Kajal Aggarwal
-
గ్రాండ్‌గా హీరోయిన్ కాజల్ అగర్వాల్ కుమారుడి బర్త్ డే వేడుక (ఫోటోలు)
-
కాజల్ సీన్లు లేపేశారు.. అందుకే సినిమా డిజాస్టర్!
బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ (Salman Khan)కు బ్యాడ్ టైమ్ నడుస్తోంది. తన ఖాతాలో వరుసగా డిజాస్టర్లు పడుతున్నాయి. అతడు నటించిన లేటెస్ట్ మూవీ సికందర్ (Sikandar Movie) కూడా బాక్సాఫీస్ వద్ద అట్టర్‌ఫ్లాప్‌గా నిలిచింది. ఏఆర్ మురుగదాస్ డైరెక్ట్ చేసిన ఈ మూవీలో రష్మిక మందన్నా హీరోయిన్గా నటించింది. కాజల్ అగర్వాల్ ముఖ్య పాత్ర పోషించింది.కాజల్ సీన్ డిలీట్అయితే సినిమాలో కాజల్ (Kajal Aggarwal) సీన్ డిలీట్ చేశారంటూ నెట్టింట గగ్గోలు వినిపిస్తోంది. ఈ మేరకు ఓ సన్నివేశం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అందులో ఏముందంటే.. అత్తింట్లో కాజల్ చనిపోవడానికి ప్రయత్నిస్తుంది. ఆమెను ఎలాగోలా కాపాడతారు. అయితే ఆమె మామ మాత్రం.. చనిపోవడానికి మా ఇల్లే దొరికిందా? అని నిందిస్తారు. ఈ చావేదో పుట్టింట్లో చావు అని శాపనార్థాలు పెడతారు. అప్పుడే అటుగా వెళ్తున్న సల్మాన్ ఇదంతా చూస్తాడు. పెద్ద డైలాగ్ చెప్తాడు. ఆడవారికి కావాల్సింది డబ్బు కాదని, మనమిచ్చే సపోర్ట్ అని చెప్పుకుంటూ పోతాడు.ఇంత చెత్త ఎడిటింగా?ఈ సీన్‌ను ఎక్స్ (ట్విటర్)లో చూసిన అభిమానులు.. 'అదేంటి? ఈ సన్నివేశం సినిమాలో లేదా? అందుకే డిజాస్టర్ అయింది, ఇది ఉండుంటే సినిమాకు ప్లస్సయ్యేది..', 'ఫస్ట్ డే సినిమా చూసినప్పుడు ఈ సన్నివేశాన్ని అలాగే ఉంచినట్లు గుర్తు.. ఇప్పుడు దాన్ని లేపేశారా?', 'జనాలు కచ్చితంగా చూడాల్సిన ఓ ముఖ్యమైన సన్నివేశాన్ని కట్ చేసి పడేస్తే ఎలా? ఇంత చెత్త ఎడిటింగ్ ఎందుకు?' అని పలువురు ప్రశ్నిస్తున్నారు. సికందర్ సినిమా విషయానికి వస్తే.. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ మూవీ మార్చి 30న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 21 రోజుల్లో రూ.110 కోట్ల మేర కలెక్షన్లు రాబట్టింది. Why was this scene cut from the Film by Editing??@BeingSalmanKhan that was a great and important scene for people to see... WHY THIS BAD EDITING??#Sikandar pic.twitter.com/FpV6zdRwR6— Ldpe414 (@ldpe414) April 20, 2025 చదవండి: బ్రెయిన్ సర్జరీ.. అరగుండుతో కష్టాలు.. కన్నీళ్లు పెట్టుకున్న అషూ రెడ్డి -
పెద్దితో స్పెషల్ సాంగ్?
‘నేను పక్కా లోకల్ పక్కా లోకల్.. పక్కా లోకలే...’ అంటూ హీరోయిన్ కాజల్ అగర్వాల్ వేసిన డ్యాన్సుల్ని ప్రేక్షకులు అంత సులువుగా మరచి పోలేరు. ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన ‘జనతా గ్యారేజ్’(2016) సినిమాలో తొలిసారి ప్రత్యేక పాటలో సందడి చేశారీ బ్యూటీ. ఎన్టీఆర్‌కి సమానంగా డ్యాన్సులతో అదరగొట్టారామె. ఆ చిత్రం తర్వాత మరో ప్రత్యేక పాట చేయలేదు కాజల్. అయితే ఆమె తెలుగులో రెండోసారి స్పెషల్ సాంగ్ చేయనున్నారని టాక్. రామ్‌చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘పెద్ది’. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తున్నారు.మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్‌పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ పాన్ ఇండియా చిత్రం షూటింగ్ జరుపుకుంటోంది. ఈ మూవీలో ఓ స్పెషల్ సాంగ్ ఉంటుందట. ఈ పాటకి కాజల్‌ని తీసుకోవాలన్నది బుచ్చిబాబు ఆలోచనట. సినిమాకి ఓ హైలెట్‌గా నిలవనున్న ఈ పాటలో రామ్ చరణ్‌తో కలిసి ఆమె డ్యాన్స్ చేయనున్నట్లు తెలుస్తోంది. గతంలో రామ్‌చరణ్ –కాజల్ హీరో హీరోయిన్లుగా నటించిన తొలి చిత్రం ‘మగధీర’ (2009) బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది.ఆ తర్వాత వీరి కాంబినేషన్లో వచ్చిన ద్వితీయ చిత్రం ‘గోవిందుడు అందరి వాడేలే’ (2014) కూడా విజయం అందుకుంది. ఇప్పుడు ‘పెద్ది’లో కాజల్ ఐటమ్ సాంగ్ చేస్తే... దాదాపు పదకొండేళ్ల తర్వాత వీరిద్దరూ స్క్రీన్ షేర్ చేసుకున్నట్లు అవుతుంది. మరి.. ‘పెద్ది’లో ఐటమ్ సాంగ్ ఉందా? ఉంటే కాజల్ అగర్వాల్ నటిస్తారా? అనే విషయాలపై అధికారిక ప్రకటన రావాలంటే వేచి చూడాలి. జగపతిబాబు, శివ రాజ్‌కుమార్, దివ్యేందు శర్మ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండగా, రత్నవేలు కెమేరామేన్‌గా చేస్తున్నారు. ఈ చిత్రం రామ్‌చరణ్ బర్త్ డేకి 2026 మార్చి 27న విడుదల కానుంది. -
పెద్దిలో మగధీర కాంబినేషన్?
-
సల్మాన్ ఖాన్ సికందర్ మూవీ భం భం భోలే సాంగ్.. (ఫోటోలు)
-
సల్మాన్ ఖాన్ సికందర్.. ఆ క్రేజీ సాంగ్ వచ్చేసింది!
బాలీవుడ్ స్టార్, కండల వీరుడు సల్మాన్ ఖాన్ నటిస్తోన్న తాజా చిత్రం సికందర్. ఈ మూవీలో పుష్ప భామ రష్మిక మందన్నా హీరోయిన్గా నటిస్తోంది. ప్రస్తుతం బాలీవుడ్‌లోనూ రష్మిక హవా కొనసాగుతోంది. ఇటీవలే ఛావా మూవీతో ప్రేక్షకులను పలకరించిన భామ.. రంజాన్ కానుకగా మరోసారి అభిమానులను అలరించనుంది. ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రాన్ని గ్రాండ్సన్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై సాజిద్ నదియావాలా నిర్మిస్తున్నారు.తాజాగా సికందర్ మూవీ నుంచి క్రేజీ సాంగ్‌ను విడుదల చేశారు. భమ్ భమ్ భోలే అంటూ సాగే పాటను విడుదల చేశారు. హోలీ పండుగ రంగుల నేపథ్యంలో రూపొందించిన ఈ పాట సల్మాన్ ఫ్యాన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఇప్పటికే రిలీజైన టీజర్, జోహ్రా జబీన్ పాటకు ఆడియన్స్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. ఈ సాంగ్‌లో కాజల్ అగర్వాల్ కూడా అభిమానులను మెప్పించింది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం రంజాన్ కాననుకగా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. -
‘కన్నప్ప’ మూవీ HD స్టిల్స్
-
మిల్కీ బ్యూటీపై స్కామ్ ఆరోపణలు.. ఘాటుగా స్పందించిన తమన్నా
మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా ప్రస్తుతం కేవలం బాలీవుడ్‌కే పరిమితమైంది. తమన్నా చివరిసారిగా సికందర్ కా ముఖద్దర్ చిత్రంలో కనిపించింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ తెలుగులో తెరకెక్కుతోన్న ఓదెల-2 మూవీలో కనిపించనున్నారు. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన టీజర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ చిత్రాన్ని అశోక్ తేజ దర్శకత్వంలో మధు క్రియేషన్స్, సంపత్ నంది టీమ్ వర్క్స్ పతాకాలపై డి. మధు నిర్మించారు. ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.టఅయితే తాజాగా మిల్కీ బ్యూటీపై క్రిప్టో కరెన్సీ స్కామ్‌లో పాత్ర ఉందంటూ వార్తలొస్తున్నాయి. ఈ నేపథ్యంలో తనపై వస్తున్న కథనాలపై తమన్నా స్పందించింది. రూ. 2.4 కోట్ల క్రిప్టోకరెన్సీ స్కామ్‌లో తనకు ఎలాంటి ప్రమేయం లేదని తెలిపింది. తనకు ఎలాంటి మోసపూరిత కార్యకలాపాలతో సంబంధం లేదని పేర్కొంది. తనపై వస్తున్న వార్తలను ఆమె తీవ్రంగా ఖండించింది. ఇలాంటి తప్పుడు ప్రచారం చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటానని వార్నింగ్ కూడా ఇచ్చింది. ఈ సమస్యను న్యాయపరంగా పరిష్కరించేందుకు తగిన చర్యలు తీసుకుంటానని తెలిపింది.తమన్నా మాట్లాడుతూ.. 'క్రిప్టోకరెన్సీ స్కామ్‌లో నా ప్రమేయం ఉందని వార్తలు రావడం నా దృష్టికి వచ్చింది. ఇలాంటి నకిలీ, తప్పుదోవ పట్టించేలా వదంతులు ప్రసారం చేయవద్దని మీడియాలోని నా స్నేహితులను అభ్యర్థించాలనుకుంటున్నా. అలా చేసిన వారిపై తగిన చర్య తీసుకోవడానికి నా టీమ్ పనిచేస్తుంది' అని తెలిపింది. తనపై వస్త్నున తప్పుడు ఆరోపణలపై తమన్నా తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. కాగా.. ఇవాళ ఉదయం నుంచి క్రిప్టోకరెన్సీ స్కామ్‌లో విచారణ కోసం తమన్నా భాటియా, కాజల్ అగర్వాల్‌లను పుదుచ్చేరి పోలీసులు విచారణకు పిలిచే అవకాశం ఉందని వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తమన్నా స్పందించింది.అసలేం జరిగిందంటే?కోయంబత్తూర్ ప్రధాన కేంద్రంగా క్రిప్టో కరెన్సీ పేరుతో 2022లో ఓ కంపెనీ ప్రారంభించారు. దీనికి తమన్నా(Thamannah Bhatia) తదితరులు హాజరయ్యారు. అనంతరం మహాబలిపురంలోని ఓ స్టార్ హోటల్ లో జరిగిన సంస్థ కార్యక్రమానికి కాజల్ అగర్వాల్ హాజరైంది. తర్వాత ముంబైలోని క్రూయిజ్ నౌకలో గ్రాండ్ గా పార్టీ నిర్వహించి, పెట్టుబడులు పెట్టేలా ప్రజల్ని ఆకర్షించారు.ఈ క్రమంలోనే అత్యధిక లాభాల్ని రిటర్న్ ఇస్తామని చెప్పిన క్రిప్టో కరెన్సీ సంస్థ.. పుదుచ్చేరిలో వేలాది మంది నుంచి రూ.3.4 కోట్లు వసూలు చేశారు. ఈ వ్యవహారంలో నితీష్ జైన్, అరవింద్ కుమార్ అనే వ్యక్తుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. అశోకన్ అనే రిటైర్డ్ ఉద్యోగి ఫిర్యాదు మేరకు హీరోయిన్లు తమన్నా, కాజల్ అగర్వాల్ ను కూడా ఈ కేసులో భాగంగా ఇప్పుడు పోలీసులు విచారించనున్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ విషయం కాస్త ఇప్పుడు వార్తల్లో నిలిచింది. -
కోట్ల రూపాయల మోసం కేసులో తమన్నా-కాజల్?
సైబర్ నేరాలు కావొచ్చు, ఎక్కువ డబ్బులిస్తామని ఆశపెట్టడం కావొచ్చు.. గత కొన్నేళ్లలో చాలామంది ప్రజలు మోసపోతూనే ఉన్నారు. కొన్నాళ్ల క్రితం ఇలానే క్రిప్టో కరెన్సీ పేరుతో పుదేచ్చేరిలో పలువురు కోట్ల రూపాయల మోసపోయారు. ఇప్పుడీ కేసులో హీరోయిన్లు తమన్నా-కాజల్(Kajal Aggarwal)ని పోలీసులు విచారించబోతున్నారు?(ఇదీ చదవండి: ఒక్కరోజే ఓటీటీల్లోకి వచ్చేసిన 20 సినిమాలు)ఇంతకీ ఏం జరిగింది?కోయంబత్తూర్ ప్రధాన కేంద్రంగా క్రిప్టో కరెన్సీ పేరుతో 2022లో ఓ కంపెనీ ప్రారంభించారు. దీనికి తమన్నా(Thamannah Bhatia) తదితరులు హాజరయ్యారు. అనంతరం మహాబలిపురంలోని ఓ స్టార్ హోటల్ లో జరిగిన సంస్థ కార్యక్రమానికి కాజల్ అగర్వాల్ హాజరైంది. తర్వాత ముంబైలోని క్రూయిజ్ నౌకలో గ్రాండ్ గా పార్టీ నిర్వహించి, పెట్టుబడులు పెట్టేలా ప్రజల్ని ఆకర్షించారు.ఈ క్రమంలోనే అత్యధిక లాభాల్ని రిటర్న్ ఇస్తామని చెప్పిన క్రిప్టో కరెన్సీ సంస్థ.. పుదుచ్చేరిలో వేలాది మంది నుంచి రూ.3.4 కోట్లు వసూలు చేశారు. ఈ వ్యవహారంలో నితీష్ జైన్, అరవింద్ కుమార్ అనే వ్యక్తుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు.(ఇదీ చదవండి: నాన్న ఫోన్ చేసేసరికి ప్రభాస్ భయపడ్డాడు: మంచు విష్ణు)అశోకన్ అనే రిటైర్డ్ ఉద్యోగి ఫిర్యాదు మేరకు హీరోయిన్లు తమన్నా, కాజల్ అగర్వాల్ ను కూడా ఈ కేసులో భాగంగా ఇప్పుడు పోలీసులు విచారించనున్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ విషయం కాస్త ఇప్పుడు వార్తల్లో నిలిచింది.పుదుచ్చేరి సైబర్ క్రైమ్ ఎస్పీ డాక్టర్ బాస్కరన్ మాట్లాడుతూ.. ఈ సంస్థపై ఢిల్లీ, ఒడిశా, మహారాష్ట్ర, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కేరళ సహా పలు ప్రాంతాల్లో కేసులు నమోదయినట్టు చెప్పారు. మొత్తంగా రూ.50 కోట్ల మేర మోసాలకు పాల్పడినట్టు పేర్కొన్నారు. ఈ కేసులో కోయంబత్తూరు, బెంగళూరు, చెన్నైకు చెందిన కనీసం 10 మందికిపైగా నిందితుల ఉన్నట్టు విచారణలో వెల్లడయ్యిందని వివరించారు.(ఇదీ చదవండి: సీనియర్ నటి జయప్రద ఇంట్లో విషాదం) -
మాల్దీవుస్‌లో సాక్షి అగర్వాల్ చిల్.. దుబాయ్‌లో కాజల్ బ్యూటీ!
ఊప్స్ అబ్ క్యా అంటోన్న శ్వేతా బసు ప్రసాద్..గొడ్డలి చేతపట్టిన సీరియల్ బ్యూటీ జ్యోతి పూర్వాజ్..మాల్దీవుస్‌లో ఫుల్‌గా ఎంజాయ్ చేస్తోన్న సాక్షి అగర్వాల్..మహాకుంభ్ మేళాలో పవిత్రం స్నానం చేసిన నిమ్రత్ కౌర్..పార్టీలో ఫుల్‌గా చిల్ అవుతోన్న సురేఖవాణి కూతురు సుప్రీత..దుబాయ్ టూర్లో కాజల్ అగర్వాల్ చిల్.. View this post on Instagram A post shared by Pragya Kapoor (@pragyakapoor_) View this post on Instagram A post shared by Nimrat Kaur (@nimratofficial) View this post on Instagram A post shared by Sakshi Agarwal (@iamsakshiagarwal) View this post on Instagram A post shared by JyotiPoorvaj (Jayashree Rai K K) (@jyotipoorvaj) View this post on Instagram A post shared by Shweta Basu Prasad (@shwetabasuprasad11) View this post on Instagram A post shared by Kajal A Kitchlu (@kajalaggarwalofficial) View this post on Instagram A post shared by Bandaru Sheshayani Supritha (@_supritha_9) -
బీచ్‌లో అనన్య నాగళ్ల చిల్.. స్టన్నింగ్ లుక్‌లో సలార్ నటి!
బీచ్‌లో అనన్య నాగళ్ల చిల్..స్టన్నింగ్ లుక్‌లో సలార్ నటి శ్రియా రెడ్డి..పింక్ డ్రెస్‌లో సింగర్ మధు ప్రియ పోజులు..బ్లూ డ్రెస్‌లో కాజల్ అగర్వాల్ క్రేజీ అవుట్‌ఫిట్..లేటేస్ట్ పిక్ షేర్ చేసిన మిహికా బజాజ్.. View this post on Instagram A post shared by Miheeka Daggubati (@miheeka) View this post on Instagram A post shared by Kajal A Kitchlu (@kajalaggarwalofficial) View this post on Instagram A post shared by Madhupriya (@madhupriya_peddinti) View this post on Instagram A post shared by Sriya Reddy (@sriya_reddy) View this post on Instagram A post shared by Andrea Jeremiah (@therealandreajeremiah) View this post on Instagram A post shared by Ananya nagalla (@ananya.nagalla) -
ది ఇండియా స్టోరీ ప్రారంభం
‘ది ఇండియా స్టోరీ’ని మొదలెట్టారు హీరోయిన్ కాజల్ అగర్వాల్(Kajal Aggarwal). శ్రేయాస్ తల్పాడే, కాజల్ అగర్వాల్ లీడ్ రోల్స్‌లో నటిస్తున్న మూవీ ‘ది ఇండియా స్టోరీ’(The India Story). చేతన్ డీకే దర్శకత్వంలో సాగర్ బి. షిండే నిర్మిస్తున్న ఈ మూవీ చిత్రీకరణ పుణేలోప్రారంభమైంది. ‘‘ది ఇండియా స్టోరీ’ తొలి షెడ్యూల్‌ని పుణే(Pune)లోప్రారంభించాం. ఇప్పటి వరకు ఎవరూ చెప్పని, ఓ ప్రభావితమైన కథను చూపించబోతున్నాం. ఆగస్టు 15న థియేటర్స్‌లో కలుద్దాం’’ అని ‘ఎక్స్’ వేదికగా కాజల్ అగర్వాల్ పేర్కొన్నారు. కాగా.. ‘ది ఇండియా స్టోరీ’ లోని ఓ మేజర్ షెడ్యూల్ చిత్రీకరణ కొల్హాపూర్‌లో జరగనుందని బాలీవుడ్ సమాచారం. రైతుల కష్టాలు, వ్యవసాయ రంగంలో కొన్ని పురుగులమందు వ్యాపార సంస్థలు చేసే మోసాలు వంటి అంశాల నేపథ్యంలో ఈ మూవీ ఉంటుందని టాక్. -
12 మంది అందాల భామలతో కలర్ఫుల్గా మై సౌత్ దివా క్యాలెండర్
ప్రముఖ ఫొటోగ్రాఫర్ మనోజ్ కుమార్ కటోకర్ రూపొందించిన ప్రతిష్టాత్మక మై సౌత్ దివా క్యాలెండర్ ద్వారా ఇప్పటికే పలువురు హీరోయిన్స్ పరిచయమై.. అగ్రశ్రేణిలో ఉన్నారు. తాజాగా 2025 క్యాలెండర్ ను 12 మంది స్టార్స్ తో శుక్రవారం గ్రాండ్ గా లాంచ్ చేశారు. హీరోయిన్స్ శ్రియా శరన్, కేథరిన్ థెరిస్సా, కాజల్ అగర్వాల్, మాళవికా శర్మ, తాన్య హోప్, ఐశ్వర్య కృష్ణ, కుషిత కొల్లాపు, వినాలీ భట్నాగర్, రియా సచ్ దేవ్, కనిక మాన్, పలక్ అగర్వాల్ తో ఈ క్యాలెండర్ ను శుక్రవారం హైదరాబాద్ లో ఆవిష్కరించారు. క్యాలెండర్ ఫౌండర్ మనోజ్ కుమార్ కటొకర్, భారతి సిమెంట్స్ మార్కెటింగ్ డైరెక్టర్ రవీందర్ రెడ్డితోపాటు ప్రముఖ సినిమాటోగ్రాఫర్ జ్ఞాన శేఖర్, దర్శకులు కరుణ కుమార్, సుజనా రావు ముఖ్య అతిథులుగా హాజరై తమ విషెస్ తెలియజేశారు.ఈ సందర్భంగా... మై సౌత్ దివా క్యాలెండర్ ఫౌండర్, ఫోటో గ్రాఫర్ మనోజ్ కుమార్ కటొకర్ మాట్లాడుతూ.."మా క్యాలెండర్ ను తొమ్మిది ఏళ్లుగా సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. 12 మంది హీరోయిన్స్ తో కూడిన ఈ క్యాలెండర్ అందరికీ నచ్చుతుందని భావిస్తున్నా. మా క్యాలెండర్ ద్వారా ఇప్పటికే కొత్తవారిని మోడల్స్ గా పరిచయం చేశాం. అలాగే కొంతమంది హీరోయిన్స్ గా మంచి గుర్తింపును అందుకున్నారు. ఈ ఏడాది మరో ఐదుగురిని ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. ఈ జర్నీలో నాకు సపోర్ట్ గా నిలిచిన మా పార్ట్నర్స్ భారతి సిమెంట్స్, కియారా జ్యువెలరీ, ఈరా క్లినిక్స్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు" అని చెప్పారు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ జ్ఞాన శేఖర్ మాట్లాడుతూ ‘ఈ క్యాలెండర్‌లోని కలర్స్ చాలా బాగున్నాయి. మనోజ్ చాలా డెడికేటెడ్ గా వర్క్ చేస్తారు’అని చెప్పారు. డైరెక్టర్ కరుణ కుమార్ మాట్లాడుతూ ‘‘పలాస’ మూవీ టైమ్‌లో మనోజ్ గారు నాకు చేసిన సపోర్ట్ మర్చిపోలేనిది. ఆయనతో నాకు ఐదేళ్ల జర్నీ ఉంది. ఇప్పటికీ నా సినిమాల్లో హీరోయిన్స్ కోసం ఆయన రిఫరెన్స్ తీసుకుంటాను. ఈ సందర్భంగా ‘పలాస’ చిత్రాన్ని మార్చి 6న రీ రిలీజ్ చేయాలని ప్రకటిస్తున్నాం’ అని చెప్పారు.దర్శకురాలు సుజనారావు మనోజ్ గారికి బెస్ట్ విషెస్ తెలియజేశారు. భారతి సిమెంట్స్ మార్కెటింగ్ డైరెక్టర్ రవీందర్ రెడ్డి మాట్లాడుతూ ‘సౌత్ దివా క్యాలెండర్ చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. ఒక క్యాలెండర్లో చాలా కల్చర్స్ ఉండటం మంచి పరిణామం. స్టార్ హీరోయిన్స్‌తో ఉన్న ఈ క్యాలెండర్ కలర్ఫుల్గా ఉంది’ అని చెప్పారు. ‘హైడ్ అండ్ సీక్’ మూవీ హీరోయిన్ రియా సచ్దేవ్ మాట్లాడుతూ ‘తెలుగు ప్రేక్షకుల ప్రేమ, సపోర్ట్ మర్చిపోలేనిది’ అని చెప్పింది. హీరోయిన్ మాల్వీ మల్హోత్రా మాట్లాడుతూ ‘ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది. ఈ క్యాలెండర్ ద్వారా చాలా మంది న్యూ టాలెంట్ ఇండస్ట్రీకి వస్తుంది’ అని అన్నారు.ఈ కార్యక్రమానికి హాజరైనహీరోయిన్స్ ఐశ్వర్య కృష్ణ, పలక్ అగర్వాల్, కనిక మాన్, అనుశ్రీ, రిచా జోషి,జెస్సీ మాట్లాడుతూ... "మై సౌత్ దివా క్యాలెండర్ తొమ్మిదవ ఎడిషన్ లో భాగమవడం చాలా హ్యాపీగా ఉంది" అని అన్నారు. -
బిజీ బిజీ
‘ది ఇండియా స్టోరీ’లో భాగం అయ్యారు హీరోయిన్ కాజల్ అగర్వాల్. శ్రేయాస్ తల్పాడే హీరోగా చేతన్ డీకే దర్శకత్వంలో ‘ది ఇండియా స్టోరీ’ అనే మూవీ రానుంది. ఈ చిత్రంలోనే హీరోయిన్గా నటించనున్నారు కాజల్ అగర్వాల్. ఆల్రెడీ ఈ సినిమా చిత్రీకరణ ముంబైలోప్రారంభమైంది. ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ ముంబై షెడ్యూల్లోనే కాజల్ అగర్వాల్ కూడా పాల్గొంటున్నారని సమాచారం. అలాగే ఈ సినిమాను ఈ ఏడాది ఆగస్టు 15న రిలీజ్ చేయనున్నట్లుగా ప్రకటించారు మేకర్స్. ‘‘ఓ పవర్ఫుల్ స్టోరీ... ఇప్పటివరకు ఎవరూ ఇలాంటి కథ చెప్పలేదు’’ అని మేకర్స్ పేర్కొన్నారు.వ్యవసాయ రంగంలో జరుగుతున్న మోసాలు, పురుగుల మందులు అమ్మే సంస్థల మోసాల నేపథ్యంలో ఈ మూవీ ఉంటుందనే టాక్ బాలీవుడ్లో వినిపిస్తోంది. ఇక ఈ సినిమా కాకుండా సల్మాన్ ఖాన్ హీరోగా నటిస్తున్న ‘సికందర్’లో కాజల్ అగర్వాల్ ఓ లీడ్ రోల్లో నటిస్తున్నారు. ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీలో రష్మికా మందన్నా హీరోయిన్. ఈ ఏడాది రంజాన్ సందర్భంగా ఈ మూవీ రిలీజ్ కానుంది.అలాగే కాజల్ అగర్వాల్ ఇప్పటికే పూర్తి చేసిన హిందీ మూవీ ‘ఉమ’ రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఇంకా కమల్‌హాసన్ హీరోగా చేసిన ‘ఇండియన్ 3’ చిత్రంలో కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటించారు. ఈ చిత్రం కూడా ఈ ఏడాదే రిలీజ్‌కు ముస్తాబు అవుతోంది. ఇలా ఈ ఏడాది బిజీ బిజీగా ఉండటంతో పాటు వరుస సినిమాల రిలీజ్‌లతో కాజల్ వెండితెరపై సందడి చేస్తారనుకోవచ్చు. -
కన్నప్ప మూవీ.. కాజల్ అగర్వాల్ ఏ పాత్ర చేయనుందంటే?
మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా వస్తోన్న చిత్రం 'కన్నప్ప'. అవా ఎంటర్ టైన్మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ పాన్ ఇండియా మూవీలో బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్, ప్రభాస్, మోహన్ లాల్, శరత్ కుమార్, మోహన్ బాబు, బ్రహ్మానందం, కాజల్ అగర్వాల్ వంటి స్టార్స్ కనిపించనున్నారు.ఇప్పటికే రిలీజైన కన్నప్ప టీజర్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. టీజర్ చూస్తే ప్రేక్షకులకు విజువల్ ఫీస్ట్‌లా ఉంది. విష్ణు మంచు యాక్షన్ సీన్స్, యుద్ధ సన్నివేశాలు, అక్షయ్ కుమార్, ప్రభాస్ క్లోజప్ షాట్స్, హై ప్రొడక్షన్ వ్యాల్యూస్, స్టన్నింగ్ విజువల్స్, అదిరిపోయే పర్ఫార్మెన్స్ లతో కన్నప్ప టీజర్ ప్రేక్షకులను అలరించింది. యూట్యూబ్‌లోనూ ఇప్పటివరకు అన్ని భాషల్లో కలిపి 30 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించింది.తాజాగా ఈ మూవీ నుంచి కాజల్ అగర్వాల్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రివీల్ చేశారు మేకర్స్. ఈ చిత్రంలో పార్వతి దేవి పాత్రలో కాజల్ కనిపించనుంది. ఈ మేరకు నాలుగు భాషల్లో కాజల్ ఫస్ట్ లుక్ పోస్టర్‌తో పాటు క్యారెక్టర్‌ను పరిచయం చేశారు. పార్వతి దేవి లుక్‌లో కాజల్ అభిమానులను ఆకట్టుకుంటోంది. మీరు కూడా పోస్టర్‌ను చూసేయండి.కాగా.. ఇప్పటికే ఈ చిత్రం నుంచి మధుబాల,శరత్‌కుమార్, దేవరాజ్ వంటి ప్రముఖ నటులు పోషిస్తున్న పాత్రలకు పరిచయం చేస్తూ.. వారి పాత్రలకు సంబంధించిన పోస్టర్లతో సినిమాపై అంచనాలను పెంచేశారు. ఇందులో కంపడు పాత్రలో ముఖేష్ రిషి, గవ్వరాజుగా బ్రహ్మాజీ కనిపించనున్నారు. వారు అత్యంత పురాతన పుళిందుల జాతికి చెందిన అత్యంత భయంకరమైన తెగకు చెందినవారు. సదాశివ కొండలలో జన్మించిన వీరిని భద్రగణం అని కూడా అంటారు. వారు 'వాయులింగానికి వంశపారంపర్య సేవకులు మరియు రక్షకులు. కంపడు నాయకుడిగా ఉంటూనే భద్రగణాన్ని నడిపిస్తాడు. ఈ వంశం త్రిశూలాలను ఉపయోగించడంలో ప్రత్యేకత కలిగి వున్నవారు. ఈ సినిమాలోని కిరాట పాత్రలో మోహన్‌లాల్ నటిస్తున్నారు. గతంలోనే ఆయన ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేశారు.కన్నప్ప కథేంటంటే..పాన్ ఇండియా ప్రాజెక్ట్ కన్నప్ప సినిమా ఈ తరం ప్రేక్షకులకైనా కొత్తగానే ఉంటుంది. భక్తి భావం, ధూర్జటి మహాకవి ఎలా రాశారు? శ్రీకాళహస్తి మహత్మ్యం ఏంటి? అన్నది ఈ చిత్రంలో చూపించనున్నాం. ఇది కేవలం భక్తి చిత్రమే కాదు. అన్ని రకాల అంశాలు ఈ సినిమాలో ఉన్నాయి. ఆ పరమేశ్వరుడి ఆజ్ఞతోనే ఈ సినిమా తీస్తున్నాం అన్నారు మోహన్‌బాబు.విజువల్ వండర్‌గా కన్నప్ప..ఈ చిత్రంలో డా.మోహన్ బాబు, మోహన్ లాల్, ప్రభాస్, బ్రహ్మానందం, బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ సినిమాకు కీలకమైన పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్ ఇచ్చే విజువల్ వండర్‌గా రాబోతోందని ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు కూడా. సినిమాను చూసిన ప్రేక్షకులు సరికొత్త అనుభూతిని ఇస్తుందని వెల్లడించారు. ఆడియన్స్‌ను మరో ప్రపంచంలోకి వెళ్లిన ఎక్స్పీరియన్స్ ఇచ్చే విధంగా మేకర్స్ చిత్రాన్ని రెడీ చేస్తున్నట్లు ప్రకటించారు. విష్ణు మంచు కన్నప్ప పాత్రను ఈ చిత్రంలో పోషిస్తున్నారు. మోహన్ బాబు నిర్మిస్తున్న ఈ విజువల్ వండర్‌ను పాన్ ఇండియాలో ఈ ఏడాది ఏప్రిల్ 25న విడుదల చేయనున్నారు. 🌟 Divine Grace Personified 🌟Here is the glorious full look of @MsKajalAggarwal as '𝐌𝐀𝐀 𝐏𝐚𝐫𝐯𝐚𝐭𝐢 𝐃𝐞𝐯𝐢'🪷 the divine union with '𝐋𝐨𝐫𝐝 𝐒𝐡𝐢𝐯𝐚'🔱, in #Kannappa🏹. Witness her ethereal beauty and the divine presence, she brings to life in this epic tale of… pic.twitter.com/EvEgx3GDWY— Kannappa The Movie (@kannappamovie) January 6, 2025 -
ఇయర్ ఎండ్‌లో కాజల్ అగర్వాల్ చిల్.. పార్టీలో మెరిసిన తమన్నా, విజయ్ వర్మ! (ఫోటోలు)
-
బౌన్స్ బ్యాక్..ఈ విషయాలు అందరికీ తెలియాలి : టాలీవుడ్‘చందమామ’
మహిళలకు పెళ్లి, మాతృత్వం, పిల్లల పెంపకం అనేది కరియర్లో పెద్ద అడ్డంకిమాత్రమే కాదు. శారీరకంగా,మానసికంగా, భావోద్వేగ పరంగా చాలా క్లిష్టమైంది కూడా. ఈ విషయాన్నే టాలీవుడ్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ సోషల్ మీడియా పోస్ట్ ద్వారా చెప్పుకొచ్చింది. పట్టుదలగా, ఓర్పుగా సాధన చేస్తే పెళ్లీ, పిల్లల బాధ్యతలతో పాటు, కరియర్‌ను సాగించడం, అలాగే శారీరకంగా ఫిట్‌గా ఉండటం సాధ్యమే అంటూ తన అనుభవాలను షేర్ చేసింది.బ్యాలెన్స్ అనేది చెప్పుకోడానికి బానే ఉంటుంది, కానీ వాస్తవం చాలా క్లిష్టంగా ఉంటుందంటూ 2024లో తన జర్నీ గురించి వివరించింది కాజల్. 2024 ఏడాది అంతా భావోద్వేగాలు, శారీరక మార్పులు వీటన్నిటికీ మించిన బాధ్యతల వలయంలో గడిచిపోయింది. పసిబిడ్డకు తల్లిగా మాత్రమే కాకుండా, ఒక నటిగా తన బాడీనీ, శక్తిని నిరంతరం దృష్టిలో ఉంచుకోవాల్సిన పయనమిది అని పేర్కొంది.బిడ్డ పుట్టిన తరువాత బాగా బరువు పెరిగాను, తల్లిగా పెరిగిన బరువును తగ్గించుకోవడంతోపాటు, మాతృత్వపు బాధ్యతలు, నటిగా కరియర్, రెండింటినీ చాలా బలంగా నిర్వర్తించారు. ఆందోళనను అధిగమించాను. కానీ అదంతా సులభంగా సాగలేదు. ఎన్నో సందేహాలు, ఆశలు, నిరాశలు, అలసట ఇలాంటివెన్నో ఉన్నాయి. ‘‘మనలో చాలా మందిలాగే, నేనూ అద్దంలో చూసుకున్నాను.. మళ్లీ మునుపటిలా మారతానా అని ఆలోచించేదాన్ని’’ అంటూ ఇన్‌స్టాలో తెలిపింది కాజల్. View this post on Instagram A post shared by Kajal A Kitchlu (@kajalaggarwalofficial) "బౌన్స్ బ్యాక్" అసాధ్యం కాదని గ్రహించడమే కీలక మలుపు. దృఢ సంకల్పంతో కొత్త అధ్యాయం కోసం ముందుగా సాగా అని చెప్పుకొచ్చింది. అలాగే పోషకాహార నిపుణుడి సాయంతో ఆరోగ్యకరమైన, పోషకాలు అధికంగా ఉండే ఆహారాన్ని ఎంచుకున్నాను. తృప్తినిచ్చే భోజనంతోపాటు క్రమశిక్షణగా, సమతుల్య ఆహారంపై దృష్టి కేంద్రీకరించాను అంటూ వివరించింది కాజల్. ఈ ప్రయాణంలో ఫిట్నెస్ మరో మూలస్తంభం. చాలా ఓర్పుగా, ధైర్యం, సంకల్పంతో ముందుకెళ్లాను. శ్రద్ధగా తీసుకున్న పోషకాహారం బిజీ షెడ్యూల్లో మరింత శక్తినిచ్చింది. ఈ నా జర్నీ మరింత మందికి ధైర్యంతో ముందుకు సాగాలే ప్రేరణనిస్తుందని ఆశిస్తున్నాను. ప్రపంచం కోసంమాత్రమే కాకుండా, మనకోసం మన ఆనందం కోసం కలిసి సాగుదాం అంటూ ముగించింది. అలాగే అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపింది.కాగా చందమామ, మగధీర లాంటి సినిమాలతో టాలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకున్న కాజల్, 2020లో తన స్నేహితుడు గౌతమ్ కిచ్లూను వివాహం చేసుకుంది. వీరికి ఒక కుమారుడు. ఈ బాధ్యతల విరామం తరువాత మళ్లీ సినిమాల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. -
అందాల చందమామ కాజల్! ఆ సీక్రెట్ ఏంటంటే..
'అందం అమ్మాయైతే నీలా ఉంటుందే...' అనేలా ఉంటుంది కాజల్ అగర్వాల్. చందమామలాంటి మోముతో చూడముచ్చటగా ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. పెళ్లితో హీరోయిన్ల కథ కంచికి అనుకుంటారు. కానీ కాజల్ విషయం అందుకు విరుద్ధం. పెళ్లై ఓ బిడ్డకు తల్లైనా ఇప్పటకీ అంతే గ్లామర్‌తో కట్టిపడేస్తుంది. పైగా వరుస సినిమాలతో దూసుకుపోతుంది. ఈ నేపథ్యంలో కాజల్ ఇంతలా గ్లామర్‌ని మెయింటైన్ చేసేందుకు ఏం చేస్తుందో, అలాగే ఫిట్‌గా ఉండేందుకు ఎలాంటి డైట్ ఫాలో అవుతుందో సవివరంగా తెలుసుకుందామా..!కాజల్ అందం, ఫిట్నెస్ గురించి అభిమానుల్లో ఎల్లప్పడూ చర్చనీయాంశమే. ఆమె ఇప్పటికీ అలానే ఉందంటూ మాట్లాడుకుంటుంటారు. పెళ్లైతే ఎలాంటి హీరోయిన్ల క్రేజ్ అయినా తగ్గిపోతుంది. కానీ కాజల్ విషయంలో నో ఛాన్స్ చెప్పేస్తున్నారు అభిమానులు. అంతలా సహజ సౌందర్యంతో మైమరిపించే కాజల్ ఓ ఇంటర్వ్యూలో తన అందం, ఫిటెనెస్ల సీక్రెట్ గురించి షేర్ చేసుకుంది. అందం కోసం..కాజల్ తప్పనిసరిగా మాయిశ్చరైజింగ్, సన్‌స్క్రీన్, హైడ్రేషన్ నైట్ సిరమ్‌లు తప్పనిసరిగా వాడతానని అంటోంది. అవి తన చర్మాన్ని ప్రకాశంతంగా కనిపించేలా చేస్తాయని తెలిపింది. స్కిన్ గ్లో కోసం ప్రత్యేకమైన కేర్ తీసుకుంటానంటోంది. ఫిట్నెస్ కోసం..ఎంత బిజీ షెడ్యూల్ అయినా వ్యాయామాలు, యోగా, వర్కౌట్లు స్కిప్ చేయనని చెబుతోంది. సినిమా షూటింగ్‌లు, కుటుంబానికి సంబంధించిన కమిట్మెంట్స్ ఉన్నా సరే..రోజువారి దినచర్యలో భాగమైన వ్యాయామాలను చేసే తీరతానని అంటోంది. అలాగే ప్రతిరోజు కనీసం 30-40 నిమిషాలు పైలెట్స్ చేసేలా లక్ష్యం పెట్టుకుంటానని చెబుతోంది. డైట్ కోసం..సమతుల్య ఆహారానికే ప్రాధాన్యత ఇస్తానంటోంది. తాజా పండ్లు, ఆకుకూరలు, కొబ్బరి నీళ్లు, రోజువారీ డైట్లో తప్పనిసరి అని చెబుతోంది. పైగా పండ్ల సహజ చక్కెరలతో తక్షణ శక్తి, ఆకుకూరల ద్వారా పోషకాలు, నట్స్ ద్వారా అవసరమైన కొవ్వులు అందుతాయని చెబుతోంది. కొబ్బరి నీరు తన దినచర్యలో భాగమని అంటోంది. ఇది తనను హైడ్రేటెడ్‌గా ఉంచడమే గాక రిఫ్రెష్‌గా ఉండేలా చేస్తుంది. తాను ఎలాంటి మోడ్రన్ డైట్లు ఫాలోకానని తేల్చి చెప్పింది. ఆరోగ్యకరమై డైట్‌తో ఫిట్‌గా, అందంగా ఉండేలా కేర్ తీసుకుంటానని పేర్కొంది కాజల్.(చదవండి: ఏడు పదుల వయసులోనూ ఎంతో చలాకీగా, ఫిట్‌గా శక్తికపూర్..! హెల్త్ సీక్రెట్ ఇదే..) -
నిర్మాత నైట్ పార్టీలో తమన్నా-కాజల్ అగర్వాల్ సందడి (ఫొటోలు)
-
భర్తకు ప్రేమగా తినిపించిన కాజల్, అలాగే కలిసి తాగుతూ (ఫోటోలు)
-
స్టార్ హీరోయిన్ చెల్లి.. తెలుగులో హిట్ సినిమాలు.. చివరకు పెళ్లి చేసుకుని! (ఫొటోలు)
-
ప్రభాస్‌తో ఛాన్స్ వస్తే.. నన్ను తొలగించి కాజల్‌ను తీసుకున్నారు: రకుల్
టాలీవుడ్ నటి రకుల్ ప్రీత్ సింగ్ కొద్దిరోజుల క్రితం నెపోటిజం (బంధుప్రీతి) గురించి మాట్లాడి సంచలనం రేపారు. అయితే, తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ప్రభాస్‌తో వచ్చిన ఒక సినిమా ఛాన్స్ ఎలా కోల్పోయిందో చెప్పుకొచ్చారు. ప్రభాస్‌తో ఒక ప్రాజెక్ట్ ప్రారంభమయ్యాక తనకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే తొలగించారని రకుల్ పేర్కొన్నారు. ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే తన స్థానంలో మరో హీరోయిన్ను తీసుకున్నారని తెలిపారు.రకుల్ ప్రీత్ సింగ్ ఎలాంటి సినీ నేపథ్యం లేకుండానే మొదట కన్నడ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చారు. ఆపై తన నటనతో ప్రేక్షకులను మెప్పించి స్వశక్తితో అవకాశాలు దక్కించుకున్నారు. అయితే, తన సినీ కెరియర్ ప్రారంభంలోనే ప్రభాస్ సరసన సినిమా ఛాన్స్ వచ్చినట్లు గుర్తుచేసుకున్నారు. ఆ ప్రాజెక్ట్‌లో తను కొంత భాగం షూటింగ్లో కూడా పాల్గొన్నట్లు తెలిపారు. ఆ సినిమా మొదటి షెడ్యూల్ పూర్తి చేసిన తర్వాత తాను కాలేజీకి వెళ్లినట్లు చెప్పారు. అయితే, రెండో షెడ్యూల్ పిలుపు కోసం ఎదురు చూసిన తనకు నిరాశే మిగిలిందన్నారు. షూటింగ్ కోసం చిత్ర యూనిట్ నుంచి తనకు ఎలాంటి కబురు రాలేదని ఆమె అన్నారు. తన స్థానంలో కాజల్‌ను తీసుకున్నారని మరోకరి ద్వారా తనకు తెలిసినట్లు చెప్పుకొచ్చారు. అయితే, కనీసం సమాచారం కూడా ఇవ్వకుండా తనను తొలగించడంతో కాస్త బాధ అనిపించినట్లు తెలిపారు. వారిద్దరి కాంబినేషన్లో అప్పటికే వచ్చిన సినిమా హిట్ కావడంతో అదే జోడీని రిపీట్ చేస్తే బాగుంటుందని చిత్ర యూనిట్ భావించినట్లు తర్వాత తెలిసిందన్నారు. కొత్తగా సినిమా పరిశ్రమలోకి వచ్చే హీరోయిన్లకు ఇలాంటివి జరగడం సర్వసాధారణమని ఆమె అన్నారు. ఇలాంటి ఘటనలు ఆమెకు చాలానే ఎదురయ్యాయని అన్నారు. కాజల్ అగర్వాల్, ప్రభాస్ కాంబినేషన్లో రెండు సినిమాలు డార్లింగ్ (2010), Mr పర్ఫెక్ట్ (2011) వచ్చాయి. రకుల్ చెబుతున్న ప్రకారం 'Mr పర్ఫెక్ట్' చిత్రంలో తనకు వచ్చిన అవకాశం కోల్పోయినట్లు తెలుస్తోంది. -
పాటతో పండగ
ముంబైలోని ధారావిలో గల మురికివాడలో జరిగిన ఓ పండగకు హాజరయ్యారు సల్మాన్ ఖాన్, రష్మికా మందన్నా. ఆ పండగలో భాగంగా అక్కడి రెండు వందల మందితో కలిసి డ్యాన్స్ చేశారు. సల్మాన్ ఖాన్, రష్మికా మందన్నా జంటగా నటిస్తున్న ‘సికందర్’కి సంబంధించి ప్రచారంలో ఉన్న వార్త ఇది. కథలో భాగంగా ధారావిలో జరిగే పండగకి ఈ ఇద్దరూ వెళతారట. అప్పుడు వచ్చేపాటను చిత్రదర్శకుడు మురుగదాస్ భారీగా చిత్రీకరించారని సమాచారం. జోష్‌గా సాగే ఈపాటకు సల్మాన్, రష్మికా అదిరి΄ోయే లెవల్లో స్టెప్పులు వేశారట.మురికివాడలకు సంబంధించిన సెట్‌ని ముంబైలోని ఓ ప్రముఖ స్టూడియోలో వేయించి, ఈపాటను చిత్రీకరించారని భోగట్టా. ఇక ఈ చిత్రంలో కీలకపాత్రలో కనిపించనున్న కాజల్ అగర్వాల్ ‘సికందర్’ సెట్స్‌లో అడుగుపెట్టారు. ‘సికందర్ డే 1’ అంటూ ఈ విషయాన్ని సామాజిక మాధ్యమం ద్వారా స్పష్టం చేశారు కాజల్. వచ్చే ఏడాది ఈద్ సందర్భంగా ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. -
సికందర్‌కు సాయం
‘సికందర్’కు సాయం చేయనున్నారట హీరోయిన్ కాజల్ అగర్వాల్. సల్మాన్ ఖాన్ హీరోగా ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్ సినిమా ‘సికందర్’. ఈ చిత్రంలో రష్మికా మందన్నా హీరోయిన్ . సత్యరాజ్, ప్రతీక్ బబ్బర్ కీలకపాత్రలుపోషిస్తున్నారు. కాగా ఈ సినిమాలో కాజల్ కూడా ఓ కీలకపాత్రలో నటించనున్నారట. త్వరలోనే ‘సికందర్’ షూటింగ్లో ఆమెపాల్గొంటారని బాలీవుడ్ టాక్. కథ రీత్యా ఈ చిత్రంలో సల్మాన్ కు సాయం చేసేపాత్రలో కాజల్ నటిస్తారట. మరి.. ‘సికందర్’లో కాజల్ భాగమైనట్లేనా? అంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాలి. ఇదిలా ఉంటే.. ముంబైలోని ఓ స్టూడియోలో నిర్మించిన భారీ సెట్లో ప్రస్తుతం ‘సికందర్’ చిత్రీకరణ జరుగుతోంది. సాజిద్ నడియాద్వాలా నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే రంజాన్ సందర్భంగా రిలీజ్ కానుంది. -
బంగారంలా మెరిసిపోతున్న రాశీ.. ధోని ఫ్యామిలీతో నయనతార
అనంత్ పెళ్లికి అందంగా ముస్తాబైన కాజల్మహారాణిలా వెలిగిపోతున్న కృతి సనన్క్యూట్గా ఉన్నా కదూ అంటోన్న నయని పావనిక్రికెటర్ ధోని ఫ్యామిలీతో నయనతారబంగారంలా మెరిసిపోతున్న రాశీ ఖన్నా View this post on Instagram A post shared by Kajal A Kitchlu (@kajalaggarwalofficial) View this post on Instagram A post shared by Kriti (@kritisanon) View this post on Instagram A post shared by Sai Pavani Raju (@nayani_pavani) View this post on Instagram A post shared by N A Y A N T H A R A (@nayanthara) View this post on Instagram A post shared by Raashii Khanna (@raashiikhanna) View this post on Instagram A post shared by Namrata Shirodkar (@namratashirodkar) View this post on Instagram A post shared by Sreeleela (@sreeleela14) View this post on Instagram A post shared by Shruti Haasan (@shrutzhaasan) View this post on Instagram A post shared by Varalaxmi Sarathkumar (@varusarathkumar) View this post on Instagram A post shared by Sonakshi Sinha (@aslisona) View this post on Instagram A post shared by Sara Ali Khan (@saraalikhan95) View this post on Instagram A post shared by KIARA (@kiaraaliaadvani) View this post on Instagram A post shared by Madhuri Dixit (@madhuridixitnene) -
వైట్ డ్రస్‌లో మెరిసిపోతూ.. స్టన్నింగ్ లుక్స్ షేర్ చేసిన కాజల్ అగర్వాల్ (ఫోటోలు)
-
గ్లామర్‌తో పోటీ పడుతున్న బ్యూటీస్
నేను పెయింటర్‌ను కాదంటున్న శ్రీలీలఏంజిల్లా మెరిసిపోతున్న కాజల్బీచ్లో కసరత్తు చేస్తున్న హనీరోజ్బుట్టబొమ్మలా జాన్వీ కపూర్సరికొత్త లుక్‌లో షాకిస్తున్న డింపుల్ హయాతి View this post on Instagram A post shared by Doulath sulthana (@inayasulthanaofficial) View this post on Instagram A post shared by Honey Rose (@honeyroseinsta) View this post on Instagram A post shared by Kajal A Kitchlu (@kajalaggarwalofficial) View this post on Instagram A post shared by Sreeleela (@sreeleela14) View this post on Instagram A post shared by mon (@imouniroy) View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor) View this post on Instagram A post shared by Hebah P (@ihebahp) View this post on Instagram A post shared by Dimple Hyati (@dimplehayathi) View this post on Instagram A post shared by Pragya Jaiswal (@jaiswalpragya) View this post on Instagram A post shared by Ananya nagalla (@ananya.nagalla) View this post on Instagram A post shared by Manushi Chhillar (@manushi_chhillar) View this post on Instagram A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna) View this post on Instagram A post shared by disha patani (paatni) 🦋 (@dishapatani) View this post on Instagram A post shared by Manchu Lakshmi Prasanna (@lakshmimanchu) -
Kajal Aggarwal: బ్లాక్ డ్రెస్‌లో ‘చందమామ’ మెరుపులు (ఫొటోలు)
-
Indian 2: 103 ఏళ్ల సేనాపతి ఫైట్స్ ఎలా చేస్తాడు..? శంకర్ సమాధానం ఇదే
హీరో కమల్‌హాసన్, దర్శకుడు శంకర్ కాంబినేషన్లో రూపొందిన చిత్రం ‘ఇండియన్ 2’ (తెలుగులో ‘భారతీయుడు 2’). 1996లో విడుదలైన బ్లాక్‌బస్టర్ సినిమా ‘ఇండియన్’కి సీక్వెల్స్‌గా ‘ఇండియన్ 2, ఇండియన్ 3’ సినిమాలు రూసొందాయి. కమల్‌హాసన్ హీరోగా శంకర్ దర్శకత్వం వహించిన ఈ సీక్వెల్స్‌లో ముందు ‘ఇండియన్ 2’ చిత్రం తెలుగు, తమిళ, హిందీ భాషల్లో జూలై 12న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఇటీవల ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు. ట్రైలర్లో సేనాపతిగా కమల్‌హాసన్ కొన్ని మార్షల్ ఆర్ట్స్, యాక్షన్ సీక్వెన్స్‌లు చేశారు. అయితే ‘ఇండియన్’ సినిమాలో సేనాపతికి 75 సంవత్సరాలు. ఈ ప్రకారం 2024లో ఆయన వయస్సు 103కి చేరుతుంది. అలాంటప్పుడు అంత వయసులో సేనాపతి మార్షల్ ఆర్ట్స్, భారీ యాక్షన్ సీక్వెన్స్‌లు ఎలా చేయగలుగుతున్నాడు అనే సందేహాలను వ్యక్తపరచారు కొందరు నెటిజన్లు. ఈ విషయంపై ఇటీవల జరిగిన ఓ మీడియా సమావేశంలో శంకర్ స్పందించారు. ‘‘నా దృష్టిలో సేనాపతి ఓ సూపర్ హీరో. ‘భారతీయుడు’ కథ రాసుకున్నప్పుడు సేనాపతిని ఓ స్వాతంత్య్ర సమరయోధుడిగా చూపించాలని అప్పుడు సేనాపతికి 75 సంవత్సరాలు అన్నట్లుగా చూపించాం. అప్పుడు సీక్వెల్ ఆలోచన లేదు. ఇప్పుడు ‘భారతీయుడు 2’లో చైనా మార్షల్ ఆర్ట్స్ ఫైటర్‌గా సేనాపతి కనిపిస్తాడు. అత్యధిక వయసు కలిగిన ఫైటర్స్ చైనాలో ఉన్నారు. 108 సంవత్సరాలు ఉన్న లు జీజీయన్ అనే చైనా మార్షల్ ఆర్ట్స్ ఫైటర్ ఇప్పటికీ యాక్టివ్‌గా ఉన్నారు. వారి సాధన, క్రమశిక్షణ వారిని అలా తీర్చిదిద్దుతుంది. సేనాపతి కూడా అలాంటివాడే’’ అని చెప్పుకొచ్చారు శంకర్. ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్, రకుల్‌ప్రీత్ సింగ్, సిద్ధార్థ్, బాబీ సింహా, ఎస్జే సూర్య, గుల్షన్ గ్రోవర్ కీలక పాత్రల్లో నటించారు. ఇక ‘ఇండియన్ 3’ చిత్రం వచ్చే ఏడాది ప్రారంభంలో విడుదల కానుంది. -
సంతూర్ మమ్మీలా 'కాజల్ అగర్వాల్'.. ఫోటోలు వైరల్
-
ఫ్యాన్స్ చేసిన పనికి కాజల్ అగర్వాల్ ఎమోషనల్
హీరోయిన్ కాజల్ అగర్వాల్ 39వ పుట్టినరోజుని తాజాగా జరుపుకొంది. ఈ క్రమంలోనే అభిమానులు, తోటీ సెలబ్రిటీలు ఈమెకు విషెస్ చెప్పారు. అందరూ శుభాకాంక్షలు చెప్పి వదిలేశారు కానీ కాజల్ ఫ్యాన్స్ మాత్రం చాలాకాలం గుర్తుండిపోయే పని చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి 11 మూవీస్.. మొత్తంగా 17 రిలీజ్)ముంబైలో పుట్టి పెరిగిన కాజల్ అగర్వాల్.. 'లక్ష్మీ కల్యాణం' సినిమాతో హీరోయిన్ అయింది. 'మగధీర' మూవీతో స్టార్ హోదా సొంతం చేసుకుంది. ఆ తర్వాత దక్షిణాదిలోనూ స్టార్ హీరోలందరితోనూ దాదాపుగా నటించేసింది. కరోనా లాక్డౌన్ టైంలో ప్రియుడు గౌతమ్ కిచ్లూని పెళ్లి చేసుకుంది. ఈమెకు ఓ కొడుకు పుట్టాడు.సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చిన కాజల్.. ఈ మధ్య 'సత్యభామ' మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. సరే ఇదంతా పక్కనబెడితే కాజల్ ఫ్యాన్స్.. ఈమె పుట్టినరోజు సందర్భంగా 150 మందికి ఫుడ్ పంచారు. అలానే ఈ నెలాఖరులోపు 50 మొక్కలు నాటేందుకు సిద్ధమవుతున్నారు. దీని గురించి తెలిసి కాజల్ భావోద్వేగానికి గురైంది. అద్భుతమైన పని చేశారని చెప్పి మెచ్చుకుంది.(ఇదీ చదవండి: 'కల్కి' మరో వీడియో.. స్టోరీని దాదాపు చెప్పేసిన డైరెక్టర్!)You guys never fail to amaze me with your thoughtfulness and kind compassion towards society. Thank you so much my amazing friends at @wekafawa for all the birthday love ❤️🙏🏻❤️ https://t.co/5F4xTZiZ10— Kajal Aggarwal (@MsKajalAggarwal) June 20, 2024 -
భర్త, కొడుకుతో బర్త్‌డే బాష్ : దిల్ ఖుష్ అంటున్న ‘భామ’ ఫోటోలు
-
'సత్యభామ' కాజల్ అగర్వాల్ బర్త్‌డే.. ఈ ఫోటోలు చూశారా..?
-
Kajal: అందంతో అల్లాడించే సొగసుల రాణి (ఫోటోలు)
-
‘సత్యభామ’ మూవీ రివ్యూ
టైటిల్: సత్యభామనటీనటులు: కాజల్ అగర్వాల్, ప్రకాష్ రాజ్, నవీన్ చంద్ర, అంకిత్ కోయా, అనిరుథ్ పవిత్రన్, సంపద, సత్య ప్రదీప్త, హర్షవర్థన్, రవివర్మ తదితరులునిర్మాణ సంస్థ: అవురమ్ ఆర్ట్స్స్క్రీన్ ప్లే,ప్రెజెంటర్:శశి కిరణ్ తిక్క నిర్మాతలు : బాబీ తిక్క, శ్రీనివాసరావు తక్కలపెల్లిదర్శకత్వం: సుమన్ చిక్కాలసంగీతం: శ్రీ చరణ్ పాకాలసినిమాటోగ్రఫీ : బి విష్ణువిడుదల తేది: జూన్ 7, 2024కథేంటంటే.. సత్య అలియాస్ సత్యభామ(కాజల్)షీ టీమ్ డిపార్ట్మెంట్లో ఏసీపీగా పని చేస్తుంది. అమ్మాయిలకు ఇబ్బంది కలిగించేవారిని మఫ్టీలో వెళ్లి మరీ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకొని శిక్ష పడేలా చేస్తుంది. అంతేకాదు షీ సేఫ్ యాప్ ఎలా ఉపయోగించుకోవాలో అవగాహన కల్పిస్తూ..తమకు ఎలాంటి సమస్యలు వచ్చినా,సత్యభామ ఉందనే నమ్మకం మహిళల్లో కలిగించేలా చేస్తుంది. అలా ఓ సారి హసీనా అనే యువతి.. ప్రేమించి పెళ్లి చేసుకున్న తన భర్త యాదు(అనిరుథ్ పవిత్రన్)చిత్రహింసలకు గురి చేస్తున్నాడని సత్యతో చెబుతుంది. యాదుకి సత్య వార్నింగ్ ఇవ్వగా..అదే కోపంతో అతను హసీనాను చంపేసి పారిపోతాడు. ఎలాగైన అతన్ని పట్టుకొని శిక్షించాలనేది సత్య కోరిక. యాదు కోసం వెతుకుతూనే ఉంటుంది.ఈ క్రమంలో ఓ రోజు హసీనా తమ్ముడు, వైద్యవిద్యార్థి ఇక్బల్(ప్రజ్వల్) మిస్ అవుతాడు. ఈ కేసును సత్య పర్సనల్‌గా తీసుకుంటుంది. పై అధికారులు అడ్డుకున్నా లెక్కచేయకుండా విచారణ చేస్తుంది. ఈ మిస్సింగ్ కేసుకి లోకల్ ఎంపీ కొడుకు రిషి(అంకిత్ కోయా)కి లింక్ ఉందని తెలుస్తుంది. అతన్ని పట్టుకునే క్రమంలో విజయ్, నేహాలు ఇందులో భాగమైనట్లు తెలుస్తుంది. అసలు ఇక్బల్ని కిడ్నాప్ చేసిందెవరు? సత్య, విజయ్‌లు ఎవరు? వీరిద్దరు రిషికి ఎలా పరిచయం అయ్యారు? సత్య ఈ కేసును ఎందుకు పర్సనల్‌గా తీసుకుంది? ఇన్వెస్టిగేషన్లో ఆమెకు తెలిసిన నిజాలు ఏంటి? ఇంతకీ యాదు దొరికాడా లేదా? దివ్య ఎవరు? ఆమెకి ఇక్బల్‌కి మధ్య ఉన్న సంబంధం ఏంటి? చివరకు ఇక్బల్ మిస్సింగ్ కేసుని సత్య ఎలా ఛేదించింది? భర్త అమరేందర్(నవీన్ చంద్ర)తనకు ఎలా తోడుగా నిలిచాడు? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే..ఆడియన్స్ ఎక్కువగా ఆసక్తి చూపే జోనర్స్ లో సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ మూవీస్ ఒకటి. కథలో ఇంట్రెస్ట్, సస్పెన్స్ లు, ట్విస్ట్ లు ఉంటే ప్రేక్షకులు ఆ సినిమాను బాగా ఎంజాయ్ చేస్తారు. ఇప్పటికే అలాంటి సినిమాలు చాలా వచ్చాయి. ‘సత్యభామ’ కూడా అదే జోనర్లో తెరకెక్కిన మూవీ. అయితే ఇప్పటివరకు వచ్చిన క్రైమ్ థ్రిల్లర్ సినిమాలకు భిన్నంగా ఈ సినిమా కథనం సాగుతుంది. సాధారణంగా సస్సెన్స్ క్రైమ్ థ్రిల్లర్ సినిమాల్లో ఓ హత్య జరగడం.. ఆ హత్య ఎవరు చేశారనేది తెలియకపోవడం..దాన్ని ఛేదించే క్రమంలో పోలిసులకు(హీరో/హీరోయిన్) కొన్ని నిజాలు తెలియడం.. క్లైమాక్స్‌లో ఊహించని ట్విస్ట్ ఉంటుంది. కానీ సత్యభామలో హత్య ఎవరు చేశారనేది ముందే తెలుస్తుంది. అతన్ని పట్టుకోవడమే హీరోయిన్ పని. ఈ సినిమా కథ పాతదే కానీ, హీరోయిన్ అలాంటి పాత్ర చేయడం..కథనం సస్పెన్స్‌తో పాటు ఎమోషనల్‌గా సాగడంతో కొత్తగా అనిపిస్తుంది.‘కాళికా దేవి కోపం...సీతాదేవి శాంతం’అంటూ సినిమా ప్రారంభంలోనే హీరోతో ఓ డైలాగ్ చెప్పించి, సత్యభామ పాత్ర ఎలా ఉంటుందో మొదట్లోనే క్లారిటీ ఇచ్చాడు దర్శకుడు. ఆమె పవర్ఫుల్ పోలీసు ఆఫీసర్ అనే చేప్పేలా ఎంట్రీ సీన్ ఉంటుంది. ఆ తర్వాత ఆమె పర్సనల్ లైఫ్ గురించి చూపించి.. హసీనా హత్యతో అసలు కథలోకి వెళ్లాడు. యాదుని వెతికే క్రమంలో వచ్చే సన్నివేశాలు రొటీన్‌గా ఉండడంతో కథనం నెమ్మదిగా సాగుతుందనే ఫీలింగ్ కలుగుతుంది. అలాగే మధ్య మధ్యలో వచ్చే ఉపకథలు ఆకట్టుకున్నా.. మెయిన్ స్టోరీని పక్కదారి పట్టిస్తాయి. షీ సేఫ్ యాప్ ప్రాధాన్యత గురించే తెలియజేసే సన్నివేశాలు ఆకట్టుకోవడంతో పాటు ఆలోచింపజేస్తాయి. సెకండాఫ్‌లో కథనం ఆసక్తికరంగా సాగుతుంది. క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్ట్ ఊహించలేరు. ఆ పాత్ర చెప్పే ప్లాష్‌బ్యాక్ స్టోరీ కూడా ఆకట్టుకుంటుంది. అయితే కథలో అనేక పాత్రలు ఉండడం, అవసరం లేకున్నా కొన్ని ఉప కథలను జోడించడం కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తుంది. కథను ఇంకాస్త బలంగా రాసుకొని, ఇంకాస్త ఆసక్తికరంగా తెరకెక్కించి ఉంటే సినిమా ఫలితం మరోలా ఉండేది. ఎవరెలా చేశారంటే..ఇన్నాళ్లు గ్లామర్ పాత్రలకే పరిమితమైన కాజల్..తొలిసారి ఫీమేల్ ఓరియెంటెడ్ ఫిల్మ్‌లో నటించింది. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఒక అమ్మాయికి సాయం చేసే పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ సత్యభామ పాత్రలో ఆమె ఒదిగిపోయింది. యాక్షన్ సన్నివేశాల్లో అదరగొట్టేసింది. సినిమా మొత్తం తన భుజాన వేసుకొని నడిపించింది. ఈ సినిమా కోసం ఆమె పడిన కష్టం తెరపై కనిచించింది. కాజల్‌లోని మరో యాంగిల్‌ని ఈ మూవీలో చూస్తారు. ఇక సత్యభామ భర్త, రచయిత అమరేందర్గా నవీన్ చంద్ర తన పాత్ర పరిధిమేర చక్కగా నటించాడు. ఇక్బల్గా ప్రజ్వల్ యాద్మ బాగా చేశాడు. ప్రకాశ్‌రాజ్, హర్షవర్ధన్, నాగినీడు పాత్రలు తెరపై కనిపించేది చాలా తక్కువ సమయే అయినా..ఉన్నంతగా బాగానే నటించారు. అయితే కాజల్ పాత్రకే ఎక్కువ ప్రాధాన్యత ఉండడంతో.. సినిమాలోని ఇతర పాత్రలు ఏవీ మనకు గుర్తిండిపోలేవు. సాంకేతికపరంగా సినిమా చాలా బాగుంది. శశికిరణ్ తిక్క స్క్రీన్‌ప్లే సినిమాకు కొత్తదనం తెచ్చిపెట్టింది. శ్రీచరణ్ పాకాల నేపథ్య సంగీతం పెద్ద అసెట్. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. రేటింగ్: 2.75/5 -
అందుకే ‘సత్యభామ’ని నేను డైరెక్ట్ చేయలేదు: శశికిరణ్ తిక్క
‘‘ఇప్పటివరకూ ఎన్నో పోలీస్ స్టోరీస్ వచ్చినా భావోద్వేగాలతో రూపొందిన ‘సత్యభామ’ ప్రత్యేకంగా ఉంటుంది. షూటింగ్ టైమ్‌లో కాజల్ అగర్వాల్గారి ఎనర్జీ మా యూనిట్‌కి ఉత్సాహాన్నిచ్చేది. ఈ సినిమాలో ఆమె చేసిన యాక్షన్ సీక్వెన్సులు చాలా స్పెషల్. ‘సత్యభామ’లో ప్రేక్షకులు కొత్త కాజల్‌ను చూస్తారు’’ అన్నారు శశికిరణ్ తిక్క. కాజల్ అగర్వాల్ లీడ్ రోల్లో నటించిన చిత్రం ‘సత్యభామ’. సుమన్ చిక్కాల దర్శకత్వంలో బాబీ తిక్క, శ్రీనివాసరావు తక్కలపల్లి నిర్మించిన ఈ సినిమా నేడు రిలీజవుతోంది.ఈ చిత్రానికి సమర్పకులుగా వ్యవహరించి, స్క్రీన్ ప్లే అందించిన శశికిరణ్ తిక్క మాట్లాడుతూ– ‘‘యూకేలో ఉండే మా మిత్రులు రమేశ్, ప్రశాంత్ చెప్పిన పాయింట్ నచ్చడంతో నేను, దర్శకుడు సుమన్ ‘సత్యభామ’ కథ సిద్ధం చేశాం. దర్శకుడిగా నేను బిజీగా ఉండటంతో ఈ మూవీకి దర్శకత్వం వహించలేదు. పైగా మా అవురమ్ ఆర్ట్స్‌పై మరిన్ని సినిమాలు నిర్మించాలనుకుంటున్నాం. నిర్మాత అనుభవాలు ఎలా ఉంటాయో ‘సత్యభామ’తో తెలిశాయి.ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌గా ఈ మూవీ ఉంటుంది. ‘సత్యభామ’ సినిమా ప్రీమియర్స్ వేశాం... చూసిన వాళ్ల నుంచి మంచి స్పందన వచ్చింది. ‘గూఢచారి’ సినిమాకి నేను దర్శకత్వం వహించాను. ‘గూఢచారి 2’కి వేరేవాళ్లు దర్శకత్వం చేయాలని నేను, అడివి శేష్ ముందే అనుకున్నాం. మహేశ్‌బాబుగారు ‘మేజర్’ సినిమాలో భాగస్వామ్యం అయ్యారు. ఆయనకు ‘సత్యభామ’ చూపించాలనుకుంటున్నాను’’ అన్నారు. -
‘సత్యభామ’లో కొత్త కాజల్ ను చూస్తారు: శశికిరణ్ తిక్క
కాజల్ అరవై సినిమాల్లో నటించింది. అయినా ఇప్పటికీ చాలా యాక్టివ్‌గా ఉంటుంది. షూటింగ్ టైమ్‌లో ఆమె ఎనర్జీ మా అందరికి ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చేంది.‘సత్యభామ’లో కాజల్ చేసిన యాక్షన్స్ ప్రేక్షలను అలరిస్తాయి. ముఖ్యంగా ఎమోషన్ ఈ మూవీలో ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతుంది. ఎన్నో పోలీస్ స్టోరీస్ వచ్చినా ఎమోషనల్ గా “సత్యభామ” స్పెషల్ గా ఉంటుంది. తెరపై కొత్త కాజల్‌ని చూస్తారు’అని అన్నారు డైరెక్టర్ శశికిరణ్ తిక్క. ఆయన ప్రెజెంటర్, స్క్రీన్ ప్లే రైటర్ గా వర్క్ చేసిన మూవీ ‘సత్యభామ’. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా అవురమ్ ఆర్ట్స్ బ్యానర్ ఈ చిత్రాన్ని నిర్మించింది. సుమన్ చిక్కాల దర్శకత్వం వహించారు. రేపు(జూన్ 7)ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా శశికిరణ్ తిక్క మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..⇢ యూకేలో ఉండే నా స్నేహితులు చెప్పిన కథతో ‘సత్యభామ’ జర్నీ మొదలైంది. ఆ పాయింట్ నచ్చి నేను, దర్శకుడు సుమన్ డెవలప్ చేశాం. అప్పుడు మేజర్ సినిమా జరుగుతోంది. అది పూర్తయ్యాక సెట్స్ మీదకు తీసుకెళ్లాలని అనుకున్నాం. కాజల్ గారికి ‘సత్యభామ’ కథ చెప్తే ఆమెకు వెంటనే నచ్చింది. అలా ఈ సినిమా ప్రారంభం అయింది.⇢ నాకు దర్శకుడిగా చేయాల్సిన ప్రాజెక్ట్స్ ఉన్నాయి. నా స్క్రిప్ట్స్ ప్రిపేర్ చేసుకుంటున్నాను. అందుకే “సత్యభామ” సినిమాకు దర్శకత్వం వహించలేదు.అలాగే అవురమ్ ఆర్ట్స్ పై మరిన్ని మూవీస్ చేయాలనుకుంటున్నాం. నాకు ప్రొడ్యూసర్ గా అనుభవం కావాలి. డైరెక్షన్ ప్రొడక్షన్ తో పాటు ఎడిటింగ్ కూడా చేయాలని ఉంది.⇢ మూవీ ప్రెజెంటర్ గా సినిమా మేకింగ్ లో మరో కోణాన్ని చూశాను. దర్శకుడిగా నేను ప్రొడక్షన్ కాస్ట్ ను చెప్పినంతలో చేస్తాననే పేరుంది. ఇప్పుడు “సత్యభామ” నిర్మాత అనుభవాలు ఎలా ఉంటాయో తెలిసింది. ఓవరాల్ గా ప్రొడక్షన్ సైడ్ చాలా విషయాలు నేర్చుకున్నాను. సినిమా మేకింగ్ ను వైడ్ యాంగిల్ నుంచి తెలుసుకున్నా. దర్శకత్వం అమ్మలాంటి పని అయితే నిర్మాతగా ఉండటం నాన్న లాంటి బాధ్యత.⇢ దర్శకుడు సుమన్ చిక్కాల, నేను, శ్రీచరణ్ పాకాల(సంగీత దర్శకుడు) మేమంతా ఫ్రెండ్స్. కలిసే మూవీస్ చేస్తుంటాం. “సత్యభామ” సినిమాకు కూడా అలాగే టీమ్ వర్క్ చేశాం. దర్శకుడిగా సుమన్ వర్క్ ఆకట్టుకుంటుంది. ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ గా మా మూవీ ఉంటుంది. అయితే రెగ్యులర్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్స్ లా కేవలం కేసును క్లూలలతో పట్టుకోవడం కాకుండా కథలో ఎమోషన్ బాగా వర్కవుట్ అయ్యింది.⇢ ఈ చిత్రంలొ నవీన్ చంద్ర, ప్రకాష్ రాజ్, నాగినీడు, హర్షవర్థన్, రవి వర్మ ఇలా మంచి కాస్టింగ్ కీ రోల్స్ చేశారు. వీళ్లు కాకుండా కొందరు కొత్త వాళ్లు నటించారు. వాళ్లకు ఈ సినిమా రిలీజ్ అయ్యాక మంచి పేరొస్తుంది.⇢ ఈ సినిమా టీమ్ వర్క్ అని చెప్పాలి, మ్యూజిక్ డైరెక్టర్, ఎడిటర్, డైరెక్టర్, నేను, ప్రొడ్యూసర్స్ మేమంతా కలిసే పనిచేస్తూ వచ్చాం. మా మూవీని నైజాంలో మైత్రీ మూవీ మేకర్స్ వాళ్లు రిలీజ్ చేస్తున్నారు. ఏపీలో ధీరజ్ మొగిలినేని రిలీజ్ చేస్తున్నారు. ఓవర్సీస్ లో సారిగమ రిలీజ్ చేస్తోంది. ఓటీటీ సహా ఓవరాల్ గా మా సినిమాకు ట్రేడ్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.⇢ దర్శకుడిగా నా తదుపరి సినిమా త్వరలో అనౌన్స్ చేస్తాను. వరుసగా థ్రిల్లర్స్ చిత్రాలే కాకుండా మల్టీపుల్ జానర్ మూవీస్ చేస్తాను. -
Kajal Aggarwal: పెళ్లయితే కెరీర్ మారాలా?
‘‘నన్ను టాలీవుడ్ చందమామ అని పిలుస్తుంటారు. ‘సత్యభామ’ విడుదల తర్వాత సత్యభామ అని పిలిచినా సంతోషిస్తాను. చందమామ అందమైన పేరు. సత్యభామ పవర్ఫుల్ నేమ్. ఈ రెండూ నాకు ఇష్టమే’’ అని కాజల్ అగర్వాల్ అన్నారు. సుమన్ చిక్కాల దర్శకత్వంలో కాజల్ అగర్వాల్ లీడ్ రోల్లో నటించిన చిత్రం ‘సత్యభామ’. నవీన్ చంద్ర కీలక పాత్ర చేశారు. ‘మేజర్’ చిత్ర దర్శకుడు శశికిరణ్ తిక్క సమర్పకులుగా వ్యవహరించి, స్క్రీన్ ప్లే అందించారు. బాబీ తిక్క, శ్రీనివాసరావు తక్కలపల్లి నిర్మించిన ఈ సినిమా రేపు విడుదలవుతోంది. ఈ సందర్భంగా కాజల్ అగర్వాల్ పంచుకున్న విశేషాలు... ⇥ ‘సత్యభామ’ కథని సుమన్ చెప్పిన వెంటనే ఒప్పుకున్నా. ఈ స్టోరీ అంత నచ్చింది. ఈ మూవీని నా వ్యక్తిగత జీవితంతో ΄ోల్చుకోవచ్చు. సమాజంలో ఏదైనా ఘటన జరిగితే నిజ జీవితంలో నేనూ స్పందిస్తుంటా. బయటకు వచ్చి ర్యాలీలు చేయకున్నా ఆ ఘటన గురించి ఆలోచనలు వస్తుంటాయి.. డిస్ట్రబ్ చేస్తుంటాయి. ‘సత్యభామ’ సినిమా లాంటి భావోద్వేగాలున్న చిత్రం చేయడం ఇదే తొలిసారి. ఈ మూవీలో నటిస్తున్నప్పుడు ఇప్పటిదాకా ఫీల్ కాని కొన్ని భావోద్వేగాలను అనుభూతి చెందాను. ⇥ ‘సత్యభామ’లో ఎమోషన్, యాక్షన్ ఉన్న పవర్ఫుల్ ΄ోలీస్ ఆఫీసర్‌గా కనిపిస్తా. యాక్షన్ సీక్వెన్సుల కోసం ఎంతో కష్టపడ్డా. ఆ ఫైట్స్ సహజంగా ఉంటాయి. రామ్ చరణ్‌లా (మగధీర మూవీని ఉద్దేశించి) వంద మందిని నేను కొడితే ప్రేక్షకులు నమ్మరు.. నా ఇమేజ్‌కు ప్రేక్షకులు ఇష్టపడేలా స్టంట్స్ ఉంటాయి. ఈ మూవీలో యువత, బెట్టింగ్ అంశంతో పాటు ఓ మతం గురించిన కీ పాయింట్స్ ఉంటాయి. ⇥ పెళ్లయ్యాక ఒక హీరోయిన్ కెరీర్ ఎందుకు మారాలో అర్థం కాదు. అందరికీ వ్యక్తిగత జీవితం ఉంది. అలాగే హీరోయిన్లకు కూడా. గతంలో పెళ్లయ్యాక కథానాయికలకి అవకాశాలు తగ్గాయేమో? కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. పెళ్లయ్యాక ఎంతోమంది హీరోయిన్లు అంతకుముందు కంటే బిజీగా సినిమాలు చేస్తున్నారు. నేను నా వ్యక్తిగత జీవితాన్ని, సినీ కెరీర్‌ను బ్యాలెన్స్ చేసుకుంటున్నాను. ఈ ప్రయాణంలో నా భర్త గౌతమ్ కిచ్లు, నా ఫ్యామిలీ స΄ోర్ట్ ఎంతో ఉంది. నా భర్తకు ఇష్టమైన కథానాయికల్లో నాతోపాటు సమంత, రష్మిక మందన్న, రాశీ ఖన్నా ఉన్నారు. ‘భారతీయుడు 2’ విడుదల కోసం ఎగ్జయిటెడ్‌గా ఎదురు చూస్తున్నాను. ‘భారతీయుడు 3’ లోనూ నా పాత్ర ఉంటుంది. ప్రస్తుతం రెండు కొత్త సినిమాలు ఒప్పుకున్నాను. -
ట్రెండ్ మారింది.. పెళ్లయిన హీరోయిన్స్ బిజీ అయ్యారు: కాజల్
‘పెళ్లయ్యాక ఒక హీరోయిన్ కెరీర్ ఎందుకు మారాలో అర్థం కాదు. అందరికీ పర్సనల్ లైఫ్ ఉంది. అలాగే హీరోయిన్స్‌కి కూడా. గతంలో పెళ్లయ్యాక హీరోయిన్స్ కు అవకాశాలు తగ్గుయోమో..ఇప్పుడు ట్రెండ్ మారింది. పెళ్లయ్యాక ఎంతోమంది హీరోయిన్స్ అంతకముందు కంటే బిజీగా సినిమాలు చేస్తున్నారు’అన్నారు కాజల్ అగర్వాల్. ఆమె పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించిన తాజా చిత్రం ‘సత్యభామ’. నవీన్ చంద్ర కీలక పాత్రను పోషించారు. సుమన్ చిక్కాల దర్శకత్వం వహించిన ఈ చిత్రం జూన్ 7న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా కాజల్ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..⇢ నేను ఇప్పటివరకు ఎన్నో క్యారెక్టర్స్ చేశాను గానీ సత్యభామ సినిమా లాంటి ఎమోషనల్ మూవీ చేయడం ఇదే తొలిసారి. ఇందులో యాక్షన్ పార్ట్ కూడా చేశాను. ఈ చిత్రంలో నటిస్తుంటే ఇప్పటిదాకా ఫీల్ కాని కొన్ని ఎమోషన్స్ అనుభూతిచెందాను. అవన్నీ మీకూ రియలిస్టిక్ గా అనిపిస్తాయి.⇢ నన్ను చాలాకాలం టాలీవుడ్ చందమామ అని పిలిచేవారు. ఇప్పుడు సత్యభామ అని పిలిచినా సంతోషిస్తాను. నాకు రెండూ కావాలి. చందమామ బ్యూటిఫుల్ నేమ్, సత్యభామ పవర్ ఫుల్ నేమ్. నాకు రెండూ ఇష్టమే. ఈ కథ చెప్పినప్పుడు ఇన్ స్టంట్ గా ఓకే చెప్పాను. అంతలా నచ్చిందీ స్టోరి.⇢ శశికిరణ్ మంచి డైరెక్టర్. ఆయన సినిమాలు చూశాను. ఈ సినిమాకు డైరెక్షన్ ఎందుకు చేయడం లేదని శశిని అడిగాను. ఆయన తను ఈ మూవీకి స్క్రీన్ ప్లే ఇస్తూ ప్రెజెంటర్ గా ఉంటున్నానని చెప్పారు. మనం ఎప్పుడూ ఒకే పనిచేయనక్కర్లేదు. డిఫరెంట్ జాబ్స్ ఎక్స్ ప్లోర్ చేయాలి. శశి తీసుకున్న నిర్ణయాన్ని గౌరవించా. ఆయన ఈ ప్రాజెక్ట్ ను అన్ని విధాలా బాగా వచ్చేలా చూసుకున్నారు.⇢ దర్శకుడు సుమన్ చిక్కాల ఫస్ట్ టైమ్ డైరెక్షన్ చేస్తున్నా..ఎంతో కన్విక్షన్ తో వర్క్ చేశారు. ఆయనకు చాలా క్లారిటీ ఉంది. తను అనుకున్న స్క్రిప్ట్ అనుకున్నట్లు రూపొందించాడు. సుమన్ చిక్కాలతో వర్క్ చేయడం హ్యాపీగా ఉంది. మా ప్రొడ్యూసర్స్ కొత్త వాళ్లైనా తమ ఫస్ట్ మూవీని ఓ బేబిని చూసుకున్నట్లు చూసుకున్నారు. ప్రతి రోజూ సెట్ లో ఉంటూ అన్ని విషయాల్లో ఇన్వాల్వ్ అయ్యేవారు. తొలి సినిమాను ఎంతో జాగ్రత్తగా ప్రొడ్యూస్ చేశారు.⇢ గతంలో జిల్లా సినిమాలో పోలీస్ గెటప్ లో కనిపించా. అయితే అది సీరియస్ నెస్ ఉన్న రోల్ కాదు. సత్యభామలో మాత్రం ఎమోషన్, యాక్షన్ ఉన్న పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తా. పోలీస్ రోల్స్ గతంలో ఎంతోమంది హీరోయిన్స్ చేసి ఉంటారు. కానీ ఇది నాకు కొత్త. నా తరహాలో పర్ ఫార్మ్ చేశాను. మీకు నచ్చుతుందనే ఆశిస్తున్నా.⇢ సత్యభామలో యాక్షన్ సీక్వెన్సుల కోసం ఎంతో కష్టపడ్డా. ఆ ఫైట్స్ అన్నీ రియలిస్టిక్ గా ఉంటాయి. నేను రామ్ చరణ్ లా వంద మందిని కొడితే ప్రేక్షకులు నమ్మరు. నా ఇమేజ్ కు ప్రేక్షకులు ఇష్టపడేలా స్టంట్స్ ఉంటాయి. సుబ్బు యాక్షన్ సీక్వెన్సులు కొరియోగ్రాఫ్ చేశారు.⇢ యూత్, బెట్టింగ్ తో పాటు ఓ రిలీజియన్ గురించి సత్యభామలో కీ పాయింట్స్ ఉంటాయి. అయితే ఏ మతానికి పాజిటివ్ గా నెగిటివ్ గా ఏదీ చెప్పడం లేదు. జస్ట్ ఆ అంశం కథలో ఉంటుంది అంతే. మీరు ట్రైలర్ చూసిన దాని కంటే ఎన్నో ట్విస్ట్ లు, టర్న్స్ మూవీలో ఉంటాయి. అవన్నీ మూవీలో చూసి మీ రెస్పాన్స్ కు చెబుతారని కోరుకుంటున్నా.⇢ మ్యూజిక్ డైరెక్టర్ శ్రీచరణ్ పాకాల తన బెస్ట్ ఎఫర్ట్స్ సత్యభామ కోసం పెట్టాడు. మా ఇద్దరికీ రాక్ మ్యూజిక్ అంటే ఇష్టం. మేము ఆ పాటల గురించి, మ్యూజిక్ గురించి మాట్లాడుకునేవాళ్లం.⇢ నేను నా వ్యక్తిగతమైన లైఫ్ ను కెరీర్ ను బ్యాలెన్స్ చేసుకుంటున్నాను. ఇది కష్టమైన పనే. కానీ నటన అంటే ప్యాషన్ కాబట్టి కష్టమైన ఇష్టంగా చేసుకుంటూ వస్తున్నా. ఈ జర్నీలో మా వారి సపోర్ట్, నా ఫ్యామిలీ సపోర్ట్ ఎంతో ఉంది. సౌత్ లో నాతో పాటు సమంత, రాశీ ఖన్నా మా ఆయనకు ఫేవరేట్ హీరోయిన్స్.⇢ భారతీయుడు 2 సినిమా రిలీజ్ కోసం ఎగ్జైటెడ్ గా వెయిట్ చేస్తున్నా. భారతీయుడు 3లో నా క్యారెక్టర్ ఉంటుంది. ఈ సినిమాలో నేను చాలా కొత్తగా డిఫరెంట్ రోల్ లో కనిపిస్తా.⇢ వైవిధ్యమైన మూవీస్ చేస్తూ నటిగా మంచి పేరు తెచ్చుకోవాలని ఉంది. కొత్త దర్శకులతోనూ పనిచేస్తా. అప్పుడే ఇండస్ట్రీ బాగుంటుంది. ఏ రంగంలోనైనా కొత్త వారిని ఎంకరేజ్ చేయాలి. ప్రస్తుతం రెండు కొత్త సినిమాలు సైన్ చేశా. వాటి డీటెయిల్స్ ప్రొడక్షన్ కంపెనీస్ అనౌన్స్ చేస్తాయి. -
మా ఆయనకు సమంత అంటే చాలా ఇష్టం: కాజల్
కాజల్ అగర్వాల్..ఒకప్పుడు టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా రాణించింది. ‘లక్ష్మీ కళ్యాణం’తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ..తొలి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత ‘చందమామ’తో హిట్ అందుకొని.. స్టార్ హీరోయిన్ల లిస్ట్‌లోకి ఎక్కేసింది. రామ్ చరణ్, ఎన్టీఆర్, మహేశ్ బాబు లాంటి స్టార్ హీరోలందరితోనూ నటించింది. కెరీర్ పీక్స్‌లో ఉండగానే..2020లో వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లూని పెళ్లి చేసుకొని, ఓ బిడ్డకు జన్మనిచ్చింది. పెళ్లి తర్వాత సినిమాలకు గ్యాప్ ఇచ్చిన కాజల్ ఇప్పుడు వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది. భగవంత్ కేసరి సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చింది కాజల్. ఆతర్వాత ఇప్పుడు సత్యభామ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే తన సినీ జీవితం ఇంత సాఫీగా సాగడానికి భర్త గౌతమ్ కిచ్లూనే కారణం అంటోంది కాజోల్. తన సపోర్ట్‌తోనే ఇప్పటికీ సినిమాలు చేస్తున్నానని చెబుతోంది. తాజాగా ఆమె మీడియాతో మాట్లాడుతూ... భర్త గురించి ఆసక్తికర విషయాలు పంచుకుంది. గౌతమ్ తనను బాగా సపోర్ట్ చేస్తాడని, ఆయన ప్రోత్సాహంతోనే మళ్లీ సినిమాలు చేస్తున్నానని చెప్పింది. సినిమాల ఎంపిక విషయంలో అతను జోక్యం చేసుకోడు కానీ..కొన్ని సలహాలు మాత్రం ఇస్తాడట. ఖాలీ సమయం దొరికితే తెలుగుతో పాటు అన్ని భాషల సినిమాలు చూస్తారట. టాలీవుడ్‌కు చెందిన హీరోయిన్లలో సమంత, రష్మిక, రాశీఖన్నా అంటే గౌతమ్‌కి చాలా ఇష్టమని కాజల్ చెప్పుకొచ్చింది. కాజల్ నటించిన తొలి లేడీ ఓరియెంటెడ్ మూవీ ‘సత్యభామ’ జూన్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
కాజల్ కొత్త సినిమా రిలీజ్.. ఆడవాళ్లకి ఫ్రీ టికెట్స్!
కొత్త సినిమా ఉచితంగా చూడాలనుకుంటున్నారా? అయితే ఈ బంపరాఫర్ మీకోసమే. తెలుగు ప్రేక్షకులకు బాగా తెలిసిన కాజల్ అగర్వాల్.. 'సత్యభామ' అనే హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమా చేసింది. ఈ శుక్రవారం అంటే జూన్ 7న థియేటర్లలో రిలీజ్ కానుంది. ఇప్పటికే ప్రమోషన్స్ పూర్తి చేశారు. తాజాగా మహిళల కోసం బంపరాఫర్ ప్రకటించారు. ఉచితంగా టికెట్ ఇస్తామని చెప్పుకొచ్చారు.(ఇదీ చదవండి: ఎన్నికల్లో వర్కౌట్ అయిన 'గ్లామర్'.. ఎవరెవరు ఎక్కడ గెలిచారంటే?)కాజల్ అగర్వాల్ 'సత్యభామ' మూవీ.. జూన్ 7న థియేటర్లలోకి రానుంది. కానీ అంతకంటే ముందే హైదరాబాద్‌లోని ప్రసాద్ మల్టీప్లెక్స్‌లో జూన్ 5న అంటే బుధవారం సాయంత్రం స్పెషల్ ప్రీమియర్ షో వేయనున్నారు. దీనికి కాజల్ అగర్వాల్ కూడా హాజరు కానుంది. ఈ షో టికెట్ ఉచితంగా కావాలంటే 'షీ సేఫ్' యాప్ డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది.థియేటర్ టికెట్ కౌంటర్ దగ్గరకు సాయంత్రం 5 గంటలకు వెళ్లి, యాప్ ఇన్స్టాల్ చేసుకున్నట్లు చూపించే మహిళలకు టికెట్స్ ఉచితంగా ఇస్తారని చిత్రబృందం ప్రకటించింది. ఈ సినిమాని 'గూఢచారి', 'క్షణం' సినిమాల ఫేమ్ శశి కిరణ్ తిక్క నిర్మించారు. సుమన్ చిక్కల దర్శకత్వం వహించాడు.(ఇదీ చదవండి: 'కల్కి' ట్రైలర్ రిలీజ్‌కి డేట్ ఫిక్స్.. వచ్చేది ఎప్పుడంటే?) -
తెలుగు ఇండస్ట్రీపై కాజల్ షాకింగ్ కామెంట్స్.. హీరోయిన్లకు పెళ్లయితే
దక్షిణాదిలో హీరోయిన్లగా పేరు తెచ్చుకుని.. ఆ తర్వాత ఛాన్సులు రాకపోతే నిందలు వేయడం పరిపాటే. గతంలో ఇలియానా, తాప్సీ, పూజా హెగ్డే ఇలానే చేయగా, ఇప్పుడు ఆ లిస్టులోకి హీరోయిన్ కాజల్ అగర్వాల్ చేరింది. 'లక్ష్మీ కల్యాణం' అనే తెలుగు మూవీతో హీరోయిన్గా పరిచయమైంది. 'మగధీర' ఈమె ఫేట్ మార్చింది. స్టార్ హీరోయిన్ని చేసింది.(ఇదీ చదవండి: ఓటీటీలోకి సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్సయిందా?)2020లో ముంబయికి చెందిన గౌతమ్ కిచ్లూ అనే వ్యాపారవేత్తని పెళ్లి చేసుకుంది. వీరికి ఓ మగబిడ్డ జన్మించాడు. పెళ్లి తర్వాత చిన్న బ్రేక్ తీసుకున్న కాజల్‌కి ఛాన్సులు తగ్గిన మాట వాస్తవమే. జూన్ 7న 'సత్యభామ' సినిమాతో ప్రేక్షకుల్ని పలకరించింది. ఈ క్రమంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె.. సౌత్ ఇండస్ట్రీ గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది.'బాలీవుడ్, సౌత్ ఇండస్ట్రీ మధ్య చాలా తేడా ఉంది. దక్షిణాదిలో పెళ్లయిన హీరోయిన్లని బాగా లేరని పక్కన పెట్టేస్తారు. అదే హిందీలో మాత్రం పెళ్లయినా సరే హీరోయిన్లుగా నటిస్తుంటారు. షర్మిళా ఠాకుర్, హేమమాలిని మొదలుకొని దీపికా పదుకొణె, ఆలియా భట్ లాంటి వాళ్లకు హీరోయిన్లుగా అవకాశాలు వస్తున్నాయి. కానీ దక్షిణాదిలో అలాంటి పరిస్థితి లేదు. దీనికి నయనతార అతీతం. ఆమె మంచి సినిమాలు చేస్తోంది. కాగా దక్షిణాదిలో నెలకొన్న ఈ పరిస్థితిని త్వరలో మారుద్దాం' అని కాజల్ అగర్వాల్ చెప్పుకొచ్చింది. (ఇదీ చదవండి: డబ్బుల కోసం అడల్ట్ సినిమాలు చేశా: 'పంచాయత్' నటుడు) -
‘సత్యభామ’ గుర్తుండిపోతుంది
‘సత్యభామ’ ప్రాజెక్ట్ చేయాలని ఫిక్స్ అయిన తర్వాత హీరోయిన్ కోసం మూడు నాలుగు ఆప్షన్స్ పెట్టుకున్నాం. ఫస్ట్ అనుకున్నది కాజల్ నే. ఆమె నో చెబితే నెక్ట్ ఆప్షన్స్ కు వెల్దామని అనుకున్నాం. అయితే కథ విన్న వెంటనే ఆమె ఓకే చెప్పారు. మేము ఫస్ట్ టైమ్ ఈ కథ విన్నప్పుడు మాలో ఎలాంటి ఎగ్జైట్ మెంట్ కలిగిందో కాజల్ కూడా అలాగే ఫీలయ్యారు. హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీస్ లో "సత్యభామ" గుర్తుండిపోయే సినిమా అవుతుంది’అని అన్నారు నిర్మాతలు బాబీ తిక్క, శ్రీనివాసరావు తక్కలపల్లి. కాజల్ అగర్వాల్ లీడ్ రోల్ లో నటిస్తున్న సినిమా “సత్యభామ”. నవీన్ చంద్ర అమరేందర్ అనే కీలక పాత్రను పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని అవురమ్ ఆర్ట్స్ పతాకంపై బాబీ తిక్క, శ్రీనివాసరావు తక్కలపల్లి నిర్మిస్తున్నారు. ఈ నెల 7న ఈ మూవీ విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా నిర్మాతలు బాబీ తిక్క, శ్రీనివాసరావు తక్కలపల్లి మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..⇢ గూఢచారి, మేజర్ సినిమాల దర్శకుడు శశికిరణ్ తిక్క బాబీ తిక్క బ్రదర్. ఆయన ఇండస్ట్రీలో ఉన్నారనే మేము ప్రొడక్షన్ లోకి వచ్చాం. అవురమ్ ఆర్ట్స్ బ్యానర్ లో తొలి ప్రయత్నంగా "సత్యభామ" సినిమాను నిర్మించాం. మంచి కంటెంట్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనేది మా ఉద్దేశం. దీంతో పాటు యంగ్ టాలెంట్ కు కూడా అవకాశాలు ఇస్తున్నాం. మా దర్శకుడు సుమన్ కు ఇది మొదటి సినిమా. మ్యూజిక్ బ్యాండ్స్ లో పాడే సింగర్స్ ను ఐడెంటిఫై చేసి వారికి రెండు పాటలు పాడే అవకాశం ఇచ్చాం.⇢ ఒక ఇరవై ఏళ్ల క్రితం యూకే జరిగిన ఓ రియల్ ఇన్సిడెంట్ బేస్ గా చేసుకుని "సత్యభామ" సినిమా లైన్ రెడీ చేశాం. అయితే పూర్తిగా మన నేటివిటీకీ మార్పులు చేసిన కథను సిద్ధం చేశాం. "సత్యభామ" సినిమా అనౌన్స్ చేసినప్పుడు మీరు హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీ ఎందుకు చేస్తున్నారు హీరోతో చేయొచ్చుక దా అని అడిగారు. హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీస్ లో మనకు విజయశాంతి కర్తవ్యం లాంటి మూవీస్ కొన్నే గుర్తుంటాయి. "సత్యభామ"లో కాజల్ పర్ ఫార్మెన్స్ ఆకట్టుకుంటుంది.⇢ "సత్యభామ" సినిమా సెన్సార్ బృందంలో మహిళలు మా మూవీని బాగా అభినందించారు. షీ సేఫ్ యాప్ కేవలం 5 వేల మంది మాత్రమే డౌన్ లోడ్ చేసుకున్నారు. ఇంకా దీని మీద అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. మా సినిమాలో ఈ యాప్ ప్రస్తావన ఉంటుంది. షీ సేఫ్ యాప్ కు పనిచేసే మహిళల్ని వారి ఫ్యామిలీతో సహా మా మూవీ స్పెషల్ షోకు ఆహ్వానిస్తున్నాం. శశి తన సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఆయన కథలనే మేము అవురమ్ ఆర్ట్స్ లో చూపించబోతున్నాం. శ్రీచరణ్ పాకాల మ్యూజిక్ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లింది.⇢ కాజల్ మా మూవీ షూటింగ్ టైమ్ లో ఎంతో సపోర్ట్ చేశారు. మా టీమ్ ఆమెకు నచ్చింది. అవురమ్ ఆర్ట్స్ నా సొంత బ్యానర్ అని ఆమె చెప్పడం మాకెంతో హ్యీపీనెస్ ఇచ్చింది. మా మూవీని ముందు తెలుగులో సక్సెస్ ఫుల్ గా చేసి ఆ తర్వాత మిగతా భాషల విషయం ఆలోచిస్తాం. మా నెక్ట్ మూవీస్ పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు తీసుకెళ్తాం. -
ఆ ఇమేజ్ ఇబ్బందిగానే ఉంది: సంగీత దర్శకుడు శ్రీచరణ్ పాకాల
కాజల్ అగర్వాల్ లీడ్ రోల్లో నటించిన చిత్రం ‘సత్యభామ’. ఓ కీలక పాత్రలో నవీన్‌చంద్ర నటించారు. సుమన్ చిక్కాల దర్శకత్వంలో బాబీ తిక్క, శ్రీనివాసరావు తక్కలపల్లి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 7న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా సోమవారం విలేకర్ల సమావేశంలో ఈ చిత్రం మ్యూజిక్ డైరెక్టర్ శ్రీ చరణ్ పాకాల మాట్లాడుతూ– ‘‘ఓ పోలీసాఫీసర్ ఎమోషనల్ జర్నీయే ఈ చిత్రం.థ్రిల్లర్ మూవీస్ ఇష్టపడేవారికి ‘సత్యభామ’ చిత్రం బాగా నచ్చుతుంది. ఈ సినిమాలో ఐదు పాటలు ఉన్నాయి. కాజల్, నవీన్‌చంద్రల మధ్య ‘కళ్లారా చూసాలే..’ అనే లవ్‌సాంగ్ ఉంటుంది. అలాగే ‘వెతుకు వెతుకు’ పాట ఇన్వెస్టిగేషన్ నేపథ్యంలో ఉంటుంది. ఈ పాటను కీరవాణిగారు పాడారు. గతంలో ‘ఆపరేషన్ గోల్డ్ ఫిష్’ సినిమాకు నా మ్యూజిక్‌లో కీరవాణిగారు పాడారు. ‘సత్యభామ‘ పాటకు ఆయన స్టూడియోకు వస్తూనే ‘నేను పాడిన ఏ పాట విని నన్ను నీ పాటకు పాడేందుకు పిలిచావ్’ అని అడిగారు. లిరిక్స్ అందించిన చంద్రబోస్‌గారు కూడా పాట పూర్తయ్యేంతవరకు చర్చిస్తూనే ఉన్నారు.‘సత్యభామ’లో ఓ ఇంగ్లిష్ సాంగ్ కూడా ఉంది. ఇతర పాటలను త్వరలోనే విడుదల చేస్తాం. నేను థ్రిల్లర్ మూవీస్‌కు ఎక్కువగా పని చేస్తాననే పేరొచ్చింది. ఈ ఇమేజ్ నాకు ఇబ్బందిగానే ఉంది. ఎందుకంటే మొత్తం థ్రిల్లర్ మూవీస్‌కు నేనే సంగీతం అందించడం లేదు. చెప్పాలంటే.. ‘కృష్ణ అండ్ హిస్ లీల, డీజే టిల్లు, గుంటూరు టాకీస్’ వంటి లవ్ అండ్ కమర్షియల్ చిత్రాలకూ సంగీతం అందించాను. కానీ థ్రిల్లర్స్ మ్యూజిక్ డైరెక్టర్ అనే ముద్ర వచ్చేసింది. నాకైతే అన్ని జానర్ సినిమాలకూ సంగీతం అందించాలని ఉంది. ప్రస్తుతం ‘గూఢచారి 2’కు పని చేస్తున్నాను. మరో నాలుగైదు ప్రాజెక్ట్స్ ఉన్నాయి’’ అని చెప్పుకొచ్చారు. -
ఫ్లోరల్ డిజైన్ దుస్తుల్లో ‘చందమామ’లా సత్యభామ (ఫోటోలు)
-
'భారతీయుడు 2' ఆడియో లాంచ్ (ఫొటోలు)
-
టాప్ లేపేసిన దిశా పటానీ.. కాజల్ అగర్వాల్ మళ్లీ అలా!
గ్రీన్ డ్రస్సులో హీట్ పెంచేస్తున్న దిశా పటానీక్యూట్ వీడియో పోస్ట్ చేసిన స్టార్ సింగర్ సునీతపూల ఔట్ ఫిట్‌లో మరింత అందంగా కాజల్ఫన్నీ ఫొటోలని పోస్ట్ చేసిన హీరోయిన్ మృణాల్పెళ్లికి ముందే హనీమూన్ ట్రిప్ వేసిన అదితీ-సిద్ధార్థ్బీచ్ ఒడ్డున మత్తెక్కించే లుక్‌లో రెబా మోనికా జాన్ View this post on Instagram A post shared by Suhana Khan (@suhanakhan2) View this post on Instagram A post shared by Sunitha Upadrasta (@upadrastasunitha) View this post on Instagram A post shared by ᴋʜᴜsʜɪ ᴋᴀᴘᴏᴏʀ (@khushi05k) View this post on Instagram A post shared by Faria Abdullah (@fariaabdullah) View this post on Instagram A post shared by Reba Monica John (@reba_john) View this post on Instagram A post shared by Eesha Rebba (@yourseesha) View this post on Instagram A post shared by Mrunal Thakur (@mrunalthakur) View this post on Instagram A post shared by Kajal A Kitchlu (@kajalaggarwalofficial) View this post on Instagram A post shared by Komalee Prasad (@komaleeprasad) View this post on Instagram A post shared by Ruchitha Sadineni (@ruchithasadineni) View this post on Instagram A post shared by disha patani (paatni) 🦋 (@dishapatani) View this post on Instagram A post shared by Subhashree Rayaguru ( Subha ) (@subhashree.rayaguru) -
ఇండియన్ 2 కోసం కష్టపడ్డానన్న కాజల్.. సినిమాలో ఆమె పాత్ర లేదన్న డైరెక్టర్
తల్లయ్యాక హీరోయిన్గా నిలదొక్కుకోవడం అంత ఈజీ కాదు. అంతకుముందున్న క్రేజ్‌ను కంటిన్యూ చేయడం కత్తిమీద సామే అవుతుంది. కానీ బాలీవుడ్లో మాత్రం అలియా భట్, కరీనా కపూర్, కాజోల్.. ఇలా పలువురూ తల్లయ్యాక కూడా స్టార్ హీరోయిన్గా రాణిస్తున్నారు. సౌత్‌లో నయనతారను మినహాయిస్తే మరెవరికీ తల్లిగా ప్రమోషన్ పొందాక గొప్ప క్యారెక్టర్లు రావడం లేదు. బహుశా అందుకేనేమో చాలామంది బ్యూటీలు పెళ్లంటేనే వెనకడుగు వేస్తున్నారు.మా కోసం కథలు రాసుకుంటేనే..తాజాగా ఈ ధోరణిపై కాజల్ అగర్వాల్ స్పందిస్తూ.. దక్షిణాదిన ఇంకా కొన్ని పాత పద్ధతులనే ఫాలో అవుతున్నారు. అది త్వరలోనే మారుతుందని ఆశిస్తున్నాను. పెళ్లయి పిల్లలున్నప్పటికీ మేము ఏ పాత్రనైనా పోషించగలం. మమ్మల్ని శక్తివంతంగా చూపించే పాత్రలు మేకర్స్ డిజైన్ చేయాలి. వీళ్లు అలాంటి కథలు రాసుకుంటేనే కదా ప్రేక్షకులు చూసేది. కొంతవరకు పరిస్థితులు మెరుగవుతున్నాయి. ఉదాహరణకు నయనతారనే తీసుకుంటే తను సెలక్ట్ చేసుకునే సినిమాలు చాలా బాగుంటాయి. యాక్షన్ రోల్స్, రొమాంటిక్ రోల్స్ ఇలా తనకు నచ్చినవి చేస్తోంది.డెలివరీ అవగానే సినిమాలో..నా విషయానికి వస్తే.. నేను కరోనాకు ముందే కొన్ని సినిమాలకు సంతకం చేశాను. వాటిని దాదాపు పూర్తి చేశాక ప్రెగ్నెన్సీ వచ్చింది. డెలివరీ అవగానే ఇండియన్ 2 సినిమాలో పని చేయాల్సి వచ్చింది. ఇందులో నా జీవితంలోనే కష్టమైన పాత్రను పోషించాను. డైరెక్టర్ శంకర్ సర్ నాకోసం ఎదురుచూసి లాస్ట్ షెడ్యూల్‌కు రమ్మన్నాడు. ఎంతో కష్టంగా ఉన్న నా పాత్రను పూర్తి చేసేశాను అని చెప్పుకొచ్చింది.ఇండియన్ 2లో కాజల్ లేదుశనివారం (జూన్ 1న) జరిగిన ఇండియన్ 2 ఆడియో లాంచ్‌లో డైరెక్టర్ శంకర్ ఊహించని ట్విస్ట్ ఇచ్చాడు. ఈ కార్యక్రమం వేదికగా భారతీయుడు 2లో కాజల్ లేదని వెల్లడించాడు. తను మూడో భాగంలో ఉంటుందని తెలిపాడు. అసలు తనను తీసేసిన విషయం కాజల్కైనా తెలుసా? అని ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారు. ఇండియన్ 2లో ఆమె లేదని తేల్చేయడంతో అభిమానులు నిరుత్సాహపడుతున్నారు. ఇకపోతే ఈ చిత్రం జూలై 12న గ్రాండ్‌గా విడుదల కానుంది.చదవండి: వావ్ అనిపించినప్పుడల్లా రూ.500 చేతిలో పెడ్తాడు! -
డూప్ లేకుండా కాజల్ ఫైట్ చేశారు: సుమన్ చిక్కాల
‘‘సత్యభామ’ కథలో ఎమోషన్, యాక్షన్ రెండూ ఉన్నాయి. భావోద్వేగాలను పండించడంలో కాజల్ అగర్వాల్‌కి మంచి పేరుంది. ఆమె యాక్షన్ చేస్తే కొత్తగా ఉంటుందనిపించింది. ఎమోషన్, యాక్షన్ ఆమె చక్కగా చేశారు. ఈ రెండింటికీ ప్రేక్షకులు కనెక్ట్ అవుతారు’’ అన్నారు డైరెక్టర్ సుమన్ చిక్కాల. కాజల్ అగర్వాల్ లీడ్ రోల్లో నటించిన చిత్రం ‘సత్యభామ’.డైరెక్టర్ శశికిరణ్ తిక్క సమర్పణలో బాబీ తిక్క, శ్రీనివాసరావు తక్కలపల్లి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 7న విడుదలవుతోంది. ఈ సందర్భంగా సుమన్ చిక్కాల మాట్లాడుతూ– ‘‘శశికిరణ్ తిక్క వద్ద స్క్రిప్ట్ సైడ్ వర్క్ చేశాను. నాపై నమ్మకంతో దర్శకత్వం బాధ్యత అప్పగించాడు తను. ‘సత్యభామ’ పూర్తిగా ఫిక్షన్ కథ.ఒక కేసు విషయంలో బాధితురాలికి న్యాయం చేసే పవర్ఫుల్ పోలీస్సాఫీసర్గా కాజల్ పాత్రకి ప్రేక్షకులు కనెక్ట్ అవుతారు. డూప్ లేకుండా యాక్షన్ సీక్వెన్సులు చేశారామె. ఆంధ్రప్రదేశ్‌లోని దిశ యాప్, తెలంగాణలో షీ సేఫ్ యాప్ గురించి మా మూవీలో చూపించాం. ఎవరైనా ఈ యాప్స్ గురించి తెలుసుకుని ఆపదలో వాడితే వారికి మా సినిమా ద్వారా ఒక సందేశం చేరినట్లే’’ అన్నారు. -
డూప్ లేకుండా కాజల్ యాక్షన్.. భయపడ్డాం: దర్శకుడు సుమన్
‘సత్యభామ కథలో ఎమోషన్, యాక్షన్ రెండూ ఉన్నాయి. ఈ కథ రాసేప్పుడు ఇది హీరోకా హీరోయిన్ కా అనేది ఆలోచించలేదు. ఒక పర్సన్ కోసం అని రాస్తూ వచ్చాం. కథలో అమ్మాయి విక్టిమ్ గా ఉంటుంది కాబట్టి ఫీమేల్ అయితే బాగుంటుంది అనిపించింది. ఎమోషన్, యాక్షన్ రెండూ కాజల్ చేయగలరు అని నమ్మాం. ఎమోషన్ పండించడంలో తనకు మంచి పేరుంది. యాక్షన్ చేస్తే కొత్తగా ఉంటుంది. యాక్షన్ పార్ట్స్ కోసం ఆమె ఎంతో కష్టపడ్డారు. డూప్ లేకుండా యాక్షన్ సీక్వెన్సులు చేశారు. మేం చాలా భయపడ్డాం’అని అన్నారు దర్శకుడు సుమన్ చిక్కాల.కాజల్ అగర్వాల్ లీడ్ రోల్ లో నటిస్తున్న సినిమా “సత్యభామ”. నవీన్ చంద్ర అమరేందర్ అనే కీలక పాత్రను పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని అవురమ్ ఆర్ట్స్ పతాకంపై బాబీ తిక్క, శ్రీనివాసరావు తక్కలపల్లి నిర్మిస్తున్నారు. “మేజర్” చిత్ర దర్శకుడు శశికిరణ్ తిక్క సమర్పకులుగా వ్యవహరిస్తూ స్క్రీన్ ప్లే అందించారు. జూన్ 7న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో దర్శకుడు సుమన్ చిక్కాల మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..→ నాకు సినిమాలంటే ప్యాషన్. రైటింగ్ వైపు ఆసక్తి ఉండేది. నేను ఉద్యోగం చేస్తూనే చిత్ర పరిశ్రమలో అవకాశాల కోసం ప్రయత్నించాను. కొన్ని హిట్ సినిమాలకు స్టోరీ డిస్కషన్స్ లో పాల్గొన్నాను. శశికిరణ్ నాకు మంచి మిత్రుడు. ఆయన సినిమాలకు స్క్రిప్ట్ సైడ్ వర్క్ చేశాను. ఈ సినిమాకు దర్శకత్వం వహించే బాధ్యత నాకు అప్పగించాడు శశి. అలా ఈ సినిమాతో దర్శకుడిగా టాలీవుడ్ లోకి అడుగుపెడుతున్నా. దర్శకుడిగా మారేందుకు శశి ఎంతో కష్టపడ్డాడు. తన సక్సెస్ నుంచి యంగ్ టాలెంట్ జర్నీ మొదలుపెట్టాలని అవురమ్ ఆర్ట్స్ స్థాపించాడు. కొందరికైనా కొత్త వాళ్లకు అవకాశాలు ఇవ్వగలుగుతాం అనేది ఆయన ఆలోచన. శశి వల్లే నేను దర్శకుడిగా మారాను.→ కొందరు పోలీస్ ఆఫీసర్స్ తాము టేకప్ చేసిన కేసుల విషయంలో ఎమోషనల్ గా పనిచేస్తారు. అలా "సత్యభామ" ఒక కేసు విషయంలో పర్సనల్ గా తీసుకుంటుంది, ఎమోషనల్ అవుతుంది. బాధితురాలికి న్యాయం చేసేందుకు ఎలాంటి పోరాటానికైనా సిద్ధమవుతుంది. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఒక అమ్మాయికి సాయం చేసే పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కాజల్ క్యారెక్టర్ కు ప్రేక్షకులంతా కనెక్ట్ అవుతారు.→ ‘సత్యభామ"లో నవీన్ చంద్ర కీ రోల్ చేస్తున్నారు. కాజల్ పెయిర్ గా ఆయన కనిపిస్తారు. నవీన్ చంద్రది రైటర్ క్యారెక్టర్. కాజల్ కు సపోర్ట్ గా ఉంటారు. కాజల్ ఒక వారం పది రోజుల షూటింగ్ తర్వాత మా టీమ్ మెంబర్ గా మారిపోయారు. తను ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అయి నటించారు. మాకు కూడా ఒక స్టార్ సెట్ లోకి వస్తున్న ఫీలింగ్ ఏరోజూ కలగలేదు.→ ఏపీలో దిశా యాప్ ఉంటుంది. తెలంగాణలో షీ సేఫ్ యాప్ ఉంది. మహిళలు తమకు ఏదైనా ఆపద వచ్చినప్పుడు ఈ యాప్ లో నెంబర్ టైప్ చేసి సెండ్ చేస్తే వారి లొకేషన్ షీ టీమ్స్ కు వెళ్లిపోతుంది. వాళ్లు కాపాడేందుకు వస్తారు. మేము సెట్ లో ఉన్నప్పుడు యాప్స్ రెస్పాండ్ అవుతాయా లేదా అని చెక్ చేసి చూశాం. మాకు షీ టీమ్స్ నుంచి ఫోన్ కాల్ వచ్చింది. "సత్యభామ" చూస్తున్నప్పుడు మహిళలు ఎవరైనా ఈ యాప్స్ గురించి తెలుసుకుని తమ లైఫ్ లో వాడితే వారికి మా సినిమా ద్వారా ఒక మెసేజ్ చేరినట్లే.→ "సత్యభామ" పూర్తిగా ఫిక్షన్ కథ. నాకు పోలీస్ డైరీస్ గురించి తెలుసుకోవడం, వారి ఇంటర్వ్యూలు వినడం అలవాటు. అలా కొందరు పోలీసుల లైఫ్ లో జరిగిన ఇన్సిడెంట్స్ స్ఫూర్తితో ఈ కథను డెవలప్ చేశాం. ముందు మా మూవికి ఈ పేరు లేదు. అయితే సత్యభామ అనే పేరు మన పౌరాణికాల్లో పవర్ ఫుల్ నేమ్. అందరికీ త్వరగా రీచ్ అవుతుందని ఆ పేరు పెట్టాం.ప్రస్తుతం కొన్ని కథలు ఉన్నాయి. త్వరలో నా నెక్ట్ మూవీ అనౌన్స్ చేస్తా. -
నా కెరీర్లో ఇదో కొత్త ప్రయత్నం: కాజల్ అగర్వాల్
‘‘సత్యభామ’ కంటే ముందు నాకు లేడీ ఓరియంటెడ్ మూవీస్‌కి చాన్స్ వచ్చింది. కానీ ఈ తరహా సినిమాలు చేసే ఆత్మవిశ్వాసం నాలో ఉన్నప్పుడే ఒప్పుకోవాలనుకున్నాను. ఇప్పుడు కాన్ఫిడెంట్‌గా ‘సత్యభామ’ చేశాను. లేడీ ఓరియంటెడ్ మూవీస్ చేస్తున్నప్పుడు నాపై ఒత్తిడి ఉందనుకోను. బాధ్యతగా తీసుకుంటాను. ఫుల్ లెంగ్త్ యాక్షన్ మూవీ చేయాలని ఎప్పట్నుంచో అనుకుంటున్నాను. అది ‘సత్యభామ’తో నెరవేరింది’’ అని కాజల్ అగర్వాల్ అన్నారు. ఆమె టైటిల్ రోల్లో నటించిన క్రైమ్ థ్రిల్లర్ మూవీ ‘సత్యభామ’. ఈ చిత్రంలో ఓ కీలక పాత్రలో నవీన్‌చంద్ర నటించారు.‘మేజర్’ చిత్రదర్శకుడు శశికిరణ్ తిక్క సమర్పకులుగా వ్యవహరించి, స్క్రీన్‌ప్లే అందించారు. సుమన్ చిక్కాలను దర్శకుడిగా పరిచయం చేస్తూ బాబీ తిక్క, శ్రీనివాసరావు తక్కలపల్లి నిర్మించిన ఈ చిత్రం జూన్ 7న విడుదల కానుంది. ఈ సందర్భంగా గురువారం విలేకర్ల సమావేశంలో కాజల్ అగర్వాల్ మాట్లాడుతూ– ‘‘సత్యభామ’ సినిమాతో ఓ కొత్త ప్రయత్నం చేశాను. ఫస్ట్ టైమ్ నా కెరీర్లో భారీ స్టంట్స్ చేసిన సినిమా ఇది. వాటి కోసం చాలా కష్టపడ్డాను. క్రిమినల్స్ గేమింగ్, వర్చ్యువల్ రియాలిటీ వంటి టెక్నాలజీ ద్వారా పోలీసులు నేరాలను ఎలా పరిష్కరిస్తారో ఓ పోలీస్ అధికారిని అడిగి తెలుసుకున్నాను.ఆ విషయాలు ఈ సినిమాలో ఉన్నాయి’’ అని అన్నారు. ‘‘సత్యభామ’ పూర్తిగా హైదరాబాద్ బేస్డ్ కథ. అందుకే ముందుగా తెలుగులో పర్ఫెక్ట్గా విడుదల చేసి, ఆ తర్వాత మిగతా భాషల గురించి ఆలోచించాలని అనుకున్నాం’’ అన్నారు శశికిరణ్ తిక్క. ‘‘ప్రతి పోలీసాఫీసర్ జర్నీలో ఓ స్పెషల్ కేసు ఉంటుంది. అలా సత్యభామ ఒక కేసును ఎందుకు పర్సనల్‌గా తీసుకుంటుంది అనేది ఈ చిత్రకథ’’ అన్నారు సుమన్ చిక్కాల. ‘‘సత్యభామ’ అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుంది’’ అన్నారు నిర్మాత బాబీ. ఈ చిత్ర సంగీత దర్శకుడు శ్రీ చరణ్ పాకాల మాట్లాడారు. -
Kajal Aggarwal: అందమైన చందమామ.. వయ్యారి సత్యభామ (ఫోటోలు)
-
కాజల్ అగర్వాల్ ‘సత్యభామ’ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)
-
కెరీర్లో కొత్త దశలోకి వెళుతున్నాను: కాజల్ అగర్వాల్
కాజల్ అగర్వాల్ టైటిల్ రోల్లో నటించిన తాజా చిత్రం ‘సత్యభామ’. ప్రకాశ్‌రాజ్, నవీన్ చంద్ర కీలక పాత్రల్లో నటించిన ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీకి సుమన్ చిక్కాల దర్శకత్వం వహించారు. దర్శకుడు శశికిరణ్ తిక్క ఈ సినిమాకు స్క్రీన్‌ప్లే అందించడంతో పాటు సమర్పకుడిగా వ్యవహరించారు. బాబీ తిక్క, శ్రీనివాసరావు తక్కలపల్లి నిర్మించిన ఈ చిత్రం జూన్ 7న విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో కాజల్ అగర్వాల్ మాట్లాడుతూ– ‘‘సత్యభామ’ వంటి యాక్షన్ సినిమాతో నా కెరీర్లో ఓ కొత్త దశలోకి వెళుతున్నాను. ఈ సినిమాలో నేను చాలా ఫైట్స్ చేశాను.కొత్త ఎమోషన్స్‌ను ఎక్స్పీరియన్స్ చేశాను. శశిగారు కథ చెప్పినప్పుడు నచ్చింది. కథపై నమ్మకం కలిగింది. అయితే ఈ సినిమా గ్లింప్స్ విడుదలైన తర్వాత ఆ నమ్మకం రెట్టింపు అయ్యింది. శశిగారు లేకపోతే ‘సత్యభామ’ లేదు. కీరవాణి, చంద్రబోస్గార్లకు థ్యాంక్స్. ‘వెతుకు వెతుకు..’ సాంగ్‌కు మంచి స్పందన వచ్చింది. అమర్ పాత్రలో నవీన్ చంద్ర బాగా యాక్ట్ చేశారు. టీమ్ అందరూ చాలా కష్టపడ్డారు. నన్ను స్టార్ హీరోయిన్ని చేసిన తెలుగు ప్రేక్షకుల ప్రేమ ‘సత్యభామ’ సినిమాపై కూడా ఉండాలని కోరుకుంటున్నాను’’ అన్నారు.‘‘సినిమాల పట్ల కాజల్గారికి ఉన్న ప్యాషన్ మమ్మల్ని ఇన్‌సై్పర్ చేసింది. ‘సత్యభామ’ను థియేటర్స్‌లో చూసి సక్సెస్ చేయండి’’ అన్నారు నిర్మాతలు. ‘‘దర్శకుడిగా నా తొలి చిత్రం ఇది. నా మొదటి హీరో (సినిమాలో కాజల్ లీడ్ రోల్ చేశారు కాబట్టి హీరో అని సంబోధించారు) కాజల్గారిని ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటాను’’ అన్నారు సుమన్ చిక్కాల. ‘‘కాజల్గారు కథ విన్న వెంటనే షూటింగ్ ఎప్పట్నుంచి ప్లాన్ చేసుకుంటారనడంతో మేం సర్ప్రైజ్ అయ్యాం. ఎమోషనల్ పవర్‌ప్యాక్డ్ ఫిల్మ్ ‘సత్యభామ’’ అన్నారు శశికిరణ్ తిక్క. ‘‘సత్యభామ’ చాలా మంచి సబ్జెక్ట్. నా క్యారెక్టర్ కూడా బాగా నచ్చింది. మా చేతిలో ఓ సక్సెస్ఫుల్ సినిమా ఉంది’’ అన్నారు నవీన్‌చంద్ర. పాటల రచయిత రాంబాబు, ఎడిటర్ పవన్ పాల్గొన్నారు. -
కాజల్ అగర్వాల్‌తో ర్యాపిడ్ ఫైర్ ఇంటర్వ్యూ
-
క్యార్‌వ్యాన్‌లోకి వచ్చి అతడలా చేసేసరికి భయపడ్డా: కాజల్ అగర్వాల్
సినిమా హీరోయిన్లకు అప్పుడప్పుడు చేదు అనుభవాలు ఎదురవుతుంటాయి. అభిమానం పేరు చెప్పి ఎలా పడితే అలా ప్రవర్తించి ఇబ్బంది పెడుతుంటారు. స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ ఇలాంటి అనుభవాల్ని చాలాసార్లు ఎదుర్కొంది. కొన్ని నెలల క్రితం జ్యూవెల్లరీ షాప్ ప్రారంభోత్సవానికి వస్తే ఏకంగా మీదమీదకొచ్చేశాడు. అయితే గతంలో షూటింగ్ సందర్భంగా ఓ వ్యక్తి వల్ల చాలా భయపడ్డానని కాజల్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చెప్పుకొచ్చింది.(ఇదీ చదవండి: రెండు ఓటీటీల్లో 'కల్కి'.. ఏకంగా అన్ని కోట్లకు అమ్మేశారా?)'కొన్నిరోజుల క్రితం ఓ సినిమా షూటింగ్లో ఉన్నాను. మొదటి రోజు పూర్తయ్యాక ఆ మూవీ అసిస్టెంట్ దర్శకుడు.. పర్మిషన్ లేకుండా నా క్యార్‌వ్యాన్‌లోకి వచ్చేశాడు. సడన్‌గా తన షర్ట్ తీసేసి ఛాతీపై నా పేరుతో ఉన్న పచ్చబొట్టుని చూపించాడు. ఎవరు లేని టైంలో అతడు అలా చేసేసరికి నేను చాలా భయపడ్డాను. నాపై అభిమానాన్ని టాటూ రూపంలో చూపించినందుకు సంతోషమే. కానీ ఇలా చేయడం మాత్రం కరెక్ట్ కాదని స్మూత్‌గా వార్నింగ్ ఇచ్చాను' అని కాజల్ తనకెదురైన భయానక అనుభవాన్ని బయటపెట్టింది.'సత్యభామ' అనే మూవీతో త్వరలో థియేటర్లలోకి రాబోతున్న కాజల్.. మరోవైపు ఫ్యామిలీ లైఫ్ కూడా ఎంజాయ్ చేస్తోంది. పెళ్లి వల్ల సినిమాలకు కాస్త గ్యాప్ తీసుకుంది. కానీ ఇప్పుడు రెండింటిని బ్యాలెన్స్ చేస్తోంది. అయితే ఈమె చేతిలో ప్రస్తుతానికి స్టార్ హీరోల సినిమాలైతే ఏం లేవు.(ఇదీ చదవండి: Allu Arjun: ఊహించని ప్లేసులో కనిపించిన అల్లు అర్జున్.. ఫొటో వైరల్) -
కన్నప్పలో కాజల్
విష్ణు మంచు టైటిల్ రోల్ చేస్తున్న తాజా చిత్రం ‘కన్నప్ప’. శివ భక్తుడు కన్నప్ప జీవితం ఆధారంగా ఈ సినిమాని దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్ తెరకెక్కిస్తున్నారు. మంచు మోహన్‌బాబు నిర్మిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్‌లో జరుగుతోంది. కాగా ‘కన్నప్ప’ సినిమాలో కాజల్ అగర్వాల్ ఓ కీలక పాత్రలో నటించనున్నట్లుగా చిత్ర యూనిట్ శుక్రవారం వెల్లడించింది.ఇంకా ఈ సినిమాలో మోహన్‌బాబు, శరత్‌కుమార్, మోహన్‌లాల్, ప్రభాస్, అక్షయ్ కుమార్, బ్రహ్మానందం కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అలాగే ఈ సినిమా టీజర్ ప్రస్తుతం ఫ్రాన్స్‌లో జరుగుతున్న 77వ కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో రిలీజ్ కానుంది. ఈ సంగతి ఇలా ఉంచితే... ‘మోసగాళ్ళు’ (2021) మూవీ కోసం విష్ణు మంచు, కాజల్ అగర్వాల్ స్క్రీన్ షేర్ చేసుకున్న విషయం తెలిసిందే. మళ్లీ ఇప్పుడు ‘కన్నప్ప’ కోసం కలిశారు. -
మంచు విష్ణు ప్రాజెక్ట్‌లో టాలీవుడ్ స్టార్ హీరోయిన్.. ఎవరో తెలుసా?
టాలీవుడ్ హీరో మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కిస్తోన్న చిత్రం కన్నప్ప. ముఖేష్‌కుమార్ సింగ్ దర్శకత్వంలో రానున్న ఈ సినిమాలో టాలీవుడ్‌తో పాటు పలువురు బాలీవుడ్ ప్రముఖులు సైతం నటిస్తున్నారు. ఇటీవల ప్రభాస్ సైతం కన్నప్ప సెట్స్‌లో సందడి చేశారు. తన పాత్రకు సంబంధించిన షూటింగ్లో ఆయన పాల్గొన్నారు. తాజాగా ఈ మూవీకి సంబంధించి మరో క్రేజీ అప్డేట్ వచ్చేసింది. ఈ చిత్రంలో స్టార్ హీరోయిన్ నటించనుందని చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది.కన్నప్ప చిత్రంలో స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ కనిపించనుంది. ఈ చిత్రంలో కాజల్ కీలక పాత్ర పోషించనున్నారు. కాగా.. ఇప్పటికే ఈ సినిమాలో మోహన్ బాబు, మోహన్ లాల్, శివరాజ్‌కుమార్, శరత్ కుమార్‌తో పాటు బాలీవుడ్ స్టార్ అక్షయ్‌కుమార్ నటిస్తున్నారు. ఇటీవలే అక్షయ్‌కుమార్ పాత్రకు సంబంధించిన షూటింగ్ పూర్తయింది. ఈ చిత్రంలో ప్రభాస్, నయనతారలు కీలక పాత్రల్లో నటించనున్నారు. మే 20న కేన్స్‌లో జరిగే ఫిల్మ్ ఫెస్టివల్లో కన్నప్ప టీజర్‌ను లాంఛ్ చేయనున్న సంగతి తెలిసిందే. We are thrilled to announce another star attraction in @iVishnuManchu's #Kannappa🏹: The talented @MsKajalAggarwal is all set to shine in an important role! Stay tuned for an unforgettable cinematic experience!@24FramesFactory @avaentofficial @KannappaMovie#KannappaMovie… pic.twitter.com/aGZKUa2wzJ— Kannappa The Movie (@kannappamovie) May 17, 2024 -
కిల్లింగ్ లుక్స్‌లో 'సత్యభామ' హంగామా ఫొటోలు
-
సత్యభామ నాకు స్పెషల్: కాజల్ అగర్వాల్
‘‘సత్యభామ పాత్రలో నటించడం సవాల్‌గా అనిపించింది. ఇలాంటి పాత్ర నా కెరీర్లో ఇదే తొలిసారి. ఇది నా కెరీర్లో స్పెషల్ ్రపాజెక్ట్గా భావిస్తున్నాను’’ అన్నారు హీరోయిన్ కాజల్ అగర్వాల్. ఆమె లీడ్ రోల్లో నటించిన సినిమా ‘సత్యభామ’. నవీన్ చంద్ర కీలక పాత్ర చేశారు. సుమన్ చిక్కాల దర్శకత్వం వహించారు. దర్శకుడు శశికిరణ్ తిక్క ఈ మూవీకి సమర్పకులుగా వ్యవహరించడంతో పాటు స్క్రీన్ ప్లే అందించారు. బాబీ తిక్క, శ్రీనివాసరావు తక్కలపల్లి నిర్మించిన ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది.ఈ చిత్రానికి శ్రీ చరణ్ పాకాల సంగీతం అందించారు. ‘సత్యభామ’ మ్యూజికల్ ఈవెనింగ్ పేరుతో నిర్వహించిన ఈవెంట్లో ఈ మూవీలోని ‘వెతుకు వెతుకు..’ అంటూ సాగే పాట రిలీజ్ చేశారు. చంద్రబోస్ సాహిత్యం అందించిన ఈ పాటని సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి పాడారు. కాజల్ అగర్వాల్ మాట్లాడుతూ– ‘‘నేను ఓ బిడ్డకు జన్మ నిచ్చిన తర్వాత చేసిన సినిమా ‘సత్యభామ’. మన అమ్మాయిలు క్షేమంగా ఉండాలనే పాయింట్ ఈ కథలో నన్ను ఆకట్టుకుంది’’ అన్నారు. ఈ వేడుకలో శశికిరణ్ తిక్క, శ్రీ చరణ్ పాకాల తదితరులు పాల్గొన్నారు. -
ఆడపిల్లనే...ఐతే ఏంటంట
హీరోలకు ప్రేమ కబుర్లు చెప్పే పాత్రలే ఎక్కువగా చేసే హీరోయిన్లు ఫర్ ఎ చేంజ్ నేరస్తులకు బుద్ధి చెప్పే పనిలో పడ్డారు. న్యాయ పోరాటం కోసం ఏం చేయడానికి అయినా వెనకాడని పోలీసాఫీసర్లుగా బెల్టు బిగించారు... తుపాకీ గురి పెట్టారు.. లాఠీకి పని చెప్పారు. ‘ఆడపిల్లనే... ఐతే ఏంటంట’ అంటూ ఓ హీరోయిన్ పోలీస్ పాత్రలో రెచ్చిపోయారు. మిగతా కథానాయికలు కూడా దాదాపు అలానే అంటూ పోలీసు పాత్రల్లో విజృంభించారు. ఆ పోలీసాఫీసర్ల గురించి తెలుసుకుందాం. సత్యభామ సాహసంహైదరాబాద్ సిటీ ఏసీపీ కె. సత్యభామగా చార్జ్ తీసుకున్నారు హీరోయిన్ కాజల్ అగర్వాల్. ఓ అమ్మాయి కేసు విషయంలో సత్యభామ పోలీసాఫీసర్‌గా ఆల్మోస్ట్ సస్పెండ్ అవ్వాల్సిన పరిస్థితి. మరి.. సత్యభామ ఈ కేసును ఎలా సాల్వ్ చేసింది? ఈ క్రమంలో ఆమె ఎదుర్కొన్న సవాళ్లు ఏంటి? అన్నది ‘సత్యభామ’ సినిమాలో చూడాలి. సత్యభామగా కాజల్ అగర్వాల్ టైటిల్ రోల్ చేసిన ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీకి సుమన్ చిక్కాల దర్శకత్వం వహించారు. దర్శకుడు శశికిరణ్ తిక్క సమర్పణలో తక్కలపల్లి శ్రీనివాసరావు, బాబీ తిక్క నిర్మించారు. ఓ అమ్మాయి హత్యాచారం నేపథ్యంలో ‘సత్యభామ’ సినిమా కథ ఉంటుందని ఫిల్మ్‌నగర్ సమాచారం.ఈ నెల 17న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ చిత్రంలో డీజీపీ నారాయణదాస్ పాత్రలో ప్రకాశ్‌రాజ్, అమరేందర్ అనే పాత్రలో నవీన్ చంద్ర లీడ్ రోల్స్‌లో నటించారు. నాగినీడు, హర్షవర్థన్, రవివర్మ కీలక పాత్రల్లో కనిపిస్తారు. ఈ సంగతి ఇలా ఉంచితే... పోలీసాఫీసర్‌గా కాజల్ అగర్వాల్ నటించడం ఇది తొలిసారి కాదు. 2014లో తమిళ హీరో విజయ్ నటించిన ‘జిల్లా’, గత ఏడాది విడుదలైన తమిళ చిత్రం ‘ఘోస్టీ’లో కాజల్ పోలీసాఫీసర్‌గా నటించారు. ఆ రెండు చిత్రాల్లోనూ పవర్ఫుల్ పోలీస్‌గా ఒదిగిపోయారు కాజల్. తాజాగా ‘సత్యభామ’లో కూడా పవర్ఫుల్ ఆఫీసర్‌గా విజృంభించారని యూనిట్ పేర్కొంది.పాయల్ రక్షణహీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ తొలిసారి ‘రక్షణ’ కోసం ఖాకీ డ్రెస్ ధరించి, లాఠీ పట్టారు. పాయల్ రాజ్‌పుత్ ఫస్ట్ టైమ్ పోలీసాఫీసర్‌గా నటించిన చిత్రం ఇది. ప్రణదీప్ ఠాకోర్ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఈ చిత్రం త్వరలోనే విడుదల కానుంది. ఓ పోలీసాఫీసర్ జీవితంలోని ఓ ఘటనను ఆధారంగా చేసుకుని, ఈ క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌ను తెరకెక్కించినట్లుగా యూనిట్ పేర్కొంది. రోషన్ , మానస్, రాజీవ్ కనకాల తదితరులు కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి మహతి స్వరసాగర్ స్వరకర్త.అగ్ని నక్షత్రంమంచు మోహన్ బాబు, మంచు లక్ష్మి లీడ్ రోల్స్‌లో నటిస్తున్న మర్డర్ మిస్టరీ చిత్రం ‘అగ్ని నక్షత్రం’. ఈ చిత్రంలో మంచు లక్ష్మి ఓ పవర్ఫుల్ పోలీసాఫీసర్ పాత్ర చేస్తున్నారు. ఈ చిత్రంలో ఆమె దీక్ష అనే పాత్రలో కనిపిస్తారని సమాచారం. ఎమ్. వంశీకృష్ణ దర్శకత్వంలో మంచు లక్ష్మి, మంచు మోహన్ బాబు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మర్డర్ మిస్టరీ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్‌గా ఈ చిత్రం రూపొందుతోంది. మలయాళీ నటుడు సిద్ధిఖ్, సముద్రఖని, విశ్వంత్, చైత్ర శుక్లా ఈ సినిమాలో ఇతర కీ రోల్స్‌లో కనిపిస్తారు. ఈ చిత్రం విడుదలపై స్పష్టత రావాల్సి ఉంది.ఐతే ఏంటంట?‘కలర్ ఫొటో’, ‘గామి’ వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు నటిగా మరింత దగ్గరయ్యారు హీరోయిన్ చాందినీ చౌదరి. ఈ బ్యూటీ ఇటీవల పోలీసాఫీసర్‌గా డ్యూటీ చేశారు. ఈ డ్యూటీ ‘యేవమ్’ సినిమా కోసం. ఈ సినిమాలో చాందినీ చౌదరితో పాటు వశిష్ట సింహా, జై భారత్, అషు రెడ్డి లీడ్ రోల్స్‌లో నటించారు. ప్రకాశ్ దంతులూరి దర్శకత్వంలో నవదీప్, పవన్ గోపరాజు నిర్మించారు. మహిళా సాధికారిత నేపథ్యంలో రూపొందిన ఈ సినిమాలో ఎస్ఐ సౌమ్య పాత్రలో కనిపిస్తారు చాందినీ చౌదరి.ఇటీవల విడుదలైన ఈ సినిమా పోస్టర్‌పై ‘ఆడపిల్లనే!.. ఐతే ఏంటంట?’ అనే క్యాప్షన్ ఉంది. దీన్నిబట్టి ఈ సినిమాలో చాందిని పాత్ర చాలా స్ట్రాంగ్‌గా ఉంటుందని ఊహించవచ్చు. త్వరలోనే ఈ చిత్రం విడుదల కానుంది. ఇలా పోలీసాఫీసర్లుగా కనిపించనున్న దక్షిణాది హీరోయిన్లు మరికొంతమంది ఉన్నారు.హీరోయిన్ త్రిష నటించిన తొలి వెబ్ సిరీస్ ‘బృందా’. త్రిష టైటిల్ రోల్లో నటించిన క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ఇది. ఇందులో త్రిష పోలీసాఫీసర్ పాత్ర చేశారు. సూర్య వంగల దర్శకత్వం వహించిన ఈ తెలుగు వెబ్ సిరీస్ చిత్రీకరణ పూర్తయింది. స్ట్రీమింగ్ తేదీపై స్పష్టత రావాల్సి ఉంది. పవర్ఫుల్ పోలీసాఫీసర్ క్యారెక్టర్ కావడంవల్లే త్రిష ఈ వెబ్ సిరీస్ చేశారని కోలీవుడ్ టాక్. -
వెతుకు... వెతుకు... అంటూ వచ్చేస్తోన్న సత్యభామ
వెతుకు... వెతుకు.. అంటూ నేరస్తులను వెతుకున్నారు పోలీసాఫీసర్ సత్యభామ. వారిని పట్టుకోవడానికి ఆమె ఎలాంటి సాహసాలు చేశారు? అనే కథతో రూపొందిన చిత్రం ‘సత్యభామ’. పోలీసాఫీసర్ సత్యభామగా కాజల్ అగర్వాల్ చేశారు. నవీన్ చంద్ర అమరేందర్ కీలక పాత్రధారి. దర్శకుడు శశికిరణ్ తిక్క సమర్పకులుగా వ్యవహరించి, స్క్రీన్‌ప్లే అందించిన ఈ చిత్రానికి సుమన్ చిక్కాల దర్శకుడు. బాబీ తిక్క, శ్రీనివాసరావు తక్కలపల్లి నిర్మించిన ఈ చిత్రం త్వరలో రిలీజ్ కానుంది. ఈ చిత్రంలోని మూడో పాట ‘వెతుకు వెతుకు..’ని ఈ నెల 15న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించి, ‘‘నేరస్తులను పట్టుకోవడానికి సత్యభామ చేసే అన్వేషణే ఈ పాట నేప థ్యం’’ అన్నారు మేకర్స్. ఈ చిత్రానికి శ్రీచరణ్ పాకాల స్వరకర్త. -
Satya Movie: ఆకట్టుకుంటున్న ‘నిజమా ప్రాణమా ..’ సాంగ్
హమరేశ్, ప్రార్థనా సందీప్ జంటగా ఆడుగలం మురుగదాస్, సాయి శ్రీ, అక్షయ ప్రధాన పాత్రల్లో రూపొందిన తమిళ చిత్రం ‘రంగోలి’. వాలీ మోహన్ దాస్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని ‘సత్య’పేరుతో శివమ్ మీడియాపై శివ మల్లాల తెలుగులో ఈ నెల 10న రిలీజ్ చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, ట్రైలర్‌కు మంచి స్పందన లభించింది. తాజాగా ఈ మూవీలోని ‘నిజమా ప్రాణమా’ లిరికల్ వీడియోని స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ విడుదల చేసి.. సినిమా హిట్ కావాలని ఆకాంక్షించారు. తను నిర్మాతగా వ్యవహరిస్తున్న తొలి సినిమా పాటను కాజల్ రిలీజ్ చేయడం సంతోషంగా ఉందన్నారు శివ మల్లాల.ఇక పాట విషయానికొస్తే.. ‘నిజమా ప్రాణమా’అంటూ సాగే ఈ మెలోడీ సాంగ్‌కి రాంబాబు గోసాల అద్భుతమైన లిరిక్స్ అందించారు. సుందరమూర్తి కేఎస్ సంగీతం మనసుకు హత్తుకునేలా ఉంది. . వాలి మోహన్ దాస్ డైరెక్ట్ చేసిన విధానం ఆ ఎమోషన్ ని క్యారీ చేసిన విధానం తన ప్రతిభని కనపరిచింది. -
సత్యభామగా ‘చందమామ’.. రిలీజ్ డేట్ ఫిక్స్
కాజల్ అగర్వాల్ లీడ్ రోల్లో నటించిన ‘సత్యభామ’ సినిమా విడుదల తేదీ ఫిక్స్ అయింది. మే 17న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రక టించారు. సుమన్ చిక్కాల దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నవీన్ చంద్ర, ప్రకాశ్ రాజ్ కీలక పాత్రలు పోషించారు. డైరెక్టర్ శశికిరణ్ తిక్క సమర్పణలో బాబీ తిక్క, శ్రీనివాసరావు తక్కలపల్లి ఈ మూవీ నిర్మించారు. ‘‘క్రైమ్ థ్రిల్లర్‌గా రూపొందిన చిత్రం ‘సత్యభామ’. ఇందులో కాజల్ పవర్ఫుల్ పోలీసాఫీసర్ పాత్రలో నటించారు’’ అని చిత్రబృందం పేర్కొంది. -
హీరోయిన్ కాజల్‌కి చేదు అనుభవం.. అభిమాని ప్రవర్తనతో షాక్
హీరోయిన్లు షాపింగ్ మాల్స్, ఈవెంట్స్‌కి వచ్చినప్పుడు అనుకోని ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. స్టార్ హీరోయిన్లు అందరూ ఇలాంటి వాటిని ఫేస్ చేశారు. కాబట్టి జన సమూహం ఉండే చోట తెగ ఇబ్బంది పడుతుంటారు. హీరోయిన్ కాజల్ అగర్వాల్ కూడా హైదరాబాద్‌లోని ఓ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి రాగా, అక్కడ ఓ అభిమాని వల్ల చేదు అనుభవం ఎదురైంది. ప్రస్తుతం ఈ విషయం చర్చనీయాంశంగా మారింది. (ఇదీ చదవండి: హీరో బాలకృష్ణ నిజ స్వరూపాన్ని బయటపెట్టిన తమిళ స్టార్ డైరెక్టర్) తెలుగు స్టార్ హీరోయిన్లలో ఒకరైన కాజల్ అగర్వాల్.. 2020లో గౌతమ్ కిచ్లూ అనే బిజినెస్‌మ్యాన్‌ని పెళ్లి చేసుకున్న తర్వాత నటనకు కొన్నాళ్లు గ్యాప్ ఇచ్చింది. ఇక కొడుకు పుట్టిన తర్వాత కొన్నాళ్లకు తిరిగి యాక్టింగ్ మొదలుపెట్టింది. 'భగవంత్ కేసరి' చిత్రంతో గతేడాది తెలుగు ప్రేక్షకుల్ని పలకరించిన కాజల్.. ఇప్పుడు పలు సినిమాలతో బిజీగా ఉంది. తాజాగా హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ రోడ్ నం.10లోని ఓ షాపింగ్ మాల్ ఓపెనింగ్‌కి వచ్చింది. ఫ్యాన్స్ చాలామంది వచ్చారు. వాళ్లకు సెల్ఫీలు కూడా ఇచ్చింది. అందరూ బాగానే ఉన్నారు. ఓ తుంటరి అభిమాని మాత్రం కాజల్‌తో ఫొటో దిగుతూ ఆమె నడుముపై చెయ్యేశాడు. దీంతో ఆమె అవాక్కయింది. వెంటనే అతడిని బౌన్సర్లు పక్కకు లాగేశారు. గతంలో కాజల్‌కి ఇలాంటి అనుభవమే ఓసారి ఎదురైంది. (ఇదీ చదవండి: ఓటీటీలోకి హిట్ సినిమా 'భ్రమయుగం'.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?) TL spammed with thalaiviii @MsKajalAggarwal latest pictures 🥰 (Gentle Remainder: it's not her bday or years of kajal or movie release. It's just a mall launch.. feel the power of kaaj 😍)#MrsPerfect @MsKajalAggarwal #KajalAggarwal pic.twitter.com/w24XyfhfBm — 𝐊𝐀𝐑𝐓𝐇𝐈𝐂𝐊 (@KarthickS_31) March 6, 2024 -
Kajal Aggarwal: హైదరాబాద్‌లో ఫ్యాషన్ స్టోర్ ప్రారంభించిన కాజల్ అగర్వాల్ (ఫొటోలు)
-
ఇండియన్ 2 విడుదల ఫిక్స్ అయిందా..?
కమల్‌హాసన్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఇండియన్ 2’ ఈ ఏడాది మేలో విడుదల కానుందనే టాక్ కోలీవుడ్‌లో వినిపిస్తోంది. ఇందుకు సంబంధించిన కార్యాచరణను కూడా స్టార్ట్ చేశారట మేకర్స్. త్వరలోనే ‘ఇండియన్ 2’ సినిమా రిలీజ్ గురించిన అధికారిక ప్రకటన కూడా రానుందని కోలీవుడ్ బోగట్టా. కమల్ హాసన్, దర్శకుడు శంకర్ కాంబినేషన్లో 1996లో వచ్చిన సూపర్ హిట్ ఫిల్మ్ ‘ఇండియన్’ (తెలుగులో ‘భారతీయుడు’). ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘ఇండియన్ 2’(తెలుగులో ‘భారతీయుడు 2’) రూపొందుతోంది. ‘ఇండియన్’ సినిమాకు దర్శకత్వం వహించిన శంకరే ‘ఇండియన్ 2’ను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటించగా, సిద్ధార్థ్, బాబీ సింహా, రకుల్ ప్రీత్‌సింగ్ కీలకపాత్రలు పోషించారు. సుభాస్కరన్, ఉధయనిధి స్టాలిన్ నిర్మించిన ‘ఇండియన్ 2’ కి అనిరుద్ స్వరకర్త. -
‘మీ ఎట్ 21’ వైరల్ ట్రెండ్
ఇన్‌స్టాగ్రామ్‌లో ఇప్పుడు ‘మీ ఎట్ 21’ వైరల్ ట్రెండ్ నడుస్తోంది. ఈ ట్రెండ్‌లో భాగంగా 21 ఏళ్ల వయసులోని తమ ఫోటోలను సామాజిక మాధ్యమాల్లో యూజర్లు పోస్ట్ చేస్తున్నారు. ఆ వయసులో తమ తీపి, చేదు జ్ఞాపకాలను గుర్తు తెచ్చుకుంటున్నారు. అరిజోనా (యూఎస్) కు చెందిన 43 ఏళ్ల డామిన్ రఫ్ ఈ ట్రెండ్‌కు కారణం. మెక్సికోలో జరిగిన తన 21 వ బర్త్‌డే ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు.ఈ ఫోటో ‘ఇంతింతై... అంతంతై’ చివరికి వైరల్ ట్రెండ్‌గా మారింది. కరీనా కపూర్, ప్రియాంక చోప్రా, కాజల్‌లు కూడా ఈ వైరల్ ట్రెండ్‌లో భాగం అయ్యారు. కరీనా కపూర్ తన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ‘అశోక’ సినిమాలో షారుఖ్‌ఖాన్ పక్కన ఉన్న ఫోటోను షేర్ చేస్తూ ‘ఫీలింగ్ 21 దిస్ మార్నింగ్’ అనే కాప్షన్ ఇచ్చింది. మరో ఫోటోకు ‘21’ అని కాప్షన్ ఇచ్చి రెడ్ హార్ట్ ఇమోజీ జోడించింది. ప్రియాంక చోప్రా మోడలింగ్ రోజుల నాటి ఫోటోలను షేర్ చేసి ‘లెర్న్ ఏ లాట్ సిన్స్ దెన్’ అని కాప్షన్ ఇచ్చింది. బైక్‌పై కూర్చున్న తన ఫోటో షేర్ చేస్తూ ‘ఉయ్ డిడ్ వెల్. ప్యాట్ ఆన్ ది బ్యాక్ ఫర్ ది యంగర్ మీ’ అని కాప్షన్ ఇచ్చింది కాజల్. -
INDIAN 2 కొత్త రిలీజ్ డేట్ అప్పుడేనా..!
-
ఫుల్ చిల్ మూడ్‌లో కాజల్.. భర్త గౌతమ్ కిచ్లూతో ఏకంగా అలా!
హీరోయిన్ కాజల్ అగర్వాల్ ఈ మధ్య తెగ కనిపించేస్తోంది. సెకండ్ ఇన్నింగ్స్‌లో భాగంగా గతేడాది పలు సినిమాలతో ప్రేక్షకుల్ని పలకరించిన కాజల్.. కొత్త ఏడాది మరికొన్ని మూవీస్‌తో ఎంటర్టైన్ చేసేందుకు రెడీ అయిపోయింది. కెరీర్ పరంగా పర్వాలేదనిపిస్తున్న కాజల్.. ఫ్యామిలీకి పూర్తి సమయాన్ని కేటాయిస్తోంది. తాజాగా న్యూ ఇయర్ సందర్భంగా కుటుంబంతో కలిసి చాలా గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంది. (ఇదీ చదవండి: టాలీవుడ్ లక్కీ హీరోయిన్ పెళ్లి చేసుకోనుందా? అందుకే ఇలా!) కొత్త సంవత్సర వేడుకల్లో కాజల్ అగర్వాల్‌తోపాటు ఫ్యామిలీ అంతా కనిపించాడు. కొడుకు నీల్, భర్త గౌతమ్ కిచ్లూ కూడా ఉన్నారు. ఇన్ స్టాలో పోస్ట్ చేసిన మిగతా ఫొటోలన్నింటి గురించి పక్కనబెడితే భర్త గౌతమ్‌ని ఘడంగా ముద్దుపెట్టుకున్న పిక్ మాత్రం తెగ వైరల్ అయిపోయింది. ఫొటో చూస్తుంటే ఇద్దరూ ఫుల్ చిల్ మూడ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. సో అదన్నమాట విషయం. (ఇదీ చదవండి: ఎంగేజ్మెంట్ చేసుకున్న 'దసరా' విలన్.. అమ్మాయి ఎవరో తెలుసా?) View this post on Instagram A post shared by Kajal A Kitchlu (@kajalaggarwalofficial) -
వేసవిలో వస్తున్నాడు
హీరో కమల్‌హాసన్, దర్శకుడు శంకర్ కాంబినేషన్లో రూపొందుతున్న తాజా చిత్రం ‘ఇండియన్ 2’. వీరి కాంబినేషన్లోనే 1996లో వచ్చిన ‘ఇండియన్’ సినిమాకు ఇది సీక్వెల్. కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో ఎస్జే సూర్య, సిద్ధార్థ్, ప్రియా భవానీ శంకర్, రకుల్‌ప్రీత్ సింగ్ కీలక పాత్రధారులు. ఈ సినిమా చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. ఇటీవల చెన్నైలో మొదలైన ‘ఇండియన్ 2’ భారీ షెడ్యూల్ చిత్రీకరణ ముగిసిందని, ఈ షూటింగ్ షెడ్యూల్‌తో టాకీ పార్టు పూర్తయిందని సమాచారం. బ్యాలెన్స్ ఉన్న రెండు పాటలను కూడా చిత్రీకరిస్తే షూటింగ్ మొత్తం పూర్తవుతుందని టాక్. ఈ చిత్రాన్ని వేసవిలో విడుదల చేయాలనుకుంటున్నారట. -
బికినీలో రకుల్ రచ్చ.. దేవర భామ జాన్వీ కపూర్ స్టన్నింగ్ లుక్స్!
►కాజల్ అగర్వాల్ అదిరిపోయే లుక్స్ ►ఫారిన్లో చిల్ అవుతోన్న హెబ్బా పటేల్ ►రెడ్ డ్రెస్‌లో దేవర భామ జాన్వీ కపూర్ పోజులు ►అమెరికాలోని ఫ్లోరిడాలో అషురెడ్డి హోయలు ►సముద్ర తీరంలో బికినీలో రకుల్ రచ్చ రచ్చ ►కలర్‌ఫుల్ డ్రెస్‌లో దివి స్టెలిష్ లుక్స్ ►రెడ్ డ్రెస్‌లో ఆదితి శంకర్ స్మైలీ లుక్స్ View this post on Instagram A post shared by Hebah P (@ihebahp) View this post on Instagram A post shared by Aditi Shankar (@aditishankarofficial) View this post on Instagram A post shared by Divi Vadthya (@actordivi) View this post on Instagram A post shared by Rakul Singh (@rakulpreet) View this post on Instagram A post shared by Kajal A Kitchlu (@kajalaggarwalofficial) View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor) View this post on Instagram A post shared by Ashu Reddy (@ashu_uuu) -
Kajal Aggarwal : కూకట్‌పల్లిలో సందడి చేసిన కాజల్ అగర్వాల్ (ఫొటోలు)
-
భగవంత్ కేసరి మూవీ సక్సెస్.. దర్శకుడికి ఖరీదైన కారు గిఫ్ట్!
నందమూరి బాలకృష్ణ, కాజల్ అగర్వాల్ జంటగా నటించిన చిత్రం భగవంత్ కేసరి. ఈ సినిమాను అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కించారు. ఈ చిత్రంలో పెళ్లిసందడి ఫేమ్ శ్రీలీల కీలక పాత్రలో కనిపించింది. దసరా కానుకగా థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. బాక్సాఫీస్ వద్ద వంద కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. థియేటర్ల అలరించిన ఈ చిత్రం ప్రస్తుతం ఓటీటీలోనూ దూసుకెళ్తోంది. అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోన్న ఈ మూవీకి ఆడియన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. ఈ మూవీకి దక్కుతున్న ఆదరణతో చిత్రబృందం సంతోషంలో మునిగిపోయింది. తాజాగా ఈ చిత్ర నిర్మాణ సంస్థ షైన్ స్క్రీన్స్ దర్శకుడికి అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చింది. సినిమా సూపర్ హిట్ కావడంతో దర్శకుడు అనిల్ రావిపూడికి ఖరీదైన టొయోటా కారును బహుమతిగా అందించింది. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. ఈ విషయాన్ని నిర్మాణసంస్థ సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. #BhagavanthKesari Producers @Shine_Screens gifted a brand new Toyota Vellfire car to the sensational director @AnilRavipudi for the tremendous Success of #BlockBusterBhagavanthKesari 👌🔥#NandamuriBalakrishna @sahugarapati7 pic.twitter.com/wDeXaLfPs5 — manabalayya.com (@manabalayya) November 27, 2023 -
సైడ్ యాంగిల్లో విష్ణుప్రియ వయ్యారాలు.. జగతి మేడమ్ అయితే అలా!
హాట్ ఫొటోలన్నీ ఒకేసారి పోస్ట్ చేసిన 'నాగిని' బ్యూటీ చీరలో మెగా డాటర్ నిహారిక.. క్యాప్షన్ మాత్రం ఫన్నీగా పరువాలన్నీ చూపించేస్తున్న యాంకర్ విష్ణుప్రియ బికినీలో కనువిందు చేస్తున్న హీరోయిన్ సారా అలీఖాన్ చలిలోనూ చెమట పట్టేలా 'గుప్పెడంత మనసు' జగతి పోజులు 'రంగబలి' బ్యూటీ యుక్తి తరేజా హాట్నెస్ వేరే లెవల్ పట్టుచీరలో మెరిసిపోతున్న హీరోయిన్ మాళవిక రెడ్ డ్రస్‌లో ఎలివేట్ అయిపోతున్న కాజల్ అగర్వాల్ View this post on Instagram A post shared by mon (@imouniroy) View this post on Instagram A post shared by Niharika Konidela (@niharikakonidela) View this post on Instagram A post shared by Vishnupriyaa bhimeneni (@vishnupriyabhimeneni) View this post on Instagram A post shared by Sara Ali Khan (@saraalikhan95) View this post on Instagram A post shared by Jyothi Rai (Jayashree Rai) (@jyothiraiofficial) View this post on Instagram A post shared by Yukti Thareja (@realyukti) View this post on Instagram A post shared by Malavika Mohanan (@malavikamohanan_) View this post on Instagram A post shared by Rakul Singh (@rakulpreet) View this post on Instagram A post shared by Kajal A Kitchlu (@kajalaggarwalofficial) View this post on Instagram A post shared by Kareena Kapoor Khan (@kareenakapoorkhan) View this post on Instagram A post shared by Shivathmika Rajashekar (@shivathmikar) View this post on Instagram A post shared by Mirnaa (@mirnaaofficial) View this post on Instagram A post shared by MEHREEN 🌟🧿 (@mehreenpirzadaa) View this post on Instagram A post shared by Sreeleela (@sreeleela14) -
పెళ్లి తర్వాత ఫస్ట్ టైమ్ కాజల్ అలా.. మంచు లక్ష్మీ మాత్రం!
పెళ్లి తర్వాత కాజల్ అగర్వాల్ తొలిసారి హాట్ పోజులు పూల డ్రస్ లో కలర్ఫుల్గా 'సామజవరగమన' రెబా మోనికా 'జబర్దస్త్' కొత్త యాంకర్ సిరి హనుమంత్ కిర్రాక్ పోజులు బ్యూటిఫుల్ డ్రస్‌లో మెరిసిపోతున్న యాంకర్ విష్ణుప్రియ మంచు లక్ష్మీ మెస్మరైజింగ్ స్టిల్స్.. బ్యాక్ చూపిస్తూ తెల్లని డ్రస్ లో ఏంజెల్ లా కనిపిస్తున్న శ్రీలీల జిగేలు అనేంతలా తయారై వచ్చిన కత్రినా కైఫ్ View this post on Instagram A post shared by Kajal A Kitchlu (@kajalaggarwalofficial) View this post on Instagram A post shared by Reba Monica John (@reba_john) View this post on Instagram A post shared by Siri Hanumanthu (@sirihanmanth) View this post on Instagram A post shared by Manchu Lakshmi Prasanna (@lakshmimanchu) View this post on Instagram A post shared by Sreeleela (@sreeleela14) View this post on Instagram A post shared by Katrina Kaif (@katrinakaif) View this post on Instagram A post shared by Payal Rajput ⭐️ ♾ (@rajputpaayal) View this post on Instagram A post shared by MEHREEN 🌟🧿 (@mehreenpirzadaa) View this post on Instagram A post shared by Mrunal Thakur (@mrunalthakur) View this post on Instagram A post shared by Anu Emmanuel (@anuemmanuel) View this post on Instagram A post shared by Srinidhi Shetty 🌸 (@srinidhi_shetty) View this post on Instagram A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna) -
వేటాడే సత్యభామ
‘సత్యా.. ఈ కేసు నీ చేతుల్లో లేదు (ప్రకాశ్‌రాజ్).. కానీ ఆ ప్రాణం నా చేతుల్లోనే పోయింది సార్ (కాజల్ అగర్వాల్)’ అనే డైలాగ్స్‌తో మొదలవుతుంది ‘సత్యభామ’ టీజర్. పోలీసాఫీసర్ సత్యభామ పాత్రలో కాజల్ అగర్వాల్ నటిస్తున్న చిత్రం ఇది. ప్రకాశ్‌రాజ్, నవీన్ చంద్ర కీలక పాత్రధారులు. బాబీ తిక్క, శ్రీనివాసరావు తక్కలపెల్లి నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి దర్శకుడు శశికిరణ్ తిక్క సమర్పకులుగా వ్యవహరిస్తూ స్క్రీన్‌ప్లే అందించారు. శుక్రవారం ‘సత్యభామ’ టీజర్‌ను రిలీజ్ చేశారు. ‘సార్.. ఆ గిల్ట్ నన్ను వెంటాడుతూనే ఉంది. వేటాడాలి (కాజల్ అగర్వాల్)’, ‘ఆ అమ్మాయి చావుకు మీరే కారణం అంటున్నారు. ఈ కేసును మీరు వదిలేసినట్లేనా? (విలేకర్లు).. నెవర్ (కాజల్)’ అనే డైలాగ్స్ టీజర్లో ఉన్నాయి. ఈ చిత్రానికి సంగీతం: శ్రీచరణ్ పాకాల. -
క్రైమ్ థ్రిల్లర్ మూవీ.. సత్యభామ టీజర్ చూశారా?
స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా “సత్యభామ”. ఈ చిత్రంలో కాజల్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్లో నటిస్తోంది. నవీన్ చంద్ర, ప్రకాశ్‌రాజ్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. క్రైమ్ థ్రిల్లర్ కథతో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. దీపావళి పండుగను ముందే తీసుకువస్తూ “సత్యభామ” సినిమా టీజర్‌ను శుక్రవారం రిలీజ్ చేశారు. “సత్యభామ” సినిమా టీజర్ ఎలా ఉందో చూస్తే.. హత్యకు గురైన ఓ యువతిని రక్షించే క్రమంలో ఆమె ప్రాణాలు కాపాడలేకపోతుంది పోలీస్ ఆఫీసర్ సత్యభామ. అప్పటి నుంచి ఆమె గిల్టీ ఫీలింగ్‌తో బాధపడుతూ ఉంటుంది. పై అధికారులు.. సత్య, ఈ కేసు నీ చేతుల్లో లేదు అని చెబితే.. కానీ ఆ ప్రాణం నా చేతుల్లోనే పోయింది సార్ అంటుంది సత్య. అమాయకురాలైన యువతిని చంపిన హంతకుల కోసం వేట మొదలుపెడుతుంది సత్యభామ. ఈ వేటను మన ఇతిహాసాల్లో నరకాసుర వధ కోసం యుద్ధరంగంలో అడుగుపెట్టిన సత్యభామ సాహసంతో పోల్చుతూ ప్లే అయ్యే బ్యాగ్రౌండ్ సాంగ్ ఆకట్టుకుంది. ఈ కేసును క్లోజ్ చేసేది లేదన్న సత్యభామ.. ఆ హంతకులను పట్టుకుందా? వారిని చట్టం ముందు నిలబెట్టిందా? లేదా అనే అంశాలతో టీజర్ ఆసక్తికరంగా ముగిసింది. “సత్యభామ” చిత్రాన్ని అవురమ్ ఆర్ట్స్ పతాకంపై బాబీ తిక్క, శ్రీనివాసరావు తక్కలపల్లి నిర్మిస్తున్నారు. “మేజర్” చిత్ర దర్శకుడు శశికిరణ్ తిక్క సమర్పకులుగా వ్యవహరిస్తూ స్క్రీన్ ప్లే అందించారు. సుమన్ చిక్కాల దర్శకత్వం వహిస్తున్నారు. చదవండి: ఆదిపురుష్‌కు పని చేయడమే నేను చేసిన పెద్ద తప్పు.. దేశం వదిలి వెళ్లిపోయా.. -
Bhagavanth Kesari Movie Success Meet: ‘భగవంత్ కేసరి’ విజయోత్సవ వేడుక (ఫొటోలు)
-
అందాల చందమామ కాజల్ ధరించిన చీర ధర తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే!
చందమామ వన్నె తగ్గుతుందా? టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ అందం కూడా అంతే! బిడ్డకు తల్లి అయినా తరగని సొగసుతో మెరిసిపోతోంది! ఖాళీ లేని కాల్షీట్లతో కెరీర్లో దూసుకుపోతోంది. ఆ అవకాశాల వెల్లువకు ఆమె టాలెంట్, ఫిట్నెస్లే కాదు ఆమె క్రియేట్ చేసుకున్న ఫ్యాషన్ స్టయిల్ కూడా కారణమే! ఆ క్రెడిట్లో ఈ బ్రాండ్స్‌నీ భాగం చేయాల్సిందే! ఫ్యాషన్ విషయంలో నేను చాలా బద్ధకంగా ఉంటాను. షూటింగ్ లేనప్పుడు క్యాజువల్ వేర్‌లోనే ఉంటాను. ఎందుకంటే నాకు.. నేను ధరించే దుస్తులు సౌకర్యవంతంగా ఉండాలి. వరుణ్ బహ్లా.. .. ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్స్‌లో ఒకరు. 2004లో తన పేరు మీదనే ఫ్యాషన్ హౌస్‌ని ప్రారంభించి, అనతి కాలంలోనే సూపర్ ఇమేజ్ను సంపాదించాడు. దాదాపు బాలీవుడ్ సెలబ్రిటీలు అందరూ కనీసం ఒక్కసారైనా ఈ డిజైనర్ వేర్ని ధరించి ఉంటారు. దేశంలోని ప్రముఖ నగరాలతో పాటు అమెరికా, లండన్‌లోనూ స్టోర్స్ ఉన్నాయి. ధర లక్షల్లోనే! ఆన్‌లైన్‌లోనూ లభ్యం. కాజల్ ధరించిన వరణ్ బహ్లా డిజైనర్ చీర ధర రూ. 2,10,000/- మినరలి జ్యూయెల్స్ వెబ్సైట్ ద్వారా ప్రారంభించిన వ్యాపారం.. తన అందమైన డిజైన్స్‌తో ఇప్పుడు సెలబ్రిటీలకూ మోస్ట్ ఫేవరెట్ అయింది. ఎవరికైనా నప్పే.. ఎవరైనా మెచ్చే ఆభరణాలను అందించడం ‘మినరలి’ జ్యూయెల్స్ ప్రత్యేకత. ఈమధ్యనే ముంబైలో ఒక స్టోర్ ఓపెన్ చేశారు. ఆన్‌లైన్‌లోనూ కొనుగోలు చేయొచ్చు. ఆభరణాల నాణ్యత, డిజైన్‌ను బట్టే ధరలు.జ్యూలరీ బ్రాండ్: మినరలి జ్యూయెల్స్ ధర: ఆభరణాల డిజైన్, నాణ్యతపై ఆధారపడి ఉంటుంది. --దీపిక కొండి (చదవండి: బుట్టబొమ్మ పూజా హెగ్డే ధరించిన చీర ధర తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే!) -
సమ్మర్లో సత్యభామ
కాజల్ అగర్వాల్ టైటిల్ రోల్లో, నవీన్ చంద్ర, ప్రకాశ్‌రాజ్ కీలక పాత్రల్లో నటిస్తున్న క్రైమ్ థ్రిల్లర్ ఫిల్మ్ ‘సత్యభామ’. సుమన్ చిక్కాల దర్శకత్వంలో బాబీ తిక్క, శ్రీనివాసరావు తక్కలపెల్లి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు దర్శకుడు శశికిరణ్ తిక్క సమర్పకుడిగా వ్యవహరిస్తుండటంతో పాటు స్క్రీన్ ప్లే కూడా అందించారు. కాజల్ అగర్వాల్ పోలీసాఫీసర్‌గా నటిస్తున్న ఈ చిత్రం టీజర్‌ను దీపావళికి రిలీజ్ చేయనున్నట్లుగా యూనిట్ వెల్లడించింది. ఈ సందర్భంగా నిర్మాత బాబీ తిక్క మాట్లాడుతూ– ‘‘ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ 60 శాతం పూర్తయింది. ఈ నెల రెండో వారంలో కొత్త షెడ్యూల్‌ను ఆరంభిస్తాం. సమ్మర్లో ఈ సినిమాను విడుదల చేసేలా సన్నాహాలు చేస్తున్నాం’’ అని అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: శ్రీ చరణ్ పాకాల, సహనిర్మాత: బాలాజీ. -
కాజల్ అగర్వాల్ నూతన గృహ ప్రవేశం.. భర్తతో కలిసి పూజలు! (ఫొటోలు)
-
కొత్తింటికి చేరిన భగవంత్ కేసరి భామ.. భర్తతో కలిసి పూజలు!
మగధీర సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరైన హీరోయిన్ కాజల్ అగర్వాల్. ఆ తర్వాత స్టార్ హీరోలందరి సరసన నటించింది. ఇటీవలే బాలకృష్ణ సరసన భగవంత్ కేసరి సినిమాతో మరోసారి ప్రేక్షకులను అలరించింది. దసరా కానుకగా థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ చిత్రంలో పెళ్లిసందడి ఫేమ్ శ్రీలీల కీలక పాత్ర పోషించింది. కాగా.. 2020లో తన ప్రియుడు గౌతమ్ కిచ్లును పెళ్లాడిన భామ కొన్నేళ్ల పాటు వెండితెరకు దూరమైంది. గతేడాదిలోనే ఈ జంటకు ఓ కుమారుడు జన్మించారు. తమ ముద్దుల కుమారుడికి నీల్ అనే పేరు పెట్టారు. ప్రస్తుతం మళ్లీ సినిమాలతో బీజీగా ఉంటోన్న ముద్దుగుమ్మ.. తాజాగా కొత్త ఇంటిని కొనుగోలు చేసింది. తన భర్త, కుమారుడితో కలిసి గృహ ప్రవేశం చేసింది. దీనికి సంబంధించిన ఫోటోలను కాజల్ తన ఇన్‌స్టాలో పంచుకుంది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. కాజల్ తన ఇన్‌స్టాలో రాస్తూ..'నేను ఈ విషయాన్ని మీతో పంచుకోవడం చాలా భావోద్వేగాలతో ముడిపడి ఉంది. మా పవిత్రమైన కుటుంబ కోసం ఈ వారంలోనే గృహ ప్రవేశానికి సంబంధించిన పూజ జరిగింది. ఇది మేము ప్రేమతో కట్టుకున్నఇల్లు. ఇది నేను ఆ దేవుడి ఆశీర్వాదంగా భావిస్తున్నా. ఈ శుభ సందర్భంలో మా హృదయాలు కృతజ్ఞతతో నిండి ఉన్నాయి.' అంటూ పోస్ట్ చేసింది. ఈ విషయం తెలుసుకున్న పలువురు ప్రముఖ సినీతారలు, ఫ్యాన్స్ అభినందనలు చెబుతున్నారు. View this post on Instagram A post shared by Kajal A Kitchlu (@kajalaggarwalofficial) -
Bhagavanth Kesari Success Meet: ‘భగవంత్ కేసరి’ మూవీ విజయోత్సవ యాత్ర (ఫోటోలు)
-
Bhagavanth Kesari: 'భగవంత్ కేసరి' సక్సెస్ మీట్ (ఫొటోలు)
-
Bhagavanth Kesari : ‘భగవంత్ కేసరి’ మూవీ రివ్యూ
టైటిల్: భగవంత్ కేసరి నటీనటులు: బాలకృష్ణ, శ్రీలీల, కాజల్, అర్జున్ రాంపాల్ తదితరులు నిర్మాణ సంస్థ:షైన్ స్క్రీన్స్ బ్యానర్ నిర్మాత: హరీశ్ పెద్ది, సాహు గారపాటి రచన-దర్శకత్వం: అనిల్ రావిపూడి సంగీతం: తమన్ సినిమాటోగ్రఫీ: రామ్ ప్రసాద్ ఎడిటర్: తమ్మిరాజు విడుదల తేది: అక్టోబర్ 19, 2023 ‘భగవంత్ కేసరి’ కథేంటంటే.. నేలకొండ భగవంత్ కేసరి (బాలకృష్ణ) వరంగల్ జైల్లో ఖైదీగా ఉంటాడు. అక్కడికి కొత్తగా వచ్చిన జైలర్ శ్రీకాంత్(శరత్ కుమార్).. భగవంత్ కేసరి గురించి తెలుసుకొని అతనికి దగ్గరవుతాడు. భగవంత్ కేసరికి సహాయం చేసిన కారణంగా శ్రీకాంత్ సస్పెండ్ అవుతాడు. వెళ్లే ముందు సత్ప్రవర్తన కారణంగా రిలీజ్ చేసే ఖైదీల లిస్ట్‌లో భగవంత్ కేసరి పేరు చేర్చుతాడు. దీంతో భగవంత్ జైలు నుంచి విడుదల అవుతాడు. బయటకు రాగానే జైలర్ శ్రీకాంత్ ఇంటికి వెళ్తాడు. అదే రోజు శ్రీకాంత్ రోడ్డు యాక్సిడెంట్లో మరణిస్తాడు. దీంతో అతని కూతురు విజ్జి పాప(శ్రీలీల) బాధ్యతను భగవంత్ కేసరి తీసుకుంటాడు. తండ్రి కోరిక మేరకు విజ్జి పాపను ఇండియన్ ఆర్మీలో చేర్పించాలనుకుంటాడు. మరోపక్క వ్యాపారవేత్త రాహుల్ సంఘ్వీ(అర్జున్ రాంపాల్) ప్రభుత్వాన్ని బెదిరించి ప్రాజెక్ట్ V ని దక్కించుకోవాలనుకుంటాడు. దానికి అడ్డుగా వచ్చిన ఉప ముఖ్యమంత్రి(శుభలేఖ సుధాకర్)ని హత్య చేసి.. అతని పీఏ దగ్గర ఉన్న ఆధారాల కోసం వెతుకుతుంటాడు. ఓ కారణంగా విజ్జి పాపను చంపేందుకు సంఘ్వీ మనుషులు ప్రయత్నిస్తారు. అప్పుడు భగవంత్ కేసరి ఏం చేశాడు? అసలు భగవంత్ కేసరి జైలుకు ఎందుకు వెళ్లాడు? ఆదిలాబాద్ ఊచకోత కేసు నేపథ్యం ఏంటి? రాహుల్ సింఘ్వీకి, కేసరికి మధ్య ఉన్న పాత వైరం ఏంటి? చివరకు విజ్జి పాప ఆర్మీలో చేరిందా? లేదా? అదేది తెలియాలంటే థియేటర్స్‌లో ‘భగవంత్ కేసరి’ చూడాల్సిందే. ఎలా ఉందంటే.. కామెడీ చిత్రాలను కమర్షియల్ పద్దతిలో తెరకెక్కించి హిట్ సాధించిన డైరెక్టర్ అనిల్ రావిపూడి. ఆయన నుంచి ఓ సినిమా వస్తుందంటే.. కచ్చితంగా కామెడీ ఆశిస్తాం. మరోవైపు బాలయ్య సినిమా అంటే పంచ్ డైలాగ్స్, ఊరమాస్ ఫైట్స్ మస్ట్. కానీ తొలిసారి వీరిద్దరు తమ బలాలను వదిలి చేసిన ప్రయోగమే ‘భగవంత్ కేసరి’. ఈ సినిమా అనౌన్స్ చేసినప్పుడే బాలయ్యను కొత్తగా చూడబోతున్నారని చెప్పాడు అనిల్ రావిపూడి. అన్నట్లుగానే బాలయ్యను తెరపై కొత్తగా చూపించాడు. అయితే కథ-కథనం విషయంలో మాత్రం కొత్తదనం లేదు. హీరో తన సొంతూరిని వదిలి దూరంగా బతకడం..దాని వెనుక విలన్ కారణంగా ఉండడం..ఒక ఫ్లాష్ బ్యాక్ స్టోరీ.. క్లైమాక్స్‌లో హీరో మళ్లీ వచ్చి విలన్ని చంపడం... ఈ తరహా కథతో తెలుగులో చాలా సినిమాలే వచ్చాయి. ‘భగవంత్ కేసరి’ కథ కూడా అలానే ఉంటుంది. కాకపోతే ట్రీట్మెంట్ కాస్త కొత్తగా అనిపిస్తుంది. దానికి కారణం బాలయ్య, శ్రీలీల అనే చెప్పాలి. తెరపై ఇంతవరకు వారిద్దరిని అలాంటి పాత్రల్లో చూడలేదు. అమ్మాయిలను సింహం లెక్క పెంచాలి అని చెబుతూ.. వారినికి కేవలం వంటింటికే పరిమితం చేయొద్దనే సందేశాన్ని ఈ చిత్రం ద్వారా ఇచ్చారు. ఆపదలో ఉన్న ముంబై కోర్టు న్యాయమూర్తి ఫ్యామిలీకి ఓ వ్యక్తి ‘భగవంత్ కేసరి’ కథ చెప్పే సీన్‌తో సినిమా ప్రారంభం అవుతుంది. ప్రధాన పాత్రల పరిచయానికే దర్శకుడు ఎక్కువ సమయం తీసుకున్నాడు. ఓ భారీ ఫైట్ సీన్‌తో హీరో ఇంట్రడక్షన్.. ఆ తర్వాత జైలర్ శ్రీకాంత్.. భగవంత్ కేసరిని కలవడం.. అతని కూతురు విజ్జికి భగవంత్‌తో మంచి బాండింగ్ ఏర్పడటం చూపించారు. అయితే ఇదంతా సాగదీతగా, రొటీన్‌గా అనిపిస్తాయి. జైలర్ శ్రీకాంత్ చనిపోయిన తర్వాత కథ కాస్త ఎమోషనల్‌గా టర్న్ తీసుకుంటుంది. ఈ క్రమంలో వచ్చే ‘ఉయ్యాలో ఉయ్యాల..’ సాంగ్ ఆడియన్స్‌కి రిలీఫ్ ఇస్తుంది. విలన్ మనుషులు విజ్జి పాప వెనుక పడడానికి గల కారణాన్ని కన్విన్సింగ్‌గా చూపించారు. అక్కడి నుంచి కథలో వేగం పెంచుకుంటుంది. ఫస్టాఫ్ స్లోగా అనిపించినా.. ఇంటర్వెల్ సీన్ మాత్రం సెకండాఫ్‌పై ఆసక్తిని పెంచుతుంది. ద్వితీయార్థంలో చాలా సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ ఉంటాయి. అనిల్ రావిపూడి కామెడీ టచ్‌తో బస్‌లో బాలయ్య చేసే యాక్షన్ సీన్ ఆకట్టుకుంటుంది. అలాగే స్కూల్లో బాలయ్య ఇచ్చే స్పీచ్ సందేశాత్మకంగా ఉంటుంది. విలన్ ఇంటికి వెళ్లి హీరో వార్నింగ్ ఇచ్చే సీన్ సినిమాటిక్‌గా అనిపించినా.. అక్కడ హీరో బాలయ్య కాబట్టి పర్వాలేదనిపిస్తుంది. హెలికాఫ్టర్లతో జాన్ విజయ్ వచ్చి కేసరికి సహాయం చేసే ఎపిసోడ్స్.. క్లైమాక్స్‌లో శ్రీలీల చేసే యాక్షన్ సీన్ థ్రిలింగ్‌గా అనిపిస్తుంది. ఎవరెలా చేశారంటే.. భగవంత్ కేసరి పాత్రలో బాలకృష్ణ ఒదిగిపోయాడు. పెప్పర్ అండ్ సాల్ట్ లుక్‌లో తెరపై కొత్తగా కనిపించాడు. తెలంగాణ యాసలో మాట్లాడుతూ.. తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. ఇక ఈ సినిమాలో బాలకృష్ణ తర్వాత బాగా పండిన పాత్ర శ్రీలీలది. విజ్జి పాప పాత్రలో ఆమె ఒదిగిపోయింది. తెరపై సరికొత్త శ్రీలీలను చూస్తాం. ఎమోషనల్ సీన్స్‌తో పాటు యాక్షన్స్ సన్నివేశంలో కూడా అదరగొట్టేసింది. కాజల్ పాత్రకు అంతగా ప్రాధాన్యత లేదు. సినిమాలో హీరోయిన్ ఉండాలి కాబట్టి ఆమె పాత్రను పెట్టినట్లుగా అనిపిస్తుంది. అర్జున్ రాంపాల్ విలనిజం అంతగా పండలేదు. శరత్ కుమార్, ఆడుకాలం నరేన్, వీటీవీ నగేష్, మురళీధర్ గౌడ్, రఘుబాబు, జయచిత్ర, రచ్చ రవి తదితరులు తమ పాత్రల పరిధిమేర నటించారు. ఇక సాంకేతిక విషయాలకొస్తే.. తమన్ నేపథ్య సంగీతం బాగుంది. తనదైన బీజీఎంతో కొన్ని సన్నివేశాలకు ప్రాణం పోశాడు. పాటల విషయంలో ఇంకాస్త కేర్ తీసుకోవాల్సింది. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటర్ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. ముఖ్యంగా ఫస్టాఫ్‌లో కొన్ని సీన్స్‌ని మరింత క్రిస్పీగా కట్ చేయాల్సింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. -అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
Bhagavanth Kesari: ‘భగవంత్ కేసరి’ మూవీ స్టిల్స్ (ఫొటోలు)
-
స్టేజీపై బతుకమ్మ ఆడిన కాజల్, శ్రీలీల.. వీడియో వైరల్
తెలంగాణ అస్థిత్వాన్ని తెలిపే పూలపండుగ బతుకమ్మ. తొమ్మిది రోజులపాటు ఈ వేడుక ఘనంగా జరుపుకుంటారు. భాద్రపద అమావాస్య నాడు మొదలయ్యే బతుకమ్మ అష్టమి రోజున సద్దుల బతుకమ్మ లేదా పెద్ద బతుకమ్మతో ముగుస్తుంది. అయితే ఈసారి బతుకమ్మ పండగ కాస్త ముందుగానే మొదలైంది. ఆదివారం నాడు హనుమకొండలో హీరోయిన్స్ కాజల్ అగర్వాల్, శ్రీలీల బతుకమ్మ ఆడారు. నందమూరి బాలకృష్ణ సినిమా భగవంత్ కేసరి ట్రైలర్ రిలీజ్ కార్యక్రమంలో భాగంగా వీరిద్దరూ బతుకమ్మను ఎత్తుకుని స్టేజీ మీదకు వెళ్లి ఆడిపాడారు. తెలుగమ్మాయిలా కట్టూబొట్టుతో మెరవడమే కాక ఎంతో ముచ్చటగా బతుకమ్మ ఆడగా ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. భగవంత్ కేసరి సినిమా విషయానికి వస్తే.. ఈ మూవీలో బాలకృష్ణ, కాజల్ అగర్వాల్ జంటగా నటించారు. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించాడు. శ్రీలీల ముఖ్య పాత్రలో నటించగా బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ విలన్‌గా కనిపించనున్నాడు. షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి, హరీష్ పెద్ది సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం అక్టోబర్ 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. #Kajal and #Sreeleela playing Bathukamma #BhagavanthKesariOnOCT19 pic.twitter.com/lebZjFn9rj — 𝐁𝐡𝐞𝐞𝐬𝐡𝐦𝐚 𝐓𝐚𝐥𝐤𝐬 (@BheeshmaTalks) October 8, 2023 చదవండి: 300కు పైగా చిత్రాలు.. తన పేరునే మర్చిపోయి.. కదల్లేనిస్థితిలో! -
నేను బిజినెస్ మెన్ ని పెళ్లి చేసుకోవడానికి కారణం ఇదే..!
-
తెలుగు సాంప్రదాయం ప్రకారమే నేను పెళ్లి చేసుకున్న: కాజల్ అగర్వాల్
-
Kajal Agarwal Latest Photos: బ్లాక్ శారీలో ధగధగ మెరిసిన 'కాజల్ అగర్వాల్' (ఫొటోలు)
-
వరంగల్: ‘భగవంత్ కేసరి’ సినిమా ట్రైలర్ విడుదల వేడుక (ఫొటోలు)
-
మేము అందరమూ కలిసే ఉంటాం అంటున్న కాజల్
-
హీట్ పెంచేస్తున్న అనన్య.. కాజల్ సోయగాలు
చాలారోజులకు గ్లామర్ చూపించిన కాజల్ ఒంపుసొంపులు చూపిస్తూ పూజాహెగ్డే రచ్చ ఎప్పుడూ లేనంత హాట్‌గా తయారైన ఈషా రెట్రో లుక్‌లో హీరోయిన్ హెబ్బా పటేల్ చీరకట్టులో అందంగా కనిపిస్తున్న జాన్వీ కపూర్ కుర్చీపై కూర్చుని కాక రేపే పోజుల్లో ప్రణీత రెడ్ డ్రస్ లో మిర్చి కంటే హాట్ గా అనన్య అనసూయ క్యూట్ పోజులు.. నవ్వుతూ మాయ View this post on Instagram A post shared by Pooja Hegde (@hegdepooja) View this post on Instagram A post shared by Kajal A Kitchlu (@kajalaggarwalofficial) View this post on Instagram A post shared by Eesha Rebba (@yourseesha) View this post on Instagram A post shared by Hebah P (@ihebahp) View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor) View this post on Instagram A post shared by Pranita Subhash (@pranitha.insta) View this post on Instagram A post shared by Ananya nagalla (@ananya.nagalla) View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) View this post on Instagram A post shared by Shalini Pandey (@shalzp) View this post on Instagram A post shared by Alekhya Harika (@alekhyaharika_) View this post on Instagram A post shared by Pujita Ponnada (@pujita.ponnada) View this post on Instagram A post shared by Alia Bhatt 💛 (@aliaabhatt) View this post on Instagram A post shared by MEHREEN 🌟🧿 (@mehreenpirzadaa) -
పోలీస్ ఆఫీసర్లుగా ఆన్ డ్యూటీలో ఉన్న హీరోయిన్లు
పోలీస్ ఆఫీసర్లుగా కొందరు నాయికలు దోషులను పట్టుకునేందుకు రెడీ అయ్యారు. ఇందులో భాగంగా కేసు వివరాల కోసం లోతుగా విచారణ చేస్తూ, ఇన్వెస్టిగేషన్ మోడ్‌లోకి వెళ్లి΄ోయారు. ఈ తారల పరిశోధనల విశేషాల్లోకి వెళదాం. ఆన్ ఇన్వెస్టిగేషన్ తొలి అడుగు రెండు దశాబ్దాలుగా అగ్రకథానాయికగా త్రిష ప్రయాణం దిగ్విజయంగా కొనసాగుతోంది. ఇప్పుడు డిజిటల్ ఎంటర్టైన్మెంట్ హవా కూడా నడుస్తున్న తరుణంలో ఈ ΄్లాట్‌ఫామ్‌లో ఆమె సైన్ చేసిన తొలి వెబ్ సిరీస్ ‘బృందా’. ఇందులో త్రిషపోలీసాఫీసర్గా నటిస్తున్నారు. పూర్తి స్థాయిపోలీసాఫీసర్ పాత్రలో త్రిష నటిస్తుండటం కూడా ఇదే మొదటిసారి అనొచ్చు. క్రైమ్–ఇన్వెస్టిగేషన్ నేపథ్యంలో ఈ సిరీస్‌కు సురేష్ వంగలా దర్శకత్వం వహిస్తున్నారు. తెలుగులో రూపొందుతున్న ఈ సిరీస్ ఇతర భాషల్లో అనువాదమై, త్వరలో స్ట్రీమింగ్ కానుంది. పవర్ఫుల్ సత్యభామ హైదరాబాద్‌లో అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్‌పోలీస్ సత్యభామగా చార్జ్ తీసుకున్నారు కాజల్ అగర్వాల్. ఆమె టైటిల్ రోల్లో రూపొందుతున్న చిత్రం ‘సత్యభామ’. ఈ చిత్రంలో ఏసీపీ సత్యభామ పాత్ర చేస్తున్నారు కాజల్. ఆల్రెడీ టీజర్‌ను కూడా రిలీజ్ చేశారు. అఖిల్ డేగల ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. గతంలో కొన్ని చిత్రాల్లో కాజల్పోలీసాఫీసర్ పాత్రలో నటించినప్పటికీ ఓ పూర్తి స్థాయి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్‌గా నటించడం ఇదే తొలిసారి. ఆఖరి నిజం ఢిల్లీలో 2018లో జరిగిన బురారి ఆత్మహత్యల ఘటన ఆధారంగా ఇప్పటికే కొన్ని వెబ్ సిరీస్‌లు రూపొందాయి. తాజాగా రూపొందిన మరో వెబ్‌సిరీస్ ‘ఆఖ్రీ సచ్’ (ఆఖరి నిజం). ఆత్మహత్యల మిస్టరీ చేధించే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఆన్యగా తమన్నా నటించారు. ఈ తరహా పాత్ర చేయడం ఇదే తొలిసారి అని ఇటీవల తమన్నా పేర్కొన్నారు. రాబీ గ్రేవాల్ ఈ వెబ్ సిరీస్‌కు దర్శకత్వం వహించారు. ఇలా ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్‌గా మరికొందరు తారలు నటిస్తున్నారు. -
Social Halchal: చంద్రముఖిలా కంగనా.. భార్యతో నితిన్
► చేతిలో చిన్న హ్యాండ్ బ్యాగ్‌తో కాజల్ అగర్వాల్ ఫోజులు ► స్టైలిష్ లుక్‌లో మీనాక్షీ చౌదరి ఫోటోలు వైరల్ ► భార్య షాలినీతో నితిన్ రొమాన్స్ ► చంద్రముఖి రూపంలో కంగనా రనౌత్.. పోస్టర్ రిలీజ్ చేసిన మేకర్స్ View this post on Instagram A post shared by Kajal A Kitchlu (@kajalaggarwalofficial) View this post on Instagram A post shared by Honey Rose (@honeyroseinsta) View this post on Instagram A post shared by Vaishnavi Chaitanya🧿🦋 (@vaishnavii_chaitanya) View this post on Instagram A post shared by Vyjayanthi Movies (@vyjayanthimovies) View this post on Instagram A post shared by Meenakshii Chaudhary (@meenakshichaudhary006) View this post on Instagram A post shared by Shalini Kandukuri (@shalinikandukuri) View this post on Instagram A post shared by Vithika Sheru (@vithikasheru) View this post on Instagram A post shared by Lyca Productions (@lycaproductions) View this post on Instagram A post shared by Ketika (@ketikasharma) View this post on Instagram A post shared by Sun Pictures (@sunpictures) View this post on Instagram A post shared by Ananya nagalla (@ananya.nagalla) View this post on Instagram A post shared by Anveshi Jain (@anveshi25) View this post on Instagram A post shared by Mehaboob Dil Se (@mehaboobdilse) View this post on Instagram A post shared by Kajal A Kitchlu (@kajalaggarwalofficial) -
నా సినిమా వ్యవహారాలన్నీ ఎవరు చూసుకుంటారంటే: కాజల్ అగర్వాల్
నటిగా, భార్యగా, తల్లిగా పరిపూర్ణ జీవితాన్ని అనుభవిస్తున్న అతి కొద్దిమంది నటీమణుల్లో కాజల్ అగర్వాల్ ఒకరు. నటిగా మంచి ఫామ్‌లో ఉండగానే గౌతమ్ కిచ్లుని ప్రేమించి పెళ్లి చేసుకుంది. తర్వాత ఒక బిడ్డకు తల్లి అయిన తర్వాత కూడా మళ్లీ నటిగా కొనసాగిస్తున్న కాజల్ అగర్వాల్ ఇప్పటికీ కథానాయకిగా బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఈమె తమిళంలో శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఇండియన్–2 చిత్రంలో కమలహాసన్ సరసన నటిస్తున్నారు. తెలుగులో బాలకృష్ణకు జంటగా ఒక చిత్రం చేస్తున్నారు. కాగా ఇటీవల ఈ భామ ఒక ఇంటర్వ్యూలో తన గురించి పేర్కొంది. (ఇదీ చదవండి: Oppenheimer Movie Review: ఓపెన్‌హైమర్ సినిమా రివ్యూ) సాధారణంగా ప్రారంభమైన తన సినీ జీవితం ఆ తర్వాత పెద్దపెద్ద స్టార్స్‌తో నటిస్తూ ఇప్పుడు కమలహాసన్ సరసన నటించే స్థాయికి చేరుకుందన్నారు. తాను నటించిన హీరోల నుంచి ఏదో మంచి విషయాన్ని నేర్చుకుంటూనే ఉన్నానన్నారు. సినీ రంగంలో సమంత, తమన్నాలతో చాలా సన్నిహితంగా ఉంటానని, చాలా విషయాలు వారితో పంచుకుంటానని చెప్పారు. తాను గత పదేళ్ల క్రితం తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యానని ఆ తర్వాత తమిళ ప్రేక్షకులు ఆదరించారని పేర్కొన్నారు. (ఇదీ చదవండి: శివ జ్యోతిని అక్కా.. అంటూనే ఇలాంటి కామెంట్లా?) ముంబైకి చెందిన తాను డిగ్రీ చదివానని అలా మోడలింగ్ చేస్తున్న తనకు సినిమా రంగం తలుపు తెరిచిందని చెప్పారు. దాంతో చదువు కట్ అయిందని అన్నారు. తన తండ్రి వినయ్ అగర్వాల్ వ్యాపారి అని చెప్పారు. ఇప్పుడు తన సినిమా వ్యవహారాలన్నీ ఆమ్మనే చూసుకుంటున్నారని చెప్పారు. ఇకపోతే పెళ్లయిన తర్వాత తల్లిదండ్రులను వదిలి వచ్చాననే భావన కొంచెం కూడా రాకుండా భర్త చూసుకుంటున్నారన్నారు. సినిమాలతో పాటు నిజజీవితంలో భార్య, తల్లి పాత్రలకు సమన్వయం చేస్తున్నాననే సంతృప్తితో ఉన్నానన్నారు. -
‘మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్’కు ప్రిపేర్ అవుతున్న స్టార్స్!
విలన్ ముఖం మీద హీరో పంచ్ ఇవ్వాలా? కాలితో ఒక్క కిక్ కొట్టాలా? గాల్లో ఎగిరి పల్టీలు కొట్టి మరీ విలన్ని కొట్టాలా? ఇవన్నీ చేయాలంటే కాస్త ట్రైనింగ్ కావాలి. రెగ్యులర్ ఫైట్స్‌కి అయితే అక్కర్లేదు. బీభత్సమైన ఫైట్స్‌కి అయితే శిక్షణ తీసుకోవాల్సిందే. అది హీరో అయినా హీరోయిన్ అయినా. ఈ మధ్య రిస్కీ రోల్స్ ఒప్పుకున్న కొందరు స్టార్స్ ‘మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్’ నేర్చుకోవడానికి ప్రిపేర్ అయ్యారు. కిక్ బాక్సింగ్, కరాటే, కుంగ్ ఫూ, జూడో, కలరి పయట్టు వంటివన్నీ మార్షల్ ఆర్ట్స్ కిందే వస్తాయి. ఫైట్‌కి సూట్ అయ్యే ఆర్ట్ నేర్చుకుని బరిలోకి దిగనున్న స్టార్స్ గురించి తెలుసుకుందాం. మూడు నెలలు బ్యాంకాక్‌లో... హీరో మహేశ్‌బాబు– డైరెక్టర్ రాజమౌళి కాంబినేషన్లో ఓ భారీ చిత్రం రూపొందనున్న విషయం తెలిసిందే. ఆఫ్రికన్ అడవుల నేపథ్యంలో జరిగే ఈ కథలో భారీ యాక్షన్ సన్నివేశాలు ఉంటాయట. పోరాట సన్నివేశాలు సహజంగా ఉండేందుకు కెరీర్లో తొలిసారి ఈ సినిమా కోసం మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోనున్నారట మహేశ్‌బాబు. ఇందుకోసం మూడు నెలల పాటు బ్యాంకాక్ వెళతారని టాక్. అక్కడ మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్, హైకింగ్, ట్రెక్కింగ్ వంటివి నేర్చుకోనున్నారట. ఈ శిక్షణ ఇవ్వనున్న బ్యాంకాక్ స్టంట్ టీమ్‌కి ఓ హాలీవుడ్ ప్రముఖ స్టంట్ కొరియోగ్రాఫర్ నేతృత్వం వహిస్తారని తెలిసింది. ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్న ‘గుంటూరు కారం’లో నటిస్తున్నారు మహేశ్‌బాబు. ఈ చిత్రం పూర్తయ్యాక బ్యాంకాక్‌లో శిక్షణ తీసుకుని, రాజమౌళి సినిమా షూట్లో జాయిన్ అవుతారట. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారు రాజమౌళి. ఈ చిత్రానికి రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ కథ అందిస్తున్న సంగతి తెలిసిందే. థాయ్‌ల్యాండ్‌లో... తొలి చిత్రం ‘ఉప్పెన’తో (2021) బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు వైష్ణవ్ తేజ్. ఆ తర్వాత ‘కొండపొలం, రంగరంగ వైభవంగా’ వంటి చిత్రాల్లో నటించారు. ఈ మూడు చిత్రాల్లో సాఫ్ట్ క్యారెక్టర్‌తో ప్రేక్షకులను అలరించిన ఆయన తొలిసారి ‘ఆదికేశవ’ చిత్రంలో ఫుల్ యాక్షన్ రోల్ చేశారు. శ్రీకాంత్ ఎన్. రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో హై ఓల్టేజ్ యాక్షన్ సన్నివేశాల కోసం థాయ్‌ల్యాండ్‌లో మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్‌లో శిక్షణ తీసుకున్నారు వైష్ణవ్ తేజ్. ఈ చిత్రంలో వైష్ణవ్‌కు జోడీగా శ్రీలీల నటించారు. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ సినిమా ఆగస్టు 18న రిలీజ్ కానుంది. కలరి మార్షల్ ఆర్ట్‌లో... మలయాళ హీరో టొవినో థామస్ కలరి అనే మార్షల్ ఆర్ట్‌లో శిక్షణ పొందారు. టొవినో థామస్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘అజయంతే రందం మోషణం’. జితిన్ లాల్ దర్శకత్వం వహిస్తున్నారు. కథ పరంగా కేరళలోని కలరి అనే మార్షల్ ఆర్ట్‌కు ఈ చిత్రంలో ప్రాధాన్యం ఉండటంతో టొవినో థామస్ ఈ విద్యలో శిక్షణ తీసుకుని నటిస్తున్నారు. ఈ చిత్రంలో కృతీ శెట్టి, ఐశ్వర్య రాజేష్, సురభి లక్ష్మి హీరోయిన్లుగా నటిస్తున్నారు. భారతీయుడు కోసం... కమల్‌హాసన్ హీరోగా శంకర్ దర్శకత్వం వహిస్తున్న ‘భారతీయుడు 2’ కోసం కాజల్ అగర్వాల్ మార్షల్ ఆర్ట్స్‌లో శిక్షణ తీసుకున్నారు. ‘భారతీయుడు’ (1996) సినిమాకి సీక్వెల్‌గా ‘భారతీయుడు 2’ (తమిళంలో ‘ఇండియన్ 2) రూపొందుతోంది. ఈ చిత్రంలో కమల్‌కు జోడీగా కాజల్ నటిస్తున్నారు. ఈ చిత్రంలో పవర్ఫుల్ ఫైట్స్ చేయడం కోసం అతిపురాతనమైన యుద్ధ క్రీడ కలరి పయట్టు నేర్చుకున్నారు కాజల్. కలరి సాధన చేస్తున్న ఓ వీడియోను ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేసి, ‘షావోలిన్, కుంగ్ ఫూ, కరాటే, తైక్వాండో.. వంటి క్రీడలు కలరి నుంచి పుట్టుకొచ్చినవే’ అని పేర్కొన్నారామె. ఈ మూవీ కోసం గుర్రపు స్వారీ కూడా నేర్చుకున్నారు కాజల్ అగర్వాల్. -
వైట్ శారీలో దీపికా పదుకోన్.. రెడ్ శారీలో దిశా పటాని హాట్ ఫోజులు
► వైట్ శారీలో ఎప్పుడూ విజయం మనదే అంటున్న దీపికా పదుకోన్ ► నడము అందాల్ని చూపుతూ రెచ్చగొడుతున్న భూమిక చావ్లా ► బ్లాక్ డ్రెస్‌లో కిర్రాక్ ఫోజులతో నభా నటేష్ ► హాట్ లుక్‌లో కుర్రాళ్ల మతిపోగొడుతున్న మృణాల్ ఠాకూర్ ► తన కుమారుడు నిల్తో కాజల్ అగర్వాల్ ►ఇదో అద్భుతమైన సంవత్సరం అంటూ ట్రెండీ డ్రెస్‌లో శ్రియా శరణ్ View this post on Instagram A post shared by दीपिका पादुकोण (@deepikapadukone) View this post on Instagram A post shared by Mrunal Thakur (@mrunalthakur) View this post on Instagram A post shared by Bhumika Chawla (@bhumika_chawla_t) View this post on Instagram A post shared by Anupama Parameswaran (@anupamaparameswaran96) View this post on Instagram A post shared by disha patani (paatni) 🦋 (@dishapatani) View this post on Instagram A post shared by Pragya Jaiswal (@jaiswalpragya) View this post on Instagram A post shared by Aditi Shankar (@aditishankarofficial) View this post on Instagram A post shared by Shriya Saran (@shriya_saran1109) View this post on Instagram A post shared by Rakul Singh (@rakulpreet) View this post on Instagram A post shared by Aishwarya Rajesh (@aishwaryarajessh) View this post on Instagram A post shared by Kajal A Kitchlu (@kajalaggarwalofficial) View this post on Instagram A post shared by Faria Abdullah (@fariaabdullah) View this post on Instagram A post shared by Nabha Natesh (@nabhanatesh) View this post on Instagram A post shared by Hebah P (@ihebahp) -
ఆయనంటే భక్తి.. అందుకే మా అబ్బాయికి ఈ పేరు పెట్టాం: కాజల్
హీరోయిన్గా రానిస్తున్న సమయంలోనే ఆమె గౌతమ్ కిచ్లు అనే వ్యక్తిని 2020లో పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. వీరికి నీల్ అనే కొడుకు కూడా ఉన్నాడు. అయితే బిడ్డకు జన్మనిచ్చిన రెండు నెలలకే కాజల్ అగర్వాల్ నటించడానికి సిద్ధమయ్యారు. ప్రస్తుతం ఈమె ఇండియన్–2 చిత్రంలో కమలహాసన్ సరసన నటిస్తున్నారు. శంకర్ దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్ర షూటింగ్ చివరి దశకు చేరుకుంది. అదే విధంగా తెలుగులో బాలకృష్ణకు జంటగా భగవంత్ కేసరి చిత్రంలో నటిస్తున్నారు. (ఇదీ చదవండి: Niharika-Chaitanya Divorce: నిహారిక కోసం పిటిషన్ వేసిన అడ్వకేట్ ఎవరంటూ..) కాగా ఇటీవల ఓ భేటీలో పేర్కొంటూ తనకు శివభక్తి అధికమని చెప్పారు. ఎక్కువగా శివుడినే కొలుస్తానన్నారు. అందుకే తన బిడ్డకు శివుని పేరు పెట్టాలని ముందుగానే నిర్ణయించుకున్నానన్నారు. బిడ్డ పుట్టిన తరువాత తన భర్త పిలవడానికి అనువుగా, రాయడానికి సులభంగా ఉండేలా పేరు పెడుతామని చెప్పారన్నారు. దీంతో నీలకంఠుడైన శివుని పేరు లోని రెండు అక్షరాలను తీసుకుని నీల్ అనే పేరును తమ బిడ్డకు నామకరణం చేసినట్లు చెప్పారు. (ఇదీ చదవండి: మెగా ఫ్యామిలీకి దూరంగా అన్నా లెజినోవా?) ఇంతకుముందు చంటి పిల్లల తల్లులను చూసినప్పుడల్లా అద్భుతమైన అనుభూతి కలిగేదన్నారు. తాను తల్లినైనా తరువాత నీల్‌ను పెంచుతున్నప్పుడు అలాంటి అనుభూతినే అనుభవిస్తున్నట్లు పేర్కొన్నారు. కొంచెం సమయం తన బిడ్డను వదిలి షూటింగ్‌లకు, జిమ్‌లకు వెళ్లటం చాలా కష్టంగా ఉందన్నారు. అయితే తిరిగి రాగానే బిడ్డ చిరునవ్వులు చూస్తే అంతా పోతుందని కాజల్ అగర్వాల్ పేర్కొన్నారు. -
కాజల్ మాకు ఆ అదృష్టం ఉందా?.. నెటిజన్ ప్రశ్నకు అదిరిపోయే రిప్లై
సినిమాలకు గుడ్ బై చెబుతుందంటూ టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్‌పై భారీగానే పుకార్లు వచ్చాయి. వాటంన్నిటినీ పక్కకు నెట్టేసి ఇండియన్2, భగవంత్ కేసరి, సత్యభామ వంటి భారీ చిత్రాలతో తను బిజీగా ఉంది. ఈ క్రమంలోనే కాజల్ అగర్వాల్ సోషల్ మీడియా వేదికగా అభిమానులు అడుగుతున్నటువంటి పలు ప్రశ్నలకు సమాధానాలు చెప్పింది. చాలా రోజుల తర్వాత తన అభిమానులతో సరదాగా తన ఇన్స్టాగ్రామ్ ద్వారా ఆమె ముచ్చటించింది. తన పర్సనల్ లైఫ్, కెరీర్‌కు సంబంధించిన పలు విషయాలను వారితో ఆమె పంచుకుంది. (ఇదీ చదవండి: ఈ కారణంతో కీర్తి, కృతి షాకింగ్ డెషిషన్ తీసుకోనున్నారా?) అయితే నేటిజన్స్ అడిగిన ప్రశ్నలన్నింటికీ కాజల్ ఎంతో ఓపికగా సమాధానం చెప్పింది. ఈ క్రమంలోనే ఒక నెటిజన్ ఇలా ప్రశ్నించాడు 'మీరంటే నాకెంతో ఇష్టం.. మీరు నన్ను పెళ్లి చేసుకుంటారా?' అని అడిగేశాడు కాజల్ అగర్వాల్ అతని ప్రశ్నకు సమాధానం చెబుతూ సారీ.. ఇప్పుడా అదృష్టం మీకు లేదు.. రెండున్నరేళ్ల క్రితమే ఆ అవకాశం మరొకరిని వరించింది. అంటూ సమాధానం చెప్పుకొచ్చింది. ఇంకేముంది ఇప్పుడిదే సోషల్ మీడియాలో ట్రెండ్ అయింది. తన స్నేహితుడు అయిన గౌతమ్ కిచ్లును ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఈ దంపతులకు నీల్ కిచ్లు అనే కుమారుడు కూడా ఉన్నాడు. (ఇదీ చదవండి: Lust stories 2: తమన్నాకు ఊహించనంత రెమ్యునరేషన్?) -
డిప్రెషన్ బారిన పడ్డా.. ఆ విషయం బయటపెట్టిన కాజల్!
సాధారణంగా సినిమా నటీనటులని చూడగానే, వాళ్లకేంటి సంతోషంగా ఉన్నారని అనుకుంటాం. కానీ అది అన్నిసార్లు నిజం కావాలని రూలేం లేదు. పలువురు హీరోయిన్లు.. బయటకు బాగానే కనిపిస్తున్నప్పటికీ.. లోలోపల పలు సమస్యలతో బాధపడుతుంటారు. సందర్భం వచ్చినప్పుడే వాటిని చెబుతుంటారు. అలా హీరోయిన్ కాజల్ అగర్వాల్, తనకు ఎదుర్కొన్న డిప్రెషన్ గురించి ఇప్పుడు బయటపెట్టింది. కాజల్ కెరీర్ 'లక్ష్మీ కల్యాణం' సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన కాజల్.. కెరీర్ ప్రారంభంలో పలు చిన్న సినిమాల్లో నటించింది. ఎప్పుడైతే 'మగధీర' చేసిందో ఆమె దశ తిరిగిపోయింది. స్టార్ హీరోయిన్ అయిపోయింది. అప్పటి నుంచి లాక్డౌన్ ముందు వరకు దక్షిణాదిలో స్టార్ హీరోలతో కలిసి చాలా సినిమాలు చేసింది. 2020లో బిజనెస్మ్యాన్ గౌతమ్ కిచ్లూని పెళ్లి చేసుకుంది. గతేడాది ఓ బాబుకు జన్మనిచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలు చేస్తూ బిజీ అయిపోయింది. తాజాగా సోషల్ మీడియాలో నెటిజన్స్‌తో చాట్ చేస్తూ తన డిప్రెషన్ గురించి బయటపెట్టింది. (ఇదీ చదవండి: తెలుగు యువ నటుడు మృతి.. విడుదలకి ముందే విషాదం) ఫ్యామిలీ అండతో 'ప్రసవం తర్వాత నేను కూడా డిప్రెషన్‌ని ఎదుర్కొన్నాను. అది సర్వసాధారణమైన విషయం. మహిళలు ఎవరైనా సరే పోస్ట్ పార్టమ్ డిప్రెషన్‌తో ఇబ్బందిపడితే ఫ్యామిలీ వాళ్లకు అండగా నిలబడాలి. అలానే ఆడవాళ్లు.. పిల్లలు పుట్టిన తర్వాత తమకంటా కొంత టైమ్‌ని కేటాయించుకోవాలి. ట్రైనర్ ఆధ్వర్యంలో వర్కౌట్స్ చేయడం, ఇష్టమైన వ్యక్తులతో సమయాన్ని ఆస్వాదించడం, ఇలా కొన్ని పనులు చేసి డిప్రెషన్ దశని దాటొచ్చు. నన్ను ఎంతగానే అర్ధం చేసుకునే కుటుంబం ఉండటంతో దాన్ని దాటి త్వరగా బయటకొచ్చేశాను. పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ టైంలో నా వల్ల భర్త గౌతమ్ కిచ్లూ చాలా క్లిష్టమైన పరిస్థితులు చూశారు' అని కాజల్ అగర్వాల్ చెప్పుకొచ్చింది. ఆ సినిమాలతో బిజీ ప్రస్తుతం కమల్‌హాసన్ 'ఇండియన్ 2'లో హీరోయిన్గా చేస్తున్న కాజల్.. బాలకృష్ణ 'భగవంత్ కేసరి'లోనూ నటిస్తోంది. మరోవైపు 'సత్యభామ', 'ఉమ' అనే లేడీ ఓరియెంటెడ్ మూవీస్‌తోనూ బిజీగా ఉంది. ఇవన్నీ రాబోయే కొన్ని నెలల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. వీటిలో కొన్ని హిట్ అయినాసరే కాజల్.. మళ్లీ పుంజుకోవడం గ్యారంటీ. (ఇదీ చదవండి: 'సామజవరగమన' బ్యూటీ ఆ తెలుగు హీరోయిన్‌కి అక్క?) -
పాత్రలే దెయ్యాలైతే..!
కాజల్, రెజీనా, జననీ అయ్యర్ ముఖ్య తారలుగా నటించిన తమిళ చిత్రం ‘కరుంగాప్పియం’. డి. కార్తికేయన్ (డీకే) దర్శకత్వం వహించారు. వెంకట సాయి ఫిల్మ్స్ పతాకంపై ముత్యాల రామదాసు సమర్పణలో టి. జనార్ధన్ ‘కార్తీక’ పేరుతో ఈ చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేయనున్నారు. ఈ సందర్భంగా ముత్యాల రాందాస్, టి. జనార్ధన్ మాట్లాడుతూ– ‘‘జూలై 7న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నాం. ఇందులో ఐదుగురు వ్యక్తుల జీవితాలను చూపించే క్రమంలో రెజీనా లైబ్రరీలో వందేళ్ల క్రితం నాటి కాటుక బొట్టు అనే బుక్ చదువుతుంది. భవిష్యత్‌లో ఏం జరుగుతుందో చెప్పే బుక్ అది. అయితే అందులోని పాత్రల గురించి చదువుతున్నప్పుడు అవి దెయ్యాలుగా మారి ఆమె ముందుకు వస్తాయి. ఇక తనకు హాని కలిగించిన వ్యక్తులపై దెయ్యంగా మారి పగ తీర్చుకునే పాత్రను కాజల్ చేశారు. జనని పాత్ర కూడా అలరించే విధంగా ఉంటుంది. హారర్ సస్పెన్స్ థ్రిల్లర్ కథాంశంతో ఈ చిత్రాన్ని డీకే అద్భుతంగా తెరకెక్కించారు’’ అన్నారు. -
చీరలో చందమామలా మెరిసిపోతున్న కాజల్ (ఫొటోలు)
-
కాజల్‌ను ఇండియన్–2 సినిమానే కాపాడింది
సౌత్ ఇండస్ట్రీలో ఎప్పుడూ ఏదోవిధంగా వార్తల్లో ఉండడానికి ప్రయత్నించే నటీమణుల్లో కాజల్ అగర్వాల్ ఒకరు. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో కథానాయకిగా నటిస్తూ ఇండియన్ నటిగా గుర్తింపు పొందిన నటి ఈమె. తెలుగు చిత్రం మగధీరతో కాజల్ అగర్వాల్ లక్ మొదలైందనే చెప్పాలి. అంతకుముందు కొన్ని చిత్రాల్లో నటించినా సరైన బ్రేక్ రాలేదు. అలాంటిది మగధీర చిత్రం తరువాత స్టార్ హీరోయిన్ల లిస్టులో చేరిపోయింది. అంతేకాకుండా వరుసగా ప్రముఖ నటుల సరసన నటించే అవకాశాలను సంపాదించుకుంది. (ఇదీ చదవండి: టాప్ లేకుండా వెళ్తేనే నిర్మాతలకు నచ్చుతారు: అర్చన) అలా అగ్రకథానాయకిగా నటిస్తుండగానే గౌతమ్ కిచ్లుతో ప్రేమలో పడి 2020లో సైలెంట్‌గా పెళ్లి కూడా చేసుకున్నారు. పెళ్లి అయిపోవడంతో కాజల్ అగర్వాల్ సినీ కెరియర్‌కు ఫుల్స్టాప్ పడినట్టే అనే ప్రచారం జరిగింది. అలాంటిది ఈమెను ఇండియన్–2 చిత్రం కాపాడిందని చెప్పాలి. ఈ చిత్రంలో నటిస్తుండగానే కాజల్ అగర్వాల్ పెళ్లి చేసుకుని ఒక బిడ్డకు తల్లి కూడా అయ్యింది. ఇదంతా జరగడానికి రెండేళ్లు పట్టింది. అయితే అలాంటి పరిస్థితుల్లో ఇండియన్–2 చిత్రం పలు కారణాల వల్ల షూటింగ్ ఆగిపోయింది. (ఇదీ చదవండి: Spy Trailer:యాక్షన్ సీన్లతో నిఖిల్ దుమ్ములేపాడు) మళ్లీ షూటింగ్ ప్రారంభమయ్యే సమయానికి కాజల్ అగర్వాల్ మళ్లీ నటించడానికి సిద్ధమైంది. అందుకు చాలా కసరత్తులే చేసింది. కాగా ఇండియన్–2 చిత్రం ఇంకా పూర్తి కాలేదు. అంతలోనే కాజల్ అగర్వాల్ తెలుగులో మరో రెండు చిత్రాలలో నటించే అవకాశాలు వరించాయి. దీంతో కాజల్ గ్రాఫ్ మళ్లీ పెరగడం ఖాయమనే వార్తలు వెలువడుతున్నాయి. -
కాఫీ కప్పులోకి దూకేసిన కాజల్.. స్విమ్మింగ్ ఫూల్ అనుకుందేమో!
కాజల్ అగర్వాల్ తెలుగువారికి పరిచయం అక్కర్లేని పేరు. స్టార్ హీరోలందరితో నటించింది ముద్దుగుమ్మ. ప్రస్తుతం బాలకృష్ణ సరసన భగవంత్ కేసరి చిత్రంలో కనిపించనుంది. ఇటీవల సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటోన్న భామ ఎప్పటికప్పుడు అభిమానులతో టచ్‌లో ఉంటోంది. తాజాగా ఈ భామ చేసిన ఓ వీడియో తెగ నవ్వులు తెప్పిస్తోంది. కాజల్ మ్యాజిక్ ఎప్పుడు నేర్చుకుంది? అంటూ ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారు. ఇంతకీ ఆ వీడియో ఏముందో తెలుసుకుందాం. (ఇది చదవండి: సల్మాన్ కోసం వెళ్తే.. కుక్కలా తరిమేశారు: 'దబంగ్' నటి) కాజల్ అగర్వాల్ ట్వీట్ చేసిన వీడియో చూస్తే మీరు తప్పకుండా షాకవ్వాల్సిందే. ఓ కాఫీ కప్పు ముందు పెట్టి ఒక్కసారిగా అందులోకి దూకేసింది. ఇంకేముంది ఎంచక్కా స్విమ్మింగ్ ఫూల్లోగా మళ్లీ బయటకు కనిపించింది. ఇదేంటీ కాఫీ కప్పులో మనిషి దూకడమేంటీ? మళ్లీ బయటికి రావడమేంటీ అనుకుంటున్నారా? అయితే మీరు కూడా ఈ వీడియో చూసేయండి. మొదటి నేను కూడా నమ్మలేదు. కానీ వీడియో చూస్తే మాత్రం ఎవరైనా నమ్మకుండా ఉండలేరు. అలా ఉంది మరీ కాజల్ అగర్వాల్ క్రియేటీవిటీ. మరీ ఈ వీడియో ఎలా చేసిందో తెలియదు కానీ.. ఇది చూసిన నెటిజన్స్ మాత్రం ఇదేలా సాధ్యమంటూ కామెంట్స్ పెడుతున్నారు. కాజల్ తన ట్వీట్లో రాస్తూ.. 'దృఢ నిశ్చయం, ప్రేమతో కాఫీ కప్పులోకి ఈ రోజు దూకేస్తున్నా. ఎక్కువ కాఫీ, కాదు.. ఎక్కువ ప్రేమ.' అంటూ పోస్ట్ చేసింది. (ఇది చదవండి: 'సైతాన్' దర్శకుడి వెంటపడుతున్న ఓటీటీలు!) Diving into this day with Conviction, Love and coffee...... loads of coffee , no, loads of love 🫶🏻😋☕ pic.twitter.com/xUCVc2wRvO — Kajal Aggarwal (@MsKajalAggarwal) June 19, 2023 -
స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ బర్త్ డే.. ఫోటోలు
-
సత్యబామా
-
ఏజెంట్ టీనాని గుర్తుచేసిన కాజల్.. కొత్త సినిమాలో అలా!
హీరోయిన్ కాజల్ అగర్వాల్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్. పెళ్లి తర్వాత ఆమె నటిస్తుందా లేదా అనే రూమర్స్ కి చెక్ పెడుతూ కొత్త సినిమాల్లో వరసగా నటిస్తూ వెళ్తోంది. ఆమె పుట్టినరోజు సందర్భంగా చిత్రబృందాలు.. పోస్టర్, టీజర్ వీడియోలు రిలీజ్ చేస్తున్నారు. ఓ సినిమా టైటిల్ గ్లింప్స్ లో అయితే కాజల్ ని వేరే లెవల్ లో చూపించారు. చెప్పాలంటే విక్రమ్ మూవీలోని టీనా పాత్రధారి గుర్తొచ్చింది. ఇంతకీ ఏంటా సినిమా? (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీలోకి 22 సినిమాలు.. ఆ ఒక్కటి మాత్రం!) తెలుగు హీరోయిన్లలో విజయవంతమైన వాళ్ల లిస్ట్ తీస్తే.. అందులో కాజల్ అగర్వాల్ పేరు కచ్చితంగా ఉంటుంది. 'లక్ష్మీ కల్యాణం' సినిమాతో కెరీర్ మొదలుపెట్టిన ఈమె.. 'మగధీర'తో స్టార్ హీరోయిన్ అయిపోయింది. సౌత్ నార్త్ అనే తేడా లేకుండా 50కి పైగా సినిమాలు చేసింది. అయితే లాక్ డౌన్ లో ఆమె పెళ్లి చేసుకోవడం.. ఫ్యాన్స్ కి పెద్ద షాకిచ్చింది. ఆ తర్వాత కొన్నాళ్లకు బిడ్డకు జన్మనిచ్చింది. ఇలా వరసగా షాకుల మీద షాకుల తగిలేసరికి కాజల్ ఇక నటించదేమోనని అభిమానులు భావించారు. కానీ కాజల్ మాత్రం బాలకృష్ణతో 'భగవంత్ కేసరి'లో నటిస్తోంది. ఈమె లీడ్ రోల్ చేస్తున్న మరో కొత్త చిత్రానికి 'సత్యభామ' టైటిల్ ఖరారు చేసి, గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఇందులో ఈమె పవర్ ఫుల్ పోలీస్ గా కనిపించింది. టీజర్ లోని ఓ సీన్ లో జుత్తు ముడి వేసుకుంటుంటే.. 'విక్రమ్'లోని ఏజెంట్ టీనా రోల్ గుర్తొచ్చింది. మరి మీలో కూడా ఎవరికైనా అలా అనిపించిందా? (ఇదీ చదవండి: రాకేశ్ మాస్టర్ కుటుంబం గొప్ప నిర్ణయం!) -
Kajal Aggarwal: చందమామ గురించి ఈ విషయాలు తెలుసా?
సాక్షి, వెబ్‌డెస్క్ : లక్ష్మీ కల్యాణం మూవీతో టాలీవుడ్ తెరపై మెరిసింది కలువ కళ్ల సుందరి కాజల్ అగర్వాల్. తన రెండవ చిత్రం చందమామ మూవీతో తొలి సెక్సెస్ అందుకుంది ఈ భామ. ఆ తర్వాత హిస్టారికల్ మూవీ మగధీరతో బ్లాక్‌బస్టర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకుంది. దీంతో సౌత్ సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకుంది. ఆమె కుటుంబ నేపథ్యం పంజాబీ, నేటితో 38వ వసంతంలోకి అడుగు పెట్టింది ఈ బ్యూటీ. కాజల్ కెరీర్ మలుపు తిప్పిన సినిమా 2007లో కృష్ణవంశీ దర్శకత్వంలో విడుదలైన 'చందమామ' సినిమాతో క్రేజీ హీరోయిన్గా మారిన కాజల్ వరుసగా తెలుగు, తమిళ చిత్రాలలో హీరోయిన్గా అవకాశాలు అందుకుంది. కానీ 2009లో ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన మగధీర సినిమా ఆమెకు ఒక స్టార్ ఇమేజ్‌ని ఇచ్చింది. రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా భారీ విజయం సొంతం చేసుకుంది. ఈ సినిమాతో కాజల్‌కు సౌత్‌లో విపరీతమైన పాపులారిటీ సంపాదించుకుంది. అక్కడి నుంచి ఆమె సినీ కెరీర్ ఊహించని విధంగా మారిపోయింది. రామ్ చరణ్, ప్రభాస్, ఎన్టీఆర్, బన్నీ, రామ్ పోతినేని లాంటి యంగ్ హీరోల సరసన మాత్రమే కాకుండా పవన్ కళ్యాణ్, మెగాస్టార్ చిరంజీవి, బాలయ్య లాంటీ సీనియర్ స్టార్ హీరోల సరసన నటించే అవకాశాలను అందుకుంది. వారితో నటించిన చాలా వరకు సినిమాలు బ్లాక్ బస్టర్స్ అయిన విషయం తెలిసిందే. కాజల్ కాంట్రవర్సీ టాలీవుడ్లో సుమారు 16 ఏళ్లుగా తను హీరోయిన్గా కొనసాగుతుంది. కానీ కాజల్ సినీ కెరీర్లో ఎలాంటి కాంట్రవర్సీలు కూడా లేవని చెప్పవచ్చు. అంతేకాకుండా తను కూడా ఎవరిపై ఎలాంటి ఆరోపణలకు కూడా చేసిన దాఖలాలు లేవని చెప్పవచ్చు. తనకు అందరితోనూ కలిసిపోయే మనస్తత్వం ఉందని ఇండస్ట్రీలోని కొందరు చెబుతుంటారు కూడా.. అందుకే అందరూ ఆమెను సొంత వ్యక్తిగానే చూస్తారని టాక్. కాజల్ ఒకే హీరోతో రెండుకు పైగానే చిత్రాలు చేసి కూడా సూపర్ హిట్స్ అందుకున్నవి చాలానే ఉన్నాయి. మెగాస్టార్ చిరంజీవి సరసన ఆయన రీ ఎంట్రీ మూవీ 'ఖైదీ 150'లో హీరోయిన్గా నటించడంతో ఆమె ఇమేజ్ మరింత పెరిగిపోయింది. వివాహబంధానికి ప్రాముఖ్యత తన ప్రియసఖుడు గౌతమ్ కిచ్లుతో ఏడడుగులు వేసి శ్రీమతిగా మారారు కాజల్ అగర్వాల్. 2020 అక్టోబర్ 30న వీరి వివాహం అతి తక్కువమంది బంధువుల సమక్షంలో ముంబయిలోని ఓ హోటల్లో జరిగింది. ఆమె సినీ కెరీర్ మంచి ఊపులో ఉండగానే వ్యాపార వేత్త అయిన గౌతమ్ కిచ్లూను ప్రేమించి పెళ్లి చేసుకోవడంతో ఫ్యాన్స్ కూడా షాక్ అయ్యారు. వారి వివాహబంధానికి గుర్తుగా 2022 ఏప్రిల్ 19న నీల్ కిచ్లూ పుట్టాడు. ప్రస్తుతం తల్లిగా ఆనందకరమైన సమయాన్ని గడుపుతున్న ఆమె మళ్ళీ సినిమాలలోకి రీ ఎంట్రీ ఇచ్చారు. కాజల్‌కు తగ్గని అవకాశాలు బాలయ్యతో భగవంత్ కేసరిలో ఎంట్రీ ఇచ్చింది. తాజాగా ఆమె ప్రధాన పాత్రలో నటించిన క్రైమ్ థ్రిల్లర్ 'సత్యభామ'లో ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా రానుంది. తన కెరీర్లో ఇది 60వ చిత్రం కావటం విశేషం. అఖిల్ డేగల దర్శకుడు. కాజల్ పుట్టినరోజును సందర్భంగా టైటిల్‌తో పాటు సినిమా గ్లింప్స్‌ను కూడా విడుదల చేశారు. అందులో కాజల్ లుక్ అదిరిపోయేలా ఉంది. మరోవైపు శంకర్ దర్శకత్వం వహిస్తున్న కమల్ హాసన్ 'ఇండియన్ 2'లో ప్రధానమైన రోల్లో తను కనిపించనుంది. తరగని అందం కాజల్ సొంతం. అందుకే, ఆమె మరికొన్నేళ్లపాటు ఇండస్ట్రీలో హీరోయిన్గా కొనసాగుతారని పలువురు సినీ తారలు అభిప్రాయపడుతున్నారు. అభిమానులు అదే కోరుకుంటున్నారు. నేడు(జూన్ 19) 'చందమామ' కాజల్ అగర్వాల్ పుట్టినరోజు సందర్భంగా ఆమెకు అభిమానులు, సినీ ప్రముఖులు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. (ఇదీ చదవండి: షూటింగ్‌కు ముందే హీరోతో లిప్‌లాక్ చేసిన హీరోయిన్) -
వారికి కాజల్ ఓ ఉదాహరణ
‘‘మగధీర’ సినిమాలో మిత్రవిందగా కాజల్ ఎలా ఉన్నారో ఇప్పుడూ అలానే ఉన్నారు. పెళ్లి చేసుకున్న తర్వాత కూడా హీరోయిన్స్ వారి కెరీర్‌ను కొనసాగించవచ్చనడానికి కాజల్ ఓ ఉదాహరణగా నిలుస్తున్నారు. ‘సత్యభామ’ సినిమా గ్లింప్స్ బాగుంది.. టీమ్‌కు ఆల్ ది బెస్ట్’’ అని దర్శకుడు శేఖర్ కమ్ముల అన్నారు. కాజల్ అగర్వాల్ టైటిల్ రోల్లో నటిస్తున్న చిత్రం ‘సత్యభామ’. అఖిల్ డేగల దర్శకత్వంలో అవురమ్ ఆర్ట్స్ పతాకంపై బాబీ తిక్క, శ్రీనివాసరావు తక్కలపెల్లి నిర్మిస్తున్నారు. నేడు (సోమవారం, జూన్ 19) కాజల్ బర్త్ డే. ఈ సందర్భంగా ఆదివారం ‘సత్యభామ’ సినిమా గ్లింప్స్‌ని శేఖర్ కమ్ముల విడుదల చేశారు. కాజల్ అగర్వాల్ మాట్లాడుతూ– ‘‘తెలుగుచిత్ర పరిశ్రమ నాకు ఇల్లులాంటింది. తెలుగు ఆడియన్స్ బెస్ట్. వారి ప్రేమ, ప్రోత్సాహం వల్లే నేను ఈ స్థాయిలో ఉన్నా’’ అన్నారు. ‘‘నా తొలి సినిమాకు హీరోగా నిలిచిన కాజల్గారికి ధన్యవాదాలు’’ అన్నారు అఖిల్ డేగల. ‘‘మంచి చిత్రాలను ప్రేక్షకులకు అందిస్తాం’’ అన్నారు శ్రీనివాస్, బాబీ. ఈ కార్యక్రమంలో స్క్రీన్‌ప్లే, చిత్ర సమర్పకుడు శశికిరణ్ తిక్క, కథారచయితలు రమేష్, ప్రశాంత్, కెమెరామేన్ మోహిత్ కృష్ణ, క్రియేటివ్ ప్రొడ్యూసర్ రాజీవ్ భరద్వాజ్ తదితరులు పాల్గొన్నారు. -
#Kajal60 : కాజల్ అగర్వాల్ ‘సత్యభామ’టీజర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)
-
సినిమాలకు గుడ్‌బై అంటూ రూమర్స్, కొత్త సినిమా ప్రకటించిన కాజల్
స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ సినిమాలకు గుడ్‌బై చెప్పనుందంటూ ప్రచారం ఊపందుకున్న సంగతి తెలిసిందే! ఈ క్రమంలో ఫ్యాన్స్‌ను సర్ప్రైజ్ చేస్తూ కొత్త సినిమాను ప్రకటించింది చందమామ. మరో కొత్త సినిమాతో తిరిగి ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. తన నెక్స్ట్ చిత్రం #కాజల్ 60లో ఆమె ఒక పవర్ ఫుల్ పాత్రలో వెండి తెరపై కనిపించడానికి సిద్ధంగా ఉంది. జూన్ 19న ఆమె పుట్టినరోజు సందర్భంగా చిత్ర నిర్మాతలు రేపు ఒక గ్లింప్స్ వీడియోను విడుదల చేయనున్నారు. అఖిల్ డేగల ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఇందులో కాజల్ మునుపెన్నడూ కనిపించని విధంగా ప్రేక్షకులు ఇష్టపడే పాత్రలో కనిపించనుంది. ఇప్పటి వరకూ కనిపించిన పోలీస్ పాత్రల కంటే భిన్నంగా కాజల్ పాత్రను డిజైన్ చేశారు. తాజాగా రిలీజ్ చేసిన ప్రీ లుక్‌లో పోలీస్ వాహనంలో నుంచి గాజులు పెట్టుకున్న చేయి కనిపిస్తోంది. ఈ లుక్ అందరినీ ఆకట్టుకుంటోంది. అవురమ్ ఆర్ట్స్ పతాకంపై బాబీ తిక్క ఈ చిత్రాన్ని తమ ప్రొడక్షన్ లో మొదటి సినిమాగా నిర్మిస్తున్నారు. సినిమా సమర్పకుడు శశి కిరణ్ తిక్క ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే కూడా అందించారు. శ్రీ చరణ్ పాకాల ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. #Kajal60 Title and glimpse tomorrow ❤️🔥 Can't wait to show this to you all 💫@AurumArtsOffl pic.twitter.com/fG1pZN5Yhs — Kajal Aggarwal (@MsKajalAggarwal) June 17, 2023 చదవండి: నాపై విషప్రయోగం.. 8 నెలలపాటు కషాయంలో కలుపుతూ: జేడీ చక్రవర్తి -
భగవంత్ కేసరి తరువాత కాజల్ రిటైర్
-
స్టార్ హీరోయిన్‌కు మరోసారి ప్రెగ్నెన్సీ.. నటి కీలక నిర్ణయం!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో కాజల్ అగర్వాల్ ఒకరు. అయితే ఉత్తరాదిలో కంటే దక్షిణాదిలోనే స్టార్దా వెలుగొందుతున్నారు. ఇక తమిళంలో 2008లో పళని చిత్రంతో ఎంట్రీ ఇచ్చారు. ఆ చిత్రం తరువాత విజయ్, అజిత్, కార్తీ అంటూ స్టార్ హీరోలతో జతకట్టి అగ్రకథానాయకి వరుసలో చేరారు. అదేవిధంగా తెలుగులోనూ స్టార్ హీరోయిన్గా రాణిస్తున్న సమయంలోనే గౌతమ్ కిచ్లూ అనే వ్యక్తిని పేమించి 2020లో పెళ్లి చేసుకున్నారు. దీంతో కాజల్ అగర్వాల్ నటనకు గుడ్‌బై చెప్పినట్లే అనే ప్రచారం జరిగింది. (ఇది చదవండి: స్టార్ హీరో మనవరాలు డేటింగ్.. సోషల్ మీడియాలో వీడియో వైరల్!) కాగా.. 2021లో ఈమె పండంటి బిడ్డకు జన్మనిచ్చారు. అలాంటిది తల్లి అయిన రెండు మూడు నెలల్లోనే మళ్లీ నటించడానికి సిద్ధమయ్యారు. అంతకుముందే అంగీకరించిన ఇండియన్- 2 చిత్రంలో కమలహాసన్‌కు జంటగా నటించడం మొదలెట్టడంతో ఆ చిత్ర షూటింగ్ సమయంలోనే వర్కౌట్స్ చేసి మరింత నాజూగ్గా తయారయ్యారు. దీంతో కాజల్ సెకెండ్ ఇన్నింగ్ మొదలైంది. ప్రస్తుతం కమలహాసన్ సరసన నటిస్తున్న ఇండియన్ 2 చిత్రం షూటింగ్ చివరి దశకు చేరుకుంది. కాగా తెలుగులో బాలకృష్ణకు జంటగా భగవంత్ కేసరి చిత్రంలో నటిస్తున్నారు. తాజాగా ఈ బ్యూటీ గురించి మరో షాకింగ్ ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. కాజల్ అగర్వాల్ నటనకు స్వస్తి చెప్పబోతున్నారన్నదే ఆ ప్రచారం. కాజల్ రెండోసారి గర్భందాల్చారని.. దీంతో నటనకు గుడ్‌బై చెప్పబోతున్నారని వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఇందులో నిజం ఎంత అనేది తెలియాల్సి ఉంది. కారణం కాజల్ ఇటీవల తన అందమైన ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో విడుదల చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు. కొత్త అవకాశాల కోసం అనే మరో కోణం కూడా అందులో దాగి ఉందని వేరే చెప్పాల్సిన అవసరం లేదు. (ఇది చదవండి: ఆ క్షణాలు అద్భుతం.. ఉపాసన ట్వీట్ వైరల్!) ఇలాంటి సమయంలో నటనకు స్వస్తి చెప్పడం నమ్మశక్యం కాని ప్రచారం అనే భావించాలి. అయితే తన బిడ్డ సంరక్షణ కోసం కొంత కాలం నటనకు దూరంగా ఉండాలని ఆమె భావించవచ్చుననే అభిప్రాయం ఒక వర్గం నుంచి వ్యక్తం అవుతోంది. అయితే కాజల్ అగర్వాల్ మాత్రం ఇంకా నోరు మెదపడం లేదు. మరి ఇలాంటి ప్రచారంపై కాజల్ ఏమంటారో చూడాలి. View this post on Instagram A post shared by Kajal A Kitchlu (@kajalaggarwalofficial) -
సినిమాలకు గుడ్‌బై చెప్పనున్న కాజల్.. కారణం ఇదేనా?
టాలీవుడ్ చందమామ కాజల్ ఎప్పుడూ సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటుంది. తన స్నేహితుడు, ప్రియుడు గౌతమ్ కిచ్లును వివాహమాడి.. ఆ తర్వాత ఓ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఒక యంగ్ మదర్‌గా తను ఆస్వాదిస్తుంది. తన బిడ్డపై శ్రద్ధ చూపడంలో ఎక్కడా రాజీపడకుండా.. ఎంతో జాగ్రత్తగా చూసుకుంటూనే గతంలో తను ఒప్పుకున్న సినిమాలు చేస్తూ వస్తుంది. (ఇదీ చదవండి: నాడు అర్జున్ రెడ్డి, నేడు యానిమల్.. ఇదీ మామూలు అరాచకం కాదు) తాజాగా కాజల్ సినిమాలకు గుడ్ బై చెప్పనుందని ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అందుకు ప్రధాన కారణం తన బాబు (నీల్) అని తెలుస్తోంది. సినిమాల్లో ఉంటే నిత్యం బాబుకు దూరంగా ఉండాల్సి వస్తుంది. బాబు ఎదుగుతున్న వేళ.. తల్లి ప్రేమను అందించాలని, అది తన బాధ్యతని కాజల్ తెలుపుతుందట. తన భర్త కిచ్లూ కూడా ఇదే చెబుతున్నారట. ఈ విషయంపై త్వరలో అఫిషయల్‌గా కాజల్ ప్రకటించనున్నట్లు వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి. ఇండస్ట్రీలో కూడా ఇదే టాక్ వినిపిస్తుంది. కానీ నిజం తెలియాలంటే కాజల్ క్లారిటీ ఇచ్చే వరకు ఆగాల్సిందే. ప్రస్తుతం కమల్ హాసన్ 'భారతీయుడు-2' , బాలకృష్ణ 'భగవంత్ కేసరి' సినిమాలలో నటిస్తుంది. ఇదే నిజం అయితే..! కాజల్ బ్యూటీకి చివరి సినిమా బాలయ్యదే. (ఇదీ చదవండి: మొగలి రేకులు నటి లహరి సీమంతం.. సోషల్ మీడియాలో వైరల్!) -
దెయ్యాలు పగబడితే...
హీరోయిన్ రెజీనా ఓసారి లైబ్రరీకి వెళ్లారు. అక్కడ వందల ఏళ్ల క్రితం నాటి ‘కాటుక బొట్టు’ అనే బుక్ చదివారు. ఆ బుక్‌లోని పాత్రలు దెయ్యాలుగా మారి రెజీనా ముందుకు వచ్చాయట. ఆ తర్వాత ఏం జరిగింది? దెయ్యాలు ఎవరిపై, ఎందుకు పగబట్టాయి? అనేది తెలుసుకోవాలంటే ‘కార్తీక’ చిత్రం చూడాల్సిందే. కాజల్ అగర్వాల్, రెజీనా, జననీ అయ్యర్ ప్రధాన పాత్రల్లో, రైజా విల్సన్, నోయిరికా కీలక పాత్రల్లో నటించిన తమిళ చిత్రం ‘కరుంగాపియం’. ఈ మేలో తమిళంలో ఈ చిత్రం విడుదలైంది. ఈ సినిమా తెలుగులో ‘కార్తీక’ టైటిల్‌తో రిలీజ్ కానుంది. ముత్యాల రామదాసు సమర్పణలో టి. జనార్థన్ తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ‘‘తనకు హాని కలిగించిన వ్యక్తులపై దెయ్యంగా మారి పగ తీర్చుకునే పాత్రలో కాజల్ అగర్వాల్ కనిపిస్తారు. అనువాద కార్యక్రమాలు పూర్తయ్యాయి. త్వరలో రిలీజ్ డేట్ ప్రకటిస్తాం’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. -
'గిప్పడి సంది ఖేల్ అలగ్' .. ఎన్బీకే108 టైటిల్ ఇదే!
నందమూరి బాలకృష్ణ, కాజల్ జంటగా నటిస్తోన్న తాజా చిత్రం 'ఎన్బీకే108'. ఈ చిత్రానికి అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. పెళ్లిసందడి ఫేమ్ శ్రీలీల ఈ చిత్రంలో ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్‌ను రిలీజ్ చేశారు. ఈ విషయాన్ని డైరెక్టర్ అనిల్ రావిపూడి ట్వీట్ చేశారు. (ఇది చదవండి: క్రికెటర్‌ను పెళ్లి చేసుకుంటున్నారా?.. ఓపెన్‌గానే చెప్పేసిన హీరోయిన్!) అనిల్ రావిపూడి ట్వీట్లో రాస్తూ.. ఇప్పటి సంది ఖేల్ అలగ్ అంటూ 'భగవంత్ కేసరి' అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఐ డోంట్ కేర్ అనే క్యాప్షన్ కూడా ఇచ్చారు. దీంతో బాలయ్య మాస్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేస్తూ టైటిల్‌ను రివీల్ చేశారు. కాగా.. ఈ చిత్రానికి ఎస్ఎస్ తమన్ సంగీతమందిస్తున్నారు. (ఇది చదవండి: రాజకీయాల్లోకి మరో స్టార్ హీరో.. టార్గెట్ అదే..) గిప్పడి సంది ఖేల్ అలగ్ 😎 Extremely proud to present our Hero, The one & only #NandamuriBalakrishna garu in & as #BhagavanthKesari 💥#NBKLikeNeverBefore ❤️🔥@MsKajalAggarwal @sreeleela14 @rampalarjun @MusicThaman @sahugarapati7 @harish_peddi @YoursSKrishna @Shine_Screens pic.twitter.com/bMXbhzDp6x — Anil Ravipudi (@AnilRavipudi) June 8, 2023 -
రానా తమ్ముడిని హీరోగా పెట్టి సినిమా తీయడానికి కారణం ఏంటిఅంటే..
-
రకుల్ కొంటె చూపులు.. ఊర్వశీ రౌతేలా ఫ్లవర్ డ్యాన్స్
థాయిలాండ్ లో వెకేషన్ ఎంజాయ్ చేస్తోందీ యాంకర్ శ్రీముఖి. మాయా బే బీచ్‌లో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది సంపూర్ణ వేసవి ఆనందం అంటే ఇదే అంటూ కుమారుడికి ఐస్‌క్రీమ్ తినిపిస్తున్న ఫోటోని షేర్ చేసింది కాజల్ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఫ్లవర్ డ్యాన్స్‌తో అదరగొట్టింది ఊర్వశీ రౌతేలా కొంటె చూపులతో కుర్రకారు మతులు పోగొడుతున్న రకుల్ ప్రీత్ సింగ్ View this post on Instagram A post shared by Sreemukhi (@sreemukhi) View this post on Instagram A post shared by Rakul Singh (@rakulpreet) View this post on Instagram A post shared by Kajal A Kitchlu (@kajalaggarwalofficial) View this post on Instagram A post shared by Shivathmika Rajashekar (@shivathmikar) View this post on Instagram A post shared by Urvashi Rautela (@urvashirautela) View this post on Instagram A post shared by Urvashi Rautela (@urvashirautela) View this post on Instagram A post shared by Mrunal Thakur (@mrunalthakur) View this post on Instagram A post shared by Malvika Sharma (@malvikasharmaofficial) View this post on Instagram A post shared by Parvati Nair (@paro_nair) View this post on Instagram A post shared by Sara Ali Khan (@saraalikhan95) -
ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు అలాంటి కామెంట్స్ చేశారు: కాజల్
ఇతర హీరోయిన్లకు నటి కాజల్ అగర్వాల్‌కు కాస్త వ్యత్యాసం ఉంది. నటనను విపరీతంగా ప్రేమించే నటి ఈ బ్యూటీ. బాలీవుడ్ నుంచి టాలీవుడ్‌కు ఆ తరువాత కోలీవుడ్‌కు పరిచయం అయిన కాజల్ ఈ మూడు భాషల్లోనూ నటిగా తనకంటూ ఓ స్థానాన్ని సంపాదించుకుంది. ముఖ్యంగా తెలుగు, తమిళం భాషల్లో స్టార్ హీరోలతో జత కట్టి స్టార్‌డమ్‌ను తెచ్చుకుంది. అయితే అగ్రనటిగా రాణిస్తున్న సమయంలోనే ఎలాంటి హంగామా లేకుండా తను ప్రేమించిన వ్యక్తి గౌతమ్ కిచ్లును పెళ్లి చేసుకుని ఒక బిడ్డకు తల్లి కూడా అయ్యింది. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో కమలహాసన్‌తో కలిసి ఇండియన్– 2 చిత్రంలో నటిస్తోంది. అదే విధంగా తెలుగులో బాలకృష్ణ సరసన నటించే అవకాశాన్ని దక్కించుకుంది. చదవండి: చిన్నచిన్నవాటికే బాధపడేదాన్ని, అనుభవం చాలా నేర్పింది ఇలాంటి పరిస్థితుల్లో తనపై వచ్చిన విమర్శలకు స్పందించిన కాజల్ అగర్వాల్ ఒక భేటీలో పేర్కొంటూ తాను కడుపుతో ఉన్నప్పుడు చాలా లావు అయ్యానంటూ కొందరు విమర్శించానని వాటిని తాను పట్టించుకోలేదని పేర్కొంది. అలాగే బిడ్డకు జన్మనిచ్చిన కొద్ది రోజులకే నటించడానికి సిద్ధం కావడంపై కూడా ఇష్టారాజ్యంగా మాట్లాడారని ఆవేదన వ్యక్తం చేసింది. తన కొడుకును ఉన్నతంగా తీర్చిదిద్ది గొప్ప తల్లిగా నిలిచి ఇలాంటి వారికి తగిన సమాధానం చెప్పాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. చదవండి: నేను కూడా యూత్ అనిపించింది: హీరో నాని -
పెళ్లయిన,బిడ్డకు తల్లైన తగ్గేదేలే...
-
ఛీ, ఇది ఒక అమ్మాయేనా? పంది, ఏనుగు అని తిట్టారు: విద్యుల్లేఖ
డిఫరెంట్ డైలాగ్ డెలివరీతో ఆకట్టుకునే లేడీ కమెడియన్ విద్యుల్లేఖ. వెండితెరపై నవ్వులు కురిపించిన ఆమె 2021లో ప్రియుడు, ఫిట్నెస్ నిపుణుడు సంజయ్‌ను పెళ్లాడింది. వివాహ అనంతరం వీరు హనీమూన్ కోసం మాల్దీవులు వెళ్లారు. ఆ సమయంలో బీచ్‌లో బికినీలో ప్రకృతిని ఎంజాయ్ చేస్తూ దిగిన ఫోటోలు షేర్ చేయడంతో తనపై చాలా ట్రోలింగ్ జరిగింది. ఒక నెటిజన్ అయితే ఏకంగా విడాకులు ఎప్పుడు తీసుకుంటున్నారని అడగడంతో ఆమె మనసు నొచ్చుకుంది. డ్రెస్సింగ్‌కు, విడాకులకు ఏమైనా సంబంధం ఉందా? అంటూ అతడిని ఏకిపారేసింది. తాజాగా బుల్లితెరపై ప్రసారమవుతున్న ఓ షోలో అడుగుపెట్టిన విద్యుల్లేఖ ఆనాటి పరిస్థితులను గుర్తు చేసుకుంటూ ఎమోషనలైంది. 'నేను లావుగా ఉన్నానని అందరూ నన్ను ట్రోల్ చేశారు. ఏనుగు, పంది.. ఇలా అన్ని జంతువులతో పోల్చారు. ఎంత లైట్ తీసుకున్నా ఏదో ఒక పాయింట్లో అది గుచ్చుకుంటుంది. నా హనీమూన్‌లో స్విమ్‌సూట్ వేసుకున్నానని.. ఛీ ఇది ఒక అమ్మాయేనా? అని తిట్టిపోశారు' అని పేర్కొంది నటి. అదే షోలో ఉన్న హీరోయిన్ కాజల్ సైతం స్పందిస్తూ.. నేను గర్భిణీగా ఉన్నప్పుడు కూడా లావెక్కానని ట్రోల్ చేశారని గుర్తు చేసింది. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. సీనియర్ నటుడు మోహన్ రామన్ కుమార్తె అయిన విద్యుల్లేఖ.. తెలుగు, తమిళంలో అనేక చిత్రాలు చేసింది. హీరోయిన్ ఫ్రెండ్ పాత్రలకు చిరునామాగా మారింది. ఎటో వెళ్లిపోయింది మనసు, రామయ్యా వస్తావయ్యా, భలే మంచిరోజు సహా పలు చిత్రాలతో ప్రేక్షకులను మెప్పించింది. ఆ మధ్య వచ్చిన హారర్ మూవీ 'రాజుగారి గది'లో కామెడీ పాత్రతో అలరించింది. View this post on Instagram A post shared by Vidyullekha / Vidyu Raman (@vidyuraman) -
గ్లామర్ విషయంలో తగ్గేదేలే..!
అగ్ర హీరోయిన్గా రాణిస్తూ పెళ్లి, పిల్లలు అంటూ సంసార జీవితంలోకి అడుగుపెడితే. ఇక ఆ నటి కెరీర్ అంతే. ఆ తరువాత అక్క, వదిన పాత్రలు వేసుకోవాల్సిందే అనే నానుడి చిత్ర పరిశ్రమలో ఉంది. నటి జ్యోతిక లాంటి కొందరు మాత్రం తమ వయసుకు తగ్గట్టుగా నటనకు అవకాశం ఉన్న పాత్రలను ఎంపిక చేసుకుని, గ్లామర్‌కు, రొమాన్స్‌కు దూరంగా నటిస్తున్నారు. అలాంటిది తెలుగు, తమిళం, హిందీ భాషల్లో నటిస్తూ క్రేజీ కథానాయకిగా రాణిస్తున్న నటి కాజల్ అగర్వాల్ అనూహ్యంగా పెళ్లి చేసుకొని ఓ బిడ్డకు తల్లి అయిన వెంటనే కేవలం రెండు నెలల గ్యాప్‌లోనే మళ్లీ నటించడానికి సిద్ధమయ్యారు. అదీ హీరోయిన్గా.. కమలహాసన్ కథానాయకుడిగా శంకర్ దర్శకత్వంలో నటిస్తున్న ఇండియన్ –2 చిత్రం షూటింగ్ అనివార్య కారణాలు వల్ల మధ్యలో కొంతకాలం ఆగిపోయింది. అది నటి కాజల్ అగర్వాల్‌కు కలిసి వచ్చింది అనే చెప్పాలి. ఈ చిత్ర షూటింగ్ మళ్లీ ప్రారంభమయ్యేసరికి కాజల్ అగర్వాల్ పెళ్లి చేసుకుని ఒక బిడ్డకు జన్మనిచ్చి మళ్లీ నటించడానికి సిద్ధమైపోయారు. అదేమంటే తనకు నటనంటే చాలా ఇష్టమని పేర్కొంటున్నారు. కాగా తాజాగా తెలుగులో బాలకృష్ణ సరసన మరో భారీ చిత్రంలో నటించే అవకాశాన్ని ఈమె దక్కించుకున్నారు. అంతేకాదు మరిన్ని అవకాశాల కోసం ఈ బ్యూటీ గ్లామర్‌ని ఆసరాగా చేసుకుంటున్నారు. సమయం దొరికినప్పుడల్లా తన గ్లామరస్ ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. అలా ఇటీవల ఒక కార్యక్రమంలో పాల్గొనడానికి తన భర్తతో కలిసి వచ్చిన కాజల్ అగర్వాల్ తనదైన స్టైల్లో అందాలను ఆరబోశారు. ఆ ఫొటోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. అలా కాజల్ పెళ్లి అయిన తర్వాత కూడా గ్లామర్ విషయంలో తగ్గేదేలే అంటున్నారు. -
Kajal Aggarwal: చురకత్తిలాంటి చూపులతో ఆగం చేస్తున్న కాజల్ (ఫోటోలు)
-
బాలీవుడ్లో విలువలు ఉండవు..కాజల్ అగర్వాల్ సంచలన కామెంట్స్
హీరోయిన్ కాజల్ అగర్వాల్ బాలీవుడ్ ఇండస్ట్రీపై సంచలన కామెంట్స్ చేసింది. తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న కాజల్.. సౌత్ మూవీస్ వర్సెస్ బాలీవుడ్ అనే అంశంపై మాట్లాడుతూ.. ''హిందీ పరిశ్రమలో క్రమశిక్షణ, నైతిక విలువలు కనిపించవంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తింది. నేను పుట్టి పెరిగింది ముంబైలో అయినా నా కెరీర్ ప్రారంభమైంది మాత్రం హైదరాబాద్‌లోనే. మాతృభాష హిందీ అయినప్పటికీ ఎక్కువగా తెలుగు, తమిళ చిత్రాల్లో నటించాను. దీంతో హైదరాబాద్, చెన్నై నగరాలను తన నివాసంగా భావిస్తాను. సౌత్ ఇండస్ట్రీలో ఫ్రెండ్లీ వాతావరణం ఉంటుంది. టాలెంట్ ఉంటే ఎవరినైనా ప్రేక్షకులు ఆదరిస్తారు. అందుకే అక్కడ అద్భుతమైన టెక్నీషియన్లు, దర్శకులు ఉన్నారు. బాలీవుడ్లో కొన్ని మంచి సినిమాల్లో నటించినప్పటికీ దక్కిణాదిలో ఉన్నట్లు ఫ్రొఫెషనలిజం,నైతిన విలువలు లొపించాయి'' అని భావిస్తున్నట్లు చెప్పుకొచ్చింది. అయితే ప్రస్తుతం కాజల్ చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ఇక ఇటీవలె ప్రియాంక చోప్రా సైతం బాలీవుడ్లో రాజకీయాలు ఎక్కువ అని, వాళ్లతో విసిగిపోయి అమెరికా వెళ్లిపోయానని పేర్కొన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు కాజల్ కూడా బాలీవుడ్ ఇండస్ట్రీపై నిప్పులు చెరగడంతో బీటౌన్ ప్రేక్షకులు ఫైర్ అవుతున్నారు. -
వేడుకగా చరణ్ బర్త్‌డే పార్టీ.. టాలీవుడ్ తారల సందడి
ఆర్ఆర్ర్తో గ్లోబల్ స్టార్‌గా మారాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. నాటు నాటుకు ఆస్కార్ రావడంతో చరణ్ విశ్వ వేదికలపై మెరిసాడు. ఈ క్రమంలో ఆయనకు ప్రపంచవ్యాప్తంగా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది. నాటు నాటు ఆస్కార్ గెలిచిన తరుణంలో టాలీవుడ్‌తో పాటు భారత సినీ పరిశ్రమ పండుగ చేసుకుంటుంది. ఈ క్రమంలో ఆ ఆనందాన్ని మరింత రెట్టింపు చేస్తూ మెగా రామ్ చరణ్ బర్త్‌డే రావడం విశేషం. ఈ నేపథ్యంలో చరణ్ బర్త్‌డే సెలబ్రేషన్స్ వేడుకగా జరిగాయి. ఆయన భార్య ఉపాసన చరణ్ బర్త్‌డే పార్టీని ఘనంగా నిర్వహించింది. మార్చి 27 రామ్ చరణ్ పుట్టిన రోజు అనే విషయం తెలిసిందే. చరణ్ బర్త్‌డే పురస్కరించుకుని రెండు తెలుగు రాష్ట్రాల్లో అభిమానులంత హంగామా చేశారు. అలాగే అమెరికాలోనూ చరణ్ పుట్టిన రోజు సెలబ్రెషన్స్ ఘనంగా జరిగాయి. లాస్ ఏంజిల్స్‌లో రామ్ చరణ్ అభిమానులు.. సర్ ప్రైజ్ గ్రీటింగ్స్ తెలిపారు. ప్రపంచ సినిమా స్టూడియోలకు ప్రసిద్ది అయిన హాలీవుడ్ సైన్ పై.. ఎయిర్ ప్లేన్ బ్యానర్ ఎగురవేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. అలాగే చరణ్ బర్త్‌డే సందర్భంగా సోమవారం రాత్రి గ్రాండ్ పార్టీ ఇచ్చింది మెగా ఫ్యామిలీ. ఈ పార్టీలో టాలీవుడ్ తారలంతా సందడి చేశారు. ‘చందమామ’ కాజల్ భర్తలో కలిసి హాజరు కాగా.. కొత్త జంట మంచు మనోజ్ భార్య మౌనిక కలిసి పాల్గొన్నాడు. ఈ వేడుకలో కాజల్ జంట, మనోజ్ జంటలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అలాగే మంచు లక్ష్మి, ఎస్ ఎస్ రాజమౌళి విక్టరి వెంకటేశ్, శ్రీకాంత్, రానా దగ్గుబాటి, నాగార్జున, నాగ చైతన్య, అఖిల్, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్, అడవి శేష్, దిల్ రాజుతో పాటు ఇతర దర్శక-నిర్మాతలు చరణ్ బర్త్‌డే సెలబ్రెషన్స్‌లో పాల్గొని సందడి చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. తారలంతా ఒక్కచోట ఇలా కనిపించడం కనుల విందుగా ఉందంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. చదవండి: మై స్వీట్ బ్రదర్ అంటూ ఫొటో షేర్ చేసిన మంచు మనోజ్ డైరెక్టర్‌తో ఏడేళ్లు ప్రేమ, పెళ్లి.. పెళ్లైన వారానికే నరకం చూశా: నటి జయలలిత -
NBK108: నందమూరి ఫ్యాన్స్‌కి ఉగాది సర్ప్రైజ్
ఉగాది పండుగ సందర్భంగా నందమూరి ఫ్యాన్స్ సర్ప్రైజ్ ఇచ్చాడు డైరెక్టర్ అనిల్ రావిపూడి. నందమూరి బాలకృష్ణ హీరోగా అనిరావిపూడి దర్శకత్వంలో ఓ భారీ బడ్జెట్ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. షైన్ స్క్రీన్స్ బ్యానర్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటించనుంది. బాలయ్య 108వ చిత్రంగా ఈ సినిమా రూపొందనుంది. చదవండి: టాలీవుడ్లో మరో విషాదం, పాపులర్ నటుడు కన్నుమూత అఖండ, వీరసింహారెడ్డి చిత్రాల బ్లాక్‌బస్టర్ హిట్‌తో ఈ చిత్రంపై భారీ అంచానలు నెలకొన్నాయి. తాజాగా ఈ మూవీ ఫస్ట్‌లుక్ విడుదల చేశారు మేకర్స్. ఈ ఫస్ట్‌లుక్ పోస్టర్ బాలయ్య లుక్ సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతోంది. ప్రస్తుతం ఈ మూవీ శరవేగంగా షూటింగ్‌ను జరుపుకుంటోంది. ఇక ఈ చిత్రంలో కాజల్‌తో పాటు ధమాకా బ్యూటీ శ్రీలీల కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే. Celebrate this UGADI with the Arrival of #NBKLikeNeverBefore 🔥 Presenting the FirstLook of Natasimham #NandamuriBalakrishna from #NBK108 💥 This time,beyond your imagination!@AnilRavipudi @MsKajalAggarwal @sreeleela14 @MusicThaman @sahugarapati7 @harish_peddi @YoursSKrishna pic.twitter.com/i1zP90B0aB — Shine Screens (@Shine_Screens) March 22, 2023 -
బాలయ్యకు జోడీగా కాజల్ అగర్వాల్.. షూటింగ్ షురూ
హీరోయిన్ కాజల్ అగర్వాల్ సెకండ్ ఇన్నింగ్స్‌లో జోరుమీదుంది. ఇప్పటికే కమల్‌హాసన్‌లో ఇండియన్-2 లో నటిస్తున్న కాజల్ ఇప్పుడు మరో బడా ప్రాజెక్ట్‌లో నటిస్తుంది. నందమూరి బాలకృష్ణ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ భారీ బడ్జెట్ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇందులో హీరోయిన్గా కాజల్ నటించబోతోందని గత కొన్నాళ్లుగా వార్తలొస్తున్నాయి. అయితే ఇప్పుడు వాటినే నిజం చేస్తూ అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చేశారు మేకర్స్. ఈ సందర్భంగా మూవీ టీం ఆమెకు వెల్కమ్ ఆన్‌బోర్డ్ అంటూ స్వాగతం పలికింది. బాలయ్యతో కాజల్ నటించనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇక ఈ చిత్రంలో కాజల్‌తో పాటు ధమాకా బ్యూటీ శ్రీలీల కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే. బాలయ్య కెరీర్లో ఇది 108వ చిత్రం కావడంతో ఇప్పటికే ఫ్యాన్స్‌లో భారీ అంచనాలు నెలకొన్నాయి. -
ఉగాదికి రిలీజవుతున్న కాజల్ ఘోస్టీ
హీరోయిన్ కాజల్ అగర్వాల్ ఈ ఉగాదికి ప్రేక్షకులకు థ్రిల్‌ని పంచేందుకు సిద్ధమయ్యారు. కళ్యాణ్ దర్శకత్వంలో కాజల్ అగర్వాల్, రాధికా శరత్ కుమార్, యోగిబాబు ప్రధాన పాత్రల్లో నటించిన తమిళ చిత్రం ‘ఘోస్టి’. ఈ నెల 17న విడుదలైన ఈ చిత్రాన్ని ‘కోస్టి’ పేరుతో గంగ ఎంటర్టైన్ మెంట్స్ ఈ నెల 22న తెలుగులో విడుదల చేస్తోంది. ‘‘హారర్ కామెడీగా రూపొందిన చిత్రం ‘కోస్టి’. ఇందులో తండ్రి, కుమార్తె మధ్య అనుబంధంతో పాటు థ్రిల్ అంశాలు కూడా ఉన్నాయి. ఆడియన్స్ ఉలిక్కిపడే సన్నివేశాలు చాలా ఉన్నాయి. ఇన్ స్పెక్టర్ ఆరతి పాత్రలో కాజల్ బాగా నటించారు. గ్యాంగ్‌స్టర్ దాస్‌గా దర్శకుడు కేఎస్ రవికుమార్ చేశారు. సామ్ సీఎస్ సంగీతం ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ. ఉగాదికి తెలుగు ప్రేక్షకులకు మంచి వినోదం అందించే చిత్రమిది’’ అని యూనిట్ పేర్కొంది. -
ఈ ఫోటోలోని చిన్నారి స్టార్ హీరోయిన్.. ఎవరో తెలుసా?
దక్షిణాది సినిమాల్లో అగ్ర కథానాయికల్లో ఒకరిగా పేరు సంపాదించింది. ఉత్తరాదికి చెందిన ఈ బ్యూటీ దక్షిణాదిలో ముఖ్యంగా తెలుగు, తమిళం భాషల్లో స్టార్ హీరోలందరితో జతకట్టింది. కాగా కథానాయకిగా మంచి ఫామ్‌లో ఉండగానే ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకొని ఓ బిడ్డకు తల్లి కూడా అయింది. 2020లో పెళ్లి చేసుకున్న ఆమె గతేడాదిలోనే మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ మొదలెట్టింది. అయితే ఇదంతా రెండేళ్ల లోపే జరిగిపోయింది. తాజాగా ఆమెకు సంబంధించిన చిన్నప్పటి ఫోటోలు నెట్టింట్లో తెగ వైరలవుతున్నాయి. ఆ ఫోటోలో కనిపిస్తున్న చిన్నారి ప్రస్తుతం తమిళ స్టార్ హీరో సినిమాలో నటిస్తోంది. ఇంతకీ ఎవరో గుర్తుపట్టారా? అయితే ఈ స్టోరీ చదివేయండి. సాధారణంగా వివాహం అయిన తర్వాత హీరోయిన్గా కొనసాగటం కాస్త కష్టమే. కానీ కాజల్ అగర్వాల్ దాన్ని బ్రేక్ చేశారు. పెళ్లే కాదు బిడ్డకు తల్లి అయిన తర్వాత కూడా ఈ బ్యూటీ హీరోయిన్గా మెప్పిస్తున్నారు. గతంలో పెళ్లి అయిన తర్వాత కూడా గ్లామర్‌గా నటిస్తారా..? అన్న ప్రశ్నకు కాజల్ అగర్వాల్ బదులిస్తూ వైనాట్ అని ఠక్కున చెప్పుకొచ్చారు. ఈ విషయంలో తాను, తన భర్త చాలా క్లియర్‌గా ఉన్నామని పేర్కొన్నారు. పెళ్లి, చేసే వృత్తి వేరు వేరు అన్నారు. అయితే గ్లామర్ సన్నివేశాలు చిత్ర కథకు ఎంతవరకు అవసరం అన్నది కూడా ముఖ్యమన్నారు. వివాహానంతరం తాను నటించనని ప్రచారం చేశారని.. దాన్ని బ్రేక్ చేశానని కాజల్ అగర్వాల్ పేర్కొన్నారు. కాగా.. ప్రస్తుతం కాజల్ అగర్వాల్ కమల్ హాసన్ ఇండియన్- 2 చిత్రంలో నటిస్తున్నారు. తదుపరి తెలుగులో బాలకృష్ణ సరసన నటించే లక్కీ చాన్స్ కాజల్‌ను వరించింది. కాగా కోలీవుడ్‌లో నటుడు అజిత్‌కు జంటగా నటించే అవకాశం కూడా ఈమె తలుపు తట్టిందనేది తాజా సమాచారం. అజిత్ 62వ చిత్రంలో కాజల్‌ను హీరోయిన్గా పరిశీలిస్తున్నట్లు తెలిసింది. -
బాలకృష్ణ సరసన కాజల్ అగర్వాల్..
తమిళ సినిమా: అగ్ర కథానాయికల్లో ఒకరు కాజల్ అగర్వాల్. ఉత్తరాదికి చెందిన ఈ బ్యూటీ దక్షిణాదిలో ముఖ్యంగా తెలుగు, తమిళం భాషల్లో స్టార్ హీరోలందరితో జతకట్టారు. కాగా కథానాయకిగా మంచి ఫామ్‌లో ఉండగానే ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకొని ఓ బిడ్డకు తల్లి కూడా అయ్యారు. అయితే ఇదంతా రెండేళ్ల లోపే జరిగిపోయింది. 2020లో పెళ్లి చేసుకున్న కాజాల్ అగర్వాల్ 2022 కల్లా గోడకు తగిలిన బంతిలా మళ్లీ నటన వైపు తిరిగొచ్చేశారు. వివాహం అయిన తర్వాత, నటీమణులు హీరోయిన్గా కొనసాగటం కష్టమే అంటారు. దాన్ని కాజల్ అగర్వాల్ బ్రేక్ చేశారు. పెళ్లే కాదు బిడ్డకు తల్లి అయిన తర్వాత కూడా ఈ బ్యూటీ హీరోయిన్గా నటిస్తున్నారు. మరో విషయం ఏమిటంటే కమలహాసన్‌కు జంటగా నటిస్తున్న ఇండియన్ –2 చిత్ర షూటింగ్ వాయిదాలు పడుతూ రావటం కాజల్ పాలిట వరంగా మారిందనే చెప్పాలి. ప్రస్తుతం ఈమె ఇండియన్ 2 చిత్రంలో నటిస్తున్నారు. తదుపరి తెలుగులో బాలకృష్ణ సరసన నటించే లక్కీ చాన్స్ కాజల్‌ను వరించింది. కాగా కోలీవుడ్‌లో నటుడు అజిత్‌కు జంటగా నటించే అవకాశం కూడా ఈమె తలుపు తట్టిందనేది తాజా సమాచారం. అజిత్ 62వ చిత్రంలో కాజల్‌ను హీరోయిన్గా పరిశీలిస్తున్నట్లు తెలిసింది. వీరిద్దరు ఇంతకుముందు వివేకం చిత్రంలో జతకట్టారన్నది గమనార్హం. ఇకపోతే పెళ్లి అయిన తర్వాత కూడా గ్లామర్‌గా నటిస్తారా..? అన్న ప్రశ్నకు కాజల్ అగర్వాల్ బదులిస్తూ వైనాట్ అని టక్కున చెప్పారు. ఈ విషయంలో తాను తన భర్త చాలా క్లియర్‌గా ఉన్నామని పేర్కొన్నారు. ప్రేమ సన్నివేశాల్లో సహా నటుడితో సన్నిహితంగా నటించాల్సి ఉంటుందన్నారు. అలా నటించనని చెప్పడం వీలుకాదన్నారు. వివాహ జీవితం, చేసే వృత్తి వేరు వేరు అన్నారు. అయితే గ్లామర్ సన్నివేశాలు చిత్ర కథకు ఎంతవరకు అవసరం అన్నది కూడా ముఖ్యమన్నారు. వివాహానంతరం తాను నటించనని ప్రచారం చేశారని, అయితే తాన చర్యలతో దాన్ని బ్రేక్ చేశానని కాజల్ అగర్వాల్ పేర్కొన్నారు. -
ఉగాదికి భయపెడతానంటున్న కాజల్ అగర్వాల్
హీరోయిన్ కాజల్ అగర్వాల్ ఈ ఉగాదికి ప్రేక్షకులను భయపెట్టేందుకు సిద్ధమయ్యారు. కాజల్ అగర్వాల్, రాధికా శరత్‌కుమార్, యోగిబాబు ప్రధాన పాత్రల్లో కళ్యాణ్ దర్శకత్వంలో తెరకెక్కిన తమిళ చిత్రం ‘ఘోస్టీ’. ఈ చిత్రం గంగ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై తెలుగులో విడుదల కానుంది. ‘‘ఘోస్టీ’లో పోలీస్‌గా, సినిమా హీరోయిన్గా కాజల్ ద్విపాత్రాభినయం చేశారు. ఆత్మలకు, కాజల్ పాత్రలకు సంబంధం ఏంటి? అనేది ఆసక్తిగా ఉంటుంది. ప్రేక్షకులను నవ్వించడంతో పాటు ఉత్కంఠకు గురి చేసే చిత్రమిది. ఉగాదికి తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమాను రిలీజ్ చేస్తాం’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. -
బిడ్డ పుట్టిన మూడు నెలలకే వచ్చాను.. అందరు ప్రశ్నిస్తున్నారు: కాజల్ అగర్వాల్
తమిళసినిమా: పెళ్లికి ముందు తమిళం, తెలుగు, హిందీ అంటూ పలు భాషల్లో టాప్ హీరోయిన్గా నటి కాజల్ అగర్వాల్ రాణించారు. ఓ బిడ్డకు తల్లి అయిన తరువాత కూడా కథానాయకిగా అవకాశాలను రాబట్టుకుంటున్నారు. ఇండియన్ 2 చిత్రంలో కమలహసన్కు జంటగా నటించడానికి అంగీకరించారు. ఆ చిత్రం కొంత షూటింగ్ జరుపుకున్న తరువాత కొన్ని ఘటనల కారణంగా ఆగిపోయింది. ఆ తరువాత నటి కాజల్ అగర్వాల్ ప్రేమించిన వ్యక్తిని పెళ్లాడి బిడ్డకు తల్లి కూడా అయ్యారు. దీంతో కాజల్ ఇక నటనకు గుడ్‌బై చెప్పినట్లే అని చాలా మంది అనుకున్నారు. చదవండి: కళ్లు చెదిరేలా కమెడియన్ రఘు లగ్జరీ ఇల్లు.. చూశారా? లక్కీగా అలాంటి సమయంలోనే ఇండియన్ –2 చిత్ర షూటింగ్ మళ్లీ ప్రారంభం అయ్యింది. దీంతో కాజల్ అగర్వాల్ రీఎంట్రీ షురూ అయ్యింది. కాగా ఇప్పుటికే కాజల్ అగర్వాల్ నటించిన ఘోస్టీ చిత్రం ఈ నెల 17న తెరపైకి రానుంది. ఇందులో కాజల్ తొలిసారిగా ద్విపాత్రాభినయం చేయడం విశేషం. ఘోస్టీ హర్రర్ కామెడీ జానర్లో రూపొందిన చిత్రాన్ని సుందరం, జి.జయరామ్ కలిసి నిర్మించారు. కల్యాణన్ దర్శకత్వం వహించారు. శ్యామ్ సీఎస్ సంగీతాన్ని అందించిన ఈ చిత్రం గురించి సోమవారం మధ్యాహ్నం చెన్నైలో చిత్ర యూనిట్ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కాజల్‌అగర్వాల్ పాల్గొన్నారు. చదవండి: ఆ సినిమా నేను చేసి ఉండకూడదు: లయ షాకింగ్ కామెంట్స్ ఇది హార్రర్ కామెడీ జానర్లో సాగే చిత్రం అని చెప్పారు. తాను పోలీస్ అధికారిగా, దెయ్యంగా రెండు పాత్రలు పోషించినట్లు కాజల్ చెప్పారు. బిడ్డను కన్న మూడు నెలలకే నటించడానికి రావడం గురించి అందరూ అడుగుతున్నారని, అందుకు కారణం తనకు నటన పట్ల ఉన్న ఇష్టమే కారణమన్నారు. తన కుమారుడిని తన తల్లి చూసుకుంటారని, అందుకే తాను కెమెరా ముందు ఎలాంటి టెన్షన్ లేకుండా నటించగలుగుతున్నానని చెప్పారు. క్షమశిక్షణ ఉంటే బరువు తగ్గడం పెద్ద కష్టమేమీ కాదన్నారు. అందుకు చాలా కసరత్తులు చేశానని, గర్రుపు స్వారీ, కర్రసాము, విలువిద్యలోనూ శిక్షణ పొందినట్లు చెప్పారు. ప్రస్తుతం తెలుగులో బాలకృష్ణకు జంటగా నూతన చిత్రంలో నటించడానికి సిద్ధం అవుతున్నాట్లు కాజల్ వెల్లడించారు. -
ఇండియన్ 2కు కాజల్ మేకోవర్.. మేకప్‌కు మూడున్నర గంటలు!
మేకప్ గురించి చెప్పాలంటే ముందుగా గుర్తొచ్చేది లోక నాయకుడు కమలహాసన్ పేరే. ఆయన పాత్రలకు ఎంత ప్రాముఖ్యతను ఇస్తారో, గెటప్పులకూ అంతే ప్రాధాన్యం ఇస్తారు. దశావతారం చిత్రంలో ఏకంగా 10 పాత్రల్లో నటించి మెప్పించారు. ఆ పాత్రల కోసం ఆయన కేవలం మేకప్ కోసమే నాలుగైదు గంటలు వెచ్చించేవారు. ఇక ఇండియన్ చిత్రంలోని కమలహాసన్ 90 ఏళ్ల వృద్ధుడిగా మారిపోయి గుర్తు పట్టలేనంతగా అబ్బురపరిచారు. ఇక అదే చిత్రంలో నటి సుకన్య కూడా ఆయనకు సరి సమాన మేకప్‌తో మేకోవర్ అయ్యి నటించి నప్పించారు. 1996లో విడుదలైన ఆ చిత్రం అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది. కాగా తాజాగా ఆ చిత్రానికి సీక్వెల్‌గా ఇండియన్ –2 చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. అనేక ఒడుదుడుకుల మధ్య నాలుగేళ్లు గడిచిన ఈ చిత్రం షూటింగ్ ఇప్పుడు శరవేగంగా జరుపుకుంటోంది. శంకర్ దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ భారీ చిత్రంలో నటి కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీతిసింగ్, ప్రియాస్నీ శంకర్, నటుడు సిద్ధార్థ్ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. కాగా ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ చెన్నైలో జరుగుతోంది. 90 ఏళ్ల వృద్ధుడు స్వాతంత్య్ర సమరయోధుడు సేనాపతిగా కమలహాసన్ నటిస్తుండగా, ఆయనకు జంటగా నటి కాజల్ అగర్వాల్ నటిస్తున్నట్లు తాజా సమాచారం. ప్రస్తుతం కాజల్ కూడా బామ్మ పాత్ర కోసం మేకోవర్ అవుతున్నట్లు తెలిసింది. ఇందుకోసం తనూ మేకప్ కోసం రోజూ మూడున్నర గంటల సమయాన్ని ప్రత్యేకంగా వెచ్చిస్తున్నట్లు చిత్రవర్గాలు పేర్కొన్నారు. ఇది ఇండియన్ చిత్రంలో నటి సుకన్య నటించిన పాత్రకు సీక్వెల్ అని సినీ వర్గాలు భావిస్తున్నారు. చదవండి: హీరోయిన్ రితికా సింగ్‌కు చేదు అనుభవం తొలిసారి జిమ్‌లో అలా.. మహేశ్ బీస్ట్ లుక్ చూశారా? -
అజిత్‌తో రెండోసారి సెట్ అయినట్లేనా?
ఇప్పుడు తమిళ సినీ పరిశ్రమ దృష్టి అంతా నటుడు అజిత్ నటించే 62వ చిత్రంపైనే. దీనికి కారణం ప్రారంభానికి ముందే దర్శకుడు విఘ్నేష్ శివన్‌ను చిత్రం నుంచి తొలగించడం, ఆ స్థానంలో మగిళ్ తిరుమేణిని ఎంపిక చేయటం. దీనికితోడు చిత్ర షూటింగ్‌ను 3 నెలల్లోనే పూర్తి చేయాలని అజిత్ దర్శకుడికి ఆంక్షలు విధించినట్లు కూడా ప్రచారం సాగుతోంది. చదవండి: అప్పుడే ఓటీటీకి వచ్చేస్తోన్న ‘బుట్టబొమ్మ’! స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే.. అదేవిధంగా లైకా ప్రోడక్షన్స్ నిర్మిస్తున్న ఈ భారీ చిత్రంలో హీరోయిన్ ఎవరనే విషయంపై ఇంకా స్పష్టత రాకపోవడం కూడా ఆసక్తిని రేకెత్తిస్తుంది. తాజాగా ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు వేగవంతమైనట్లు తెలుస్తోంది. ఇక హీరోయిన్గా ఐశ్వర్యారాయ్ నటించే అవకాశం ఉందని తొలుత ప్రచారం సాగింది. తర్వాత నయనతార, త్రిష పేర్లు వెలుగులోకి వచ్చాయి. ఇప్పుడు ఆ అవకాశాన్ని నటి కాజల్ అగర్వాల్ దక్కించుకున్నట్లు సామాజిక మాధ్యమాల్లో పోస్టులు హోరెత్తుతున్నాయి. చదవండి: పెళ్లి తర్వాత నయన్‌కు కలిసిరావడం లేదా? ఈమె ఇంతకుముందు అజిత్ సరసన వివేకం చిత్రంలో నటించారు. శివ దర్శకత్వం వహించిన ఆ చిత్రం 2017లో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. కాగా, కరోనా టైమ్‌లో నటి కాజల్ అగర్వాల్ పెళ్లి చేసుకొని ఒక బిడ్డకు తల్లి కూడా అయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం కమలహాసన్ సరసన ఇండియన్ 2, కరుంగాపియన్ చిత్రాల్లో నటిస్తున్నారు. ఈ నేపథ్యంలో అజిత్ 62వ చిత్రంలో కాజల్ నటించే విషయమై అధికారిక ప్రకటన త్వరలో వెలువనుందని తెలుస్తోంది. -
పెళ్లి తర్వాత కూడా ఏమాత్రం తగ్గని కాజల్ జోరు
హీరోయిన్లకు పెళ్లి తర్వాత ఒక కెరీర్ అయిపోయినట్లే అని అపోహ ఉండేది. స్టార్ హీరోయిన్గా చక్రం తిప్పినా పెళ్లి తర్వాత వదిన, అక్క పాత్రలతో సరిపెట్టుకోవాల్సి వచ్చేది. కానీ పరిస్థితులు మారాయి. పెళ్లి తర్వాత కూడా ఇప్పటి హీరోయిన్లు దూసుకుపోతున్నారు. వారిలో కాజల్ అగర్వాల్ కూడా ఒకరు. తెలుగుతో పాటు తమిళం, హిందీ చిత్రల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న కాజల్ పెళ్లి తర్వాత కూడా వరుస సినిమాలు చేస్తోంది. అయితే ప్రెగ్నెన్సీ టైంలోనే కాస్త బ్రేక్ ఇచ్చినా ఇప్పుడు మళ్లీ యాక్షన్‌కు రెడీ అంటోంది. సెకండ్ ఇన్నింగ్స్‌లో పాన్ ఇండియా సినిమాలు సైన్ చేసిన కాజల్ రెమ్యునరేషన్ కూడా భారీగా పెంచేసిందట. ఒకప్పుడు సుమారు కోటిన్నర నుంచి రెండు కోట్ల వరకు పారితోషికం తీసుకునే కాజల్ ఇప్పుడు దాదాపు మూడు కోట్లు రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తుందని టాక్ వినిపిస్తుంది. ప్రస్తుతం కాజల్ శంకర్ డైరెక్షన్లో ఇండియన్-2 సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో పాటు మరో రెండు తమిళ చిత్రాలు, బాలయ్య సరసన ఓ సినిమాలో నటిస్తుంది. -
కాజల్ కొడుకు ఫుల్ ఫోటో చూశారా.. ఎంత క్యూట్‌గా ఉన్నాడో
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ ఇప్పుడు ఎక్కువ సమయం కొడుకుతో గడపడానికే కేటాయిస్తుంది. గతేడాది జూన్‌లో ఈ ‘చందమామ’కి పండంటి మగ బిడ్డ జన్మించిన విషయం తెలిసిందే. అతనికి నీల్ కిచ్లూ అని నామకరణం చేసింది. ఈ విషయంతో పాటు కొడుకుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. తల్లిగా తను పొందే ఆనందాన్ని ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటుంది ఈ బ్యూటీ. అయితే ఇప్పటి వరకు కుమారుడిని మొత్తంగా చూపించలేదు. సైడ్‌గా చూపిస్తూ.. అతను చేసే అల్లరి పనులను చెప్పుకొచ్చింది. కానీ తాజాగా కొడుకు ఫుల్ పోటోని అభిమానులతో షేర్ చేసుకుంది. కొడుకు పుట్టి 9 నెలలు పూర్తయిన సందర్భంగా గురువారం(జనవరి 19) కాజల్ ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. దేవుడు నీ ద్వారా చేయించబోయే పనులను చూడడానికి వేచి ఉండలేకపోతున్నాను. గడిచిన 9 నెలలతో పాటు రాబోయే రోజులకు ఎంతో కృతజ్ఞతలు తెలుపుతున్నాను. . ఏడాదిలో మూడవవంతు పూర్తి చేసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది’ అంటూ నీల్ కిచ్లూ నవ్వుతూ ఉన్న ఫోటోలను షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. కాజల్ అగర్వాల్ 2020లొ ముంబైకి చెందిన వ్యాపారవేత్తను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. గతేడాది జూన్ 19న ఈ జంటకు కొడుకు పుట్టాడు. ప్రెగ్నెన్సీ కారణంగా దాదాపు ఏడాదిన్నర పాటు సినిమాలకు దూరమైంది కాజల్. ప్రస్తుతం ఈ బ్యూటీ కమల్ హాసన్, శంకర్ కాంబోలో తెరకెక్కుతున్న ఇండియన్-2 చిత్రంలో నటిస్తోంది. View this post on Instagram A post shared by Kajal A Kitchlu (@kajalaggarwalofficial) -
తుపాకీ పట్టిన హీరోయిన్లు.. బాక్సాఫీస్‌పై గురి
తుపాకీ పట్టారు.. విలన్లపై గురి పెట్టారు...రెచ్చిపోయి ఫైట్స్ చేస్తున్నారు... బాక్సాఫీస్ కలెక్షన్లపై గురి పెట్టారు... ప్రస్తుతం కొందరు కథానాయికలు సిన్సియర్ పోలీసాఫీసర్లుగా, లేడీ జేమ్స్ బాండ్ తరహా పాత్రల్లో నటిస్తున్నారు. ఆ చిత్రాల గురించి తెలుసుకుందాం. సీనియర్ నటి టబు మరో రెండు నెలల్లో ఇన్స్పెక్టర్ డయానా జోసెఫ్‌గా కనిపించనున్నారు. అజయ్ దేవగన్ హీరోగా నటిస్తూ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న హిందీ చిత్రం ‘భోలా’లోనే ఆమె పోలీస్ ఇన్స్పెక్టర్ డయానా జోసెఫ్ పాత్ర చేస్తున్నారు. మూడు రోజుల క్రితం ఈ చిత్రంలో టబు లుక్ విడుదలైంది. మార్చి 30న ఈ చిత్రం విడుదల కానుంది. ఇక గత ఏడాది సెప్టెంబర్‌లో ‘పొన్నియిన్ సెల్వన్’ చిత్రంలో యువరాణి పాత్రలో కనిపించిన త్రిష త్వరలో విడుదల కానున్న వెబ్ సిరీస్ ‘బృందా’లో తుపాకీ తూటాలను అలవోకగా వదిలే పోలీస్‌గా కనిపించనున్నారు. త్రిష నటించిన తొలి వెబ్ సిరీస్ ఇది. సూర్య వంగల దర్శకత్వంలో రూపొందిన ఈ సిరీస్ సీజన్ వన్ షూటింగ్ ఇటీవలే పూర్తయింది. త్వరలో స్ట్రీమింగ్ కానుంది. ఓ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ చుట్టూ తిరిగే కథతో ఈ సిరీస్ రూపొందింది. ఇక కాజల్ అగర్వాల్ కూడా సిన్సియర్ పోలీసాఫీసర్‌గా కనిపించనున్నారు. ‘ఘోస్టీ’ అనే చిత్రంలోనే ఈ పాత్ర చేశారామె. తన తండ్రి అడుగుజాడలను అనుసరించి, పోలీస్‌గా మారుతుంది ఆర్తి (కాజల్). ఇరవయ్యేళ్ల క్రితం తన తండ్రి కస్టడీ నుంచి తప్పించుకున్న ఖైదీని పట్టుకోవాలన్నదే ఆర్తి ఆకాంక్ష. ఈ క్రమంలో ఆమెకు విచిత్రమైన ఘటనలు ఎదురవుతుంటాయి. కాజల్ నటించిన తొలి హారర్ సినిమా ఇది. కల్యాణ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. మరోవైపు అధికారిక ప్రకటన రాలేదు కానీ ఓ హిందీ షోలో తమన్నా పోలీస్‌గా చేస్తున్నారనే వార్త ప్రచారంలోకి వచ్చింది. క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో ఈ షో సాగుతుందని సమాచారం. ఇంకోవైపు దాదాపు లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేస్తున్న నయనతార తన తొలి హిందీ చిత్రం ‘జవాన్’లో పోలీసాఫీసర్ పాత్ర చేస్తున్నారు. షారుక్ ఖాన్ హీరోగా తమిళ దర్శకుడు అట్లీ తెరకెక్కిస్తున్న తొలి హిందీ చిత్రం ఇది. ఈ చిత్రంలో అన్యాయంగా జైలుపాలైన మహిళలను విడిపించి, వారిని సాంఘిక దురాచారాలకు వ్యతిరేకంగా పోరాడే ఒక టీమ్‌గా మార్చే కామన్ మేన్ పాత్రను షారుక్ ఖాన్ చేస్తున్నారని సమాచారం. ఈ కేసును ఛేదించే పోలీసాఫీసర్ పాత్రలో నయనతార కనిపిస్తారని టాక్. ఈ ఏడాది జూన్ 2న ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు. ఇక అభినయానికి ఆస్కారం ఉన్న పాత్రలంటే దర్శకులకు గుర్తొచ్చే కథానాయికల్లో కీర్తీ సురేష్ ముందు వరుసలో ఉంటారు. ప్రస్తుతం కీర్తి చేస్తున్న చిత్రాల్లో ‘రివాల్వర్ రీటా’ ఒకటి. రెండు చేతులతో రెండు తుపాకీలు పట్టుకుని అలవోకగా షూట్ చేసే రీటా పాత్రలో కనిపించనున్నారు కీర్తి. కె. చంద్రు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో లేడీ జేమ్స్ బాండ్ తరహా పాత్ర చేస్తున్నారామె. మరోవైపు హిందీ చిత్రం ‘కమాండో’ సీక్వెల్స్‌లో పోలీస్ ఇన్స్పెక్టర్ భావనా రెడ్డిగా కనిపించిన అదా శర్మ ప్రస్తుతం ఓ హిందీ చిత్రంలో పోలీస్ ఆఫీసర్‌గా చేస్తున్నారు. విశాల్ పాండ్య దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. మరోసారి పోలీస్‌గా నటించే అవకాశం రావడం ఆనందంగా ఉంది అంటున్నారు అదా. ఇక ‘సీతారామం’ చిత్రంతో పాపులర్ అయిన మృణాల్ ఠాకూర్ నటించిన హిందీ చిత్రం ‘గూమ్రా’. ‘సీతారామం’లో సున్నిత మనసు ఉన్న సీత పాత్రలో అందర్నీ ఆకట్టుకున్న మృణాల్ ‘గూమ్రా’లో శక్తిమంతమైన పోలీసాఫీసర్‌గా కనిపించనున్నారు. ఈ పాత్ర చేయడానికి శిక్షణ తీసుకున్నారు మృణాల్. తమిళ చిత్రం ‘తడమ్’కి రీమేక్‌గా వర్థన్ కట్కర్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. ఈ తారలే కాదు.. మరికొందరు కథానాయికలు కూడా పోలీసాఫీసర్ పాత్రలో విజృంభించనున్నారు. -
త్రిషకు షాక్! తెరపైకి కాజల్ అగర్వాల్?
సినిమా రంగంలో ఏ నిమిషానికి ఏం జరుగుతుందో ఊహించడం కష్టం. నటుడు అజిత్ కొత్త చిత్రం విషయంలోనూ అదే జరుగుతున్నట్లు సమాచారం. ఈయన కథానాయకుడిగా నటించిన తుణివు చిత్రం పొంగల్‌కు తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. దీంతో తన 62వ చిత్రానికి అజిత్ రెడీ అవుతున్నారు. దీనిని లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించబోతోంది. నయనతార భర్త విఘ్నేష్ శివన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. దాదాపు ప్రీ ప్రొడక్షన్స్ కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ మూవీ త్వరలో సెట్స్‌పైకి వెళ్లనుంది. అయితే ఈ చిత్రంలో హీరోయిన్ ఎవరన్నది ఆసక్తిగా మారింది. మొదట నయనతార నటించనున్నట్లు టాక్ వచ్చింది. అయితే ఇందులో కొన్ని కారణాల వల్ల ఆమె ఈ మూవీని రిజెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. నిజానికి అజిత్, నయనతారలది హిట్ కాంబినేషన్. ఇంతకు ముందు ఆరంభం, విశ్వాసం వంటి విజయవంతమైన చిత్రాల్లో ఈ జంట నటించి మెప్పించింది. ఆ విషయం పక్కన పెడితే అజిత్ 62వ చిత్రంలో నటి త్రిష నాయకిగా నటిస్తున్నట్లు మరోసారి ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడు ఆమె కూడా ఇందులో నటించడం లేదని సమాచారం. దీంతో కాజల్ అగర్వాల్ ఎంపిక చేసినట్లు టాక్ వైరల్ అవుతోంది. ఈమె ఇంతకుముందు వివేకం చిత్రంలో అజిత్‌తో జతకట్టిన విషయం తెలిసిందే. అజిత్‌కు జంటగా నటించే విషయమై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ప్రస్తుతం కాజల్ అగర్వాల్, కమలహాసన్ సరసన ఇండియన్–2 చిత్రంలో నటిస్తోంది. -
క్రిస్మస్ సెలబ్రేషన్స్‌లో స్టార్స్ సందడి.. బ్యూటీల తళుకులు-మెరుపులు
► క్రిస్మస్ సెలబ్రేషన్స్‌లో కాజల్ సిస్టర్స్ ► యంగ్ లుక్‌తో మెరిసిపోతున్న మీరా జాస్మిన్ ► యాంకర్ నిఖిల్ క్రిస్మస్ పార్టీలో టాలీవుడ్ సెలబ్రిటీలు ► అందంతో కేక పుట్టిస్తోన్న హీరోయిన్ శ్రీలీల ► భర్తతో కాజల్ క్యూట్ ఫోటో View this post on Instagram A post shared by Sreeleela (@sreeleela14) View this post on Instagram A post shared by Meera Jasmine (@meerajasmine) View this post on Instagram A post shared by Gautam Kitchlu (@kitchlug) View this post on Instagram A post shared by Are Syamala (@syamalaofficial) View this post on Instagram A post shared by Are Syamala (@syamalaofficial) View this post on Instagram A post shared by Mehaboob Dil Se (@mehaboobdilse) View this post on Instagram A post shared by Ariaana & Viviana Manchu (@ariviviofficial) View this post on Instagram A post shared by Shilpa Reddy (@shilpareddy.official) View this post on Instagram A post shared by 𝐀𝐊𝐇𝐈𝐋𝐒𝐀𝐑𝐓𝐇𝐀𝐊 (@akhilsarthak_official) View this post on Instagram A post shared by Viranica Manchu (@viranica) View this post on Instagram A post shared by Nisha Aggarwal (@nishaaggarwal) View this post on Instagram A post shared by Nikhiluuuuuuuuu (@nikhilvijayendrasimha) View this post on Instagram A post shared by SitaraGhattamaneni (@sitaraghattamaneni) View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) -
కాజల్ న్యూలుక్.. వైరల్ అవుతున్న ఫోటోలు
సాధారణంగా హీరోయిన్లు స్లిమ్‌గా, నాజూగ్గా తయారు అవడానికే ఇష్టపడుతుంటారు. అందుకు తగిన కసరత్తు కూడా చేస్తుంటారు. బరువు పెంచడం అన్నది అతి తక్కువ మంది నటీమణులే చేస్తుంటారు. కాజల్ అగర్వాల్ గురించి ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో చర్చ నడుస్తోంది. గత ఏడాది ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ బ్యూటీ నటనకు స్వస్తి చెప్తారని అందరూ భావించారు. ఆమె ఇంతకుముందు నటించడానికి ఒప్పందం కుదుర్చుకున్న ఇండియన్– 2 చిత్రం నుంచి తొలగిస్తున్నట్లు, ఆ పాత్రలో మరో నటిని ఎంపిక చేయడానికి దర్శకుడు శంకర్ సిద్ధమైనట్టు ప్రచారం కూడా జరిగింది. అందరి ఊహలను తలకిందులు చేస్తూ కాజల్ అగర్వాల్ తల్లి అయిన మూడు నాలుగు నెలలకే నటించడానికి సిద్ధమైంది. బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత కూడా ఆమె మరింత అందంగా తయారవ్వడం విశేషం. ఈమె కమలహాసన్ జంటగా ఇండియన్ – 2 చిత్రంలో నటించడానికి సిద్ధమైంది. అందుకు గుర్రపు స్వారీ, కత్తి సాము వంటి విద్యల్లోనూ శిక్షణ పొందింది. తాజాగా కాజల్ అగర్వాల్ కాస్త బరువెక్కింది. ఆ ఫొటోలను తన ట్విట్టర్లో పొందుపరిచింది. అవి సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ఇండియన్– 2 చిత్రంలో కమలహాసన్ 90 ఏళ్ల వృద్ధుడిగా నటిస్తున్నట్లు తాజా సమాచారం. ఇప్పుడు నటి కాజల్ బరువు పెరగడానికి ఈ చిత్ర కథకు సంబంధం ఉందనే ప్రచారం సాగుతోంది. -
పట్టుచీరలో బుట్టబొమ్మలా పూజాహెగ్డే.. పూజిత స్టన్నింగ్ లుక్స్
► పట్టుచీరలో బుట్టబొమ్మలా పూజాహెగ్డే ► వెకేషన్ ఫోటోలు షేర్ చేసిన అనన్య పాండే ► చందమామ కాజల్ అగర్వాల్ ఫ్యామిలీ ఫోటోలు ► పొడుగు కాళ్ల సుందరిలీ ఫోటోలకు ఫోజులిచ్చిన శివానీ ► ఆరేంజ్ డ్రెస్‌లో పూజిత పొన్నాడ స్టన్నింగ్ స్టిల్స్ View this post on Instagram A post shared by Lahari Shari (@lahari_shari) View this post on Instagram A post shared by Rakul Singh (@rakulpreet) View this post on Instagram A post shared by Pooja Hegde (@hegdepooja) View this post on Instagram A post shared by Ananya 💛💫 (@ananyapanday) View this post on Instagram A post shared by Jacqueline Fernandez (@jacquelinef143) View this post on Instagram A post shared by Pujita Ponnada (@pujita.ponnada) View this post on Instagram A post shared by Hebah P (@ihebahp) View this post on Instagram A post shared by Kajal A Kitchlu (@kajalaggarwalofficial) View this post on Instagram A post shared by Shivani Rajashekar (@shivani_rajashekar1) View this post on Instagram A post shared by Kajal A Kitchlu (@kajalaggarwalofficial) View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor) -
ఆ లుక్ కోసం ఆహారం మానేసిన కమల్! కేవల పండ్ల రసాలతోనే..
‘ఇండియన్’ (తెలుగులో ‘భారతీయుడు’) సినిమా తర్వాత హీరో కమల్‌హాసన్, దర్శకుడు శంకర్ తాజాగా ‘ఇండియన్ 2’ చేస్తున్న సంగతి తెలిసిందే. కమల్‌హాసన్ టైటిల్ రోల్ చేస్తున్న ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తుండగా, రకుల్‌ప్రీత్ సింగ్, సిద్ధార్థ్, బాబీ సింహా కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చెన్నైలో జరుగుతోంది. ‘ఇండియన్’ సినిమాలో మాదిరిగానే ‘ఇండియన్ 2’లోనూ కమల్ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ‘ఇండియన్’లో సేనాపతి, అతని తనయుడు చంద్రబోస్ సేనాపతి పాత్రల్లో నటించారు కమల్‌హాసన్. అయితే ‘ఇండియన్ 2’ కథను మాత్రం సేనాపతి, అతని తండ్రి పాత్రల నేపథ్యంలో (1920 సమయంలో...) సాగుతూనే, మరోవైపు ఇప్పటి కాలం కూడా టచ్ అయ్యేలా స్క్రీన్‌ప్లే రెడీ చేశారట శంకర్. అలాగే ఈ చిత్రంలో కమల్‌హాసన్ ఓ పాత్రలో తొంభైసంవత్సరాల వ్యక్తిగా కనిపించనున్నారు. ఈ లుక్‌కి సంబంధించిన షూటింగ్లో పాల్గొంటున్నప్పుడు కమల్ ఆహారం తీసుకోవడంలేదట. ప్రొస్థటిక్ మేకప్ వాడడంతో నోరు పూర్తిగా తెరవలేని పరిస్థితుల్లో షూటింగ్ అప్పుడు కేవలం పండ్ల రసాలతో సరిపెట్టుకుంటున్నారట. -
బాత్రూంలో ఆలియా ఫోటోషూట్.. రకుల్ క్యూట్ లుక్స్.. ఇన్ స్టాలో తారల అందాలు
► డిఫరెంట్ లుక్ ఉన్న పొడవాటి డ్రెస్ లో మైమరపిస్తున్న వాణి కపూర్ ► బ్లాక్ డ్రెస్‌లో హెబ్బా పటేల్..అదిరిపోయే కటౌట్ ► టైట్ డ్రెస్ లో రకుల్ క్యూట్ లుక్స్ ► ఆదివారం ఉదయం మంచి సూర్యకాంతిని చూసి మురిసిపోయిన అలియా.. బాత్రూంలోనే ఫోటో షూట్ చేసిందట. ఇలా సోషల్ మీడియాలో సినీ తారలు పంచుకున్న ఫోటోలపై ఓ లుక్కేయండి View this post on Instagram A post shared by Vaani Kapoor (@_vaanikapoor_) View this post on Instagram A post shared by Hebah P (@ihebahp) View this post on Instagram A post shared by Rakul Singh (@rakulpreet) View this post on Instagram A post shared by Alia Bhatt 💛 (@aliaabhatt) View this post on Instagram A post shared by Kajal A Kitchlu (@kajalaggarwalofficial) View this post on Instagram A post shared by Neha Sharma 💫 (@nehasharmaofficial) View this post on Instagram A post shared by Shraddha Das (@shraddhadas43) View this post on Instagram A post shared by Huma Qureshi (@iamhumaq) View this post on Instagram A post shared by RAm POthineni (@ram_pothineni) View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) View this post on Instagram A post shared by RambhaIndrakumar💕 (@rambhaindran_) View this post on Instagram A post shared by Raashii Khanna (@raashiikhanna) -
సినీ నటి కాజల్ అగర్వాల్ కొత్త అవతార్: అదేంటో తెలుసా?
హైదరాబాద్: ఆయుర్వేద ఉత్పత్తుల విక్రయంలో ఉన్న ద ఆయుర్వేద కంపెనీ (టీఏసీ)..సిరీస్-ఏ రౌండ్లో సినీ నటి కాజల్ అగర్వాల్ నుంచి పెట్టుబడి అందుకుంది. డైరెక్ట్-టు-కన్స్యూమర్ ఆయుర్వేద బ్రాండ్ తన సిరీస్ఏలో టాలీవుడ్ నటి కాజల్ పెట్టుబడి పెట్టినట్టు కంపెనీ తెలిపింది. ఇప్పటికే విప్రో కంజ్యూమర్ కేర్ వెంచర్స్ పెట్టుబడి పెట్టింది. ఈ-కామర్స్ పోర్టల్స్‌తోపాటు ఆఫ్‌లైన్‌లో 1,000కిపైగా కౌంటర్లలో టీఏసీ ఉత్పత్తులు లభిస్తాయి. అయుర్వేదానికి ఈ ప్రపంచాన్ని మార్చే శక్తిని కలిగి ఉందని నిజంగా తాను నమ్ముతానని కాజల్ అగర్వాల్ చెప్పారు. అందుకే ఆయుర్వేద కంపెనీ మిషన్‌లో చేరానని తెలిపారు. కాగా ఈ ఏడాది అక్టోబర్‌లో కాజల్ ‘దశపుష్పది’ ప్రొడక్ట్ ప్రకటనల ప్రచారాన్ని కూడా ప్రారంభించారు. రాబోయే తరాలకు ఆయుర్వేదం అందించే ఫలాలను అందించాలనుకుంటున్నాం. ముఖ్యంగా జీవితాన్ని మార్చే అలవాట్లు, ప్రయోజనాలను పరిచయం చేయాల్సిన సమయం ఆసన్నమైందని కంపెనీ సహ వ్యవస్థాపకుడు, సీఈవో శ్రీధా సింగ్ వెల్లడించారు. మెరుగైన జీవన నాణ్యతకు ఆయుర్వేద ఉపయోగ పడుతుందన్నారు. అలాగే కాలక్రమంలో ఆయుర్వేదానికి దూరమైపోతున్న మిలీనియల్స్‌కు శక్తివంతమైన సాంప్రదాయ వ్యవస్థను అందించాలని శ్రీధా సింగ్ పేర్కొన్నారు. . -
హా అంటారా... హడలిపోతారా!
అందాల తారలు భయపెట్టడానికి రెడీ అవుతున్నారు. ఆ అందం వెనక ఎంత ట్రాజెడీ ఉండి ఉంటే.. భయపెట్టాలనుకుని ఉంటారో ఊహించవచ్చు. అలా భయపెట్టే కథలతో కొందరు కథానాయికలు ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతున్నారు. మరి ప్రేక్షకులు ‘హా’ అంటూ హడలిపోతారా చూడాలి. ఇక ఈ హారర్ స్టోరీలపై ఓ లుక్ వేయండి. ‘మాయ’, ‘ఐరా’, ‘డోరా’... ఇలా వీలై నప్పుడల్లా వెండితెరపై ఆడియన్స్‌ని భయ పెట్టారు హీరోయిన్ నయనతార. తాజాగా నయనతార గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన మరో హారర్ మూవీ ‘కనెక్ట్’. నయనతారతో 2015లో ‘మాయ’ సినిమా తీసిన అశ్విన్ శరవణన్యే ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. అనుపమ్ ఖేర్, సత్యరాజ్ కీ రోల్స్ చేస్తున్నారు. ఈ సినిమాను త్వరలోనే రిలీజ్ చేయాలనుకుంటున్నారు. మరోవైపు హారర్ జానర్‌పై హీరోయిన్ కాజల్ అగర్వాల్ స్పెషల్ ఫోకస్ పెట్టినట్లున్నారు. ఎందుకంటే ప్రస్తుతం కాజల్ డైరీలో మూడు హారర్ సినిమాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. కాజల్ ప్రధాన పాత్రధారిగా యోగిబాబు, దర్శక–నటుడు కేఎస్ రవి కుమార్ కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘ఘోస్టీ’. హారర్ కామెడీ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందిన ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ పోలీసాఫీసర్ పాత్రలో నటించగా, కల్యాణ్ దర్శకత్వం వహించారు. ఇటీవల ఈ సినిమా టీజర్ విడుదలైంది. త్వరలోనే చిత్రాన్ని విడుదల చేయాలను కుంటున్నారు. అలాగే తమిళ దర్శకుడు డీకే దర్శకత్వంలో ‘కరుంగాప్పియమ్’ అనే హారర్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందిన సినిమాలో ఓ లీడ్ రోల్ చేశారు కాజల్ అగర్వాల్. కాజల్‌తో పాటు ఈ సినిమాలో రెజీనా, జనని, నోయిరికా, రజియా విల్సన్ నటించారు. ఈ చిత్రంలో కొన్ని అతీంద్రియ శక్తులు ఉన్న యువతి పాత్రలో కాజల్ కనిపిస్తారు. ఇక హారర్ జానర్లో వచ్చిన చిత్రాల్లో ‘చంద్రముఖి’ సినిమాను ప్రేక్షకులు ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటారు. ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘చంద్రముఖి 2’ రెడీ అవుతోంది. తొలి భాగానికి దర్శకత్వం వహించిన పి. వాసుయే మలి భాగానికి దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఫస్ట్ పార్ట్‌లో రజనీకాంత్ నటించగా, ‘చంద్రముఖి 2’లో రాఘవా లారెన్స్ మెయిన్ లీడ్ చేస్తున్నారు. ఈ సినిమాలోని ఓ హీరోయిన్ పాత్రకు కాజల్ అగర్వాల్‌ను సంప్రదించిందట చిత్ర యూనిట్. మరోవైపు వెండి తెరపై ఇప్పటివరకు గ్లామరస్‌గా కనిపించిన హన్సిక కూడా హారర్ వైపు మొగ్గుచూపుతున్నారు. ఈ మధ్య ‘గార్డియన్’ అనే హారర్ ఫిల్మ్‌కు హన్సిక సైన్ చేశారు. ఆల్రెడీ ఫస్ట్ లుక్ కూడా రిలీజైంది. శబరి–గురుశరవణన్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. అలాగే ఆర్. కన్నన్ అనే దర్శకుడు తెరకెక్కిస్తున్న హారర్ సినిమాలో కూడా హన్సిక నటిస్తున్నారు. మరో హీరోయిన్ రాయ్‌లక్ష్మీ ‘సిండ్రెల్లా’గా ప్రేక్షకులను భయపెట్టేందుకు రెడీ అయ్యారు. వినో వెంకటేశ్ దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ సినిమాలో సాక్షీ అగర్వాల్ ఓ లీడ్ రోల్ చేస్తున్నారు. ఈ సినిమాలో రాయ్‌లక్ష్మీ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. కాగా.. ‘రాజుగారి గది 2’ తర్వాత సమంత మరోసారి ప్రేతాత్మగా కనిపించనున్నారని, ఈ సినిమాకు ‘స్త్రీ’ ఫేమ్ అమర్ కౌశిక్ దర్శకత్వం వహించనున్నారని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇలా హారర్ బ్యాక్‌డ్రాప్‌లోనే మరికొందరు కథానాయికలు సినిమాలు చేస్తున్నారు. -
Kajal Agarwal: కొడుకు విషయంలో కాజల్ షాకింగ్ నిర్ణయం!
సినిమాల కోసం కాజల్ అగర్వాల్ షాకింగ్ నిర్ణయం తీసుకుంది. ఈ టాలీవుడ్ ‘చందమామ’ కి జూన్ 19న పండంటి మగ బిడ్డ జన్మించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం తన సమయమంతా కొడుకుకే కేటాయిస్తుంది ఈ బ్యూటీ. తల్లిగా తను పొందే ఆనందాన్ని అభిమానులతో పంచుకుంటుంది. దాదాపు ఏడాది పాటు సినిమాలకు దూరంగా ఉన్న కాజల్.. మళ్లీ ఇటీవల షూటింగ్‌లకు హాజరవుతుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ కమల్ హాసన్, శంకర్ కాంబోలో తెరకెక్కుతున్న ఇండియన్-2 చిత్రంలో నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ కోసం చెన్నైలో ఎక్కువ సమయం గడపాల్సి వస్తుందట. దీంతో కొడుకు బాగోగులు చూసుకోవడం కాజల్‌కు ఇబ్బంది అవుతుందట. అందుకే కుమారుడి బాధ్యతను తన చెల్లి నిషా అగర్వాల్‌కి అప్పజెప్పినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. నిషాతో పాటు ఆమె తల్లి కూడా నీల్ కిచ్లూ బాగోగులు చూసుకుంటున్నారట. ఇండియన్-2తో పాటు కాజల్ తమిళ్లో మరో సినిమా చేస్తుంది. -
కాజల్ డబుల్ రోల్లో సినిమా, ఓటీటీలో స్ట్రీమింగ్!
పెళ్లి చేసుకుని బిడ్డను కన్న తరువాత కూడా కథానాయకిగా నటించిన అతి కొద్ది మంది నటీమణుల్లో కాజల్ అగర్వాల్ ఒకరని చెప్పవచ్చు. బాలీవుడ్లో కొన్ని చిత్రాలే చేసినా దక్షిణాదిలోనే అగ్ర కథానాయికిగా రాణించిన నటి కాజల్ అగర్వాల్. ముఖ్యంగా తెలుగు, తమిళ భాష ల్లో పలు విజయవంతమైన చిత్రాల్లో నటించింది. కథానాయకిగా మంచి ఫామ్‌లో ఉండగానే ఈ బ్యూటీ పెళ్లి చేసుకుంది. ఇంకా చెప్పాలంటే 2020 అక్టోబర్‌లో ఈ భామ పెళ్లి చాలా గుంభనంగా జరిగింది. అలాగే పెళ్లయి ఏడాది తిరగకుండానే బిడ్డకు తల్లి అయ్యింది. తల్లి అయిన కొద్ది రోజులకే మళ్లీ నటించడానికి సిద్ధమైపోయింది. ప్రస్తుతం ఈమె శంకర్ దర్శకత్వంలో కమలహాసన్ సరసన ఇండియన్– 2 చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రం కోసం కాజల్ చాలా కసరత్తులనే చేసింది. ముఖ్యంగా గురప్రు స్వారీ, కత్తి సాము, విలు విద్యల్లో తగిన శిక్షణ తీసుకుంది. లేకపోతే ఈ బ్యూటీ తాజాగా మరో చిత్రంలో కథానాయికిగా నటిస్తోంది. కల్యాణ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి ఘోస్టీ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. విశేషం ఏమిటంటే ఇందులో కాజల్ అగర్వాల్ తొలిసారిగా ద్విపాత్రాభినయం చేయడం. గ్లామర్‌ను తట్టి లేపే సినీ తారగా, లాఠీని పట్టే పోలీస్ అధికారిగా రెండు వైవిధ్య భరిత పాత్రలను ఇందులో ఆమె పోషించింది. ఇతర ముఖ్యపాత్రలో నటుడు యోగిబాబు, దర్శకుడు కేఎస్.రవికుమార్, రెండిన్ కింగ్ల్సీ, తంగదురై, జగన్ ఊర్వశి, ఆడుగళం నరేన్ మనోబాల, మొట్టై రాజేంద్రన్ తదితరులు నటించారు. దీన్ని సీడ్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తోంది. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలో ఓటీటీ ప్లాట్ ఫామ్‌లో స్ట్రీమింగ్కు సిద్ధమవుతున్నట్లు సమాచారం. చిత్ర టీజర్‌ను ఇటీవల విడుదల చేయగా మంచి స్పందన వచ్చింది. కాగా ఇందులోని కొన్ని అందమైన ఫొటోలను నటి కాజల్ అగర్వాల్ తన ఇన్‌స్ర్ట్రాగామ్‌లో పోస్ట్ చేసి బ్రహ్మ సృష్టించిన వాటిలో అందం ఒకటి అని పేర్కొంది. ఈ ఫొటోలు ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. కాగా వివాహానంతరం కాజల్ అగర్వాల్ నటించి విడుదలకు సిద్ధం అవుతున్న రెండో చిత్రం ఇది. -
సమంత లాగే కాజల్ కూడా ఆ పార్టుకి సర్జరీ చేయించుకుందా?
సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్లు తమ అందాన్ని పెంచుకోవడం కోసం రకరకాల వర్కౌట్లు చేస్తుంటారు. వీటితో పాటు సర్జరీలు చేయించుకోవడానికి కూడా ఏమాత్రం ఎనక్కి తగ్గరు. ఇప్పటికే చాలామంది హీరోయిన్లు ముక్కు, పెదాలు, చిన్ సర్జరీ చేయించుకొని ముఖంలో కొత్త మెరుపులు కొనితెచ్చుకున్నారు. ఇక మొన్నటికి మొన్న సమంత కూడా ముఖానికి సర్జరీ చేయించుకుందని వార్తలు వచ్చాయి. రీసెంట్గా విడుదలైన యాడ్‌షూట్‌లో సామ్ లుక్ కాస్త డిఫరెంట్‌గా కనిపించింది. దీంతో అమెరికాకు వెళ్లి సర్జరీ చేయించుకుందంటూ టాక్ వినిపిస్తుంది. తాజాగా ఈ జాబితాలో మరో స్టార్ హీరోయిన్ కూడా చేరింది. చందమామ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయం అయిన కాజల్ అగర్వాల్ రీసెంట్గా కాస్మొటిక్ సర్జరీ చేయించుకుందని తెలుస్తుంది. ప్రస్తుతం మాతృత్వపు మాధుర్యాన్ని అనుభవిస్తున్న కాజల్ ముఖంలో ఆ తేడా స్పష్టంగా కనిపిస్తుంది. ఇంతకుముందు కంటే ముఖం కాస్త బొద్దుగా మారడంతో పాటు లిప్స్ కూడా లావుగా కనిపిస్తున్నాయని, సర్జరీ వల్లే ఇలా అయ్యిందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఇందులో ఎంతవరకు నిజం ఉందన్నది తెలియాల్సి ఉంది.