థలాన్ని లీజు పేరుతో అప్పనంగా కొట్టేసేందుకు పన్నిన పన్నాగాన్ని ప్రభుత్వం తిప్పికొట్టింది. తమ ప్రభుత్వ హయాంలో అధికారాన్ని అడ్డు పెట్టుకుని టీడీపీ జిల్లా నేతలు రూ.25 కోట్ల విలువ చేసే ఎన్ఎస్పీ స్థలాన్ని కాజేసేందుకు చేసిన ప్రయత్నానికి ప్రస్తుత ప్రభుత్వం అడ్డుకట్ట వేసింది. గత ఏడాది అక్టోబర్ 11వ తేదీన అప్పటి ప్రభుత్వం టీడీపీ కార్యాలయానికి చ్చిన 1.96 ఎకరాల స్థలానికి ఇచ్చిన జీఓ ఎంఎస్ నెంః 514ను రద్దు చేస్తూ ప్రస్తుత ప్రభుత్వం బుధవారం నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే... ఒంగోలు నగరం నడిబొడ్డున నెల్లూరు– కర్నూలు హైవే పక్కన సర్వే నంబర్ 68/8లో నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ (ఎన్ఎస్పీ)కి చెందిన 1. 96 ఎకరాల స్థలం ఉంది. దీని మార్కెట్ విలువ రూ. 25 కోట్లకు పైగానే ఉంటుందని అంచనా. ఈ స్థలానికి తూర్పున ఇరిగేషన్ ప్రాజెక్ట్ సీఈ కార్యాలయం, పడమర వైపున ఆచార్య నాగార్జున యూనివర్సిటీ స్టడీ సెంటర్, దక్షిణం వైపున కర్నూలు– నెల్లూరు హైవే ఉన్నాయి. పక్కనే ఉన్న నీటిపారుదల శాఖ సర్కిల్ కార్యాలయం శిథిలావస్థకు చేరి చిన్నపాటి వర్షానికే కార్యాలయ ఆవరణ తటాకాన్ని తలపిస్తోంది. దీంతో నూతన కార్యాలయ భవన నిర్మాణానికి 2016 మే నెలలో ప్రతిపాదనలు సిద్ధం చేశారు. అప్పట్లో ఈ నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు రూ. 5.90 కోట్ల నిధులను మంజూరు చేసింది. 2016 ఆగస్టు 20వ తేదీన టెండర్లు కూడా పిలిచారు. హైదరాబాద్‌కు చెందిన ఆర్. గంగయ్య అండ్ కంపెనీ టెండర్‌ను దక్కించుకుని 2017 మార్చి 3న అగ్రిమెంట్ కూడా చేసి పనులు మొదలుపెట్టేందుకు సమాయత్తమయ్యారు. పనులకు శంకుస్థాపన చేసేందుకు పునాదులు కూడా తవ్వారు. స్థలంపై తమ్ముళ్ల కన్ను.. ఈ స్థలంపై అప్పట్లో టీడీపీ జిల్లా నేతల కన్ను పడింది. సదరు స్థలాన్ని పార్టీ జిల్లా కార్యాలయానికి కావాలంటూ అక్కడ జరుగుతున్న నీటిపారుదల శాఖ సర్కిల్ కార్యాలయ నిర్మాణ పనులను నిలిపి వేయించారు. అప్పట్లో అధికారంలో ఉన్న పార్టీ కావడంతో అధికారులు సైతం చేసేది లేక మిన్నకుండిపోయారు. ఆ తరువాత టీడీపీ నేతలు చెప్పినట్లుగా 1.96 ఎకరాల స్థలాన్ని ఏడాదికి రూ.1960 చొప్పున అద్దె చెల్లించేలా 33 ఏళ్ళపాటు లీజుకు ఇస్తూ జీఓ జారీ చేశారు. అప్పటి నుంచి ఈ స్థలం టీడీపీ నేతల ఆధీనంలో ఉన్నప్పటికీ ఏడాది దాటినా అందులో పనులు ప్రారంభించిన దాఖలాలు లేవు. దీనికితోడు సదరు స్థలం ఎన్ఎస్పీ శాఖకు అవసరమైన నేపథ్యంలో టీడీపీ కార్యాలయానికి గతంలో ఇచ్చిన జీఓ ఎంఎస్ నం 514ను రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీని ఆధారంగా తదుపరి చర్యలు తీసుకోవాలంటూ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ ఛీఫ్ కమిషనర్, జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. -
మోదీ టర్కీ పర్యటన రద్దు
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ రెండు రోజుల అధికారిక టర్కీ పర్యటన రద్దయ్యింది. గత నెలలో ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ వేదికగా జమ్మూ కశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దుపై టర్కీ అధ్యక్షుడు తుయ్యిప్ ఎర్డోగన్ విమర్శలు చేసిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. మరోవైపు పారిస్‌లోని ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ సమావేశంలోనూ పాక్‌కు మద్దతుగా ఎర్డోగన్ చేసిన వ్యాఖ్యలు కూడా పర్యటనకు రద్దు కు కారణాలుగా తెలుస్తోంది. ఈ నెల్లో జరగనున్న పెట్టుబడుల సదస్సులో పాల్గొనేందుకు సౌదీ అరేబియాకు వెళ్లనున్న మోదీ.. అక్కడి నుంచి టర్కీ రాజధాని అంకారా వెళ్లాల్సి ఉంది. అయితే తాజా నిర్ణయంతో మోదీ కేవలం సౌదీలో మాత్రమే పర్యటించనున్నారు. ఈ వార్తలపై విదేశాంగ శాఖ స్పందిస్తూ అసలు మోదీ టర్కీ పర్యటన ఖరారే కాలేదని, అలాంటప్పుడు రద్దయ్యే అవకాశమే లేదని పేర్కొంది. తమిళంలో మోదీ కవిత: ఇటీవల మామల్లపురం లో తాను సముద్రంతో సంభాషణ అంటూ రాసిన కవిత తమిళ అనువాదాన్ని తాజాగా ఆది వారం ప్రధాన మంత్రి మోదీ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌తో అనధికార భేటీ సందర్భంగా మహాబలిపురంలో మోదీ ఒక రోజు గడిపిన విషయం తెలిసిందే. భేటీ రోజు ఉదయం బీచ్‌లో ప్లాగింగ్ చేసిన మోదీ.. అక్కడే కాసేపు కూర్చున్నారు. ఆ సందర్భంగా సముద్రంతో మమేకమయ్యానంటూ తన భావావేశాన్ని కవితగా మలిచానని తరువాత చెప్పారు. ఆ కవితనే తమిళంలో ఆదివారం ట్వీట్ చేశారు. ఇటీవలి కాలంలో తమిళంపై ప్రధాని ప్రత్యేక ప్రేమ చూపుతున్న విషయం తెలిసిందే. ఐరాస వేదికపైనా తమిళం అత్యంత ప్రాచీన భాష అని గుర్తు చేశారు. జిన్‌పింగ్ పర్యటన సందర్భంగా మామల్లపురంలో తమిళ సంప్రదాయ వస్త్రధారణలో కనిపించారు. -
‘ఆంధ్రజ్యోతి’కి స్థల కేటాయింపులు రద్దు
తన తాబేదార్లకు, అంతేవాసులకు విశాఖను వడ్డించిన విస్తరిలా మార్చేసి.. భూములను అడ్డంగా వడ్డించేసిన గత టీడీపీ సర్కారు నిర్వాకం గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ.. తాబేదార్లకే కాదు.. నిత్యం తనకు భజన చేసే తోక పత్రికలకు సైతం రూ.కోట్ల విలువైన భూములను నామమాత్రపు ధరలకు ధారాదత్తం చేసేసిన పచ్చ సర్కారు.. పచ్చి అక్రమాలకు.. తాజాగా అధికారంలోకి వచ్చిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం అడ్డుకట్ట వేస్తోంది. అప్పనంగా అన్యాక్రాంతమైన భూములను స్వాధీనం చేసుకొని.. వాటిని అర్హులైన పేదలకు ఇచ్చే చర్యలకు శ్రీకారం చుట్టింది. అందులో భాగంగానే నగర శివారు పరదేశిపాలెంలో జాతీయ రహదారిని ఆనుకొని ఉన్న అత్యంత విలువైన ఒకటిన్నర ఎకరాల భూమిని తన తోక పత్రికకు దఖలుపరుస్తూ.. 2017లో అప్పటి టీడీపీ సర్కారు జరిపిన కేటాయింపులపై ఇప్పటి ప్రభుత్వం వేటు వేసింది. ఆ భూమిని పేదలకు కేటాయించాలని బుధవారం జరిగిన కేబినెట్ సమావేశంలో తీర్మానించింది. కాగా అడ్డగోలుగా పొందిన ఆ భూమిని ఇప్పటికే తవ్వుకొని కంకర అమ్మకాల ద్వారా రూ.7 కోట్లకుపైగా అప్పనంగా వెనుకేసుకోవడం కొసమెరుపు. సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: విశాఖ శివారున పరదేశిపాలెంలో రూ.కోట్ల విలువైన 1.50 ఎకరాల స్థలాన్ని ఆంధ్రజ్యోతి యాజమాన్య సంస్థ అయిన ఆమోద పబ్లికేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు కేవలం రూ.50 లక్షల 5వేలకే ఇచ్చేస్తూ.. 2017 జూన్ 28న అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దానికి ముందు ఎప్పుడో.. 1986లో అప్పటి ఎన్టీఆర్ ప్రభుత్వం ఆంధ్రజ్యోతి ప్రెస్‌కు పరదేశిపాలెం గ్రామ పరిధి సర్వే నెం.191, 168లలో ఎకరా రూ.10వేల ధరకు 1.50ఎకరాల భూమి కేటాయించింది. అయితే కొన్నాళ్లకు జాతీయ రహదారి విస్తరణ కోసం ఇందులో ఎకరా భూమిని ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. మిగిలిన 50 సెంట్ల భూమి అప్పటి నుంచి ఆ సంస్థ అధీనంలోనే ఉంది. జాతీయ రహదారి(ఎన్‌హెచ్–16) కోసం స్వాధీనం చేసుకున్న భూమికి ప్రత్యామ్నాయంగా వేరే భూమి ఇవ్వాలని, 1986లో తమకు కేటాయించిన ధరకే ఎకరా రూ.10వేల చొప్పున రేటు నిర్ణయించాలని ఆంధ్రజ్యోతి యాజమాన్యం 2016లో చంద్రబాబు ప్రభుత్వాన్ని కోరింది. ఇలా సదరు పత్రిక కోరడమే ఆలస్యం.. ఆగమేఘాల మీద స్పందించిన బాబు సర్కారు అదే ప్రాంతంలో ఒకటిన్నర ఎకరాల భూమిని గుర్తించాలని జిల్లా అధికార యంత్రాంగాన్ని ఆదేశించింది. కలెక్టర్ చెప్పిన రేటు కాదని.. అప్పటి జిల్లా కలెక్టర్ యువరాజ్ ఈ ప్రాంతంలో ప్రభుత్వ స్థలం ఉందని పేర్కొంటూ.. మార్కెట్ విలువ ఎకరా రూ.7.26 కోట్లుగా నిర్ధారిస్తూ ప్రభుత్వానికి నివేదిక పంపారు. 2016 ఆగస్టు 10న ఇచ్చిన ఈ నివేదికను అనుసరించి అదే ఏడాది అక్టోబర్ 4వ తేదీన అప్పటి జిల్లా కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ రివైజ్డ్ నివేదిక పంపించారు. ఆ నివేదికలో కూడా ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం ఎకరా రూ.7.26 కోట్లకే కేటాయించాల్సిందిగా ఎలినేషన్ ప్రతిపాదనలు పంపారు. కానీ టీడీపీ సర్కారు జిల్లా అధికారుల సిఫార్సులను లెక్కలోకి తీసుకోలేదు. పరదేశిపాలెం సర్వేనంబర్ 191/10 నుంచి 191/14లో అందుబాటులో ఉన్న ఎకరా 50 సెంట్ల భూమిని ఆమోద పబ్లికేషన్స్‌కు కేటాయిస్తూ రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ కరికల వలవన్ 2017 జూన్ 28న జీవో ఎంఎస్. 25ను జారీ చేశారు. 0.50 సెంట్ల భూమిని పాత ధర కింద ఎకరా రూ.10వేల రేటుతో, ప్రత్యామ్నాయంగా ఇస్తున్న ఎకరా భూమిని ఎకరా రూ.50 లక్షల రేటుతో కేటాయించాలని సదరు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మూడేళ్లలో భూమిని ఉపయోగించాలనీ, ఆ భూమిలో ఉన్న వాటర్ బాడీస్ (చెరువులు, గెడ్డలు)ను రూపు మార్చకూడదని స్పష్టం చేశారు. సంబంధిత అవసరాలకు మాత్రమే వినియోగించాలని, వివరాలను జిల్లా కలెక్టర్‌కు సమర్పించాలని అప్పటి ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అదేవిధంగా ప్రతి మార్చి 31వ తేదీకల్లా ఈ భూమి వినియోగంపై నివేదిక సమర్పించాలని ఆదేశించారు. ఇక్కడ ఎకరా కోట్లలో పలుకుతుందనేది అందరికీ తెలిసిందే. అలాంటిది ఒకటిన్నర ఎకరాల భూమిని కేవలం రూ.50లక్షలకే ధారాదత్తం చేయడం అప్పట్లోనే వివాదమైంది. ఇప్పుడు బలహీనవర్గాలకు కేటాయించేలా... పేదలకు చెందాల్సిన విలువైన భూమిని అధికారం అడ్డం పెట్టుకొని ఆంధ్రజ్యోతికి అప్పనంగా ఇచ్చేసినట్లుగా వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించింది. విలువైన ఈ స్థలంలో పదుల సంఖ్యలో నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని సంకల్పించింది. ఈ మేరకు బుధవారం జరిగిన కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆ భూమి కేటాయింపును రద్దు చేస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఆ స్థలాన్ని బలహీనవర్గాలకు కేటాయించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని జిల్లా అధికారులకు సూచించనున్నట్లు మంత్రి పేర్ని నాని ప్రకటించారు. గ్రావెల్ తరలింపుతో రూ.కోట్లు కొల్లగొట్టారు ఇక ఎకరాన్నర స్థలంలో ఉన్న కొండలను చదును చేసే పనిని టీడీపీ అధినేత చంద్రబాబుకు సన్నిహితంగా ఉండే ఓ బడా నిర్మాణ సంస్థకు సదరు భూమి పొందిన ఆమోదా పబ్లికేషన్స్ అప్పగించినట్టు తెలుస్తోంది. ఈ సంస్థ కొండను చదును చేసి రోజుకు సుమారు రూ. 2లక్షల విలువ చేసే గ్రావెల్ తరలిస్తోంది. ఏడాది నుంచి ఈ వ్యవహారం సాగుతోంది. మొత్తంగా ఇప్పటివరకు రూ. 7కోట్ల విలువైన గ్రావెల్‌ను అడ్డగోలుగా తరలించినట్టు చెబుతున్నారు. ఈ కొండను లెవెల్ చేసి గ్రావెల్ అమ్ముకున్నందుకు ప్రతిగా సదరు సంస్థ ఉచితంగా ఆమోదా పబ్లికేషన్స్‌కు కార్యాలయం నిర్మించి ఇవ్వాలన్నదే వారి మధ్య ఒప్పందంగా తెలుస్తోంది. -
బాక్సైట్ మైనింగ్ లీజు రద్దు: ఉత్తర్వులు జారీ
సాక్షి, అమరావతి: విశాఖ ఏజెన్సీలో చంద్రబాబు ప్రభుత్వం 30 ఏళ్ల పాటు లీజుకిచ్చిన బాక్సైట్ తవ్వకాల అనుమతిని రద్దు చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. బాక్సైట్ మైనింగ్ లీజు రద్దుకు సంబంధించిన ఫైల్‌పై గత గురువారం వైఎస్ జగన్మోహన్రెడ్డి సంతకం చేయగా, తాజాగా అనుమతులను రద్దు చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే బాక్సైట్ తవ్వకాలు జరపబోమని.. గతంలో టీడీపీ సర్కార్ ఇచ్చిన మైనింగ్ లీజును రద్దు చేస్తామని విపక్ష నేత హోదాలో వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన మాటకు కట్టుబడి ఇప్పుడు బాక్సైట్ లీజును రద్దు చేశారు. అనంతగిరి రిజర్వ్ ఫారెస్ట్, జెర్రెల బ్లాక్ 1,2,3, గాలికొండ, చిత్తమగొండి, రక్తికొండ, చింతపల్లి రిజర్వ్ ఫారెస్ట్ గ్రామాల్లో బాక్సైట్ అనుమతులను వైఎస్సార్సీపీ ప్రభుత్వం రద్దు చేసింది. గతంలో బాక్సైట్ తవ్వకాలకు వ్యతిరేకంగా గిరిజనుల పోరాటానికి వైఎస్ జగన్మోహన్రెడ్డి మద్దతు ఇచ్చారు. రెండేళ్ల కిందటే బాక్సైట్ తవ్వకాలను రద్దు చేస్తామని వైఎస్ జగన్ ప్రకటించారు. గిరిజనులకు ఇచ్చిన హామీ మేరకు 2,226 హెక్టార్లలో బాక్సైట్ తవ్వకాలకు సీఎం జగన్ మాట నిలబెట్టుకున్నారు. (చదవండి: విశాఖ జిల్లాలో.. బాక్సైట్ మైనింగ్ లీజు రద్దు) ఐదు జీవోలు జారీ.. బాక్సైట్ తవ్వకాల అనుమతులు రద్దుకు సంబంధించి మొత్తం 5 జీవోలను ఏపీ ప్రభుత్వం జారీ చేసింది. ►జీవో నెంబర్ 80- విశాఖ జిల్లా అనంతగిరి మండలంలోని రక్తకొండ గ్రామ పరిధిలో 113.192 హెక్టార్ల బాక్సైట్ మైనింగ్ లీజు రద్దు ►జీవో నెంబర్ 81- చింతపల్లి, అరకులో 152 ఎకరాల బాక్సైట్ మైనింగ్ లీజు రద్దు ►జీవో నెంబర్ 82- అనంతగరి మండలం గాలికొండలో 93.886 హెక్టార్ల మైనింగ్‌లీజు రద్దు. ►జీవో నెంబర్ 83 - జెర్రెల బ్లాక్–1 లో 85 హెక్టార్ల బాక్సైట్ మైనింగ్‌లీజు రద్దు ►జీవో నెంబర్ 84- జెర్రెల బ్లాక్–2,3లో 617 హెక్టార్లకు సంబంధించి చింతపల్లిలో మైనింగ్‌లీజు రద్దు ►జీవో నెంబర్ 85- చింతపల్లి రిజర్వు ఫారెస్ట్‌లో జెర్రెల బ్లాక్–3 లో మరో 460 హెక్టార్లలో మైనింగ్‌లీజు రద్దు -
సరిహద్దులో 230 మంది ఉగ్రవాదులు
న్యూఢిల్లీ: భారత జాతీయ భద్రతా సలహాదారు(ఎన్ఎస్ఏ) అజిత్ దోవల్ శనివారం సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూకశ్మీర్‌లో విధ్వంసం సృష్టించేందుకు పాకిస్తాన్ కుట్ర పన్నుతోందని తెలిపారు. ఇందులోభాగంగా సరిహద్దులో 230 మంది ఉగ్రవాదులను పాక్ సిద్ధం చేసిందనీ, వీరిలో కొందరు ఇప్పటికే కశ్మీర్లోకి ప్రవేశించి ఉండొచ్చని వ్యాఖ్యానించారు. కశ్మీర్లో పరిస్థితులు సాధారణ స్థితికి రావడం, లోయ నుంచి రోజుకు 750 ట్రక్కుల ఆపిల్స్ ఎగుమతి కావడంపై పాక్ లోని ఉగ్రమూకలు రగిలిపోతున్నారని దోవల్ వెల్లడించారు. ఆర్టికల్ 370 రద్దుతో కశ్మీరీ యువతకు గొప్ప భవిష్యత్, ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు. కశ్మీర్లో ఉగ్రవాదాన్ని ఎగదోయడమే పాక్ వద్దున్న ఏకైక అస్త్రమని విమర్శించారు. ఢిల్లీలో శనివారం ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన దోవల్.. పాక్ వ్యవహారశైలిపై తీవ్రంగా మండిపడ్డారు. టవర్లు ఏర్పాటుచేసిన పాక్.. కశ్మీర్ వద్ద సరిహద్దులో 20 కి.మీ విస్తీర్ణంలో పాక్ ప్రత్యేకంగా కమ్యూనికేషన్ టవర్లను ఏర్పాటు చేసిందని ఎన్ఎస్ఏ అజిత్ దోవల్ తెలిపారు. ‘‘ఈ టవర్ల సాయంతో కశ్మీర్‌లోని ఉగ్రవాదులతో పాక్‌లోని వారి హ్యాండ్లర్లు సంప్రదింపులు జరుపుతున్నారు. వీరి సంభాషణల్ని మన నిపుణులు గుర్తించారు. ఈ సందర్భంగా పాకిస్తానీ హ్యాండ్లర్ మండిపడుతూ..‘అసలు అన్ని ఆపిల్ ట్రక్కులు రాకపోకలు ఎలా సాగిస్తున్నాయ్? వాటిని మీరు ఆపలేరా? చేతకాకుంటే ఒప్పుకోండి. మీకు తుపాకులకు బదులుగా గాజులు పంపుతాం’ అని రెచ్చగొట్టేలా పంజాబీలో పాక్ యాసలో మాట్లాడాడు. ఇది జరిగిన తర్వాత ఇద్దరు ఉగ్రవాదులు గత శుక్రవారం సోపోర్‌లోని దంగపురా ప్రాంతంలో ప్రముఖ ఆపిల్ వ్యాపారి హమీదుల్లా రాథర్ ఇంటికెళ్లారు. హమీదుల్లా నమాజ్‌కు వెళ్లడంతో ఆగ్రహంతో ఆయన కుటుంబసభ్యులపై పిస్టళ్లతో కాల్పులు జరిపారు. ఈ ఘటనలో హమీదుల్లా కుమారుడు ఇర్షాద్(25), రెండున్నరేళ్ల మనవరాలు అస్మాలు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో చిన్నారి అస్మా ఆరోగ్యం విషమంగా ఉండటంతో ఢిల్లీలోని ఎయిమ్స్‌కు తరలించాం’’ అని దోవల్ వెల్లడించారు. ఆర్టికల్ 370ని కేంద్ర ప్రభుత్వం రద్దుచేయడాన్ని మెజారిటీ కశ్మీరీలు మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నారని పేర్కొన్నారు. ఆర్టికల్ 370 ప్రత్యేక హక్కు ఎంతమాత్రం కాదనీ, అతి ప్రత్యేకమైన వివక్షని వ్యాఖ్యానించారు. కశ్మీర్లో ప్రస్తుతం 10 పోలీస్స్టేషన్ల పరిధిలోనే నిషేధాజ్ఞలు అమలవుతున్నాయనీ, ఉగ్రవాదులు సంప్రదింపులు జరపకుండా ఉండేందుకే ఇంటర్నెట్, ఇతర కమ్యూనికేషన్ వ్యవస్థలను స్తంభింపజేశామన్నారు. -
బ్రెజిల్ అధ్యక్షుడికి అమెజాన్ సెగలు
పోర్టో వెల్హో(బ్రెజిల్): అమెజాన్ అడవుల్లో రేగిన కార్చిచ్చు సెగలు బ్రెజిల్ అధ్యక్షుడు జెయిర్ బోల్సోనారోకి తగులుకుంటున్నాయి. అడవులు తగలబడిపోతుంటే ఆయన స్పందించిన విధానంపై స్వదేశంలోనూ, ప్రపంచవ్యాప్తంగానూ నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. అమెజాన్ అడవుల్లో కార్చిచ్చులు సర్వసాధారణమే అయినప్పటికీ గతంతో పోల్చి చూస్తే ఈ ఏడాది 85 శాతం పెరిగిపోయాయి. అయితే ప్రభుత్వ విశ్వసనీయతను దెబ్బతీయడానికి సామాజిక సంస్థలే అడవుల్ని తగలబెట్టి ఉంటాయని బోల్సోనారో చేసిన వ్యాఖ్యలు దుమారం లేపాయి. బ్రెజిల్ వ్యాప్తంగానూ, ప్రపంచ దేశాల్లో బ్రెజిల్ దౌత్యకార్యాలయాల ఎదుట వందలాది మంది నిరసన ప్రదర్శనలకు దిగారు. సొంత దేశంలోనే కొందరు యువకులు ‘‘బోల్సోనారో మా భవిష్యత్‌ని మసి చేస్తున్నారు‘‘అంటూ ప్ల కార్డులు ప్రదర్శించారు. పోప్ ప్రాన్సిస్ కూడా తన నిరసన గళాన్ని వినిపించారు. ఊపిరితిత్తుల్లాంటి అడవులు మన భూమికి అత్యంత ముఖ్యమంటూ ప్రకటన జారీ చేశారు. ప్రేఫర్అమెజాన్ అంటూ సోషల్ మీడియాలో ఉద్యమం ప్రపంచంలోనే ట్రెండింగ్ అంశంగా మారింది. బ్రెజిల్‌తో వ్యాపార సంబంధాలు నిలిపివేస్తాం బ్రెజిల్ అధ్యక్షుడు వాణిజ్య ప్రయోజనాల కోసం తీసుకువచ్చిన అటవీ విధానాలే కార్చిచ్చు రేపాయని, ఇవి ఇంకా కొనసాగితే బ్రెజిల్, ఇతర దక్షిణ అమెరికా దేశాలతో వ్యాపార సంబంధాలు రద్దు చేసుకుంటామని యూరోపియన్ నాయకులు హెచ్చరించారు. బ్రెజిల్ అధినేత అంతర్జాతీయ పర్యావరణ ఒప్పందాలను తోసి రాజని అడవుల నరికివేత, పశువుల మేతకు చదును చేయడం, అక్రమ మైనింగ్‌ను ప్రోత్సహించడం వల్లే ఈ పరిస్థితులు తలెత్తాయని ప్రపంచ దేశాల అభిప్రాయంగా ఉంది. గతంలో కూడా బోల్సోనారో అమెజాన్ వర్షారణ్యాలు బ్రెజిల్ ఆర్థికాభివృద్ధికి అడ్డంకిగా మారాయని వ్యాఖ్యానించారు. ఈ పరిణామాలతో బోల్సోనారోపై అంతర్జాతీయంగా ఒత్తిడి పెరిగింది. దీంతో ఆయన దిగివచ్చారు. పర్యావరణ విధానాల్ని సవరించుకుంటామని హామీ ఇచ్చారు. మంటల్ని ఆర్పడానికి 44వేల మంది సైనికుల్ని పంపిస్తానని వెల్లడించారు. అంతేకాదు కార్చిచ్చు రేగడానికి గల కారణాలపై విచారణ జరిపి బాధ్యుల్నిశిక్షిస్తామని అధినేత చెప్పినట్టుగా ఆ దేశ న్యాయశాఖ మంత్రి, పర్యావరణ విధానాలను సమీక్షించే అధికారం ఉన్న సెర్గియో మోరో ట్విటర్లో వెల్లడించారు. ఆర్పడానికి జీ7 అండ అమెజాన్ అడవుల్లో కార్చిచ్చుని ఆర్పడానికి అన్నివిధాల సాయపడడానికి జీ7 దేశాలు ముందుకొచ్చాయి. 2.2 కోట్ల అమెరికా డాలర్లు సాయం చేస్తామని ఫ్రాన్స్ అధ్యక్ష కార్యాలయం ప్రకటించింది. మంటలనార్పే విమానాలు పంపడానికి ఈ డాలర్లని వినియోగించాలని తెలిపింది. బ్రిటన్, కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, అమెరికాలతో కూడిన జీ7 సదస్సు అడవుల పునరుద్ధరణ ప్రణాళిక అంశంలో కూడా బ్రెజిల్‌కు ఆర్థిక సహకారాన్ని అందిస్తామని హామీ ఇచ్చింది. ఆగస్టు 15 నుంచి దక్షిణ అమెరికా దేశాల్లో రోజురోజుకూ విస్తరిస్తున్న కార్చిచ్చు, బ్రెజిల్, బొలివియా, పెరూ, పరాగ్వే, ఈక్వెడార్, ఉరుగ్వే, ఉత్తర అర్జెంటీనా, వాయవ్య కొలంబియా దేశాల్లో కార్చిర్చు ( ఎరుపురంగు) -
బందరు పోర్టు కాంట్రాక్టు రద్దు
సాక్షి, అమరావతి: మచిలీపట్నం (బందరు) పోర్టు కాంట్రాక్టును రద్దు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులిచింది. ఈ పోర్టు నిర్మించడానికి 2010 జూన్ 7న నవయుగ సంస్థతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. కానీ, పోర్టు నిర్మాణం దిశగా ఇప్పటివరకు ఒక్క అడుగు కూడా ముందుకు పడకపోవడంతో కాంట్రాక్టును రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నవయుగ సంస్థ ఇప్పటికే మరో ఓడరేవును నిర్వహిస్తుండడంతో ఆ ప్రాజెక్టు లాభదాయకతను దృష్టిలో పెట్టుకొని ఉద్దేశపూర్వకంగానే బందరు పోర్టు నిర్మాణం విషయంలో జాప్యం చేస్తోందని అధికారులు అంటున్నారు. బందరు పోర్టు నిర్మాణం పేరిట ఇప్పటికే నవయుగ సంస్థ తీసుకున్న 471.28 ఎకరాల భూమికి పైసా కూడా లీజు చెల్లించలేదు. దీంతో నవయుగ సంస్థతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని తక్షణమే రద్దు చేయడంతో పాటు ఇప్పటికే ఇచ్చిన భూమిని తిరిగి స్వాధీనం చేసుకోవాలంటూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. దీనికి సంబంధించిన నష్ట పరిహారాన్ని మచిలీపట్నం పోర్టు ప్రైవేట్ లిమిటెడ్ నుంచి వసూలు చేయనున్నట్లు ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. -
నివురుగప్పిన నిప్పులా కశ్మీర్
శ్రీనగర్‌లో ప్రస్తుతం ఎటుచూసినా సాయుధ బలగాలే ఉన్నాయి. బయటివారి సంగతి పక్కనపెడితే స్థానికులు కూడా ఇంట్లోంచి అడుగుతీసి బయట పెట్టలేని పరిస్థితి నెలకొంది. అడుగడుగునా సీఆర్పీఎఫ్ బలగాలు చెక్‌పోస్టులను ఏర్పాటు చేశాయి. ఎక్కడకు, ఎందుకు వెళుతున్నారు? అనే సీఆర్పీఎఫ్ జవాన్ల ప్రశ్నలకు సంతృప్తికరమైన సమాధానాలు ఇస్తేనే ముందుకెళ్లేందుకు అనుమతిస్తున్నారు. శ్రీనగర్–జమ్మూ మధ్య 260 కి.మీ దూరాన్ని సాధారణ పరిస్థితుల్లో 6–7 గంటల్లో దాటేయొచ్చు. కానీ ప్రస్తుతం ప్రతీ కిలోమీటర్‌కు ఓ సీఆర్పీఎఫ్ పోస్ట్(మొత్తం 260 పోస్టుల)ను ఏర్పాటుచేశారు. ప్రతీ వాహనానికి వారు ఓ ప్రత్యేక నంబర్ కేటాయిస్తున్నారు. అదుంటేనే బండి ముందుకు కదులుతుంది. జమ్మూకశ్మీర్‌కు సంబంధించి కేంద్రం తీసుకున్న ఆర్టికల్ 370 రద్దు గురించి చాలామంది కశ్మీరీలకు తెలియదు. ఇందుకు కమ్యూనికేషన్ల వ్యవస్థ మొత్తం స్తంభించిపోవడమే కారణం. అయితే ఆర్టికల్ 370 రద్దు గురించి తెలిసిన కొందరు కశ్మీరీలు మాత్రం కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై పెదవి విరిచారు. తమ జీవితాలకు సంబంధించిన కీలక నిర్ణయం తీసుకునే సందర్భంగా తమకు కనీస సమాచారం ఇవ్వలేదనీ, విశ్వాసంలోకి తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కశ్మీరీల్లో భయాందోళన.. ఆర్టికల్ 370తో తమ జీవితాలు మారిపోతాయనే వాదనను స్థానిక కశ్మీరీలు తిరస్కరిస్తున్నారు. ‘సగటు కశ్మీరీ కుటుంబం ఉన్నంతలో హుందాగా బతికేందుకు ప్రాధాన్యత ఇస్తుంది. ఉపాధి కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లడాన్ని, కూలిపని చేయడాన్ని కశ్మీరీలు నామోషీగా భావిస్తారు. సుగంధ ద్రవ్యాలు, యాపిల్ సాగు, కళాత్మక పనులు, చేతివృత్తుల విషయంలో కశ్మీరీలకు మంచి నైపుణ్యముంది. దీంతో సొంతంగా నిలదొక్కుకోవాలన్న తపన వీరిలో చాలా అధికం. అయితే కేంద్రం ఆర్టికల్ 370ని రద్దుచేయడంతో తమ పరిస్థితి తలకిందులవుతుందని వారంతా ఆందోళన చెందుతున్నారు. స్థానికేతరులు కశ్మీర్లో స్థిరపడ్డా, లేదంటే కేంద్రం నిర్ణయంతో ఉగ్రవాదం తిరిగి పుంజుకున్నా తాము ఉపాధిని కోల్పోతామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కశ్మీర్ పండిట్లు మాత్రం కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు. ఏళ్లుగా తాముపడిన కష్టాలకు ఇక ఓ ముగింపు దొరికిందని హర్షం వ్యక్తం చేస్తున్నారు. నిర్మాణ పనుల్లో తెలుగు వారు కశ్మీర్లో జరుగుతున్న రోడ్డు నిర్మాణ పనుల్లో పలువురు తెలుగువాళ్లు పాల్గొంటున్నారు. ఇతర రాష్ట్రాలవారిని కశ్మీరీలు గౌరవిస్తారనీ, ఆతిథ్యం విషయంలో ఎవరైనా వారి తర్వాతేనని తెలుగువాళ్లు చెప్పారు. మరోవైపు వచ్చే సోమవారం బక్రీద్, అనంతరం ఆగస్టు 15 వస్తుండటంతో అప్పటివరకూ ఆంక్షలు కొనసాగే అవకాశముందని ఆర్మీ అధికారులు భావిస్తున్నారు. -(జమ్మూకశ్మీర్ నుంచి సాక్షి ఇన్ పుట్ ఎడిటర్ ఇస్మాయిలుద్దిన్) -
పండిట్ల ఘర్ వాపసీ!
దేశమంతా జమ్మూ కశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు నిర్ణయంపై వాదోపవాదనలు జరుగుతుంటే.. కశ్మీరీ పండిట్లు సంబరాలు చేసుకుంటున్నారు. వీరు కశ్మీర్‌ను ఎందుకు వదిలేయాల్సి వచ్చింది.. ఎందరు విడిచి వెళ్లారు? ఇప్పుడెక్కడ స్థిరపడ్డారు? లోయలో ఇప్పుడెందరున్నారు? చూద్దాం... మూడు కేటగిరీలు పండిట్లు.. కశ్మీరీ పండిట్ల సమాజం ముఖ్యంగా మూడు వర్గాలు. వీరిలో ముందుగా చెప్పుకోవాల్సింది బన్మాసీల గురించి. కశ్మీర్ లోయ ముస్లిం రాజుల పాలనలో ఉన్నప్పుడు వీరంతా వ్యాలీని వదిలేసి వెళ్లిపోయి.. కొన్నేళ్లకు తిరిగి వచ్చారు. ఇక రెండో కేటగిరీ మల్మాసీ. లోయలో జరుగుతున్న అన్ని కష్టనష్టాలను తట్టుకొని అక్కడే స్థిరపడ్డారు. మూడో కేటగిరీ బుహ్రీస్. వ్యాపార వ్యవహరాలు సాగించే పండిట్లంతా ఈ కేటగిరీ వారే. అయితే 1989లో పండిట్ల భారీ వలసలతో వీరి మధ్య వ్యత్యాసాలు చాలా తగ్గిపోయాయి. డోగ్రా పాలనలో.. 1846 నుంచి 1947 వరకు డోగ్రా రాజవంశ పాలనలో ముస్లింల సంఖ్య మెజారిటీగానే ఉన్నప్పటికీ కశ్మీరీ పండిట్ల హవా సాగింది. ఈ కాలంలో లోయలో అధికంగా ఉన్న ముస్లింలతో సఖ్యతగానే ఉంటూ పండిట్లు జీవనం సాగించారు. అయితే 1950 భూ సంస్కరణ నిర్ణయాల ఫలితంగా 20 శాతం పండిట్లు కశ్మీర్ లోయను వదిలేసి ఇతర ప్రాంతాలకు వలస వెళ్లారు. 1981 నాటికి లోయలో పండిట్ల జనాభా కేవలం 5 శాతం. పెరిగిన అకృత్యాలు 1989 మధ్య నాటికి ఇస్లామిక్ ఉగ్రవాదం పెరిగిపోయింది. పండిట్లలోని పురుషులను చంపడం, మహిళలపై అత్యాచారాలు జరపడం, వారి ఇళ్లలో చోరీలు చేయడం అధికమయ్యాయి. తప్పనిసరి పరిస్థితులో పండిట్లు లోయను వదిలేసి ఇతర ప్రాంతాలకు వలస వెళ్లారు. కొన్ని కథనాల ప్రకారం 1990లో సుమారు 1,40,000 మంది పండిట్ల జనాభా ఉందని అంచనా వేయగా.. వారిలో లక్ష మంది కశ్మీర్‌ను వదిలేశారు. వలస వెళ్లిన వారిలో అధికంగా జమ్మూ, ఢిల్లీ చుట్టుపక్కల ప్రాంతాల్లో స్థిరపడ్డారు. పండిట్లకు బాల్ థాక్రే సాయం.. కశ్మీర్ నుంచి వలస వచ్చిన పండిట్లకు మొదటగా సాయం చేసింది శివసేన వ్యవస్థాపకుడు బాల్ థాక్రే. ఇంజనీరింగ్ కాలేజీల్లో పండిట్ల కుటుంబాల్లోని పిల్లలకు ఆయన రిజర్వేషన్లు కల్పించారు. కాగా జమ్మూ కశ్మీర్ ప్రభుత్వం లెక్కల ప్రకారం 2010లో కశ్మీర్లో 808 పండిట్ల కుటుంబాల్లో మొత్తం 3,445 మంది జనాభా ఉన్నట్లు తేలింది. -
హిందూ రాజు ముస్లిం రాజ్యం
స్వాతంత్య్రానంతర పరిణామాల్లో రెండు రాచరిక పాలనల్లోని రాజ్యాంగ అంశాలు కీలకంగా మారాయి. అవే హైదరాబాద్, కశ్మీర్ సంస్థానాలు. ఈ రెండు సంస్థానాల మధ్య ఒక పోలిక ఉంది. హైదరాబాద్ సంస్థానంలో మెజారిటీ ప్రజలు హిందువులు కాగా, రాజ్యాధికారం ముస్లింల చేతిలో ఉండేది. కశ్మీర్లో మెజారిటీ ప్రజలు ముస్లింలు కాగా, అధికారం హిందూ రాజు చేతిలో ఉండేది. భారత్‌లో విలీనానికి నిజాం రాజు అంగీకరించకపోవడంతో ‘ఆపరేషన్ పోలో’తో భారత్ సైన్యాన్ని దించడంతో, హైదరాబాద్ సంస్థానం భారత్‌లో విలీనమైంది. పాకిస్తాన్ సైన్యం దురాక్రమణకు రావడంతో కశ్మీర్ రాజు రాజా హరిసింగ్ కొన్ని షరతులు, ఒప్పందాలకు లోబడి కశ్మీర్ సంస్థానాన్ని భారత్‌లో విలీనం చేశారు. బ్రిటిష్ పాలన నుంచి స్వాతంత్య్రాన్ని సాధించుకునేటప్పటికి 562 ప్రాంతాలు రాచరిక పాలనలో ఉన్నాయి. అయితే అందులో మూడు మాత్రం 1947 స్వాతంత్య్రానంతరం కూడా అదే రాచరిక వ్యవస్థలో కొనసాగాయి. కశ్మీర్, హైదరాబాద్, గుజరాత్ కతీవార్ ప్రాంతంలోని జునాగఢ్‌లు మాత్రం 1947 నాటికి భారత్‌లో భాగం కాలేదు. హైదరాబాద్ సంస్థానం ప్రత్యేకత... బ్రిటిష్ పాలన సమయంలోనే హైదరాబాద్ సంస్థానానికి ప్రత్యేక సైన్యముండేది. ప్రత్యేకంగా రైల్వే, పోస్టల్ విభాగాలున్నాయి. హైదరాబాద్ సంస్థానంలో 80 శాతంగా ఉన్న హిందువులను ముస్లిం రాజు పాలించేవాడు. భారత్ పాకిస్తాన్ విభజన సందర్భంగా హైదరాబాద్ సంస్థాన నిజాం రాజు 1947 జూన్ 26న హైదరాబాద్ సంస్థానం ఇటు పాకిస్తాన్‌లోకానీ, భారత్‌లో కానీ విలీనం కాబోదని ఫర్మానా జారీ చేశాడు. హైదరాబాద్ సంస్థానంపై సంపూర్ణాధిపత్యాన్ని కొనసాగించాలని భావిం చాడు. ఆయనకు టోరీ పార్టీ నాయకుడు విన్స్టన్ చర్చిల్ వెన్నుదన్నుగా నిలిచాడు. 1947 ఆగస్టు 15 నాటికి నిజాం రాజు తేల్చుకోలేకపోవడంతో భారతప్రభుత్వం మరో రెండు నెలల సమయమిచ్చింది. నాటి కేంద్ర హోంమంత్రి సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ హైదరాబాద్ స్వతంత్రతను ఒప్పుకునే ప్రసక్తే లేదని నిజాంని హెచ్చరించారు. హైదరాబాద్ సంస్థానంలోని ప్రజలపై నిరంకుశ పోకడలను మానుకోవాలని నిజాం రాజును భారత సర్కార్ 1948 సెప్టెంబర్ 7న హెచ్చరించింది. భారతసైన్యం 1948 సెప్టెంబర్ 17న హైదరాబాద్‌లో అడుగుపెట్టడంతో హైదరాబాద్ సంస్థానం ఎట్టకేలకు భారత్‌లో విలీనమైంది. అదేసమయంలో ముస్లిం జనాభా అధికంగా ఉన్న కశ్మీర్ సంస్థానాన్ని రాజా హరిసింగ్ పాలిస్తున్నారు. కశ్మీర్‌పై పాకిస్తాన్ దండెత్తడంతో రాజా హరిసింగ్ కశ్మీర్‌ను భారత్‌లో విలీనం చేసేందుకు ముందుకొచ్చారు. చివరకు కొన్ని షరతులకు లోబడి 1948 అక్టోబర్ 27న కశ్మీర్ భారత్‌లో విలీనం అయ్యింది. -
నాలుగు యుద్ధాలు
1947 పీఓకే జననం ఈ యుద్ధాన్ని మొట్టమొదటి కశ్మీర్ యుద్ధమని కూడా పిలుస్తారు. దేశ విభజనకు ముందు అతి పెద్ద సంస్థానంగా ఉన్న జమ్మూ కశ్మీర్ హిందూ మతానికి చెందిన మహారాజా హరిసింగ్ పాలనలో ఉండేది. 1947 దేశ విభజన సమయంలో సంస్థానాల విలీనాన్ని బ్రిటీష్ పాలకులు వారి ఇష్టానికే వదిలిపెట్టారు. భారత్‌లో కలుస్తారా, పాక్‌లో కలుస్తారా ? లేదంటే స్వతంత్రంగా ఉంటారా అన్నది వారే నిర్ణయించుకోవాలని తెలిపారు. రాజా హరిసింగ్ భారత్‌లో ఎక్కడ కలుస్తారోనన్న ఆందోళనతో పాకిస్తాన్ 1947 అక్టోబర్‌లో కశ్మీర్‌పై దండయాత్ర చేసింది. ఇస్లాం ఆదివాసీలు పాక్ ఆర్మీ అండదండ చూసుకొని కశ్మీర్‌పై దాడికి దిగాయి. దీంతో మహారాజా హరిసింగ్ కశ్మీర్ ప్రాంతాన్ని భారత్‌లో కలుపుతానని ప్రకటించి మన దేశ సైనిక సాయాన్ని అభ్యర్థించారు. ఇరు వర్గాల మధ్య పోరు కొన్నాళ్లు సాగింది. కశ్మీర్లో అత్యధిక భాగాన్ని పాక్ ఆక్రమించుకుంది. అప్పుడే పాక్ ఆక్రమిత కశ్మీర్, వాస్తవాధీన రేఖ ఏర్పడ్డాయి. చివరికి ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి జోక్యంతో కాల్పుల విరమణ ఒప్పందాన్ని ప్రకటించాయి. కశ్మీర్ లోయలో రెండింట మూడు వంతుల భాగం భారత్ కిందకి వచ్చాయి. ఇక పాక్ ఆక్రమించుకున్న ప్రాంతాన్ని ఆజాద్ కశ్మీర్ గిల్జిట్ బల్టిస్తాన్ అని పిలుస్తారు. 1965 పాక్ పలాయనం జమ్మూ కశ్మీర్లో ఉగ్రవాదుల చొరబాటుకు పాక్ 1965లో భారీ కుట్రకు తెరతీసింది. ఆపరేషన్ గిబ్రాల్టర్ పేరుతో భారత్‌లో మారణహోమం సృష్టించడానికి పన్నాగాలు రచించింది. దీంతో భారత్ పశ్చిమ పాకిస్తాన్‌పై పూర్తి స్థాయి యుద్ధాన్ని ప్రకటించింది. మొత్తం 17 రోజుల పాటు సాగిన ఈ యుద్ధంలో ఇరుపక్షాలకు భారీగా ప్రాణ, ఆస్తి నష్టం జరిగింది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అత్యధికంగా యుద్ధట్యాంకులు వినియోగించింది ఈ యుద్ధంలోనే. దీనినే రెండో కశ్మీర్ యుద్ధం అని కూడా పిలుస్తారు. ఈ యుద్ధంలో కొద్ది రోజులకే పాక్ తోక ముడిచింది. పాకిస్తాన్ మీద భారత్ పైచేయి సాధించింది. అదే సమయంలో అమెరికా, రష్యా దౌత్యపరమైన జోక్యంతో యుద్ధం నిలిచిపోయింది. తాష్కెంట్ డిక్లరేషన్ అమల్లోకి వచ్చింది. 1971 బంగ్లా విముక్తి ఈ యుద్ధంలో వాస్తవానికి కశ్మీర్ ప్రమేయం ప్రత్యక్షంగా లేకపోయినా పాక్‌కు అత్యంత నష్టం కలిగించింది, భారత్ కశ్మీర్లో తిరిగి కొంత భాగాన్ని ఆక్రమించుకుంది ఈ యుద్ధంతోనే. పశ్చిమ, తూర్పు పాకిస్తాన్ల మధ్య సంక్షోభం తలెత్తడంతో తూర్పు పాకిస్తాన్ (ప్రస్తుతం బంగ్లాదేశ్) పాలకుడు షేక్ ముజ్బీర్ రెహ్మాన్‌కు అండగా భారత్ నిలబడింది. బంగ్లాదేశ్ విముక్తి కోసం పాక్‌తో యుద్ధం చేసింది. పాక్ ప్రభుత్వ ఆగడాలు భరించలేని బెంగాలీలు బంగ్లాదేశ్ విముక్తి కోసం పోరు బాట పట్టారు. వారికి అండగా నిలిచిన భారత్‌పైకి పాకిస్తాన్ యుద్ధానికి దిగింది. ఎన్నో ప్రాంతాలపై దాడులు మొదలు పెట్టింది. భారత్ ఆర్మీ వాటిని సమర్థవంతంగా తిప్పికొట్టింది. ఆ సమయంలోనే పాక్ అధీనంలో ఉన్న కశ్మీర్లో 5,795 చదరపు మైళ్ల భాగాన్ని మన సైన్యం కైవసం చేసుకుంది. రెండువారాల పాటు ఉ«ధృతమైన పోరాటం తర్వాత బంగ్లాదేశ్ విముక్తి జరిగింది. ఆ తర్వాత కుదుర్చుకున్న లాహోర్ ఒప్పందంలో భాగంగా భారత్ కశ్మీర్లో తాను సొంతం చేసుకున్న భాగాన్ని పాక్‌కు తిరిగి ఇచ్చేసింది. ఇరు దేశాల మధ్య సుహృద్భావ వాతావరణం ఉండాలని, కశ్మీర్లో శాంతి నెలకొల్పాలనే భారత్ ఆ నిర్ణయం తీసుకుంది. 1999 కార్గిల్ చొరబాటు 1999 మొదట్లో పాకిస్తాన్ దళాలు వాస్తవాధీన రేఖ వెంబడి కశ్మీర్లోకి చొచ్చుకువచ్చాయి. కార్గిల్ జిల్లాలో అత్యధిక భాగాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. పాక్ చొరబాట్లను అడ్డుకోవడానికి ఈసారి పెద్ద ఎత్తున మిలటరీ చర్యకి భారత్ దిగింది. రెండు నెలల పాటు ఇరు దేశాల మధ్య పోరు సాగింది. పాక్ ఆక్రమించుకున్న ప్రాంతాలన్నింటినీ భారత్ మిలటరీ తిరిగి తన అధీనంలోకి తెచ్చుకోవడం మొదలు పెట్టింది. పాక్ ఆక్రమించుకున్న ప్రాంతంలో 75 నుంచి 80శాతం వరకు తిరిగి భారత్ అధీనంలోకి వచ్చేశాయి. ఇరు దేశాల మధ్య యుద్ధ తీవ్రత ఎక్కువైపోతూ ఉండడంతో పాకిస్తాన్‌ను వెనక్కి తగ్గమంటూ అమెరికా దౌత్యపరమైన ఒత్తిడిని పెంచింది. అప్పటికే పాక్ సైనికుల్లో నైతిక స్థైర్యం దెబ్బతింది. 4 వేల మంది వరకు సైనికులు ప్రాణాలు కోల్పోయారు. ఆర్థికంగా కూడా ఆ దేశం బలహీనపడిపోయింది. భారీ పరాజయాన్ని మూటగట్టుకున్న పాక్ యుద్ధాన్ని నిలిపివేసింది. అలా కార్గిల్ యుద్ధంతో భారత్ అతి పెద్ద విజయాన్ని నమోదు చేసుకుంది. -
కేంద్ర పాలిత ప్రాంతాలుగా జమ్మూకశ్మీర్, లదాఖ్
ఇప్పటివరకు ఇకపై రాష్ట్రాలు 29 28 కేంద్రపాలిత ప్రాంతాలు 7 9 న్యూఢిల్లీ: ఆర్టికల్ 370 రద్దుతో జమ్మూ కశ్మీర్‌ను భారత్‌లో విలీనం చేయాలని కేంద్రం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్రాల విభజన తర్వాత భారతదేశంలో వైశాల్యపరంగా అతి పెద్ద కేంద్ర పాలిత ప్రాంతంగా (యూటీ) జమ్మూ కశ్మీర్ నిలవనుంది. దీని తర్వాతి స్థానంలో లదాఖ్ ఉండనుంది. కశ్మీర్‌ను రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించాలన్న కేంద్రం నిర్ణయాన్ని పీడీపీ, నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీలు తీవ్రంగా వ్యతిరేకించాయి. లదాఖ్‌ను యూటీ చేయడాన్ని ఆ ప్రాంతంలో నివసించే కొన్ని వర్గాల ప్రజలు మాత్రం స్వాగతిస్తున్నారు. కొత్తగా ఏర్పడిన జమ్మూ కశ్మీర్, లదాఖ్‌లతో కలిపి భారత్‌లో యూటీల సంఖ్య తొమ్మిదికి చేరింది. జమ్మూ కశ్మీర్, లదాఖ్, ఢిల్లీ, పుదుచ్చేరి, డమన్ అండ్ డయ్యూ, దాద్రా నగర్ హవేలీ, ఛండీగర్, లక్షద్వీప్, అండమాన్ నికోబార్ దీవులు ప్రస్తుతం యూటీలుగా ఉన్నాయి. వీటిలో ఢిల్లీ, పుదుచ్చేరీలకు శాసనసభలు ఉండగా.. తాజాగా వీటికి జమ్మూ కశ్మీర్ జతచేరింది. శాసనసభలు ఉన్న యూటీలకు లెఫ్టినెంట్ గవర్నర్లు ఉంటారు. ఛండీగఢ్, దాద్రా నగర్ హవేలీ, డమన్ అండ్ డయ్యూ, లక్షద్వీప్, లదాఖ్, అండమాన్ నికోబార్ దీవులను కేంద్రం పాలించనుంది. యూటీల నుంచి పార్లమెంట్‌కు ఎంపికయ్యే వారి సంఖ్య మారుతుంటుంది. ఢిల్లీ నుంచి ఏడుగురు ఎంపీలు పార్లమెంట్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 107 అసెంబ్లీ స్థానాలు: ‘జమ్మూ కశ్మీర్ పునర్విభజన బిల్లు–2019’ప్రకారం జమ్మూ కశ్మీర్ శాసనసభకు 107 స్థానాలు ఉండనున్నాయి. పునర్విభజన తర్వాత మరో 7 స్థానాలు పెరిగి 114కు చేరే అవకాశం ఉంది. ‘370’లు ఇంకా ఉన్నాయి! ఈశాన్య రాష్ట్రాలకు ఎక్కువగా వర్తించే ఆర్టికల్ –371 ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. చాలా రాష్ట్రాలకు ఈ ఆర్టికల్ ప్రత్యేక సదుపాయాలు కల్పిస్తోంది. ఆర్టికల్ –371ఏ నాగాలాండ్ హక్కులకు సంబంధించినది. నాగా ఆచార చట్టం ప్రకారం పౌర, నేర న్యాయపాలన నిర్ణయాలకు సంబంధించి, భూ యాజమాన్యం, బదలాయింపునకు సంబంధించి నాగా అసెంబ్లీ ఆమోదించకుండా పార్లమెంట్ చేసే చట్టాలేవీ నాగాలకు వర్తించవు. ఆర్టికల్ –371ఏ లాంటిదే మిజోరంనకు సంబంధించిన ఆర్టికల్ –371జి. అస్సాంకు ఆర్టికల్ –371బి ప్రత్యేక సదుపాయాలు కల్పిస్తోంది. ఇక ఆర్టికల్ –371సి మణిపూర్‌కు, ఆర్టికల్ –371ఎఫ్ సిక్కింకు, ఆర్టికల్ –371హెచ్ అరుణాచల్ ప్రదేశ్‌కు ప్రత్యేక సదుపాయాలు కల్పిస్తాయి. -
కశ్మీర్ పిక్చర్లో నాయక్ – ఖల్నాయక్
రావణ కాష్టంలా మండుతూనే ఉన్న కశ్మీర్ సమస్యకు...ఆర్టికల్ 370 రద్దు పరిష్కారం అవుతుందా ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాల్సింది కాలమే..! అయితే 1949లో మొదలైన ఈ సమస్యలో కీలక పాత్ర ధారులు ఎవరు? ఆద్యుడు... రాజా హరిసింగ్! కశ్మీర్ సమస్యకు మూల పురుషుడు.. జమ్మూ కశ్మీర్ రాజ్యానికి చిట్టచివరి రాజు. 1895 సెప్టెంబరు 23న జమ్మూలోని అమర్ మహల్లో జన్మించిన రాజా హరిసింగ్... 1909లో తండ్రి రాజా అమర్ సింగ్ జమ్వాల్ మరణం తరువాత బ్రిటిష్ పాలకుల కనుసన్నల్లో విద్యాభ్యాసం పూర్తి చేశారు. అజ్మీర్‌లోని మేయో కాలేజీలో చదువు పూర్తయిన తరువాత డెహ్రాడూన్‌లోని ఇంపీరియల్ కేడెట్ కారŠప్స్‌లో మిలటరీ శిక్షణ పొందిన హరిసింగ్‌ను బాబాయి మహారాజా ప్రతాప్ సింగ్ 1915లో జమ్మూ కశ్మీర్ సైనికాధికారిగా నియమించారు. 1925లో గద్దెనెక్కిన రాజా హరిసింగ్.. తన రాజ్యంలో నిర్బంధ ప్రాథమిక విద్యను అమలు చేశారు. బాల్యవివాహాలను రద్దు చేయడమే కాకుండా సమాజంలోని అన్ని వర్గాల వారికీ పూజా మందిరాలు అందుబాటులో ఉండేలా చట్టాలు చేశారు. రాజకీయంగా తొలి నుంచి కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా వ్యవహరించిన హరిసింగ్... మత విద్వేషాలను రెచ్చగొడుతుందని ముస్లింలీగ్, దాని సభ్యులనూ పూర్తిగా వ్యతిరేకించారు. పష్తూన్ల దాడుల్లో కోల్పోయిన రాజ్యాన్ని మళ్లీ దక్కించుకునేందుకు భారత ప్రభుత్వంతో చేతులు కలిపిన హరిసింగ్ తన చివరి రోజులను ముంబైలో గడిపారు. 1961 ఏప్రిల్ 26న హరిసింగ్ మరణించగా వీలునామా ప్రకారం.. ఆయన అస్థికలను జమ్మూ ప్రాంతం మొత్తం చల్లడంతోపాటు తావీ నదిలో నిమజ్జనం చేశారు. తొలి నేత... షేక్ అబ్దుల్లా... కశ్మీరీల సమస్యలన్నింటికీ భూస్వామ్య వ్యవస్థ కారణమని నమ్మిన.. ప్రజాస్వామ్య వ్యవస్థతోనే అభివృద్ధి సాధ్యమని చెప్పిన కశ్మీరీ నేత షేక్ అబ్దుల్లా. జమ్మూ కాశ్మీర్ చివరి రాజు రాజా హరిసింగ్, భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూలకు మిత్రుడిగా మాత్రమే కాకుండా.. ఆ ప్రాంతంలో తొలి రాజకీయ పార్టీని స్థాపించిన వ్యక్తిగానూ షేక్ అబ్దుల్లాకు పేరుంది. అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీలో విద్యనభ్యసించిన షేక్ అబ్దుల్లా 1932లో కశ్మీర్ ముస్లిం కాన్ఫరెన్స్‌ను స్థాపించారు. తరువాతి కాలంలో ఈ పార్టీ నేషనల్ కాన్ఫరెన్స్‌గా మారింది. 1932 సమయంలోనే జమ్మూ కశ్మీర్‌కు ఒక అసెంబ్లీ ఏర్పాటైనప్పటికీ అధికారం మాత్రం రాజా హరిసింగ్ చేతుల్లోనే ఉండేది. రాజరికం తొలగిపోయిన తరువాత మూడుసార్లు ప్రభుత్వాన్ని నడిపిన అబ్దుల్లాను షేర్ –ఏ– కశ్మీర్‌గా పిలుస్తారు. కశ్మీర్ నుంచి రాజా హరిసింగ్ తొలగాలన్న డిమాండ్‌తో ఉద్యమం నడిపిన చరిత్ర కూడా ఈయనదే. 1953లో రాజ్యానికి వ్యతిరేకంగా కుట్ర పన్నాడన్న ఆరోపణలతో అబ్దుల్లాను 11 ఏళ్లపాటు జైల్లో పెట్టారు. ఆ తరువాత 1975లో భారత ప్రధాని ఇందిరాగాంధీతో కుదిరిన ఒప్పందంతో జమ్మూ కశ్మీర్ ముఖ్యమంత్రిగా తిరిగి రాజకీయాల్లోకి వచ్చారు ఆయన. 1964లో కశ్మీర్ సమస్యకు పరిష్కారం కనుక్కోవాలన్న లక్ష్యంతో పాకిస్తాన్‌కు వెళ్లిన అబ్దుల్లా అప్పటి ప్రధానితో చర్చలు జరిపారు. తొలి, చివరి ప్రెసిడెంట్... రాజా కరణ్ సింగ్... దేశంలో రాజభరణాలు, బిరుదులన్నింటినీ రద్దు చేసిన ఇందిరాగాంధీ మంత్రివర్గంలో మంత్రిగా పనిచేసిన వ్యక్తి రాజా కరణ్‌సింగ్. 1931 మార్చి తొమ్మిదిన ఫ్రాన్స్‌లోని కెయిన్స్‌లో జన్మించిన కరణ్‌సింగ్.. జమ్మూ కశ్మీర్ చివరి రాజు రాజా హరిసింగ్ ఏకైక సంతానం. కవిగా, దాతగా మాత్రమే కాకుండా.. ప్రచ్ఛన్న యుద్ధ పరిసమాప్తి సమయంలో అమెరికాలో భారత రాయబారిగానూ పనిచేసిన ఘనత ఈయనది. 1949 అక్టోబరులో కశ్మీర్ రాజ్యం భారత ప్రభుత్వంలో విలీనమైన రోజు నుంచి 18 ఏళ్ల వయసులోనే జమ్మూకశ్మీర్ ప్రతినిధిగా నియమితుడైన కరణ్ సింగ్.. తరువాతి కాలంలో రాష్ట్ర తొలి, చివరి అధ్యక్షుడిగా, గవర్నర్‌గానూ వ్యవహరించారు. ఈ కాలంలోనే జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక హక్కులు కల్పిస్తూ భారత రాష్ట్రపతి పేరుతో అనేక ఉత్తర్వులు వెలువడ్డాయి. 1961 నుంచి తనకు అందుబాటులో ఉన్న రాజభరణాన్ని 1973లో స్వయంగా త్యజించిన వ్యక్తిగా కరణ్‌సింగ్‌కు పేరుంది. 1967–73 మధ్యకాలంలో కేంద్ర పర్యాటక, పౌర విమానయాన శాఖల మంత్రిగా పనిచేశారు. 1984 వరకూ పలు దఫాలు లోక్‌సభకు ఎన్నికైన కరణ్‌సింగ్ వైద్య ఆరోగ్యం, విద్య, సాంస్కృతిక శాఖల మంత్రిగా పనిచేశారు. 1971 పాకిస్తాన్ యుద్ధం సమయంలో తూర్పు దేశాలకు భారత ఉద్దేశాలను వివరించే దూతగానూ పనిచేశారు. 1999 వరకూ నేషనల్ కాన్ఫరెన్స్ తరఫున, ఆ తరువాత 2018 వరకూ కాంగ్రెస్ తరఫున రాజ్యసభ ఎంపీగా కొనసాగారు. అతివాది... యాసిన్ మాలిక్... జమ్మూకశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్ అనే వేర్పాటువాద సంస్థ స్థాపకుడు యాసిన్ మాలిక్. భారత్, పాకిస్తాన్ రెండింటి నుంచి కశ్మీర్ వేరుపడాలన్నది ఈయన సిద్ధాంతం. 1966లో శ్రీనగర్‌లో జన్మించిన యాసిన్ తన సిద్ధాంతం కోసం తుపాకులు పట్టాడు కూడా. అయితే 1994 తరువాత ఈయన తీవ్రవాదాన్ని విడిచిపెట్టడమే కాకుండా... శాంతియుత మార్గాల ద్వారా మాత్రమే కశ్మీర్ సమస్యకు పరిష్కారం లభిస్తుందని ప్రచారం చేశారు. 1987 అసెంబ్లీ ఎన్నికల్లో ఇస్లామిక్ స్టూడెంట్స్ లీగ్ అధ్యక్షుడిగా యాసిన్ మాలిక్ ముస్లిం యునైటెడ్ ఫ్రంట్‌కు ప్రచారం చేశారు. నేషనల్ కాన్ఫరెన్స్ కండబలాన్ని ఎదుర్కొనేందుకు మాలిక్ ఉపయోగపడ్డారని విశ్లేషకులు అంటారు. ఈ ఎన్నికల్లో అధికార పార్టీ రిగ్గింగ్‌కు పాల్పడటమే కశ్మీర్లో చొరబాట్ల సమస్యకు కారణమైందన్న విశ్లేషకుల అంచనాలను అంగీకరించని మాలిక్ రిగ్గింగ్ అంతకుమునుపు కూడా ఉందని అంటారు. 2007లో సఫర్ ఏ ఆజాదీ పేరుతో కొత్త సంస్థను ఏర్పాటు చేసిన యాసిన్ మాలిక్ కశ్మీర్ సమస్య పరిష్కారం పేరుతో తరచూ పాకిస్తాన్ ప్రధానితో సమావేశం కావడం, చర్చలు జరపడం భారతీయుల్లో ఆయన పట్ల తీవ్ర వ్యతిరేకతకు కారణమైంది. 2013లో పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థ లష్కరే తయ్యబా అధ్యక్షుడు హఫీజ్ సయీద్‌తో కలిసి యాసిన్ మాలిక్ ఒక నిరసన కార్యక్రమంలో పాల్గొనడం దేశంలో తీవ్ర చర్చకు దారితీసింది. స్వతంత్రవాది ఒమర్ ఫారూఖ్... జమ్మూకశ్మీర్‌పై భిన్నాభిప్రాయం కలిగినవారిలో మిర్వాయిజ్ ఒమర్ ఫారూఖ్ ఒకరు. జమ్మూ కాశ్మీర్ భారత్ నుంచి వేరు పడాలని, స్వతంత్రంగా ఉండాలన్న భావజాలం కలిగిన హురియత్ కాన్ఫరెన్స్ సభ్యత్వమున్న పార్టీల్లో మిర్వాయిజ్ పార్టీ అవామీ యాక్షన్ కమిటీ కూడా ఒకటి. 2003లో హురియత్ కాన్ఫరెన్స్ రెండుగా చీలిపోగా మిర్వాయిజ్ నేతృత్వంలోని వర్గానికి మితవాద వర్గమని పేరు. కశ్మీర్ రాజకీయాల్లోకి రాకమునుపు సాఫ్ట్వేర్ ఇంజినీర్ కావాలనుకన్న మిర్వాయిజ్ ఆ తరువాతి కాలంలో ఇస్లామిక్ స్టడీస్‌లో స్నాతకోత్తర విద్యతోపాటు పీహెచ్డీ కూడా చేశారు. జమ్మూ కశ్మీర్లో తొలి రాజకీయ పార్టీగా గుర్తింపు పొందిన ముస్లిం కాన్ఫరెన్స్ తొలి అధ్యక్షుడు మిర్వాయిజ్ తాత. కశ్మీర్ సమస్యను అంతర్జాతీయ వేదికల్లో తరచూ లేవనెత్తే మిర్వాయిజ్ భారత్, పాకిస్థాన్‌ల మధ్య చర్చల ద్వారా మాత్రమే సమస్య పరిష్కారం అవుతుం దని నమ్మేవారిలో ఒకరు. అయితే ఇరుపక్షాలు ప్రజల ఆశయాలను కూడా అర్థం చేసుకోవాలని అంటారాయన. ఉగ్రవాదానికి బీజం... గిలానీ... కశ్మీర్ సమస్యకు బీజం పడిన సమయం నుంచి జీవించి ఉన్న అతికొద్ది మంది రాజకీయ నేతల్లో సయ్యద్ అలీ షా గిలానీ ఒకరు. 1929 సెప్టెంబరు 29న బండిపొరలో జన్మించిన గిలానీ వేర్పాటువాద సంస్థ హురియత్ కాన్ఫరెన్స్‌కు అధ్యక్షుడిగా చాలాకాలం పనిచేశారు. కశ్మీర్లో ఉగ్రవాదానికి బీజం పడింది గిలానీ విధానాల కారణంగానే అని కొంతమంది నేతలు ఆరోపిస్తారు. హురియత్ కాన్ఫరెన్స్ రెండు భాగాలుగా విడిపోయిన తరువాత తెహ్రీక్ ఏ హురియత్ పేరుతో మరో పార్టీని స్థాపించిన గిలానీ ఉగ్రవాదుల మరణాలకు నిరసనగా తరచూ కశ్మీర్లో బంద్‌లు, రాస్తారోకోలకు పిలుపునిచ్చేవారు కశ్మీర్ సమస్యకు స్వాతంత్య్రం ఒక్కటే పరిష్కారమన్న అంశంపై ఒక సదస్సు నిర్వహించినందుకుగాను.. .2010లో భారత ప్రభుత్వం గిలానీతోపాటు రచయిత్రి అరుంధతీ రాయ్, మావోయిస్టు సానుభూతిపరుడు వరవర రావులపై భారత ప్రభుత్వం దేశద్రోహం కేసు నమోదు చేసింది. 2016లో బుర్హాన్ వానీ మరణం తరువాత ఏర్పడ్డ పరిస్థితుల్లో కశ్మీర్లో సాధారణ స్థితిని తీసుకొచ్చేందుకని గిలానీ ఐక్యరాజ్య సమితికి లేఖ రాశారు. భారత వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలపై గిలానీ పాస్‌పోర్టును 1981లోనే రద్దు చేశారు. అయితే 2006లో మూత్రనాళ కేన్సర్ బారిన పడినట్లు నిర్ధారణ కావడంతో చికిత్స కోసం అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ గిలానీకి మళ్లీ పాస్‌పోర్టు దక్కేలా చేశారు. -
ఆవిర్భావం నుంచి రద్దు వరకు..
ఆవిర్భావం నుంచి కశ్మీర్ సమస్యలకు, వివాదాలకు నిలయంగా మారింది. నాటి నుంచి కశ్మీర్ ప్రత్యేక హోదా రద్దు వరకు పరిణామాలు... ► 1846: ఆంగ్లేయులకు సిక్కులకు మధ్య జరిగిన మొదటి యుద్ధం దరిమిలా జమ్మూ పాలకుడు రాజా గులాబ్ సింగ్‌కు బ్రిటిష్ ఈస్టిండియా కంపెనీకి మధ్య కుదిరిన ఒప్పందం (అమృతసర్ ఒప్పందం) మేరకు మార్చి 16న జమ్మూకశ్మీర్ స్వతంత్ర రాజ్యంగా ఆవిర్భవించింది. ► 1946, మే: మహారాజుకు వ్యతిరేకంగా షేక్ అబ్దుల్లా క్విట్ కశ్మీర్ ఉద్యమాన్ని ప్రారంభించారు. అరెస్టయిన అబ్దుల్లాను కాపాడేందుకు నెహ్రూ విఫలయత్నం చేశారు. ► 1946, జులై: బయటివారి ప్రమేయం అవసరం లేకుండా కశ్మీరీలు తమ భవిష్యత్తును తామే నిర్ణయించుకుంటారని రాజా హరిసింగ్ ప్రకటించారు. ► 1947, జూన్3: భారత దేశాన్ని భారత్, పాకిస్తాన్‌లుగా విభజించాలని మౌంట్ బాటెన్ ప్రతిపాదించారు ► 1947, జూన్19: కశ్మీర్‌ను భారత్‌లోనో లేదా పాకిస్తాన్లోనో విలీనం చేసేలా హరిసింగ్‌ను ఒప్పించడం కోసం మౌంట్‌బాటెన్ ఐదు రోజులు కశ్మీర్లో ఉన్నారు ► 1947, జులై: సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ ఆహ్వానం మేరకు రాజా హరిసింగ్ ఢిల్లీ వచ్చి గోపాల్ దాస్‌తో చర్చలు జరిపారు. ► 1947, జులై 11: కశ్మీర్ స్వతంత్రం కోరుకుంటే పాకిస్తాన్ దానితో స్నేహం చేస్తుందని మహ్మద్ అలీ జిన్నా ప్రకటించారు ► 1947, ఆగస్టు1: మహాత్మాగాంధీ హరిసింగ్‌ను కలిసి ప్రజాభీష్టం మేరకు విలీనంపై నిర్ణయం తీసుకోవాలని కోరారు. ► 1947, సెప్టెంబర్22: పాకిస్తాన్లో విలీనానికి సానుకూలత తెలుపుతూ ముస్లిం కాన్ఫరెన్స్ నిర్ణయం తీసుకుంది.అయితే, భారత్‌లో విలీనం కావాలని మహారాజు నిర్ణయించారని పాకిస్తాన్ టైమ్స్ పేర్కొంది. ► 1947, అక్టోబర్: భారత్–పాక్ యుద్ధం. పాక్ వాయవ్య రాష్ట్రానికి చెందిన వేల మంది గిరిజనులు కశ్మీర్‌పై, రాజ హరిసింగ్ సైన్యంపై దాడికి దిగారు. హరిసింగ్ భారత్ సహాయం కోరారు. దానికి భారత్ పెట్టిన షరతుకు హరిసింగ్ అంగీకరించారు. ఇరు పక్షాలు విలీన ఒప్పందంపై సంతకం చేశాయి.భారత సైన్యం కశ్మీర్‌ను రక్షించింది. కశ్మీర్ విషయమై జరిగిన మొదటి యుద్ధమిది. ► 1948: కశ్మీర్ సమస్యను భారత దేశం ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి ముందుకు తీసుకెళ్లింది.కాల్పుల విరమణ, కశ్మీర్ భవిష్యత్తుపై ప్రజాభిప్రాయ సేకరణ వంటి అంశాలతో తీర్మానం కుదిరింది. ► 1949, జనవరి1: భారత్,పాక్ మధ్య కాల్పుల విరమణ జరిగింది. కశ్మీర్లో కొంత భాగం పాక్‌కు వెళ్లిపోయింది. ► 1949: జమ్మూకశ్మీర్‌ను భారత్‌లో భాగం చేయాలంటూ కశ్మీర్ అసెంబ్లీ ఉద్యమం చేపట్టింది. ► 1949, జూన్: మమారాజా హరిసింగ్ తన కుమారుడు కరణ్ సింగ్‌ను రాజప్రతినిధిగా నియమించి తాను వైదొలిగారు. ► 1949, అక్టోబరు 17: కశ్మీర్‌కు ప్రత్యేక హోదా కల్పిస్తూ రాజ్యాంగసభ రాజ్యంగంలో 370 అధికరణను చేర్చింది. ► 1951, నవంబర్: రాజా హరిసింగ్ అధికారాలను రద్దు చేస్తూ, శాసన సభను ప్రభుత్వానికి జవాబుదారీ చేస్తూ రాజ్యాంగ సభ చట్టం చేసింది. ► 1957: జమ్మూకశ్మీర్ భారత్‌లో భాగమని, ఈ విషయమై ప్రజాభిప్రాయ సేకరణ జరిపే ప్రసక్తే లేదని భారత హోం మంత్రి గోవింద్ వల్లభ్ పంత్ స్పష్టం చేశారు. ► 1965: కశ్మీర్ విషయమై భారత్, పాక్ మళ్లీ తలపడ్డాయి. ► 1966, జనవరి 10: రష్యా మధ్యవర్తిత్వంలో ఇరు దేశాలు 1965కు ముందున్న స్థానాలకు వెళ్లిపోవాలంటూ రూపొందించిన తాష్కెంట్ ఒప్పందంపై భారత్, పాక్‌లు సంతకాలు చేశాయి. ► 1989: అఫ్గానిస్తాన్ నుంచి వేలమంది మిలిటెంట్లు కశ్మీర్లోకి ప్రవేశించారు. పాకిస్తాన్ వారికి అవసరమైన శిక్షణ, ఆయుధాలు అందజేసింది ► 1989: కశ్మీర్ నుంచి పెద్ద సంఖ్యలో హిందువులు (కశ్మీరీ పండిట్లు) ఇతర ప్రాంతాలకు వలసపోసాగారు. ► 1972: భారత్, పాకిస్తాన్ల మధ్య సిమ్లా ఒప్పందం కుదిరింది. దీనికి అనుగుణంగా పాక్ ఆక్రమిత కశ్మీర్, కశ్మీర్‌ల మధ్య నియంత్రణ రేఖ(ఎల్వోసీ) రూపుదిద్దుకుంది. ► 1999: పాకిస్తాన్ మద్దతుతో మిలిటెంట్లు కశ్మీర్ సరిహద్దు దాటి కార్గిల్‌లో భారత సైనిక స్థావరాలను చట్టుముట్టారు. పది వారాల పాటు జరిగిన యుద్ధంలో భారత బలగాలను దురాక్రమణదారులను తిప్పికొట్టాయి. ► 2013, ఫిబ్రవరి: భారత పార్లమెంటుపై దాడి కేసులో జైషే మహ్మద్ నేత అఫ్జల్ గురును ప్రభుత్వం ఉరితీసింది. ► 2015, మార్చి: భారతీయ జనతాపార్టీ మొదటి సారి కశ్మీర్లో పీడీపీతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ► 2016: భారత సైనిక స్థావరాలపై జరిగిన ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైన్యం పాక్ ఆక్రమిత కశ్మీర్‌పై సర్జికల్ స్ట్రైక్స్ జరిపింది ► 2019: పుల్వామా వద్ద ఉగ్రవాదులు జరిపిన దాడిలో40 మంది భారత సైనికులు అమరులయ్యారు.దానికి ప్రతిగా భారత్ పాకిస్తాన్‌లోని బాలాకోట్‌పై మెరుపుదాడులు జరిపింది. ► 2019, ఆగస్టు2: ప్రభుత్వం అమర్నాథ్ యాత్రను రద్దు చేసింది. యాత్రికులు స్వస్థలాలకు వెళ్లిపోవాలని ఆదేశం. ► 2019, ఆగస్టు 3: కశ్మీర్‌లోని పర్యాటకులు, యాత్రికులు, ఇతర రాష్ట్రాల విద్యార్థులను స్వస్థలాలకు తరలించారు. ► 2019, ఆగస్టు 4: మెహబూబా ముఫ్తి, ఒమర్ అబ్దుల్లాలను గృహ నిర్బంధం చేశారు. కేంద్ర హోం మంత్రి అమిత్‌షా జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ తదితన ఉన్నత భద్రతాధికారులతో చర్చలు జరిపారు. ► 2019, ఆగస్టు 5: కశ్మీర్‌కు ప్రత్యేక హోదానిస్తున్న 370 అధికరణను కేంద్రం రద్దు చేసింది. -
ప్రపంచ మీడియాకు హెడ్‌లైన్స్
న్యూఢిల్లీ: జమ్మూ కశ్మీర్‌కు స్వతంత్ర ప్రతిపత్తి కల్పిస్తున్న ఆర్టికల్ 370 రద్దు నిర్ణయం తీసుకున్న నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వాన్ని భారత మీడియా ఆకాశానికెత్తేస్తూ సోమవారం రోజంతా ప్రత్యేక కథనాలు ప్రసారం చేసింది. ఆర్టికల్ 370 రద్దుతో పరోక్షంగా ప్రభావం పడే పాకిస్తాన్ మీడియా మోదీ ప్రభుత్వ నిర్ణయంపై వ్యతిరేక కథనాలు వండి వారుస్తోంది. ఈ అంశంపై ప్రపంచ మీడియా సంస్థలు ఎలా రిపోర్ట్ చేశాయో ఓసారి చూద్దాం. ది గార్డియన్: జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక హోదా కల్పిస్తోన్న ఆర్టికల్ 370ని తొలగించడానికి ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని భారత ప్రభుత్వం తీవ్రమైన నిర్ణయం తీసుకుందని లండన్ కేంద్రంగా పనిచేస్తున్న ది గార్డియన్ వెల్లడించింది. జమ్మూ కశ్మీర్‌ను విభజించాలన్న నిర్ణయం కూడా నాటకీయ మైన ఎత్తుగడ అని తెలిపింది. ఈ నిర్ణయం తో పాకిస్తాన్ వల్ల ఉద్రిక్తతలు పెరిగే అవకాశం ఉందంది. బీబీసీ: జమ్మూ కశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు చేయాలన్న భారత ప్రభుత్వ నిర్ణయం అత్యంత ముఖ్యమైన చర్యగా ప్రముఖ వార్తా సంస్థ బీబీసీ అభివర్ణించింది. అయితే ఈ నిర్ణయం వల్ల ఉద్రిక్తతలు రాజేసే అవకాశం ఉందంది. సీఎన్ఎన్: ఆర్టికల్ 370ని రద్దు చేయాలన్న భారత ప్రభుత్వ చర్య కశ్మీరీలకు మానసికంగా పెద్ద షాక్ కలిగించిందని అమెరికా కేంద్రంగా పనిచేస్తున్న సీఎన్ఎన్ సంస్థ పేర్కొంది. భారత్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో ఆ రాష్ట్రం పూర్తిగా స్తంభించిపోయిందని తెలిపింది. ది వాషింగ్టన్ పోస్ట్: ‘కలహాలకు కొత్త వేదిక’అంటూ భారత ప్రభుత్వ ఆర్టికల్ 370 రద్దు నిర్ణయాన్ని వాషింగ్టన్ పోస్ట్ రిపోర్ట్ చేసింది. భారత్‌లో కశ్మీర్ విలీనమవ్వడానికి ఆర్టికల్ 370 మూలమైందని పేర్కొంది. -
సైన్యం.. అప్రమత్తం
న్యూఢిల్లీ: జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేయడంతో పాకిస్తాన్ దాడులు నిర్వహించే అవకాశం ఉందని భావించిన కేంద్రం, పీఓకేలో భారీగా సైన్యాన్ని మోహరించింది. పాక్ నుంచి వచ్చే ఏ ప్రతిచర్యనైనా తిప్పికొట్టడానికి సైన్యం సిద్ధంగా ఉందని సైనికవర్గాలు తెలిపాయి. ఆర్మీ ప్రధానాధికారులంతా జమ్మూ కశ్మీర్లో జరుగుతున్న పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్నారు. కశ్మీర్ లోయలో పాక్ హింసకు, ఐఈడీ పేలుళ్లకు పాల్పడే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. అయితే ఏ సమయంలోనూ పరిస్థితిని చేజారనివ్వమని ఓ సీనియర్ మిలిటరీ అధికారి తెలిపారు. 2016లో హిజ్బుల్ ముజాహిద్దీన్ నాయకుడు బుర్హాన్ వానిని హతం చేసినపుడు కశ్మీర్‌లోయలో దాదాపు నాలుగు నెలలకుపైనే అస్థిరత నెలకొంది. అలాంటి పరిస్థితులు మళ్లీ ఏర్పడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు ఆ అధికారి వెల్లడించారు. వైమానిక దళం కూడా అక్కడే ఉంటూ పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తోంది. వారిని అదుపు చేయాలి: కేంద్రం జమ్మూ కశ్మీర్‌కు సంబంధించిన ఆర్టికల్ 370 రద్దు నేపథ్యంలో భద్రతా దళాలను మరింత అప్రమత్తతో ఉంచాల్సిందిగా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్ర ప్రభుత్వం సూచించింది. ఈ మేరకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సోమవారం ఒక ప్రకటన విడుదల చేసింది. ‘జాతీయ ప్రయోజనాలు, దేశ భద్రతను బలోపేతం చేయడానికి కేంద్ర కేబినెట్ ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంది. ఈ నేపథ్యంలో సామాన్య ప్రజలకు ఇబ్బంది కలిగించేలా సాంఘిక వ్యతిరేక శక్తులు రెచ్చిపోయే ప్రమాదం ఉంది. వాటిని అదుపు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా మత పరమైన సున్నిత ప్రాంతాల్లో మరింత అప్రమత్తంగా ఉండాలి.’ అని పేర్కొంది. -
ముసురుకున్న సందేహాలు
న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్‌ను పునర్విభజిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చట్టబద్ధతపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఆర్టికల్ –370ను రద్దు చేయడం జమ్మూకశ్మీర్‌ను భారత్‌లో విలీనం చేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని సాంకేతికంగా సవరిస్తుందనే విమర్శలు ఎదురవుతున్నాయి. ఇవీ చిక్కులు ► ఆర్టికల్ 370 (3) ప్రకారం రాష్ట్రపతి ఉత్తర్వులపై ‘రాజ్యాం గబద్ధమైన అసెంబ్లీ (కాన్‌స్టిట్యుయంట్ అసెంబ్లీ)’ సలహా తీసు కోవాల్సి ఉంటుంది. రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారా దీన్ని ‘శాసనసభ (లెజిస్లేటివ్ అసెంబ్లీ)’గా సవరించారు. ప్రస్తుతం జమ్మూకశ్మీర్‌లో శాసనసభ లేనందున ఆ అధికారాలు గవర్నర్‌కు దఖలు పడ్డాయి. గవర్నర్ సూచనల మేరకే ఆర్టికల్ –370ను రద్దు చేశారు. అయితే, ఇది చెల్లదని కొందరు నిపుణులు వాదిస్తున్నారు. రాష్ట్రపతి ఉత్తర్వులకు ‘ముందు’ రాజ్యాంగబద్ధమైన అసెంబ్లీ నుంచి ఏకాభ్రిపాయం సేకరించాలని ఆర్టికల్ 370 (3)పేర్కొంటోంది. ► శాసనసభ ఎన్నికైన ప్రజాప్రతినిధులతో కూడుకున్నది కాగా గవర్నర్ కేంద్రం ప్రతినిధిగా నియమితులవుతారు. ఎన్నికైన ప్రజాప్రతినిధుల స్థానంలో గవర్నర్ సూచనల ఆధారంగా ఆర్టికల్ –370ను రద్దు చేయవచ్చా? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ► మరోవైపు ఆర్టికల్ –370 తాత్కాలికం కాదని 2016లో ఎస్బీఐ వర్సెస్ సంతోష్ గుప్తా కేసులో సుప్రీంకోర్టు ఉత్తర్వులు పేర్కొంటున్నాయి. రాజ్యాంగ బద్ధమైన అసెంబ్లీ సూచనలు చేసే వరకు అది ‘పర్మినెంటే’ అని చెబుతోంది. జమ్మూకశ్మీర్ అసెంబ్లీ నుంచి అలాంటి సూచనలు ఏవీ రాలేదు. ► రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని సవరించడం, మార్చడం చెల్లదని పలు తీర్పుల్లో సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఆర్టికల్ –370 అందులో భాగమేనా? దాన్ని మార్చవచ్చా? ► ఆర్టికల్ –370 రద్దు భారత్‌లో జమ్మూకశ్మీర్ విలీనాన్ని సాంకేతికంగా సవరిస్తుంది. అంతర్జాతీయంగా అభ్యంతరం ► ఐరాస భద్రతా మండలి 47వ తీర్మానం ప్రజాభిప్రాయ సేకరణ ద్వారా కశ్మీర్ ప్రజలకు స్వయం నిర్ణయాధికార హక్కు కల్పించింది. ఆర్టికల్ –370 రద్దు, స్వయం ప్రతిపత్తిని తొలగించడం ఐరాస భద్రతా మండలి తీర్మానం ఉల్లంఘనగా మారే అవకాశం ఉంది. -
ఆర్టికల్ 370 రద్దును ప్రతిఘటిస్తాం
ఇస్లామాబాద్: జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిప త్తిని కల్పించే రాజ్యాంగంలోని ఆర్టికల్ 370ను రద్దు చేస్తూ భారత్ తీసుకున్న నిర్ణయాన్ని పాకిస్తాన్ ఖండించింది. ఐరాస తీర్మానాలకు వ్యతిరేకంగా భారత్ తీసుకున్న నిర్ణయంపై అంతర్జాతీయ సమాజం దృష్టికి తీసుకెళతామని తెలిపింది. కశ్మీరీలకు మద్దతు కొనసాగిస్తామని పేర్కొంది. తాజా పరిణామంతో రెండు అణ్వస్త్ర దేవాల మధ్య సంబంధాలు మరింత క్షీణిస్తాయని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ వ్యాఖ్యానించారు. భారత్ ప్రకటన ఐరాస తీర్మానాలకు వ్యతిరేకమని అధ్యక్షుడు ఆరిఫ్ అల్వీ పేర్కొన్నారు. ఈ విషయమై చర్చించేం దుకు ఆయన మంగళవారం ప్రత్యేకంగా పార్లమెంట్ ఉభయసభల సంయుక్త సమా వేశం ఏర్పాటు చేశారు. పలు కశ్మీరీ సంఘాలు, సంస్థలు ఇస్లామాబాద్‌లోని భారత హైకమిషన్ కార్యాలయం ఎదుట ప్లకార్డులతో నిరసన తెలిపాయి. నీలం లోయలో భారత్ బాంబు దాడులతో తీవ్రంగా దెబ్బతిన్న సరిహద్దు ప్రాంతాలను విదేశీ ప్రతినిధుల బృందం సందర్శించనుందని పాక్ అధికారులు తెలిపా రు. నియంత్రణ రేఖ వెంబడి పౌరులే లక్ష్యంగా భారత్ చేసిన క్లస్టర్ బాంబులతో తీవ్ర నష్టం వాటిల్లిందన్నారు. ఈ విదేశీ బృందంలో చైనా, బ్రిటన్, ఫ్రాన్సు, టర్కీ, జర్మనీ దౌత్యాధి కారులు ఉంటారన్నారు. అయితే, పాక్ ఆరోపణలను భారత్ తీవ్రంగా ఖండించింది. అవి అబద్ధాలు, మోసమని పేర్కొంది. ‘అణ్వస్త్ర’ దేశాల మధ్య సంబంధాలు క్షీణిస్తాయి: ఆర్టికల్–370 రద్దుతో అణ్వస్త్ర పాటవ ఇరుగుపొరుగు దేశాల మధ్య సంబంధాలు మరింత దిగజారుతాయని ఇమ్రాన్‌ఖాన్ తెలిపారు. మలేసియా ప్రధాని మహతీర్ మహమ్మద్‌తో కలిసి మీడియాతో మాట్లాడుతూ ఆయన... కశ్మీర్ హోదాను మార్చడం అన్యాయం, ఐరాస తీర్మానాల ఉల్లంఘన. భారత్ చర్యతో అణ్వస్త్ర పాటవ దేశాల మధ్య సంబంధాలు మరింత దిగజారుతాయి’ అని తెలిపారు. కశ్మీర్లో పరిస్థితులను నిశితంగా గమనిస్తుంటామని, పాక్‌తో చర్చలు జరుపుతుంటామని మలేసియా ప్రధాని మహతీర్ పేర్కొన్నారని పాక్ మీడియా తెలిపింది. వచ్చే నెలలో న్యూయార్క్‌లో జరిగే ఐరాస సమావేశాల సందర్భంగా ప్రధాని ఇమ్రాన్‌తో భేటీ ఉంటుం దని కూడా ఆయన తెలిపారని పేర్కొంది. కశ్మీరీలకు మద్దతు కొనసాగిస్తాం కశ్మీర్‌పై భారత్ తీసుకున్న ఏకపక్ష, చట్ట విరుద్ధ చర్యను అడ్డుకునేందుకు సాధ్యమైన అన్ని ప్రయత్నాలను చేస్తామని పాక్ పేర్కొంది. విదేశాంగ శాఖ ఈ మేరకు ఒక ప్రకటన చేసింది. ‘భారత ప్రభుత్వ నిర్ణయం జమ్మూకశ్మీర్‌తోపాటు, పాకిస్తాన్ ప్రజలకు కూడా ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదు. భారత్ తీసుకునే చట్ట విరుద్దమైన చర్యలను ప్రతిఘటించేందుకు ఈ వివాదంతో సంబంధం ఉన్న పాకిస్తాన్ శాయశక్తులా ప్రయత్నిస్తుంది. కశ్మీర్ ప్రజల స్వయం నిర్ణయాధికారానికి దౌత్యపరమైన రాజకీయ, నైతికమద్దతును కొనసాగిస్తామని మరోసారి స్పష్టం చేస్తున్నాం’ అని తెలిపింది. కాగా, జమ్మూకశ్మీర్ పరిణామాలపై చర్చించేందుకు మంగళవారం పాక్ పార్లమెంట్ ప్రత్యేకంగా సమావేశం కానుంది. అంతర్జాతీయ సమాజానికి వివరిస్తాం కశ్మీర్ విషయంలో భారత్ చర్యలను ఐరాస, ఇస్లామిక్ దేశాల సహకార సంస్థ (ఓఐసీ)తోపాటు మిత్రదేశాలు, అంతర్జా తీయ మానవ హక్కుల సంఘాల దృష్టికి తీసుకెళతామని పాక్ విదేశాంగ మంత్రి షా మహ్మూద్ ఖురేషి తెలిపారు. త్వరలో ఇక్కడ పర్యటించనున్న అమెరికా ప్రతిని ధులకు కూడా ఈ విషయం తెలియ పరుస్తాం’ అని ట్విట్టర్లో పేర్కొన్నారు. ‘కశ్మీర్‌పై ఐరాస పలు తీర్మానాలు చేసింది. కశ్మీర్‌ను ఐరాస వివాదాస్పద ప్రాంతంగా గుర్తించిందన్న విషయాన్ని మాజీ ప్రధాని వాజ్‌పేయి కూడా అంగీకరించారు’ అని ఆయన అన్నారు. ‘కశ్మీరీలకు పాక్ మద్దతు ఇకపై నా కొనసాగుతుంది. భారత్ నిర్ణయం తప్పని చరిత్రే రుజువు చేస్తుంది’ అని వ్యాఖ్యానించారు. భారత్ నిర్ణయం అక్కడి ప్రజల అభిప్రాయంపై ఎలాంటి ప్రభావం చూపబోదు అన్నారు. -
నివురుగప్పిన నిప్పులా జమ్మూకశ్మీర్!
శ్రీనగర్/జమ్మూ/న్యూఢిల్లీ : ఓవైపు భారీగా బలగాల మోహరింపు.. మరోవైపు కేంద్రం మౌనంతో జమ్మూకశ్మీర్‌లో పరిస్థితి నివురుగప్పిన నిప్పులా తయారైంది. జమ్మూకశ్మీర్‌లో శాశ్వతనివాసం, స్వయంప్రతిపత్తికి సంబంధించి రాజ్యాంగంలోని ఆర్టికల్ 35ఏ, ఆర్టికల్ 370లను కేంద్రం రద్దుచేయబోతోందన్న వదంతుల నేపథ్యంలో ప్రతిపక్షాలు గవర్నర్ సత్యపాల్ మాలిక్‌తో శనివారం భేటీ అయ్యాయి. ఉగ్రముప్పు ఉన్నప్పటికీ పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ తన భద్రతాసిబ్బంది కళ్లుగప్పి నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్ ఫరూక్ అబ్దుల్లా ఇంటికి వెళ్లారు. కేంద్రం తీసుకునే ఎలాంటి చర్యనైనా కలసికట్టుగా ఎదుర్కొందామని కోరారు. అనంతరం ఇతర కశ్మీరీ నేతలతో కలిసి గవర్నర్ సత్యపాల్ మాలిక్‌తో భేటీ అయ్యారు. దీంతో జమ్మూకశ్మీర్‌కు సంబంధించి ఎలాంటి రాజ్యాంగ నిబంధనల్ని సవరించడం లేదనీ, వదంతుల్ని నమ్మవద్దని మాలిక్ రాజకీయ నేతలు, మద్దతుదారులకు విజ్ఞప్తి చేశారు. జమ్మూకశ్మీర్‌లో కొనసాగుతున్న అనిశ్చితిపై ప్రధాని మోదీ ప్రకటన చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేయగా, ఈ విషయంలో కశ్మీరీ ప్రజలకు పార్లమెంటు హామీ ఇవ్వాలని ఎన్సీ నేత ఒమర్ అబ్దుల్లా కోరారు. రంగంలోకి ఐఏఎఫ్ విమానాలు.. జమ్మూకశ్మీర్‌లో ఉగ్రదాడి జరగొచ్చన్న ఆర్మీ హెచ్చరికల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర పాలనా యంత్రాంగం అప్రమత్తమయ్యాయి. పలువురు పర్యాటకుల్ని, అమర్నాథ్ యాత్రికులను ప్రత్యేక వాహనాల్లో శ్రీనగర్ విమానాశ్రయానికి తరలించాయి. జమ్మూకశ్మీర్‌లో శుక్రవారం నాటికి 20,000 నుంచి 22,000 మంది పర్యాటకులు ఉన్నారు. అయితే ఉగ్రహెచ్చరికల నేపథ్యంలో గుల్మార్గ్, పెహల్గామ్ వంటి పర్యాటక ప్రాంతాల నుంచి 6,126 మంది పర్యాటకులను శ్రీనగర్‌కు తీసుకొచ్చారు. ఈ సందర్భంగా 5,829 మందిని 32 విమానాల్లో శనివారం తమ స్వస్థలాలకు తరలించారు. భారత వాయుసేన(ఐఏఎఫ్)కు చెందిన విమానాల్లో మరో 387 మందిని గమ్యస్థానాలకు చేర్చారు. ఈ సందర్భంగా పలు విమానయాన సంస్థలు టికెట్ల రీషెడ్యూల్, రద్దుపై విధించే అదనపు చార్జీలను ఆగస్టు 15 వరకూ ఎత్తివేశాయి. టికెట్లను రద్దుచేసుకుంటే అదనపు చార్జీలు విధించబోమని రైల్వేశాఖ చెప్పింది. మరోవైపు భారత పర్యటనలో భాగంగా జమ్మూకశ్మీర్‌కు వెళ్లవద్దని తమ పౌరులను బ్రిటన్, జర్మనీ దేశాలు హెచ్చరించాయి. భద్రతా సిబ్బందిని సంప్రదించాకే కశ్మీర్లో పర్యటించాలనీ, ప్రస్తుతం అక్కడి పరిస్థితి ప్రమాదకరంగా ఉందని ఆస్ట్రేలియా తమ పౌరులకు స్పష్టం చేసింది. అవన్నీ వదంతులే.. నమ్మొద్దు: గవర్నర్ మాలిక్ జమ్మూకశ్మీర్‌లో ఉద్రిక్త పరిస్థితి నెలకొన్న నేపథ్యంలో నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్సీ) నేత, మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా నేతృత్వంలోని ప్రతినిధుల బృందం శనివారం గవర్నర్ సత్యపాల్ మాలిక్‌తో సమావేశమైంది. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఆర్టికల్ 35ఏ, ఆర్టికల్ 370లను రద్దు చేయబోతోందని చెలరేగుతున్న వదంతులపై స్పష్టత ఇవ్వాల్సిందిగా కోరింది. దీంతో గవర్నర్ స్పందిస్తూ..‘ఆర్మీ హెచ్చరికల తీవ్రతను దృష్టిలో ఉంచుకునే అమర్నాథ్ యాత్రను తక్షణం నిలిపివేయాల్సి వచ్చింది. ఇక నాకు తెలిసినంతవరకూ కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ నిబంధనల్ని సవరించేందుకు ఎలాంటి ప్రయత్నం చేయడంలేదు. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణ కోసం తీసుకున్న చర్యలకు కొందరు ఇతర కారణాలను ఆపాదిస్తున్నారు. దీనివల్ల ప్రజల్లో అనవసరంగా భయాందోళన చెలరేగుతుంది’ అని తెలిపారు. జమ్మూకశ్మీర్‌లో నెలకొన్న పరిస్థితులపై వచ్చే వదంతుల్ని, పుకార్లను నమ్మవద్దనీ, ప్రశాంతంగా ఉండాలని రాజకీయ నేతలు, వారి మద్దతుదారులకు గవర్నర్ సత్యపాల్ మాలిక్ విజ్ఞప్తి చేశారు. ‘బుద్ధ అమర్నాథ్ యాత్ర’ రద్దు: వీహెచ్‌పీ ఉగ్రదాడి హెచ్చరికల నేపథ్యంలో పూంఛ్ జిల్లాలో ఈ నెల 6 నుంచి పది రోజుల పాటు సాగనున్న ‘బుద్ధ అమర్నాథ్ యాత్ర’ను రద్దు చేసుకుంటున్నట్లు విశ్వహిందూ పరిషత్(వీహెచ్‌పీ) ప్రకటించింది. ఈ విషయమై వీహెచ్‌పీ రాష్ట్ర అధ్యక్షుడు లీలాకరణ్ శర్మ మాట్లాడుతూ..‘అమర్నాథ్ యాత్రామార్గంలో అమెరికా తయారీ స్నైపర్ తుపాకీ, మందుపాతర లభ్యంకావడం, మరోవైపు రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో భక్తుల భద్రత రీత్యా బుద్ధ అమర్నాథ్ యాత్రను నిలిపివేస్తున్నాం. అలాగే కుల్గామ్ జిల్లాలో కౌశర్నాగ్ యాత్ర, కిష్త్వర్ జిల్లాలో మచైల్ యాత్రను నిలిపివేస్తున్నట్లు కూడా ఆపేస్తున్నాం’ అని చెప్పారు. మోదీ ప్రకటన చేయాలి: ప్రతిపక్షాలు అమర్నాథ్ యాత్రను కేంద్ర ప్రభుత్వం అర్ధాంతరంగా నిలిపివేయడంతో దేశ ప్రజల్లో తీవ్రమైన ఆందోళన నెలకొందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత గులామ్ నబీ ఆజాద్ తెలిపారు. ప్రస్తుతం జమ్మూకశ్మీర్‌లో నెలకొన్న పరిస్థితిపై ప్రధాని మోదీ ఉభయసభలను ఉద్దేశించి ఓ ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. ఆర్టికల్ 370, ఆర్టికల్ 35ఏల కొనసాగింపు విషయంలో తమకు పార్లమెంటు నుంచి హామీ కావాలని ఎన్సీ ఉపాధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లా చెప్పారు. భారత్‌లో విలీనం సందర్భంగా జమ్మూకశ్మీర్‌కు ఇచ్చిన హామీలు కాలాతీతమైనవని వ్యాఖ్యానించారు. ప్రజలను భయపెడుతున్నారు: బీజేపీ ప్రజల్లో భయాందోళనలు రేకెత్తించేందుకు కాంగ్రెస్, పీడీపీ, ఎన్సీ పార్టీలు ప్రయత్నిస్తున్నాయని బీజేపీ విమర్శించింది. ఈ విషయమై రాష్ట్ర బీజేపీ చీఫ్ రవీంద్ర రైనా మాట్లాడుతూ..‘రాజకీయ నేతలు ప్రజలను భయాందోళనకు గురిచేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ విషయంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి. రాజకీయ పార్టీలన్నీ కేంద్రానికి సహకరించాలి. రాజ్యాంగంలోని ఆర్టికల్ 370, ఆర్టికల్ 35 ఏ కారణంగా రాష్ట్రంలో ప్రశాంతత అనేది కరువైంది. ఆగస్టు 15న లోయలోని అన్ని పంచాయతీల్లో మువన్నెల జెండాను ఎగురవేస్తాం’ అని ప్రకటించారు. భద్రతా సిబ్బందికి ముఫ్తీ షాక్ పీడీపీ అధినేత్రి, మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ భద్రతా సిబ్బందికి షాక్ ఇచ్చారు. ఉగ్రముప్పు ఉన్నందున ఇంటి నుంచి బయటకు వెళ్లరాదని హెచ్చరించినప్పటికీ ఆమె శుక్రవారం రాత్రి సిబ్బంది కళ్లు కప్పి గుప్కార్ రోడ్డులోని ఎన్సీ అధినేత ఫరూక్ అబ్దుల్లా ఇంటికి చేరుకున్నారు. కశ్మీరీల హక్కుల్ని కాపాడుకునేందుకు చేతులు కలుపుదామని కోరారు. అయితే తన ఆరోగ్యం బాగోలేనందున కుమారుడు ఒమర్ అబ్దుల్లాతో ఈ విషయాన్ని చర్చించాలని ఫరూక్ సూచించారు. ఒమర్ ఆదివారం నిర్వహించే అఖిలపక్ష భేటీకి రావాలని కోరారు. దీంతో ముఫ్తీ పీపుల్స్ కాన్ఫరెన్స్ అధినేత సజ్జద్ లోనే, జేకేపీఎం అధినేత, మాజీ ఐఏఎస్ అధికారి షా ఫైజల్‌తో భేటీ అయ్యారు. అనంతరం వీరంతా రాజ్‌భవన్‌కు వెళ్లారు. రాజ్యాంగం ఏం చెబుతోంది? జమ్మూకశ్మీర్ రాష్ట్రాన్ని జమ్మూ, కశ్మీర్, లడఖ్ పేరిట మూడు ముక్కలుగా చేయడం అసాధ్యం కాదని కొందరు రాజ్యాంగ నిపుణులు చెబుతున్నారు. రాజ్యాంగంలోని కొన్ని నిబంధనల మేరకు పాకిస్తాన్ పక్కనే ఉన్న రాష్ట్రాల సరిహద్దులు మార్చవచ్చని అంటున్నారు. జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పిస్తున్న ఆర్టికల్ 370ను మరో అధికరణ 368(1) ద్వారా సవరించవచ్చు. ఇందుకోసం తొలుత లోక్‌సభ, ఆ తర్వాత రాజ్యసభలో బిల్లును ప్రవేశపెట్టాల్సి ఉంటుంది. కనీసం సగం రాష్ట్రాలు ఇందుకు ఆమోదం తెలిపితే, ఆర్టికల్ 370 రద్దవుతుంది. ఇది జరిగిన వెంటనే జమ్మూకశ్మీర్ సరిహద్దుల్ని నిర్ణయించే అధికారం పార్లమెంటుకు లభిస్తుంది. ఇక రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ప్రకారం ఇప్పటికే ఉన్న రాష్ట్రాలకు సరికొత్తగా సరిహద్దుల్ని ఏర్పాటు చేయడంతో పాటు కొత్త రాష్ట్రాలకు సరిహద్దుల్ని నిర్ణయించవచ్చు. కానీ దీనికి ఆర్టికల్ 370 అడ్డుపడుతున్న నేపథ్యంలో ఈ అధికరణాన్ని తొలగించడం తప్ప మరో మార్గం లేదని నిపుణులు అంటున్నారు. ఈ విషయమై లోక్‌సభ మాజీ కార్యదర్శి సుభాష్ కశ్యప్ మాట్లాడుతూ..‘ఆర్టికల్ 370 అన్నది తాత్కాలిక నిబంధనే తప్ప ప్రత్యేకమైన నిబంధన కాదు. మన రాజ్యాంగంలో తాత్కాలిక, పరివర్తన, ప్రత్యేకమైన అనే నిబంధనలున్నాయి. వీటిలో తాత్కాలికమన్నది అత్యంత బలహీనమైనది’ అని తెలిపారు. 35ఏ ఎందుకంత ప్రాముఖ్యం? ► జమ్మూకశ్మీర్ సంస్థానాధీశుడు మహారాజా హరి సింగ్ 1927, 1932లో జారీ చేసిన ఉత్తర్వుల్లో రాష్ట్ర పరిధిలోని అంశాలు, ప్రజల హక్కులను నిర్వచించారు. ఇదే చట్టాన్ని వలస వచ్చిన వారికీ వర్తింపజేశారు. ► కశ్మీర్ పగ్గాలు చేపట్టిన షేక్ అబ్దుల్లా 1949లో భారత ప్రభుత్వంతో జరిపిన చర్చల ఫలి తంగా రాజ్యాంగంలో ఆర్టికల్ 370 చేరింది. దీంతో జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి లభించింది. ఆ రాష్ట్రంపై భారత ప్రభుత్వ అధికారాలు.. రక్షణ, విదేశీ వ్యవహారాలు, సమాచార రంగాలకే పరిమితమయ్యాయి. ► షేక్ అబ్దుల్లా, నెహ్రూ మధ్య కుదిరిన ఢిల్లీ ఒప్పందం ప్రకారం 1954లో రాష్ట్రపతి ఉత్త ర్వుల మేరకు జమ్మూకశ్మీర్‌కు సంబంధించి 35ఏతోపాటు మరికొన్ని ఆర్టికల్స్‌ను రాజ్యాంగంలో చేర్చారు. ►1956లో జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక రాజ్యాంగం రూపుదిద్దుకుంది. దాని ప్రకారం.. 1911కు పూర్వం అక్కడ జన్మించిన, వలస వచ్చిన వారే కశ్మీర్ పౌరులు. అంతేకాకుండా, 1911కు ముందు పదేళ్లకు తక్కువ కాకుండా అక్కడ ఉంటున్న వారికే స్థిరాస్తులపై హక్కుంటుంది. జమ్మూకశ్మీర్ నుంచి వలసవెళ్లిన వారు, ఇంకా పాకిస్తాన్ వెళ్లిన వారు కూడా రాష్ట్ర పౌరులుగానే పరిగణిస్తారు. శ్రీనగర్–నిట్ క్లాసులు బంద్ శ్రీనగర్‌లోని ప్రఖ్యాత నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(నిట్)లో తరగతుల్ని నిరవధికంగా సస్పెండ్ చేస్తున్నట్లు సంస్థ రిజిస్టార్ తెలిపారు. తరగతులు ప్రారంభమయ్యే విషయమై తాము త్వరలోనే సమాచారం అందజేస్తామని వెల్లడించారు. శ్రీనగర్ జిల్లా యంత్రాంగం నుంచి అందిన ఆదేశాల నేపథ్యంలోనే ఈ ఉత్తర్వులు జారీచేస్తున్నామని చెప్పారు. అయితే ఈ ప్రకటనను జిల్లా కలెక్టర్ షాíß ద్ ఖండించారు. ‘శ్రీనగర్–నిట్‌ను మూసివేయాల్సిందిగా మేం ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదు. ప్రస్తుతం రాష్ట్రంలో రకరకాల వదంతులు చెలరేగుతున్న నేపథ్యంలో జాగ్రత్తగా ఉండాలని మాత్రమే సూచించాం’ అని కలెక్టర్ షాహిద్ అన్నారు. నిత్యావసర దుకాణాలు, పెట్రోల్ బంకులు, ఏటీఎంల ముందు ప్రజలు క్యూకట్టారు. శ్రీనగర్‌లో పెట్రోల్‌బంక్ వద్ద స్థానికుల పడిగాపులు -
కేంద్రం ఈ దిశగా ఆలోచిస్తోందా?
న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్‌లో రాజకీయ అనిశ్చితి నెలకొన్న నేపథ్యంలో కేంద్రం ప్రధానంగా రెండు మార్గాలను పరిశీలిస్తున్నట్లు న్యాయ, రాజ్యాంగ నిపుణులు చెబుతున్నారు. ఇందులోభాగంగా కశ్మీర్‌కు సంబంధించి ఆర్టికల్ 35ఏ, ఆర్టికల్ 370లను కేంద్రం రద్దుచేయడం మొదటిది. దీనివల్ల దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలు జమ్మూకశ్మీర్‌లో ఆస్తులను కొనుగోలు చేసేందుకు, అక్కడే స్థిరపడేందుకు వీలు కలుగుతుంది. అయితే ఈ నిర్ణయంతో భారత్‌లో విలీనమయ్యేందుకు కశ్మీర్‌తో చేసుకున్న ఒప్పందం చెల్లకుండాపోయే ప్రమాదముంది. దీన్ని నివారించేందుకు జమ్మూకశ్మీర్‌ను భారత్‌లో కలిపేస్తున్నట్లు రాష్ట్రపతి కోవింద్ ఆదేశాలు జారీచేసినా అనేక న్యాయపరమైన చిక్కుముళ్లు ఎదురవుతాయని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. మూడు ముక్కలు చేయడం.. ఇక రెండో ప్రతిపాదన ఏంటంటే జమ్మూకశ్మీర్‌ను మూడు ముక్కలు చేయడం. అంటే జమ్మూను ఓ రాష్ట్రంగా, కశ్మీర్, లడఖ్‌లను కేంద్రపాలిత ప్రాంతాలుగా మార్చే ప్రతిపాదన కేంద్రం దృష్టిలో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇది అనుకున్నంత సులభమేంకాదని రాజ్యాంగ, న్యాయ నిపుణులు అంటున్నారు. రాష్ట్రాన్ని విడగొట్టాలంటే సమగ్రమైన అధ్య యనాలతో పాటు సరిహద్దుల ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం చాలా సమయం పడుతుంది. కానీ ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం యత్నాలు ప్రారంభించినట్లు ఇప్పటివరకూ ఎలాంటి సంకేతాలు లేవన్నది నిపుణుల మాట. ఇలాంటి పరిస్థితుల్లో కేంద్రం ఏ నిర్ణయం తీసుకుంటుందో అని సర్వత్రా ఆసక్తి నెలకొంది. -
58 పురాతన చట్టాల రద్దు
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం బుధవారం మరో 58 పురాతన, వాడుకలోలేని చట్టాలను రద్దు చేసింది. దీంతో ప్రధాని మోదీ నేతృత్వంలోని రెండు (గత, ప్రస్తుత) ప్రభుత్వాలు కలిసి రద్దు చేసిన పురాతన చట్టాల సంఖ్య 1,824కు చేరింది. చట్టాల రద్దు, సవరణ బిల్లు–2019కు పార్లమెంటు ఆమోదం లభించడంతో త్వరలోనే మరో 137 పురాతన చట్టాలు రద్దు కానున్నాయి. మోదీ నేతృత్వంలోని కేంద్ర మంత్రివర్గం బుధవారం సమావేశమై ఈ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత పరిస్థితులకు, ఈ పురాతన చట్టాలకు అసలు సంబంధమే లేదనీ, ఈ కాలానికి అవి పనికిరావని కేంద్రం చెబుతోంది. తాజాగా రద్దు అయిన 58 చట్టాలేవో ఇంకా తెలియరాలేదు. అయితే అవన్నీ ప్రధాన చట్టాలకు సవరణలు చేసేందుకు తీసుకొచ్చినవేనని విశ్వసనీయ వర్గాలు చెప్పాయి. వైద్య విద్యలో ‘నెక్ట్స్’కు ఆమోదం భారత వైద్య మండలి (మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా) స్థానంలో కొత్తగా జాతీయ వైద్య కమిషన్ (ఎన్ఎంసీ–నేషనల్ మెడికల్ కౌన్సిల్)ని ఏర్పాటు చేసేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇందుకు సంబంధించిన బిల్లును ప్రస్తుత సమావేశాల్లోనే పార్లమెంటులో ప్రవేశపెట్టనుంది. ఈ బిల్లును కేంద్రం 2017 డిసెంబర్లోనే పార్లమెంటులో ప్రవేశపెట్టినప్పటికీ 16వ లోక్‌సభ గడువు ముగిసే నాటికి అది ఆమోదం పొందకపోవడం కారణంగా రద్దయింది. ఎంబీబీఎస్ చివరి సంవత్సరం పరీక్షను అందరికీ ఉమ్మడిగా జాతీయ నిష్క్రమణ పరీక్ష (నెక్ట్స్–నేషనల్ ఎగ్జిట్ టెస్ట్) పేరిట నిర్వహించేలా బిల్లులో నిబంధనలున్నాయి. ఠి 15వ ఆర్థిక సంఘం తన నివేదికను సమర్పించేందుకు గడువును కేంద్రం మరో నెల రోజులు పొడిగించి నవంబర్ 30 వరకు సమయం ఇచ్చింది. ఠి నేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ డిజైన్ చట్టం–2014ను సవరించేందుకు ఉద్దేశించిన ఓ బిల్లును కేబినెట్ ఆమోదించింది. మరో నాలుగు ఎన్ఐడీలను ఈ చట్టం పరిధిలోకి తెచ్చి, వాటిని జాతీయ ప్రాధాన్యం ఉన్న సంస్థలుగా ప్రకటించేందుకు ఈ సవరణను చేపడుతున్నారు. అమరావతి, భోపాల్, జొర్హాత్, కురుక్షేత్రల్లోని ఎన్ఐడీలను కొత్తగా ఈ చట్టం పరిధిలోకి తేనున్నారు. -
సాగు చేసే రైతులకు మార్కెట్ ఫీజ్ రద్దు
-
నేటి నుంచి పండ్లు, కూరగాయల రైతులకు ఫీజులు రద్దు
సాక్షి, అమరావతి బ్యూరో: పండ్లు, కూరగాయలు సాగుచేసే రైతులకు ప్రభుత్వం మార్కెట్ యార్డులు, చెక్‌పోస్టుల్లో ఫీజును రద్దు చేసింది. ఈనెల 2వ తేదీన ప్రభుత్వం జీవో నం.58 విడుదల చేసింది. దీని ప్రకారం రాష్ట్రంలోని 22 మార్కెట్లలో బుధవారం నుంచి అధికారికంగా ఫీజు రద్దు అమలు చేయనున్నారు. రైతులు పండించిన పండ్లు, కూరగాయల ఉత్పత్తులకు ఎటువంటి మార్కెట్ ఫీజు చెల్లించకుండా ఎక్కడైనా విక్రయించే వెసులుబాటు ఉంటుంది. ప్రధానంగా మార్కెట్ యార్డుల్లో ఉన్న కమీషన్ ఏజెంట్ల వ్యవస్థకు మంగళం పలికారు. ఇప్పటి వరకూ కమీషన్ ఏజెంట్లు మార్కెట్ యార్డుల్లో 4 నుంచి 10 శాతం కమీషన్ వసూలు చేస్తున్నారు. ఈ వ్యవస్థ రద్దుతో రైతులకు ఊరట లభించనుంది. కమీషన్ ఏజెంట్లు వ్యాపారం చేయాలంటే ట్రేడర్స్‌గా మారాల్సి ఉంటుంది. వీరు మళ్లీ కొత్తగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. దీంతో ఔత్సాహికులు ఎవరైనా వ్యాపారం చేసుకోవచ్చు. ప్రధానంగా మదనపల్లి, ఏలూరు, తెనాలి, బంగారుపాలెం, పుంగనూరు, రావులపాలెం వంటి మార్కెట్లలో అమలు కానుంది. ప్రభుత్వం ఆదాయం కోల్పోయినా.. రైతులు, వినియోగదారులకు మేలు కలుగుతుందని మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. -
ఆదాయ పన్ను రద్దు సాధ్యమా?
రెండంకెల వృద్ధి సాధించాలంటే పొదుపును పెంచాలి. ఆదాయ పన్ను రద్దు చేయాలి అన్నారు డాక్టర్ సుబ్రమణ్య స్వామి గతంలో ఓసారి. కొంతమంది రాజకీయవేత్తలు, ఆదాయ పన్ను నిపుణులు కూడా ఇదే మాట మాట్లాడుతున్నారు. దీన్ని తెలివైన చర్యగా భావించవచ్చా? నిపుణులు ఏముంటున్నారో పరిశీలిద్దాం. ఆదాయ పన్ను ప్రభుత్వ రాబడికి ప్రధాన వనరు. భారత్ లాంటి దేశాల్లో పన్ను ఆదాయం సుస్థిర ఆర్థికాభివృద్ధి, ఉపాధి కల్పనకు దోహదపడుతుంది. పన్ను నిపుణుల ప్రకారం.. 2016 –17లో ప్రత్యక్ష పన్నుల చెల్లింపుదారులు 7.41 కోట్ల మంది. వీరి ద్వారా ప్రభుత్వానికి రూ. 8.5 లక్షల కోట్ల ఆదాయం సమకూరింది. మన జనాభాలో పన్ను చెల్లింపుదారులు కేవలం 2 శాతం మందే. జీడీపీలో ప్రత్యక్ష పన్నుల వాటా 5.98 శాతం మాత్రమే. ఈ వాటాను పెంచడానికి బదులు, అసలు ఆదాయ పన్నునే రద్దు చేయాలన్న ఆలోచనను పలువురు ముందుకు తెస్తున్నారు. జనం చేతుల్లో మరింత డబ్బు ఉండేలా చేయడమనేది దీని వెనక ఉన్న ఉద్దేశం. ‘పర్యవసానంగా డిమాండ్ పెరుగుతుంది. వ్యవస్థలోకి పెట్టుబడులు ప్రవహిస్తాయి. ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుంది’ అంటున్నారు కేపీఎంజీ (ఇండియా)లో కార్పొరేట్ అండ్ ఇంటర్నేషనల్ ట్యాక్స్ విభాగాధిపతి హిమాన్షు పరేఖ్. అయితే, ఇది నాణానికి ఒకవైపు మాత్రమే. మరోవైపు, ఆర్థిక వ్యవస్థ అవసరాల కోసం భారీగా నిధులు కావాలి. 2030 నాటికి లక్ష గ్రామాల డిజిటలీకరణ, గ్రామాల పారిశ్రామికీకరణ, నదుల శుద్ధీకరణ, తీర ప్రాంత విస్తరణ, ఆహార రంగంలో స్వయం సమృద్ధి, ఆరోగ్య సంరక్షణ, విద్య, మౌలిక సౌకర్యాల కల్పన తదితర లక్ష్యాలు సాధించాల్సివుంది. ఈ నేపథ్యంలో పన్ను రద్దు ప్రతిపాదన అసంబద్ధమైనదే అవుతుందంటున్నారు పరేఖ్. పైగా ప్రత్యక్ష పన్నుల విధానం న్యాయబద్ధంగా ఉందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా దృష్టిలో పెట్టుకోవాలని ఆయన చెబుతున్నారు. పన్నుల మొత్తాలతోనే ప్రభుత్వాలు సమాజంలోని దిగువ తరగతి వర్గాలకు సంక్షేమ పథకాలు, సబ్సిడీలు అమలు చేస్తుంటాయి. ఈ నేపథ్యంలో ప్రత్యక్ష పన్నులను రద్దు చేయాలంటే ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాలను అన్వేషించాల్సి ఉందంటున్నారు డెలాయిట్ ఇండియా భాగస్వామి సరస్వతి కస్తూరి రంగన్. ప్రత్యక్ష పన్నుల రద్దు ద్వారా కోల్పోయే ఆదాయాన్ని – పరోక్ష పన్నులు పెంచడం వంటి ఇతరత్రా చర్యల ద్వారా సమకూర్చుకోవాలని ఆయన సలహా ఇస్తున్నారు. ఆదాయ పన్ను రద్దు వల్ల పన్ను చెల్లింపుదారులు తమ డబ్బును పొదుపు మార్గాల్లోకి, పెట్టుబడుల్లోకి మళ్లిస్తారని, ప్రత్యక్ష పన్ను వ్యవస్థ నిర్వహణకు సంబంధించి ప్రభుత్వం చేసే ఖర్చు కూడా తగ్గుతుందని పలువురు పన్ను నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కానీ, ఇప్పటికే 3.4 శాతం ద్రవ్య లోటుతో ఉన్న ఆర్థిక వ్యవస్థపై ఈ చర్య వ్యతిరేక ప్రభావం చూపుతుందని మరికొందరు విశ్లేషిస్తున్నారు. ‘ప్రస్తుతం యూఏఈ, కేమన్ ఐలాండ్స్, బహమాస్, బెర్ముడా తదితర కొన్ని దేశాలు ఆదాయ పన్ను విధించడం లేదు. పెద్ద దేశాలు మాత్రం పన్ను వసూలు చేస్తూనే ఉన్నాయి. నిజానికి, ప్రతి దేశమూ కనీసపాటి పన్ను విధించాలంటున్న ఓఈసీడీ – ఇందుకు శ్రీకారం కూడా చుట్టింది. ఆదాయ పన్నును రద్దు చేయడం వల్ల కొన్ని అనుకూలతలు దరి చేరవచ్చునేమో గానీ, భారత్‌లోని స్థూల ఆర్థిక దృశ్యాన్ని పరిగణనలోకి తీసుకున్నప్పుడు దాన్ని రద్దు చేయకపోవడమే ఉత్తమం. ఇందుకు బదులుగా పన్ను రేట్లను తగ్గించడం, పన్ను విధానాన్ని మెరుగ్గా అమలు పరచడం అవసరం’ అంటున్నారు పరేఖ్. అమెరికా, బ్రిటన్ వంటి అభివృద్ధి చెందిన దేశాలు కూడా ఆదాయ పన్ను వసూలు చేస్తుండటం, దానిపై ఆధారపడి కీలక ఆర్థిక నిర్ణయాలు తీసుకుంటూ ఉండటం ఈ సందర్భంలో గుర్తు చేసుకోవాల్సిన విషయం. ప్రత్యక్ష పన్ను చట్టాల ప్రక్షాళన కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన టాస్క్ ఫోర్స్ ఈ నెల 31న తన నివేదిక సమర్పించనుంది. -
ఐఆర్సీటీసీ అలర్ట్
సాక్షి, న్యూఢిల్లీ : రైల్వే టికెట్ బుకింగ్ ప్లాట్‌ఫామ్ ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్సీటీసీ) మూతపడనుంది. శనివారం, ఆదివారాల్లో కొంత సమయం పాటు ఐఆర్సీటీసీ సేవలను నిలిపివేయనున్నారు. మెయింటినెన్స్ కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నామని, వినియోగదారులకు కలగనున్న ఈ అసౌకర్యానికి చింతిస్తున్నామని ఐఆర్సీటీసీ వెబ్సైట్ ఒక ప్రకటనలో తెలిపింది. మే 18, 2019 శనివారం, మే 19 ఆదివారం మధ్య కొంత సమయం పాటు సేవలు నిలిపివేస్తారు. ఇ-టికెట్ బుకింగ్ వెబ్సైట్ ఐఆర్సీటీసీ అందించిన సమాచారం ప్రకారం తత్కాల్ సహా రైలు టికెట్ బుకింగ్, టికెట్ల రద్దు తదితర రైలు-సంబంధిత సేవలు ఈ సమయంలో అందుబాటులో ఉండవు. దేశీయంగా శనివారం అర్థరాత్రి 12 గంటల నుంచి తెల్లవారుఝాము 2.30 గంటల వరకు, ఢిల్లీలో 18వ తేదీ అర్థరాత్రి 23.45 నుంచి 19వ తేదీ ఉదయం 5 గంటలకు ఈ అంతరాయం ఉంటుంది. మరింత సమాచారం కోసం : కస్టమర్ కేర్ నంబర్లు: 0755-6610661, 0755-4090600, 0755-3934141 మెయిల్ ఐడీ: eticket@irctc.co.in సంప్రదింవచ్చని ఇ-టికెట్ బుకింగ్ వెబ్సైట్ ప్రకటించింది. కాగా రైల్వే టికెట్ బుకింగ్ ప్లాట్‌ఫామ్ ఐఆర్సీటీసీ మే 16, గురువారం ఉదయం ప్రయాణికులకు చుక్కలు చూపించింది. ఐఆర్సీటీసీ వెబ్సైట్ పని చేయకపోవడంతో ఆందోళన నెలకొంది. మెయింటెనెన్స్ కారణంగా ఇప్పుడు ఈ-టికెటింగ్ సౌకర్యం అందుబాటులో లేదు. దయచేసి కొద్దిసేపటి తర్వాత మళ్లీ ప్రయత్నించండి అన్న మెసేజ్‌తో దర్శనమిచ్చింది. దీంతో సైట్ మెయింటెనెన్స్ విషయాన్ని ముందుగా తెలియజేయ లేదంటూ పలువురు యూజర్లు సోషల్ మీడియా ద్వారా ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. -
ప్రధాని ఫొటోలున్న బోర్డింగ్ పాస్‌లు రద్దు
న్యూఢిల్లీ: ప్రధాని మోదీ ఫొటోలున్న బోర్డింగ్ పాస్‌లను రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వరంగ ఎయిరిండియా ప్రకటించింది. ఎన్నికల వేళ ప్రధానితోపాటు గుజరాత్ సీఎం ఫొటోలుండటంపై విమర్శలు రావడంతో ఈ నిర్ణయం తీసుకుంది. నేతల ఫొటోలున్న బోర్డింగ్ పాస్‌లపై పంజాబ్ మాజీ డీజీపీ శశికాంత్ ట్విట్టర్లో అభ్యంతరం తెలిపారు. ‘ఈ రోజూ న్యూఢిల్లీ విమానాశ్రయంలో ఎయిరిండియా జారీ చేసిన బోర్డింగ్ పాస్‌పై వైబ్రంట్ గుజరాత్ నినాదంతోపాటు ప్రధాని, గుజరాత్ సీఎం ఫొటోలున్నాయి. ఎన్నికల సమయంలో ఇటువంటి వాటిని చూడలేని, వినలేని, మాట్లాడలేని ఎన్నికల సంఘంపై ప్రజాధనం వృథాగా ఖర్చు చేయడం ఎందుకు?’ అని ప్రశ్నిస్తూ బోర్డింగ్ పాస్ ఫొటోను జత చేశారు. దీనిపై ఎయిరిండియా అధికార ప్రతినిధి ధనంజయ్ కుమార్ స్పందిస్తూ ‘ప్రధాని మోదీ, గుజరాత్ సీఎంల ఫొటోలతో ఉన్న బోర్డింగ్ పాస్‌లను వెనక్కి తీసుకోవాలని మా సంస్థ నిర్ణయించింది. ఆ పాస్‌లను జనవరిలో వైబ్రంట్ గుజరాత్ సమిట్ సందర్భంగా జారీ చేయగా మిగిలిపోయినవి అని భావిస్తున్నాం. వేరే సంస్థ వ్యాపార ప్రకటనలో భాగంగా వాటిని ఆవిధంగా ముద్రించి గుజరాత్‌తోపాటు దేశవ్యాప్తంగా ఉన్న విమానాశ్రయాల్లో ఉపయోగిస్తున్నాం. వాటి జారీని కొనసాగించడం ఎన్నికల నియమావళికి విరుద్ధమని తేలితే వెనక్కి తీసుకుంటాం’ అని వివరించారు. ఈ మేరకు అన్ని విమానాశ్రయాల అధికారులకు ఆదేశాలిచ్చి నట్లు తెలిపారు. -
కంటోన్మెంట్ బోర్డు త్వరలో రద్దు!
సాక్షి, హైదరాబాద్: త్వరలోనే కంటోన్మెంట్ బోర్డులు రద్దు కానున్నాయి. దేశవ్యాప్తంగా మిలటరీ స్టేషన్లలో అంతర్భాగంగా కొనసాగుతున్న జననివాస ప్రాంతాలను తప్పించనున్నారు. అనంతరం ఆయా కంటోన్మెంట్లు ప్రత్యేక మిలటరీ స్టేషన్లుగా కొనసాగనున్నాయి. సంబంధిత ప్రక్రియపై అధ్యయనం చేసేందుకు గతేడాది ఆగస్టులోనే నియమించిన ఉన్నతస్థాయి కమిటీ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు చేపట్టనున్నారు. ఈ మేరకు బుధవారం హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ పార్లమెంట్లో అడిగిన ప్రశ్నకు సమాధానంగా రక్షణ శాఖ సహాయమంత్రి డాక్టర్ సుభాష్ బమ్రే స్పష్టం చేశారు. కంటోన్మెంట్లను ప్రత్యేక మిలటరీ స్టేషన్లుగా మార్చనున్నామని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా 62 కంటోన్మెంట్ల పరిధిలో 1,86,730.39 ఎకరాల భూమి ఉన్నట్లు చెప్పారు. కంటోన్మెంట్ల పనితీరుపై అధ్యయనం కోసం 2018 ఆగస్టు 31న ఏర్పాటైన నిపుణుల కమిటీ ప్రత్యేక నివేదికను సమర్పించనుందని తెలిపారు. జీహెచ్ఎంసీలో కలిసే అవకాశం కంటోన్మెంట్లను ప్రత్యేక మిలటరీ స్టేషన్లుగా మారిస్తే ప్రస్తుతం సికింద్రాబాద్ కంటోన్మెంట్లో కొనసాగుతున్న జన నివాస ప్రాంతాలు జీహెచ్ఎంసీలో విలీనమయ్యే అవకాశముంది. 9,926 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న సికింద్రాబాద్ కంటోన్మెంట్లో ఆరు వేల ఎకరాలు పూర్తిగా మిలటరీ అధీనంలో ఉన్నాయి. 5 వందల ఎకరాలు విమానయాన, రైల్వే మంత్రిత్వ శాఖల అధీనంలో ఉన్నాయి. డిఫెన్స్ ఎస్టేట్స్ యాజమాన్య పరిధిలోని మరో 450 ఎకరాలు గ్రాంటుల రూపంలో (ఓల్డ్ గ్రాంట్ బంగళాలు) ఉన్నాయి. మిగిలిన 3,500 ఎకరాల్లో 700 ఎకరాలు (బైసన్ పోలో, జింఖానా సహా) కంటోన్మెంట్ బోర్డు యాజమాన్య పరిధిలో ఉన్నాయి. మిగిలిన 2,800 ఎకరాల్లోనే సాధారణ పౌరులకు సంబంధించిన 350 కాలనీలు, బస్తీలు ఉన్నాయి. సెక్రటేరియట్‌కు మార్గం సుగమం! కంటోన్మెంట్ బోర్డులను ప్రత్యేక మిలటరీ స్టేషన్లుగా మారిస్తే బైసన్ పోలో, జింఖానా సహా ప్రతిపాదిత స్కైవేల నిర్మాణానికి అవసర మయ్యే భూబదలాయింపు ప్రక్రియ ప్రభుత్వానికి మరింత సర ళతరం కానుంది. ప్రస్తుతం భూబదలాయింపునకు ప్రధాన అడ్డంకిగా ఉన్న సర్వీసు చార్జీలు చెల్లించాల్సిన అవసరం ఉండదు. రాష్ట్ర ప్రభుత్వానికి బదలాయించే 156 ఎకరాల్లో సుమారు 120 ఎకరాలు కంటోన్మెంట్ బోర్డుకు సంబంధిం చినవే. ఈ స్థలాలను అప్పగించడం వల్ల కోల్పోయే ఆదాయానికి బదులుగా కంటోన్మెంట్ బోర్డు సర్వీసు చార్జీలు చెల్లించాలని ప్రతిపాదించింది. కంటోన్మెం ట్ బోర్డు పరిధిలోని ప్రాంతాలు జీహెచ్ఎంసీలో కలిస్తే కేవలం 30 ఎకరాల మిలటరీ స్థలం మాత్రమే బదలాయింపు పరిధిలోకి వస్తుం ది. తద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి సర్వీసు చార్జీలు చెల్లించకుండానే బైసన్‌పోలో, జింఖా నా మైదానాలు సహా, ప్యాట్నీ– హకీంపేట, ప్యారడైజ్– సుచిత్ర మార్గాల్లోని స్కైవేలకు భూములను సేకరించే వెసులుబాటు కలుగుతుంది. -
సెప్టెంబర్ నుంచి రైళ్లలో ఉచిత బీమా రద్దు
న్యూఢిల్లీ: వచ్చే నెల నుంచి రైలు ప్రయాణికులకు ఉచిత బీమా సౌకర్యం రద్దు చేయనున్నట్లు రైల్వే శాఖ అధికారులు ప్రకటించారు. సెప్టెంబర్ 1 నుంచి ప్రయాణికులకు ఉచిత బీమా సౌకర్యాన్ని నిలిపివేయాలని భారతీయ రైల్వే కేటరింగ్, టూరిజం కార్పొరేషన్(ఐఆర్సీటీసీ) నిర్ణయించిందని రైల్వే ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. కావాలనుకున్న వారే ఇకపై బీమా సౌకర్యం పొందే వీలుంటుంది. ప్రయాణ బీమా ఫీజు ఎంతనేది త్వరలో ప్రకటిస్తామన్నారు. ప్రయాణికులను డిజిటల్ కార్యకలాపాల వైపు ప్రోత్సహించేందుకు గాను ఐఆర్సీటీసీ 2017లో ఉచిత బీమా సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చింది. అప్పుడు, డెబిట్ కార్డుల ద్వారా చెల్లింపులు జరిపే వారికి టికెట్ బుకింగ్ రుసుమును తొలగించింది. బీమా పథకం కింద ప్రయాణ సమయంలో వ్యక్తి మరణిస్తే రూ.10లక్షలు పరిహారం పొందే వీలుంది. -
పలు ప్యాసింజర్ రైళ్లు రద్దు
కొమురం భీం ఆసిఫాబాద్: పలు ప్యాసింజర్ రైళ్లను దక్షిణ మధ్య రైల్వే శుక్రవారం నుంచి రద్దు చేసింది. పెద్దంపేట నుంచి మంచిర్యాల వరకు రైల్వే మరమ్మతులు జరుగుతుండటంతో ఈ నెల 8 వరకు రద్దు చేస్తున్నట్లు స్థానిక రైల్వే అధికారులకు ఉత్తర్వులు అందాయి. కరీంనగర్ నుంచి సిర్పూర్( రైలు నెంబర్ 77255), సిర్పూర్ నుంచి కరీంనగర్(77256), కాజీపేట్ నుంచి బల్లర్ష(77121), సిర్పూర్ నుంచి కాజీపేట్(57122), అజ్ని నుంచి కాజీపేట్(57135), కాజీపేట్ నుంచి అజ్ని(57136) మధ్యలో నడిచే రైళ్లను రద్దు చేశారు. కాగజ్ నగర్ నుంచి సికింద్రాబాద్ వెళ్లే ఎక్స్‌ప్రెస్ రైలును కాజీపేట్ నుంచి సికింద్రాబాద్ వరకు మాత్రమే నడుస్తుంది. -
రెండేళ్ల డీఈడీ రద్దు!
సాక్షి, హైదరాబాద్: ప్రాథమిక పాఠశాలల్లో బోధించేందుకు అవసరమైన రెండేళ్ల డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీఈడీ) కోర్సు ఇకపై రద్దు కానుందా? దాని స్థానంలో నాలుగేళ్ల బ్యాచిలర్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (బీఈఎల్ఈడీ) అమల్లోకి రానుందా? ఈ దిశగా కేంద్రం కసరత్తు చేస్తోందని జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి (ఎన్సీటీఈ) వర్గాలు పేర్కొంటున్నాయి. డీఈడీ స్థాయి ప్రస్తుత విద్యార్థులకు సరిపోవడం లేదని, దాన్ని రద్దు చేసి డిగ్రీతో బ్యాచిలర్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ విద్యను ప్రవేశపెట్టేందుకు కేంద్రం కార్యాచరణ రూపొందిస్తోంది. 2014లో ఉపాధ్యాయ విద్యా కోర్సుల్లో అనేక సంస్కరణలు తెచ్చిన ఎన్సీటీఈ అప్పుడే నాలుగేళ్ల డీఈఎల్ఈడీ కోర్సును రూపొందించినా అమల్లోకి రాలేదు. దాంతోపాటు నాలుగేళ్ల ఇంటిగ్రేటెడ్ బీఎడ్ కోర్సు కూడా రూపొందించినా అమలు చేయడం లేదు. భవిష్యత్తులో ప్రస్తుతం ఉన్న రెండేళ్ల బీఎడ్, డీఎడ్‌ను రద్దు చేసి నాలుగేళ్ల కోర్సులను అమలు చేసే అవకాశం ఉంది. అయితే రెండేళ్ల కోర్సులను వెంటనే రద్దు చేయాలా? 2018–19 నుంచి ఇంటిగ్రేటెడ్ కోర్సులను ప్రవేశపెట్టి, పాత కోర్సుల రద్దుకు ఒకట్రెండేళ్ల సమయం ఇవ్వాలా? అన్న దానిపై తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. నాణ్యత పెంచేందుకే.. ప్రస్తుతం దేశవ్యాప్తంగా లక్షల మంది డీఈడీ, బీఈడీ అభ్యర్థులున్నారు. 2014కు ముందు ఈ రెండు కోర్సులు ఏడాది పాటే ఉండటం, ఉపాధ్యాయ కొలువు అవకాశాలు ఎక్కువగా ఉండటంతో అనేక మంది వాటిల్లో చేరారు. ప్రత్యేక ఆసక్తి లేకపోయినా, చివరికి టీచర్ ఉద్యోగమైనా సంపాదించుకోవచ్చన్న యోచనతో లక్షల మంది ఈ కోర్సులను పూర్తిచేశారు. ఒక్క తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోనే దాదాపు 8 లక్షల మంది డీఈడీ, బీఈడీ అభ్యర్థులు ఉన్నారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఈ పరిస్థితిలో మార్పు తేవడంతోపాటు ఉపాధ్యాయ విద్యలో నాణ్యతను పెంపొందించేందుకు ఇంటిగ్రేటెడ్ కోర్సులే శరణ్యమని కేంద్రం భావిస్తోంది. 2019–20 విద్యా సంవత్సరం నుంచి వాటిని అమల్లోకి తేవాలని యోచిస్తోంది. అసమానతలు తొలగించేలా.. ప్రస్తుతం ఎన్సీటీఈ నిబంధనల ప్రకారం.. ఇంటర్‌తో డీఈడీ చేసిన వారు ఒకటి నుంచి 5వ తరగతి వరకు బోధించేందుకు మాత్రమే అర్హులు. ఒకవేళ డిగ్రీ ఉంటే ఒకటో తరగతి నుంచి 8వ తరగతి వరకు (ఎలిమెంటరీ విద్య) బోధించవచ్చు. ఇక డిగ్రీతో బీఈడీ చేసిన వారు 8వ తరగతి నుంచి 12వ తరగతి వరకు బోధించేందుకు అర్హులు. ఉపాధ్యాయ అర్హత పరీక్షను (టెట్) కూడా ఇదే విధానంలో నిర్వహిస్తున్నారు. కానీ రాష్ట్రంలో ఇంటర్‌తో డీఈడీ కలిగిన వారిని ఐదో తరగతి వరకే పరిమితం చేస్తున్నారు. వారు కేవలం టెట్ పేపరు–1 రాసేందుకే ప్రభుత్వం అనుమతి ఇస్తోంది. అయితే వారితో 6, 7, 8 తరగతులకు కూడా అనధికారికంగా బోధన కొనసాగిస్తోంది. డిగ్రీ ఉన్నా 6, 7, 8 తరగతులకు అధికారికంగా బోధించే అవకాశం (టెట్ పేపరు–2 రాసే అర్హత) ఇవ్వడం లేదు. దీంతో వారు ఆందోళన చెందుతున్నారు. ఉన్నత పాఠశాలల్లోని 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు బోధించేందుకు డిగ్రీతో బీఎడ్ కలిగిన వారికి మాత్రమే టెట్ పేపరు–2 రాసే అవకాశం ఇస్తోంది. రాష్ట్రంలో 12వ తరగతి విధానం లేనందున వారు 10వ తరగతి వరకే పరిమితం అవుతున్నారు. ఈ నేపథ్యంలో పాఠశాలల్లో ఎలిమెంటరీ విద్య, ఉన్నత పాఠశాల విద్య విధానం అమలు చేయాలని కేంద్రం ఇప్పటికే ఆదేశించింది. ఆ దిశగా రాష్ట్రంలో కసరత్తు ప్రారంభించినా ఇంతవరకు ఆచరణకు నోచుకోలేదు. కోర్సుల పరంగా వ్యత్యాసాలు లేకుండా, నాణ్యమైన విద్యను అందించేందుకు ఇంటిగ్రేటెడ్ కోర్సులను ప్రవేశపెడితే ప్రయోజనం ఉంటుందని యోచిస్తోంది. ముందుగా ప్రభుత్వ, ఎయిడెడ్ కాలేజీల్లో.. ప్రస్తుతం ఉన్న రెండేళ్ల బీఈడీ కోర్సు స్థానంలో నాలుగేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సును ప్రవేశపెడతామని బడ్జెట్ సందర్భంగా కేంద్రం ప్రకటించింది. ఆ మేరకు వచ్చే విద్యా సంవత్సరం(2019–20) నుంచి ప్రభుత్వ, ఎయిడెడ్ బీఈడీ కళాశాలల్లో బీఏ–బీఈడీ, బీఎస్సీ–బీఈడీ కోర్సులను ప్రవేశపెట్టాలని కేంద్రం సూత్రప్రాయంగా నిర్ణయించింది. ఆ తర్వాత ప్రైవేట్ బీఈడీ కాలేజీల్లో ఈ కోర్సులను ప్రవేశ పెట్టే ఆలోచనలు చేస్తోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా బీఈడీ చదువుతున్నవారు ఉండటం, అలాగే డిగ్రీలో చేరి తర్వాత బీఈడీ చేయాలన్న ఆలోచన కలిగిన వారు ఉన్నందునా రెండేళ్ల బీఈడీ కోర్సును 2020–21 విద్యా సంవత్సరం వరకు కొనసాగిస్తే ఎలా ఉంటుందన్న ఆలోచనలు చేస్తోంది. కాలేజీలు కూడా అందుకు సిద్ధం కావాల్సి ఉన్నందున మరికొన్నేళ్లు కొత్త కోర్సులతోపాటు పాత రెండేళ్ల కోర్సులను కూడా కొనసాగించాలని ఇటీవల నిపుణుల కమిటీ కూడా కేంద్రానికి సిఫారసు చేసినట్లు తెలిసింది. రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌లో ఇంటిగ్రేటెడ్ బీఎడ్‌ను ప్రవేశ పెట్టేందుకు రెండు కాలేజీలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకున్నా వాటికి అనుబంధ గుర్తింపు లభించకపోవడంతో అవి ప్రారంభానికి నోచుకోలేదు. -
వ్యభిచార వ్యతిరేక చట్టం ఉండాల్సిందే
న్యూఢిల్లీ: అక్రమ సంబంధాలను నేరంగా పరిగణిస్తున్న చట్టాన్ని రద్దుచేస్తే వివాహ పవిత్రత దెబ్బతింటుందని కేంద్రం సుప్రీంకోర్టుకు తెలిపింది. ఈ మేరకు కేంద్ర హోం శాఖ అఫిడవిట్ సమర్పించింది. ఐపీసీ సెక్షన్ 497 ప్రకారం వివాహితతో అక్రమ సంబంధం పెట్టుకున్న పురుషుడు శిక్షార్హుడవుతాడు. ఈ సెక్షన్‌ను రద్దుచేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్లను కొట్టివేయాలని కేంద్రం కోరింది. సెక్షన్ 497 వివాహ వ్యవస్థను కాపాడుతోందని అఫిడవిట్లో పేర్కొంది. ‘ఐపీసీ సెక్షన్ 497, సీఆర్పీసీ సెక్షన్ 198(2)ల రద్దు.. వైవాహిక వ్యవస్థ, పవిత్రతకు ప్రాధాన్యమిస్తున్న భారతీయ సంప్రదాయ విలువలకు కీడు చేస్తుంది. భారతీయ సమాజం, విశిష్టతలను దృష్టిలో పెట్టుకుని చట్టాన్ని రూపొందించారు’ అని తెలిపింది. -
మమత చైనా పర్యటన రద్దు
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చివరి నిమిషంలో తన చైనా పర్యటనను రద్దుచేసుకున్నారు. ఉన్నతస్థాయి నేతలతో రాజకీయ సమావేశాలకుచైనా ప్రభుత్వం అంగీకరించకపోవడంతోనే ఈ భేటీ రద్దు చేసుకున్నట్లు మమత వెల్లడించారు. షెడ్యూల్ ప్రకారం మమత తన బృందంతో కలిసి ఎనిమిదిరోజులపాటు చైనాలో పర్యటించాల్సి ఉంది. శుక్రవారం రాత్రి వీరంతా బీజింగ్ బయలుదేరి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. భారత్, చైనా ప్రభుత్వాల ఎక్స్చేంజ్ ప్రోగ్రాంలో భాగంగా ఈ పర్యటనను నిర్ధారించారు. అయితే.. చైనా విదేశాంగ మంత్రి సాంగ్ తావో మినహా ఇతర సీనియర్ రాజకీయ నాయకులతో మమత భేటీకి చైనా ప్రభుత్వం అంగీకరించకపోవడంతో చివరి నిమిషంలో ఈ పర్యటన రద్దయింది. -
15 రోజుల్లో మాఫీపై నిర్ణయం
బెంగళూరు: రుణమాఫీపై 15 రోజుల్లో ఓ నిర్ణయం తీసుకుంటామని సీఎం కుమారస్వామి చెప్పారు. ప్రతి రైతు ఇంటికొచ్చి వారి రుణాలను రద్దుచేసినట్లు సర్టిఫికెట్లు అందజేస్తామన్నారు. రాష్ట్ర బడ్జెట్ రూ.2 లక్షల కోట్లని, చిన్న, సన్నకారు రైతులు వ్యవసాయానికి తీసుకున్న రుణాలను రెండు దశల్లో మాఫీ చేస్తామని చెప్పారు. బుధవారం ఆయన రైతు సంఘాల ప్రతినిధులతో సమావేశమై రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించారు. రైతులు ఎంత రుణం తీసుకున్నా మాఫీచేస్తామని స్పష్టంచేశారు. 2009 ఏప్రిల్ 1 – 2017 డిసెంబర్ మధ్య రుణాలు పొందిన రైతులకు పథకాన్ని వర్తింపజేస్తారు. వేడుకలు, బైకులకు వాడుకున్న రుణాలనూ రద్దుచేయాలా.. సాగు కోసం తీసుకున్న రుణాలతో కొందరు పెళ్లి వేడుకలు జరుపుకుంటున్నారని, కొందరు బైకులు కొనుగోలు చేస్తున్నారని కుమారస్వామి అన్నారు. అలాంటి వారి రుణాలను కూడా మాఫీ చేయాలా అని ఒకింత అసహనం వ్యక్తం చేశారు. ‘రుణ మాఫీపై 15 రోజుల్లో నిర్ణయం తీసుకుంటాం. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తూనే, రైతులను కాపాడేందుకు మా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మాఫీ చేయాల్సిన మొత్తం ఎంతో లెక్కగడుతున్నాం. మరో 2–3 రోజుల్లో బ్యాంకు అధికారులతో సమావేశం నిర్వహించి వివరాలు తెలుసుకుంటాం’ అని కుమారస్వామి అన్నారు. ప్రతి జిల్లాలో నియమించే నోడల్ అధికారి రుణాలు పొందిన రైతుల వివరాలు సేకరిస్తారని, వాటి ఆధారంగా లబ్ధిదారులను గుర్తిస్తామని తెలిపారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో తాను, ఉపముఖ్యమంత్రి పరమేశ్వర సమావేశమై ఈ విషయంపై చర్చిస్తామని చెప్పారు. అధికారంలోకి వచ్చిన 24 గంటల్లోనే రూ.53 వేల కోట్ల విలువైన రైతు రుణాలను మాఫీ చేస్తామని ఎన్నికల ప్రచార సమయంలో జేడీఎస్ ప్రకటించింది. ఈ హామీ అమలు ఆలస్యమవడంతో బీజేపీ సోమవారం రాష్ట్రవ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. -
అబార్షన్ చట్టాల రద్దుకే ఐర్లాండ్ ఓటు!
లండన్: ఆరేళ్ల క్రితం భారత సంతతి వివాహిత సవితా హాలప్పనవర్(31) మృతితో ఐర్లాండ్‌లో అబార్షన్ వ్యతిరేక చట్టాలను రద్దుచేయాలని మొదలైన ఉద్యమం ఎట్టకేలకు ఫలించింది. ఈ మేరకు శుక్రవారం నిర్వహించిన రిఫరెండంలో ఆ కఠిన చట్టాల్ని రద్దు చేయాలని సుమారు 66.4 శాతం మంది ఓటేసినట్లు మీడియా తెలిపింది. 33.6 శాతం మంది వ్యతిరేకించారు. గర్భస్థ శిశువు, తల్లికి సమాన హక్కులు కల్పిస్తున్న 8వ రాజ్యాంగ సవరణను రద్దు చేయాలని కోరుతూ ప్రజాభిప్రాయం సేకరించారు. ప్రజా తీర్పును ప్రధాని వారద్కర్ స్వాగతించారు. గత కొన్నేళ్లుగా కొనసాగుతున్న నిశ్శబ్ద విప్లవం ముగింపు దశకు చేరుకుందని వ్యాఖ్యానించారు. ఆయన మొదటి నుంచి అబార్షన్ వ్యతిరేక చట్టాల రద్దుకు మద్దతు పలుకుతున్నారు. -
ఉప సర్పంచ్‌లకు చెక్ పవర్‌పై సర్కారు పునరాలోచన
సాక్షి, హైదరాబాద్ : గ్రామాల్లో సర్పంచ్‌తోపాటు ఉప సర్పంచ్‌కు ఉమ్మడిగా చెక్ పవర్ ఇచ్చే అంశంపై ప్రభుత్వం పునరాలోచన చేస్తోంది. దీనిని ఇప్పటికే కొత్త పంచాయతీరాజ్ చట్టంలో చేర్చి ఆమోదం పొందినా... ప్రజాప్రతినిధుల నుంచి భిన్నాభిప్రాయాలు వస్తున్న నేపథ్యంలో ఈ నిబంధనను ఉప సంహరించుకోవాలని భావిస్తోంది. దీనితోపాటు కొత్త చట్టంలోని పలు ఇతర నిబంధనలనూ మార్చాలని యోచిస్తోంది. ఇందుకోసం చట్టానికి సవరణలు చేయాలని ప్రాథమికంగా నిర్ణయించినట్టు సమాచారం. ఈ దిశగానే కొత్త పంచాయతీరాజ్ చట్టంలోని పలు నిబంధనలను అమల్లోకి తీసుకురాకుండా ‘మినహాయింపు’ పేరిట నిలిపివేసినట్టుగా ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. భిన్నాభిప్రాయాల నేపథ్యంలో.. ఇటీవలి వరకు అమల్లో ఉన్న పంచాయతీరాజ్ చట్టం ప్రకారం గ్రామంలో సర్పంచ్‌తోపాటు గ్రామ కార్యదర్శికి సంయుక్తంగా చెక్ పవర్ ఉండేది. అయితే ఏప్రిల్ 18 నుంచి అమల్లోకి వచ్చిన కొత్త పంచాయతీరాజ్ చట్టంలో ప్రభుత్వం ఈ నిబంధనను మార్చింది. గ్రామ కార్యదర్శి అధికారానికి కత్తెర వేసింది. దానికి బదులుగా సర్పంచ్‌తోపాటు ఉప సర్పంచ్‌కు జాయింట్ చెక్ పవర్‌ను కల్పించింది. కానీ కొత్త పంచాయతీరాజ్ చట్టం అమల్లోకి వచ్చినా.. ఉప సర్పంచ్‌కు జాయింట్ చెక్ పవర్ అంశాన్ని అమల్లోకి తీసుకురావడంపై మల్లగుల్లాలు పడుతోంది. ఈ అంశంపై ప్రజాప్రతినిధుల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతుండటమే దీనికి కారణం. గ్రామాల్లో సర్పంచ్‌తో పాటు ఉప సర్పంచ్‌కు సంయుక్తంగా చెక్ పవర్ ఇస్తే రాజకీయ విభేదాలు రాజేసినట్లవుతుందనే వాదన వినిపిస్తోంది. ముఖ్యంగా సర్పంచ్, ఉప సర్పంచ్ ఇద్దరూ వేర్వేరు పార్టీలకు చెందిన వారైనా, వారి మధ్య రాజకీయ స్పర్థలున్నా.. సమన్వయం లోపించి, నిధుల వినియోగం గాడి తప్పుతుందనే అభిప్రాయాలున్నాయి. దీంతో లేనిపోని చిక్కులు ఎదురవుతాయనే భావన వ్యక్తమవుతోంది. గ్రామ పాలన, అభివృద్ధిపై ప్రభావం సాధారణంగా గ్రామ సభ తీర్మానాలు, పాలకవర్గం నిర్ణయాలకు అనుగుణంగానే గ్రామాల్లో నిధులు ఖర్చు చేస్తారు. గ్రామ కార్యదర్శి– సర్పంచ్‌లకు ఉమ్మడిగా చెక్ పవర్ ఉన్నప్పుడు... సర్పంచ్ ఏదైనా చెక్కుపై సంతకం చేస్తే, ఆ నిధులను వేటికి ఖర్చు చేస్తున్నారు, సంబంధిత తీర్మానం ఉందా.. లేదా వంటి అంశాలను కార్యదర్శి పరిశీలించి సంతకం చేసేవారు. ఇప్పుడు ప్రభుత్వ అధికారి పరిశీలన విధానం కాకుండా.. నేరుగా ఇద్దరు ప్రజాప్రతినిధులకే చెక్ పవర్ కల్పించారు. దీనివల్ల నిధుల వినియోగం ప్రశ్నార్థకంగా మారుతుందని అధికారవర్గాలు సందేహం వ్యక్తం చేస్తున్నాయి. దీనివల్ల గ్రామ పాలన, అభివృద్ధిపై ప్రభావం పడుతుందని అభిప్రాయపడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఉప సర్పంచ్‌లకు చెక్ పవర్ నిబంధనను అమలుపై సర్కారు పునరాలోచనలో పడింది. మరిన్ని అంశాలపైనా సందిగ్ధం..! కొత్త పంచాయతీరాజ్ చట్టాన్ని అమల్లోకి తెచ్చిన రాష్ట్ర ప్రభుత్వం.. అందులో తొమ్మిది అంశాలను మాత్రం ప్రస్తుతం అమల్లోకి తేవడం లేదంటూ మినహాయింపు ఇచ్చింది. రాష్ట్రంలో ప్రస్తుతమున్న గ్రామ పంచాయతీల పాలక వర్గాల పదవీకాలం 2018 జూలై ఆఖరుతో ముగుస్తుందని.. అనంతరం అన్ని నిబంధనలు అమల్లోకి తెస్తామని ప్రకటించింది. కానీ సర్పంచ్–ఉప సర్పంచ్‌లకు జాయింట్ చెక్ పవర్‌తోపాటు పలు ఇతర అంశాలపైనా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతుండటంతో.. వాటిలో సవరణలు చేసే అవకాశమున్నట్టు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. కొత్త చట్టంలో నుంచి అమలు మినహాయించిన అంశాల్లో... ఉప సర్పంచ్‌కు చెక్ పవర్, ఆడిట్ పత్రాలు సమర్పించకపోతే సర్పంచ్, కార్యదర్శులను విధుల్లోంచి తొలగించటం, గ్రామాల్లో మొక్కల పెంపకానికి సంబంధించి కార్యదర్శిపై చర్యలు, సర్పంచ్‌లను సస్పెండ్ చేసేలా కలెక్టర్‌కు అధికారాలు, కార్యదర్శి తన పనితీరు నివేదికను బహిరంగపర్చకుంటే చర్యలు, లేఔట్లు–భవన నిర్మాణ అనుమతులకు సంబంధించిన సాఫ్ట్‌వేర్‌ను ప్రభుత్వం సమకూర్చటం, పంచాయతీరాజ్ ట్రిబ్యునల్ ఏర్పాటు, పంచాయతీలో ఓటర్ల సంఖ్యకు అనుగుణంగా గ్రామసభ కోరం ఉండాలనే నిబంధనలను మినహాయించారు. ఇందులో గ్రామ కార్యదర్శులపై కఠిన చర్యలకు సంబంధించి కూడా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. చెక్ పవర్ లేకున్నా కార్యదర్శులను ఆడిటింగ్ బాధ్యులను చేయటం, హరితహారం మొక్కల పెంపకంలో చర్యలు తీసుకునేలా నిబంధనపై విమర్శలు వస్తున్నాయి. ఈ నిబంధనల్లో సర్పంచ్‌లనే బాధ్యులుగా చేయాల్సిన సర్కారు.. కార్యదర్శులపై కటువుగా ఉండటమేమిటనే అభిప్రాయాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో కొత్త చట్టంలోని పలు నిబంధనలను సవరించడం లేదా పూర్తిగా పక్కనపెట్టడం జరిగే అవకాశాలు ఉన్నాయని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. -
‘ఎస్సీ, ఎస్టీ చట్టం’పై ఆర్డినెన్స్?
న్యూఢిల్లీ: ఎస్సీ, ఎస్టీ చట్టంలో మార్పులు చేస్తూ సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో.. ఆ తీర్పును రద్దు చేసేలా ఆర్డినెన్స్ తెచ్చే యోచనలో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. సుప్రీంకోర్టు తీర్పునకు ముందున్న యథాస్థితికి ఆ చట్టాన్ని పునరుద్ధరించాలని కేంద్రం భావిస్తోంది. ఆర్డినెన్స్ జారీ ద్వారా సుప్రీంకోర్టు చేసిన మార్పుల్ని రద్దు చేసే అంశంపై ఇప్పటికే సమాలోచనలు జరుగుతున్నాయని కేంద్ర ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. ఈ అంశంపై సాగుతున్న చర్చలపై ప్రభుత్వ వర్గాలు స్పందిస్తూ.. ‘ఆర్డినెన్స్ తీసుకురావడం ద్వారా ఉద్రిక్తతల్ని తగ్గించవచ్చనే ఆలోచనలో కేంద్రం ఉంది. అలాగే సుప్రీంకోర్టు తీర్పును నిరోధించేలా జూలైలో జరిగే పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలపై వేధింపుల నిరోధక చట్టం, 1989ను సవరించేలా బిల్లును ప్రవేశపెట్టే అవకాశముంది’ అని వెల్లడించాయి. ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టం కింద తక్షణ అరెస్టుల నుంచి రక్షణ కల్పిస్తూ గత నెల 20న సుప్రీం తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆర్డినెన్స్‌తో తక్షణ ఫలితం ‘ఒకసారి ఆర్డినెన్స్ జారీ చేస్తే.. ఆ తర్వాత దానిని బిల్లు రూపంలో మార్చి పార్లమెంటు ఆమోదం పొందవచ్చు. రెండింటి ఫలితాలు ఒకటే అయినా ఆర్డినెన్స్‌తో తక్షణం ఎస్సీ, ఎస్టీ చట్టం పూర్వపు స్థితిలో అమల్లోకి వస్తుంది. ఆర్డినెన్స్‌తో వెంటనే ఫలితాన్ని పొందవచ్చు. దేశంలో కొనసాగుతున్న నిరసనల్ని నియంత్రించవచ్చు’ అని ప్రభుత్వంలోని సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు. ఎస్సీ, ఎస్టీ చట్టంలో మార్పులు చేస్తూ మార్చి 20న సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై దళిత, గిరిజన సంఘాలతో పాటు అనేక రాజకీయ పార్టీలు అభ్యంతరం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. తీర్పును నిరసిస్తూ ఏప్రిల్ 2న దేశవ్యాప్తంగా నిర్వహించిన భారత్ బంద్ హింసాత్మకంగా మారడంతో దేశంలోని పలు రాష్ట్రాల్లో పలువురు ప్రాణాలు కోల్పోయారు. అయితే ఎస్సీ, ఎస్టీ చట్టాన్ని నీరుగారనివ్వబోమని శుక్రవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ‘మనం పటిష్టంగా రూపొందించిన చట్టం ప్రభావితమయ్యేందుకు (సుప్రీంకోర్టు తీర్పు ద్వారా) అనుమతించమని మీకు హామీ ఇవ్వాలనుకుంటున్నాను’ అని ఆయన పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ చట్టంపై ఇచ్చిన తీర్పు దేశానికి తీవ్ర నష్టం వాటిల్లేలా చేస్తుందని, సమీక్షించాలని ఇప్పటికే సుప్రీంకోర్టును కేంద్ర ప్రభుత్వం కోరిన విషయం విదితమే. ఇంకా నిర్ణయం తీసుకోలేదు: ప్రభుత్వం కాగా ఎస్సీ, ఎస్టీ చట్టంపై ఆర్డినెన్స్ జారీకి ఇంతవరకూ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, కేంద్ర సామాజిక న్యాయ మంత్రిత్వ శాఖ దాఖలు చేసిన రివ్యూ పిటిషన్‌పై సుప్రీం తీర్పు ఆధారంగా తదుపరి చర్యలు ఉంటాయని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. రివ్యూ పిటిషన్‌తో తక్షణ ఫలితం రాకపోవచ్చని, అలాగే సుప్రీంకోర్టు నిర్ణయం సానుకూలంగా ఉండకపోవచ్చని.. అందువల్ల భవిష్యత్తు కార్యాచరణపై ప్రభుత్వం గట్టి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరముందని భావిస్తున్నారు. వ్యతిరేకంగా వస్తే ఆర్డినెన్స్: పాశ్వాన్ దళితుల హక్కుల పరిరక్షణకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర మంత్రి రాం విలాస్ పాశ్వాన్ స్పష్టం చేశారు. ఎస్సీ, ఎస్టీ చట్టం బలహీనపరిచే చర్యల్ని ప్రభుత్వం అంగీకరించబోదని ఆయన పేర్కొన్నారు. సుప్రీంకోర్టు తీర్పుపై దాఖలైన రివ్యూ పిటిషన్‌పై తీర్పు వ్యతిరేకంగా వచ్చిన పక్షంలో.. ఆర్డినెన్స్‌తో పాటు పలు ప్రత్యామ్నాయాల్ని కేంద్రం పరిశీలిస్తుందని చెప్పారు. ‘తీర్పు మాకు వ్యతిరేకంగా వస్తే.. ఆ తర్వాతి రోజే కేబినెట్ భేటీలో ఆర్డినెన్స్‌పై నిర్ణయం తీసుకుంటాం’ అని చెప్పారు. సుప్రీంకోర్టు, హైకోర్టుల్లో ఎస్సీ, ఎస్టీ వర్గానికి చెందిన న్యాయమూర్తుల అంశంపై మాట్లాడుతూ.. ‘సుప్రీంకోర్టులో ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన ఒక్క న్యాయమూర్తి కూడా లేరు. హైకోర్టుల్లో నామమాత్రంగా న్యాయమూర్తులు ఉన్నారు’ అని పేర్కొన్నారు. -
గర్జించిన ఉద్యోగలోకం
పాడేరు రూరల్: మన్యంలో ఉద్యోగ లోకం గర్జించింది. సీపీఎస్ విధానం రద్దు కోరుతూ ఏజెన్సీ 11 మండలాల ఉద్యోగులు కదం తొక్కారు. ఇందుకు పాడేరు వేదికైంది. ఏపీ సీపీఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఆదివారం పాడేరులో మన్యం ర్యాలీ నిర్వహించారు. పట్టణంలోని తలారిసింగ్ నుంచి ప్రారంభమైన ర్యాలీ ఆర్టీసీ కాంప్లెక్స్, సినిమాహాల్ సెంటర్, పాతబస్టాండ్ మీదుగా మోదకొండమ్మ ఆలయం వరకూ సాగింది. ఈ సందర్భంగా సీపీఎస్‌ను రద్దు చేయాలని ఉద్యోగులు పెద్ద ఎత్తున ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు. ఇంతకు ముందు తలారిసింగ్ వద్ద ప్రధాన రహదారిపై బైఠాయించి తమ నిరసన వ్యక్తం చేశారు. మోదకొండమ్మ ఆలయం ఓపెన్ ఆడిటోరియంలో నిర్వహించిన బహిరంగ సభలో ఏపీ సీపీఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాజీ పట్టాన్ మాట్లాడుతూ 2014 సంవత్సరం నుంచి అమలవుతున్న లోపభూయిష్టమైన సీపీఎస్ విధానంతో ఉద్యోగులకు సామాజిక, ఆర్థిక భద్రత కరువైందన్నారు. రాష్ట్రంలో లక్షా 86 వేల మంది ఉద్యోగులు సీపీఎస్ పథకం వల్ల రిటైర్మెంట్ తర్వాత కనీస పెన్షన్ కోల్పోతున్నారన్నారు. గత ఎన్నికలకు ముందు తాము అధికారంలోకి వస్తే సీపీఎస్‌ను రద్దు చేస్తామని ప్రకటించిన టీడీపీ.. ప్రభుత్వ పగ్గాలు చేపట్టాక మోసగించిందన్నారు. సీపీఎస్ రద్దు కోసం అసెంబ్లీ, పార్లమెంట్లలో తీర్మానం ఎందుకు పెట్టడం లేదని ప్రశ్నించారు. సీపీఎస్ రద్దు చేస్తామని హామీ ఇచ్చిన పార్టీకే వచ్చే ఎన్నికల్లో ఉద్యోగుల మద్దతు ఉంటుందన్నారు. తలారిసింగ్ వద్ద ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన తెలియజేస్తున్న ఉద్యోగులు ఉద్యోగుల సంక్షేమాన్ని గాలికొదిలేసిన టీడీపీ రాష్ట్ర కోశాధికారి రొంగలి అప్పలరాజు మాట్లాడుతూ టీడీపీ తమది సంక్షేమ ప్రభుత్వమని చెప్పుకుంటూ సీపీఎస్ ఉద్యోగుల సంక్షేమాన్ని మాత్రం పూర్తిగా గాలికొదిలేసిందన్నారు. ఒక్కసారి ఎమ్మెల్యే, ఎంపీ అయిన వారికి జీవితాంతం పెన్షన్ ఇస్తున్నారని, కానీ తాము 30 ఏళ్లపాటు ప్రజలకు సేవ చేస్తే మాత్రం పెన్షన్ ఇవ్వకపోవడం ఏమిటని ప్రశ్నించారు. వైఎస్సార్‌టీఎఫ్ రాష్ట్ర కోశాధికారి కోడా సింహాద్రి మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా సుమారు 280 మంది ఉద్యోగులు మరణిస్తే వారికి సీపీఎస్ కారణంగా పెన్షన్ రాలేదన్నారు. దీంతో వారి కుటుంబ ఆర్థిక పరిస్థితులు దిగజారాయన్నారు. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి ఇప్పటికే సీపీఎస్ రద్దు చేస్తామని ప్రకటించారని గుర్తు చేశారు. అధికారంలోకి వస్తే తప్పనిసరిగా సీపీఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానం కొనసాగిస్తారన్నారు. గిరిజన ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు కుడుముల కాంతారావు మాట్లాడుతూ ఇప్పుడున్న ప్రభుత్వాలు తమ పెన్షన్, పీఎఫ్ నిధులను షేర్మార్కెట్లో పెడుతున్నాయన్నారు. సీపీఎస్‌ను రద్దు చేయకపోతే పెన్‌డౌన్ చేసి ఆమరణ నిరాహారదీక్షలకైనా సిద్ధమని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏపీసీపీఎస్ జిల్లా అధ్యక్షుడు కోరుకొండ సతీష్, పీఆర్టీయు జిల్లా ప్రధాన కార్యదర్శి డి.గోపీనా«థ్, గిరిజన ఉద్యోగుల సంఘం అర్బన్ అధ్యక్షుడు ఓలేసు రామలింగం, పీజీహెచ్‌ఎంల సంఘం అధ్యక్షుడు రీమలి జాన్, ఏపీఎన్జీఓ పాడేరు తాలూకా అధ్యక్షుడు బుక్కా చిట్టిబాబు, గిరిజన సంక్షేమ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు కె.గంగన్న పడాల్, ఏపీటీఎఫ్ ఉపాధ్యక్షుడు కె.శ్యాంసుందర్, ఏపీసీపీఎస్ జిల్లా మహిళా ప్రధాన కార్యదర్శి మళ్ళ ఉమ, ఏపీసీపీఎస్ పాడేరు డివిజన్ అధ్యక్ష, కార్యదర్శులు రాంబాబు, ఈశ్వర్, కన్వీనర్ తెల్లబాబు, కోశాధికారి వెంకటరమణ, కో కన్వీనర్ పరమేశ్వర్‌తోపాటు అధిక సంఖ్యలో ఉద్యోగులు పాల్గొన్నారు. -
హజ్ సబ్సిడీ రద్దు
న్యూఢిల్లీ: ఈ ఏడాది నుంచి హజ్ యాత్రకు సబ్సిడీ ఇవ్వబోమని కేంద్ర మైనారిటీ శాఖమంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ తెలిపారు. ‘బుజ్జగింపు రాజకీయాలు కాకుండా ముస్లింలు హుందాగా బతికేలా సాధికారత కల్పించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నాం. ఈ సబ్సిడీతో ముస్లింలు ఎలాంటి లబ్ధి పొందటం లేదు. గౌరవంతో కూడిన అభివృద్ధినే మేం విశ్వసిస్తాం. ఇప్పటివరకూ హజ్‌యాత్రకు కేటాయిస్తున్న మొత్తాన్ని మైనారిటీ బాలికల చదువుకు వినియోగిస్తాం’ అని మంగళవారం మీడియాకు వెల్లడించారు. సౌదీ అరేబియాలోని మక్కాకు దేశం నుంచి ఏటా 1.75 లక్షల మంది ముస్లింలు వెళ్తుంటారని నఖ్వీ తెలిపారు. గతేడాది హజ్ సబ్సిడీ కింద రూ.250 కోట్లకు పైగా కేటాయించినట్లు వెల్లడించారు. సబ్సిడీ రద్దు వల్ల హజ్ ఖర్చులు పెరిగిపోకుండా తగిన చర్యలు తీసుకుంటున్నామన్నారు. 2022 నాటికి హజ్ సబ్సిడీని పూర్తిగా ఎత్తేయాలంటూ సుప్రీం కోర్టు 2012లో ఇచ్చిన ఆదేశాల మేరకే ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. సబ్సిడీలో భాగం గా ప్రభుత్వరంగ విమానయాన సంస్థల్లో టికెట్ ధరలపై రాయితీ ఇస్తున్నారు. అదనపు భారమేం ఉండదు సాక్షి, హైదరాబాద్: హజ్ సబ్సిడీని రద్దు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయంతో తెలంగాణ నుంచి హజ్ యాత్రకు వెళ్లేవారిపై ఎలాంటి అదనపు భారం పడదని హజ్ కమిటీ ఉన్నతాధికారులు తెలిపారు. హజ్ యాత్రకు విమానయాన టికెట్లపై కేంద్ర హజ్ కమిటీ నిర్ణయించిన స్లాబ్ రేటుకు, విమానయాన సంస్థలు వసూలు చేస్తున్న మొత్తానికి భారీ వ్యత్యాసం లేకపోవడమే ఇందుకు కారణమన్నారు. గతేడాది హజ్ యాత్రికులకు కమిటీ స్లాబ్ రేటును రూ.65 వేలుగా నిర్ధారించగా, విమానయాన సంస్థలు రూ.62,065 మాత్రమే వసూలు చేశాయన్నారు. సాధారణంగా ఇప్పటివరకూ స్లాబ్ రేటు కన్నా ఎక్కువ మొత్తాన్ని విమానయాన సంస్థలు వసూలు చేస్తే.. ఆ మొత్తాన్ని సబ్సిడీగా కేంద్రం హజ్ కమిటీకి అందజేస్తుంది. -
ఢిల్లీలో దట్టంగా అలుముకున్న పొగమంచు
సాక్షి: ఢిల్లీలో దట్టంగా పొగమంచు అలుముకున్నది. పొగమంచు కారణంగా పలు రైళ్లు ఆలస్యంగా నడుస్తుండగా మరికొన్నిటి వేళల్లో మార్పులు చేశారు. 17 రైళ్లను రద్దు చేయగా 26 రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. 6 రైళ్ల వేళల్లో రైల్వే అధికారులు మార్పులు చేశారు. రైళ్లు ఆలస్యంగా నడుస్తుండడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. -
శరద్ యాదవ్ రాజ్యసభ సభ్యత్వం రద్దు
న్యూఢిల్లీ: జేడీయూ తిరుగుబాటు ఎంపీలు శరద్ యాదవ్, అలీ అన్వర్ల రాజ్యసభ సభ్యత్వం రదై్ధంది. ఈ మేరకు రాజ్యసభాధ్యక్షుడు వెంకయ్య నాయుడు కార్యాలయం నుంచి సోమవారం ఓ ప్రకటన వెలువడింది. బిహార్ సీఎం నితీశ్ కుమార్ నేతృత్వంలోని జేడీయూనే ఎన్నికల సంఘం అసలైన జేడీయూగా ఇటీవల గుర్తించిన అనంతరం శరద్, అలీల సభ్యత్వాలు రద్దు కావడం గమనార్హం. వారిద్దరూ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనీ, రాజ్యసభ నుంచి బహిష్కరించాలని గతంలో జేడీయూ వెంకయ్య నాయుడును కోరడం తెలిసిందే. గతకొన్నేళ్లలో శరద్ యాదవ్ ఏ సభలోనూ సభ్యుడిగా లేకపోవడం ఇదే తొలిసారి. -
11 తర్వాత శీతాకాల సమావేశాలు ప్రారంభం!
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: లోక్‌సభ శీతాకాల సమావేశాలు డిసెంబర్ 11 నుంచి 14 తేదీల మధ్య ఏదో ఒక రోజు ప్రారంభం కావచ్చని తెలుస్తోంది. నిజానికి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు నవంబర్ మూడో వారంలోనే ప్రారంభమవ్వాలి. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల కారణంగా సమావేశాలు ప్రారంభం కావడం ఆలస్యమవుతోందని పార్లమెంట్ వర్గాలు తెలిపాయి. కాగా సమావేశాల తేదీల్ని నిర్ణయించే రాజకీయ వ్యవహారాల కేబినెట్ కమిటీ ఇంకా భేటీ కాలేదు. డిసెంబర్ 9, 14 తేదీల్లో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు ఉండటంతో పార్లమెంట్ సమావేశాలు డిసెంబర్ 11– 14 మధ్యలో ప్రారంభం కావచ్చని లోక్‌సభ వర్గాలు తెలిపాయి. సభ నిర్వహణకు కేంద్రం సుముఖంగా లేదని, శీతాకాల సమావేశాల్ని రద్దు చేసే ఆలోచనలో ఉందని ప్రతిపక్షాలు ప్రభుత్వంపై ఆరోపణలుచేశాయి. -
వినోద పన్ను రద్దు?
సాక్షి, చెన్నై: సినిమా థియేటర్లకు విధిస్తున్న వినోదపు పన్ను రద్దు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇందుకు తగ్గ ఉత్తర్వులు త్వరలో జారీ కానున్నట్టు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. రాష్ట్రంలోని సినిమా థియేటర్లకు ప్రభుత్వం ఆదేశాలమేరకు కార్పొరేషన్, నగర, పురపాలక సంస్థలు, పట్టణ, తదితర పంచాయతీల ద్వారా వినోద పన్ను వసూళ్లు సాగుతున్న విషయం తెలిసిందే. ఈ వినోద పన్ను ముప్ఫై శాతం మేరకు అమల్లో ఉంది. అయితే, జూలైలో దేశవ్యాప్తంగా ఒకే పన్ను అమల్లోకి రావడంతో థియేటర్ల యాజమాన్యంలో ఆందోళన బయలుదేరింది. అన్ని రకాల పన్నులు ఒకే గొడుగు నీడలోకి వచ్చినా, వినోద పన్ను అనేది రాష్ట్రంతో ముడిపడి ఉండడంతో ఆందోళన బయలుదేరింది. జీఎస్టీ రూపంలో రూ.100కు పైగా ఉన్న టికెట్టుకు 28 శాతం, వంద వరకు ఉన్న టికెట్లకు 18 శాతం పన్ను అమల్లోకి వచ్చింది.ఈ పన్ను అమలుతో రూ.120గా ఉన్న టికెట్లు రూ.150గాను , రూ.100 ఉన్న టికెట్లు రూ.120గాను, రూ.80గా ఉన్న టికెట్లు రూ.100కు పెరిగాయని చెప్పవచ్చు. జీఎస్టీతో పాటుగా వినోద పన్ను సైతం చెల్లించాల్సి రావడంతో థియేటర్ల సంఘాలు ఏకమైన పోరుబాటను సైతం సాగించాయి. ఒక టికెట్టుకు తాము 58 శాతం మేరకు పన్ను చెల్లించాల్సి ఉన్న దృష్ట్యా, టికెట్ల ధరల్ని మరింతగా పెంచాల్సి ఉందని, ఇది ప్రజల మీద భారం అవుతోందని ప్రభుత్వం దృష్టికి తెచ్చారు. ఈ ఆందోళనలతో ప్రభుత్వం ఓ కమిటీని నియమించింది. అధికారులు, పలువురు మంత్రులతో కూడిన ఈ కమిటీ వినోద పన్ను విషయంగా చర్చించి నిర్ణయం తీసుకునేందుకు ముందుకు సాగుతూ వచ్చింది. ప్రస్తుతం ఈ కమిటీ తన పరిశీలనను పూర్తిచేసి ప్రభుత్వానికి నివేదిక సమర్పించి ఉంది. అందులోని వివరాల మేరకు వినోద పన్ను రద్దు అయ్యే అవకాశాలు ఉన్నట్టు సంకేతాలు వెలువడ్డాయి. అయితే, వినోద పన్ను రద్దు చేసిన పక్షంలో నగర, పురపాలక, పట్టణ తదితర పంచాయతీల ఆదాయానికి గండి పడే అవకాశం ఉందన్న వాదనను అధికార వర్గాలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఉన్నాయి.అయితే, ప్రత్యామ్నాయ మార్గం ద్వారా ఆ ఆదాయాన్ని రాబట్టుకునే రీతిలో మరికొన్ని సూచనలు ఇచ్చి ఉన్నట్టు సంకేతాలు వెలువడ్డాయి. వినోద పన్ను రద్దుచేసినా, ఆదాయానికి గండి పడకుండా, త్వరలో ఉత్తర్వులు జారీ అయ్యే అవకాశాలు ఉన్నట్టు సమాచారం. -
తెలుగు మీడియం రద్దు దారుణం
ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి రాజా ధ్వజం కాకినాడ సిటీ : మున్సిపల్ స్కూల్స్‌లో తెలుగు మీడియం రద్దు చేయడం దారుణమని ఎస్ఎఫ్ఐ ఆందోళన వ్యక్తం చేసింది. స్థానిక కచేరిపేటలో ఎస్ఎఫ్ఐ కార్యాలయంలో నిర్వహించిన ఫెడరేషన్ జిల్లా కార్యవర్గ సమావేశానికి జిల్లా అధ్యక్షుడు ఆర్. ఈశ్వరరావు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి టి.రాజా మాట్లాడుతూ విద్యా రంగాన్ని ప్రభుత్వం పూర్తిగా ప్రైవేటు, కార్పొరేట్ సంస్థలకు ధారాదత్తం చేస్తోందని ఆరోపించారు. మున్సిపల్ పాఠశాలలో తెలుగు మీడియం రద్దు వల్ల జిల్లాలో 38 వేల మంది విద్యార్థులు ఇబ్బంది పడతారన్నారు. దేశం అంతా మాతృభాషలోనే విద్య ఉంటే రాష్ట్రంలో మాత్రం తెలుగు మీడియాన్ని రద్దు చేయడంతో విద్యా రంగానికి తెలుగుదేశం ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యం ఇస్తుందో అర్ధమవుతుందన్నారు. ప్రభుత్వ నిర్ణయానికి నిరసనగా ఈ నెల 24న జిల్లాలోని అన్ని మున్సిపల్ కేంద్రాలలో రిలే నిరాహార దీక్షలు నిర్వహిస్తామన్నారు. ప్రభుత్వం నిర్ణయం ఉపసంహరించకుంటే పెద్ద సంఖ్యలో విద్యార్థులను సమీకరించి ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో ఎస్ఎఫ్ఐ నాయకులు సూరిబాబు, రామ్, వీరబాబు తదితరులు పాల్గొన్నారు. -
అప్పుటి తప్పే శాపమై..
గత సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఇచ్చిన హామీలు నమ్మి ఓటు వేయడమే ఇప్పుడు తమ పాలిట శాపమైందని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. అప్పట్లో రుణాలు కట్టొద్దని, అధికారంలోకి వస్తే అవన్నీ బేషరతుగా మాఫీ చేస్తామని చెప్పిన ఆ పార్టీ ఇప్పుడు నట్టేట ముంచిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు పైసా రుణమాఫీ కాకపోగా, బ్యాంకులు తమను దొంగలుగా చిత్రీకరించి నోటీసులు జారీచేస్తున్నాయని, రుణ ఎగవేతదారులుగా ప్రకటించి పత్రికల్లో ఫొటోలు వేయిస్తామని బెదిరింపులకు దిగుతున్నాయని కన్నీటిపర్యంతమవుతున్నారు. ఏలూరు (మెట్రో) : తెలుగుదేశం పార్టీ ఇచ్చిన రుణమాఫీ హామీని నమ్మి రుణాలు చెల్లించని రైతులను బ్యాంకులు తీవ్రంగా వేధిస్తున్నాయి. మానసికంగా కుంగదీస్తున్నాయి. నోటీసులు జారీ చేసి దొంగలుగా చిత్రీకరిస్తున్నాయి. అయినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. అన్నదాతలకు అండగా నిలవడం లేదు. దీంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఐదు విడతల్లోనూ అన్యాయమే ఎన్నికల ముందు రైతు, డ్వాక్రా రుణాలను బేషరతుగా మాఫీ చేస్తామని ప్రకటించిన తెలుగుదేశం పార్టీ గద్దెనెక్కాక మాట మార్చింది. డ్వాక్రా మహిళలకు రిక్తహస్తం చూపింది. రైతులకూ షరతులతో ఐదు విడతల్లో రుణమాఫీ చేస్తామని 2014 ఆగస్టు 14న 174 జీవోను విడుదల చేసింది. జిల్లాలో ఐదు విడతల్లోనూ అర్హులైన రైతులకు న్యాయం జరగలేదు. జిల్లాలో 5 లక్షల మంది రైతులు ఉండగా.. వారికి రూ.12వందల కోట్ల రుణాలు మాఫీ కావాల్సి ఉంది. కౌలు రైతులు 53 వేల మంది ఉండగా వారికి రూ.165 కోట్లు మాఫీ కావాల్సి ఉంది. ఈ ఐదు విడతల్లోనూ రూ.90కోట్లు మాత్రమే మాఫీ చేసిన ప్రభుత్వం మిగిలిన రుణాలు తీర్చాల్సిందేనంటూ రైతులకు బ్యాంకుల ద్వారా నోటీసులు పంపించే ఏర్పాట్లు చేసింది. తాజాగా.. 36 మందికి ఇప్పటికే రుణాలు చెల్లించని ఎందరో డ్వాక్రా మహిళలకు నోటీసులు జారీ చేసిన బ్యాంకులు ఇప్పుడు రైతులపై పడుతున్నాయి. తాజాగా పెదపాడు మండలం బూరాయిగూడేనికి చెందిన 36 మంది కౌలు రైతులకు ఏలూరు ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు నోటీసులు జారీ చేసింది. ఈ 36 మంది రూ.పదివేల చొప్పున మొత్తం రూ.3లక్షల 60వేలు ఏలూరు ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు నుంచి అప్పుగా తీసుకున్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఆ అప్పు తీరిపోతుందని భావించారు. ఐదు విడతలూ పూర్తయినా తీరకపోవడంతో ఈ రుణాలు తక్షణమే కట్టాలంటూ బ్యాంకు ఆదేశాలు జారీ చేసింది. లేకుంటే పత్రికల్లో ఫొటోలు వేయించి రుణ ఎగవేత దారులుగా ప్రకటిస్తామని నోటీసుల్లో పేర్కొంది. రుణమాఫీకి బ్యాంకుకు ఎటువంటి సంబంధం లేదంటూ తేల్చిచెప్పింది. మూడేళ్లుగా పంటలు పండక నోటీసులు అందుకున్న రైతులకు కృష్ణాడెల్టా పరిధిలో పొలాలు ఉన్నాయి. ఈ డెల్టాలో మూడేళ్లుగా నీరు అందక పంటలు పండడం లేదు. భూములు బీడువారుతున్నాయి. దీంతో రైతులు రుణాలు చెల్లించలేకపోయారు. ఈ సమయంలో తీసుకున్న అప్పు చెల్లించాలని బ్యాంకులు నోటీసులు ఇవ్వడంతో రైతులు లబోదిబోమంటున్నారు. సాగు లేదు.. రుణమాఫీ లేదు మూడేళ్లుగా పంటలు పండక తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. తీసుకున్న రుణం మాఫీ అవుతుందని ఎదురు చూశాం. మూడేళ్లయినా మా నిరీక్షణ ఫలించలేదు. – డి.సూర్యప్రకాశరావు, నోటీసు అందుకున్న రైతు పత్రికల్లో ఫొటోలు వేయిస్తారట ప్రభుత్వం రుణమాఫీ చేస్తామని చెప్పినందువల్ల అప్పు చెల్లించలేదు. ఇప్పటికిప్పుడు కట్టాలని బ్యాంకు అధికారులు నోటీసులు ఇచ్చారు. లేదంటే పత్రికల్లో ఫొటోలు వేయిస్తామని చెబుతున్నారు. మేమెలా చెల్లించగలం? – పిట్టా థామస్, నోటీసు అందుకున్న రైతు మోసం చేసిన ప్రభుత్వాన్ని ఏమనాలి? రుణం చెల్లించాలి లేకుంటే పత్రికల్లో ఫొటోలు వేయిస్తామని బ్యాంకు అధికారులు బెదిరిస్తున్నారు. రుణమాఫీ అని చెప్పి మోసం చేసిన ప్రభుత్వాన్ని ఏమనాలి. ప్రభుత్వం మోసం చేసినా ప్రజలు ఏమీ చేయలేరా? పంటలు పండకపోయినా రుణాలు ఎలా చెల్లించాలి? – దాకారపు కేశవరావు, నోటీసు అందుకున్న రైతు -
సర్కారుపై ఆటోవాలాల సమరం
తణుకు అర్బన్ : ఆటో కార్మిక రంగాన్ని కుదేలుచేసే 894 జీవో రద్దుకోరుతూ తణుకులో ఆటో కార్మికులు కదం తొక్కారు. ఏఐటీయూసీ, సీఐటీయూ కార్మిక యూనియన్ల ఆధ్వర్యంలో పట్టణంలోని ఆర్వోబీ నుంచి ప్రారంభమైన ర్యాలీ మున్సిపల్ కార్యాలయం మీదుగా రవాణా శాఖ కార్యాలయం వద్దకు చేరుకుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఆటో కార్మికులు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ట్రాన్సపోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర నాయకులు ముజుఫర్ అహ్మద్ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్పొరేట్ సంస్థలకు కొమ్ముకాస్తూ కార్మికుల పొట్టకొడుతున్నాయని విమర్శించారు. ఇటీవల ఆటో వాహనాలపై విపరీతంగా ఫీజులు పెంచడంతో పాటు ఫిట్నెస్ చేయించుకోని ఆటోలపై రోజుకు రూ.50 అపరాధ రుసుం విధించేలా జీవోను తీసుకురావడం దారుణమన్నారు. ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కోనాల భీమారావు మాట్లాడుతూ ఆటో కార్మికుల సంక్షేమానికి నిధులు కేటాయించకపోగా వారిని అప్పులపాలుచేసేలా జీవోలు తేవడం సరికాదన్నారు. ఆటో ఓనర్స్ అండ్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు పంగం రాంబాబు మాట్లాడుతూ జీవోల పేరుతో అధికారులు కార్మికులను వేధిస్తే పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఏఐటీయూసీ తణుకు ఏరియా నాయకులు బొద్దాని నాగరాజు, వైస్సార్ సీపీ ట్రేడ్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు కౌరు వెంకటేశ్వర్లు, సీఐటీయూ నాయకులు పీవీ ప్రతాప్, కేతా గోపాలన్, సబ్బిత లాజర్, పైబోయిన సత్యనారాయణ తదితరులు మట్లాడారు. అనంతరం మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ నెక్కంటి శ్రీనివాస్‌కు నాయకులు, కార్మికులు వినతిపత్రాన్ని అందజేశారు. త ణుకు, తణుకు మండలం, ఉండ్రాజవరం, అత్తిలి, ఇరగవరం, పెరవలి, పెనుమంట్ర మండలాల నుంచి 30 యూనియన్లకు చెందిన ఆటో కార్మికులు భారీగా తరలివచ్చారు. జీవో రద్దు కోరుతూ ధర్నా ఏలూరు (సెంట్రల్): రవాణా రంగంలో పెంచిన చార్జీలను తగ్గించాలని కోరుతూ నరసాపురం, ఆచంట, పాలకొల్లు, భీమవరం నియోజకవర్గాలకు చెందిన ఆటో కార్మికులు సోమవారం కలెక్టరేట్ వద్ద ధర్నా చేశారు. జీవో 894ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం కలెక్టరేట్లో వినతిపత్రం సమర్పించారు. ధర్నాకు సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి డీఎన్‌వీడీ ప్రసాద్ మద్దతు తెలిపారు. అధిక సంఖ్యలో ఆటో కార్మికులు తరలివచ్చారు. సీపీఎం మద్దతు ఫీజులు పెంచి కార్మికులను దోపిడీ చేస్తున్న బీజేపీ తన విధానాన్ని మార్చుకుని రవాణా కార్మికులను ఆదుకోవాలని సీపీఎం జిల్లా కార్యదర్శి బి.బలరాం ఒక ప్రకటనలో తెలి పారు. ఆటో కార్మికుల ధర్నాకు మద్దతు తెలిపారు. 7న రాష్ట్రవ్యాప్త సమ్మె రవాణా చార్జీలను పెంచుతూ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 894 జీవోను రద్దు చేయాలని కోరుతూ వచ్చేనెల 7న రాష్ట్రవ్యాప్తంగా సమ్మె, ప్రదర్శనలు నిర్వహించనున్నట్టు సీఐటీయూ జిల్లా కార్యదర్శి డీఎన్‌వీడీ ప్రసాద్ ప్రకటనలో తెలిపారు. -
బ్యాంకర్ల బెంబేలు
సాక్షి ప్రతినిధి, ఏలూరు : సీబీఐ కేసులతో బ్యాంకు అధికారుల్లో వణుకు మొదలైంది. పెద్దనోట్ల రద్దు తర్వాత మూడు రోజులపాటు బ్యాంకుల నుంచి పెద్దమొత్తంలో నగదు విత్‌డ్రా చేసిన వ్యవహారంపై సీబీఐ దృష్టి సారించి కేసులు నమోదు చేసిన సంగతి విదితమే. ఇప్పటివరకూ నమోదైన కేసుల్లో చిక్కుకున్న వారంతా తణుకు పరిధిలో వ్యాపార లావాదేవీలు నిర్వహిస్తున్న ఖాతాదారులే. అయితే, జిల్లా వ్యాప్తంగా అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు పెద్దఎత్తున నల్లధనాన్ని మార్పిడి చేశారు. వీరిపై ఇప్పటివరకూ చర్యలు తీసుకునే ప్రయత్నం మొదలు కాలేదు. తణుకు కేంద్రంగా ఇద్దరు ఎమ్మెల్యేలు నల్లధనాన్ని తెలుపు చేశారన్న పక్కా ఆధారాలు సీబీఐ వద్ద ఉన్నా.. వాటిపై దృష్టి పెట్టకపోవడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. జిల్లాలోని ప్రజాప్రతి నిధులు వివిధ మార్గాల్లో నల్లధనాన్ని మార్చగా, ఎక్కువ మంది బ్యాంకర్ల ద్వారా కమీషన్ పద్ధతిలో మార్పిడి చేసినట్టు ప్రచారం సాగుతోంది. తాడేపల్లిగూడెంలో అధికార పార్టీకి చెందిన ఒక ముఖ్యనేత తన అనుచరులు, ఆయన సామాజిక వర్గానికి చెందిన వారి ద్వారా బ్యాంక్ ఆఫ్ ఇండియా. యూనియన్ బ్యాంక్, ఆంధ్రా బ్యాంక్‌లలో పెద్ద మొత్తంలో సొమ్ములను డిపాజిట్టు చేయించారు. కొన్ని గ్రామాలను ఎంపిక చేసుకుని, ఇంటికి రూ.లక్ష నుంచి రూ. 2.50 లక్షల వరకు పాత నోట్లను ఇచ్చారు. వీటిని మూడు బ్యాంకుల్లో జనధన్ ఖాతాలకు, డ్వాక్రా ఖాతాలకు, సేవింగ్స్ ఖాతాలకు మళ్లించారు. ఈ వ్యవహారంపై ఫిర్యాదులు అందడంతో దీనిపైనా సీబీఐ దృష్టి పెట్టినట్టు సమాచారం. ఎస్బీఐ, ఇతర ప్రధాన బ్యాంకులతోపాటు పలు ప్రైవేటు బ్యాంకుల అధికారులతో లోపాయికారి ఒప్పందాలు చేసుకొని సొమ్మును తెలుపు చేసుకోగలిగారు. ఇదిలావుంటే.. పెద్ద మొత్తంలో నగదు విత్‌డ్రా చేసిన వ్యవహారంపై సీబీఐ దృష్టి సారించింది. తణుకు ఎస్బీఐ కేంద్రంగా జరిగిన అక్రమ లావాదేవీలు తాజాగా వెలుగు చూడటంతో ఇందుకు సహకరించిన అసిస్టెంట్ జనరల్ మేనేజర్ కేవీ కృష్ణారావుపై ఆర్బీఐ అధికారులు వేటు వేసిన విషయం విదితమే. ఈ వ్యవహారంలో ఒకే రోజు రూ.2.49 కోట్లు విత్‌డ్రాకు సహకరించిన బ్యాంకు అధికారులపై సీబీఐ కేసు నమోదు చేయడం సంచలనం రేకెత్తించింది. వీరితోపాటు తణుకు పరిసర ప్రాంతాలకు చెందిన వ్యాపారుల పైనా కేసులు నమోదు చేయడం చర్చనీయాంశమైంది. ఇటీవల తణుకు పట్టణంలో కొందరు వ్యాపారులు, బిల్డర్లతోపాటు బ్యాంకు అధికారుల ఇళ్లలో సోదాలు నిర్వహించిన అధికారులు పెద్దఎత్తున అక్రమాలు గుర్తించినట్టు సమాచారం. అంతేకాకుండా వీరి నుంచి కీలక డాక్యుమెంట్లు సైతం స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. పనిలో పనిగా ఆర్బీఐ, సీబీఐ అధికారులు జిల్లావ్యాప్తంగా నిఘా ఉంచారు. ఈ నేపథ్యంలో తమ వ్యవహారాలు బయటకు పొక్కకుండా పలువురు ప్రజాప్రతినిధులు జాగ్రత్త పడుతుండగా.. ఎటుతిరిగి ఎటు వస్తుందోనని జిల్లాలోని బ్యాంకుల అధికారుల్లో కొందరు ఆందోళన చెందుతున్నారు. -
ధర అదిరె.. అమ్మకానికి బెదిరె
తాడేపల్లిగూడెం : బహిరంగ మార్కెట్లో ధాన్యం ధర పెరిగింది. కానీ.. అమ్మడానికి రైతులు ముందుకు రావడం లేదు. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర కంటే క్వింటాల్‌కు రూ.65 అదనంగా చెల్లించేందుకు మిల్లర్లు, ధాన్యాం వ్యాపారులు ముందుకొస్తున్నా 30 శాతం రైతులు ధాన్యాన్ని అమ్మకుండా నిల్వ ఉంచుతున్నారు. జిల్లాలో ఎక్కువ మంది రకాన్ని స్వర్ణ రకాన్ని సాగు చేయగా, దీనిని కామన్ వెరైటీగా గుర్తించిన ప్రభుత్వం క్వింటాల్‌కు రూ.1,470 మద్దతు ధర ప్రకటించింది. ఐకేపీ కేంద్రాల్లో ఇదే ధర చెల్లిస్తున్నారు. బహిరంగ మార్కెట్లో క్వింటాల్‌కు రూ.1,535 చెల్లిస్తున్నా రైతులు ధాన్యం అమ్మడానికి విముఖత చూపుతున్నారు. సొమ్ము సకాలంలో చేతికందే పరిస్థితి లేకపోవడం, వ్యాపారులు ఇస్తున్న చెక్కుల్ని బ్యాంకుల్లో మార్చుకునేందుకు అవస్థలు పడాల్సి వస్తుందన్న ఉద్దేశంతో ధాన్యాన్ని అమ్మడం లేదు. జిల్లాలో 5.50 లక్షల ఎకరాల్లో వరి సాగు చేయగా, 13 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి అయినట్టు వ్యవసాయ శాఖ అంచనా వేసింది. ఐకేపీ కేంద్రాల ద్వారా ఇప్పటివరకు 48,408 మంది రైతుల నుంచి 4,77,113 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేశామని, రూ.704 కోట్లను రైతులకు చెల్లించాల్సి ఉండగా, రూ.604 కోట్లు చెల్లించామని పౌర సరఫరాల శాఖ జిల్లా మేనేజర్ కె.గణపతి రావు తెలిపారు. మరో 4 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని వ్యాపారులు కొనుగోలు చేసినట్టు అంచనా. ఇంకా 4 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం రైతుల వద్దే ఉండిపోయిందని అధికారులు భావిస్తున్నారు. సొమ్ములున్నా తీసుకోలేని దుస్థితి ఐకేపీ కేంద్రాల్లో ధాన్యం అమ్మిన రైతుల ఖాతాల్లో సొమ్ము జమ అయినా తీసుకోలేని దుస్థితి నెలకొంది. బ్యాంకుల్లో నగదు కొరత కారణంగా సొమ్ము రైతులకు సొమ్ములు ఇవ్వడం లేదు. చేతిలో సొమ్ముల్లేక రబీ నారుమడులు, నాట్లు ఎలా వేయాలో అర్థంకాక అవస్థలు పడుతున్నారు. పోనీ.. కమీషన్‌దారులు, ప్రైవేటు వడ్డీ వ్యాపారుల వద్ద అప్పు తీసుకుందామన్నా.. రబీ సీజన్లో చేసిన అప్పులను తిరిగి చెల్లించకపోవడంతో వారినుంచి రుణాలు అందటం లేదు. తొలి దశలో ఎకరాకు రూ.5 వేలైనా పెట్టుబడి అవసరం ఉంటుంది. ఆ మొత్తాన్ని ఎలా సమకూర్చుకోవాలో తెలియక తంటాలు పడుతున్నారు. సొమ్ము రావట్లేదని ధాన్యం అమ్మలేదు ఐకేపీ కేంద్రాల్లో ధాన్యం అమ్మినా సొమ్ము చేతికి అందటం లేదు. ప్రైవేటు వ్యాపారులకు అమ్ముదామంటే చెక్కులిస్తామంటున్నారు. బ్యాంకుల చుట్టూ తిరిగే ఓపిక లేక ధాన్యాన్ని అమ్మలేదు. ఇంట్లోనే నిల్వ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. గత పంట సొమ్ము రాలేదు. చేతిలో చిల్లిగవ్వ లేదు. అప్పు చేద్దామంటే ఇచ్చేవాళ్లు లేరు. కొత్త పంట ఎలా వేయాలో అర్థం కావడం లేదు. – గరగ ప్రభాకరరావు, రైతు, మాధవరం -
వేటు మొదలైంది
సాక్షి ప్రతినిధి, ఏలూరు : అక్రమార్కులపై వేటు మొదలైంది. పెద్ద నోట్ల రద్దును అడ్డం పెట్టుకుని నగదును దొడ్డిదారిన బయటకు పంపించి.. నల్ల కుబేరులకు సహకరించిన బ్యాంకు అధికారులపై చర్యలు మొదలు కావడంతో ఆ వర్గాల్లో ఆందోళన నెలకొంది. డిసెంబర్ 31 వరకూ బ్యాంకుల్లో సీసీ టీవీ ఫుటేజ్‌లను అందించాలని ఆదేశాలు వచ్చాయి. మరోవైపు ప్రధాన బ్యాంకుల్లో ఆడిటింగ్ మొదలైంది. ఆరోపణలు ఎదుర్కొంటున్న బ్రాంచిలపై ఆర్బీఐ, ఐటీతోపాటు సీబీఐ అధికారులు నిఘా పెట్టారు. తాజాగా తణుకు ఎస్బీఐ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ కేవీ కృష్ణారావుపై ఆర్బీఐ అధికారులు సస్పెన్షన్ వేటు వేశారు. పెద్ద నోట్ట రద్దు అనంతరం నగదు చెల్లింపుల్లో నిబంధనల్ని బేఖాతరు చేయడంతోపాటు కొందరు నల్లకుబేరులకు పరోక్షంగా సహకరించారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో వారం రోజులుగా ఆర్బీఐ అధికారులు ఆ బ్యాంకులో విస్తృత సోదాలు నిర్వహించి, అక్రమాలు జరిగినట్టు తేల్చడంతో ఆయనపై సస్పెన్షన్ వేటు వేసినట్టు సమాచారం. మరోవైపు జిల్లా వ్యాప్తంగా పోలీసులు జరిపిన దాడుల్లో పెద్ద మొత్తంలో కొత్తనోట్లు బయటపడ్డాయి. పకడ్బందీగా ఆర్బీఐ నుంచి బ్యాంకులకు వచ్చిన ఈ నోట్లు బయటకు ఎలా వెళుతున్నాయనే దానిపై ఇప్పటికే విచారణ మొదలైంది. బ్యాంకు మేనేజర్లకు, సిబ్బందికి 20 నుంచి 30 శాతం కమీషన్ ఇచ్చి పెద్ద మొత్తంలో డబ్బులు మార్చుకున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. ఏలూరులో రూ.24 లక్షలు మార్చుకునేందుకు వచ్చిన ఇద్దరు వ్యక్తులతోపాటు మరో ఆరుగురు పోలీసులకు పట్టుబడ్డారు. తర్వాత ఏలూరు వన్‌టౌన్‌లో సూర్యా అపార్ట్మెంట్లో ఎలబాక బాలకృష్ణ నుంచి రూ.19 లక్షల నగదు చేసుకుని ఐదుగురిని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అతని ఇంటిపక్కనే స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచి ఉండటంతో అందులో పనిచేసే సిబ్బంది ద్వారా ఈ డబ్బులు బయటకు వచ్చినట్టు పోలీసులు అనుమానించారు. ఈ కోణంలో ఆర్బీఐæ అధికా రులూ విచారణ జరుపుతున్నట్టు సమాచారం. రోజులు గడుస్తున్నా అవే కష్టాలు పెద్దనోట్ల రద్దుతో కష్టాలు మొదలై 41 రోజులు గడిచాయి. బ్యాంకులు, ఏటీఎంల వద్ద పేదలు, సామాన్యులు బారులు తీరుతూనే ఉన్నారు. భీమవరం ఎస్బీఐ మెయిన్ బ్రాంచి వద్ద బ్యాంకు తెరవక ముందే జనం బారులు తీరి కనిపించారు. చంటి పిల్లలతో తల్లులు, నిలబడే ఓపికలేని వృద్ధులు పడిగాపులు పడుతూ కనిపించారు. భీమడోలు ఎస్బీఐ వద్ద నేటికీ రూ.2 వేలు మాత్రమే ఇస్తున్నారు. తాడేపల్లిగూడెంలో సోమవారం బ్యాంకుల వద్ద నో క్యాష్ బోర్డులు దర్శనమిచ్చాయి. నరసాపురంలో ఉదయం నుంచే బ్యాంకుల ఎదుట జనం క్యూ కట్టారు. నరసాపురం పట్టణం, మండలం, మొగల్తూరు మండలంలో ఎక్కడా ఏటీఎంలు పనిచేయలేదు. తాళ్లపూడి మండలంలోని ప్రక్కిలంక స్టేట్ బ్యాంకులో నగదు లేదని బోర్డులు పెట్టారు. ఆంధ్రాబ్యాంకులో నగదు లేదని చెప్పడంతో ఖాతాదారులు నిరాశ చెందారు. టి.నరసాపురం ఆంధ్రాబ్యాంకు వద్ద గంటల కొద్దీ క్యూలో నిలబడలేక ఖాతాదారులు వారి పాదరక్షలను లైన్లో పెట్టి సమీపంలో షాపుల వద్ద వేచి ఉంటున్నారు. టి.నరసాపురం ఆంధ్రాబ్యాంకు, బొర్రంపాలెం సిండికేట్ బ్యాంకుల్లో సోమవారం నగదు చెల్లింపులు జరగలేదు. మక్కినవారిగూడెం ఒక్కొక్క ఖాతాదారుడికి రూ.2 వేల చొప్పున 100 మందికి రూ.2 లక్షలు పంపిణీ చేశారు. -
నోట్ల రద్దు వారికి ముందే తెలుసా ?
-
దిన‘ధన’ గండం
సాక్షి ప్రతిని«ధి, ఏలూరు : పెద్దనోట్లు రద్దు అయిన నెల తర్వాత కూడా పరిస్థితుల్లో మార్పులేదు. ప్రజల కష్టాలు తగ్గలేదు. సామాన్యుల పరిస్థితి దినదినగండంగా మారింది. బ్యాంకుల ముందు నో క్యాష్ బోర్డులే దర్శనమిస్తున్నాయి. అధికశాతం ఏటీఎంలు మూతపడే ఉంటున్నాయి. ఫలితంగా ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. పలుచోట్ల వారు రోడ్డెక్కి ఆందోళనకు దిగాల్సిన దుస్థితి నెలకొంది. తాజాగా గురువారం యలమంచిలి, కైకరం బ్యాంకుల్లో నగదు నిల్వలు నిండుకోవడంతో ఖాతాదారులు ఆందోళనకు దిగారు. కైకరం స్టేట్ బ్యాంక్‌లో రెండురోజు గురువారం కూడా డబ్బులు లేవనే బోర్డు పెట్టడంతో ఖాతాదారులు ఆగ్రహం వ్యక్త ం చేసి రోడ్డు ఎక్కారు. మేనేజర్‌గానీ, సిబ్బందిగానీ స్పష్టమైన సమాధానం చెప్పలేకపోవటంతో ఖాతాదారులు ఆగ్రహంతో జాతీయ రహదారిపై ఆందోళనకు దిగారు. రాస్తారోకో వల్ల ట్రాఫిక్ జామ్ కావడంతో ఉంగుటూరు తహసీల్దార్, చేబ్రోలు ఎస్ఐలు వచ్చి పరిస్థితిని చక్కదిద్దాల్సి వచ్చింది. బ్యాంకులో డబ్బులు ఉన్నా తీసుకోవడానికి బ్యాంకర్లు ఇబ్బంది పెడుతున్నారంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కూలి పనులకు డబ్బులు ఇవ్వలేకపోవడంతో వారు పనికి రావడానికి ఇష్టపడడం లేదని, ఇలా అయితే రబీలో పంట వేసినట్లేనని రైతులు ఆందోళన చెందుతున్నారు. ‘ధాన్యం డబ్బులు బ్యాంకులో పడ్డాయి. మా డబ్బులు తీసుకోవడానికి కూడా వీలులేకుండా పోయింది. బాకీదారులు మా ఇళ్ల చుట్టూతిరుగుతున్నారు’ అని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డబ్బుల కోసం తామూ పనులు మానుకుని పెద్ద సంఖ్యలో బ్యాంకుల ముందు క్యూ కట్టాల్సి వస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఎనిమిదో తేదీ వచ్చినా పింఛను సొమ్ములు అందకపోవడంతో వృద్ధులు ఆందోళ చెందుతున్నారు. పింఛను పడని వారికి ఇంటికి వచ్చి డబ్బులు ఇస్తామని ప్రభుత్వం చెబుతున్నా వారికి సరైన సమాచారం లేక ఆందోళనగా బ్యాంకులు, పంచాయతీ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. ఇదివరకు ఒకటో తేదీనే పింఛ¯ŒS వచ్చేది. ఇప్పుడు ఎనిమిదో తేదీకి కూడా రాకపోవడంతో అసలు వస్తుందా రాదా అన్న ఆందోళన వ్యక్తమవుతోంది. మరోవైపు జిల్లాలో పెద్ద ఎత్తున దొంగనోట్లు చలామణి అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం నోట్ల రద్దుతో చాలా వరకు పెద్ద నోట్లు బ్యాంక్ ఖాతాల్లోకి చేరుకోగా.. ప్రస్తుతం చలామణీలో ఉన్న దొంగనోట్లును కొంతమంది వ్యక్తులు కార్మికులు, వ్యవసాయ కూలీలు, భవన నిర్మాణ కార్మికులకు గుట్టుచప్పుడు కాకుండా వారి కూలీ డబ్బులు కింద చలామణీలో పెడుతున్నట్లు పలువురు చెబుతున్నారు. ఈనెల 6వ తేదీ నుంచి రేష¯ŒSషాపులను మినీ బ్యాంకులుగా మారుస్తున్నామని రేష¯ŒS డీలర్లను బ్యాంకు కరస్పాండెంట్లుగా మార్చి బ్యాంకింగ్ కార్యకలాపాలన్నీ నిర్వహింప చేస్తామని కలెక్టర్ కాటంనేని భాస్కర్ చేసిన ప్రకటన ఇంతవరకూ అమలులోకి రాలేదు. -
ఢాబాలపై పెద్ద నోట్ల రద్దు ఎఫెక్ట్
-
నోట్ల రద్దుతో కళ తప్పిన చేపల మార్కెట్
-
ఖమ్మం రైతు మార్కెట్లో నోట్ల రద్దు ఎఫెక్ట్
-
పెద్ద నోట్ల రద్దు బాబుకు ముందే తెలుసా ?
-
పెద్ద నోట్ల రద్దుతో ఆర్టీసీకి భారీగా గండి
-
పెద్ద నోట్లు రద్దు..
-
అకారణంగా పింఛన్ తొలగింపు l
రికార్డుల్లో చనిపోయినట్టు చూపిన వైనం సంవత్సర కాలంగా అధికారుల చుట్టూ తిరుగుతున్న వృద్ధురాలు కాకినాడ సిటీ : గడిచిన ఏడు సంవత్సరాలుగా వస్తున్న వృద్ధాప్య పింఛనును అకారణంగా తొలగించడమే కాకుండా అధికారులు ఏకంగా ఆ వృద్ధురాలు చనిపోయినట్టు రికార్డుల్లో చూపించిన వైనమిది. కరప మండలం కూరాడ గ్రామానికి చెందిన నల్లజర్ల వీరలక్ష్మికి 2008 నవంబర్‌లో వృద్ధాప్య పింఛను మంజూరు కాగా అప్పటి నుంచి 2015 అక్టోబర్ వరకు పింఛను తీసుకుంది. తరువాత నుంచి నిలిపివేయగా మండల అధికారులు, జిల్లా అధికారుల చుట్టూ తిరిగినా ఫలితం లేకపోయింది. నేటికీ సమస్యను పరిష్కరించి పింఛను పునరుద్ధరించకపోవడంతో ప్రజావాణిలో వినతి ఇచ్చేందుకు వీరలక్ష్మి సోమవారం కలెక్టరేట్‌కు వచ్చారు. రోడ్డు ప్రమాదంలో ఒక కాలు పోగొట్టుకున్న తాను ఎవరో ఒకరి సహాయంతో అధికారుల చుట్టూ సంవత్సర కాలంగా తిరుగుతున్నా కనికరించలేదని, చనిపోయినట్టు చూపించడంపై ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు ఆరు సార్లు మండలంలోని ఎండీవో కార్యాలయానికి, నాలుగుసార్లు కాకినాడలోని డీఆర్డీఏ కార్యాలయానికి తిరిగానని ఇప్పటికైనా అధికారులు కనికరించి పింఛనును పునరుద్ధరించాలని కోరారు. -
ఎమ్మెల్యే దయాకర్‌రావుపై కేసు కొట్టివేత
వరంగల్ లీగల్ : విధి నిర్వహణలో ఉన్న పోలీసు అధికారిపై దురుసుగా ప్రవర్తించి విధులను ఆటంకపర్చారనే అభియోగాలతో జఫర్గడ్ పోలీసు స్టేషన్లో పాలకుర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావుపై నమోదైన కేసును మంగళవారం మూడో మున్సిఫ్ మెజిస్ట్రేట్ కోర్టు జడ్జి అజేష్‌కుమార్ కొట్టివేశారు. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం 2012 మార్చిలో స్టేషన్‌ఘన్‌పూర్ శాసనసభ నియోజకవర్గానికి ఉప ఎన్నికలు జరిగాయి. టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన కడియం శ్రీహరి పక్షాన ఎమ్మెల్యే దయాకర్‌రావు ప్రచారంలో పాల్గొన్నారు. ఈ క్రమంలో 2012 మార్చి 15న జఫర్గడ్లో ప్రచార సభ జరగగా, ఎన్నికల నిబంధనావళి ఉల్లంఘించి సభ కొనసాగిస్తుండగా పోలీసులు ఆపివేశారు. అయి తే, విధి నిర్వహణలో ఉన్న తనపై దురుసుగా ప్రవర్తించడమే కాకుండా విధులను అడ్డుకున్నారని అప్పటి ఎస్సై రంజిత్‌కుమార్ ఫిర్యాదు మేర కు కేసు నమోదైంది. ఆ కేసు విచారణ సందర్భంగా సాక్ష్యాధారాలు లేకపోవడంతో అభియోగాలు నిరూపణ కానందున కేసు కొట్టివేస్తున్నట్లు జడ్జి అజేష్‌కుమార్ తీర్పు ఇచ్చారు. -
ఉపాధ్యాయుల డిప్యూటేషన్ రద్దు
విద్యారణ్యపురి : హన్మకొండలోని ప్రభుత్వ బీఈడీ కళాశాలలో పనిచేస్తున్న నలుగురు ఉపాధ్యాయుల డిప్యూటేషన్‌ను రద్దుచేసిన ట్లు జిల్లా విద్యాశాఖాధికారి పి.రాజీవ్ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన చేశారు. ఉపాధ్యాయులు సదయ్య, ఆంజనేయులు, కవిత, సరేఖలను ఆ విధుల నుంచి రిలీవ్ చేయాలని కళాశాల ప్రిన్సిపాల్‌ను కోరారు. -
123 జీఓ రద్దుపై హర్షం
కందుకూరు: ఇటీవల 123 జీఓను రద్దు చేస్తూ హైకోర్టు తీర్పు వెలువరించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ మండల పరిధిలోని ముచ్చర్ల సర్వే నంబర్ 288లోని సర్టిఫికెట్దారులు ఆదివారం గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తెలంగాణ సర్కార్ పేదల భూములను లాక్కొంటూ సరైన పరిహారం ఇవ్వడం లేదని, ఈతీర్పు ప్రభుత్వానికి ఓ చెంప పెట్టులాంటిదన్నారు. గ్రామ పరిధిలోని 221 మంది పేదలకు గతంలో ఎకరం చొప్పున ఇచ్చిన సర్టిఫికెట్లను పట్టించుకోకుండా, కనీస పరిహారం చెల్లించకుండా అన్యాయంగా భూములను గుంజుకున్నారని విమర్శించారు. ఆ భూముల్నే నమ్ముకున్న తమకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. హైకోర్టు తీర్పును అనుసరించి 2013 భూసేకరణ చట్టం ప్రకారమే భూములను సేకరించాలని రైతులు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. లేదంటే ఆందోళనలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకుడు వెంకటరమణ, యాదయ్య, లక్ష్మమ్మ, బుగ్గమ్మ తదితరులు పాల్గొన్నారు. -
డీఈవో కార్యాలయంలోని టీచర్ల డిప్యూటేషన్ రద్దు
l ఆరుగురిని పాఠశాలల విధులకు రిలీవ్ చేసిన డీఈఓ విద్యారణ్యపురి : విద్యాహక్కు చట్టం ప్రకారం టీచర్లు పాఠశాలల్లో విధుల్లో ఉండాలనేది ఇటీవలే సుప్రీంకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించిన విషయం విధితమే. దీంతో పాఠశాల విద్యాశాఖ ఉన్నతాధికారులు కూడా ఎక్కడైతే డిప్యూటేషన్ మీద ఉపాధ్యాయులు పనిచేస్తున్నారో వారిని పాఠశాల విధులకు పంపుతున్నారు.అందులో భాగంగా జిల్లాలోని డీఈఓ కార్యాలయంలో గత కొనేళ్లుగా వివిధ సెక్షన్లలో పనిచేస్తున్న ఆరుగురి ఉపాధ్యాయుల డిప్యూటేషన్‌ను తాజాగా డీఈఓ పి.రాజీవ్ రద్దు చేశారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. డిప్యూటేషన్ రద్దు అయిన ఉపాధ్యాయుల వివరాలు ఇలా ఉన్నాయి. పి.తిరుపతి (ఎస్ఏ, వర్ధన్నపేట మండలం పెరుమాండ్ల గూడెం యూపీఎస్), పి.రమేష్‌బాబు (ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎం, బచ్చన్నపేట మండలం బోనుకుల్లు ఎంపీపీఎస్), పి.తిరుపతి (ఎస్జీటీ, ఏయిడెడ్ పాఠశాల శారదా విద్యానికేతన్), ఎస్పి.శేషుబాబు (ఏయిడెడ్ పాఠశాల, శారదా విద్యానికేతన్), సయ్యద్ అజీమ్ ఖురేషి (ఎస్జీటీ, హన్మకొండలోని మచిలీబజార్ పాఠశాల,‡ఉర్దూ మీడియం), కె.రజనీ (ఎస్జీటీ, డోర్నకల్ మండలం చిలుకోడు పాఠశాల) ఉన్నారు. -
డాయిష్ ఫండ్ రిజిస్ట్రేషన్ రద్దు చేసిన సెబీ
న్యూఢిల్లీ: మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ.. డాయిష్ మ్యూచువల్ ఫండ్ రిజిస్ట్రేషన్‌ను రద్దు చేసింది. డాయిష్ ఎంఎఫ్ తన పథకాలన్నింటినీ డీహెచ్ఎఫ్ఎల్ ప్రమెరికా ఎంఎఫ్‌కు బదిలీ చేసిన నేపథ్యంలో సెబీ తాజాగా ఈ నిర్ణయం తీసుకుంది. రిజిస్ట్రేషన్ రద్దు నేపథ్యంలో డాయిష్ ఎంఎఫ్ ఇక నుంచి ఎంఎఫ్‌గా, ట్రస్టీగా, ఏఎంసీగా ఎలాంటి కార్యకలాపాలను నిర్వహించకూడదని సెబీ ఆదేశించింది. -
ఐస్ క్రీమ్ కోసం పెళ్ళి కాన్సిల్!
మథురః పెళ్ళిలో కట్నకానుకలు అడిగినంత ఇవ్వలేదనో, మర్యాదలు సరిగా చేయలేదనో పెళ్ళికొడుకు, అత్తింటివారు అలగడం చూస్తాం. ఒక్కోసారి కట్నం కోసం పెళ్ళిళ్ళు కాన్సిల్ అయిపోవడం చూస్తాం. కానీ అక్కడ మాత్రం కేవలం ఐస్ క్రీం... పెళ్ళి క్యాన్సిల్ అవ్వడానికి కారణమైంది. ఐస్ క్రీమ్ కోసం వచ్చిన గొడవ చినికి చినికి గాలివానగా మారింది. అడ్డొచ్చిన పోలీసులనూ తీవ్రంగా గాయపడేలా చేసింది. చివరికి పెళ్ళి.. పీటలమీదే ఆగిపోయేలా చేసింది. ఉత్తర ప్రదేశ్ కు చెందిన మధుర, మహేష్ నగర్ లో జరిగిన ఘటన.. అందర్నీ ఆశ్చర్య పరిచింది. పెళ్ళి వేడుకలో భాగంగా నిర్వహించే జయమాలా కార్యక్రమంలో పెళ్ళికొడుకు తరపున వచ్చిన కొందరు బంధువులు ఐస్ క్రీమ్ అడిగినంత ఇవ్వలేదని గొడవకు దిగారు. దీంతో అక్కడి పరిస్థితి రణరంగంగా మారింది. అడ్డొచ్చిన పోలీసులపై వధువు తరపు మహిళలతో సహా రాళ్ళు రువ్వారు. అక్కడినుంచీ వారిని తరిమి కొట్టారు. రోడ్లు కూడ దిగ్బంధనం చేశారు. గొడవలో ముగ్గురు పోలీసులు కూడ తీవ్రంగా గాయపడ్డారు. అనంతరం ప్రత్యేక ఫోర్స్ తో వచ్చిన పోలీసులు రాయసదాబాద్ రోడ్డును క్లియర్ చేసి, అక్కడి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఘటన అనంతరం ఇరు వర్గాల వారిపై ఎఫ్ ఐ ఆర్ బుక్ చేసినట్లు పోలీసులు తెలిపారురు. వరుడి తరపు బంధువుల ఫిర్యాదుతో గొడవకు కారణమైన ఏడుగుర్ని అరెస్టు చేసిన్నట్లు స్థానిక ఎస్పీ.. అరుణ్ కుమార్ సింగ్ వెల్లడించారు. ఐస్ క్రీమ్ కోసం ఇరు కుటుంబాల మధ్య వచ్చిన గొడవతో చివరికి వివాహాన్ని రద్దు చేసుకున్న మగపెళ్ళివారు... అక్కడినుంచీ వెళ్ళిపోయారు. -
రావెల సుశీల్‌పై కేసు కొట్టివేత
సాక్షి, హైదరాబాద్: ఏపీ మంత్రి రావెల కిషోర్‌బాబు కుమారుడు సుశీల్‌కుమార్‌పై బంజారాహిల్స్ పోలీసులు నమోదు చేసిన కేసును హైకోర్టు కొట్టి వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి రాజా ఇలంగో సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. సుశీల్ డ్రైవర్ మణికొండ రమేష్‌బాబుపై నమోదైన కేసును కూడా కొట్టి వేసింది. ఈ కేసులో ఫిర్యాదుదారు ఫాతిమా బేగంతో రాజీ కుదిరిందని పేర్కొంటూ సుశీల్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాన్ని జస్టిస్ ఇలంగో విచారించారు. పిటిషనర్లు, ఫిర్యాదుదారులు రాజీకి రావడంతో కే సును కొట్టివేస్తున్నట్లు న్యాయమూర్తి ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఫాతిమా బేగం పట్ల అసభ్యంగా ప్రవర్తించినందుకు పోలీసులు సుశీల్, అతని డ్రైవర్‌పై గత నెలలో కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. -
351 మందిని విచారించి..
తిరుపతి: తిరుపతి శేషాచల అటవీ ప్రాంతంలో 2013 డిసెంబర్ 15 న ఎర్రచందనం కూలీల దాడిలో అటవీ శాఖ అధికారులు శ్రీధర్, డేవిడ్ మృతి చెందారు. ఈ కేసు విషయంపై బుధవారం తిరుపతి మూడో అదనపు జిల్లా కోర్టు లో విచారణ జరిగింది. ఈ విచారణలో దాడికి పాల్పడిన 287 మంది నిందితులను విడుదల చేస్తూ కోర్టు తీర్పును వెల్లడించింది. కాగా అప్పటి నుంచి తమిళనాడుకు చెందిన ఈ నిందితులు జైలులో ఉన్నారు. మరో 64 మంది బెయిలు పై ఉన్నారు. ప్రాసిక్యూషన్ సరైన సాక్ష్యాధారాలు చూపనందున కేసును కొట్టివేస్తున్నట్టు కోర్టు తీర్పు వెలవరించింది. నిందితులపై ఇతర కేసులు లేకుంటే వారిని వెంటనే విడుదల చేయాలని కోర్టు పోలీసులను ఆదేశించింది. దేశ చరిత్రలోనే మొదటిసారిగా హత్యకేసులో 351 మందిని కోర్టు విచారించింది. -
నేడు, రేపు 'రత్నాచల్' రద్దు
విశాఖపట్నం : విజయవాడ - విశాఖపట్నం మధ్య నడిచే రత్నాచల్ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ 12718, 12717 రైలు సర్వీసు రెండు రోజులపాటు రద్దు చేసినట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. ఈ రైలు సర్వీసులు బుధవారం, గురువారం రద్దు చేసినట్లు తెలిపారు. అలాగే హౌరా - చెన్నై మెయిల్ (12839) మరింత ఆలస్యంగా నడుస్తుందని పేర్కొన్నారు. ఈ రైలు మంగళవారం రాత్రి 11.45 గంటలకు విశాఖ రావాల్సి ఉందని కానీ బుధవారం తెల్లవారుజామున 5.30 గంటలకు విశాఖ చేరుకుంటుందని వాల్తేర్ డివిజన్ అధికారులు చెప్పారు. -
ఫైవ్ స్టార్ హోటల్ సంచలన నిర్ణయం
చెన్నై: అకాల వర్షాలతో బాధలు పడుతున్నచెన్నై ప్రజలకు సంఘీభావంగా స్థానిక హోటల్ సంచలన నిర్ణయం తీసుకుంది. క్రిస్మస్, 2016 నూతన సంవత్సర వేడుకలను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. అష్టకష్టాలు పడుతూ మన చుట్టూ ఉన్న వారి కోసం ప్రార్థనలు చేద్దాం... విలాసాలు కాదంటూ పిలుపు నిచ్చింది. దీంతో పాటు పట్టణంలో ప్రతి సంవత్సరం ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఎత్తైన క్రిస్మస్ చెట్టు ఏర్పాటును కూడా రద్దు చేసేందుకు నిర్ణయించింది. చెన్నైకు చెందిన ప్రముఖ ఫైవ్ స్టార్ హోటల్ లి రాయల్ మెరిడియాన్ ఈ సంచలన నిర్ణయం తీసుకుంది. హోటల్ ఛైర్మన్ పీజీ పెరియ స్వామి ప్రకృతి విపత్తుతో విలవిల్లాడిన బాధితులను అందరం కలిసికట్టుగా ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. -
విమానం రద్దు... ప్రయాణికులకు ఇబ్బందులు
విజయవాడ : గన్నవరం విమానాశ్రయంలోని ఎయిర్ ఇండియా విమానంలో ఆదివారం సాంకేతిక లోపం ఏర్పడింది. దీంతో విమానం సర్వీస్‌ను రద్దు చేస్తున్నట్లు ఎయిర్ ఇండియా అధికారులు ప్రకటించారు. అయితే ప్రత్యామ్నయ విమానం సర్వీసును ఏర్పాటు చేయకుండా సదరు విమానాన్ని రద్దు చేయడం పట్ల ప్రయాణికులు ఉన్నతాధికారులపై మండిపడుతున్నారు. అధికారులు ఎంటువంటి ఏర్పాట్లు చేయకపోవడంతో తిరిగి వెళ్లడానికి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గన్నవరం విమానాశ్రయంలో ఈ రోజు ఉదయం ఎయిర్ ఇండియా విమానం బయలుదేర వలసి ఉంది. ఆ క్రమంలో విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. సాంకేతిక లోపాన్ని సరిచేసేందుకు సిబ్బంది తీవ్రంగా ప్రయత్నించారు. కానీ లోపాన్ని సరి చేయలేకపోయారు. దీంతో సదరు విమాన సర్వీసును రద్దు చేస్తున్నట్లు ఎయిర్ ఇండియా ఉన్నతాధికారులు ప్రకటించారు. -
రేవంత్ బెయిల్ రద్దు చేయండి.
-
రేవంత్ బెయిల్ రద్దు చేయండి
సాక్షి, హైదరాబాద్: ‘ఓటుకు కోట్లు’ కేసులో ప్రధాన నిందితుడు, టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి బెయిల్‌ను రద్దు చేయాలంటూ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) బుధవారం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. బెయిల్ షరతులను రేవంత్‌రెడ్డి ఉల్లంఘించారని, కేసులో సాక్షులను ప్రభావితం చేసేలా ప్రకటనలు చేస్తున్నారని ఏసీబీ అదనపు ఎస్పీ మల్లారెడ్డి పిటిషన్లో కోరారు. రేవంత్‌రెడ్డి మాటల వల్ల కేసులో సాక్ష్యం ఇచ్చేందుకు సాక్షులెవరూ ముందుకొచ్చే అవకాశాలు ఉండవని కోర్టుకు విన్నవించారు. ‘‘ఓటుకు కోట్లు’ కేసులో రేవంత్‌రెడ్డికి బెయిల్ మంజూరు చేసే సమయంలో హైకోర్టు పలు షరతులు విధించింది. నియోజకవర్గాన్ని దాటవద్దని, దర్యాప్తునకు సహకరించాలని ఆదేశించింది. కానీ బెయిల్‌పై విడుదలైన వెంటనే బహిరంగ ర్యాలీ నిర్వహించిన రేవంత్‌రెడ్డి, సీఎం కేసీఆర్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తరువాత అనారోగ్య కారణాలను చూపుతూ బెయిల్ షరతుల సడలింపునకు పిటిషన్ దాఖలు చేసి, అనుకూల ఉత్తర్వులు పొందారు. కీలక షరతులను సడలించిన హైకోర్టు, దర్యాప్తులో జోక్యం చేసుకోవడం గానీ, కేసు గురించి ఎలాంటి వ్యాఖ్యలు చేయడం గానీ చేయరాదని రేవంత్‌కు స్పష్టం చేసింది. కానీ ఈ షరతును రేవంత్‌రెడ్డి ఉల్లంఘించారు. ఈనెల 9న హైదరాబాద్‌లోని ఎల్బీ నగర్లో జరిగిన టీడీపీ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న ఆయన పలు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘నా మీద కుట్రలు, కుతంత్రాలు చేసి ఆ తరువాత జైలు పంపించారు. దీంతో కొడంగల్ నియోజకవర్గానికి పరిమితమై ఈ రోజు హైదరాబాద్‌కు వచ్చాను. ఆట మొదలైందని అంటున్నారు మిత్రులు. ఆటకాదు వేట మొదలైంది’ అంటూ వ్యాఖ్యలు చేశారు. ఈ మాటలు తీవ్ర అభ్యంతరకరం. ఇది కేసు గురించి వ్యాఖ్యలు చేయడమే కాదు. హైకోర్టు విధించిన షరతును ఉల్లంఘించడమే. సాక్ష్యం చెప్పేందుకు సాక్షులు ముందుకు రాకుండా చేసేందుకే రేవంత్ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇలా చేయడం కేసు దర్యాప్తులో జోక్యం చేసుకోవడమే. కాబట్టి రేవంత్‌కు ఇచ్చిన బెయిల్‌ను రద్దుచేసి తిరిగి జ్యుడీషియల్ కస్టడీకి పంపితే తప్ప దర్యాప్తు నిష్పక్షపాతంగా జరిగే అవకాశం లేదు’’ అని పిటిషన్లో పేర్కొన్నారు. -
వాహనాల పన్ను వివాదంపై పిటిషన్ కొట్టివేత
త్వరగా విచారించాలని హైకోర్టుకు సూచించిన సుప్రీం న్యూఢిల్లీ: తెలంగాణలో ప్రవేశించే ఏపీ వాహనాలపై పన్ను విధిం పు తగదంటూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. శ్యామల తదితర ప్రైవేటు బస్సు ఆపరేటర్లు ఈ మేరకు పిటిషన్ దాఖలు చేయ గా.. బుధవారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హెచ్.ఎల్.దత్తు, జస్టిస్ ఎస్.ఎ.బాబ్డే, జస్టిస్ అరుణ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం ముందు ఈ అంశం ప్రస్తావనకు వచ్చింది. పిటిషనర్ల తరపు న్యాయవాది వి.వి.ఎస్.రావు వాదన వినిపిస్తూ ఏపీలో రిజిస్టర్ అయిన బస్సులు తెలంగాణలోకి ప్రవేశిస్తే పన్ను కట్టాలంటూ ఆ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని, మరో పదేళ్లపాటు హైదరాబాద్ రెండు రాష్ట్రాలకూ ఉమ్మడి రాజధాని అని పునర్ వ్యవస్థీకరణ చట్టంలో పేర్కొన్న నేపథ్యంలో ఈ ఆదేశాలు చట్ట విరుద్ధమని వివరించారు. దీనిపై జస్టిస్ హెచ్.ఎల్.దత్తు స్పందిస్తూ పన్నులు విధించకుంటే పాలన ఎలా సాగుతుందని ప్రశ్నిం చారు. కానీ ఈ తరహా పన్ను విధించడం పరిహాసమేనని న్యాయవాది పేర్కొనగా.. ఏమాత్రం కాదని న్యాయమూర్తి అభిప్రాయ పడ్డారు. పన్నులు విధించడం రాష్ట్రాల అవసరమని, దీనిని తప్పుపట్టాల్సిన పనిలేదని అభిప్రాయపడుతూ పిటిషన్‌ను విచారించేందుకు తిరస్కరించారు. హైకోర్టులో ఈ కేసు విచారణ పెండింగ్‌లో ఉన్నందున దీనిని త్వరగా పరిష్కరించాలని సూచిస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. -
థర్మల్ కుంపటి మాకొద్దు
పలాస: థర్మల్ ప్లాంట్ పేరుతో సోంపేట, కాకరాపల్లి సంఘటనలను పునరావృతం చేయవద్దని వివిధ ప్రజాసంఘాల నాయకులు డిమాండ్ చేశారు. పలాస మండలం బొడ్డపాడు అమరవీరుల స్మారక మందిరంలో ఆదివారం రౌండు టేబుల్ సమావేశం జరిగింది. ఇందులో పాల్గొన్న పలువురు మాట్లాడుతూ ఉద్దానంలో పవర్ ప్లాంటు ఏర్పాటు ఆలోచనను తక్షణమే విరమించుకోవాలని, కిడ్నీ వ్యాధి బాధితుల కోసం ఉద్దానంలో డయాలిస్ కేంద్రం ఏర్పాటు చేయాలని కోరారు. ఉద్దానం ప్రాజెక్టు ద్వారా క్రమం తప్పకుండా మంచినీరు సర ఫరా చేయాలని, బహుళజాతి కంపెనీలతో ప్రభుత్వాలు కుదుర్చుకున్న అన్ని రకాల ఒప్పందాలను తక్షణమే రద్దు చేయాలని డిమాండు చేశారు. గతంలో ప్రతిపక్ష నాయకునిగా ఈ ప్రాంతంలో పర్యటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు థర్మల్ ప్రాజెక్టులను వ్యతిరేకించారని, అధికారంలోకి వచ్చిన తర్వాత పాత ఒప్పందాలు రద్దు చేయకపోగా కొత్త ప్లాంట్ల ఏర్పాటుకు ఒప్పందాలు చేసుకోవడం దారుణమన్నారు. ప్రశాంత ఉద్దానంలో విధ్వంసకర పరిశ్రమలను పెట్టడాన్ని విరమించుకోవాలన్నారు. థర్మల్ ప్రాజెక్టును పెట్టాలని ప్రయత్నిస్తే ఇక్కడి ప్రజలు ప్రతిఘటిస్తారని హెచ్చరించారు. జీవితాలపై తీవ్రప్రభావం చూపే ప్లాంట్‌ను అడ్డుకోవడానికి ప్రజలంతా సంఘటితం కావాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో దేశభక్త ప్రజాతంత్ర ఉద్యమ నాయకులు ఎస్.వీరాస్వామి, పి.నారాయణరావు, పౌరహక్కుల సంఘం నాయకుడు పత్తిరి దానేసు, ప్రగతిశీల కార్మిక సమాఖ్య నాయకుడు పుచ్చ దుర్యోధన, ప్రజా కళామండలి నాయకుడు జుత్తు శంకర్, అమరుల బంధుమిత్రుల సంఘం నాయకుడు జోగి కోదండరావు, టెక్కలి డివిజన్ రైతాంగ సాధన క మిటీ నాయకుడు దాసరి శ్రీరాములు, కుల నిర్మూలన కమిటీ నాయకుడు మిస్క క్రిష్ణయ్య, డీటీఎఫ్ నాయకుడు కె.ధర్మారావు తదితరులు పాల్గొన్నారు. -
గతంలో పరిశ్రమలకు చేసిన భూ కేటాయింపులన్నీ రద్దు
మంత్రి పల్లె రఘునాథరెడ్డి వెల్లడి సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో 2008వ సంవత్సరం నుంచి పలు పరిశ్రమలకు సంబంధించి ప్రభుత్వం చేసిన భూముల కేటాయింపులన్నీ రద్దు చేయాలంటూ.. అవినీతి నిరోధంపై ఏర్పాటైన మంత్రుల ఉపసంఘం రాష్ట్ర మంత్రివర్గానికి సిఫారసు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్ర సమాచార, ఐటీశాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి తెలిపారు. ఉపసంఘం బుధవా రం హైదరాబాద్‌లోని సచివాలయంలో సమావేశమై పలు నిర్ణయాలు తీసుకుంది. ఈ వివరాలను రఘునాథరెడ్డి వెల్లడించారు. వాన్‌పిక్ ప్రాజెక్టుకు ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో కేటాయించిన 18,878 ఎకరాలు కేటాయించేందుకు ఒప్పందం జరిగిందని.. అందులో 6,608 ఎకరాలు అప్పగించారని ఆ ఎంఓయూ, కేటాయింపులన్నీ రద్దు చేయాలని నిర్ణయించామన్నారు. అప్పగించిన భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందన్నారు. అనంతపురం జిల్లా చిలమత్తూరు, గోరంట్ల మండలాల్లో లేపాక్షి నాలెడ్జ్ హబ్‌కు 8,840 ఎకరాలు కేటాయించారని, ఇందులోపెద్ద కుంభకోణం జరిగిందని మంత్రి తెలిపారు. సర్వీసు చార్జీ 15 శాతం వసూలు చేయాల్సి ఉండగా, 2 శాతం మాత్రమే వసూలు చేశారని, ప్రభుత్వానికి రావాల్సిన రూ. 15.19 కోట్ల సొమ్ము ఎగ్గొట్టారని పేర్కొన్నారు. నెల్లూరు జిల్లా చిలకూరు మండలంలో కినెటా పవర్ ప్రైవేటు లిమిటెడ్‌కు వపర్ ప్రాజెక్టుకు కేటాయించిన 814.77 స్వాధీనం చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. -
తుపాను ధాటికి దెబ్బతిన్న రైల్వే రవాణా
విశాఖ: హూదుద్ పెను తుపానుతో రైల్వే రవాణాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. తుపాను ప్రభావంతో తాజాగా 62 రైళ్ల సర్వీసులను రద్దు చేసినట్లు దక్షిణమధ్య రైల్వే ప్రకటించింది. మరో 50 రైల్వే సర్వీసులను దారి మళ్లించినట్లు పేర్కొంది. ప్రస్తుతం ట్రాక్ స్థితిగతులపై విజయవాడ, విశాఖ, భువనేశ్వర్ నుంచి సమీక్షలు నిర్వహిస్తున్నట్లు రైల్వే అధికారులు స్పష్టం చేశారు. తుపాను ధాటికి ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల్లో రైళ్లు భారీగా రద్దయినట్లు అధికారులు తెలిపారు. విజయవాడ నుంచి భువనేశ్వర్ మధ్య రైళ్లను పూర్తిగా రద్దు చేయగా, విశాఖ-హైదరాబాద్ మధ్య రైళ్లను వరుసుగా రెండో రోజు కూడా రద్దు చేశారు. రద్దయిన రైళ్ల వివరాలు.. భువనేశ్వర్ - బెంగళూరు (ప్రశాంతి), భువనేశ్వర్ - విశాఖపట్నం (ఇంటర్సిటీ) సికింద్రాబాద్ - భువనేశ్వర్ (విశాఖ) పూరీ - తిరుపతి ఎక్స్‌ప్రెస్ భువనేశ్వర్ - ముంబయి (కోణార్క్) విజయవాడ - విశాఖపట్నం (రత్నాచల్) తిరుపతి - విశాఖపట్నం (తిరుమల) నిజాముద్దీన్ - విశాఖపట్నం ( దక్షిణ్) విశాఖపట్నం - హైదరాబాద్ (గోదావరి) సికింద్రాబాద్ - విశాఖపట్నం (గరీభ్ రథ్) విశాఖపట్నం - సికింద్రాబాద్ (దురంతో) సికింద్రాబాద్ - విశాఖపట్నం (జన్మభూమి) జగదల్ పూర్ - భువనేశ్వర్ (హిరాకండ్) విశాఖపట్నం - నిజాముద్దీన్ (సమతా) -
తుపాన్ దృష్ట్యా పలు రైల్వే సర్వీసులు రద్దు
హైదరాబాద్: హుదూద్ తుపాను దృష్ట్యా నేడు పలు ఎక్స్‌ప్రెస్, సూపర్‌పాస్ట్ రైళ్లను రద్దు చేస్తున్నట్లు రైల్వే శాఖ ప్రకటించింది. రద్దు అయిన ఎక్స్‌ప్రెస్, సూపర్‌పాస్ట్ రైళ్ల వివరాలు... భువనేశ్వర్ - బెంగళూరు (ప్రశాంతి), భువనేశ్వర్ - విశాఖపట్నం (ఇంటర్సిటీ) సికింద్రాబాద్ - భువనేశ్వర్ (విశాఖ) పూరీ - తిరుపతి ఎక్స్‌ప్రెస్ భువనేశ్వర్ - ముంబయి (కోణార్క్) విజయవాడ - విశాఖపట్నం (రత్నాచల్) తిరుపతి - విశాఖపట్నం (తిరుమల) నిజాముద్దీన్ - విశాఖపట్నం ( దక్షిణ్) విశాఖపట్నం - హైదరాబాద్ (గోదావరి) సికింద్రాబాద్ - విశాఖపట్నం (గరీభ్ రథ్) విశాఖపట్నం - సికింద్రాబాద్ (దురంతో) సికింద్రాబాద్ - విశాఖపట్నం (జన్మభూమి) జగదల్ పూర్ - భువనేశ్వర్ (హిరాకండ్) విశాఖపట్నం - నిజాముద్దీన్ (సమతా) -
ఆదర్శం అవుట్
నరసన్నపేట రూరల్: టీడీపీ ప్రభుత్వం అన్నంత పని చేసింది. అధికారం చేపట్టక ముందు నుంచే అదర్శ రైతుల వ్యవస్థను రద్దు చేస్తామని చెబుతూ వచ్చిన తెలుగుదేశం నేతలు అధికారం చేపట్టిన మూడు నెలల తర్వాత తామనుకున్నది చేసేశారు. ఈ వ్యవస్థ లోపభూయిష్టంగా ఉందన్న సాకు చూపిస్తూ.. దీని స్థానంలో కొత్త వ్యవస్థ ఏర్పాటు చేస్తామంటూ వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ చంద్ర పునేఠా పేరుతో జీవో నెం. 43 జారీ అయ్యింది. ఈ జీవో ఫలితంగా ఆదర్శ రైతుల వ్యవస్థ రద్దు కాగా.. జిల్లాలో 1652 మంది ఆదర్శ రైతులు ఇంటికే పరిమితం కానున్నారు. వ్యయసాయాన్ని మరింత లాభసాటిగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌రాజశేఖరరెడ్డి 2007లో ఆదర్శ రైతుల వ్యవస్థను ప్రవేశపెట్టారు. వీరికి ప్రతి నెలా వెయ్యి రూపాయల గౌరవ వేతనం ఇవ్వాలని నిర్ణయించారు. ఆయన మరణించే వరకూ ఈ వ్యవస్థ ద్వారా వ్యవసాయ రంగం చాలా బలోపేతమైంది. ఆదర్శ రైతుల ద్వారానే గ్రామాల్లో విత్తనాలు, ఎరువుల పంపిణీ సమాచారాన్ని గ్రామస్థాయిలో రైతులకు చేరవేయడంతోపాటు.. ఏ తెగులుకు ఏ మందు వాడాలి, ఏ సమయంలో ఏ ఎరువు వాడితే దిగుబడి బాగుంటుందన్న సూచనలు ఇచ్చేవారు. వైఎస్ఆర్ మరణాంతరం ఈ వ్యవస్థ గాడి తప్పింది. దీంతో అనర్హులను తొలగించాలన్న ఉద్దేశంతో 2012 జూన్‌లో ప్రభుత్వ ఆదేశాల మేరకు వ్యవసాయ శాఖ ఆదర్శ రైతులకు పరీక్షలు నిర్వహించింది. గత ఏడాది ఫలితాలను కూడా ప్రకటించింది. ఈ పరీక్షల్లో తప్పినవారిని తొలగించి, వారి స్థానంలో కొత్తవారిని నియమిస్తామని చెప్పినా అది అమలు కాలేదు. మొదట్లో 2800 ఆదర్శ రైతులు ఉండగా పరీక్షల సమయానికి 2400 మంది ఉండేవారు. పరీక్షల్లో తప్పిన 400 మందిని తొలగించగా, మరికొంత మంది మానివేశారు. దీంతో ప్రస్తుతం 1652 మంది మిగిలారు. అప్పటి నుంచి ఆదర్శరైతులు బాధ్యతగానే వ్యవహరిస్తున్నారు. వ్యవసాయశాఖ ఇచ్చిన పనులను చేస్తూ రైతులకు ఉపయుక్తంగా ఉండేవారు. అయితే కాంగ్రెస్ కార్యకర్తలే ఆదర్శ రైతులుగా ఉన్నారని ఆరోపిస్తున్న టీడీపీ, అధికారంలోకి రావడంతో ఆ వ్యవస్థనే రూపుమాపేసింది. తీవ్ర వ్యతిరేకత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఆదర్శ రైతులు తీవ్రంగా తప్పుపడుతున్నారు. పనిచేయని వారిని తొలగిస్తే బాగుం డేది. అలాగే ఉన్న వారితో పని చేయించుకోవాలే గానీ తొలగించడం అన్యాయమంటున్నారు. చాలా మంది ఇదే పనిని నమ్ముకొని ఉండిపోయారని, ప్రభుత్వ ఉత్తర్వులతో తామంతా వీధిన పడ్డామని వాపోతున్నారు. 18 నెలలుగా నెలవారీ తమకివ్వాల్సిన వెయ్యి రూపాయల గౌరవ వేతనం కూడా ఇవ్వడంలేదని, దాని సంగతి ఏమటని పలువురు ప్రశ్నిస్తున్నారు. బకాయిలు చెల్లించకుండా జీవోలతో తొలగించడమేమిటని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కోర్టుకు వెళతాం ఎటువంటి సమీక్షలు, పరిశీలనలు లేకుండా అందరినీ మూకుమ్మడిగా తొలగించడం అన్యాయం. దీనిపై కోర్టును ఆశ్రయిస్తాం. ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తాం. జీవో కాపీని పూర్తిగా పరిశీలించన తర్వాత కోర్టులో పిటిషన్ వేస్తాం. మాకు రావాల్సిన 18 నెలల వేతన బకాయిల కోసం ఆందోళనలు నిర్వహిస్తాం. -శ్రీనివాసరావు, జిల్లా సంఘం అధ్యక్షుడు