Teja
-
సినీ ప్రేక్షకులకు థియేటర్లకు రప్పించేది అదే: డైరెక్టర్ తేజ
సన్నీ అఖిల్, అజయ్ ఘోష్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిస్తోన్న చిత్రం "పోలీస్ వారి హెచ్చరిక ". దర్శకుడు బాబ్జీ దర్శకత్వంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. తూలికా తనిష్క్ క్రియేషన్స్ పతాకంపై బెల్లి జనార్థన్ నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీ టైటిల్ లోగోను టాలీవుడ్ డైరెక్టర్ తేజ ఆవిష్కరించారు.ఈ సందర్భంగా దర్శకుడు తేజ మాట్లాడుతూ.. "ఏ సినిమాకైన ప్రేక్షకులను ఆకర్షించేది. వారిని థియేటర్ల వద్దకు రప్పించేలా చేసేది టైటిల్ మాత్రమే. ఈ పోలీస్ వారి హెచ్చరిక అనే టైటిల్ కూడా అలాంటిదే. ఈ టైటిల్ దర్శక నిర్మాతలకు మంచి విజయాన్ని అందిస్తుంది" అని అన్నారు. దర్శకుడు తేజ గారి చేతుల మీదుగా మా సినిమా పోస్టర్ ఆవిష్కరించడం మాకు చాలా సంతోషంగా ఉందని నిర్మాత బెల్లి జనార్థన్ పేర్కొన్నారు. ఈ సినిమా షూటింగ్ రెండు తెలుగు రాష్ట్రాల్లోని అద్భుతమైన లొకేషన్స్‌లో పూర్తి చేశామని తెలిపారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుందని.. రిలీజ్ తేదీని త్వరలోనే ప్రకటిస్తామన్నారు. కాగా.. ఈ చిత్రంలో రవి కాలే , గిడ్డేశ్ , శుభలేఖ సుధాకర్ , షియాజీ షిండే , హిమజ , జయవాహినీ , శంకరాభరణం తులసి , ఖుషి మేఘన , రుచిత , గోవింద , హనుమ, బాబురాం కీలక పాత్రలు పోషిస్తున్నారు. -
Funday Story: బాలిశెట్టి అహం..!
బాలిశెట్టి.. కిరాణా కొట్టు వ్యాపారి. నిత్యావసర సరుకులు బియ్యం, బెల్లం, పప్పు, ఉప్పు, చింతపండు వంటివి అమ్మేవాడు. వ్యాపారం బాగా సాగటంతో చేతికింద పనివాడిని పెట్టుకోవాలని అనుకున్నాడు. పక్క గ్రామంలో ఉండే నర్సయ్య పనికి కుదిరాడు. బాలిశెట్టికి తన కింద పనిచేసేవారంటే చులకన ఎక్కువ. తన ముందు వాళ్లు దేనికీ సరితూగరనీ, ఎందుకూ పనికిరారనే అహంతో ఉండేవాడు. నర్సయ్యది కష్టపడి పనిచేసే స్వభావం. దుకాణం తెరిచినప్పటి నుండి మూసేవరకు బాలిశెట్టి చెప్పే రకరకాల పనులన్నిటినీ కాదనకుండా చేసేవాడు. దుకాణంలో దుమ్ము దులపడం, సరుకులు పొట్లాలు, మూటలు కట్టడం చేసేవాడు. అతనికి ఏమాత్రం విరామం దొరికినా.. పప్పులు, బియ్యంలో ఉండే రాళ్లు ఏరమని పురమాయించేవాడు బాలిశెట్టి. ఎంతపని చేసినా తృప్తి ఉండేది కాదు. పని వేళలు ముగిసి నర్సయ్య ఇంటికి వెళ్లబోతుంటే ఉల్లిగడ్డల బస్తాను కరణం గారింట్లోనో, బియ్యం బస్తాను మునసబు గారింట్లోనో వేసి పొమ్మనేవాడు. ఇంటికి ఆలస్యం అవుతుంది, మరునాడు వేస్తానంటే కించపరుస్తూ, వెక్కిరిస్తూ మాట్లాడేవాడు. బాలిశెట్టి కూతురు పెళ్ళీడు కొచ్చింది. చదువుకున్న పిల్ల కావటంతో మంచి సంబంధం కుదిరింది. నర్సయ్యను దుకాణం పనులతోపాటు, పెళ్ళి పనులకూ తిప్పుకోవటం మొదలుపెట్టాడు. దాంతో ఏ అర్ధరాత్రో ఇంటికి చేరేవాడు నర్సయ్య. ఇంట్లోవాళ్ళు బాలిశెట్టి దగ్గర పని మానేయమని ఒత్తిడి చేశారు. పెళ్ళికి మూడురోజుల ముందు బాలిశెట్టి ఇంట్లో దొంగలు పడి ఉన్న నగలు, నగదు దోచుకుపోయారు. కూతురు పెళ్లి ఆగిపోతుందని బాలిశెట్టి భయపడి నర్సయ్యకు చెప్పుకుని భోరున ఏడ్చాడు. ‘అయ్యా! మీరేం కంగారు పడకండి. మీకు అభ్యంతరం లేకపోతే పెళ్లి ఖర్చులు నేను సర్దుతాను’ అన్నాడు నర్సయ్య. ఆమాటకు బాలిశెట్టి ఆశ్చర్యపోయాడు. నర్సయ్యకు తన ఊరిలో పదిహేను ఎకరాల మాగాణి, ఇరవై ఎకరాల మామిడితోట, సొంత ఇల్లు ఉంది. ఇప్పుడు కొడుకు వ్యవసాయం పనులు చూసుకుంటున్నాడు. అతనికి ఇంట్లో కూర్చోని విశ్రాంతి తీసుకోవటం ఇష్టంలేకనే బాలిశెట్టి వద్ద పనిలో చేరాడని తెలిసింది. తన కూతురు పెళ్లికి నగదు సహాయం చేశాడు నర్సయ్య. ఆనాటి నుండి ఇతరులను తక్కువ అంచనా వేయటం, చులకనగా చూడటం మానేశాడు బాలిశెట్టి. — తేజశ్రీ -
నేను సాధించగలను అనే పట్టుదల ఉన్న వారికి ఏ ఫీల్డ్ అయినా ఒకటే
ఫీల్డ్ మారడం అనేది మంచి నీళ్లు తాగినంత సులభం కాదు.కాస్త అటూ ఇటూ అయితే మూడు చెరువుల నీళ్లు తాగాల్సి ఉంటుంది.‘నేను సాధించగలను’ అనే పట్టుదల ఉన్న వారికి మాత్రం ఏ ఫీల్డ్ అయినా ఒకటే. అలాంటి ప్రతిభావంతులలో తేజ ఒకరు. ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్‌గా పనిచేసిన తేజ ఐటీ రంగంలోకి అడుగుపెట్టి టెక్ లీడర్‌గా మంచి పేరు సంపాదించింది. కర్ణాటకలోని బెల్గాంలో పెరిగిన తేజ మనకమె డాక్టర్ అయిన తండ్రి నుంచి విజ్ఞానప్రపంచానికి సంబంధించిన ఎన్నో విషయాలు తెలుసుకునేది. డిఐవై (డూ ఇట్ యువర్ సెల్ఫ్) పాజెక్ట్స్ చేసేది. కర్ణాటక యూనివర్శిటీలో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ కోర్సు చేసింది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ తొలిసారిగా నాన్–మెడికల్ ఏరియాలలో మహిళల కోసం ద్వారాలు తెరుస్తున్న సమయం అది. తన సీనియర్స్ ఎయిర్ ఫోర్స్‌లో చేరిపోయారు. వారిని యూనిఫామ్‌లో చూడడం తేజాకు ఎగ్టయిటింగ్గా అనిపించింది. వారి స్ఫూర్తితోనే ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లోకి వచ్చింది. బెంగళూరులోని ఎయిర్ ఫోర్స్ టెక్నికల్ కాలేజీలోప్రాథమిక శిక్షణ తరువాత మౌంట్ అబూలో పాస్టింగ్ ఇచ్చారు. మౌంట్ అబూ స్టేషన్‌లోని ఉద్యోగులలో ఇద్దరు మాత్రమే మహిళలు. అందులో తాను ఒకరు. మహిళల కోసం ప్రత్యేక వాష్ రూమ్స్ ఉండేవి కావు. ఇలాంటి సమస్యలు ఎన్ని ఉన్నా ఎప్పుడూ నిరాశపడేది కాదు తేజ,మౌంట్ అబూ తరువాత నాసిక్, బెంగళూరులలో కూడా పనిచేసింది. మన దేశాన్ని ఐటీ బూమ్ తాకిన సమయం అది.ఐటీ ఫీల్డ్‌లో ఉన్న సోదరుడు తేజాతో ఆ రంగానికి సంబంధించి ఎన్నో విషయాలు పంచుకునేవాడు. దీంతో ఐటీ రంగంపై తనకు ఆసక్తి పెరిగింది. అలా ఎయిర్ ఫోర్స్‌ను వదిలి ఐటీ రంగంలోకి అడుగు పెట్టింది. టీసీఎస్(టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్)లో డెవలపర్‌గా చేరింది. ఫ్రెషర్‌గా ఐటీ రంగంలో కెరీర్ మొదలు పెట్టిన తేజ అక్కడ ఎన్నో విషయాలు నేర్చుకుంది. ఆ తరువాత టెక్నాలజీస్‌లో పనిచేసింది. 2005లో డెల్ టెక్నాలజీలో మేనేజర్‌గా చేరింది. ఒక్కోమెట్టు ఎక్కుతూ కంపెనీ వైస్ ప్రెసిడెంట్ (ఐటీ) స్థాయికి చేరింది. జెండర్ స్టీరియో టైప్స్‌ను బ్రేక్ చేస్తూ డెల్ ఐటీ–ఇండియాలో కీలక స్థానంలో చేరిన తొలి మహిళగా గుర్తింపు ΄పోందింది.డెల్ ఫౌండేషన్‌లో సేల్స్ అండ్ మార్కెటింగ్, సప్లై చైన్, డేటా సైన్స్... మొదలైన విభాగాల్లో పట్టు సాధించింది. సీఎస్ఆర్ యాక్టివిటీస్‌పై బాగా ఆసక్తి చూపేది. ‘టెక్నాలజీ సహాయంతో ఎన్నో మంచిపనులు చేయవచ్చు’ అంటున్న తేజ రకరకాల స్వచ్ఛంద సంస్థలతో కలిసి ఎన్నో మంచి కార్యక్రమాలు చేసింది. కోవిడ్ మహమ్మారి సమయంలో బుద్ద ఫౌండేషన్‌తో కలిసి వలస కార్మికులకు పునరావాసం కల్పించింది.‘ప్రతి మహిళకు ఒక రోల్‌మోడల్, మెంటర్ ఉండాలి. అప్పుడే ఎన్నో విజయాలు సాధించగలరు’ అంటున్న తేజ డెల్లో ‘మెంటర్ సర్కిల్ కాన్సెప్ట్’ను అమలు చేసింది. ప్రతి సర్కిల్లో కొందరు మహిళలు ఉంటారు. వారికో మెంటర్ ఉంటారు. ఈ సర్కిల్లో తమ సమస్యలను చర్చించుకోవచ్చు, సలహాలు తీసుకోవచ్చు. ఒకరికొకరు సహాయంగా నిలవచ్చు. ‘ఇంజినీరింగ్ కాలేజీలో క్లాసులో నలుగురు అమ్మాయిలు మాత్రమే ఉండేవాళ్లం. ఇప్పటి పరిస్థితి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మా కుటుంబంలో నేను ఫస్ట్ ఉమెన్ ఇంజనీర్ని. ఇప్పుడు ఎంతోమంది ఉన్నారు. ఒక ముక్కలో చెపాలంటే సమాజంలో చాలా మార్పు వచ్చింది. ఇది ఆహ్వానించదగిన మార్పు. నేను నేర్చుకున్న విషయాల ద్వారా ఇతరులకు ఏ రకంగా సహాయం చేయగలను అని ఎప్పటికప్పుడు ఆలోచిస్తుంటాను. టైమ్ మేనేజ్మెంట్కు సంబంధించి ఎన్నో సమావేశాలు నిర్వహించాను’ అంటుంది తేజ. -
గ్యాంగ్‌స్టర్ రాక్షస రాజా
రానా హీరోగా తేజ దర్శకత్వంలో వచ్చిన ‘నేనే రాజు నేనే మంత్రి’ (2017) సూపర్ హిట్ అయిన సంగతి గుర్తుండే ఉంటుంది. ఈ కాంబినేషన్లో రెండో చిత్రం రూపొందనున్న విషయం తెలిసిందే. రానా పుట్టినరోజు (డిసెంబర్ 14) సందర్భంగా ఈ చిత్రం టైటిల్‌ని ‘రాక్షస రాజా’గా ప్రకటించి, రానా ఫస్ట్ లుక్‌ని విడుదల చేశారు. ‘‘ఇప్పటివరకూ చూడని క్రైమ్ వరల్డ్‌ని ఆవిష్కరిస్తూ ఇంటెన్స్ ఎమోషన్స్, ఫ్యామిలీ డ్రామాల సమ్మేళనంతో ఈ చిత్రం ఉంటుంది. గ్యాంగ్‌స్టర్ డ్రామాగా రూపొందించనున్న ఈ చిత్రం ప్రేక్షకులను ఓ అద్భుతమైన అనుభూతికి గురి చేస్తుంది. గ్రిప్పింగ్ కథనం, వండర్ఫుల్ విజువల్స్‌తో ‘రాక్షస రాజా’ తెలుగు పరిశ్రమలో కొత్త బెంచ్ మార్క్‌ను సెట్ చేయడానికి రెడీ అవుతోంది’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. -
‘రాక్షస రాజు’గా వస్తున్న రానా.. లుక్ అదిరింది
టాలీవుడ్ మల్టీ టాలెంటెడ్ నటుల్లో రానా దగ్గుబాటి ఒకరు. ఒకవైపు నటుడిగా వైవిధ్యమైన పాత్రల్లో నటిస్తూనే..మరోవైపు నిర్మాతగానూ రాణిస్తున్నాడు. అయితే ఈ టాలెంటెడ్ హీరో ఖాతాలో మాత్రం ఇటీవల ఒక్క హిట్ కూడా పడలేదు. బాహుబలి తర్వాత పలు సినిమాల్లో నటించినా.. ఆ స్థాయి గుర్తింపు, విజయం మాత్రం రాలేదు. అందుకే ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టాలనే కసితో తనకు ‘నేనే రాజు నేనే మంత్రి’ బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన దర్శకుడు తేజతో జత కట్టాడు. నేడు(డిసెంబర్ 14)రానా పుట్టిన రోజు. ఈ సందర్భంగా రానా-తేజ కాంబోలో తెరకెక్కుతున్న కొత్త సినిమా పోస్టర్ని రిలీజ్ చేశారు. ఈ సినిమాకు‘రాక్షస రాజా’అనే టైటిల్‌ని ఖరారు చేశారు. పోస్టర్లో రానా గన్ పట్టుకుని వైల్డ్ లుక్ లో కనిపిస్తున్నారు.గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామాగా రాక్షసరాజా మూవీ తెరకెక్కబోతున్నట్లు సమాచారం. ఇందులో రానా పాత్ర నెగెటివ్ షేడ్స్‌తో ఉంటుందని ప్రచారం జరుగుతోంది. ఇప్పటివరకు చేయని కొత్త పాత్రలో అతడు కనిపించబోతున్నట్లు చెబుతున్నారు. పాన్ ఇండియన్ మూవీగా రాక్షసరాజాను రూపొందించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. రాక్షసరాజా సినిమాలో హీరోయిన్‌తో పాటు ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణులు ఎవరన్నది త్వరలోనే ప్రకటించబోతున్నారు. -
కోడిబాయె లచ్చమ్మది
దినేష్ తేజ్, హెబ్బా పటేల్ జంటగా నటించిన చిత్రం ‘అలా నిన్ను చేరి’. కొమ్మాల పాటి శ్రీధర్ సమర్పణలో మారేష్ శివన్ దర్శకత్వంలో కొమ్మాలపాటి సాయి సుధాకర్ నిర్మించిన ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది. ఈ సినిమాలోని మాస్ సాంగ్ ‘కోడిబాయె లచ్చమ్మది..’ని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విడుదల చేసి, మాట్లాడుతూ – ‘‘యంగ్ టాలెంట్ తీసే చిత్రాలను ప్రేక్షకులు ఆదరిస్తుంటారు. ఈ చిత్రాన్ని కూడా ఆదరించాలి. సినిమా పెద్ద హిట్టవ్వాలి’’ అన్నారు. సుభాష్ ఆనంద్ స్వరపరచిన ‘కోడిబాయె..’ పాటను మంగ్లీ పాడగా, భాను నృత్యరీతులు సమకూర్చారు. ‘‘ఈ పాటలో దినేష్ తేజ్, హెబ్బా పటేల్‌ల మాస్ స్టెప్స్ ఆకట్టుకునే విధంగా ఉంటాయి. తెలంగాణ నుంచి మరో జానపదం చార్ట్ బస్టర్‌గా నిలవనుంది. సినిమాలోని అన్ని పాటలనూ చంద్రబోస్ గారు రాశారు ’’ అని యూనిట్ పేర్కొంది. -
తలకిందులుగా వేలాడదీసి..కింద మంట పెట్టి...
మందమర్రి రూరల్: మంచిర్యాల జిల్లా మందమర్రిలో దారుణం చోటు చేసుకుంది. మేకలు దొంగతనం చేశారని ఇద్దరు యువకులను కట్టేసి చిత్రహింసలు పెట్టారు. తలకిందులుగా వేలాడదీసి, కింద మంటపెట్టి నరకం చూపించారు. అవమానం భరించలేక ఓ యువకుడు కనిపించకుండా పోయాడు. అతని చిన్నమ్మ శనివారం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో ఆలస్యంగా విషయం వెలుగులోకి వచ్చింది. మందమర్రి పోలీస్ స్టేషన్ పరిధిలోని యాపల్ ఏరియా సమీపంలోని అబ్రహం నగర్‌కు చెందిన చాకలి రాములుకు కొన్ని మేకలు ఉన్నాయి. ఆ మేకలను కాసేందుకు తేజ అనే యువకుడిని కూలీగా పెట్టుకున్నాడు. అయితే మేకల షెడ్డు వద్ద ఉన్న ఓ పైపు, ఒక మేక ఇటీవల చోరీ అయ్యాయి. అదే ఏరియాకు చెందిన కిరణ్ ఈ పని చేసి ఉంటాడన్న అనుమానంతో రాములు పిలిచి ప్రశ్నించాడు. దీంతో తడబడిన కిరణ్ పైపు దాచిన చోటు చూపించాడు. తర్వాత చోరీ అయిన మేక గురించి కూడా ఆరా తీయగా స్థానికులు మేకను కూడా కిరణే ఎత్తుకెళ్లి అమ్ముకున్నాడని ఆరోపించారు. దీంతో ఆగ్రహించిన రాములు నిందితుడిని తాళ్లతో కట్టేసి తలకిందులుగా వేలాడదీసి చిత్రహింసలు పెట్టాడు. అంతటితో ఆగకుండా కింద మంట పెట్టాడు. చిత్రహింస భరించలేక కిరణ్, తనకు మేకల కాపరి తేజ సహకరించాడని చెప్పాడు. దీంతో అతడిని కూడా తీసుకువచ్చి షెడ్డులో కట్టేసి రాములు, అతని కుటుంబ సభ్యులు చిత్రహింసలు పెట్టారు. తర్వాత పెద్దమనుషుల వద్ద పంచాయితీ పెట్టగా మేకకు రూ.6 వేలు ఇవ్వాలని తీర్మానం చేశారు. ఇందుకు నిందితులు అంగీకరించారు. కిరణ్ చిన్నమ్మ ఫిర్యాదుతో.. ఘటన అనంతరం అవమాన భారంతో కిరణ్ కనిపించకుండాపోయాడు. దీంతో రాములు, అతని కొడుకు శ్రీనివాస్, భార్య స్వరూప, అతని వద్ద పనిచేసే నరేశ్ రెండు రోజుల క్రితం తన అక్క కొడుకు కిరణ్‌ను తీవ్రంగా హింసించారని కిరణ్ చిన్నమ్మ నిట్టూరి సరిత శనివారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ అవమానం భరించలేక తన అక్క కొడుకు కిరణ్ కనిపించకుండా పోయాడని తెలిపింది. కిరణ్ దళితుడు కావడంతో నిందితులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు ఎస్సై చంద్రకుమార్ పేర్కొన్నారు. ఘటన స్థలాన్ని బెల్లంపల్లి ఏసీపీ పంతాటి సదయ్య శనివారం పరిశీలించారు. -
ఆ ఒక్క తప్పు వల్లే నా లైఫ్ ఇలా ఉంది
-
ఫుట్ బాల్ నేపథ్యంలో ‘డ్యూడ్’
యంగ్ హీరో తేజ్ నటిస్తున్న ద్విభాషా చిత్రం ‘డ్యూడ్’. తెలుగు - కన్నడ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని పనరోమిక్ స్టూడియోస్ పతాకంపై తేజ్ స్వయంగా నిర్మిస్తుండడమే కాకుండా... స్వయంగా కథను అందించి, దర్శకత్వం వహిస్తుండడం విశేషం. తేజ్ ఇంతకుముందు ‘రామాచారి’ అనే హిట్ చిత్రంలో నటించారు. తను తాజాగా నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘గాడ్’ ప్రి - ప్రొడక్షన్ లో ఉంది. ఇప్పటివరకు కొన్ని వేల ప్రేమ కథా చిత్రాలు వచ్చాయి. కానీ పూర్తి ఫుట్ బాల్ నేపథ్యంలో ఇప్పటివరకు ఏ తెలుగు, కన్నడ భాషల్లో సినిమా రాలేదు. అందువల్లే... కర్ణాటకలోని ‘కిక్ స్టార్ట్’ అనే సుప్రసిద్ధ ఫుట్ బాల్ క్లబ్... ‘డ్యూడ్’ చిత్రానికి పూర్తి సహాయసహకారాలు అందిస్తోంది. అక్టోబర్ లో సెట్స్ కు వెళ్లనున్న ఈ చిత్రానికి కన్నడ - మలయాళ భాషల్లో సుపరిచితుడైన ఇమిల్ మొహమ్మద్ సంగీతం సమకూర్చుతుండగా... నాని కెరీర్ కి తిరుగులేని పునాది వేసిన "అలా మొదలైంది" చిత్రానికి ఛాయాగ్రహణం అందించిన ప్రేమ్ కెమెరా బాధ్యతలు నిర్వహించనున్నారు. -
Ahimsa Movie Review: ‘అహింస’ మూవీ రివ్యూ
టైటిల్: అహింస నటీనటులు: అభిరామ్ దగ్గుబాటి, గీతికా తివారి, సదా, కల్పలత, కమల్ కామరాజు, దేవి ప్రసాద్ తదితరులు నిర్మాత : పి.కిరణ్ దర్శకత్వం : తేజ సంగీతం: ఆర్పీ పట్నాయక్ సినిమాటోగ్రఫీ: సమీర్ రెడ్డి ఎడిటర్ : కోటగిరి వెంకటేశ్వరరావు విడుదల తేది : జూన్ 2, 2023 తెలుగు చిత్ర పరిశ్రమలో దగ్గుబాటి ఫ్యామిలీకి ప్రత్యేక స్థానం ఉంది. రామా నాయుడు మొదలు రానా వరకు ఆ ఫ్యామిలీకి చెందిన ప్రతి ఒక్కరు తమదైన టాలెంట్‌తో ఇండస్ట్రీలో స్పెషల్ ఇమేజ్‌ని క్రియేట్ చేసుకున్నారు. అలాంటి ఫ్యామిలీ నుంచి ఓ మరో హీరో ఎంట్రీ ఇవ్వబోతున్నారంటే.. ఆ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడడం సహజం. అందుకే ‘అహింస’పై మొదటి నుంచి భారీ అంచనాలు ఉన్నాయి. సురేశ్ బాబు తనయుడు, రానా తమ్ముడు అభిరామ్ నటించిన ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి అభిరామ్ డెబ్యూ మూవీ ఎలా ఉంది? రివ్యూలో చూద్దాం. కథేంటంటే.. రఘు(అభిరామ్) ఓ పేద రైతు. తల్లిదండ్రులు చిన్నప్పుడు చనిపోవడంతో మేన మామ, అత్త(దేవీ ప్రసాద్, కల్పలత)దగ్గర పెరుగుతాడు. రఘు మరదలు అహల్య(గీతికా తివారి)కి బావ అంటే చాలా ఇష్టం. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలనుకుంటారు. ఓ రోజు అహల్య పొలం దగ్గరు ఉన్న రఘుకి టిఫిన్ బాక్స్ ఇచ్చి వెళ్తుంటే.. సిటీకి చెందిన ఇద్దరు కుర్రాళ్లు ఆమెపై హత్యాచారానికి పాల్పడుతారు. అనంతరం దారుణంగా కొట్టి అడవిలో పడేసి వెళ్తారు. తన మరదలికి జరిగిన అన్యాయంపై న్యాయ పోరాటం చేస్తాడు రఘు. అతని ఓ మహిళా లాయర్ లక్ష్మీ(సదా)తోడుగా నిలుస్తుంది. నిందితులిద్దరూ బడా వ్యాపారవేత్త ధనలక్ష్మి దుష్యంతరావు(రజత్ బేడీ) కొడుకులు కావడంతో ధర్మ పోరాటంలో రఘు ఓడిపోతారు. అంతేకాదు తనకు సహాయం చేసిన లాయర్ లక్ష్మీ, ఆమె భర్తను ధనలక్ష్మీ దుష్కంతరావు దారుణంగా చంపేస్తాడు. అహింసా మార్గంలో వెళ్తే తనకు న్యాయం జరగది భావించిన రఘు.. హింసని ఎంచుకుంటాడు. తన మరదలిపై హత్యాచారానికి పాల్పడిన దుండగులను చంపేయాలని డిసైడ్ అవుతాడు. దాని కోసం రఘు ఏం చేశాడు? వారిని ఎలా చంపాడు? అడవుల్లో గంజాయి సాగు చేసే లుంబ్డి గ్యాంగ్.. రఘును చంపాలని ఎందుకు ప్రయత్నించింది? దుష్కంతరావు కనబడకుండా పోవడానికి కారణం ఏంటి? అనేది తెలియాలంటే థియేటర్లో అహింస మూవీ చూడాల్సిందే. ఎలా ఉందంటే.. టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్స్‌లో తేజ ఒకరు. ఒకప్పుడు ఆయన సినిమాలు ఇండస్ట్రీలో రికార్డులు సృష్టించాయి. ఎంతో మంది హీరోలను తెలుగు తెరకు పరిచయం చేశాడు. చిత్రం, నువ్వు నేను, జయం లాంటి బ్లాక్ బస్టర్స్ అందించాడు. ఇక తేజ పని అయిపోందిలే అనుకుంటున్న సమయంలో రానాతో ‘నేనే రాజు నేను మంత్రి’ సినిమా తీసి మళ్లీ పుంజుకున్నాడు. ఆ తర్వాత ‘సీత’లాంటి డిజాస్టర్ మూవీని ఇచ్చినా.. ఈ సారి బ్లాక్ బస్టర్ పక్కా ఇస్తాడులే అని అభిమానులు ఎంతో నమ్మకంగా ఉన్నారు. కానీ తేజ వారి నమ్మకాన్ని కాపాడుకోలేకపోయాడనిపిస్తుంది. పాత కథ, రొటీన్ స్క్రీన్‌ప్లేతో ‘అహింస’ను తెరకెక్కించాడు. చాలా సన్నివేశాలు తేజ తెరకెక్కించిన ‘జయం’, ‘నువ్వు నేను’ ‘ధైర్యం’ చిత్రాలను గుర్తుకు తెస్తాయి. ఇక లాజిక్కుల గురించి మాట్లాడుకోకపోవడం మంచిదేమో. కానిస్టేబుల్ పతంగి ఎగిరేసి అడవిలో ఉన్న హీరోకి సమాచారం అందించడం, కోర్టులోకి హీరో ప్రవేశించిన తీరు, సాక్ష్యాల కోసం హీరో చేసే ప్రయత్నాలు.. ఇలా ఏ ఒక్కటి రియలిస్టిక్‌గా ఉండదు. పైగా కథ మొత్తాని లాగినట్లుగా అనిపిస్తుంది. సెకండాఫ్‌లో వచ్చే ఐటమ్ సాంగ్ అయితే మరీ దారుణం. ఇంట్లో శవాలను పెట్టుకొని ఐటమ్ పాట పాడించడం ఏంటో ఎవరీ అర్థం కాదు. అలాగే ఓ కానిస్టేబుల్ ఎందుకు వారికి సపోర్ట్‌గా నిలిచాడో అదీ తెలియదు. ఫస్టాఫ్ ఎండింగ్ సమయంలోనే క్లైమాక్స్ అర్థమైపోతుంది. సెకండాఫ్‌లో కథ మరీ సాగదీసినట్లుగా అనిపిస్తుంది. ఒకనొక దశలో సినిమా ఇంకా అయిపోవట్లేదే అనే ఫీలింగ్ కలుగుతుంది. మొత్తంగా అహింస పేరుతో తేజ ప్రేక్షకులను హింసించారనే చెప్పాలి. ఎవరెలా చేశారంటే.. అభిరామ్‌కు ఇది తొలి సినిమా. ఉన్నంతలో రఘు తన పాత్రకు న్యాయం చేసేందుకు ట్రై చేశాడు. తేజ కూడా అభిరామ్‌పై పెద్దగా భారం వేయకుండా సన్నివేశాలను రాసుకున్నాడు. కానీ కొన్ని చోట్ల అభిరామ్ అనుభవలేమి కొట్టొచ్చినట్లు కనిపించింది. ఇక అహల్యగా గీతికా తివారి తనదైన నటనతో మెప్పించింది. తెరపై చాలా అందంగా కనిపించింది. పోలీస్ ఆఫీసర్‌గా కమల్ కామరాజు, లాయర్‌గా సదా తన పాత్రలకు న్యాయం చేశారు. విలన్‌గా నటించిన రజత్ బేడి, ఛటర్జీ పాత్ర పోషించిన వ్యక్తితో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. ఇక సాంకేతిక విషయాలకొస్తే.. ఆర్పీ పట్నాయక్ సంగీతం పర్వాలేదు. ‘ఉందిలే’ పాట మినహా మిగతావేవి అంతగా ఆకట్టుకోలేవు. సమీర్ రెడ్డి సినిమాటోగ్రపీ బాగుంది. ఎడిటర్ తన కత్తెరకు చాలా పని చెప్పాల్సింది. ముఖ్యంగా సెకండాఫ్‌లో చాలా సన్నివేశాలను మరింత క్రిస్పీగా కట్ చేయాల్సింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లుగా ఉన్నాయి. -
మీరు కూడా RGV లాగా మారిపోయారా ..!
-
వెంకటేష్,అభిరాం,నాగచైతన్యతో అసలు సినిమా చేయను ....
-
హీరోయిన్ గా తెలుగు అమ్మాయిలను ఎందుకు తీసుకోను అంటే..!
-
థియేటర్ లో పాప్ కార్న్ రేట్ల పై తేజ సంచలన కామెంట్స్
-
తేజ్ కామెడీ పంచెస్ చూస్తే నాన్ స్టాప్ గ నవ్వుతూనే ఉంటారు
-
రానాతో నెక్ట్స్ మూవీని అనౌన్స్ చేసిన డైరెక్టర్ తేజ
డైరెక్టర్ తేజ తెరకెక్కించిన లేటెస్ట్ మూవీ అహింస. ఈ సినిమాతో దగ్గుబాటి అభిరామ్‌ను హీరోగా పరిచయం చేస్తున్నారు. ఈ మూవీ అనంతరం తన నెక్ట్స్ మూవీ రానాతో చేస్తానని తేజ ప్రకటించారు. అహింస ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడిన ఆయన ఈ మేరకు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. 'రానాతో నేను చేయబోయే సినిమా పేరు రాక్షస రాజు. ఈ సినిమాతో 45మంది కొత్త ఆర్టిస్టులను పరిచయం చేయాలని అనుకుంటున్నాను. ఆసక్తి ఉన్న వాళ్లు ఇన్స్టాగ్రామ్ ద్వారా నన్ను సంప్రదించవచ్చు. రామానాయుడు స్వస్థలమైన చీరాల నుంచి కనీసం 10మంది ఆర్టిస్టులు కావాలి. త్వరలోనే ఈ మూవీ షూటింగ్ ప్రారంభం కానుంది' అంటూ తేజ వెల్లడించారు. గతంలో రానా-తేజ కాంబినేషన్లో వచ్చిన నేనే రాజు నేనే మంత్రి మూవీ సూపర్ సక్సెస్ అయిన సంగతి తెలిసిందే. దీంతో రాక్షస రాజు మూవీపై మరింత ఆసక్తి నెలకొంది. ఈ చిత్రంలో ప్రముఖ మలయాళ హీరో కీలక పాత్రలో నటించనున్నట్లు సమాచారం. -
అమ్మా, నాన్న చనిపోతే.. వారే అంతా పంచుకున్నారు: తేజ
దగ్గుబాటి అభిరామ్ హీరోగా ఎంట్రీ ఇస్తున్న చిత్రం 'అహింస'. ఈ సినిమాలో గీతికా తివారి హీరోయిన్గా నటిస్తోంది. విభిన్న కథనాలతో సినిమాలను తెరకెక్కించే తేజ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా జూన్ 2న విడుదల థియేటర్లలో కానుంది. ఈ సందర్భంగా మూవీ ప్రమోషన్స్ కార్యక్రమాలతో బిజీగా ఉన్నారు తేజ. (ఇది చదవండి: ఉదయ్‌కిరణ్ డెత్ మిస్టరీ.. ఏమీ తెలియనట్లు నటిస్తున్నారు: తేజ) తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన తన బాల్యంలో ఎదురైన ఇబ్బందులను పంచుకున్నారు. తన చిన్నప్పుడు ఫుట్ పాత్ మీద పడుకున్న రోజుల గురించి తెలిపారు. చిన్నప్పుడే తల్లిదండ్రులను కోల్పోయానని.. ఆ తర్వాతే ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు చూశానని చెప్పుకొచ్చారు. తేజ మాట్లాడుతూ.. 'మేము చెన్నైలో ఉండేవాళ్లం. నాకు ఒక అక్క, ఒక చెల్లి. నా బాల్యంలో మాకు ఆస్తులు బాగానే ఉండేవి. నాకు ఊహ తెలిసే సరికి అమ్మ చనిపోయారు. ఆ బెంగతో నాన్న కొంతకాలానికే కన్నుమూశారు. ఆ పరిస్థితుల్లో మా భవిష్యత్తు తలకిందులైంది. మా బంధువులే మమ్మల్ని పంచుకున్నారు. అక్క ఒక చోట. నేనూ, చెల్లి మరో చోట ఉండాల్సి వచ్చింది. మమ్మల్ని చూసుకున్నందుకు వాళ్లు కూడా కొన్ని ఆస్తులు తీసుకున్నారు. అంతే కాకుండా ఓరోజు నన్ను ఆరు బయట పడుకోమన్నారు. నేను ఆ రోజు రాత్రే పారిపోయా. ఫుట్‌పాత్‌పై పడుకున్నా. ఈ రోజు నేను ఈ స్థాయికి వచ్చానంటే కేవలం సినిమా వల్లే.' అంటూ తను పడిన బాధలను వివరించారు. (ఇది చదవండి: మీ కోసమే వచ్చా.. సల్లు భాయ్‌కి ప్రపోజ్ చేసిన అమ్మాయి!) మహేశ్ బాబు హీరోగా నటించిన నిజం అనుకున్నంతగా ఆడకపోవడంతో సినిమాపై ఏకాగ్రత కోల్పోయానని అన్నారు. ఆ తర్వాత మా అబ్బాయికి ఆరోగ్యం బాగాలేక పోవడంతో సుమారు నాలుగేళ్లపాటు సినిమాకు దూరంగా ఉన్నానని తెలిపారు. నేనే రాజు నేనే మంత్రి మూవీతో తిరిగి హిట్ అందుకున్నా అని తేజ వెల్లడించారు. -
రానా తమ్ముడు హీరోగా 'అహింస'.. ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ఫిక్స్
ప్రముఖ నిర్మాత సురేష్‌బాబు తనయుడు, రానా సోదరుడు అభిరామ్ అహింస చిత్రంతో హీరోగా పరిచయం అవుతున్న సంగతి తెలిసిందే. తేజ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రేమకథా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అభిరామ్‌కు జోడీగా గీతికా తివారీ హీరోయిన్గా నటిస్తుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ సినిమాపై మంచి హైప్ క్రియేట్ చేస్తోంది. ఇక ఇప్పటికే రిలీజ్ డేట్ పలుమార్లు వాయిదా పడిన ఈ చిత్రం జూన్2న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో భారీగా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ప్లాన్ చేస్తున్నారు. ఈనెల 27న ఆంధ్రప్రదేశ్ చీరాలలోని ఎన్ఆర్పీఎం హైస్కూల్ గ్రౌండ్లో ఈ ఈవెంట్‌ను నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని వెల్లడిస్తూ ఓ పోస్టర్‌ను వదిలారు. ఇక ఈ ఈవెంట్‌కు పలువురు టాలీవుడ్ పెద్దలు రానున్నట్లు సమాచారం. -
దగ్గుబాటి మల్టీస్టార్ లో నాగచైతన్య ...
-
ఉదయ్‌కిరణ్ డెత్ మిస్టరీ.. ఏమీ తెలియనట్లు నటిస్తున్నారు: తేజ
దగ్గుబాటి అభిరామ్ హీరోగా ఎంట్రీ ఇస్తున్న చిత్రం అహింస. గీతికా తివారి హీరోయిన్. తేజ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా జూన్ 2న విడుదల కానుంది. ఈ సందర్భంగా ప్రమోషన్స్ కార్యక్రమాలతో బిజీ అయి తేజ వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. ఈ క్రమంలో ఎక్కడికి వెళ్లినా అతడికి దివంగత నటుడు ఉదయ్ కిరణ్ గురించే ప్రశ్న ఎదురవుతుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఉదయ్ కిరణ్ పేరు చెప్పగానే పాపం అనేశాడు తేజ. దీంతో ఇంటర్వ్యూ చేస్తున్న వ్యక్తి హీరో డెత్ మిస్టరీ రివీల్ చేస్తానన్నారు కదా సర్.. అని అడిగాడు. దీనికి తేజ స్పందిస్తూ.. 'చాలామందికి ఉదయ్ కిరణ్ మరణం వెనుక అసలు కారణం తెలుసు. కానీ ఎందుకు నాతోనే దాన్ని చెప్పించాలని చూస్తున్నారు. అందరూ ఏమీ తెలియనట్లు అమాయకంగా మీరే చెప్పండని ఎందుకు నటిస్తున్నారో అర్థం కావట్లేదు' అని బదులిచ్చాడు. తన కుటుంబం గురించి మాట్లాడుతూ.. 'మా అబ్బాయి డైరెక్షన్ కోర్స్ పూర్తి చేశాడు. తనను త్వరలో హీరోగా పరిచయం చేస్తాను. అమ్మాయి తన చదువు పూర్తి చేసుకుని ఇండియాకు తిరిగొచ్చేసింది. ఆమెకు నేను పెళ్లి చేయను. నచ్చినవాడిని చూసుకుని రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోమని చెప్పాను. ఆ తర్వాత దగ్గరివాళ్లను పిలిచి భోజనాలు పెడదామన్నాను. ఒకవేళ పెళ్లి తర్వాత నచ్చకపోతే విడాకులిచ్చేయ్.. నా ఇద్దరు పిల్లలకు అదే చెప్తా.. జీవితంలో సంతోషంగా ఉండటం కోసం ఏది చేయాలనిపిస్తే అది చేయండి.. అంతే తప్ప పక్కవాళ్ల కోసం ఆలోచించవద్దని చెప్తాను' అని చెప్పుకొచ్చాడు. చదవండి: చులకన చేసే నోరు ఉంటే చురకలు వేసే నోరు కూడా ఉంటుంది -
హీరోగా ఎంట్రీ ఇవ్వనున్న డైరెక్టర్ తేజ కుమారుడు
ప్రేమకథా చిత్రాలు తెరకెక్కించడంతో తనదైన మార్క్ చూపించిన దర్శకుల్లో డైరెక్టర్ తేజ ఒకరు. తెలుగులో జయం, నిజం, ఔనన్నా కాదన్నా, లక్ష్మీ కల్యాణం, నేనే రాజు నేనే మంత్రి వంటి పలు హిట్ చిత్రాలు తెరకెక్కించిన ఆయన రీసెంట్గా అహింస అనే సినిమాను రూపొందించారు. దగ్గుబాటి రానా తమ్ముడు అభిరామ్‌ను ఈ సినిమాతో హీరోగా పరిచయం చేస్తున్నారు. గతంలోనూ అనేకమంది నటీనటులను డైరెక్టర్ తేజ ఇండస్ట్రీకి పరిచయం చేశారు. ఇదిలా ఉంటే తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన తేజ తన కొడుకు ఎంట్రీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మా అబ్బాయిని హీరోగా పరిచయం చేయాలనుకుంటున్నా. తనకు ఇంట్రెస్ట్ ఉండటంతో విదేశాల్లో అందుకు సంబంధించిన కోర్సులు చేసి వచ్చాడు. చూడటానికి హ్యాండ్సమ్గానే ఉంటాడు. కానీ హీరోగా చేయడానికి అదొక్కటే సరిపోదు కదా.. ఇక మా అబ్బాయిని నేను డైరెక్ట్ చేయాలా లేక ఇంకెవరికైనా అప్పగించాలా అన్నది చూడాల్సి ఉంది అంటూ తేజ పేర్కొన్నారు. -
నాకు జరిగిన అవమానాలను గుర్తు పెట్టుకుంటా: డైరెక్టర్ తేజ
హిట్, ఫ్లాపులతో సంబంధం లేకుండా సినిమాలు తెరకెక్కించే డైరెక్టర్లలో తేజ ఒకరు. కొత్త నటీనటులతో సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తుంటారు. ‘సీత’ తర్వాత ఆయన దర్శకత్వం వహించిన సినిమా అహింస. చిత్రం సినిమాతో జర్నీ ప్రారంభించిన ఆయన.. ప్రస్తుతం అభిరామ్ దగ్గుబాటి హీరోగా తెరకెక్కించిన ప్రేమకథా చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఆయన తన కెరీర్లో ఎదురైన అనుభవాలను పంచుకున్నారు. (ఇది చదవండి: ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలకు దూరంగా జూ.ఎన్టీఆర్!) తెలుగులో జయం, నిజం, ఔనన్నా కాదన్నా, లక్ష్మీ కల్యాణం, నేనే రాజు నేనే మంత్రి లాంటి చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఎలాంటి హంగులకు పోకుండా కంటెంట్‌కు అనుగుణంగా చిత్రాలను తెరకెక్కిస్తే తప్పకుండా అది ప్రేక్షకులకు రీచ్ అయ్యే అవకాశం ఉందని అన్నారు. తప్పుల నుంచే తాను ఎన్నో విషయాలను నేర్చుకున్నానని.. వాటిని ఎప్పటికీ మర్చిపోనని తేజ అన్నారు. డైరెక్టర్ తేజ మాట్లాడుతూ.. 'నేను నా ఇంటి సైట్‌ను బ్యాంక్‌లో పెట్టా. మధ్యలో నాలుగేళ్లు సినిమాలు చేయలేదు. బ్యాంక్ వాళ్లు వచ్చి ఈ ఆస్తి జప్తులో ఉందని గేటుకు రాశారు. ఆ తర్వాత అప్పు కట్టేశా. కానీ జీవితంలో మళ్లీ లోన్ తీసుకోకూడదని గుర్తు పెట్టుకోవడం కోసం వాళ్లు రాసిన నోటీసు తొలగించకుండా అలాగే ఉంచా. కానీ నా జీవితంలో చేసిన తప్పులు, అవమానాలను గుర్తు పెట్టుకుంటా. మళ్లీ వాటిని చేయకూడదని నిర్ణయించుకుంటా. నేను చేసిన సినిమాలు ఫెయిల్ అయ్యాయి. సినిమా తీసినప్పుడే హిట్టా, ఫ్లాపా అనేది ముందే తెలుస్తుంది. అందుకే నేను ఏ సినిమాపై ఎలాంటి ఆశలు పెట్టుకోను. సినిమా విషయంలో బడ్జెట్ ఉందని ఎలా పడితే అలా చేయకూడదు. కథకు తగిన బడ్జెట్లోనే తీయాలి. అంతే కానీ ఉంది కదా అని కథను మించి బడ్జెట్ ఖర్చు పెడితే అంతే ' అని అన్నారు. (ఇది చదవండి: లక్షన్నరలో హీరోయిన్ వివాహం.. పెళ్లి చీర రూ.3 వేలు మాత్రమేనట!) -
రానా తమ్ముడు నటించిన 'అహింస' ట్రైలర్ చూశారా?
ఓ యువకుడిని క్రిమినల్ కేసులో పోలీసులు అరెస్ట్ చేస్తారు. అతన్ని విడిపించడానికి ఓ క్రిమినల్ లాయర్ కేసును టేకప్ చేస్తుంది. గురువారం హీరో రామ్‌చరణ్ విడుదల చేసిన ‘అహింస’ ట్రైలర్లో కనిపించిన సన్నివేశాలు ఇవి. మరోవైపు అదే ట్రైలర్లో ఆ యువకుడు, ఓ యువతి ప్రేమలో ఉన్న సీన్లు కనబడతాయి. దివంగత ప్రముఖ నిర్మాత డి. రామానాయుడు మనవడు, నిర్మాత సురేష్‌బాబు తనయుడు అభిరామ్ హీరోగా పరిచయమవుతున్న చిత్రం ‘అహింస’. గీతిక హీరోయిన్గా లాయర్ పాత్రలో సదా నటించిన ఈ చిత్రానికి తేజ దర్శకుడు. ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీకి పి. కిరణ్ నిర్మాత. త్వరలో రిలీజ్ కానున్న ఈ చిత్రానికి సంగీతం: ఆర్పీ పట్నాయక్, కెమెరా: సమీర్ రెడ్డి. -
నేరుగా ఓటీటీలోకి వస్తున్న ‘జగమేమాయ’.. రిలీజ్ ఎప్పుడంటే?
చైతన్య, తేజ, ధన్య బాలకృష్ణన్ కీలక పాత్రల్లో సునీల్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'జగమేమాయ'. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం రిలీజ్‌కు రెడీ అయింది. నేరుగా ఓటీటీలోనే ఈ మూవీ విడుదల కానుంది. ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ వేదికగా డిసెంబరు 15వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు చిత్రబృందం వెల్లడించింది. తాజాగా చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు మేకర్స్. ట్రైలర్ చూస్తే.. 'నేను కాలేజీలో ఉన్నప్పుడు ఒక అమ్మాయిని లవ్ చేశాను.' అనే డైలాగ్‌తో ట్రైలర్ ప్రారంభమైంది. ఈ సమాజంలో మనుషుల వ్యక్తిత్వం ఎలా ఉంటుంది? డబ్బు కోసం ఎలాంటి పనులు చేస్తారు? వంటి అంశాలను ‘జగమేమాయ సినిమాలో చాలా విలక్షణంగా ఆవిష్కరించినట్లు అర్థమవుతోంది. ముగ్గురు వ్యక్తుల మధ్య ఉన్న రిలేషన్‌పై డబ్బు ఎలాంటి ప్రభావం చూపిస్తుందన్నది సినిమాలో చూపించే ప్రయత్నం చేశారు. -
యాక్షన్ ఎంటర్టైనర్గా రానా సోదరుడి ‘అహింస’
నిర్మాత సురేశ్‌బాబు తనయుడు, హీరో రానా సోదరుడు అభిరామ్ హీరోగా పరిచయమవుతున్న చిత్రం ‘అహింస’. తేజ దర్శకత్వంలో పి. కిరణ్ నిర్మించిన ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. త్వరలోనే ఈ సినిమాని విడుదల చేస్తున్నట్లు తెలుపుతూ, కొత్త పోస్టర్లను విడుదల చేసింది చిత్రయూనిట్. ‘‘యూత్‌ఫుల్ లవ్, యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందిన చిత్రం ‘అహింస’. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్‌కు మంచి స్పందన వచ్చింది. ఆర్పీ పట్నాయక్ సంగీతం అందించిన ‘నీతోనే నీతోనే..’, ‘కమ్మగుంటదే..’ పాటలు చార్ట్ బస్టర్స్‌గా నిలిచాయి. త్వరలోనే సినిమాని థియేటర్లలో విడుదల చేస్తాం’’ అని చిత్రవర్గాలు పేర్కొన్నాయి. ఈ చిత్రానికి కెమెరా: సమీర్ రెడ్డి. -
యంగ్ హీరో చెంప పగలగొట్టిన తేజ!
కొత్త నటులతో సినిమా తీయడంలో దర్శకుడు తేజ దిట్ట. టాలీవుడ్‌కి ఆయన చాలా మంది హీరోహీరోయిన్లను అందించాడు. . ఉదయ్ కిరణ్, నితిన్, నవదీప్ లాంటి యంగ్ హీరోలను తెలుగు తెరకు పరిచయం చేసిన గొప్ప డైరెక్టర్ ఆయన. అయితే షూటింగ్ సమయంలో తేజ కాస్త మొరటుగా ప్రవర్తిస్తాడట. తాను అనుకున్నట్లుగా సీన్ రాకపోతే నటీనటులపై చేయి చేసుకుంటాడని ఇండస్ట్రీలో టాక్. తాజాగా తేజ మరో యంగ్ హీరో చెంప పగలగొట్టాడట. ప్రస్తుతం తేజ ‘అహింస’ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. దగ్గుబాటి రానా తమ్ముడు అభిరామ్ ఈ చిత్రం ద్వారా హీరోగా పరిచయం కాబోతున్నాడు. ఈ మూవీని సురేశ్ బాబు నిర్మిస్తున్నాడు. ఈ చిత్రం షూటింగ్ సమయంలో అభిరామ్‌పై డైరెక్టర్ తేజ చేయి చేసుకున్నట్లు టీటౌన్ టాక్. షూటింగ్లో భాగంగా ఒక రోజు లెన్త్ సీన్ ప్లాన్ చేశాడట తేజ. ఆ సీన్లో నటించడానికి అభిరామ్ చాలా ఇబ్బంది పడ్డాడట. తేజ ఎన్నిసార్లు చెప్పినా.. సరిగా నటించలేదట. దీంతో తేజ అతనిపై చేయి చేసుకున్నాడట. దీంతో అభిరామ్ అలిగి..కొద్ది రోజుల పాటు షూటింగ్‌కి వెళ్లలేదట. చివరకి సురేశ్‌బాబు రంగంలోకి దిగి..కొడుకును బుజ్జగించి షూటింగ్‌కి పంపినట్లు ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే ఈ విషయంపై తేజ గానీ, అభిరామ్ గానీ ఇంతవరకు స్పందించలేదు. -
దగ్గుబాటి వారసుడి చెంప పగలగొట్టిన డైరెక్టర్ తేజ
-
ఉదయ్ కిరణ్ చావుకు కారణం తెలుసు: తేజ సంచలన వ్యాఖ్యలు
ఏ విషయాన్నైనా మనసులో దాచుకోకుండా కుండ బద్దలు కొట్టినట్లు చెప్తాడు దర్శకుడు తేజ. తనను తెలియని విషయాల జోలికి వెళ్లడు కానీ.. తెలిసిని విషయాన్ని నిర్మోహమాటంగా చెప్తేస్తాడు. ఇతరుల విషయంలోనే కాదు.. తనకు సంబంధించిన విషయాలో కూడా చాలా ఓపెన్‌గా ఉంటాడు. తాజాగా ఈ క్రియేటివ్ దర్శకుడు ఉదయ్ కిరణ్ ఆత్మహత్య సంఘటనపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఉదయ్ కిరణ్ చావుకు కారణాలేంటో తనకు తెలుసని అన్నాడు. తేజ దర్శకత్వం వహించిన ‘చిత్రం’ సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు ఉదయ్‌కిరణ్. ఆ సినిమా భారీ విజయం అందుకోవడంతో ఉదయ్‌కి అవకాశాలు వరుసకట్టాయి. తదుపరి ‘నువ్వు నేను’ అంతకుమించి హిట్ అయింది. ఆ తర్వాత వచ్చిన 'మనసంతా నువ్వే' కూడా భారీ విజయం సాధించడంతో స్టార్ హీరోగా మారిపోయాడు. కానీ ఆ స్టార్డమ్ ఎక్కువ రోజులు ఉండలేదు. వరుస సినిమాలు ఫ్లాప్ కావడంతో ఉదయ్ కిరణ్‌కు అవకాశాలు సన్నగిల్లాయి. దీంతో డిప్రెషన్లోకి వెళ్లి.. 2014 జనవరి లో ఉదయ్ కిరణ్ తన ఇంట్లో ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. అప్పటి నుంచి ఉదయ్ కిరణ్ ఆత్మహత్య పై మీడియాలో రకరకాలుగా కథనాలు వినిపిస్తున్నాయి. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న దర్శకుడు తేజ ఉదయ్ కిరణ్ ఆత్మహత్య పై ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఉదయ్ కిరణ్ ఆత్మహత్యకు కారణం తనుకు తెలుసని, చనిపోయేలోపు ఆ విషయాలు చెబుతానన్నారు. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... ఉదయ్ కిరణ్ చాలా సున్నితమైన మనస్తత్వం కలవాడు. వరుసగా మూడు హిట్ లు వచ్చేటప్పటికి బ్యాలెన్స్ కోల్పోయాడు. స్టార్డమ్ వచ్చినప్పుడు బ్యాలెన్స్ మిస్ కావడం కామన్. నేను దాన్ని తల పొగరు అనుకోలేదు. అమాయకత్వం అనుకున్నా. తను ప్లాప్‌లతో సతమతమవుతున్న సమయంలో పిలిచి ‘ఔనన్నా కాదన్నా’ లో అవకాశం ఇచ్చా. ఆ సినిమా షూటింగ్ సమయంలో విచారం వ్యక్తం చేశాడు. ‘మీ విషయంలో నేను కాస్త పొగరుగా వ్యవహరించినా... గుర్తుపెట్టుకొని మరీ సినిమా అవకాశం ఇచ్చారు. మీ పాదాలు తాకుతా.. క్షమించానని ఒక్కసారి చెప్పండి చాలు’ అన్నారు. నేను అవేవి వద్దని చెప్పా. అతని జీవితంలో ఏం జరిగిందో అంతా నాకు తెలుసు. నాకు అన్ని విషయాలు చెప్పాడు. ఉదయ్ కిరణ్ ఆత్మహత్యకు కారణాలు సమయం వచ్చినప్పుడు బయటపెడతా. నేను చనిపోయేలోపు ఈ విషయాలను వెల్లడిస్తా. ఇప్పుడు చెప్పడం సరైన పద్దతి కాదు’అని తేజ చెప్పుకొచ్చాడు. తేజ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. -
హీరోగా దగ్గుబాటి అభిరామ్ ఎంట్రీ.. 'అహింస' గ్లింప్స్ చూశారా?
దగ్గుబాటి అభిరామ్‌ను హీరోగా పరిచయం చేస్తున్నారు డైరెక్టర్ తేజ. ప్రస్తుతం వీరిద్దరి కాంబినేషన్లో అహింస అనే చిత్రం తెరకెక్కతుతున్న సంగతి తెలసిందే. ఇటీవలె ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అయ్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రం ఈ ఏడాది చివర్లో విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమా నుంచి ఇంట్రెస్టింగ్ గ్లింప్స్‌ను విడుదల చేశారు మేకర్స్. ఇందులో హీరోని కొందరు అడవిలో తీసుకెళ్తుండగా అతను తప్పించుకొని పారిపోవడానికి ప్రయత్నించడం, తర్వాత వాళ్లు మళ్లీ లాక్కొచ్చి కొడుతుంటారు. ఈ గ్లింప్స్ సినిమాపై మరింత క్యూరియాసిటీని క్రియేట్ చేస్తుంది.ఈ చిత్రంలో అభిరామ్‌కు జోడీగా గీతికా తివారి హీరోయిన్గా నటించింది. ఆర్పీ పట్నాయక్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. -
ఆకట్టుకుంటున్న‘ చినుకమ్మా .. నా వెంటే పడుతున్న చిన్నాడెవడమ్మా’ సాంగ్
‘హుషారు’ఫేమ్ తేజ్ కూరపాటి, అఖిల ఆకర్షణ జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘ నా వెంటపడుతున్న చిన్నాడెవడమ్మా’. వెంకట్ వందెల దర్శకత్వం లో జి వి ఆర్ ఫిల్మ్ మేకర్స్ సమర్పణలో రాజధాని ఆర్ట్ మూవీస్ బ్యానర్ పై ముల్లేటి కమలాక్షి, గుబ్బల వేంకటేశ్వరావు లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవల ఈ చిత్రం నుంచి విడుదల చేసిన ఫస్ట్ లుక్‌కి మంచి స్పందన వచ్చింది. తాజాగా ఈ చిత్రంలోని తొలి పాటను విడుదల చేశారు మేకర్స్. ‘పుడిమిని తడిపే తొలకరి మొరుపుల చినుకమ్మా .. నా వెంటే పడుతున్న చిన్నాడెవడమ్మా ’అంటూ సాగే ఈ పాటకి డాక్టర్ భవ్య దీప్తిరెడ్డి లిరిక్స్ అందించగా.. రమ్య బెహరా అద్భుతంగా ఆలపించారు. సందీప్ కుమార్ సంగీతం అందించిన ఈ సాంగ్‌కి గణేష్ మాస్టర్ కొరియోగ్రఫి చేశారు. ఇటీవలే విడుదల చేసిన సాంగ్ ప్రోమో కి మంచి రెస్సాన్స్ వచ్చింది. ఇప్పడు ఈ సాంగ్ ని ప్రముఖ నటులు , రచయిత, దర్శకులు తణికెళ్ళ భరణి చేతుల మీదుగా లాంచ్ చేశారు. ఈ సందర్భంగా తణికెళ్ల భరణి మాట్లాడుతూ.. భవ్య దీప్తి సాహిత్యంతో గణేశ్ మాస్టర్ కొరియోగ్రఫి చాలా బాగుంది. ఈ పాటలో హీరో తేజ, అఖిల చాలా అందంగా ఉన్నారు. ఈ చిత్రం మరింత విజయం సాధించాలని కొరుకుంటున్నాను’ అన్నారు. దర్శకుడు వెంకట్ వందెల మాట్లాడుతూ.. ‘పల్లెటూరి నేపధ్యం లో సాగే చక్కటి ప్రేమకథ గా ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. ఈ చిత్రం ఫ్యామిలి మరియు యూత్ ని ఆకట్టకుంటుంది’ అన్నారు. -
బాలీవుడ్ ఎంట్రీకి రెడీ అయిన డైరెక్టర్ తేజ!
టాలీవుడ్ దర్శకుల్లో తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న డైరెక్టర్లలతో తేజ కూడా ఒకరు. చిత్రం సినిమాతో దర్శకుడిగా అవతారం ఎత్తిన తేజ తొలి సినిమాతో సూపర్ హిట్ కొట్టారు. ఆ తర్వాత వరుస సినిమాలు చేస్తూ హ్యాట్రిక్ హిట్టు సాధించాడు. కానీ కొంతకాలంగా ఆయనకు సాలిడ్ హిట్టు మాత్రం దొరకడం లేదు. గత పదిహేనేళ్లలో ‘నేనే రాజు నేనే మంత్రి’ తప్పితే మరో హిట్టు లేదు. ప్రస్తుతం ఆయన రానా తమ్ముడు అభిరామ్‌ను హీరోగా పరిచయం చేస్తూ ‘అహింస’అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తయ్యింది. ఇదిలా ఉండగా ఇప్పుడు తేజ బాలీవుడ్లో సత్తా చాటేందుకు రెడీ అవుతున్నారు. ఇప్పటికే రెండు ప్రాజెక్టులకు సైన్ చేసినట్లు సమాచారం. ‘జఖ్మీ’ అనే సినిమాతో పాటు,‘తస్కరి’ అనే వెబ్ సిరీస్‌ని కూడా డైరెక్ట్ చేయబోతున్నట్లు తెలుస్తుంది. టైమ్ ఫిల్మ్స్, ఎన్.హెచ్. స్టూడియోస్, ట్రిఫ్లిక్స్ ఫిల్మ్స్ సంస్థలు వీటిని నిర్మించనున్నాయి. త్వరలోనే ఈ ప్రాజెక్టులకు సంబంధించి మరిన్ని వివరాలు వెల్లడి కానున్నాయి. -
అభిరాం తీరుకు విసిగిపోయిన తేజ?, ఏం చేశాడంటే!
Abhiram Troubles Director Teja Over Ahimsa Shooting?: దర్శకుడు తేజ గురించి టాలీవుడ్ ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. ఉదయ్ కిరణ్, నితిన్, నవదీప్ లాంటి యంగ్ హీరోలను తెలుగు తెరకు పరిచయం చేసిన గొప్ప డైరెక్టర్ ఆయన. ఒకప్పుడు తేజ చిత్రాలకు యమ క్రేజ్ ఉండేది. ఎన్నో ఫ్లాప్‌ల అనంతరం నేనే రాజు నేనే మంత్రి మూవీతో హిట్ అందుకున్నాడు తేజ. అదే జోష్‌లో తేజ ఇప్పుడు దగ్గుబాటి మరో వారసుడు, రానా తమ్ముడు అభిరాంను హీరోగా పరిచయం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీకి అహింస అనే టైటిల్‌ను ఖరారు చేస్తూ ఇటివల అభిరాం ఫస్ట్‌లుక్‌ను కూడా విడుదల చేశారు మేకర్స్. చదవండి: అసభ్యకర సంజ్ఞతో స్టార్ హీరోయిన్ ఫైర్, పక్కనే షారుఖ్.. ఫోటో వైరల్ దీనికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈ నెలాఖరు వరకు శరవేగంగా షూటింగ్‌ను పూర్తి చేసి ప్రమోషన్ కార్యాక్రమాలు, పోస్ట్ ప్రోడక్షన్ పనులను స్టార్ట్ చేయాలని తేజ ప్లాన్ చేస్తున్నాడట. అయితే దీనికి అభిరాం సహకరించకుండ ఇబ్బంది పెడుతున్నట్లు ఫిలిం సర్కీల్‌లో జోరుగా ప్రచారం జరుగుతోంది. తన డెబ్యూ మూవీ విషయంలో అభిరాం చాలా నిర్లక్ష్య ధోరణి చూపిస్తున్నాడని, అతడి యాటిట్యూడ్ తీరుకు తేజ విసిగిపోయినట్లు టీ-టౌన్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇటీవల షూటింగ్‌కు రావాల్సిందిగా అభిరాంకు తేజ ఫోన్ చేయగా.. కాలికి గాయమైందని, రెస్ట్ కావాలని అడిగాడట. చదవండి: RRR: తారక్, చరణ్, రాజమౌళితో యాంకర్ సుమ రచ్చ రచ్చ అయితే తీరా చూస్తే అభిరాం అబద్ధం చెప్పి స్నేహితులతో పార్టీకి వెళ్లినట్లు తేజ దృష్టికి వెళ్లింది. ఇలా ఒక్కసారి కాదు చాలాసార్లు చిన్నచిన్న విషయాలను సాకుగా చూపించి అభిరాం షూటింగ్‌కు డుమ్మా కొట్టాడని సినీ వర్గాల నుంచి సమాచారం. ఇక అతడి తీరుపై అసహానికి లోనైన తేజ అభిరాం గురించి తండ్రి సురేశ్ బాబుకు చెప్పినట్లు సమాచారం. ‘ఫస్ట్మూవీకే యాటిట్యూడ్ చూపిస్తే ఫ్యూచర్ ఉండదంటూ’ నెటిజన్లు అభిరాంపై విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే ఈ వార్తల్లో నిజమెత్తుందో తెలియదు. దీనిపై మరింత క్లారిటీ రావాల్సి ఉండగా డైరెక్టర్ తేజను విసిగిస్తున్న అభిరాం అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇక దీనిపై స్పష్టత రావాలంటే చిత్ర బృందం స్పందించే వరకు వేచి చూడాలి. -
ఆ మూవీతో కొడుకును హీరోగా పరిచయం చేస్తున్న డైరెక్టర్ తేజ!
డైరెక్టర్ తేజ ప్రస్తుతం రానా సోదరుడు అభిరాం దగ్గుబాటి హీరోగా అహింస మూవీ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో అభిరాం హీరోగా పరిచయం కానున్నాడు. భిన్న కథలతో కొత్త హీరోలను ఇండస్ట్రీకి పరిచయం చేసే తేజ ఇప్పుడు ఆయన తనయుడిని హీరోగా చూపించబోతున్నాడు. ఫిబ్రవరి 22 తేజ బర్త్‌డే సందర్భంగా ఆయన కొత్త సినిమాలను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందులో ఆయన పిరియాడిల్ ఎపిక్ లవ్‌స్టోరిగా విక్రమాదిత్య మూవీని రూపొందిస్తున్నట్లు వెల్లడించాడు. చదవండి: ఒకే ఫ్రేంలో ‘గాడ్ ఫాదర్’, ‘భీమ్లా నాయక్’, వీడియో వైరల్ లక్ష్మి నరసింహా ప్రోడక్షన్స్ నిర్మిస్తున్న ఈ మూవీ ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను ఆయన బర్త్‌డే సందర్భంగా విడుదల చేశారు. 18వ శతాబ్దం నేపథ్యంలో నడిచే ప్రేమకథ ఇది. ఈ మూవీలో తేజ కొడుకు అమితవ్ లీడ్ రోల్ పోషిస్తున్నాడనే టాక్ నడుస్తోంది. ‘విక్రమాదిత్య’ అనే పిరియాడికల్ లవ్‌స్టోరితో తేజ తన కుమారుడిని హీరోగా ఇండస్ట్రీకి పరిచయం చేయబోతున్నాడట. మరి ఇందులో నిజమెంతుందో తెలియాలంటే కొద్ది రోజుల ఆగాల్సిందే. కాగా త్వరలోనే ‘విక్రమాదిత్య’ను సెట్స్‌పైకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. Taking you back in the year 1836, when LOVE was INNOCENT ❤️ Here’s the PRE LOOK POSTER of an Epic Love Story #VikramAditya 🎬 Directed by @tejagaru ❤️🔥 Shoot Begins today🤘 More details to be revealed soon✨@LNPOfficial #NallamalupuSrinivas (Bujji)#HappyBirthdayTeja 💥 pic.twitter.com/fzKTQuqaaY — LNP (@LNPOfficial) February 22, 2022 -
దగ్గుబాటి రానా తమ్ముడి ‘అహింస’.. ప్రీ లుక్ పోస్టర్ వైరల్
Rana Daggubati Brother Debut Movie First Look: దర్శకుడి తేజ గురించి టాలీవుడ్ ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. ఉదయ్ కిరణ్, నితిన్, నవదీప్ లాంటి యంగ్ హీరోలను తెలుగు తెరకు పరిచయం చేసిన గొప్ప డైరెక్టర్ ఆయన. ఒకప్పుడు తేజ చిత్రాలకు యమ క్రేజ్ ఉండేది. పలువురు యంగ్ హీరో,హీరోయిన్లు తేజ దర్శకత్వంలో నటించాలని ఆశ పడేవారు. అయితే ఇటీవల కాలంలో తేజను వరుస ప్లాపులు పలకరించాయి. చాలా కాలం తర్వాత రానాతో ‘నేనే రాజు నేనే మంత్రి’మూవీ తీసి హిట్ కొట్టాడు. అయితే ఈ విజయాన్ని అలాగే కొనసాగించడంతో తేజ విఫలం ఆయ్యాడు. ఆ మూవీ తర్వాత తేజ తీసిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాయి.దీంతో తేజ కాస్త విరామం తీసుకొని.. దగ్గుబాటి ఫ్యామిలీ నుంచి మరో హీరోని పరిచయం చేసేందుకు సిద్దమయ్యాడు. రానా తమ్ముడు అభిరామ్ హీరోగా ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు తేజ. నేడు(ఫిబ్రవరి 22) తేజ బర్త్‌డే. ఈ సందర్భంగా ఈ చిత్రంకు సంబంధించిన ప్రీ లుక్ పోస్టర్, టైటిల్ ని మేకర్స్ రిలీజ్ చేశారు.ఈ సినిమాకి అహింస అనే టైటిల్ ని ఫిక్స్ చేశారు. అభిరామ్ ముఖం కనిపించకుండా కళ్ళవరకూ గోనె సంచితో కట్టేసి ఉండగా.. అతడి నోటి నుంచి రక్తం కారుతూ ఉండే లుక్ ఆకట్టుకుంటోంది. ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ఆర్పీ పట్నాయక్ సంగీతం అందిస్తున్నారు. అహింసా పరమో ధర్మః, ధర్మహింసా తధైవచ !! Presenting the Fierce Pre Look Poster of #AbhiramDaggubati’s #AHIMSA 🩸 A Film by @tejagaru 🎬 Principal Shoot Completed 🤘#Kiran @rppatnaik #SameerReddy @boselyricist @AnandiArtsOffl #HappyBirthdayTeja pic.twitter.com/AfBZsky3XA — Suresh Productions (@SureshProdns) February 22, 2022 -
‘బ్యాక్ డోర్’ కర్రి బాలాజీకి బోలెడు పేరు తేవాలి!
పూర్ణ ప్రధాన పాత్రలో తేజ త్రిపురాన హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'బ్యాక్ డోర్'. కర్రి బాలాజీ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఆర్చిడ్ ఫిలిమ్స్ పతాకంపై బి.శ్రీనివాస్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ మూవీ క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 25 న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా బుధవారం సాయంత్రం ప్రీరిలీజ్ ఈవెంట్‌ని నిర్వహించింది చిత్ర బృందం. కోలాహలంగా జరిగిన ఈ వేడుకలో ప్రముఖ నటి-నిర్మాత-దర్శకురాలు జీవితా రాజశేఖర్, అడిషన్ ఎస్పీ కె.జి.వి. సరిత ముఖ్య అథితులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ‘ఈట్ సినిమా... డ్రింక్ సినిమా.. స్లీప్ సినిమాగా’అన్నట్లుగా సినిమానే సర్వస్వంగా భావించే కర్రి బాలాజీకి ‘బ్యాక్ డోర్’ బ్లాక్ బస్టర్ కావాలని అతిధులు ఆకాంక్షించారు. తనకు ‘బ్యాక్ డోర్’వంటి మంచి సినిమా ఇచ్చిన కర్రి బాలాజీకి హీరోయిన్ పూర్ణ కృతజ్ఞతలు తెలిపారు. పూర్ణ కెరీర్ లో ‘బ్యాక్ డోర్’ఓ మైల్ స్టోన్ గా నిలిచిపోతుందని పేర్కొన్న కర్రి బాలాజీ... ప్రి-రిలీజ్ ఈవెంట్ కు పెద్ద సంఖ్యలో విచ్చేసి గ్రాండ్ సక్సెస్ చేసిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు. ఈ క్రేజీ చిత్రం వరల్డ్ వైడ్ థియేట్రికల్ హక్కులు సొంతం చేసుకున్న కె.ఆర్.ఫిల్మ్ ఇంటర్నేషనల్ అధినేత కందల కృష్ణారెడ్డి మాట్లాడుతూ...‘బ్యాక్ డోర్’ చిత్రానికి గల క్రేజ్ కి తగ్గట్టు... భారీ స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా ఈనెల 25న విడుదల చేస్తున్నాం’అన్నారు. ఈ కార్యక్రమంలో హీరోయిన్ పూర్ణ, హీరో తేజ త్రిపురాన, చిత్ర దర్శకుడు కర్రి బాలాజీ, సంగీత దర్శకులు ప్రణవ్, ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్న కందల కృష్ణారెడ్డి, ప్రముఖ నిర్మాతలు చదలవాడ శ్రీనివాసరావు, తుమ్మలపల్లి రామసత్యనారాయణ, డి.ఎస్.రావు, శోభారాణి, నిర్మాతల మండలి ప్రధాన కార్యదర్శి తుమ్మల ప్రసన్నకుమార్, ప్రముఖ నటి కరాటే కల్యాణి, ప్రముఖ దర్శకులు వీరశంకర్, అజయ్ కుమార్, సంతోషం సురేష్, ప్రముఖ నటులు అశోక్ కుమార్, రామ్ రావిపల్లి, ఆదిత్య మ్యూజిక్ ప్రతినిధులు నిరంజన్, మాధవ్, పబ్లిసిటీ డిజైనర్ విక్రమ్ రమేష్ తదితరులు పాల్గొన్నారు. -
ఉదయ్ కిరణ్ తొలి ‘చిత్రం’.. పారితోషికం వేలల్లో, వసూళ్లు కోట్లలో
Uday Kiran First Remuneration: దివంగత నటుడు ఉదయ్ కిరణ్ వెండితెరకు హీరోగా పరిచయమైన సినిమా ‘చిత్రం’. తేజ దర్శకత్వంలో తెరకెక్కిచిన ఈ మూవీతో ఉదయ్ తొలి సక్సెస్ అందుకున్నాడు. ఆ తర్వాత వెంట వెంటనే నువ్వు-నేను, కలుసుకోవాలని వంటి లవ్‌స్టోరీల్లో నటించి హ్యాట్రిక్ కొట్టాడు. అంతేకాదు ఈ చిత్రాలతో లవర్ బాయ్‌గా కూడా పేరు తెచ్చుకున్నాడు. అప్పటి అమ్మాయిల కలల రాకుమారుడిగా ఎదిగిన ఉదయ్‌కిరణ్ ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండానే స్టార్ హీరో హోదా సంపాదించుకున్నాడు. ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో నటించి హిట్లు, ప్లాప్‌లు అందుకున్న అతడి జీవితం చివరకు విషాదంగా ముగిసింది. 2014లో అతడు ఆత్మహత్య చేసుకుని తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా తొలి సనిమాతోనే ఎంతో పాపులారిటీ తెచ్చుకున్న ‘చిత్రం’ మూవీకి ఉదయ్ తీసుకున్న రెమ్యునరేషన్ ఎంతో తెలిస్తే అందరూ షాక్ అవ్వాల్సింది. ఉషా కిరణ్ మూవీస్‌లో రామోజీరావు తెరకెక్కించిన ఈ మూవీ 42 లక్షల రూపాయల బడ్జెట్‌తో నిర్మించారట. 30 రోజుల్లోనే షూటింగ్‌ను పూర్తి చేసుకున్న ఈ మూవీ సంచలన విజయం సాధించింది. బాక్సాఫీసు వద్ద దూసుకుపోతూ 8 కోట్ల రూపాయల వసూళ్లు రాబట్టింది. అంతగా నిర్మాతలకు లాభాలను తెచ్చిపెట్టిన ఈ ‘చిత్రం’ మూవీకి ఉదయ్ కిరణ్ కేవలం 11 వేల రూపాయల పారితోషికం మాత్రమే తీసుకున్నాడట. అంతేగాక ఈ మూవీకి పని చేసిన డైరెక్టర్ తేజ, సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్‌లు సైతం అతి తక్కవ రెమ్యునరేషన్‌ను తీసుకోవడం గమనార్హం. అయితే ఈ మూవీలో మొదట హీరోగా మరో వ్యక్తిని ఫైనల్ చేసి హీరో స్నేహితుడి పాత్రలో ఉదయ్ క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఉన్నాడట. అయితే సినిమా షూటింగ్ మొదలయ్యే ముందు హీరోగా చేయాల్సిన ఆ వ్యక్తి చివరకు హ్యాండ్ ఇవ్వడంతో తేజ ఉదయ్ కిరణ్‌ను హీరోగా పెట్టి ‘చిత్రం’ మూవీ రూపొందించి టాలీవుడ్‌కు బ్లాక్‌బస్టర్ హిట్‌ను అందించాడు. మరో విషయం ఎంటంటే ఈ మూవీ తర్వాత తేజ తీసిన నువ్వు-నేను సినిమాకు కూడా మొదట ఉదయ్‌ను అనుకోలేదట. హీరో మాధవన్‌తో ఈ మూవీ చేద్దామనుకున్నాడట. అప్పటికే మాధవన్ తెలుగు సినిమాలు చేసేందుకు ఆసక్తి చూపకపోవడంతో మళ్లీ ఉదయ్ కిరణ్‌ను హీరోగా తీసుకుని ఈ ‘నువ్వు-నేను’ మూవీని తెరకెక్కించాడు. లవ్ స్టోరీగా వచ్చిన ఈ చిత్రం కూడా బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. -
దగ్గుబాటి అభిరామ్ డెబ్యూ మూవీకోసం తేజ మ్యూజిక్ సిట్టింగ్స్
టాలీవుడ్ ప్రమముఖ నిర్మాత డి. సురేశ్ బాబు తనయుడు, రానా దగ్గుబాటి సోదరుడు దగ్గుబాటి అభిరామ్ హీరోగా పరిచయం కానున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను తేజ దర్శకత్వంలో ఆనంది ఆర్ట్స్ పతాకంపై ‘జెమిని’ కిరణ్ నిర్మించనున్నారు. ఈ మూవీ షూటింగ్ ఇటీవల హైదరాబాద్‌లో ప్రారంభమైంది. తాజాగా ఈ మూవీ మ్యూజిక్ సిట్టింగ్స్ మొదలయ్యాయి. దర్శకుడు తేజ, మ్యూజిక్ డైరెక్టర్ ఆర్.పి.పట్నాయక్, గేయ రచయిత చంద్రబోస్ ఈ చిత్రానికి ట్యూన్స్ రెడీ చేస్తున్నారు. ఆర్.పి.పట్నాయక్-తేజ కాంబినేషన్లో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు వచ్చాయి. చాలా ఏళ్ల తర్వాత వీరిద్దరు మళ్లీ కలిసి పనిచేస్తున్నారు. మనసుకు హత్తుకునే సాహిత్యానికి ప్రసిద్ది చెందిన స్టార్ లిరిసిస్ట్ చంద్రబోస్ ఈ చిత్రానికి సాహిత్యం అందిస్తున్నారు. ఈ ముగ్గురి కలయికలో అభిరామ్ ఫస్ట్ మూవీ తప్పకుండా మ్యూజికల్ బొనాంజగా ఉండబోతుంది. -
తన సినిమా పనులను స్టార్ట్ చేసిన అభిరామ్ దగ్గుబాటి
ప్రముఖ నిర్మాత డి. సురేశ్ బాబు తనయుడు దగ్గుబాటి అభిరామ్ హీరోగా పరిచయం కానున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను తేజ దర్శకత్వంలో ఆనంది ఆర్ట్స్ పతాకంపై ‘జెమిని’ కిరణ్ నిర్మించనున్నారు. తాను హీరోగా పరిచయం కానున్న సినిమా పనులను షురూ చేశారు అభిరామ్. ఈ చిత్రం పూజా కార్యక్రమాలు హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ స్టూడియోలో ఆదివారం జరిగాయని తెలిసింది. ఆగస్టు నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిం చేందుకు సన్నాహాలు చేస్తున్నారని సమాచారం.ఆర్.పి పట్నాయక్ ఈ సినిమాకు సంగీతం అందించనున్నారు. -
ఉదయ్ కిరణ్ ఆగిపోయిన 10 సినిమాలు ఇవే!
ఒకప్పుడు టాలీవుడ్లో లవర్ బాయ్‌గా ఒ వెలుగు వెలిగాడు దివంగత నటుడు ఉదయ్ కిరణ్. నేడు(జూన్ 26) అతడి జయంతి. ఈ సందర్భంగా ఒకసారి ఉదయ్ సినీ కేరీర్‌పై ఓ లుక్కెద్దాం. ఉదయ్ తేజ డైరెక్షన్లో తెరకెక్కిన ‘చిత్రం’ మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఫస్ట్ మూవీతోనే సూపర్ హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత నటించిన ఉదయ్ కిరణ్ సినిమాలన్ని మంచి విజయం సాధించాయి. అలా వరుస సినిమాలు చేస్తూ అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోగా ఎదిగాడు. ఈ క్రమంలో కొన్ని సంఘటనల వల్ల ఉదయ్ కిరణ్ సినీ కెరీర్ ఒక్కసారిగా స్లో అయిపోయింది. ఈ క్రమంలో అతడు నటించిన శ్రీరామ్ మూవీ ప్లాప్ అవ్వడంతో కొంతాకాలం సినిమాలకు దూరమయ్యాడు. ఈ నేపథ్యంలో దర్శకుడు తేజ ‘ఔనన్నా.. కాదన్నా’ మూవీతో ఉదయ్‌కి మరో హిట్ అందించాడు. దీంతో మళ్లీ ఉదయ్ కిరణ్ సినీ కెరీర్ గాడిన పడిందని అందరూ భావించారు. కానీ ఈ సినిమా తర్వాత ఉదయ్‌కి ఆశించిన అవకాశాలు రాలేదు. చేసిన కొన్ని సినిమాలకు పెద్దగా గుర్తింపు రాలేదు. దీంతో ఉదయ్‌కి సినిమాల అవకాశాలు దగ్గడమే కాకుండా అప్పటికే ఉదయ్‌తో తీస్తాన్న పలు ప్రాజెక్ట్స్ కూడా నిలిచిపోయాయి. అయితే ఇందుకు కారణంగా లేకపోలేదు. అయితే ఉదయ్ ఆగిపోయిన ఆ పది క్రేజీ ప్రాజెక్ట్స్ ఏంటో ఓ సారి చూద్దాం. నర్తనశాల బాలకృష్ణ స్వీయ దర్శకత్వంలో అప్పటి హీరోయిన్ సౌందర్య ప్రధాన పాత్రలో నర్తనశాల మూవీకి సన్నాహాలు జరిగాయి. ఈ నేపథ్యంలో సౌందర్య ఆకస్మాత్తు మరణంతో ఈ సినిమా అర్థంతరంగా ఆగిపోయింది. అయితే ఇందులోని కీలక పాత్ర అభిమాన్యుడి కోసం ఉదయ్‌కిరణ్‌ను అనుకున్నారని అప్పట్లో టాక్ వచ్చిన సంగతి తెలిసిందే. సూపర్ గుడ్ ఫిలింస్ బ్యానర్లో.. ఈ బ్యానర్లో ఉదయ్ కిరణ్, సదా జంటగా ఓ సినిమాకు తీయాలని భావించారు మేకర్స్. అంతేగాక ఈ చిత్రానకి లవర్స్ అనే టైటిల్‌ను కూడా ఖారారు చేశారట. ఏమైందో తెలియదు కానీ ఈ సినిమా పట్టలెక్కలేకపోయింది. కాగా ఈ బ్యానర్లో తెరకెక్కిన ఎన్నో చిత్రాలు సూపర్ హిట్‌గా నిలిచాయి. సూపర్ గుడ్ ఫిలింస్ బ్యానర్లో తెలుగుతో పాటు పలు తమిళం చిత్రాలు కూడా వచ్చాయి. అంజనా ప్రొడక్షన్స్ సినిమా కమర్షియల్ హిట్ చిత్రాల దర్శకుడు పూరీ జగన్నాథ్ డైరెక్షన్లో ఉదయ్ కిరణ్, అసిన్ జంటగా అంజనా ప్రొడక్షన్ బ్యానర్లో ఒక సినిమా తీయాలని చర్చించుకున్నారు. కానీ అప్పటి పరిస్థితుల దృష్ట్యా ఆ సినిమా పట్టాలెక్కలేదు. ప్రత్యూష క్రియేషన్స్ ఉదయ్ కిరణ్, అంకిత జంటగా ప్రత్యూష క్రియేషన్స్ ఒక సినిమా మొదలు పెడదామని అనుకుని దీనిపై ప్రకటన కూడా ఇచ్చారు. కానీ ఆ తర్వాతా ఈ మూవీ అనుకొకుండా ఆగిపోయింది. చంద్రశేఖర్ యేలేటితో.. విభిన్న చిత్రాల దర్శకుడిగా పేరుగాంచిన చంద్రశేఖర్ యేలేటి కూడా ఉదయ్ కిరణ్‌తో ఓ సినిమా అనుకున్నారట. ప్రేమంటే సులువు కాదురా ఉదయ్ కిరణ్ హీరోగా ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం నిర్మాణంలో ఓ సినిమా మొదలుపెట్టారు. దాదాపు 80 శాతం షూటింగ్‌ను పూర్తి చేసుకున్న ఈ సినిమా ఎందుకో తెలియదు కాదు విడుదలకు నోచుకోలేదు. షూటింగ్ చివరి దశలో ఉండగా ఈ చిత్రం నిలిచిపోయింది. ఆది శంకరాచార్య ఉదయ్ కిరణ్ చేయాల్సిన భారీ సినిమా ఆదిశంకరాచార్య. ఈ సినిమా పట్టాలెక్కే సమయానికి ఉదయ్ కిరణ్ మార్కెట్ పడిపోయింది. దీంతో నిర్మాతలు సినిమాను ఆపేశారు. జబ్ వి మెట్ తెలుగు రీమేక్ షాహిద్ కపూర్, కరీనా కపూర్ జంటగా రూపొందిన బాలీవుడ్ చిత్రం జబ్ వి మిట్. ఈ మూవీతో హిందీ మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే. దీంతో ఉదయ్ కిరణ్, త్రిష హీరోహీరోయిన్లుగా తెలుగులో ఈ మూవీని రీమేక్ చేయడానికి సన్నాహాలు జరిగాయి. ఈ మూవీకి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. కానీ పట్టాలేక్కలేదు. అయితే తమిళంలో ప్రేమిస్తే భరత్, తమన్నాలతో ‘కందేన్ కందాలయి’గా ఈ మూవీని చిత్రీకరించగా.. తెలుగులోకి ‘ప్రియ.. ప్రియతమా’ పేరుతో డబ్ అయిన సంగతి తెలిసిందే. ఎంఎస్ రాజుతో ఓ సినిమా ఉదయ్ కిరణ్‌తో మనసంతా నువ్వే, నీ స్నేహం వంటి సినిమాలు చేసి మంచి హిట్ అందించారు ఎంఎస్ రాజుజ దీంతో ఉదయ్ కిరణ్‌తో హ్యాట్రిక్‌గా మరో సినిమా చేయాలని ప్లాన్ చేశాడు. కానీ ఆ సినిమా కూడా ఆగిపోయింది. తేజతో మరోసారి ఉదయ్ కిరణ్‌ను సినీ ఇండస్ట్రీకి పరిచయం చేసిన దర్శకుడు తేజ. వీరి కాంబినేషన్లో వచ్చిన ‘చిత్రం’, ‘నువ్వు నేను’ బ్లాక్‌బస్టర్‌గా నిలిచాయి. ఆ తర్వాత ఉదయ్ కిరణ్ కెరీర్ డైలామా పడిన సమయంలో ‘ఔనన్నా కాదన్న’ సినిమా తీసి హిట్ అందించాడు తేజ. ఆ తర్వాత అవకాశాలు లేక ఇబ్బందుల్లో ఉన్న ఉదయ్ కిరణ్‌ను మళ్లీ ఆదుకునేందుకు తేజ మరో సినిమాను ప్లాన్ చేశాడు. ఉదయ్‌కి స్టోరీ లైన్ కూడా చెప్పాడు. ఇక ఈ ప్రాజెక్ట్ స్క్రిప్ట్ సిద్దం చేస్తుండానే ఉదయ్ అనుకొకుండా మృతి చెందాడు. ఉదయ్ మరణాంతరం ఇదే విషయాన్ని తేజ పలు ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే. చదవండి: ఓటీటీలోకి రానున్న ఉదయ్ కిరణ్ చివరి చిత్రం -
45 మంది కొత్త వారితో 'చిత్రం' సీక్వెల్
డైరెక్టర్ తేజ గతేడాది రెండు సినిమాలు ప్రకటించాడు. ఒకటి గోపీచంద్‌తో 'అలిమేలుమంగ వేంకటరమణ' కాగా మరొకటి దగ్గుబాటి రానాతో 'రాక్షసరాజు రావణాసురుడు'. ఈ రెండు సినిమాలు ఇంకా షూటింగ్‌కు నోచుకోనేలేదు, అప్పుడే మరో కొత్త చిత్రాన్ని ప్రకటించాడు. తొలి ప్రయత్నంలోనే తనకు పేరు ప్రఖ్యాతలు తెచ్చిపెట్టిన చిత్రం మూవీకి సీక్వెల్ "చిత్రం 1.1" తీస్తున్నట్లు వెల్లడించాడు. ఈ సినిమా షూటింగ్ మార్చిలో షురూ కానున్నట్లు పేర్కొన్నాడు. సోమవారం తన పుట్టిన రోజు సందర్భంగా తేజ ఈ విషయాన్ని సోషల్ మీడియాలో అధికారికంగా తెలిపాడు. అంతే కాదు, ఇందులో 45 మంది కొత్త వాళ్లు నటించనున్నట్లు చెప్పుకొచ్చాడు. కాగా 2000 సంవత్సరంలో వచ్చిన 'చిత్రం' సినిమాతో తేజ టాలీవుడ్‌కు దర్శకుడిగా పరిచయమయ్యాడు. ఆర్పీ పట్నాయక్ కూడా ఈ చిత్రంతోనే సంగీత దర్శకుడిగా ప్రయాణాన్ని ప్రారంభించాడు. ఉదయ్ కిరణ్, రీమాసేన్ జంటగా నటించిన ఈ మూవీ అప్పట్లో ట్రెండ్ సెట్టర్‌గా నిలిచింది. మళ్లీ 21 ఏళ్ల తర్వాత దీనికి సీక్వెల్ తీయడానికి రెడీ అవుతున్నాడు తేజ. తన సినిమాల ద్వారా ఎందరో నటీనటులకు లైఫ్ ఇచ్చిన తేజ ఈసారి ఇండస్ట్రీకి ఎవర్ని పరిచయం చేస్తారనేది టాలీవుడ్లో ఆసక్తికరంగా మారింది. ఇక ఈ సీక్వెల్ మరోసారి 'చిత్రం' మ్యాజిక్ రిపీట్ చేస్తుందా అనేది తెలియాలంటే కొంతకాలం వేచి చూడాల్సిందే. Will start shoot this Year! pic.twitter.com/VHVIJEJ2PT — Teja (@tejagaru) February 22, 2021 చదవండి: తేజ సినిమా: కాజల్ పోయి.. తాప్సీ వచ్చే బన్నీని పోలీసులు అలా వాడేసుకున్నారన్నమాట! -
రమణ యాక్షన్
వెంకటరమణ యాక్షన్ మొదలుపెట్టే డేట్ ఫిక్సయిందట. ఈ ఫైట్ అలిమేలు కోసమేనా? తెలియాల్సి ఉంది. గోపీచంద్ హీరోగా తేజ దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రం ‘అలిమేలు మంగ వెంకటరమణ’. ‘జయం, నిజం’ సినిమాల తర్వాత గోపీచంద్, తేజ కాంబినేషన్లో వస్తున్న సినిమా ఇది. అయితే ఆ చిత్రాల్లో విలన్‌గా నటించిన గోపీచంద్ ఈ సినిమాలో హీరోగా నటించనున్నారు. ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ఈ నెల 7న హైదరాబాద్‌లో ప్రారంభం కానుందని తెలిసింది. యాక్షన్ సన్నివేశాలతో ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం కానుంది. ఈ సినిమాలో హీరోయిన్గా సాయిపల్లవి నటించనున్నారు. -
తేజ సినిమా: కాజల్ పోయి.. తాప్సీ వచ్చే
ఇండస్ట్రీకి పరిచయమై పుష్కర కాలం పూర్తయినా కూడా ఇప్పటికీ టాప్ హీరోయిన్గా కొనసాగుతోంది కాజల్ అగర్వాల్. ఇటీవల పెళ్లి చేసుకొని వివాహ బంధంలోకి అడుగుపెట్టిన టాలీవుడ్ ముద్దుగుమ్మ కాజల్ వైవాహిక బంధాన్ని, సినీ కెరీర్‌ను బాగానే మేనేజ్ చేస్తోంది. ఒకవైపు సినిమా షూటింగ్‌ల్లో పాల్గొంటూనే మరోవైపు భర్త గౌతమ్ కిచ్లుకు తగినంత సమయాన్ని కేటాయిస్తోంది. ఈ న్యూ ఇయర్ సందర్భంగా భర్తతో కలిసి పలు దేశాల్లో విహరించిన విషయం తెలిసిందే. ఇక సినిమాల విషయానికొస్తే.. కాజల్ ప్రస్తుతం ఆచార్య సినిమా చేస్తోంది. మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న ఈ సినిమాను కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. ఇవే కాకుండా కాజల్ చేతిలో అనేక ప్రాజెక్టులు ఉన్నాయి. కమల్ హాసన్ ఇండియన్-2లో కూడా నటిస్తోంది. అంతేగాక భర్త గౌతమ్‌తో కలిసి కుషన్ వ్యాపారాన్ని ప్రారంభించారు ఈ భామ. ఇదిలా ఉండగా డైరెక్టర్ తేజ తెరకెక్కించనున్న ‘అలివేలు వెంకటరమణ’ సినిమాలో నటించేందుకు కాజల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ సినిమా నుంచి కాజల్ వైదొలిగినట్లు వార్తలు వినిపిస్తన్నాయి. కొన్ని కారణాల వల్ల కాజల్ తప్పుకోగా ఆమె స్టానంలో సొట్ట బుగ్గల సుందరి తాప్సీ పన్నును తీసుకున్నట్లు వినికిడి. కాగా కాజల్, తేజ కాంబినేషన్లో ఇప్పటికే లక్ష్మీ కళ్యాణం, నేనే రాజు నేనే మంత్రితో పాటు సీతా సినిమాలు వచ్చాయి. -
బ్యాక్‌డోర్ ఎంట్రీ
పూర్ణ ప్రధాన పాత్రలో యువ కథానాయకుడు తేజ ముఖ్య పాత్రలో తెరకెక్కుతోన్న చిత్రం ‘బ్యాక్ డోర్’. కర్రి బాలాజీ దర్శకత్వంలో బి. శ్రీనివాస్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమా మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకుంది. కర్రి బాలాజీ మాట్లాడుతూ– ‘‘బ్యాక్ డోర్’ ఎంట్రీ వల్ల ఎదురయ్యే విచిత్ర పరిణామాల నేపథ్యంలో రూపొందుతున్న చిత్రమిది. ఈ చిత్రం పూర్ణ కెరీర్లో ఓ మైలు రాయిలా నిలిచిపోతుంది’’ అన్నారు. ‘‘ఈ చిత్రం దర్శకుడిగా బాలాజీకి చాలా మంచి పేరు తెస్తుంది’’ అన్నారు బి.శ్రీనివాస్ రెడ్డి. ‘‘నిర్మాతకు రివార్డులు, దర్శకుడికి అవార్డులు రావడం ఖాయం’’ అన్నారు పూర్ణ. ఈ చిత్రానికి కెమెరా: ఓంకార్ యూనిట్, సంగీతం: ప్రణవ్, కెమెరా: శ్రీకాంత్ నారోజ్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: రేఖ, సహ నిర్మాత: ఊట శ్రీను. -
బ్యాక్ డోర్‌తో ఇబ్బందులు
హీరోయిన్ పూర్ణ ప్రధాన పాత్ర పోషిస్తున్న చిత్రం ‘బ్యాక్ డోర్’. నంది అవార్డు గ్రహీత కర్రి బాలాజీ దర్శకత్వంలో బి. శ్రీనివాస్ రెడ్డి నిర్మిస్తున్నారు. యువ కథానాయకుడు తేజ ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు. ప్రస్తుతం పూర్ణ, తేజలపై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ‘‘బ్యాక్‌డోర్’ ఎంట్రీ వల్ల ఎదురయ్యే విచిత్ర పరిణామాల నేపథ్యంలో రూపొందుతున్న చిత్రమిది’’ అన్నారు కర్రి బాలాజీ. ‘‘బాలాజీగారు కంప్లీట్ క్లారిటీతో షూటింగ్ చేస్తున్నారు’’ అన్నారు బి. శ్రీనివాస్ రెడ్డి. ‘‘నిర్మాతకు రివార్డులు, దర్శకుడికి అవార్డులు తెచ్చిపెట్టే చిత్రమిది’’ అన్నారు పూర్ణ. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: రేఖ, కో–ప్రొడ్యూసర్: ఊట శ్రీను. -
డైరెక్టర్ తేజకు కరోనా పాజిటివ్
సాక్షి, హైదరాబాద్ : కరోనా వైరస్ ఎవరిని వదిలి పెట్టడం లేదు. సామాన్య ప్రజల నుంచి సెలబ్రిటీల వరకు అందరూ కరోనా బారిన పడుతున్నారు. ఇటీవల దర్మక ధీరుడు రాజమౌళి కుటుంబానికి కరోనా సోకిన విషయం తెలిసిందే. తాజాగా మరో ప్రముఖ డైరెక్టర్ తేజకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా తన సోషల్ మీడియాలో వెల్లడించారు. ఇటీవల ఓ వెబ్ సిరీస్ షూటింగ్లో తేజ పాల్గొన్నారు. అనంతరం షూటింగ్ సభ్యుల్లో ఒకరికి కరోనా సోకినట్లు తేలింది. దీంతో ముందు జాగ్రత్త చర్యగా కరోనా నిర్దారణ పరీక్షలు నిర్వహించుకోగా తేజకు పాజిటివ్‌గా తేలింది. (కరోనా నుంచి కోలుకున్న బిగ్ బి) కాగా ఈ విషయంపై తేజ స్పందిస్తూ.. ‘అందరూ ఇంట్లో ఉండి కరోనా తెచ్చుకుంటే నేను షూటింగ్‌కు వెళ్లి కరోనా తెచ్చకున్నా. మా షూటింగ్లో సభ్యులకు గానీ, మా కుటుంబసభ్యులకు ఎవరికీ కరోనా రాలేదు. నా ఒక్కడికే కరోనా పాజిటివ్, ప్రస్తుతం హోం క్వారంటైన్లో ఉన్నా’ అని తెలిపారు. మరోవైపు తేజకు కరోనా సోకిన విషయం తెలియడంతో ఆయన త్వరగా కోలుకోవాలని అభిమానులు ప్రార్ధిస్తున్నారు. ఇదిలా ఉండగా కరోనా వైరస్ బారిన పడకుండా ఉండటానికి ప్రజలకు జాగ్రత్తలు చెబుతూ తేజ నెల క్రితం ఓ వీడియోను విడుదల చేశారు. ప్రజలకు జాగ్రత్తలు చెప్పిన తేజ.. ఇప్పుడు ఆ మహమ్మారి బారిన పడటం గమనార్హం. (దర్శకుడు రాజమౌళికి కరోనా పాజిటివ్) Director @tejagaru about spreading #CoronavirusIndia. #StaySafe pic.twitter.com/lD9R1ZtPtM — Vamsi Shekar (@UrsVamsiShekar) June 12, 2020 -
సోషల్ మీడియాలో లైవ్ ఆడిషన్స్
కొత్త వారికి నటీనటులుగా అవకాశాలు ఇచ్చి ప్రోత్సహించే డైరెక్టర్ తేజ మరోసారి తన తర్వాతి సినిమాకి ప్రతిభావంతులైన నటీనటులను పరిచయం చేయనున్నారు. ఇందుకోసం సోషల్ మీడియా వేదికగా ఆడిషన్స్ నిర్వహించనుండటం విశేషం. కరోనా లాక్డౌన్ నేపథ్యంలో ఇలా లైవ్ ఆడిషన్స్ ప్లాన్ చేశారు. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్స్‌లో సినిమాలు చేయనున్నట్లు ఆ మధ్య తేజ ప్రకటించిన సంగతి తెలిసిందే. వాటిలో ఒకటి రానా దగ్గుబాటితో ‘రాక్షసరాజు రావణాసురుడు’ సినిమా కాగా, మరొకటి గోపీచంద్‌తో ‘అలిమేలుమంగ వేంకటరమణ’ చిత్రం. ఈ రెండు సినిమాల్లో దేని కోసం ఈ ఆడిషన్స్‌ను నిర్వహించనున్నారనే విషయాన్ని త్వరలో వెల్లడించనున్నారు. కాగా హలో యాప్‌లో అప్లోడ్ చేసిన అప్లికేషన్లను మాత్రమే ఫైనల్ ఆడిషన్స్ కోసం పరిగణనలోకి తీసుకుంటామని తేజ స్పష్టం చేశారు. కరోనా కారణంగా ఆయా సినిమా యూనిట్స్ తక్కువ మందితో షూటింగ్ చేయడం, భౌతిక దూరం పాటించడం వంటి జాగ్రత్తలు తీసుకోనున్నారు. ఇక ఆడిషన్స్ కూడా ఇలా లైవ్‌లో జరుగుతున్నాయన్న మాట. -
లాక్డౌన్లో ఏం చేస్తున్నారు?
నెలరోజులయింది అందరం లాక్డౌన్లో ఉండి. గృహ నిర్భందనను, ప్రభుత్వ నిబంధనలను క్రమంగా పాటిస్తూ కరోనా దరి చేరకుండా పోరాటం చేస్తున్నాం. ఈ 30 రోజుల్లో ఏం చేశాం? ఏం నేర్చుకున్నాం? ఈ లాక్డౌన్ పూర్తయ్యేలోగా ఎలాంటి విషయాలు నేర్చుకొని బయటకు రావాలనుకుంటున్నాం? ఒక్కసారి అందరం స్వీయ పరిశీలన చేసుకోవాల్సిన సమయం ఇది. ఇవే ప్రశ్నలను కొందరు స్టార్స్‌ని అడిగితే ఇలా సమాధానమిచ్చారు. అంత్యక్రియలకు కూడా అడ్డుపడుతోంది - భూమిక ‘‘ప్రపంచంలో ప్రతి ఒక్కరూ సమానమే. మన కులం, మతం, స్టేటస్ ఇవేమీ మనల్ని ఎక్కువ... తక్కువ చేయవు. ఈ విషయం కంటికి కనిపించని ఒక్క సూక్ష్మ జీవి మళ్లీ మనందరికీ గుర్తు చేస్తోంది’’ అన్నారు భూమిక. లాక్డౌన్ సమయంలో ఏం చేస్తున్నారు అనే విషయం గురించి ఈ విధంగా చెప్పారు. కరోనా వైరస్ మనకు తెలియకుండానే దాడి చేస్తుంటుంది. చివరకు మనకు సరైన అంత్యక్రియలు కూడా జరగనివ్వకుండా చేస్తోంది. గోల్డెన్ టెంపుల్లో ఆధ్యాత్మిక గీతాలు ఆలపించే నిర్మల్ సింగ్ కల్సా పద్మశ్రీ పొందారు. ఆయన ఇటీవలే కరోనాతో మరణించారు. ఆయన అంత్యక్రియలు ఊరి స్మశానంలో జరపొద్దని, వైరస్ వ్యాప్తి చెందుతుందని గ్రామ ప్రజలు అడ్డుపడ్డారు. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నాం మనం. ప్రస్తుతం కుటుంబ సభ్యులతో టైమ్ గడుపుతున్నాను. ఇంటి పని, వంట పని, మా పిల్లాడిని చదివిస్తూ, వాడితో ఆడుకుంటున్నాను. మొక్కల్ని పెంచుతున్నాను. మా కుక్కల్ని చూసుకుంటున్నాను. కరోనా నిజంగా మ్యాజిక్ చేసింది. అందరూ తమ ఇంటి సభ్యులతో ఎక్కువసేపు గడిపేలా చేస్తోంది. వ్యాయామం చేస్తున్నాను. పంజాబీ మాట్లాడటం వచ్చు కానీ రాయడం, చదవడం రాదు. ప్రస్తుతం పంజాబీ నేర్చుకుంటున్నా. అలాగే కరోనా మనందరిలో క్రమశిక్షణ, కంట్రోల్‌ను చాలావరకూ నేర్పింది. సాధారణంగానే నేను చాలా పరిశుభ్రతను పాటించే వ్యక్తిని. అందుకని శుభ్రం గురించి కొత్తగా నేర్చుకున్న విషయాలే లేవు. మానవత్వం మీద గౌరవం పెరిగింది - మధుబాల ‘‘ప్రస్తుత పరిస్థితులను గమనిస్తుంటే మానవత్వం, కృతజ్ఞతాభావం వంటి వాటి పట్ల నాకు ఉన్న గౌరవం పెరిగింది. ప్రపంచం అంతా ఎదుర్కొంటున్న ఈ కరోనా గడ్డు పరిస్థితుల నుంచి మనందరం త్వరగా బయటపడాలని కోరుకుంటున్నాను’’ అన్నారు నటి మధుబాల. ఇంకా పలు విషయాలను ఇలా పంచుకున్నారు. ప్రస్తుతం అందరం కఠినమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నాం. సాధారణంగా నా భర్త, పిల్లలు చాలా బిజీగా ఉంటారు. నిజానికి ఒక రోజులో మేం అందరం ఇంట్లో కలుసుకునే సందర్భాలు కూడా తక్కువ. ప్రస్తుతం అందరం ఇంట్లోనే ఉంటున్నాం. రోజంతా మా ముఖాలు మేమే చూసుకుంటున్నాం. నా భర్త, నా పిల్లలు కొంచెం ఆన్లైన్ వర్క్ చేస్తున్నారు. నాకు అలా కుదరదు కాబట్టి వ్యాయామం, యోగ, డ్యాన్స్, రీడింగ్ వంటివి చేస్తున్నాను. రోజులో సమయం కుదిరినప్పుడు అమేజాన్, నెట్‌ఫ్లిక్స్ వంటి డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌లో సినిమాలు చూస్తున్నాను. వ్యాయామానికి, రీడింగ్‌కు ఎక్కువ సమయాన్ని కేటాయిస్తున్నాను. ఎలాంటి పరిస్థితుల్లో అయినా నేను మానసికంగా ధృడంగా ఉండాలని కోరుకుంటాను. నా బాడీ, మైండ్ ఆరోగ్యంగా ఉండేందుకు శ్రమిస్తాను. నేను బుక్స్ ఎక్కువగా చదువుతాను. ప్రస్తుతం ఫిక్షన్‌కి చెందినవి కాకుండా కొన్ని సీరియస్ బుక్స్ చదువుతున్నాను. దీని వల్ల నాకు తెలియని విషయాలను తెలుసుకోగలుగుతున్నాను. నాలెడ్జ్ పెంచుకుంటున్నాను. శారీరకంగా, మానసికంగా మరింత స్ట్రాంగ్‌గా ఉండేందుకు ఈ లాక్డౌన్ సమయాన్ని ఉపయోగించు కుంటున్నాను. ప్రకృతిని గౌరవించడం మర్చిపోయాం - తేజ ‘‘మనుషులందరం ప్రకృతిని గౌరవించడం మర్చిపోయాం. ఆ వైఖరి మారాలి’’ అంటున్నారు దర్శకుడు తేజ. లాక్డౌన్ సమయాల్లో ఆయన ఏం చేస్తున్నారు? అనే విషయాలు పంచుకున్నారు. ‘‘ఈ లాక్ డౌన్ వల్ల మనందరం తెలుసుకోవాల్సింది ఏంటంటే.. భూమి కేవలం మనకు (మనుషులకు) మాత్రమే కాదు. భూమి మీద నివశించే ప్రతీ ఒక్కరికీ అంతే హక్కు ఉంటుంది. ప్రస్తుతం ఇంట్లోనే ఉంటూ పుస్తకాలు చదువుతున్నాను, రాసుకుంటున్నాను, గిన్నెలు శుభ్రం చేస్తున్నాను, మా కుక్కపిల్లలకు స్నానం చేయించడం, మొక్కలకు నీళ్లు పోయడం, గార్డెనింగ్ చేయడం, మా ఆవిడ నిత్యావసర సరుకులు కొనడానికి బయటకు వెళ్లినప్పుడు తనకు డ్రైవర్‌గా ఉండటం వంటి పనులు చేస్తున్నాను. లాక్డౌన్ పరిస్థితుల ఆధారంగా ఓ కథ రాస్తున్నాను. గాలి ద్వారా వ్యాప్తి చెందే వైరస్ల గురించి ప్రపంచ ఆరోగ్య సంస్థలో కోర్స్ నేర్చుకుంటున్నాను. ఇది ఎలా వస్తుంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయాలను అవగాహన చేసుకుంటున్నాను. ఈ కోర్స్ పాస్ అవుతాననే అనుకుంటున్నాను. తేజ, అల్లరి నరేష్ వంట చేస్తానని ఎప్పుడూ అనుకోలేదు - అల్లరి నరేష్ ‘‘లాక్డౌన్లో భాగంగా గడిచిన ఈ 30 రోజులు ఓ వినూత్నమైన అనుభవాన్నిస్తున్నాయి. కరోనా కారణంగా మనకంటే తీవ్రంగా నష్టపోయిన కొన్ని దేశాల్లోని ప్రçస్తుత పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి’’ అన్నారు ‘అల్లరి’ నరేష్. ఇంకా పలు విషయాలను పంచుకున్నారు. మనం ఆగర్యోం గురించి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉంది. సామాజిక దూరం, ఐసొలేషన్ వంటివాటితోనే మనం కరోనాను కట్టడి చేయగలం. ప్రస్తుతానికి దీనికి ప్రత్యామ్నాయం లేదు. ఇలాంటి సమయాల్లో మన మానసిక ఆరోగ్యం, సహనం కూడా ముఖ్యమే. మన ఇంట్లో చిన్నారులు ఉన్నప్పుడు రోజును తప్పనిసరిగా ఓ క్రమపద్ధతిలో ప్లాన్ చేసుకోవాల్సిందే. మా దినచర్య మా మూడున్నరేళ్ల పాప సమయపాలనను బట్టి ప్రారంభం అవుతుంది. నా భార్య (విరూప) నా కూతుర్ని ఎప్పుడూ అంటి పెట్టుకునే ఉంటుంది. అందుకే నా భార్య ఈ లాక్డౌన్ పరిస్థితులను బాగా బ్యాలెన్స్ చేస్తోంది. మా చిన్నారికి పాఠాలు చెప్పడం, ఆడుకోవడం, కథలు చెప్పడం వంటివి చేస్తున్నాం. అయితే లాక్డౌన్ వల్ల మన రోటీన్ లైఫ్ తప్పక ప్రభావితం అవుతుంది. నేను వంట చేస్తానని ఎప్పుడూ అనుకోలేదు. కానీ రెండు వారాలుగా అదే పనిలో ఉన్నాను (సరదాగా). వంట చేయడం అంటే రెసిపీని ఫాలో కావడమే కాదు. తప్పనిసరిగా కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. నేను వంట చేయడాన్ని నా భార్య, నా కుమార్తె బాగా ఎంజాయ్ చేస్తున్నారు. దాంతో ముగ్గురం కలిసి వంట పనులు చేయాలనుకున్నాం. మా పాప వెల్లుల్లి తొక్క తీయడం, ఆకుకూరలను తుంచడం వంటి పనులు చేస్తుంటే చాలా సరదాగా అనిపిస్తోంది. నాకు హలీమ్ అంటే ఇష్టం. ప్రస్తుతం లాక్డౌన్ వల్ల బయటకు వెళ్లి తినలేం. అందుకని ఈ ఏడాది నేనే స్వయంగా హలీమ్ చేయడం నేర్చుకోవాలనుకుంటున్నాను. -
వెరైటీ టైటిళ్లతో తేజ కొత్త చిత్రాలు.. హీరోలు వీరే
టాలీవుడ్ విలక్షణ దర్శకుడు తేజ శనివారం తన పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ ప్రత్యేక సందర్భంలో, ఆయన తన తదుపరి రెండు సినిమాల టైటిళ్లనూ, వాటి హీరోలనూ ప్రకటించారు. ఒక మూవీలో గోపీచంద్, మరో సినిమాలో రానా హీరోలుగా నటించనున్నారు. ఈ సినిమాల కోసం ఆయన 'రాక్షస రాజు రావణాసురుడు', 'అలిమేలు మంగ వెంకట రమణ' అనే ఆసక్తికర టైటిళ్లను రిజిస్టర్ చేయించారు. అయితే, ఆసక్తికరమైన విషయమేమంటే, హీరోలు సహా ఎవరి పేర్లనూ ప్రస్తావించకుండా ఈ సినిమాల పోస్టర్లను తేజ విడుదల చేశారు. దాంతో రానాతో చేసే మూవీ ఏది? గోపీచంద్ నటించే సినిమా ఏది?.. అనే విషయాన్ని ఆయన ప్రస్తుతానికి సస్పెన్స్‌లో ఉంచారు. ఈ సినిమాల నిర్మాతలనూ, వాటిలో నటించే తారాగణాన్నీ త్వరలోనే తేజ ప్రకటించనున్నారు. ఇప్పటికే ఆయన ఈ సినిమాల స్క్రిప్టుల్ని పూర్తి చేశారు. 'జయం' చిత్రంతో గోపీచంద్ కు పెద్ద బ్రేక్ ఇచ్చిన తేజ, 'నేనే రాజు నేనే మంత్రి' సినిమాతో రానాకు మరపురాని హిట్ ను అందించిన విషయం గమనార్హం. -
పాయల్ రాజ్‌పుత్‌కు మరో చాన్స్!
తొలి సినిమాతోనే టాలీవుడ్‌ను షేక్ చేసిన అందాల భామ పాయల్ రాజ్‌పుత్. ఆర్ఎక్స్ 100 సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయిన ఈ బ్యూటీ, తొలి ప్రయత్నంలోనే గ్లామర్ షోతో పాటు నెగెటివ్ రోల్లోనూ ఆకట్టుకున్నారు. ప్రస్తుతం ఆర్డీఎక్స్ లవ్ సినిమాతో పాటు రవితేజ హీరోగా తెరకెక్కుతున్న డిస్కోరాజా సినిమాల్లో నటిస్తున్నారు పాయల్. తాజాగా ఈ భామకు మరో క్రేజీ ఆఫర్ వచ్చినట్టుగా తెలుస్తోంది. ఇటీవల సీత సినిమాతో నిరాశపరిచిన తేజ తన తదుపరి చిత్రాన్ని లేడీ ఓరియంటెడ్ సినిమాగా తెరకెక్కించే ఆలోచనలో ఉన్నాడు. ఈ సినిమాలో పాయల్ రాజ్‌పుత్‌కు చాన్స్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. అయితే ఈ సినిమాలో పాయల్ నటించబోయేది హీరోయిన్గా కాదు. ఓ స్పెషల్ సాంగ్ కోసం ఈ బ్యూటీని తీసుకున్నాడట తేజ. గతంలో తేజ తెరకెక్కించిన సీత సినిమాలోనూ పాయల్ రాజ్‌పుత్ స్పెషల్ సాంగ్‌లో అలరించారు. -
కల నెరవేరుతుందా?
తేజ హీరోగా, హరిణి రెడ్డి హీరోయిన్గా రాజేష్ కనపర్తి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘డ్రీమ్ బాయ్’. మాస్టర్ ఎన్.టి. రామ్‌చరణ్ సమర్పణలో 7 వండర్స్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రేణుక నరేంద్ర నిర్మిస్తున్న ఈ సినిమా టాకీ పార్ట్ పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాజేష్ కనపర్తి మాట్లాడుతూ– ‘‘మంచి కథాబలం ఉన్న చిత్రమిది. వైవిధ్యమైన కథతో రూపొందుతున్న మా సినిమా అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నా’’ అన్నారు. ‘‘ఇది నా తొలి సినిమా. కథాబలం ఉన్న చిత్రం ద్వారా హీరోగా పరిచయం అవుతున్నందుకు, సూర్య, హేమ, ధనరాజ్ లాంటి సీనియర్ నటులతో కలసి పనిచేసే అవకాశం వచ్చినందుకు సంతోషంగా ఉంది’’ అన్నారు తేజ. ‘‘ఈ చిత్రంలో నాలుగు పాటలుంటాయి. త్వరలో వైజాగ్‌లో చిత్రీకరించనున్నాం’’ అని సంగీత దర్శకుడు సుభాష్ ఆనంద్ అన్నారు. ‘‘పోస్ట్ ప్రొడక్షన్ పనులు త్వరలో పూర్తి చేసుకొని జూలై నెలలో సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం’’ అని ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ వీరబాబు తెలిపారు. చమ్మక్ చంద్ర, రాకింగ్ రాకేష్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: నాని–సుభాష్ బొంతు. -
‘సీత’ మూవీ రివ్యూ
టైటిల్ : సీత జానర్ : రొమాంటిక్ డ్రామా తారాగణం : బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కాజల్ అగర్వాల్, సోనూసూద్ సంగీతం : అనూప్ రుబెన్స్ దర్శకత్వం : తేజ నిర్మాత : రామబ్రహ్మం సుంకర ఇన్నాళ్లు మాస్ యాక్షన్ హీరోగా ప్రూవ్ చేసుకునేందుకు ప్రయత్నించి ఫెయిల్ అయిన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఈ సారి కొత్తగా ప్రయత్నించాడు. లేడి ఓరియంటెడ్ సినిమాగా తెరకెక్కిన సీత చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. నేనే రాజు నేనే మంత్రి సినిమాతో ఘనవిజయం సాధించిన తేజ దర్శకత్వంలో కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన సీత చిత్రంలో బెల్లంకొండ ఓ చాలెంజింగ్ రోల్లో కనిపించాడు. మరి ఈ సినిమా అయిన బెల్లంకొండకు ఆశించిన సక్సెస్ అందించిందా..? తేజ వరుసగా మరో సక్సెస్ సాధించాడా..? కథ : సీతా మహాలక్ష్మి (కాజల్ అగర్వాల్) డబ్బుకు తప్ప మనుషులకు, బంధాలకు ఏ మాత్రం విలువ ఇవ్వని పొగరుబోతు. తండ్రితో గొడవపడి సొంతంగా బిజినెస్ చేసి చిక్కుల్లో పడుతుంది. తను కొన్న ఓ స్థలం సమస్యల్లో ఉండటంతో లోకల్ ఎమ్మెల్యే బసవరాజు (సోనూసూద్) సాయం కోరుతుంది. అయితే బసవ అందుకు బదులుగా తనతో నెల రోజులు గడపాలని అగ్రిమెంట్ రాయించుకుంటాడు. అగ్రిమెంట్ ముందు ఒప్పుకున్న సీత, తన పని పూర్తయిన తరువాత కాదనటంతో వ్యాపరపరంగా సీతకు అడ్డంకులు సృష్టిస్తాడు బసవ. ఆ ఇబ్బందుల నుంచి బయటపడాలంటే తనకు డబ్బు కావాలి. కానీ సీత తండ్రి తన ఆస్తినంత భూటన్లో బాబాల దగ్గర పెరుగుతున్న రఘురామ్ (బెల్లంకొండ సాయి శ్రీనివాస్) పేరిట రాసేస్తాడు. దీంతో ఆస్తి కోసం రామ్‌ను కలుస్తుంది సీత. చిన్నతనంలో ‘సీతను నువ్వు చూసుకోవాలి, నిన్ను సీత చూసుకుంటుంది’ అని మామయ్య చెప్పిన మాటలకు కట్టుబడిన రామ్, సీతతో సిటీ వచ్చేస్తాడు. అలా వచ్చిన సీతా రామ్‌లకు బసవ నుంచి ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయి.? వాటి నుంచి ఎలా బయటపడ్డారు? అన్నదే మిగతా కథ. నటీనటులు : ఇన్నాళ్లు మాస్ యాక్షన్ హీరోగా కనిపించిన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఈ సినిమాలో కొత్తగా కనిపించే ప్రయత్నం చేశాడు. తన బాడీ లాంగ్వేజ్‌కు, ఇమేజ్‌కు ఏ మాత్రం సెట్ అవని అమాయకుడి పాత్రలో పూర్తిగా నిరాశపరిచాడు. సినిమా చూశాక అసలు ఈ సినిమాకు సాయి శ్రీనివాస్ ఎలా ఓకె చెప్పాడా అన్న అనుమానం రాక మానదు. హీరోయిన్గా సీత పాత్రకు కాజల్ అగర్వాల్ పూర్తి న్యాయం చేశారు. తల పొగరు ప్రదర్శించే సన్నివేశాలతో పాటు సెంటిమెంట్ సీన్స్‌లోనూ మెప్పించారు. విలన్‌గా సోనూసూద్ ఆకట్టుకున్నాడు. బసవ క్యారెక్టర్లో తేజ గత చిత్రాల పాత్రల ఛాయలు కనిపించినా.. సోనూ తనదైన మేనరిజమ్స్‌తో ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. ఇతర పాత్రల్లో మన్నార చోప్రా, భాగ్యరాజ, తనికెళ్ల భరణి, అభిమన్యూ సింగ్‌లు తమ పరిధి మేరకు ఆకట్టుకున్నారు. విశ్లేషణ : సినిమా మొదలైన పది నిమిషాల్లోనే కథ అంతా చెప్పేసిన దర్శకుడు తేజ... తరువాత కథనాన్ని ముందుకు నడిపించేందుకు చాలా కష్టపడ్డాడు. తన గత చిత్రాల్లోని పాత్రలు, సన్నివేశాలు చాలా రిపీట్ అయిన భావన కలుగుతుంది. కథపరంగా పెద్దగా మలుపులు లేకపోయినా కథనంలో ట్విస్ట్‌లను ఇరికించే ప్రయత్నం చేశాడు. ముఖ్యంగా ప్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ వరకు ఇక సినిమా అయిపోయిందని ప్రేక్షకుడు అనుకున్న ప్రతీ సారి కొత్త ట్విస్ట్‌తో షాక్ ఇచ్చాడు. చాలా రోజుల తరువాత సంగీత దర్శకత్వం చేసిన అనూప్ రుబెన్స్ పరవాలేదనిపించాడు. ఎడిటర్ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. సినిమాట్రోగఫి, నిర్మాణవిలువలు సినిమా స్థాయికి తగ్గటుగా ఉన్నాయి. ప్లస్ పాయింట్స్ : కాజల్ అగర్వాల్ మైనస్ పాయింట్స్ : బెల్లంకొండ సాయి శ్రీనివాస్ స్క్రీన్‌ప్లే క్లైమాక్స్ సతీష్ రెడ్డి జడ్డా, ఇంటర్నెట్ డెస్క్. -
కజురహో బీర్ఫెస్ట్లో ‘సీత’ బృందం..!
-
నాది యావరేజ్ బ్రెయిన్
‘‘సీత’ సినిమా ఎలా వచ్చిందని బెంగళూరులో అడగ్గానే నా మైండ్ బ్లాంక్ అయిపోయింది. మామూలుగా సినిమా చాలా బాగా వచ్చింది.. సూపర్‌గా వచ్చిందని చెబుతారు. కానీ నేను అబద్ధం చెప్పలేను.. నిజమూ చెప్పలేను.. ఎందుకంటే నిజంగా నాకు జడ్జిమెంట్ లేదు. సినిమా తీశా.. ఎక్కడ తప్పులున్నాయో అని వెతుకుతున్నా’’ అని దర్శకుడు తేజ అన్నారు. బెల్లంకొండ సాయిశ్రీనివాస్, కాజల్ అగర్వాల్ జంటగా నటించిన చిత్రం ‘సీత’. మన్నారా చోప్రా మరో కథానాయిక. ఎ.కె.ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై రామబ్రహ్మం నిర్మించిన ఈ సినిమా ఈ నెల 24న విడుదలవుతోంది. హైదరాబాద్‌లో నిర్వహించిన ఈ చిత్రం ప్రీ రిలీజ్ వేడుకలో తేజ మాట్లాడుతూ– ‘‘సీత’ చిత్రం 90 శాతం బాగుంది. ఇప్పటికి కూడా సినిమా సూపరా? బాగుందా? ఏంటో మీరే చూసి చెప్పాలి. నేను సినిమా తీసేసి పరుచూరి బ్రదర్స్‌కి చూపించా. వాళ్లు చెప్పిన కరెక్షన్స్‌తో మళ్లీ షూట్ చేసి అంతా సరి చేశా. ఎందుకంటే నాది అంత ఇంటెలిజెంట్ బ్రెయిన్ కాదు యావరేజ్ బ్రెయిన్. నా కళ్లజోడు చూసి మేధావి అనుకుంటారు. కళ్లజోడు పెట్టుకున్నవాళ్లంతా మేధావులు కాదు.. కొంతమందే మేధావులుంటారు. సాయి శ్రీనివాస్, కాజల్, సోనూసూద్, అనూప్.. వీళ్లందరికీ నేను గ్రేడింగ్ ఇవ్వగలనేమో కానీ, నా గ్రేడింగ్ మాత్రం మీరే (ప్రేక్షకులు)ఇవ్వగలరు. నన్ను తిట్టినా, పొగిడినా దాన్ని సినిమాలో పెట్టేస్తా. ఎందుకంటే నాకు సినిమా తప్ప ఇంకొకటి రాదు. హిట్లు తీసినా, ఫ్లాపులు తీసినా ఇక్కడే. ప్రేక్షకులే మాకు దేవుళ్లు.. మీరంతా బాగుండాలి’’ అన్నారు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మాట్లాడుతూ– ‘‘సినిమాను ప్రేమించే ప్రతి ఒక్కరి ప్రేమ, ఆదరణ పొందడానికి నేను జీవితాంతం ఇలాగే కష్టపడుతూ ఉంటా. సినిమానే నాకు ప్రాణం. సినిమా కోసం నేను ఏమైనా చేస్తా. తేజగారిలాంటి పాసొనేట్ ఫిల్మ్ మేకర్‌ను నేను లైఫ్‌లో కలవలేదు. ఇలాంటి డైరెక్టర్లను అరుదుగా చూస్తాం. నా ఆరో సినిమాకే ఇలాంటి దర్శకుడితో పని చేస్తానని అనుకోలేదు. పురుషుల కంటే మహిళలకు మేధస్సు ఎక్కువ అని చెబుతుంటాం. కానీ ప్రాక్టికల్‌గా చూపించలేదు. అందుకే అలాంటి కథతో ‘సీత’ సినిమా చేశాం’’ అన్నారు. ‘‘ఫస్ట్ టైమ్ నేను నెర్వస్ ఫీలవుతున్నా. ‘సీత’ సినిమాతో చాలా నేర్చుకున్నా. తేజగారు లేకపోతే నేను ఈ స్టేజ్‌పై ఉండేదాన్ని కాదు. ఆయన స్కూల్లోనే నేను అంతా నేర్చుకున్నా. ‘సీత’ సినిమాతో పీహెచ్డీ చేసే అవకాశం వచ్చింది’’ అన్నారు కాజల్ అగర్వాల్. ‘‘నా ఫేవరెట్ లాంగ్వేజ్ ఏంటి? అని అడిగితే వెంటనే తెలుగు అని చెప్పా. నేను హిందీవాడినే అయినా నాకంటూ ఒక ప్లాట్‌ఫామ్ ఇచ్చింది తెలుగు భాషే. టాలీవుడ్ నా ఫేవరెట్ ఇండస్ట్రీ’’ అని నటుడు సోనూ సూద్ అన్నారు. సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్, మన్నారా చోప్రా పాల్గొన్నారు. -
‘సీత’ ప్రీ రిలీజ్ వేడుక
-
తేజగారు నా బ్రెయిన్ వాష్ చేశారు
‘‘సీత’ సినిమా స్టోరీ తేజగారు నాకు ఎప్పుడో చెప్పారు. అప్పటి టైమ్‌కు సెట్ అవుతుందా? అనుకున్నాం. అప్పుడు నా డేట్స్ కూడా ఖాళీ లేవు. అలా ఆ ప్రాజెక్ట్‌ను పక్కన పెట్టాం. ‘నేనే రాజు నేనే మంత్రి’ సమయంలో ‘సీత’ సినిమా నాతోనే తీయాలి. వేరే హీరోయిన్‌తో మిమ్మల్ని చేయనివ్వనని ఆటపట్టించేదాన్ని. పెర్ఫామ్ చేయడానికి చాలా స్కోప్ ఉన్న పాత్ర ఇది. అందుకే మిస్ చేసుకోకూడదు అనుకున్నాను’’ అని కాజల్ అగర్వాల్ చెప్పారు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కాజల్ జంటగా తేజ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సీత’. ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై అనిల్ సుంకర నిర్మించారు. ఈ నెల 24న ఈ చిత్రం రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా కాజల్ అగర్వాల్ మీడియాతో పలు విశేషాలు పంచుకున్నారు. ► నాకు పురాణాలంటే చాలా ఇష్టం. కానీ ఈ సినిమాకు పురాణాలకు ఎక్కువ సంబంధం లేదు. ఇదంతా ప్రస్తుత కాలంలో జరిగే కథ. సినిమాలో ఎక్కువ మానవ సంబంధాలు, లక్ష్యాల గురించి చర్చించాం. కొందరమ్మాయిలు సింపుల్‌గా పెళ్లి చేసుకుని సెటిలైతే చాలు అనుకుంటున్నారు. కొందరమ్మాయిలు ఏదైనా సాధించాలనుకుంటారు. ఇందులో నా పాత్రకు ఓ గోల్ ఉంటుంది. దాన్ని అందుకోవడం కోసం ప్రయత్నిస్తుంటుంది. తను చాలా స్వార్థపరురాలు. ► తేజగారు స్క్రిప్ట్‌కు తగ్గ టైటిల్ మాత్రమే పెడతారని మనకు తెలుసు. దీనికి అలానే పెట్టారు. నటిగా నా కెరీర్ స్టార్ట్ చేసినప్పటి నుంచి నా ప్లస్, మైనస్సులు ఆయనకు తెలుసు. ఇందులో నటిగా నన్ను ఇంకా పుష్ చేశారు. తేజగారంటే నాకు చాలా గౌరవం. సినిమా మీద ఆయనకున్న డ్రైవ్ ‘లక్ష్మీ కల్యాణం’ సమయంలో ఎలా ఉందో ఇప్పుడూ అలానే ఉంది. ఆయన నాకు లక్కీ. ► సాయిశ్రీనివాస్‌తో మంచి కెమిస్ట్రీ ఏర్పడింది. మేమిద్దరం ‘కవచం’ సినిమా చేయడం వల్ల ఈ సినిమాకు ఇంకా ప్లస్ అయిందనుకుంటున్నాను. నా పాత్ర కంటే కూడా తనది ఇంకా కష్టమైన పాత్ర. చాలా బాగా చేశాడు. యంగ్ హీరోలతో యాక్ట్ చేసినా డామినేట్ చేయను. సరదాగా టీజ్ చేస్తానేమో. ► ఈ సినిమాలో నా పాత్రను కొందరు రిలేట్ చేసుకోవచ్చు. కొందరు ఇలా ఉందేంటి? అని కూడా అనుకోవచ్చు. నా పాత్రకు నెగటివ్ షేడ్స్ ఉంటాయి. ఈ పాత్రను కొన్నిసార్లు నేనూ రిలేట్ చేసుకున్నా, కొన్నిసార్లు ఇది టూమచ్ అనుకున్నాను. ప్రతీ సీన్ ముందు తేజగారు కొంచెం బ్రెయిన్ వాష్ కూడా చేశారు. ఆ పాత్ర అలాంటిది. ► సీత పాత్ర చేయడానికి హోమ్‌వర్క్ అంటే.. తేజగారితో చాలా డిస్కషన్స్ చేశాను. సీత ఎలా ఉంటుంది అని నోట్స్ రాసుకున్నాను. చాలా పుస్తకాలు చదివాను. అలాగే ఈ సినిమాలో నా స్టంట్స్ నేనే చేసుకున్నాను. గాయాలు కూడా అయ్యాయి. నా వీపు అంతా ప్లాస్టర్స్‌తో నిండిపోయింది. నిటారుగా కూర్చోలేని సందర్భాలు కూడా ఉన్నాయి. ఫిజియోథెరఫీ కూడా చేయించుకోవాల్సి వచ్చింది. ► నా తోటి హీరోయిన్లు ఫీమేల్ ఓరియంటెడ్ సినిమాలు చేస్తున్నారని నేను చేయను. నాకు నచ్చాలి కదా? పక్కవారితో పోల్చి చూసుకోను. నా దగ్గరకు వచ్చిన వాటిలో బెస్ట్ పిక్ చేసుకుంటాను. ► 23న ఎన్నికల రిజల్ట్స్ రాబోతున్నాయి. 24న మా సినిమా రిలీజ్ కాబోతోంది. భవిష్యత్తులో రాజకీయాల్లోకి వస్తారా అంటే ఆ ఉద్దేశమే లేదు. ప్రస్తుతం నా ఫోకస్ అంతా సినిమాలపైనే ఉంది. సినిమాలు చేసే ప్రాసెస్‌ను చాలా ఎంజాయ్ చేస్తున్నాను. భవిష్యత్తు గురించి ఆలోచించను. ► తెలుగులో శర్వానంద్‌తో ఓ సినిమా, తమిళంలో క్వీన్ రీమేక్ ‘ప్యారిస్ ప్యారిస్’, ‘జయం’ రవితో చేసిన ‘కోమలి’ రిలీజ్‌కు రెడీ అవుతున్నాయి. ‘భారతీయుడు 2’ జూన్ నుంచి తిరిగి ప్రారంభం అవుతుంది. మరో ప్రాజెక్ట్ వివరాలు రెండు రోజుల్లో తెలియజేస్తాను. -
రూమరమరాలు
ఇంగ్లిష్‌లో ‘రూమర్ మిల్’ అనే మాట ఉంది. అంటే.. పిడి మరలాగే రూమర్లకూ ఒక మర ఉంటుందని!ఆ పిండితో ఏ రొట్టే చెయ్యలేం. కానీ ఆకలి తీరుతుంది!రూమరో రామచంద్రా..అన్నంతగా ఉన్న..ఆకలి తీరుతుంది. కానీ.. రూమర్లు లైట్‌గా ఉండాలి. లైట్‌గా ఉంటే..మరమరాల్లా ఎంజాయ్ చెయ్యొచ్చు.మోతాదు మించితేనే ముంచినంత పని చేస్తాయి! ప్రాణి పుట్టుకకు ఎక్స్‌వై క్రోమోజోములు అవసరం. ప్రాణం లేని రూమర్ పుట్టుకకు ‘డెవిల్స్ వర్క్‌షాప్’ ఒకటి చాలు! పనిలేని బుర్ర! అది పుట్టిస్తుంది అందమైన రూమర్లు. బాధించే రూమర్లు. కంపెనీలను లాస్ చేయించే రూమర్లు. కెరీర్‌ను దెబ్బదీసే రూమర్లు. మంచి రూమర్లు ఎక్కువ కాలం బతకవు. బతికినా వెంటనే చనిపోతాయి. చెడ్డ రూమర్లే.. ‘పాపి చిరాయువు’లా బతికేస్తుంటాయి! రూమర్లంటే ఎవరైనా భయపడి చచ్చేది అందుకే. సెలబ్రిటీలకైతే రూమర్లంటే మహా వణుకు. నోరు మెదపరు. వాళ్ల నోట్లో వేలుపెట్టి కోపం తెప్పించి, వేలు కొరికించుకుని రూమర్లు క్రియేట్ చేసేవాళ్లు కూడా ఉంటారు. అసలు నోరు, వేలు, కోపం, కొరకడం.. ఇవేవీ లేకుండానే పుట్టే రూమర్లూ ఉంటాయి! నానీ ‘జెర్సీ’ బాగుందని జూ‘‘ ఎన్టీఆర్ ఎక్కడో ఒక ట్వీటో, చిన్న మాటో వేశాడు. అక్కడో రూమర్ పుట్టేసింది. ‘కథానాయకుడు’ బాగుందని అనలేదు. ‘మహానాయకుడు’ బాగుందని అనలేదు. ‘జెర్సీ’ బాగుందని అన్నాడు. తాతగారి మీద తీసిన ఆ రెండు బయోపిక్కుల్లో తనకు పాత్రే లేకుండా చేసినందుకు జూ‘‘ ఎన్టీఆర్ అలా రివెంజ్ తీర్చుకున్నాడని రూమర్. అర్థం లేని రూమర్లపై ఎవరైనా ఎందుకు మాట్లాడతారు. ఎన్టీఆర్ కూడా మాట్లాడలేదు. లోకంలో ఎన్ని ఇండస్ట్రీలు ఉన్నా రూమర్లకు అనువుగా ఉండేది సినిమా ఇండస్ట్రీ ఒక్కటే. హాలీవుడ్లో రోజుకు లక్ష రూమర్లు పుట్టుకొస్తుంటాయి. బాలీవుడ్లో వెయ్యి రూమర్లు ఉసురు పోసుకుంటాయి. మన తెలుగువుడ్ ఇంకా అంత ‘డెవలప్’ కాలేదు. నయం అనుకోవాలి అంతగా డెవలప్ కాకపోవడం. షూటింగ్ స్పాట్ వరకైతే ఓకే. మరీ ఇళ్లలోకి వెళ్లిపోకూడదు కదా. కానీ పబ్లిక్ పర్సన్స్ ప్రైవేట్ లైఫ్ ఈజ్ మోర్ ఇంట్రెస్టింగ్ దేన్ ప్రైవేట్ పర్సన్స్ పబ్లిక్ లైఫ్. మానవ నైజం. ‘సైరా’ సెట్లో చిరంజీవి గెటప్ ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. ఇంటికెళ్లాక పెరట్లో మొక్కలకు ట్యూబ్ పట్టుకుని నీళ్లు పడుతున్నప్పుడు చిరంజీవి గెటప్ ఎలా ఉంటుందో తెలుసుకోవడం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ‘‘సరే రావయ్యా.. మొక్కలకు నీళ్లు పడుతున్నప్పుడు ఒక ఫొటో తీసుకో’’ అని చిరంజీవి అంటారేమో. అయితే ఇండస్ట్రీలో అంత ఈజీగా ఏదీ ఉండదు. ఈజీగా లేని పరిస్థితుల్లో ఈజీగా పుట్టేవే రూమర్లే. దసరాకి కాదా సైరా ‘సైరా నరసింహారెడ్డి’ ఈ దసరాకు విడుదల కానట్లేనా! అనే రూమర్ ఇప్పుడు రౌండ్లు కొడుతోంది. మెగాస్టార్ అభిమానుల డీలా పడిపోయారు. ‘శంకర్ దాదా జిందాబాద్’ తర్వాత పదేళ్లకు ‘ఖైదీ నెం.150’గా సాక్షాత్కరించారు చిరు. మళ్లీ రెండేళ్ల గ్యాప్! సైరా కోసం అవురావురుమని చూస్తున్నారు. సినిమా రిలీజ్ అవుతుందని చూస్తుంటే రూమర్ రిలీజ్ అయింది.. దసరాకు విడుదల కావడం లేదని!! దర్శకుడు సురేందర్‌రెడ్డి. నిర్మాత రామ్ చరణ్. భారీగా తీస్తున్నారు. శరవేగంతో షూటింగ్ అవుతోందనీ, క్లయిమాక్స్‌కి వచ్చేశామని కూడా చెప్పారు. ఇప్పుడేమిటి దసరాకు కాదంటున్నారు? సెట్లో అగ్నిప్రమాదం జరిగింది కదా, అందుకే లేట్ అవుతోందని ఒక రూమర్. లేట్ చేయించడానికే అగ్నిప్రమాదం సృష్టించారని ఇంకో రూమర్. రామ్ చరణ్‌కి ప్రకటన ఇవ్వక తప్పలేదు. ‘‘అవును.. సైరా దసరాకు విడుదల కావడం లేదు’’ అన్నాడు. ఆ వెంటనే.. ‘‘అక్టోబర్ 2కి విడుదల చేస్తున్నాం’’ అన్నాడు. చిరు అభిమానులు ఆనందంతో షాక్‌లోకి వెళ్లిపోయారు. అక్టోబర్ 2.. ఈ ఏడాది దసరాకంటే ముందొచ్చేస్తోంది మరి! దసరా అక్టోబర్ 8న. ఆశించినదానికి ఆరు రోజులే ముందే అయినా ఫ్యాన్స్‌కి అదో పెద్ద పండుగ. అయితే రామ్ చరణ్ నిజంగానే అలా అన్నారా లేక అన్నారని ఒక రూమరా?! ఏమైనా ఉల్లాసం కలిగించే సంగతే. గుడ్ రూమర్. ఏమి సేస్తిరి.. ఏమి సేస్తిరి?! చిరు ఇంట్లోనే సగానికి పైగా సినిమా ఇండస్ట్రీ ఉంది. హీరోలు, హీరోయిన్లు, నిర్మాతలు, పొలిటికల్ లీడర్స్ అంతా కలిపి పదిమందికి పైగా ఉన్నారు. అంత పెద్ద ఇల్లు కాబట్టి వాళ్లతో ఎప్పుడూ ఏదో ఒక రూమర్ సహజీవనం చేస్తుంటుంది. పవన్ కల్యాణ్ ఆ ఇంట్లోంచి బయటికి వచ్చేశాడని ఆ మధ్య ఒక రూమర్ వచ్చింది. ఇప్పుడు అల్లు అరవింద్‌కి, ఆయన కొడుకు అల్లు అర్జున్‌కి సినిమాలు తీసే విషయంలో మాటామాట వచ్చింది మరో రూమర్! రాజకీయంగా కూడా చిరంజీవి మీద, పవన్ కల్యాణ్ మీద అనేక రూమర్లు వచ్చాయి. అవన్నీ ఇప్పుడు అవుట్ డేటెడ్. అప్డేట్ ఏంటంటే.. పవన్ కల్యాణ్‌కు హీరో రాజశేఖర్ కౌంటర్ ఇచ్చాడని! ఇవ్వడం అంటే డైరెక్ట్‌గా కాదు. ఇన్‌డైరెక్ట్‌గా. ‘కల్కి’లో రాజశేఖర్ హీరో. గత గురువారం విడుదలైన ‘కల్కి’ టీజర్లో రాజశేఖర్ ‘ఏం సెప్తిరి, ఏం సెప్తిరి.. ఎప్పుడూ ఇలాగే సెప్తారా?’ అంటూ ‘గబ్బర్‌సింగ్’లో పవన్‌ని ఇమిటేట్ చేస్తాడు. గబ్బర్‌సింగ్‌లోని రౌడీల అంత్యాక్షరి సీన్లో.. రౌడీలను కమెడియన్లా పాడిస్తూ పవన్ ఎంజాయ్ చేస్తుంటాడు. ఒక కమెడియన్ లేచి, హీరో రాజశేఖర్ సూపర్ హిట్ సాంగ్ ‘రోజ్ రోజ్ రోజ్ రోజా పువ్వా’ అనే సాంగ్‌ని ఎత్తుకుంటాడు. రాజశేఖర్‌ని ఇమిటేట్ చేస్తూ సేమ్ అలాగే ఎక్స్ప్రెషన్స్ ఇస్తాడు. ప్రేక్షకులు నవ్వలేక చచ్చిన సీన్ అది. ఆ రౌడీ కమెడియన్.. సాంగ్‌ని పూర్తి చెయ్యగానే ‘ఏం సేస్తిరి.. ఏం సేస్తిరి. ఎప్పుడూ ఇలాగే సేస్తురా.. ఈ మధ్యనే ఇలాగే సేస్తున్నారా?’ అంటాడు. అప్పట్లో రాజశేఖర్‌కి, చిరంజీవికి మధ్య చిన్నపాటి మాటల యుద్ధం నడుస్తోంది. అది దృష్టిలో పెట్టుకుని పవన్ కావాలనే ఆ డైలాగులతో రాజశేఖర్‌కి కౌంటర్ ఇచ్చారని ఒక రూమర్ వచ్చింది. ఆ సీన్‌ని దృష్టిలో పెట్టుకుని ‘కల్కి’లో ఇప్పుడు రాజశేఖర్ పవన్‌కి కౌంటర్ ఇచ్చాడని రూమర్. ఈ రూమర్‌కి బొత్తిగా బేస్ లేకుండా ఏమీ లేదు. కల్కి టీజర్ ఎండింగ్లో.. సేమ్ అదే కమెడియన్ని... పోలీస్ గెటప్‌లో ఉన్న రాజశేఖర్ (గబ్బర్‌సింగ్‌లోని రౌడీ అంత్యాక్షరిలో పవన్దీ పోలీస్ గెటప్పే) కాలితో తంతాడు.. ‘ఏంట్రా ఆ ఊపుడు’ అంటూ.. నన్నే ఇమిటేట్ చేస్తావా అన్నట్లు. దీంతో రూమర్ క్రియేట్ అయి చక్కర్లు కొడుతోంది.. గబ్బర్‌సింగ్‌తో రాజశేఖర్‌ని పవన్ దెబ్బకొడితే, కల్కితో పవన్‌ని రాజశేఖర్ దెబ్బకు దెబ్బ కొట్టాడని. కనిపించవేం ప్రభాస్ ‘సైరా’లా, అభిమానులు ఏళ్లుగా ఎదురుచూస్తున్న ఇంకో సినిమా ప్రభాస్ నటిస్తున్న ‘సాహో. 2017 జూన్‌లో షూటింగ్ మొదలైంది. ఇప్పటికింకా షూటింగ్ నడుస్తూనే ఉంది. సినిమా మాట తర్వాత సంగతి విడిగానైనా ప్రభాస్‌ని చూద్దామంటే ఆయనెక్కడా కనిపించడం లేదు. ఎలా ఉన్నాడో, ఏం తింటున్నాడో అని బెంగ పెట్టేసుకున్నారు ఫాన్స్. సాహో డైరక్టర్ సుజీత్‌ని తిట్టుకుంటున్నారు కూడా. అంత లావున ఏం తీస్తున్నాడో అని. అప్పుడప్పుడు ప్రభాస్‌ని కూడా! డార్లింగ్ అనీ, మిస్టర్ పర్ఫెక్ట్ అనీ హాయిగా ఏడాదికి రెండు సినిమాల్లో కనిపించక ఎందుకీ భారీ ప్రాజెక్టులు అని వారి ఆవేదన. ప్రభాస్ కెరీర్ గురించి కూడా అభిమానులు ఆందోళన చెందుతున్నారు. బాహుబలి, సాహో.. ఇలా ఒక్కో సినిమాను ఏళ్ల తరబడి తీసుకుంటూ పోతుంటే ప్రభాస్ బాడీ ఏమౌతుంది? ఆ తర్వాత కెరీర్ ఏమవుతుంది? కెరీర్‌ని పనిగట్టుకునేం నిర్మించుకోనవసరం లేదు. ప్రభాస్‌కి క్రేజ్ ఉంది. నిర్మాతలు వచ్చేస్తారు. పాత్రల కోసం బాడీని ఫ్లక్చువేట్ చేసుకుంటూ పోతుంటే.. ఫిట్నెస్ దెబ్బతిన్నాక ఏ నిర్మాత దగ్గరికొస్తాడు? ఇవన్నీ రూమర్లు కాదు. చింతాక్రాంతులైన అభిమానుల సందేహాలు. మరి రూమర్ ఏమిటి? సాహూలో ఇప్పటికే చిత్రీకరించిన కొన్ని సన్నివేశాలపై ప్రభాస్ తీవ్ర అసంతృప్తితో ఉన్నారట! చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ సంస్థ 300 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. ఆ లెవల్లో అంటే.. ప్రేక్షకుల అంచనాలు అంతకుమించిన లెవల్లోనే ఉంటాయి. అయితే దర్శకుడు సుజి తెరకెక్కించిన కొన్ని కీలకమైన సీన్స్ ప్రేక్షకుల అంచనాలను అందుకోలేనంత వీక్‌గా ఉన్నాయని, వాటిని మళ్లీ రీషూట్ చేయాలని దర్శకుడిని అడిగితే అతడి ఇగో హర్ట్ అయిందని రూమర్స్ వస్తున్నాయి. రీషూట్ కోసం ప్రభాస్ అడగడం నిజమైతే ఉండొచ్చు కానీ, దర్శకుడి ఇగో హర్ట్ అవడం మనవాళ్లు కల్పించిన రూమర్ అయి ఉండడానికి ఎక్కువ చాన్సెస్ ఉన్నాయి. సుజీత్ నిన్నమొన్నటి కుర్రాడు. ఇరవై మూడేళ్ల వయసులో ‘రన్ రాజా రన్’ తో దర్శకుడిగా ఇండస్ట్రీలోకి వచ్చాడు. హిట్ కొట్టాడు. తర్వాత మూడేళ్లకు సాహో మొదలు పెట్టాడు. రెండు సినిమాలకే మనిషి ఎదగవచ్చేమో కానీ, మనిషిలోని ఇగో సాధారణంగా ఎదగదు. ముందనుకున్న డేట్ ప్రకారం ఆగస్టు 15న సాహో విడుదల కావాలి. అయితే రీషూట్ల కారణంగా ఆ తేదీకి విడుదల కాకపోవచ్చని ఒక రూమర్. నిప్పు లేకుండా పొగ రాదని అంటారు. కానీ నిప్పు లేకుండానే పొగ తెప్పించేస్తుంది రూమర్. ఎంటర్టైన్మెంట్ ఇండస్త్రీలో రూమర్లు సాధారణమే. అయితే అవి వ్యక్తిగతాల్లోకి వెళ్లి మనసుల్ని పాడు చేసేంతగా ఉండకూడదు. ఇమేజ్‌ని దెబ్బతీయకూడదు. భవిష్యత్తును నాశనం చేయకూడదు. సినిమా రిలీజ్ అయ్యేలోపు రూమర్ ఒక టీజర్లా ఉండాలి తప్ప, ఎవర్నీ టీజ్ చేసేలా ఉండకూడదు. ఎప్పుడు పిలిస్తే అప్పుడు... ఈ మధ్య డైరెక్టర్ తేజ మీద కూడా కొన్ని రూమర్లు వచ్చాయి. ఈ మధ్యే అనేం ఉంది. తేజ నిక్కచ్చిగా మాట్లాడతాడు. దానిని అర్థం చేసుకోలేనివాళ్లు రూమర్స్ క్రియేట్ చేస్తారు. కావాలని చెయ్యరు. వాళ్లన్నవి, అనుకున్నవి రూమర్స్ అయిపోతాయి. చెప్పినట్లు చెయ్యకపోతే తేజ హీరోయిన్లపై చెయ్యి చేసుకుంటాడని ఎప్పటి నుంచో ఉన్న రూమర్. ఈ మధ్య ఒక న్యూస్ చానెల్‌కు తేజ ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు.. ఇలాంటి రూమర్లను నవ్వుతూ కొట్టిపడేశారు. ఆ ఇంటర్వ్యూలోనే తేజ.. ‘నేనెప్పుడు పిలిస్తే అప్పుడు కాజల్ వచ్చేస్తుంది.. వెంటపడి మరీ’ అన్నాడు. ఇక రూమర్లు మొదలయ్యాయి. ఆయన అన్న సందర్భం వేరు. తేజ ‘సీత’ అనే సినిమా డైరెక్ట్ చేస్తున్నాడు. మే 24న విడుదల అవుతోంది. ఆ సినిమా కథ చెప్పడం కోసం కాజల్‌తో కూర్చుంటే.. ఆ పాత్రకు తను బాగా కనెక్టయి.. ఎప్పుడు డిస్కషన్స్‌కి కూర్చుందాం అన్నా వెంట పడి వచ్చేస్తుంది అనే అర్థంలో తేజ ఆ మాట అన్నారు. ముందు వెనకల్ని వదిలేసి ‘ఎప్పుడు పిలిస్తే అప్పుడు’ అనే ముక్కను పట్టుకోవడంతో అది రూమర్ అయింది. మహిళలకు తేజ రెస్పెక్ట్ ఇస్తారు. అతడి సినిమాల్లోని మహిళల పాత్రలూ ఇండివిడ్యువాలిటీతో ఉంటాయి. సీతనే తీసుకుందాం. అందులో కాజల్ డామినేటెడ్ రోల్లో డిఫరెంట్‌గా కనిపించబోతోంది. సీత అంటే మనకో సంప్రదాయ భావన ఉంటుంది కదా. దానికి భిన్నంగా ఉంటుంది కాజల్. అలాగని సంప్రదాయ విరుద్ధంగా ఏమీ ఉండదు. టీవీ ఇంటర్వ్యూలో కాజల్ గురించి తేజ మరో మాట కూడా చెప్పారు. ఇండస్ట్రీలో.. ఎవరు సక్సెస్‌లో ఉంటే వారి వెనుక పడి వస్తారు. కాజల్ అలాక్కాదు. తనకు సక్సెస్‌లు, ఫెయిల్యూర్స్‌తో నిమిత్తం లేదు. కథ నచ్చితే వెంటపడి చేస్తుంది అని అన్నారు. తేజ స్ట్రయిట్ ఫార్వార్డ్. అనవసరంగా ఒకర్ని పొగడరు. తిట్టాల్సి వస్తే తిట్టకుండా వదలరు. ఈ ముక్కుసూటి ధోరణి కారణంగా రూమర్స్‌కి ఆయనో నాణ్యమైన ముడిసరుకు అవుతున్నారు ఎప్పటికప్పుడు. -
యువతి ఫోటోలు మార్ఫింగ్, ఇంజనీర్ అరెస్ట్
సాక్షి, భీమవరం : ప్రయివేట్ కంపెనీలో సివిల్ ఇంజనీరుగా పనిచేస్తూ విజ్ఞానంతో వికృత చేష్టలకు పాల్పడ్డాడో ప్రబుద్ధుడు. ఫేస్బుక్లో పరిచయమైన యువతి ఫోటోలను మార్ఫింగ్ చేసి ఆపై బ్లాక్ మెయిలింగ్‌కు దిగి మనోవేదనకు గురిచేశాడు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గానికి చెందిన యువతి భీమవరంలోని ఇంజనీరింగ్ కళాశాలలో చదువుకుంది. అనంతపురం జిల్లా మడకశిరకు చెందిన సేనపరిగి హిమతేజకు ఫేస్బుక్ ద్వారా పరిచయం అయింది. ఇది స్నేహంగా మారడంతో ఆమె తన ఫోటోలు పంపింది. ఒకరినొకరు ఇష్టపడ్డారు. తర్వాత అతడు మంచివాడు కాదని తెలుసుకుని ఫేస్బుక్ పరిచయాన్ని ఆపేసి, మాట్లాడటం మానేసింది. ఆరు నెలల తర్వాత యువతి పేరుపై ఫేస్బుక్, ఇన్‌స్ట్రాగామ్‌లో నకిలీ అకౌంట్స్ క్రియేట్ చేశాడు. ఆమె స్నేహితురాళ్లకు ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపి తర్వాత ఆ యువతి ఫోటోలను మార్ఫింగ్ చేసి వాళ్లకు పంపాడు. వారంతా ఆమెకు ఫోన్ చేసి ఇలాంటి ఫోటోలు అప్లోడ్ చేస్తున్నావేంటని అడగటంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో బాధిత యువతి భీమవరం పోలీసులకు ఈ నెల 8న ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. నెల్లూరు జిల్లా నాయుడుపేటలో సివిల్ ఇంజనీరుగా పనిచేస్తున్న నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. -
అభినవ ‘సీత’రాముల కథ
వరుసగా మాస్ సినిమాలు చేస్తూ సక్సెస్ కోసం పోరాడుతున్న యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్. ఇన్నాళ్లు మాస్ ఇమేజ్ కోసం ప్రయత్నించినా పెద్దగా వర్క్ అవుట్ కాకపోవటంతో ఇప్పుడు రూట్ మార్చి ఓ లేడి ఓరియంటెడ్ సినిమా చేశాడు. నేనే రాజు నేనే మంత్రి సినిమాతో తిరిగి ఫాంలోకి వచ్చిన తేజ దర్శకత్వంలో సీత సినిమాలో నటిస్తున్నాడు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాలో టైటిల్ రోల్లో కాజల్ అగర్వాల్ నటిస్తున్నారు. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడిన ఈ సినిమాను మే 24న రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు చిత్రయూనిట్. ఇప్పటికే టీజర్‌తో ఆకట్టుకున్న చిత్రయూనిట్ తాజాగా ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. సినిమాలో కీలక పాత్రలను పరిచయం చేస్తూ రూపొందించిన ఈ ట్రైలర్ సినిమా మీద అంచనాలు పెంచేస్తోంది. ఇన్నాళ్లు సీరియస్ యాక్షన్ రోల్స్ లో కనిపించిన శ్రీనివాస్ ఈ సినిమా కామెడీ టచ్ ఉన్న పాత్రలో నటించాడు. అయితే తన మార్క్ యాక్షన్ మాత్రం మిస్ అవ్వకుండా జాగ్రత్తగా పడినట్టుగా తెలుస్తోంది. ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ సినిమాకు అనూప్ రుబెన్స్ సంగీతమందిస్తున్నాడు. -
మే 24న రాబోతోన్న ‘సీత’
‘కవచం’ సినిమాతో రీసెంట్గా పలకరించిన బెల్లంకొండ శ్రీనివాస్‌కు ఆశించిన విజయం దక్కలేదు. కెరీర్ స్టార్టింగ్ నుంచీ సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న ఈ యువహీరో వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఈ హీరో మరోసారి కాజల్ అగర్వాల్‌తో కలిసి తెరపై సందడి చేసేందుకు రెడీ అయ్యాడు. వీరి కాంబినేషన్లో రాబోతోన్న మరో చిత్రం ‘సీత’ రిలీజ్ డేట్ ఖరారైంది. ఈపాటికే విడుదల కావల్సిన ఈ చిత్రాన్ని సరైన సమయం కోసం చూసి వేసవి చివర్లో విడుదల చేసేందుకు సిద్దమయ్యారు మేకర్స్. మే 24న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. సోనూసూద్ విలన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో పాయల్ రాజ్‌పుత్ ఓ ప్రత్యేక గీతంలో నటించింది. ఎ.కె.ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై రామబ్రహ్మం సుంకర ఈ చిత్రాన్ని నిర్మించంగా డైరెక్టర్ తేజ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకు అనూప్ రూబెన్స్ సంగీతాన్ని అందిస్తున్నారు. -
బుల్.. బుల్.. బుల్లెట్టు మీదొచ్చె..!
మాస్ సినిమాల హీరోగా గుర్తింపు తెచ్చుకున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం సీత. కాజల్ అగర్వాల్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాకు తేజ దర్శకుడు. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న ఈ సినిమాను ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై సుంకర రామబ్రహ్మం నిర్మిస్తున్నారు. చాలా కాలంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను త్వరలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు చిత్రయూనిట్. ఇటీవల టీజర్ రిలీజ్ చేసిన సీత యూనిట్ తాజాగా సినిమాలోని మాస్ సాంగ్‌ను విడుదల చేశారు. ఆర్ఎక్స్ 100 ఫేం పాయల్ రాజ్‌పుత్‌పై చిత్రీకరించిన స్సెషల్ సాంగ్‌ను బుధవారం రిలీజ్ చేశారు. అనూప్ రుబెన్స్ సంగీత సారధ్యంలో ఉమ నేహ, తేజ సంతోష్, అమిటోలు ఆలపించిన ఈ పాటకు సురేంద్ర కృష్ణ సాహిత్యమందించారు. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమాను ఏప్రిల్‌లోనే రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు చిత్రయూనిట్. -
సీతని నేను చూసుకోవాలి
బంజారాహిల్స్‌లో ఉన్న స్థలాన్ని ఖాళీ చేయించినందుకు... అనే డైలాగ్‌తో ప్రారంభమవుతుంది ‘సీత’ సినిమా టీజర్. నువ్వు నాలా ఉన్న మగాడికి హెల్ప్ చెయ్ పెళ్లి చేసుకుని(సోనూసూద్)... ఈ పెళ్లి, పర్మనెంట్ అటాచ్మెంట్స్ నాకు వర్కవుట్ అవ్వదు(కాజల్), నువ్వు మట్టికొట్టుకుపోతావే.. నువ్వు సీతవికాదే సూర్పణఖవి, ఇంత కంత్రీ పిల్లకి ఆపేరు పెట్టారేమిటా అనుకున్నాను.. పక్కనే శ్రీరాముడు ఉన్నాడన్న సంగతి అర్థం కాలేదు నాకు(తనికెళ్ల భరణి), హలో సార్.. నా పేరు రఘురామ్.. సీతని నేను చూసుకోవాలి, సీత నన్నుచూసుకోవాలని మావయ్య చెప్పారు(సాయి శ్రీనివాస్)... వంటి డైలాగులు సినిమాపై ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా తేజ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘సీత’. కాజల్ అగర్వాల్, మన్నారా చోప్రా హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ఏటీవీ సమర్పణలో ఏకే ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రామబ్రహ్మం సుంకర నిర్మించిన ఈ సినిమా టీజర్‌ని విజయవాడలోని వి.ఆర్.సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్స్‌లో రిలీజ్ చేశారు. ‘‘ఈ ఫంక్షన్లో బెల్లంకొండ, పాయల్ రాజ్‌పుత్ స్టన్నింగ్ డ్యాన్స్ పెర్ఫామెన్స్, అనూప్ రూబెన్స్ లైవ్ పెర్ఫామెన్స్ స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచాయి. సినిమాని ఏప్రిల్ 25న విడుదల చేయనున్నాం’’ అని చిత్రవర్గాలు పేర్కొన్నాయి. ఈ వేడుకలో తేజ, నిర్మాత అనీల్ సుంకర, కిషోర్ గరికపాటి పాల్గొన్నారు. -
‘సీత’ సందడే లేదేంటి!
హిట్టూ, ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం చేస్తున్న యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్. కెరీర్ స్టార్టింగ్ నుంచి భారీ చిత్రాలు చేస్తూ వస్తున్న ఈ యువ కథానాయకుడు కమర్షియల్ సక్సెస్‌లు మాత్రం సాధించలేకపోతున్నాడు. ఇటీవల కవచం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన బెల్లంకొండ తరువాత తేజ దర్శకత్వంలో సీత సినిమాను ప్రారంభించాడు. గత ఏడాది జూలైలోనే తేజ దర్శకత్వంలో సినిమాను ప్రారంభించాడు సాయి శ్రీనివాస్. ఈ సినిమా సెట్స్ మీద ఉండగానే కవచం సినిమాను తెరకెక్కించి రిలీజ్ కూడా చేశారు. కవచం గత ఏడాది డిసెంబర్లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇంకా సీతకు సంబంధించి ప్రమోషన్ ప్రారంభం కాలేదు. గతంలో ఏప్రిల్ 25న సినిమా రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నట్టుగా ప్రకటించినా ప్రస్తుతం అలాంటి పరిస్థితి కనిపించటం లేదు. ఇప్పటి వరకు రెండు పోస్టర్స్ తప్ప సినిమా ప్రమోషన్ ప్రారంభం కాలేదు. దీంతో సీత ఏప్రిల్‌లో ప్రేక్షకుల ముందుకు రావటం కూడా అనుమానమే అన్న ప్రచారం జరుగుతోంది. సాయి శ్రీనివాస్‌కు జోడిగా కాజల్ అగర్వాల్ నటిస్తున్న ఈ సినిమా ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై రూపొందుతోంది. అనూప్ రుబెన్స్ సంగీతమందిస్తున్నారు. -
‘యన్.టి.ఆర్’పై తేజ ఏమన్నాడంటే..!
నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో తెరకెక్కిన బయోగ్రాఫికల్ మూవీ యన్.టి.ఆర్ కథానాయకుడు. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు ముందుగా తేజను దర్శకుడిగా తీసుకున్నారు. ముహూర్తం షాట్ చిత్రీకరణ కూడా జరిగిన తరువాత తేజ తప్పుకోవటంతో ప్రాజెక్ట్ క్రిష్ చేతిలోకి వెళ్లింది. అయితే ఇటీవల మీడియాతో మాట్లాడిన తేజకు యన్.టి.ఆర్ కథానాయకుడికి సంబంధించిన ప్రశ్న ఎదురైంది. అయితే ఈ విషయంపై స్పందించిన తేజ.. తాను ‘సీత’ సినిమా పనుల్లో బిజీగా ఉండటంతో ఇంకా ఆ సినిమా చూడలేదని చూసిన తరువాత స్పందిస్తానంటూ సమాధానమిచ్చారు. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన యన్.టి.ఆర్ కథానాయకుడు సినిమాకు మిక్స్డ్ టాక్ వచ్చినా.. కలెక్షన్ల పరంగా మాత్రం తీవ్రంగా నిరాశపరిచిన సంగతి తెలిసిందే. -
తమిళ స్టార్ హీరోతో తేజ!
నేనే రాజు నేనే మంత్రి సినిమాతో తిరిగి ఫాంలోకి వచ్చిన దర్శకుడు తేజ, ప్రస్తుతం బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా ‘సీత’ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. కాజల్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఈ సినిమా తరువాత మరో ఇంట్రస్టింగ్ ప్రాజెక్ట్‌కు రెడీ అవుతున్నాడు. తేజ తన తదుపరి చిత్రంగా ఓ తమిళ స్టార్ హీరోతో స్ట్రయిట్ తెలుగు సినిమా చేయనున్నాడట. కోలీవుడ్ లో సినిమాలతో పాటు సినీ రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేస్తున్న నటుడు విశాల్. కోలీవుడ్‌లో హాట్ ఫేవరెట్ గా మారిన ఈ తెలుగబ్బాయి చాలా కాలంగా స్ట్రయిట్ తెలుగు సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు. ఈ సినిమా తేజ డైరెక్ట్ చేయనున్నాడు. ప్రస్తుతం టెంపర్ రీమేక్‌గా తెరకెక్కుతున్న అయోగ్య షూటింగ్లో బిజీగా ఉన్న విశాల్, అక్టోబర్ నుంచి తేజ సినిమాకు డేట్లు ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వెయిట్ చేయాల్సింది. -
‘సీత’ నుంచి ఫస్ట్ లుక్!
బెల్లంకొండ శ్రీనివాస్ హిట్ కోసం ప్రయత్నిస్తూ.. వరుసగా సినిమాలను చేస్తున్నాడు. రీసెంట్గా కవచం మూవీతో పలకరించినా.. ఆశించినంత స్థాయిలో విజయం సాధించలేదు. గణతంత్ర దినోత్సవ సందర్భంగా.. ఆయన హీరోగా నటిస్తున్న ‘సీత’ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. ఈ ఫస్ట్‌లుక్‌ను బెల్లంకొండ శ్రీనివాస్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ‘నేనే రాజు నేనే మంత్రి’ సినిమాతో మంచి ఫామ్‌లోకి వచ్చిన డైరెక్టర్ తేజ.. ప్రస్తుతం బెల్లంకొండ శ్రీనివాస్, కాజల్ అగర్వాల్ కాంబినేషన్లో ‘సీత’ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. మరి ఈ సినిమా అయిన బెల్లంకొండ హీరోకు విజయాన్ని అందిస్తుందో లేదో చూడాలి. ఈ మూవీకి అనూప్‌రూబెన్స్ సంగీతాన్ని అందిస్తున్నాడు. Gear up guys.. Here it is!!! Presenting #sitafirstlook.#DirectorTeja @MsKajalAggarwal #freakycouple 😉#HappyRepublicDay2019 pic.twitter.com/CuMyCxFAu9 — Sai bellamkonda (@BSaiSreenivas) January 26, 2019 -
సాఫ్ట్ టైటిల్‌తో మాస్ హీరో..!
బిగ్ హిట్ కోసం ఎదురుచూస్తున్న యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్. వరుసగా భారీ బడ్జెట్ సినిమాలు చేస్తున్న ఈ యువ కథానాయకుడు భారీ హిట్ మాత్రం అందుకోలేకపోతున్నాడు. బోయపాటి దర్శకత్వంలో తెరకెక్కిన జయ జానకి నాయకకు మంచి టాక్ వచ్చిన హిట్ లిస్ట్‌లో చేరలేకపోయింది. తరువాత చేసిన సాక్ష్యం, కవచం సినిమాలు కూడా ఆశించిన స్థాయిలో అలరించలేకపోయాయి. దీంతో ప్రస్తుతం చేస్తున్న సినిమాకు రూట్ మార్చాడు ఈ యంగ్ హీరో. తేజ దర్శకత్వంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా తెరకెక్కుతున్న సినిమాకు సాఫ్ట్ టైటిల్‌ను ఫిక్స్ చేసినట్టుగా తెలుస్తోంది. చాలా రోజులుగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకు సీత అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారట. కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తి కావచ్చింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి సినిమాను మార్చిలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. -
జోరు పెంచాడు
యువ కథానాయకుడు బెల్లకొండ సాయి శ్రీనివాస్ కెరీర్లో జోరు పెంచారు. ప్రస్తుతం తేజ దర్శకత్వంలో ఓ సినిమా, శ్రీనివాస్ దర్శకునిగా పరిచయం అవుతున్న మరో సినిమాలో హీరోగా నటిస్తున్నారు శ్రీనివాస్. తాజాగా ఆయన రమేష్ వర్మ దర్శకత్వంలో ఓ చిత్రానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పతాకంపై ఈ సినిమాను అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్నారు. ‘‘ప్రస్తుతం ప్రీ–ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. త్వరలో రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుంది. మేజర్ షూటింగ్ విదేశాల్లో ప్లాన్ చేశాం. లవ్‌స్టోరీ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందననున్న ఈ సినిమాలో నటించనున్న ఇతర తారాగణం వివరాలను త్వరలో వెల్లడిస్తాం’’ అని పేర్కొంది చిత్రబృందం. -
కొండ చిలువతో ‘చందమామ’
యంగ్ హీరోలు సీనియర్ హీరోలు అన్న తేడా లేకుండా ఫుల్ ఫాంలో సినిమాలు చేస్తున్న టాలీవుడ్ బ్యూటీ కాజల్ అగర్వాల్. ఇక కెరీర్ ముగిసిపోనట్టే అనుకుంటున్న సమయంలో బౌన్స్ బ్యాక్ అయిన భామ ప్రస్తుతం యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌తో కలిసి ఓ సినిమాలో నటిస్తున్నారు కాజల్. తేజ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ థాయ్‌లాండ్‌లోని నఖోమ్ పాథోమ్ ప్రావిన్స్‌లో జరుగుతోంది. షూటింగ్ అప్డేట్స్ను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ సందడి చేస్తున్న చిత్రయూనిట్ తాజాగా ఓ ఆసక్తికర వీడియోను పోస్ట్ చేశారు. హీరోయిన్ ఓ భారీ కొండచిలువను మెడలో వేసుకొని కెమెరాకు ఫోజ్ ఇస్తున్న వీడియో సోషల్‌మీడియాలో ట్రెండ్ అవుతుంది. దర్శకుడు తేజ తన ఇన్స్‌స్టాగ్రామ్ పేజ్‌లో ఈ వీడియోను షేర్ చేశాడు. -
కొండ చిలువతో కాజల్ అగర్వాల్
-
వివాదాస్పదమైన బెల్లంకొండ ఫోటో
అల్లుడు శీను సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ భారీ చిత్రాలు చేస్తూ సత్తా చాటుతున్నాడు. అయితే కెరీర్ మలుపు తిప్పే భారీ కమర్షియల్ హిట్ మాత్రం ఇంత వరకు దక్కలేదు. తాజాగా ఈ యంగ్ హీరో తేజ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ థాయ్ లాండ్లో జరుగుతోంది. షూటింగ్ కి సంబంధించిన అప్డేట్స్ ను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటున్నాడు సాయి శ్రీనివాస్. అయితే అలా షేర్ చేసిన ఫోటో ఒకటి వివాదాస్పదంగా మారింది. ఏనుగు దంతాలపై కూర్చొని పోజ్ ఇచ్చిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. అలా మూగజీవి మీద కూర్చొని ఫోటో దిగటం జీవ హింస కిందకే వస్తుందంటున్నారు జంతు ప్రేమికులు. అయితే శ్రీనివాస్ ఆ ఫోటోను తన ట్విటర్ నుంచి తొలగించినా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. -
బెల్లంకొండ కొత్త సినిమా అప్డేట్
అల్లుడు శీనుగా వెండితెరకు పరిచయం అయిన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ స్పీడు పెంచాడు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన జయ జానకి నాయక సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న సాయి శ్రీనివాస్ త్వరలో సాక్ష్యం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. ఇప్పటికే సాక్ష్యం షూటింగ్ పూర్తి చేసిన సాయి శ్రీనివాస్ కొత్త దర్శకుడు శ్రీనివాస్ దర్శకత్వంలో తన ఐదో సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా సెట్స్‌మీద ఉండగానే మరో సినిమాను స్టార్ట్ చేస్తున్నాడు సాయి శ్రీనివాస్. నేనే రాజు నేనే మంత్రి సినిమాతో తిరిగి ఫాంలోకి వచ్చిన దర్శకుడు తేజ, సాయి శ్రీనివాస్ హీరోగా సినిమాను ప్రారంభించనున్నారు. సాయి శ్రీనివాస్ ఆరో చిత్రంగా తెరకెక్కనున్న ఈ సినిమా రేపు (సోమవారం) ఉదయం నానక్‌రామ్‌గూడాలోని రామానాయుడు స్టూడియోలో ప్రారంభం కానుంది. ప్రస్తుతం సెట్స్‌మీద ఉన్న సినిమాలో సాయి శ్రీనివాస్‌కు జోడిగా నటిస్తున్న కాజల్ అగర్వాల్ తదుపరి చిత్రలోనూ హీరోయిన్గా నటించనున్నారు. ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై అనిల్ సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. -
తేజ నెక్ట్స్ సినిమా ఫిక్స్!
ఎన్టీఆర్ బయోపిక్ నుంచి తప్పుకున్న తరువాత దర్శకుడు తేజ చేయబోయే నెక్ట్స్ ప్రాజెక్ట్‌పై ఆసక్తి నెలకొంది. నేనే రాజు నేనే మంత్రి సినిమాతో సూపర్ హిట్ అందుకున్న తేజ, తరువాత చాలా కాంబినేషన్స్‌ను సెట్ చేసే ప్రయత్నం చేశాడు. వెంకటేష్ హీరోగా ఓ సినిమా అనుకున్నా అది పట్టాలెక్కలేదు. తరువాత ఎన్టీఆర్ బయోపిక్ నుంచి తానే తప్పుకున్నాడు. రానాతో మరో సినిమా అనుకున్నా రానాకు ఖాలీ లేకపోవటంతో కుదరలేదు. దీంతో తేజ మరో సినిమా ఎప్పుడు మొదలు పెడతాడా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. తాజాగా తేజ కొత్త సినిమాపై మరో వార్త టాలీవుడ్ సర్కిల్స్‌లో హల్చల్ చేస్తోంది. తేజ తన తదుపరి చిత్రాన్ని బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నారట. యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటించనుందని తెలుస్తోంది. ప్రస్తుతం సాయి శ్రీనివాస్ హీరోగా తెరకెక్కుతున్న సినిమాలో కూడా కాజల్ అగర్వాలే హీరోయిన్. అంటే వరుసగా రెండు సినిమాలో ఈ జంట కలిసి నటిస్తున్నారు. -
కొత్త హీరోతో కాజల్..!
మరో స్టార్ వారసుడి వెండితెర అరంగేట్రానికి రంగం సిద్ధమవుతున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవల వరుస విజయాలు సాధిస్తున్న డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ అధినేత దానయ్య తన కుమారుడ్ని హీరో పరిచయం చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట. ఎంతో మంది నటులను వెండితెరకు పరిచయం చేసిన దర్శకుడు తేజ ఈ చిత్రానికి దర్శకత్వం వహించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ ప్రాజెక్ట్‌లో హీరోయిన్ గా కాజల్ అగర్వాల్‌ను ఫైనల్ చేసే ఆలోచనలో ఉన్నారు. ఇప్పటికే స్క్రిప్ట్ ఫైనల్ అయ్యిందని, త్వరలోనే ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రారంభించనున్నారన్న టాక్ వినిపిస్తోంది. -
‘ఎన్టీఆర్’ రిలీజ్.. అదే రోజు ఎందుకంటే..!
నందమూరి బాలకృష్ణ తన తండ్రి నందమూరి తారక రామారావు జీవిత కథ ఆధారంగా సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కావాల్సి ఉన్న చివరి నిమిషంలో దర్శకుడు తేజ తప్పుకోవటంతో వాయిదా పడింది. త్వరలో క్రిష్ దర్శకత్వంలో ఎన్టీఆర్ బయోపిక్‌ను ప్రారంభించనున్నట్టుగా బాలకృష్ణ అధికారికంగా ప్రకటించారు. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ విషయంలో ఆసక్తికర వార్త ఒకటి టాలీవుడ్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. ఎన్టీఆర్ బయోపిక్‌ను జనవరి 9న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. అయితే జనవరి 9నే రిలీజ్ డేట్‌గా ప్రకటించటం వెనుక ప్రత్యేకమైన కారణం ఉన్నట్టుగా తెలుస్తోంది. పార్టీ పెట్టిన 9 నెలల్లోనే అధికారం చేపట్టిన ఎన్టీఆర్ తొలిసారిగా జనవరి 9నే ప్రమాణ స్వీకారం చేశారు. ఎంతో చారిత్రక ప్రాదాన్యం ఉన్న అదే రోజు సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట. అయితే విషయంపై చిత్రయూనిట్ నుంచి మాత్రం ఎలాంటి అధికారిక ప్రకటనా వెలువడలేదు. -
మైనర్‌పై టీడీపీ నేత కుమారుడి లైంగిక దాడి
సాక్షి, గుంటూరు : ‘మైనర్ బాలికలు, మహిళలపై అత్యాచారాలకు పాల్పడే మానవ మృగాలకు ఈ భూమి మీద అదే చివరి రోజు అవుతుంది.. ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేసి ఉరిశిక్ష పడేలా చేస్తాం.. ఇలాంటి వారిని మహిళలు రోడ్లపైకి ఈడ్చి బుద్ధి చెప్పాలి..’ ఈ మాటలన్నది ఎవరో కాదు.. సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. దాచేపల్లిలో మైనర్ బాలికపై ఓ వృద్ధుడు అత్యాచారానికి పాల్పడ్డ సంఘటన సమయంలో గుంటూరు వచ్చిన ముఖ్యమంత్రి విలేకరుల సమావేశంలో హెచ్చరికలు చేయడంతో అంతా నిజమని నమ్మారు. అయితే ఆయన హెచ్చరించిన వారం రోజులకే అదే దాచేపల్లిలో ఓ మైనర్ బాలికపై టీడీపీ మండల పరిషత్ కో–ఆప్షన్ సభ్యుడు పలుమార్లు అత్యాచారానికి పాల్పడడమే కాకుండా గర్భవతిని సైతం చేసిన దుర్ఘటన చోటుచేసుకుంది. అయితే అతన్ని అరెస్టు చేసి రిమాండ్‌కు పంపారే తప్ప, బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం తరఫున పట్టించుకున్న దాఖలాలు లేకుండా పోయాయి. మంత్రి నియోజకవర్గంలో మరో అమానుషం.. తాజాగా రాష్ట్ర మంత్రి నక్కా ఆనందబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న వేమూరు నియోజకవర్గంలోని అమృతలూరులో 11 ఏళ్ల మైనర్ బాలికపై అధికార పార్టీ నేత తనయుడు అత్యాచారానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. అత్యాచారానికి పాల్పడ్డ మృగాడిని కఠినంగా శిక్షించాల్సిన అధికార పార్టీ నేతలే నిరుపేద బాధిత కుటుంబాన్ని డబ్బుతో మభ్యపెట్టి కేసు లేకుండా చేశారు. ఇద్దరూ ఒకే సామాజిక వర్గానికి చెందినవారు కావడంతో కులం పరువు పోతుందంటూ కొందరు అధికార పార్టీ నేతలు పంచాయితీ చేసి బాలిక కుటుంబానికి కొంత డబ్బు ఇచ్చేలా మాట్లాడి కేసు లేకుండా రాజీ కుదిర్చారు. పోలీసులకు అత్యాచార ఘటన గురించి వివరాలు తెలిసినప్పటికీ అధికార పార్టీ నేత తనయుడు కావడంతో రాజీ పడ్డారంటూ కేసు నమోదు చేయకుండా వదిలేశారు. దీనిపై ఈనెల 13న‘మైనర్ బాలికపై టీడీపీ నేత తనయుడి లైంగిక దాడి’ శీర్షికతో ప్రచురించిన వార్తకు స్పందించిన ఎస్పీ వెంకటప్పలనాయుడు ‘మీతో మీ ఎస్పీ’ కార్యక్రమంలో భాగంగా శనివారం అమృతలూరు వెళ్ళిన సమయంలో బాలిక తల్లిదండ్రులను పిలిపించి విచారించగా అసలు విషయం బయటపడింది. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలంటూ తెనాలి డీఎస్పీ స్నేహితను ఆదేశించారు. అమానుష ఘటన వివరాలివీ... అమృతలూరు మండల కేంద్రంలో నివాసం ఉంటున్న 11 ఏళ్ళ మైనర్ బాలికపై అదే గ్రామానికి చెందిన శరణు విశ్వతేజ అనే యువకుడు ఈనెల 2వ తేదీ మధ్యాహ్నం బాలికకు మాయమాటలు చెప్పి రామమందిరం వద్దకు తీసుకెళ్ళి అత్యాచారానికి పాల్పడ్డాడు. విష్ణుతేజ తండ్రి నాగేశ్వరరావు అధికార పార్టీ ముఖ్యనేత. గతంలో ఆయన కూచిపూడి నీటి సంఘం అధ్యక్షుడిగా పనిచేశారు. మృగాడి బెదిరింపులతో విషయాన్ని ఇంట్లో చెప్పేందుకు బాలిక భయపడింది. ఇది జరిగిన రెండు రోజులకు కడుపు నొప్పితో ఇబ్బంది పడుతుండగా అనుమానం వచ్చిన తల్లి గట్టిగా నిలదీయడంతో జరిగిన విషయం చెప్పింది. దీంతో ఫిర్యాదు చేసేందుకు కుమార్తెతో కలసి పోలీసు స్టేషన్‌కు వెళుతుండగా, మృగాడి బంధువులు ఆమెను అడ్డుకుని కుల పెద్దలు, అధికార పార్టీ నేతలతో పంచాయితీ పెట్టారు. బాలిక కుటుంబం పూరిగుడిసెలో నివాసం ఉంటూ కటిక బీదరికంతో ఇబ్బందులు పడుతుండటాన్ని ఆసరాగా తీసుకుని బాలికపై అమానుషానికి వెలకట్టేందుకు వెనుకాడలేదు. చివరకు రూ.10 లక్షలు ఇచ్చేలా బేరం కుదుర్చుకుని పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయకుండా రాజీ కుదిర్చారు. పోలీసులకు తెలిసినా... అత్యాచార ఘటన విషయం పోలీసులకు తెలిసినప్పటికీ వారిద్దరూ రాజీ పడ్డారంటూ కేసు నమోదు చేయకుండా వదిలేశారు. బాలిక కుటుంబానికి మాత్రం కేవలం రూ.4 లక్షలు చెల్లించారు. ఘటన ఆలస్యంగా వెలుగులోకి రావడంతో ‘సాక్షి’ దీనిని వెలుగులోకి తెచ్చింది. రూరల్ ఎస్పీ చొరవతో... విషయం తెలుసుకున్న రూరల్ ఎస్పీ సీహెచ్.వెంకటప్పలనాయుడు ‘మీతో మీ ఎస్పీ’ కార్యక్రమంలో భాగంగా శనివారం అమృతలూరుకు వెళ్ళిన సమయంలో బాలికను, ఆమె తల్లిని పిలిపించి ఘటనకు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. వెంటనే దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలంటూ తెనాలి డీఎస్పీ స్నేహితను ఆదేశించారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు ఆదివారం బాలికను తెనాలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆసుపత్రిలో బాలిక, ఆమె తల్లితో డీఎస్పీ స్నేహిత మాట్లాడి సంఘటనపై ఆరా తీశారు. అధికార పార్టీ ముఖ్య నేతలు రాష్ట్రంలో ఎంత పెద్ద సంఘటన జరిగినా నష్టపరిహారం పేరుతో డబ్బులు ఇచ్చి తూతూ మంత్రపు చర్యలతో సరిపెడుతున్న విషయం అందరికీ తెలిసిందే. అమృతలూరు అధికార పార్టీ నేతలు సైతం ఇదే మార్గాన్ని ఎంచుకుని డబ్బుతో ఆడపిల్లపై అమానుషానికి పాల్పడితే దానికి వెలకట్టే దుశ్చర్యకు పాల్పడ్డారు. విషయం బయట పడడంతో కేసు నుంచి తప్పించుకునేందుకు పోలీసు అధికారులపై ఒత్తిడి పెంచే యత్నాలు చేస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకోలేదు. -
వాస్తవ సంఘటనలతో...
సోమవారం ఎన్టీఆర్ జయంతి సందర్భంగా రాజకిరణ్ సినిమా పతాకంపై ‘విశ్వామిత్ర’ సినిమాను లాంఛనంగా ప్రారంభించారు చిత్ర యూనిట్. సినిమాకు మాధవి అద్దంకి, రజనీకాంత్ యస్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ‘గీతాంజలి, త్రిపుర’ చిత్రాల దర్శకుడు రాజకిరణ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రముఖ దర్శక–నిర్మాత తేజ ఎన్టీఆర్ చిత్ర పటానికి నమస్కరించి, చిత్ర పటంపై క్లాప్‌నిచ్చి సినిమాను లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా దర్శకుడు రాజకిరణ్ మాట్లాడుతూ–‘‘ఈ సినిమా స్విట్జర్లాండ్, అమెరికాలలో జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా రూపొందిస్తున్నాం. సినిమా మొదటి ఫ్రేమ్ నుంచి ఎంటర్టైన్మెంట్తో పాటు క్యూరియాసిటీని క్రియేట్ చేస్తుంది. నా గత చిత్రాలైన ‘గీతాంజలి, త్రిపుర’ కథలలో ఎన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయో ఈ సినిమాలో కూడా అదే థ్రిల్ మెయింటేన్ చేస్తుంది. జూన్ మూడవ వారం నుండి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తాం. మంచి నాయకా,నాయికలు దొరికారు. అతి త్వరలో మిగతా విషయాలు తెలియజేస్తాం’’ అన్నారాయన. ఈ కథ నచ్చి ‘జక్కన్న’ చిత్ర దర్శకుడైన ఆకెళ్ల వంశీకృష్ణ ఈ చిత్రానికి మాటలు రాస్తుండటం విశేషం. ఈ చిత్రానికి కెమెరా: అనిల్ భండారి, మాటలు: ఆకెళ్ల వంశీకృష్ణ, ఎడిటర్:ఉపేంద్ర, ఆర్ట్:చిన్నా. నిర్మాతలు: మాధవి అద్దంకి, కథ–స్క్రీన్‌ప్లే–దర్శకత్వం: రాజకిరణ్ -
బాలయ్య సొంత బ్యానర్లో మరో సినిమా
కుర్ర హీరోలకు పోటి ఇస్తూ వరుస సినిమాలతో బిజీ అవుతున్నారు నందమూరి బాలకృష్ణ. ఇప్పటికే ఎన్టీఆర్ సినిమాను ప్రారంభించిన బాలయ్య, దర్శకుడు తేజ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవటంతో ఆ చిత్ర షూటింగ్‌ను తాత్కాలికంగా పక్కకు పెట్టారు. ఈ గ్యాప్‌లో వినాయక్ దర్శకత్వంలో ఓ సినిమా చేసేందుకు రెడీ అవుతున్నారు బాలకృష్ణ. అంతేకాదు తనకు సింహా, లెజెండ్ లాంటి ఘనవిజయాలను అందించిన బోయపాటి శ్రీను దర్శకత్వంలోనూ ఓ సినిమాను ప్రారంభించనున్నారట. ఈ సినిమాను బాలయ్య పుట్టిన రోజు సందర్భంగా జూన్ 10న ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సినిమాను బాలయ్య స్వయంగా ఎన్.బి.కె ఫిలింస్ బ్యానర్‌పై నిర్మించే అవకాశమున్నట్టుగా తెలుస్తోంది. ఎన్టీఆర్ బయోపిక్‌ను కూడా బాలయ్య స్వయంగా నిర్మిస్తున్న విషయం తెలిసిందే. -
‘ఎన్టీఆర్’ని పక్కన పెట్టేశారా..?
నందమూరి బాలకృష్ణ హీరోగా ఎన్టీఆర్ బయోపిక్ ప్రారంభమైన సంగతి తెలసిందే. బాలయ్య స్వయంగా నిర్మిస్తున్న ఈ సినిమాను ముందుగా తేజ దర్శకత్వంలో తెరకెక్కించనున్నట్టుగా ప్రకటించారు. చిత్ర ప్రారంభోత్సవ సమయంలో కూడా తేజ దర్శకుడిగా కొనసాగారు. అయితే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభానికి ముందు తాను ఎన్టీఆర్‌కు పూర్తి న్యాయం చేయలేనేమో అంటూ తేజ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నాడు. దీంతో మరో దర్శకుడి కోసం ప్రయత్నాలు ప్రారంభించాడు బాలకృష్ణ, రాఘవేంద్రరావు, క్రిష్, పూరి జగన్నాథ్ లాంటి పేర్లు వినిపించినా ఎవరినీ ఫైనల్ చేయలేదు. ఒక దశలో బాలయ్యే దర్శకత్వ బాధ్యతలు తీసుకుంటారన్న ప్రచారం కూడా జరిగింది. తాజాగా మరో ఆసక్తికరమైన వార్త టాలీవుడ్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. ఎన్టీఆర్ మరింత ఆలస్యమవుతుండటంతో బాలయ్య మరో సినిమా ప్రారంభించాలనుకుంటున్నారట. చాలా రోజులుగా వినాయక్ దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా ఓ సినిమా నిర్మించేందుకు ప్రయత్నిస్తున్నాడు నిర్మాత సీ కల్యాణ్. ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చింది. ఇప్పుడు ఎన్టీఆర్‌ను పక్కన పెట్టి ఈ సినిమాను ముందుగా పూర్తి చేసే ఆలోచనలో ఉన్నాడట నందమూరి నటసింహం. అయితే ఈ విషయంపై ఇంత వరకు అధికారిక ప్రకటన మాత్రం వెలువడలేదు. -
మరో వార్ డ్రామాలో రానా..?
ఈ జనరేషన్ హీరోల్లో పీరియాడిక్, హిస్టారికల్ పాత్రలకు తగ్గ నటుడంటే ముందుగా గుర్తొచ్చే పేరు రానా దగ్గుబాటి. ఇప్పటికే బాహుబలి, రుద్రమదేవి, ఘాజీ లాంటి చిత్రాల్లో విభిన్న పాత్రల్లో కనిపించిన రానా.. ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న సినిమాల్లో కూడా ఆ తరహా పాత్రల్లోనే కనిపించనున్నాడు. ప్రస్తుతం రానా.. 1945 సినిమాలో నటిస్తున్నాడు. ఆజాద్ హింద్ ఫౌజ్ నేపథ్యంలో సాగే ఈ కథలో రానా సైనికుడిగా కనిపించనున్నాడట. పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కుతున్న మరో మూవీ హాథీ మేరి సాథీలోనూ నటిస్తున్నాడు రానా. తరువాత ట్రావెన్కోర్ రాజు మార్తండ వర్మ కథతో అదే పేరుతో తెరకెక్కనున్న సినిమాలో నటించనున్నాడు. ఈ రెండు సినిమాల తరువాత మరో వార్ డ్రామాకు రానా అంగీకరించారన్న ప్రచారం జరుగుతోంది. తనకు నేనే రాజు నేనే మంత్రి సినిమాతో సోలో హీరోగా ఘనవిజయాన్ని అందించిన తేజ దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నాడు రానా. ఈ సినిమా భారత్ - పాకిస్థాన్ మధ్య జరిగిన యుద్ధ నేపథ్యంలో తెరకెక్కనుందట. అయితే ఈ వార్తలపై హీరో రానా, దర్శకుడు తేజ ఇంతవరకు స్పందించలేదు. -
మరో సీనియర్ హీరోతో తేజ..?
నేనే రాజు నేనే మంత్రి సినిమాతో ఫాంలోకి వచ్చిన దర్శకుడు తేజ, ఆ సినిమా తరువాత సీనియర్ హీరోల మీద దృష్టి పెట్టాడు. తనకు స్టార్ హీరోలతో సినిమాలు చేయటం రాదంటూనే వరుసగా స్టార్ హీరోల పేర్లు తెర మీదకు తెస్తున్నాడు. నేనే రాజు నేనే మంత్రి తరువాత సీనియర్ హీరో వెంకటేష్‌తో ఓ సినిమాను ప్రారంభించాడు తేజ. ఆ సినిమాకు సంబంధించి వెంకటేష్ లుక్ కూడా బయటకు వచ్చింది. ఈ లోగా నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో ఎన్టీఆర్ (బయోపిక్) ప్రారంభం కావటంతో వెంకటేష్ సినిమాకు బ్రేక్ పడింది. కానీ తాను ఎన్టీఆర్ ప్రాజెక్ట్‌ను ఆశించిన స్థాయిలో తీర్చిదిద్దలేనన్న భావనతో బయోపిక్ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నాడు తేజ. వెంకటేష్ సినిమా ఆగిపోవటం, ఎన్టీఆర్ సినిమా నుంచి తానే తప్పుకోవటంతో ఇప్పుడు మరో సీనియర్ హీరోతో సినిమా చేయాలని భావిస్తున్నాడట ఈ క్రియేటివ్ డైరెక్టర్. కింగ్ నాగార్జున హీరోగా ఓ సినిమా చేయాలని తేజ ప్రయత్నిస్తున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో ఆఫీసర్ సినిమాను పూర్తి చేసిన నాగ్, ప్రస్తుతం యువ దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో మల్టీ స్టారర్ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా పూర్తి కావటానికి కాస్త సమయం పడుతుంది. మరి అప్పటి వరకు తేజ వెయిట్ చేసి నాగ్‌తో సినిమా చేస్తాడా..? లేక మరో ప్రాజెక్ట్‌ను లైన్లోకి తీసుకువస్తాడా చూడాలి. -
ఎన్టీఆర్ బయోపిక్ : తెరపైకి మరో పేరు
సీనియర్ నటుడు నందమూరి బాలకృష్ణ.. తన తండ్రి నందమూరి తారక రామారావు జీవిత కథ ఆధారంగా సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఎన్టీఆర్‌గా తానే స్వయంగా నటిస్తూ నిర్మిస్తున్నాడు బాలయ్య. ముందుగా ఈ సినిమాను తేజ దర్శకత్వంలో రూపొందించాలని నిర్ణయించారు. అయితే షూటింగ్ లాంఛనంగా ప్రారంభమైన తరువాత తేజ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవటం, రాఘవేంద్ర రావు, కృష్ణవంశీ, క్రిష్ లాంటి దర్శకులను సంప్రదించిన ఈ ప్రాజెక్ట్‌ను ముందుకు నడిపించేందుకు అంగీకరించకపోవటంతో బాలయ్య స్వయంగా దర్శకత్వం వహించాలని నిర్ణయించుకున్నారు. అయితే దర్శకత్వ శాఖలో అనుభవం లేని బాలయ్య సీనియర్ దర్శకుల పర్యవేక్షణలో సినిమా చేయాలని భావిస్తున్నారట. ముందుగా ఆ బాధ్యతను దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావుకు అప్పగించాలని భావించినా.. రాఘవేంద్ర రావు బిజీగా ఉండటంతో మరో దర్శకుడి కోసం ప్రయత్నాలు ప్రారభించారు. తాజాగా ఆ నలుగురు ఫేం చంద్ర సిద్ధార్థ, ‘ఎన్టీఆర్’ సినిమాకు దర్శకత్వ పర్యవేక్షణ బాధ్యతలు తీసుకుంటారన్న టాక్ వినిపిస్తోంది. ఈ విషయంపై చిత్రయూనిట్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటనా రాలేదు. దర్శకుడు చంద్ర సిద్ధార్థ -
రాఘవేంద్రుడి హెల్ప్ తీసుకుంటున్న బాలయ్య!
బాలకృష్ణ నటిస్తూ, స్వయంగా నిర్మిస్తున్న ఎన్టీఆర్ బయోపిక్ దర్శకత్వ బాధ్యతల నుంచి తేజ తప్పుకున్న విషయం తెలిసిందే. దీంతో ఆ తరువాత చాలా మంది పేర్లే వినిపించినా... ఎవరూ ఆ సాహసం చేయడానికి ముందుకు రాలేదు. సో..బాలయ్యే దాని పగ్గాలు చేపట్టి డైరెక్షన్ కూడా చేసేయాలని ఫిక్స్ అయ్యారు. అయితే డైరెక్షన్ చేయడం అంటే మాములు విషయం కాదు. అసలే ఎన్టీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మకమైన సినిమా ఇది. అందుకే దర్శకేంద్రుడి సహాయాన్ని బాలయ్య తీసుకుంటున్నారని సమాచారం. దర్శకత్వ పర్యవేక్షణ అంటే గుర్తుకొచ్చేది రాఘవేంద్రరావే. ఆయన చాలా సినిమాలకు పర్యవేక్షణ చేశారు. సినిమాకు తగిన సలహాలు, సూచనలు ఇస్తూ... వెనకుండి నడిపిస్తారు. బాలయ్య కూడా దర్శకేంద్రుడి పర్యవేక్షణలో ‘ఎన్టీఆర్’ సినిమాను పూర్తి చేయబోతున్నట్లు తెలుస్తోంది. -
ప్రారంభమైన ఎన్టీఆర్ బయోపిక్
నందమూరి బాలకృష్ణ హీరోగా విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు ఎన్టీఆర్ జీవిత కథ ఆధారంగా బయోపిక్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. తేజ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఈ రోజు (గురువారం) రామకృష్ణ హర్టీ కల్చరల్ సినీ స్టూడియోలో ప్రారంభమైంది. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ముఖ్య అతిథిగా పాల్గొన్న ఈ కార్యక్రమంలో తెలుగుదేశం, బిజేపీ పార్టీ నాయకులు పాల్గొన్నారు. దర్శకులు రాఘవేంద్ర రావు, బోయపాటి శ్రీను, వివి వినాయక్, పూరి జగన్నాథ్ లతో పాటు పలువురు సినీప్రముఖులు పాల్గొన్నారు. నందమూరి యువ కథానాయకుడు కళ్యాణ్ రామ్ కూడా ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. దుర్యోధనుడి పాత్రలో ఎన్టీఆర్ అద్భుతంగా నటించి మెప్పించిన దానవీర శూర కర్ణ సినిమాలోని ‘రాచరికమా అర్హతలు నిర్ణయించునది’ అనే డైలాగ్‌లను తొలి షాట్‌గా చిత్రీకరించారు. వెంకయ్య నాయుడు క్లాప్ కొట్టి సినిమా షూటింగ్‌ను ప్రారంభించారు. ముందుగా నిర్ణయించిన ముహూర్తం ప్రకారం 9 గంటల 42 నిమిషాలకు తొలి షాట్‌ను చిత్రీకరించారు. బాలకృష్ణ స్వయంగా ఎన్బీకే ఫిలింస్ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఈ సినిమాకు సాయి కొర్రపాటి, విష్ణువర్థన్ ఇందూరిలు సహనిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. కీరవాణి సంగీతమందిస్తుండగా బాలీవుడ్ ఛాయగ్రాహకుడు సంతోష్ తుండియిల్ సినిమాటోగ్రఫి అందిస్తున్నారు. శరవేగంగా షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసి దసరాకు సినిమాను రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
ఎన్టీఆర్ బయోపిక్ : కొత్త పోస్టర్
ఇటీవల జై సింహా సినిమాతో ఆకట్టుకున్న నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం ఎన్టీఆర్ బయోపిక్‌ను పట్టాలెక్కించేందుకు రెడీ అవుతున్నాడు. చాలా రోజులుగా ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా మార్చి 29న ప్రారంభం కానుంది. తేజ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాను వారాహి చలనచిత్రం బ్యానర్‌తో కలిసి బాలకృష్ణ స్వయంగా నిర్మిస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన కాన్సెప్ట్ పోస్టర్‌ను చిత్రయూనిట్ విడుదల చేశారు. సినిమాలో ఏఏ అంశాలను చూపించబోతున్నారన్న విషయాన్ని తెలిపేలా పోస్టర్ ను రూపొందించారు. ఎన్టీఆర్ చిన్న నాటి విషయాలు గుర్తుగా ఎన్టీఆర్ సొంత ఊరిలోని ఇళ్లు వెండితెరపై ఎన్టీఆర్ పోషించిన అద్భుత పాత్రలతో పాటు రాజకీయ ప్రవేశం సందర్భంగా ఎన్టీఆర్ ఉపయోగించిన ప్రచార రథంతో పాటు పార్టీ జెండా కూడా ఉండేలా ఈ పోస్టర్‌ను డిజైన్ చేశారు. #NTR biopic launch on 29 March 2018 at Ramakrishna Studios, Hyderabad... NTR's son Balakrishna to enact the role of NTR in the film... Will be made in Hindi and Telugu... Directed by Teja... Produced by Balakrishna, Sai Korrapati and Vishnu Vardhan Induri... #NTRBiopic pic.twitter.com/SrMIMa8ADK — taran adarsh (@taran_adarsh) 27 March 2018 -
నవ్వుల్ నవ్వుల్
తేజ, హరిణిరెడ్డి జంటగా రూపొందుతోన్న వినోదాత్మక చిత్రం ‘డ్రీమ్ బాయ్’. రాజేష్ కనపర్తి దర్శకత్వంలో సెవన్ వండర్స్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రేణుక నరేంద్ర నిర్మిస్తున్న ఈ సినిమా హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత ఎం.వి. రావు కెమెరా స్విచ్చాన్ చేయగా, మరో నిర్మాత రాజ్ కందుకూరి క్లాప్ ఇచ్చారు. రాజేష్ కనపర్తి మాట్లాడుతూ– ‘‘ఇదొక థ్రిల్లింగ్ ఎంటర్టైనర్. ప్రేమతో నిండిన క్యూట్ స్టోరీ. ఆద్యంతం కామెడీతో రూపొందుతోన్న ఈ చిత్రం అందర్నీ ఆకట్టుకుంటుందనే నమ్మకముంది. కొత్త, పాత నటీనటులతో తెరకెక్కిస్తున్నాం’’ అన్నారు. ‘‘రాజేష్ చెప్పిక కథ నచ్చడంతో ఈ చిత్రం నిర్మిస్తున్నా. అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ఉంటాయి. మాకు, మా బ్యానర్‌కు మంచి పేరు తీసుకొచ్చేలా ఈ సినిమా ఉంటుంది’’ అన్నారు రేణుక. నటులు ధనరాజ్, రాకేష్, సుఖేష్ రెడ్డి, లడ్డు, ఆర్ట్ డైరెక్టర్ వెంకట్ సన్నిధి తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: నాని, సంగీతం: సుభాష్ ఆనంద్, సమర్పణ: మాస్టర్ ఎన్.టి. రామ్ చరణ్. -
ఎన్టీఆర్ బయోపిక్‌లో బాలీవుడ్ హీరోయిన్
జై సింహా సినిమా తరువాత గ్యాప్ తీసుకున్న బాలకృష్ణ త్వరలో ఎన్టీఆర్ బయోపిక్‌ను ప్రారంభించబోతున్నాడు. నేనే రాజు నేనే మంత్రి సినిమాతో తిరిగి ఫాంలోకి వచ్చిన తేజ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఈ నెలాఖరున సెట్స్ మీదకు వెళ్లనుంది. బాలయ్య ఎన్టీఆర్ పాత్రలో నటిస్తూ నిర్మిస్తున్న ఈ సినిమాలో యంగ్ ఎన్టీఆర్ గా శర్వానంద్ నటించనున్నాడన్న ప్రచారం జరుగుతోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో ఆసక్తికరమైన వార్త టాలీవుడ్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. ఎన్టీఆర్ సతీమణి పాత్ర ఎంపిక కోసం చాలా కసరత్తులు చేసిన చిత్రయూనిట్ ఫైనల్ ఓ బాలీవుడ్ హీరోయిన్ను ఎంపిక చేశారట. విభిన్న పాత్రలతో ఆకట్టుకుంటున్న టాలెంటెడ్ బ్యూటీ విద్యాబాలన్ ఈ సినిమాలో ఎన్టీఆర్ సతీమణి బసవతారకం పాత్రలో కనిపించనున్నారట. ఈ విషయాన్ని చిత్రయూనిట్ ధృవీకరించాల్సి ఉంది. -
మరో రీమేక్‌పై దృష్టి పెట్టిన వెంకీ
తెలుగు ఇండస్ట్రీలో రీమేక్ సినిమాలు చేయటంలో విక్టరీ వెంకటేష్ కు అరుదైన రికార్డ్ ఉంది. వెంకీ కెరీర్లో ఘనవిజయాలు సాధించిన చాలా చిత్రాలు రీమేక్‌గా తెరకెక్కినవే. ఇటీవల వెంకటేష్ హీరోగా సక్సెస్ సాధించిన దృశ్యం, గురు సినిమాలు కూడా రీమేక్ చిత్రాలే. తాజాగా మరో సూపర్ హిట్‌ను రీమేక్ చేసేందుకు వెంకీ ప్లాన్ చేస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది. మలయాళంలో ఘనవిజయం సాధించిన ది గ్రేట్ ఫాదర్ చిత్రాన్ని వెంకటేష్ హీరోగా తెలుగులో రీమేక్ చేసే ఆలోచనలో ఉన్నారు. ఒరిజినల్ వర్షన్లో మమ్ముట్టి నటించిన పాత్రను తెలుగులో వెంకటేష్ చేయనున్నారు. ఈ సినిమాను తమిళ్లో విక్రమ్ హీరోగా రీమేక్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే ది గ్రేట్ ఫాధర్ సినిమా చూసిన వెంకీ తన నిర్ణయాని మాత్రం ప్రకటించలేదని తెలుస్తోంది. ప్రస్తుతం వెంకటేష్ తేజ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు. -
హ్యాపీడేస్ గుర్తొచ్చాయి – నిఖిల్
‘‘ట్రైలర్ మళ్లీ మళ్లీ చూడాలనిపిస్తోంది. చాలా ఫ్రెష్‌గా ఉంది. నిఖిల్‌కు ఫ్రెండ్స్‌గా నటించినవాళ్లంతా న్యాచురల్‌గా, ప్రెష్‌గా కనిపిస్తున్నారు. సినిమా తప్పకుండా బాగుంటుందని, టీమ్ అందరికీ మంచి పేరు వస్తుందని భావిస్తూ అందరికీ శుభాకాంక్షలు’’ అని దర్శకుడు తేజ అన్నారు. నిఖిల్, సిమ్రాన్ పరీన్జా, సంయుక్తా హెగ్డే హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘కిరాక్ పార్టీ’. ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై శరణ్ దర్శకత్వంలో రామబ్రహ్మం సుంకర నిర్మించారు. ఈ సినిమా ట్రైలర్‌ను దర్శకుడు తేజ విడుదల చేశారు. ఈ సందర్భంగా నిఖిల్ మాట్లాడుతూ– ‘‘ఈ సినిమాలో నేను గ్యాంగ్ లీడర్‌గా కనిపించినా మా అందరి లీడర్ మాత్రం అనిల్ సుంకరగారే. ఈ సినిమా చేస్తున్నప్పుడు ‘హ్యాపీ డేస్’ మూవీ చేసిన రోజులు గుర్తుకు వచ్చాయి. షూటింగ్ పూర్తవ్వగానే అందరం ఏడ్చేశాం. ఈ సినిమా నాకు ప్రత్యేకమైనది’’ అన్నారు. ‘‘ఎంతో అనుభవం ఉన్నవాళ్లు ఈ సినిమాకు పని చేశారు. కాలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన సినిమాల్లో ‘కిరాక్ పార్టీ’ బెస్ట్ మూవీగా నిలుస్తుందని చెప్పగలం’’ అన్నారు నిర్మాత అనిల్ సుంకర. ‘‘కన్నడ సూపర్ హిట్ సినిమా ‘కిరిక్ పార్టీ’. ఆ సినిమా ఫ్లేవర్ పోకుండా మన నేటివిటీకి తగ్గట్టుగా తీశాం. అవకాశం ఇచ్చిన నిర్మాతలకు, హీరో నిఖిల్‌కు చాలా థాంక్స్’’ అన్నారు శరణ్. ఈ సినిమాకు సంగీతం: అంజనీష్ లోకనా«థ్, స్క్రీన్‌ప్లే: సుధీర్ వర్మ, డైలాగ్స్: చందూ మొండేటి. -
బిజీ అవుతోన్న చందమామ
టాలీవుడ్ అందాల భామ కాజల్ అగర్వాల్ మళ్లీ బిజీ అవుతోంది. ఒక దశలో ఇక కెరీర్ ముగిసినట్టే అనుకుంటుండగా స్టార్ హీరోల సినిమాలతో కంబ్యాక్ అయిన ఈ బ్యూటీ, ఇప్పుడు సీనియర్లతో పాటు యంగ్ హీరోలతోనూ జత కడుతూ వరుస సినిమాలతో సత్తా చాటుతోంది. ప్రస్తుతం కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కుతున్న ఎమ్మెల్యే (మంచి లక్షణాలున్న అబ్బాయి) సినిమాలో నటిస్తోంది కాజల్. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోన్న సుధీర్ వర్మ, శర్వానంద్‌ల సినిమాలోనూ కాజల్ ను హీరోయిన్గా ఫైనల్ చేసే ఆలోచనలో ఉన్నారట చిత్రయూనిట్. ఈ సినిమాతో పాటు తేజ దర్శకత్వంలో వెంకటేష్ హీరోగా తెరకెక్కబోయే సినిమాలోనూ కాజల్ నే హీరోయిన్ గా ఫైనల్ చేసే ఆలోచనలో ఉన్నారు. వీటితో పాటు తమిళంలోనూ పలు చిత్రాలకు ఓకె చెప్పిందీ చందమామ. -
ఇక గ్యాప్ ఉండదు గురూ
‘గురు’ సినిమా రిలీజై దాదాపు పది నెలలు కావొస్తోంది. వెంకటేశ్ ఇంకా కొత్త సినిమా షూటింగ్ మొదలుపెట్టలేదు. తేజ దర్శకత్వంలో ఏకే ఎంటర్టైన్మెంట్స్, సురేశ్ ప్రొడక్షన్స్ నిర్మించనున్న ఓ సినిమాను ఓకే చేసి, మూహూర్తం కూడా జరిపారు. కానీ... ఆ సినిమా ఇంకా సెట్స్ పైకి వెళ్లలేదు. మరి గురు షూటింగ్‌లోకి ఎంటరయ్యేదెప్పుడు అంటే.. వచ్చే నెలలో. ‘‘ఫిబ్రవరిలో షూటింగ్ మొదలుపెడుతున్నాం. సినిమాకు సంబంధించిన తారాగణం కూడా త్వరలో వెల్లడిస్తాం’’ అని పేర్కొన్నారు దర్శకుడు తేజ. ఈ సినిమాలో వెంకీ సరసన ‘చెలియా’ భామ అదితీరావ్ హైదరీ పేరును ప్రముఖంగా పరిశీలిస్తునట్టు ఫిల్మ్‌నగర్ సమాచారం. ఇదిలా ఉంటే ‘గురు’ సినిమా తర్వాత పది నెలలు గ్యాప్ తీసుకున్న వెంకీ ఇక నుంచి గ్యాప్ వచ్చే ప్రసక్తే లేదంటున్నారు. తేజ సినిమా చేస్తూనే.. రానాతో కలిసి రాజీవ్ గాంధీ హత్య ఆధారంగా ఓ వెబ్ సిరీస్‌లో యాక్ట్ చేయనున్నారు వెంకీ. అలాగే అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ యంగ్ హీరోతో మల్టీస్టారర్ మూవీ కూడా ఒప్పుకున్నారు. వీటితోపాటు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నట్టు ప్రకటించేశారు. సో.. గత ఏడాది వచ్చిన గ్యాప్‌ను మళ్లీ రాకుండా వరుసగా సినిమాలు ఒప్పుకుంటున్నారు వెంకటేశ్. -
అప్పుడు రచయిత ఇప్పుడు డైరెక్టర్
వెంకటేశ్ బర్త్‌డే సందర్భంగా హారిక హాసిని క్రియేషన్స్ అధినేత ఎస్. రాధాకృష్ణ ఓ సినిమా ఎనౌన్స్ చేశారు. ఈ చిత్రానికి త్రివిక్రమ్ దర్శకుడు. వెంకటేశ్ కెరీర్లో మంచి హిట్స్‌గా నిలిచిన ‘నువ్వు నాకు నచ్చావ్’, ‘మల్లీశ్వరి’ చిత్రాలు త్రివిక్రమ్ రాసినవే. రైటర్‌గా వెంకీకి హిట్స్ ఇచ్చిన త్రివిక్రమ్ ఇప్పుడు దర్శకుడిగా హిట్ ఇవ్వడానికి రెడీ అయ్యారు. వెంకటేశ్ అంటే మనకు గుర్తొచ్చేది మంచి కుటుంబ కథలున్న సినిమాలు, కడుపుబ్బా నవ్వుకునే హాస్య సన్నివేశాలు. త్రివిక్రమ్ సినిమాలో ఈ రెండూ కామన్. సో.. ఒక మంచి ఫ్యామిలీ ప్యాకేజీ మూవీని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అన్నట్లు.. వెంకీని త్రివిక్రమ్ డైరెక్ట్ చేయడం ఇది రెండోసారి. ఆశ్చర్యంగా ఉందా? త్రివిక్రమ్–పవన్ కల్యాణ్ కాంబినేషన్లో రూపొందుతోన్న ‘అజ్ఞాతవాసి’లో అతిధి పాత్రలో మెరవనున్నారు వెంకీ. అసలు విషయం అది. -
ముగ్గురిలో విక్టరీ ఎవరికి?
అనుష్క, కాజల్ అగర్వాల్, రాధికా ఆప్టే.. ఈ ముగ్గురిలో విక్టరీ ఎవరిది? అదేనండి.. గెలుపు ఎవరిది? ఇక్కడ విక్టరీ వెంకటేశ్ ఫొటో ఉంది కాబట్టి... ఆయన మనసుని గెలుచుకునేది ఎవరు? ఇంతకీ వెంకీ మనసుని వీళ్లు గెలవడం ఏంటి? అంటే.. ఓ సినిమాలో జత కట్టేందుకు. అది తేజ సినిమా. వెంకటేశ్ హీరోగా తేజ దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందనున్న విషయం తెలిసిందే. సురేశ్ ప్రొడక్షన్స్, ఏకే ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మించనున్న ఈ చిత్రం పూజా కార్యక్రమాలు ఇటీవల జరిగాయి. రెగ్యులర్ షూటింగ్ జనవరిలో ఆరంభమవుతుంది. ఇప్పుడు డిస్కషన్ అంతా ఈ సినిమాలో వెంకీ సరసన నటించనున్నది ఎవరు? అని. ముగ్గురు పేర్లను తేజ పరిశీలిస్తున్నారట. వెంకీ కాంబినేషన్లో ఆల్రెడీ ‘చింతకాయల రవి’, ‘నాగవల్లి’ చిత్రాల్లో నటించిన అనుష్క, వెంకీతో ఇప్పటివరకూ నటించని కాజల్ అగర్వాల్, రాధికా ఆప్టే.. ఈ ముగ్గురిలో ఎవరో ఒకర్ని కథానాయికగా తీసుకోవాలని తేజ అనుకుంటున్నారట.మరి.. ముగ్గురిలో ఎవరికి చాన్స్ దక్కుతుందో ఈ ఇయర్ ఎండింగ్లో తెలిసిపోతుంది. ఎందుకంటే జనవరిలో ఈ చిత్రం షూటింగ్‌ని ప్రారంభించాలనుకుంటున్నారు. అన్నట్లు.. ఈ చిత్రంలో యాంగ్రీ మేన్ రాజశేఖర్ ఓ కీలక పాత్ర చేయనున్నారని టాక్. వెంకీ బావగా నెగటివ్ షేడ్ ఉన్న పాత్ర చేయనున్నారట. అది నిజమా? కాదా? అనే క్లారిటీ కూడా ఇయర్ ఎండింగ్లో వచ్చేస్తుంది. -
బావ బావమరిది?
‘గరుడవేగ’ హిట్‌తో ఫుల్ జోష్‌లో ఉన్నారు రాజశేఖర్. ‘నేనే రాజు నేనే మంత్రి’ హిట్ జోష్‌లో ఉన్నారు తేజ. అదే జోష్‌తో వెంకటేశ్‌తో సినిమా చేయడానికి రెడీ అయ్యారు. ఈ చిత్రానికి ‘ఆట నాదే వేట నాదే’ టైటిల్ పరిశీలనలో ఉందట. ఈ నెల 13న వెంకీ బర్త్ డేకి ఈ సినిమాకి కొబ్బరికాయ కొడుతున్నారు. ఇందులో ఓ కీలక పాత్రలో రాజశేఖర్ నటించనున్నారట. ‘‘కథ, పాత్ర నచ్చితే విలన్‌గా, ఇతర పాత్రల్లో నటించేందుకు ఎటువంటి అభ్యంతరం లేదు’’ అని ఇటీవల రాజశేఖర్ చెప్పిన విషయం తెలిసిందే. తేజ చెప్పిన కథ రాజశేఖర్‌కు నచ్చిందట. క్యారెక్టర్ కూడా డిఫరెంట్‌గా ఉండటంతో గ్రీన్ సిగ్నల్ ఇవ్వడానికి రెడీ అయ్యారట. ఇందులో రాజశేఖర్ విలన్‌గా చేయబోతున్నారట. వెంకీకి బావగా కనిపించనున్నారని మరో టాక్. -
రెండూ వెంకీవేనట!
ఏంటో అవి? ఒకటి ఆట... రెండోది వేట! ఈ రెండూ వెంకటేశ్వేనట! తేజ దర్శకత్వంలో వెంకీ హీరోగా సురేశ్ ప్రొడక్షన్స్, ఏకే ఎంటర్టైన్ మెంట్స్ సంస్థలు ఓ సినిమా నిర్మించనున్న సంగతి తెలిసిందే. ఆ సిన్మాకు ‘ఆట నాదే.. వేట నాదే’ టైటిల్ ఖరారు చేసినట్టు సమాచారం. ఇటీవలే ఈ టైటిల్ ఫిల్మ్ ఛాంబర్లో రిజిస్టర్ అయ్యింది. అది వెంకీ సినిమా కోసమేనని టాక్! ఇందులో కథానాయికగా కాజల్ అగర్వాల్ పేరు ముందు వరుసలో వినిపిస్తోంది! వెంకీ బర్త్‌డే సందర్భంగా డిసెంబర్ 13న ఈ సినిమా మొదలు కానుంది. -
హిందీలోనూ ఎన్టీఆర్ బయోపిక్
తెలుగువారి అభిమాన నటులు ఎన్టీఆర్ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయ్యారు. ఇందుకు కారణం ఆయన జీవిత చరిత్రతో రెండు సినిమాలు తెరకెక్కనుండటమే. తేజ దర్శకత్వంలో తండ్రి పాత్రలో బాలకృష్ణ నటించి, ఓ సినిమా నిర్మించనున్న విషయం తెలిసిందే. కాగా, ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ పేరుతో రామ్‌గోపాల్ వర్మ కూడా ఎన్టీఆర్ బయోపిక్ తెరకెక్కించనున్నట్లు స్పష్టం చేయడంతో పాటు ఫస్ట్ లుక్ కూడా రివీల్ చేయడం సంచలనం సృష్టించింది. ఒకే వ్యక్తి జీవితకథతో తెలుగులోనే రెండు సినిమాలు తెరకెక్కనుండటంతో ఎన్టీఆర్‌ని ఎవరు ఎలా చూపించనున్నారనే ఆసక్తి అప్పుడే మొదలైంది. కాగా, బాలకృష్ణ–తేజ కాంబినేషన్లో రూపొందనున్న బయోపిక్ ఒక్క తెలుగుకే పరిమితం కావడం లేదు. హిందీలోనూ రూపొందనుంది. మరి.. తెలుగు–హిందీ చిత్రాలను ఏకకాలంలో తెరకెక్కించనున్నారట. ప్రస్తుతం కేయస్ రవికుమార్ దర్శకత్వంలో బాలకృష్ణ ఓ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. దీనికి ‘కర్ణ’ అనే టైటిల్‌ని అనుకుంటున్నారని టాక్. ఈ చిత్రం షూటింగ్ మరో మూడు నెలల్లో పూర్తి చేయాలనుకుంటున్నారు. జనవరిలో ఎన్టీఆర్ బయోపిక్‌ని ప్రారంభించాలని బాలకృష్ణ–తేజ అనుకుంటున్నారట. -
ఎన్టీఆర్ బయోపిక్: తేజ వర్సస్ వర్మ
-
తేజ దర్శకత్వంలో సీనియర్ హీరో..?
నేను రాజు నేనే మంత్రి సినిమాతో తిరిగి ఫాంలోకి వచ్చిన తేజ, తన నెక్ట్స్ సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఈ సక్సెస్ ఫాంను కొనసాగించేందుకు స్టార్ ఇమేజ్ ను ఉపయోగించుకునే ప్రయత్నాల్లో ఉన్నాడు. ఇటీవల మెగా హీరోలతో తేజ ఓ మల్టీ స్టారర్ సినిమాకు ప్లాన్ చేస్తున్నాడన్న వార్తలు వినిపించాయి. అయితే ఈ ప్రాజెక్ట్ పై ఎలాంటి అధికారిక ప్రకటనా రాలేదు. తాజాగా మరో సీనియర్ హీరోతో తేజ సినిమా అన్న వార్త టాలీవుడ్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. వంద సినిమాలు పూర్తి చేసుకున్న తరువాత జెట్ స్పీడుతో సినిమాలు చేస్తున్న నందమూరి బాలకృష్ణ, తేజ దర్శకత్వంలో సినిమా చేసేందుకు అంగీకరించారట. ప్రస్తుతం కేయస్ రవికుమార్ దర్శకత్వంలో తన 102వ సినిమా చేస్తున్న బాలకృష్ణ, ఆ తరువాత చేయబోయే సినిమాను ఇంత వరకు ప్రకటించలేదు. -
పల్లెటూరి ప్రేమకథ
‘చూడాలని ఉంది, ఇంద్ర, యువరాజు’ సినిమాల్లో బాలనటుడిగా నటించిన తేజను లక్కీ మీడియా సంస్థ హీరోగా పరిచయం చేస్తోంది. బెక్కం వేణుగోపాల్ (గోపి) నిర్మిస్తున్న ఈ సినిమాకు హరి దర్శకుడు. సెప్టెంబర్ 15న రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించనున్నారు. నిర్మాత గోపి మాట్లాడుతూ– ‘‘పల్లెటూరి యువత నేపథ్యంలో జరిగే అందమైన ప్రేమకథా చిత్రమిది. కుటుంబమంతా చూసేలా ఉంటుంది. మా దర్శకుడు ప్రముఖ నిర్మాత శ్యామ్‌ప్రసాద్‌రెడ్డిగారి సంస్థలో దర్శకత్వ విభాగంలో ఎనిమిదేళ్లు పనిచేశారు. ‘ఉయ్యాలా జంపాలా, స్వామిరారా’ ఫేమ్ యంఆర్ సన్నీ మా సినిమాకు స్వరకర్త’’ అన్నారు. -
ముందు స్టోరీ... తర్వాతే టెక్నాలజీ!
‘‘వైవిధ్యమైన పాత్రలు చేయాలనే నటుణ్ణి అయ్యా. ప్రతిసారీ ఒకే రకమైన పాత్రలు చేస్తే చూడ్డానికి ప్రేక్షకులకు, చేయడానికి నాకు బోర్. కొత్త క్యారెక్టర్ చేస్తున్నప్పుడు ఆ పాత్ర నుంచి ఏం నేర్చుకోవాలా? అని ఆలోచిస్తా. క్యారెక్టర్ బేస్డ్ సినిమాలు చేయడం ఇష్టం. ఇప్పటివరకు చేసిన పాత్రలతో సంతోషంగా ఉన్నా’’ అన్నారు రానా. ఆయన హీరోగా తేజ దర్శకత్వంలో డి. సురేశ్‌బాబు, సీహెచ్. భరత్‌చౌదరి, వి. కిరణ్‌రెడ్డి నిర్మించిన చిత్రం ‘నేనే రాజు నేనే మంత్రి’. ఈరోజు సినిమా విడుదలవుతున్న సందర్భంగా రానా చెప్పిన విశేషాలు... ♦ మా సురేశ్ ప్రొడక్షన్స్‌లో ఫస్ట్ నుంచి సినిమా చేద్దాం అనుకున్నా కుదర్లేదు. ఇప్పుడైనా చేయడం చాలా ఆనందంగా ఉంది. మా నాన్నకు (డి.సురేశ్‌బాబు), నాకు స్టోరీ నచ్చింది. బాబాయ్ వెంకటేశ్‌గారు కథ విని హ్యాపీ. ఒక సినిమా మీద ఓనర్షిప్ ఉంటే బాగా చేయొచ్చు. ఈ సినిమాకి మా నాన్నగారు ఓ నిర్మాత కావడం నా లక్. ♦ ‘లీడర్’ సినిమాలోని అర్జున్‌ప్రసాద్ మంచోడు. ‘నేనే రాజు నేనే మంత్రి’లో జోగేంద్ర(రానా పాత్ర పేరు) అంత మంచోడు కాదు. ఈ చిత్రంలో రాజకీయాలు ఒక అంశం మాత్రమే. రాధా, జోగేంద్ర అనే భార్యాభర్తల కథ ఇది. కరువు ప్రాంతంలో ఉంటూ సింపుల్ అండ్ హ్యాపీలైఫ్ను లీడ్ చేసే జోగేంద్ర క్రైమ్, పాలిటిక్స్, మనీ అనే ప్రపంచంలోకి ఎందుకు అడుగుపెడతాడు? ఏం చేశాడన్నదే చిత్ర కథ. ♦ ‘బాహుబలి’ కోసం కండలు పెంచా. జోగేంద్ర చాలా కామన్‌మ్యాన్. అందుకోసం కష్టపడి బరువు తగ్గా. ఈ సినిమాకు ఆత్మ కథే. టెక్నాలజీ అనేది స్టోరీని సపోర్ట్ చేసే ఒక అంశం మాత్రమే. టెక్నాలజీ మీదే ఆధారపడితే సినిమాలు ఆడకపోవచ్చు. ముందు కథ ముఖ్యం. తర్వాతే టెక్నాలజీ అని నమ్ముతాను. విడుదలకు ముందు కొంచెం డబ్బులు మిగిలితే అది ఫైనాన్షియల్‌గా సక్సెస్ఫుల్æమూవీనే. ♦ ‘నేనే రాజు నేనే మంత్రి’ని తమిళంలో కూడా రిలీజ్ చేస్తున్నాం. తమిళ రాజకీయాలకు ఈ సినిమా కనెక్ట్ అవుతుందంటున్నారు. మేం తీసిన తర్వాత కనెక్ట్ అయ్యిందేమో అనిపిస్తుంది. నేను ప్రతిసారి పొలిటికల్ సినిమా చేస్తుంటే అది ఎవరికో ఎప్పుడో ఒక చోట కనెక్ట్ అవుతూనే ఉంది (నవ్వుతూ) . ♦ కాంపిటీషన్ అంటే ఫస్టఫాల్ నేను చేసే సినిమాలు ఇంకెవరూ చేయరని నా అభిప్రాయం. ఈరోజు విడుదలవుతున్న సినిమాలు వేటికవే డిఫరెంట్. బిగ్ వీకెండ్. ఇండిపెండెన్స్ వీకెండ్ అనేది ఒక సంక్రాంతి వీకెండ్ అయిపోవాలని కోరుకుంటున్నాను. హాలీవుడ్ మూవీ కోసం డిస్కషన్స్ జరుగుతున్నాయి త్వరలోనే పూర్తి వివరాలు చెబుతా. . -
రాజశేఖర్‌తో అనుకున్న సినిమా రానాతో చేశారా..!
బాహుబలి లాంటి భారీ సినిమా తరువాత యంగ్ హీరో రానా ప్రధాన పాత్రలో తెరకెక్కిన సినిమా నేనే రాజు నేనే మంత్రి. కొంత కాలంగా సరైన సక్సెస్ లు లేక ఇబ్బందుల్లో ఉన్న తేజ దర్శకత్వంలో ఈ సినిమాను తెరకెక్కింది. ఈ శుక్రవారం (11-08-2017) రిలీజ్ కు రెడీ అవుతున్న ఈ సినిమాకు సంబందించిన ఇంట్రస్టింగ్ అప్ డేట్ ఒకటి టాలీవుడ్ సర్కిల్స్ లో వినిపిస్తుంది. కొంత కాలం క్రితం తేజ సీనియర్ హీరో రాజశేఖర్ తో అహం అనే సినిమాను తెరకెక్కిస్తున్నట్టుగా ప్రకటించాడు. అయితే క్లైమాక్స్ విషయంలో ఏకాభిప్రాయం కుదరకపోవటంతో ఆ సినిమా సెట్స్ మీదకు రాలేదు. తరువాత అదే కథను రానాతో నేనే రాజు నేనే మంత్రి గా మార్చి చేశారట. రాజశేఖర్ సినిమాను తీసుకున్నట్టుగా చెప్పకపోయినా.. అహం కథనే రానా కోసం కొన్ని మార్పులు చేసినట్టుగా నిర్మాత సురేష్ బాబు తెలిపారు. మరి రాజశేఖర్ అనుకున్న క్యారెక్టర్ కు రానా ఎంత వరకు సూట్ అవుతాడు. రానాకు తగ్గట్టుగా కథలో ఏం మార్పులు చేశారో తెలియాలంటే రిలీజ్ వరకు వెయిట్ చేయాల్సిందే. -
రాధ మీద ప్రేమే రాక్షసుడిగా మార్చేసింది..!
యంగ్ హీరో రానా, తేజ దర్శకత్వంలో నటిస్తున్న సినిమా నేనే రాజు నేనే మంత్రి. పొలిటికల్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా కథపై చిత్రయూనిట్ క్లారిటీ ఇచ్చేశారు. తేజ గత సినిమాల మాదిరిగానే ఈసినిమా కూడా ప్రేమ కోసం జరిగే యుద్ధం నేపథ్యంలోనే తెరకెక్కుతుంది. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ లో రాధ లేనిదే జోగేంద్ర లేడు అంటూ హిట్ ఇచ్చిన తేజ, తాజా పోస్టర్ తో మరింత క్లారిటీ ఇచ్చాడు. పొలిటీషియన్ గెటప్ లో రానా కూర్చొని ఉన్న స్టిల్ తో రిలీజ్ అయిన పోస్టర్ లో 'రాధ మీద జోగేంద్ర ప్రేమే అతన్ని రాక్షసుడిలా మార్చేసింది' అనే క్యాప్షన్ రాసారు. దీంతో తన భార్యకు జరిగిన అన్యాయానికి ప్రతీకారంగానే జోగేంద్ర రాజకీయ వ్యవస్థను శాసించే నియంత మారతాడు. ఈ సినిమాలో రానా భార్య రాధగా కాజల్ అగర్వాల్ నటిస్తోంది. ఇప్పటికే భారీ హైప్ క్రియేట్ చేస్తున్న నేనే రాజు నేనే మంత్రి తెలుగుతో పాటు తమిళ, మలయాళ బాషల్లోనూ ఒకేసారి రిలీజ్ అవుతోంది. -
'నేనే రాజు నేనే మంత్రి' వర్కింగ్ స్టిల్స్
-
తేజ.. పెద్ద కథే చెబుతున్నాడు..!
చాలా రోజులుగా సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న దర్శకుడు తేజ, రానా హీరోగా తెరకెక్కుతున్న నేనే రాజు నేనే మంత్రి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. తన రెగ్యులర్ స్టైల్‌కు భిన్నంగా ఈ సారి ఓ పొలిటికల్ థ్రిల్లర్‌ను తెరకెక్కిస్తున్న ఈ క్రియేటివ్ డైరెక్టర్, సక్సెస్ మీద చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్, టీజర్స్కు కూడా మంచి రెస్పాన్స్ రావటంతో సినిమా మీద అంచనాలు పెరిగిపోతున్నాయి. ఈ సినిమా రన్ టైంకు సంబంధించిన అప్డేట్ ఒకటి మరోసారి తేజ సినిమా రిజల్ట్‌పై అనుమానాలు కలిగిస్తోంది. దాదాపుగా ఇటీవల రిలీజ్ అవుతున్న సినిమాలన్ని రెండు గంటల రన్ టైంకు ఓ పది నిమిషాలు అటు ఇటుగా రూపొందుతున్నాయి. అలాంటి సినిమాలనే కొన్ని సందర్భాల్లో ప్రేక్షకులు బోర్ ఫీల్ అవుతున్నారు. కానీ తేజ మాత్రం నేనే రాజు నేనే మంత్రి సినిమా రన్ టైంను ఏకంగా రెండు గంటల నలబై నిమిషాలుగా ఫిక్స్ చేశాడు. ఇది థ్రిల్లర్ సినిమా కావటంతో రన్ టైం తక్కువగా ఉంటుందని భావించారు. కానీ చిత్రయూనిట్ రెండున్నర గంటలకు పైగా నిడివి ఉన్న సినిమాను రెడీ చేశారు. మరి అంత సేపు అభిమానులను థ్రిల్ చేసే కథ తేజ రెడీ చేశాడా..? నేనే రాజు నేనే మంత్రి సినిమా రిజల్ట్ ఎలా ఉండబోతోంది..? అభిమానులతో పాటు ఇండస్ట్రీ వర్గాలు కూడా ఆసక్తిగా గమనిస్తున్నారు. -
రానా సినిమాకు రికార్డ్ ప్రైజ్..!
బాహుబలి సినిమాతో జాతీయ స్థాయి నటుడిగా మారిన రానా, ఇప్పుడు సోలో హీరోగా సక్సెస్ కొట్టేందుకు రెడీ అవుతున్నాడు. తేజ దర్శకత్వంలో పొలిటికల్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న నేనే రాజు నేనే మంత్రి సినిమాతో ప్రేక్షకులు ముందుకు వస్తున్నాడు రానా. బాహుబలి తరువాత రానాకు ఉన్న క్రేజ్ మార్కెట్ దృష్ట్యా ఈ సినిమాను నాలుగు భాషల్లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు. అంతేకాదు ఈ సినిమాతో రానా మరో రికార్డ్ సృష్టించాడు. నేనే రాజు నేనే మంత్రి సినిమా బాలీవుడ్ డబ్బింగ్ రైట్స్ భారీ మొత్తానికి అమ్ముడయ్యాయన్న వార్తలు వినిపిస్తున్నాయి. బాహుబలి కన్నా ముందు నుంచే బాలీవుడ్ కు పరిచయమున్న రానా, బాహుబలి తరువాత అక్కడ స్టార్ గా మారిపోయాడు. అందుకే ఈ సినిమా రైట్స్ ను ఏకంగా 11 కోట్లకు సొంతం చేసుకున్నారట బాలీవుడ్ నిర్మాతలు. అత్యధికంగా మహేష్ బాబు, మురుగదాస్ ల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న స్పైడర్ సినిమా బాలీవుడ్ రైట్స్ 20 కోట్లు పలకగా, రానా నేనే రాజు నేనే మంత్రి రెండో స్థానంలో నిలిచింది. ఇటీవల రిలీజ్ అయిన అల్లు అర్జున్, డీజే దువ్వాడ జగన్నాథమ్ రైట్స్ 8 కోట్లు మాత్రమే పలకటం విశేషం. -
షూటింగ్ పూర్తి చేసుకున్న 'నేనే రాజు నేనే మంత్రి'
సురేష్ ప్రొడక్షన్స్, బ్లూ ప్లానెట్ ఎంటర్టైన్మెంట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం 'నేనే రాజు నేనే మంత్రి'. సురేష్ బాబు, కిరణ్ రెడ్డి, భారత్ చౌదరిలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి తేజ దర్శకత్వం వహిస్తున్నారు. రాణా టైటిల్ పాత్రలో నటిస్తున్న ఈ పొలిటికల్ థ్రిల్లర్‌లో కాజల్, కేథరిన్లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రం ట్రైలర్ నిన్న విడుదలై సంచలనం సృష్టించింది. కేవలం 24 గంటల్లోపే 4 మిలియన్ వ్యూస్ సాధించి సినిమాపై ఉన్న అంచనాలను అమాంతం పెంచింది. ఈ సందర్భంగా చిత్ర దర్శకులు తేజ మాట్లాడుతూ.. 'రాణాలోని సరికొత్త యాంగిల్ ను 'నేనే రాజు నేనే మంత్రి'లో చూస్తారు. ప్రేక్షకులు ఊహించని విధంగా ఈ చిత్రంలో రాణా యాటిట్యూడ్ ఉంటుంది. జోగేంద్ర పాత్రలో రాణా ఒదిగిపోయిన విధానం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది' అన్నారు. చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ.. 'రాణా కెరీర్లో మరో మైలురాయిగా నిలిచే చిత్రం 'నేనే రాజు నేనే మంత్రి'. తెలుగుతోపాటు తమిళ, మలయాళ భాషల్లోనూ చిత్రాన్ని ఏకకాలంలో విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ట్రైలర్‌కు వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే సినిమాపై మాకున్న నమ్మకం ద్విగుణీకృతం అవుతోంది. తేజ టేకింగ్ చాలా కొత్తగా ఉండబోతోంది. లక్ష్మీ భూపాల్ సంభాషణలకి థియేటర్లలో విజిల్స్ వేస్తారు, ఆయన డైలాగ్స్ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. నేటి(శనివారం)తో చిత్రీకరణ పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా మొదలయ్యాయి' అన్నారు. -
టార్గెట్... సీయం కుర్చీ!
అతను అల్లూరి సీతారామరాజు కాదు... సుభాష్ చంద్రబోస్ కాదు... భగత్‌సింగ్ కూడా కాదు! కానీ, టీవీల్లో ముప్ఫై ఏళ్ల ఆ యువకుడి జీవితం గురించి తెగ చెప్పేస్తున్నారు. అతని పేరు... జోగేంద్ర. అతని టార్గెట్... సీయం కుర్చీ! అతని బలం... ‘వందమంది ఎమ్మెల్యేలను తీసుకెళ్లి స్టార్ హోటల్లో పెడితే సాయంత్రానికి నేనూ అవుతా సీయం’ అంటూ ఏకంగా ఓ రాష్ట్ర ముఖ్యమంత్రికి సవాల్ విసిరేంత! మరి, అనుకున్న టైమ్‌లో అతను టార్గెట్ రీచ్ అయ్యాడా? లేదా? అనేది మరికొన్ని రోజుల్లో విడుదల కానున్న పొలిటికల్ థ్రిల్లర్ ‘నేనే రాజు నేనే మంత్రి’ చూసి తెలుసుకోమంటున్నారు దర్శకుడు తేజ. ఆయన దర్శకత్వంలో రానా హీరోగా డి. సురేశ్‌బాబు, కిరణ్‌రెడ్డి, భరత్‌చౌదరి నిర్మించిన చిత్రమిది. కాజల్ అగర్వాల్, కేథరిన్ త్రెసాలు హీరోయిన్లు. ఈ సినిమా చిత్రీకరణ శనివారంతో పూర్తయింది. ‘‘నటుడిగా రానాలో కొత్త కోణాన్ని చూస్తారు. ప్రేక్షకుల ఊహకు అందని విధంగా సినిమాలో రానా యాటిట్యూడ్ ఉంటుంది’’ అన్నారు తేజ. చిత్రనిర్మాతలు మాట్లాడుతూ – ‘‘ఇటీవల విడుదలైన సినిమా టీజర్‌ను 40 లక్షలమంది నెటిజన్లు చూశారు. ప్రేక్షకుల స్పందన చూస్తోంటే మా నమ్మకం బలపడుతోంది. రానా కెరీర్లో మైలురాయిగా నిలిచే ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళ, మలయాళ, హిందీ భాషల్లో ఏకకాలంలో విడుదల చేస్తాం’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: అనూప్ రూబెన్స్, కెమెరా: వెంకట్ సి. దిలీప్, కూర్పు: కోటగిరి వెంకటేశ్వరరావు, కళ: నారాయణరెడ్డి, రచన: పరుచూరి బ్రదర్స్–లక్ష్మీ భూపాల్–సురేంద్ర కృష్ణ, ఫైట్స్: రవివర్మ, ఎగ్జిక్యూటివ్ నిర్మాతలు: అభిరామ్ దగ్గుబాటి, వివేక్ కూచిబొట్ల, సమర్పణ: డి. రామానాయుడు. -
'నేనే డిసైడ్ చేస్తా.. నేనే రాజు నేనే మంత్రి'
బాహుబలి, ఘాజీ లాంటి సినిమాలతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరో రానా చేస్తున్న కమర్షియల్ ఎంటర్టైనర్ నేనే రాజు నేనే మంత్రి. సెన్సేషనల్ డైరెక్టర్ తేజ దర్శకత్వంలో తెరకెక్కతున్న ఈ పొలిటికల్ థ్రిల్లర్‌లో కాజల్ అగర్వాల్ హీరోయిన్ నటిస్తోంది. ప్రస్తుతం ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న ఈ సినిమా ఫస్ట్ టీజర్‌ను మూవీ మొగల్ రామానాయుడు జయంతి సందర్శంగా రిలీజ్ చేశారు. రానా రాజకీయనాయకుడు జోగేంద్రగా కనిపించనున్నాడు. ఇప్పటి వరకు కమర్షియల్ హీరోగా ప్రూవ్ చేసుకోలేకపోయిన రానా ఈ సినిమాతో ఎలాగైన సోలోగా మంచి హిట్ కొట్టాలని భావిస్తున్నాడు. అదే సమయంలో దర్శకుడు తేజకు కూడా ఈ సినిమా కీలకం కానుంది. కెరీర్ స్టార్టింగ్ లో బ్లాక్ బస్టర్ సక్సెస్ లతో అలరించిన తేజ, తరువాత ఆ స్థాయి సక్సెస్‌లు సాధించలేకపోయాడు. అందుకే తన మార్క్ లవ్ స్టోరిలను పక్కన పెట్టి పొలిటికల్ థ్రిల్లర్‌తో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు. -
జోగేంద్రగా రానా..!
బాహుబలి సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరో రానా మరో ఇంట్రస్టింగ్ క్యారెక్టర్ లో అలరించనున్నాడు. బాహుబలి, ఘాజీ లాంటి చిత్రాలతో డిఫరెంట్ సినిమాల హీరోగా పేరుతెచ్చుకున్న భల్లాలదేవ, నెక్ట్స్ ఓ పొలిటికల్ థ్రిల్లర్ సినిమాతో ఆడియన్స్ ముందుకు రానున్నాడు. తేజ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు నేనే రాజు నేనే మంత్రి అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి కావచ్చిన ఈ సినిమాకు సంబంధించిన ఇంట్రస్టింగ్ అప్డేట్ ఇచ్చారు చిత్రయూనిట్. రానా పొలిటీషన్ గా కనిపిస్తున్న ఈ సినిమాలో ఆయన పాత్ర పేరు జోగేంద్ర అని తెలిపారు. ఈ సినిమాలో రానా సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తుంది. ఈ సినిమాతో ఎలాగైన సక్సెస్ ట్రాక్ లోకి రావాలని భావిస్తున్న తేజ, తన రెగ్యులర్ స్టైల్ ను పక్కన పెట్టి డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఆడియన్స్ ముందుకు వస్తున్నాడు. -
పదేళ్ల తరువాత ఆ ఇద్దరితో..!
టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగిన అందాల భామ కాజల్ అగర్వాల్.. ప్రస్తుతం వరుస ఫెయిల్యూర్స్ తో ఇబ్బందుల్లో పడింది. ఒక దశలో కెరీర్ ముగిసిపోయినట్టే అని భావించినా.. మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ సినిమా ఖైదీ నంబర్ 150తో తిరిగి ఫాంలోకి వచ్చింది. ప్రస్తుతం అజిత్, విజయ్ లాంటి టాప్ హీరోల సరసన నటిస్తున్న ఈ బ్యూటి ఇంట్రస్టింగ్ కాంబినేషన్ లను రిపీట్ చేస్తోంది. తెలుగులో లక్ష్మీ కళ్యాణం సినిమాతో పరిచయం అయిన కాజల్, ఆ సినిమాలో కళ్యాణ్ రామ్‌కు జోడిగా తేజ దర్శకత్వంలో నటించింది. ప్రస్తుతం మరోసారి తేజ దర్శకత్వంలో రానాకు జోడిగా నేనే రాజు నేనే మంత్రి సినిమాలో నటిస్తున్న కాజల్, కళ్యాణ్ రామ్ తోనూ నటించేందుకు అంగీకరించింది. కొత్త దర్శకుడు ఉపేంద్ర డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఎమ్మెల్యే సినిమాలో కళ్యాణ్ రామ్ కు జోడిగా నటించనుంది కాజల్. -
ఖైదీ బాగానే కలిసొచ్చింది..!
వరుస ఫ్లాప్‌లతో కెరీర్ ముగిసిపోయిందనుకున్న దశలో మెగా స్టార్ చిరంజీవి రీ ఎంట్రీ సినిమాలో ఛాన్స్ కొట్టేసింది కాజల్. ఒకప్పుడు టాలీవుడ్ టాప్ హీరోలతో వరుస సినిమాలు చేసిన ఈ బ్యూటి కెరీర్, వరుస ఫ్లాప్‌లతో కష్టాల్లో పడింది. ఇక కెరీర్ ముగిసిపోయనట్టే అనుకుంటున్న సమయంలో చిరంజీవి సరసన నటించే ఛాన్స్ కొట్టేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. మెగాస్టార్‌కు జోడిగా నటించిన ఖైదీ నంబర్ 150 ఘన విజయం సాధించటంతో కాజల్ మళ్లీ బిజీ అవుతోంది. ఇప్పటికే తేజ దర్శకత్వంలో రానా హీరోగా తెరకెక్కుతున్న నేనే రాజు.. నేనే మంత్రి సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది కాజల్. ఈ సినిమాతో పాటు మరో మూడు తమిళ సినిమాలకూ కమిట్ అయ్యింది. ఒకప్పుడు ఫ్లాప్ హీరోయిన్గా అవకాశాల కోసం ఎదురుచూసిన కాజల్, ఇప్పుడు చేతినిండా సినిమాలతో బిజీగా హీరోయిన్ అయ్యింది. మరోసారి కాజల్ లక్కీ గర్ల్‌గా మారిపోవటంతో తెలుగు నిర్మాత కూడా కాజల్ డేట్స్ కోసం ఎదురుచూస్తున్నారట. -
తేజ దర్శకత్వంలో స్టార్ వారసురాలు
చిత్రం, నువ్వు నేను, జయం లాంటి సినిమాలతో ఇండస్ట్రీని మలుపు తిప్పిన దర్శకుడు తేజ. అంత కొత్త వారితో తిరుగులేని విజయాలు సాధించిన ఈ గ్రేట్ డైరెక్టర్, కొంత కాలంగా సక్సెస్ కు దూరమయ్యాడు. తేజ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమాలన్ని వరుసగా ఫ్లాప్ అవ్వటంతో ఆయన కెరీర్ కష్టాల్లో పడింది. లాంగ్ గ్యాప్ తరువాత ప్రస్తుతం రానా హీరోగా ఓ పొలిటికల్ డ్రామాను తెరకెక్కిస్తున్నాడు తేజ. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తి కావచ్చింది. నేనే రాజు నేనే మంత్రి పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమా తరువాత మరోసారి తన మార్క్ లవ్ స్టోరిని చేసే ఆలోచనలో ఉన్నాడు తేజ. అంతా కొత్త వారితో ఓ క్యూట్ లవ్ స్టోరిని ప్రీపేర్ చేస్తున్నాడు. ఈ సినిమాతో ప్రముఖ హీరో రాజశేఖర్ కూతురు శివానిని హీరోయిన్గా పరిచయం చేయబోతున్నాడట. గతంలో రాజశేఖర్ హీరోగా తేజ అహం అనే సినిమాను ఎనౌన్స్ చేశాడు. అయితే ఈ సినిమా చర్చల దశలోనే ఆగిపోయింది. గతంలో తేజ పరిచయం చేసిన నటీనటులు ఇప్పుడు స్టార్ గా వెలుగొందుతున్నారు. అదే బాటలో రాజశేఖర్ కూతురికి కూడా తేజ బ్రేక్ ఇస్తాడేమో చూడాలి. -
ముంపు ప్రాంతాలపై పాట రాస్తా
సినీ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ వీఆర్‌పురం (రంపచోడవరం) : పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం మూలంగా సర్వస్వాన్ని కోల్పోతున్న నిర్వాసితుల ఆవేదనను కళ్లకు కట్టే రీతిలో ఒక పాట రాస్తానని సినీ గేయ రచయితీ సుద్దాల అశోక్‌తేజ అన్నారు. తెలంగాణ రాష్ట్రం భద్రాచలంలో భద్రాద్రి కళాభారతి 15వ అంతరాష్ట్ర స్థాయి నాటకోత్సవాల ముంగిపు కార్యక్రమానికి వచ్చిన ఆయన.. బుధవారం పాపికొండల ప్రాంతాన్ని వీక్షించేందుకు వచ్చారు. మండలంలోని పోచవరం బోట్ పాయింట్ నుంచి గోదావరిపై బోట్లో పేరంటపల్లిలోని శివాలయం, పాపికొండలను వీక్షించారు. ప్రకృతి అందాలు కనుమరుగైతే బాధ వేస్తుంది.. పచ్చటి అటవీ ప్రాంతం, ఆహ్లాదకర వాతావరణం, గోదావరి నది వంపు సొంపుల నడుమ ఉన్న గిరిజన పల్లెలు.. గోదావరి ఒడిలో కలిసిపోతాయంటే బాధ వేస్తుందని అశోక్‌తేజ అన్నారు. సంస్కృతి, సాంప్రదాయాలను వదిలి మరో ప్రాంతంలో వీరు బతకాలంటే కష్టమేనన్నారు. అసలు ఇంటి పేరు గుర్రం .. సుద్దాల అశోక్ తేజాగా సుప్రసిద్ధుడైన ఆయన ఇంటి పేరు గుర్రం అని చెప్పారు. నల్గొండ జిల్లా గుండాల మండలంలోని సుద్దాల గ్రామం ఆయన స్వగ్రామం. తండ్రి హనుమంతు కూడా సినీగేయ రచయితే. ఆయనను సుద్దాల హనుమంతుగా పిలిచేవారు. దీంతో ఇంటి పేరు సుద్దాలగా మారిందని ఆయన అన్నారు. గేయ రచీతగా 22 ఏళ్ల కాలంలో 1,250 సినిమాల్లో సుమారు 2,200 పైగా పాటలు రాసినట్టు చెప్పారు. పాండురంగడు చిత్రంలో రాసిన ‘మాతృదేవోభవ’ పాట అంటే తనకు ఇష్టమని చెప్పారు. -
16 ఏళ్ల తరువాత అదే లోకేషన్లో రానా
బాహుబలి షూటింగ్ పూర్తి చేసుకున్న రానా, ప్రస్తుతం తాను హీరోగా తెరకెక్కుతున్న నేనే రాజు నేనే మంత్రి షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. తన తొలి సినిమాలో రాజకీయనాయకుడిగా నటించిన ఈ మ్యాన్లీ హీరో ఇప్పుడు మరోసారి అదే తరహా పాత్రలో కనిపించనున్నాడు. లవ్ స్టోరీలతో టాలీవుడ్ ఇండస్ట్రీలో సరికొత్త ట్రెండ్ సృష్టించిన తేజ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కర్నూలు జిల్లాలోని యాంగటి ఆలయ పరిసరాల్లో జరుగుతోంది. ఈ సందర్భంగా గతంలో తాను ఆలయాన్ని వెళ్లిన సందర్భాన్ని అభిమానులతో పంచుకున్నాడు రానా. 16 ఏళ్ల క్రితం వెంకటేష్ హీరోగా తెరకెక్కిన జయంమనదేరా షూటింగ్ సమయంలో యాగంటి ఆళయానికి వచ్చారాన్న తిరిగి ఇన్నేళ్ల తరువాత అక్కడే షూటింగ్ చేయటం ఆనందంగా ఉందని ట్వీట్ చేశాడు. Never was a believer of the God or the Devil!! But this is just spectacular. Shooting at the Yaganti Temple!! #bestjobever pic.twitter.com/omQTy0urnv — Rana Daggubati (@RanaDaggubati) 8 January 2017 Came here exactly 16years ago for the shoot of VictoryV's #JayamManadaeRaa #జయంమనదేరా pic.twitter.com/s7SkhLIVKu — Rana Daggubati (@RanaDaggubati) 8 January 2017 -
పార్టీ ప్రచారంలో బిజీ బిజీగా రానా
యంగ్ హీరో రానా కొత్త ఏడాదిలో బిజీ అయ్యాడు. అనంతపురంలోజరుగుతున్న పార్టీ ప్రచారంలో ఉత్సాహంగా పాల్గొంటున్నాడు. చుట్టూ అనుచరులు, కార్యకర్తలతో కలిసి రోడ్ షో నిర్వహిస్తున్నాడు. ఇదంతా పొలిటికల్ పార్టీ కోసం మాత్రం కాదులెండీ. రానా హీరోగా తెరకెక్కుతున్న నేనే రాజు.. నేను మంత్రి సినిమా షూటింగ్ అనంతపురంలో జరుగుతోంది. ఇందులో భాగంగా రానా ప్రచారంలో పాల్గొంటున్న సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఇప్పటికే బాహుబలి, ఘాజీ సినిమాల షూటింగ్ పూర్తి చేసిన రానా, తేజ దర్శకత్వంలో తెరకెక్కుతున్న నేనే రాజు.. నేనే మంత్రి షూటింగ్లో పాల్గొంటున్నాడు. కాజల్ హీరోయిన్గా తెరకెక్కుతున్న ఈ సినిమా పొలిటికల్ డ్రామాగా తెరకెక్కుతోంది. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం షూటింగ్‌లకు బ్రేక్ ఇచ్చిన రానా, నిన్న (మంగళవారం) తిరిగి షూటింగ్ పాల్గొన్నాడు. ఈ విషయాన్ని అభిమానులతో పంచుకున్న తొలిరోజు షూటింగ్ ఫోటోనూ ట్విట్టర్ పేజ్‌లో పోస్ట్ చేశాడు. Day 1 of shoot in 2017 started yesterday in Ananthapur!! Thank you for the love!! pic.twitter.com/PnJoaQF28o — Rana Daggubati (@RanaDaggubati) 4 January 2017 -
డై..లాగి కొడితే...
సినిమా : జయం రచన, దర్శకత్వం: తేజ వెంకటరమణ (నితిన్), సుజాత (సదా) ఒకే కాలేజీలో చేరతారు. కాళ్లకు పట్టీలు వేసుకొచ్చిందని సుజాతను ఏడిపిస్తాడు అలీబాబా (సుమన్ శెట్టి). ఆ కారణంతో మరుసటి రోజు రైల్వేస్టేషన్ వరకూ పట్టీలు వేసుకొచ్చిన సుజాత వాటిని తన చెల్లికి ఇచ్చి సాయంత్రం తీసుకురమ్మని కాలేజీకి వస్తుంది. అదేంటండి.. పట్టీలు తీసేశారని వెంకటరమణ అడుగుతాడు. అవును.. తీసేశాను. నీకెందుకు? పట్టీలు వేసుకుంటే ఎందుకు వేసుకున్నావని మీరే ఏడిపిస్తారు.. తీసేస్తే.. ఎందుకు తీసేశారని మళ్లీ మీరే అడుగుతారు. వేసుకుంటే వేసుకుంటా.. తీసేయాలనిపిస్తే తీసేస్తా.. అసలు నా సంగతి నీకెందుకయ్యా.. నీకూ, నాకూ ఏంటి సంబంధం? ‘వెళ్లవయ్యా.. వెళ్లు.. వెళ్లూ...’ అంటుంది సుజాత. ఈ డైలాగ్ ఎంత పాపులర్ అంటే.. ఇప్పటికీ ఎక్కడో చోట వినిపిస్తూనే ఉంటుంది. -
రానా మరో సినిమా మొదలెట్టేశాడు
స్టార్ వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన హీరో క్యారెక్టర్లకే ఫిక్స్ అయిపోకుండా అన్ని రకాల పాత్రలతో ఆకట్టుకుంటున్న యంగ్ హీరో రానా. ఇప్పటికే తెలుగు, తమిళ, హిందీ భాషల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న రానా.. బాహుబలి సినిమాతో అంతర్జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకున్నాడు. అదే జోరు లో ఇప్పుడు హీరోగా కూడా సత్తా చాటడానికి రెడీ అవుతున్నాడు. ఇప్పటికే బాహుబలి తో పాటు మరో బహుభాషా చిత్రం ఘూజీ షూటింగ్ లను పూర్తి చేసిన రానా, ఇక టాలీవుడ్ మీద దృష్టి పెట్టాడు. సెన్సేషనల్ దర్శకుడు తేజ దర్శకత్వంలో ఓ సినిమాను ప్రారంభించాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ మధురై దగ్గరలోని కరైకుడిలో ప్రారంభమైంది. రానాతో పాటు కాజల్, కేథరిన్ లు పాల్గొంటున్న ఈ షెడ్యూల్ పది రోజుల పాటు జరగనుంది. తరువాత హైదరాబాద్ లో మరో భారీ షెడ్యూల్ ను ప్లాన్ చేస్తున్నారు. చాలా రోజులుగా సరైన హిట్ లేని తేజ ఈ సారి ఎలాగైన భారీ సక్సెస్ తో సత్తా చాటాలని చూస్తున్నాడు. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాతో రానా కూడా సోలో హీరోగా సక్సెస్ కొట్టాలని భావిస్తున్నాడు. -
రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి
-
రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి
శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కేంద్రంలో గురువారం ఉదయం జరిగిన ప్రమాదంలో ఒక మహిళ చనిపోగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. కోవూరు మండలం లేగుంటపాడుకు చెందిన తేజ(35), ఆమె తమ్ముడు అభిలాష్(30) నెల్లూరు సింహపురి ఆస్పత్రిలో ఉన్న తమ తల్లికి సాయంగా ఉన్నారు. గురువారం ఉదయం వారు ఆస్పత్రి నుంచి ఇంటికి వెళ్తుండగా ఆత్మకూరు బస్టాండ్ వద్ద ఎదురుగా రాంగ్ రూట్లో వచ్చిన ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో తేజ అక్కడికక్కడే చనిపోగా తీవ్రంగా గాయపడిన అభిలాష్‌ను వెంటనే 108లో సింహపురి ఆస్పత్రికి తరలించారు. నార్త్ ట్రాఫిక్ ఎస్సై కొండయ్య ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
రాష్ట్రస్థాయి క్విజ్‌లో ‘తేజ’కు ప్రథమ స్థానం
కోదాడ: ప్రపంచ వన్యప్రాణి సంరక్షణ సంస్థ రాష్ట్ర స్థాయిలో శుక్రవారం హైద్రాబాద్‌లో నిర్వహించిన వైల్డ్ విజ్డమ్ క్విజ్‌లో కోదాడలోని తేజ విద్యాలయానికి చెందిన విద్యార్థులు ప్రథమ స్థానం సాధించారు. వీరు త్వరలో డిల్లీలో జరగనున్న జాతీయస్థాయి పైనల్లో రాష్ట్రం తరుపున పాల్గొననున్నారు. పాఠశాలకు చెందిన పవన్‌కుమార్‌రెడ్డి (7వ తరగతి), పవన్ (8వ తరగతి) విద్యార్థుల టీం 150 మార్కులతో ప్రథమ స్థానం సాధించింది. మొత్తం 108 టీంలు పాల్గొన్న ఈ పోటీల్లో తమ పాఠశాల విద్యార్థులు ప్ర«థమ స్థానం సాధించడం పట్ల పాఠశాల నిర్వాహకులు రమాసోమిరెడ్డి, జానకిరామయ్య హర్షం వ్యక్తం చేశారు. గత మూడు సంవత్సరాలుగా తమ పాఠశాల విద్యార్థులు వరుసగా ప్రథమ స్థానం సాధిస్తున్నారని వారు తెలిపారు. -
తేజ దర్శకత్వంలో రానా
వారసులుగా ఎంట్రీ ఇచ్చిన యువ కథానాయకులు స్టార్ ఇమేజ్ కోసం పోటీ పడుతుంటే యంగ్ హీరో రానా మాత్రం విలక్షణ పాత్రలతో ఆకట్టుకుంటున్నాడు. తెలుగుతో పాటు తమిళ, హిందీ భాషల్లో అతిథి పాత్రల్లో నటిస్తూ తన మార్క్ చూపిస్తున్నాడు. బాహుబలి సినిమాలో ప్రతినాయక పాత్రలో నటించిన రానా ఒక్కసారిగా జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం స్టార్ స్టేటస్ ను ఎంజాయ్ చేస్తున్న రానా ఓ రిస్కీ ప్రాజెక్ట్ ను ఓకె చేశాడు. చిత్రం, నువ్వు నేను, జయం లాంటి సినిమాలతో ఇండస్ట్రీని మలుపు తిప్పిన దర్శకుడు తేజ, తరువాత ఆ స్థాయిలో ఆకట్టుకోలేకపోయాడు. యంగ్ హీరోలతో పాటు స్టార్ హీరోలతో కలిసి చేసిన సినిమాలు ఫ్లాప్ అవ్వడంతో ఆలోచనలో పడ్డాడు. కొద్ది రోజులుగా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్న ఈ క్రియేటివ్ డైరెక్టర్ ఇటీవల రాజశేఖర్ ప్రధాన పాత్రలో అహం సినిమాను ప్రారంభించాలని ప్రయత్నించాడు. అయితే ఈ సినిమా ఇప్పటికీ చర్చల దశలోనే ఉంది. అహం సినిమా పట్టాలెక్కక ముందే రానా హీరోగా మరో సినిమాను ప్రారంభిస్తున్నాడు తేజ. ఈ విషయాన్ని రానా స్వయంగా తన ట్విట్టర్ లో ప్రకటించాడు. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా ఈ వారంలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. మరి చాలా రోజులుగా అహం సినిమా కోసం ఎదురుచూస్తున్న రాజశేఖర్ ఈ వార్త పై ఎలా స్పందిస్తాడో చూడాలి. My next film goes on floors this week. Look test completed. Director Teja and @MsKajaIAggarwaI !! More details soon!! — Rana Daggubati (@RanaDaggubati) 9 May 2016 -
తేజ సినిమా నుంచి రాజశేఖర్ అవుట్
కొద్ది రోజులుగా కెరీర్ పరంగా భారీ కష్టాల్లో ఉన్న రాజశేఖర్ ప్రస్తుతం సరైన అవకాశం కోసం ఎదురుచూస్తున్నాడు. హీరోగా అవకాశాలు రాకపోవటంతో నెగెటివ్ రోల్స్‌కు కూడా రెడీ అయిన ఈ యాంగ్రీ హీరో, తేజ దర్శకత్వంలో తెరకెక్కుతున్న అహం సినిమాలో విలన్‌గా నటించడానికి అంగీకరించాడు. అయితే ఈ సినిమా మొదలైన సమయంలోనే ఈ ఇద్దరి కాంబినేషన్లో సినిమా ముందుకెళుతుందా అన్న టాక్ వినిపించింది. అనుకున్నట్టుగానే తేజ తెరకెక్కిస్తున్న అహం నుంచి రాజశేఖర్ తప్పుకున్నాడన్న వార్త ఇప్పుడు టాలీవుడ్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది. కారణాలేంటన్న విషయం తెలియకపోయినా రాజశేఖర్‌ను కాదని తేజ మరో స్టార్ హీరోని సంప్రదిస్తున్నాడట. ఒకప్పుడు యూత్‌లో భారీ క్రేజ్ సొంతం చేసుకున్న తేజ కొద్ది రోజులుగా ఆ స్థాయి సినిమాను తెరకెక్కించలేకపోతున్నాడు. అందుకే ఈ సారి ఎలాగైన హిట్ కొట్టాలనే ఉద్దేశంతో అహం సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. -
ఆ ముగ్గురికీ కీలకమే
దర్శకుడిగా ఒకప్పుడు టాప్ స్టార్ డమ్‌ను అందుకున్న తేజ, కొంత కాలంగా ఆకట్టుకోలేకపోతున్నాడు. ఒకప్పుడు హీరోలకు సమానంగా క్రేజ్ సంపాదించుకున్న ఈ దర్శకుడు, ఇప్పుడు మినిమమ్ కలెక్షన్లు వసూళు చేసే సినిమాను కూడా ఇవ్వలేకపోతున్నాడు. దీంతో ఈ సారి ఎలాగైన హిట్ కొట్టాలనే ఆలోచనలో ఓ క్రేజీ కాంబినేషన్‌ను సెట్ చేస్తున్నాడు. తానే ఇంట్రడ్యూస్ చేసిన ఓ యువ నటుడు హీరోగా, మరో సీనియర్ హీరోను విలన్‌గా పరిచయం చేస్తూ సినిమా తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే కథా కథనాలు కూడా రెడీ అయిన అహం సినిమాను త్వరలోనే సెట్స్ మీదకు తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నాడు దర్శకుడు తేజ. ఈ సినిమాలో తేజ ఇండస్ట్రీకి పరిచయం చేసిన నవదీప్ హీరోగా నటిస్తున్నాడు. 12 ఏళ్ల క్రితం జై సినిమాతో తేజ డైరెక్షన్లో పరిచయం అయిన నవదీప్, ఇన్నేళ్ల తరువాత తిరిగి తన గురువుతో కలిసి నటిస్తున్నాడు. అంతేకాదు ఈ సినిమాతో యాంగ్రీ హీరో రాజశేఖర్ తొలిసారిగా నెగెటివ్ రోల్లో నటించడానికి రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం రాజశేఖర్, తేజ, నవదీప్‌ల కెరీర్లు భారీ కష్టాల్లో ఉన్నాయి. అందుకే ఈ ముగ్గురికి అహం సినిమా సక్సెస్ చాలా కీలకం కానుంది. మరి ఈ అహం ఆ ముగ్గురి కెరీర్లను గాడిలో పెడుతుందేమో చూడాలి. -
నీకు నేను... నాకు నువ్వు...
సినిమా వెనుక స్టోరీ - 34 తేజ... తేజ... తేజ... ఎక్కడ విన్నా ఇదే పేరు. 40 లక్షల్లో ‘చిత్రం’ తీసి 9 కోట్లకు పైగా రాబట్టడమంటే ఇప్పటి ట్రెండ్‌లో నిజంగా చిత్రం భళారే విచిత్రమే! అప్పటి వరకూ కెమెరామ్యాన్‌గా ఉన్నవాడు ‘చిత్రం’తో ఒక్కసారిగా ఫేమస్ అయి పోయాడు. నిర్మాతలు ఎగబడ్డారు. తేజ కొంచెం చిత్రమైన మనిషి. రెమ్యునరేషన్ కన్నా ముందు మనిషి నచ్చాలి. మనిషి నచ్చితేనే సినిమా చేస్తాడు. అలా ఇద్దరికి గ్రీన్సిగ్నలిచ్చాడు. ఒకరు - సుంకర మధుమురళి, ఇంకొకరు - ‘జెమినీ’ కిరణ్. మధుమురళి బ్యానర్లో జగపతిబాబు హీరోగా ‘ఫ్యామిలీ సర్కస్’కు ప్లానింగ్ జరుగుతోంది. ఇటు ‘జెమినీ’ కిరణ్ సంస్థలో వెంకటేశ్ హీరోగా ఓ సినిమా చేయాలి. వెంకటేశ్‌కు కథ చెప్పి వచ్చాడు తేజ. ఆయన ‘ఎస్’ చెప్పలేదు. ‘నో’ చెప్పలేదు. కానీ పనులు ఆపలేదు తేజ. మ్యూజిక్ డెరైక్టర్ ఆర్.పి.పట్నా యక్, లిరిక్ రైటర్ కులశేఖర్‌కు సిట్యు యేషన్స్ చెప్పి రెండు పాటలు కూడా రెడీ చేయించేశాడు. అదిరిపోయేలా వచ్చాయి. ఒకటేమో ఫోక్ సాంగ్. ‘గాజువాక పిల్లా... మేం గాజులోళ్లం కాదా’, ఇంకొకటి డ్యూయెట్... ‘తుమ్మెదా... ఓ తుమ్మెదా’. బౌండ్ స్క్రిప్ట్ రెడీగా ఉంది కానీ, వెంకటేశ్ ఏం తేల్చడం లేదు. ఆయన స్టూడియోకెళ్లాడు తేజ. అక్కడ సెట్‌వర్క్ జరుగుతోంది. వెంకటేశ్ కొత్త సినిమా కోసమట. విజయ్‌భాస్కర్ డెరైక్షన్‌లో ‘నువ్వు నాకు నచ్చావ్’ చేస్తున్నారట. తేజకు క్లారిటీ వచ్చేసింది. ఇక తన సినిమా ఉండదు. కారెక్కాడు. కారు స్పీడ్‌గా ఫిల్మ్‌నగర్ డౌన్ రోడ్డులోకి దూసుకెళ్తోంది. తేజ మైండ్ కూడా స్పీడ్‌గా ఆలోచిస్తోంది. సడెన్ బ్రేక్. ఎదురుగా గొర్రెల మంద. ఓ అమ్మాయి వాటిని అదిలిస్తూ రోడ్డు దాటుతోంది. అటుపక్క కాస్ట్లీ కారులో కూర్చున్న ఓ అబ్బాయి చాలా అసహ నంగా ఈ అమ్మాయివైపు చూస్తున్నాడు. ఆమె కంగారుగా గొర్రెలను పక్కకు తరిమేసింది. కారు ముందుకెళ్లిపోయింది. ఆఫీసులో అడుగుపెట్టాడు తేజ. బాగా ఆకలి వేస్తోంది. ఆఫీస్‌బాయ్ పెట్టే లోపు తనే వడ్డించేసుకుని తినేశాడు. ఇంతలో ‘జెమినీ’ కిరణ్ వచ్చాడు. ‘‘ఓ పావుగంటలో మీకో కథ చెబుతా. మీకు నచ్చితే దానితోనే సినిమా తీద్దాం. ఇక వెంకటేశ్ ప్రాజెక్టు ఉండనట్టే’’ అని చెప్పేశాడు తేజ. లంచ్ కంప్లీటయ్యాక, ఆ టేబుల్ మీదే తలవాల్చుకుని పావుగంట కునుకు తీశాడు. తర్వాత కిరణ్ రూమ్‌లో కెళ్లి కథ చెప్పడం మొదలుపెట్టాడు. గొర్రెలు కాసుకునేవాడి కూతురు హీరోయిన్. కృష్ణా ఒబెరాయ్ లాంటి రిచెస్ట్ మ్యాన్ కొడుకు హీరో. వాళ్లిద్దరి మధ్యనా లవ్‌స్టోరీ. సీన్లతో సహా ఎక్స్ప్లెయిన్ చేసేశాడు. ‘జెమినీ’ కిరణ్ ఫ్లాట్. ‘‘ఇంతకూ ఈ సినిమాలో ‘గాజువాక పిల్లా’ పాట ఉంటుందా? లేదా?’’ ఆసక్తిగా అడిగాడు కిరణ్. తేజ నవ్వుతూ ఏదో చెప్ప బోయాడు. కిరణ్ మధ్యలోనే కల్పించుకుని, ‘‘ఎల్లుండే ఓపెనింగ్ పెట్టేద్దాం. చాలా మంచి ముహూర్తం ఉంది. మిగతా విషయాలు తర్వాత ప్లాన్ చేద్దాం’’ అని చెప్పేశాడు. ఆ రోజు జనవరి 2. అసోసియేట్ డెరైక్టర్ దశరథ్‌తో కూర్చుని తేజ చకచకా స్క్రిప్టు రెడీ చేసేశాడు. సినిమా పేరు ‘నువ్వు - నేను’. జనవరి 4నే షూటింగ్ స్టార్ట్. హీరో లేడు. హీరోయిన్ ఎవరో తెలియదు. ఫస్ట్‌డే... తనికెళ్ల భరణి, ‘తెలంగాణ’ శకుంతలపై సీన్స్ షూట్ చేసేశారు. ఆ తర్వాత రోజూ కొన్ని షాట్స్ తీశారు. ఇప్పుడు హీరో హీరోయిన్ల కోసం వేట మొదలైంది. సుమంత్‌ను కలిశాడు తేజ. వర్కవుటయ్యే పరిస్థితి లేదు. మాధవన్‌ని అడిగితే తెలుగు సినిమాలు చేయనంటాడు. తేజలో అసహనం. ఆ టైమ్‌లో ఉదయ్‌కిరణ్ వచ్చాడు ఆఫీసుకి. రోజూ వచ్చి తేజను కలిసి వెళ్తూంటా డతను. ‘చిత్రం’తో తనను హీరోను చేసిన తేజ అంటే ఉదయ్‌కిరణ్‌కు విపరీతమైన గౌరవం. ఏ సినిమా చేయాలో... ఎవరి దగ్గర కథ వినాలో... ఎంత రెమ్యునరేషన్ తీసుకోవాలో... ఏదైనా తేజ చెబితేనే వింటాడు. తేజ చెప్పడంతోనే తన సెకెండ్ సినిమా డేట్లు ‘నిధి’ ప్రసాద్‌కిచ్చాడు. ఆయన డెరైక్షన్‌లో ‘హోలీ’ చేయాలి. తేజ ఎదురుగా భక్తిభావంతో కూర్చున్నాడు ఉదయ్‌కిరణ్. నవ్వుతూ గలగలా మాట్లాడే తేజ, ఆ రోజెందుకో ముభావంగా ఉన్నాడు. మూడ్ బాలేదని అర్థమైంది. అందుకే ఉదయ్‌కిరణ్ కూడా కామ్‌గా ఉన్నాడు. కాసేపటి తర్వాత తేజ అన్నాడు. ‘‘ఉదయ్! జిమ్ బాగా చేసి బాడీ పెంచు. ‘నువ్వు - నేను’ నీతోనే చేస్తున్నా.’’ ఉదయ్కిరణ్కి సెకెండ్ టైమ్ కూడా బంపర్ లాటరీ కొట్టేసిన ఫీలింగ్. ‘నువ్వు - నేను’ హోల్డ్‌లో పెట్టి ‘ఫ్యామిలీ సర్కస్’ కంప్లీట్ చేస్తున్నాడు తేజ. వాళ్లేమో రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేసేశారు. హడావిడిగా ఆ వర్క్ పూర్తి చేసేశాడు. తీరా సినిమా రిజల్ట్ తేడా కొట్టేసింది. తేజ కూడా ‘సెకెండ్ ఫిల్మ్ సిండ్రోమ్’ని తప్పించుకోలేకపోయాడు. మొదటి సినిమాతో వచ్చిన క్రేజ్ తగ్గిపోలేదు కానీ, తేజలోనే ఏదో ఫీలింగ్. ఒక రకమైన కసి. ‘నువ్వు - నేను’ని బ్లాక్‌బస్టర్ చేయాలి. ఆ లక్ష్యంతోనే పనిచేస్తున్నాడు తేజ. హీరోయిన్ సెలెక్షన్. ముంబై నుంచి అమ్మాయిలొచ్చారు. ఒకమ్మాయి బాగుంది. కాన్ఫిడెంట్‌గా ఉంది. ఈ సినిమాకు తనే దిక్కు అని అర్థమైపోయి నట్టుంది. ఫోజు కొడుతోంది. ఫైవ్‌స్టార్ హోటల్లో రూమ్ కావాలి.... ఇంతమంది అసిస్టెంట్స్ ఉండాలి... ఫ్లైట్‌లో బిజినెస్ క్లాస్ టికెట్ కావాలి అంటూ డిమాండ్స్. తేజకు చిర్రెత్తుకొచ్చింది. మిగతా అమ్మాయిలందర్నీ చూపించి, ‘‘నీ దృష్టిలో వాళ్లల్లో లీస్ట్ ఎవరు?’’ అనడిగాడు. ఆమె ఆశ్చర్యపోతూ చాలా క్యాజువల్‌గా ఒకమ్మాయి వైపు వేలు చూపించింది. ‘‘నువ్వింక వెళ్లొచ్చు. నా సినిమాలో ఆ అమ్మాయే హీరోయిన్’’ అని తేజ చెప్పే సరికి, ఆమె షాకైపోయింది. అలా అనిత హీరోయిన్గా సెలెక్టయిపోయింది. హైదరాబాద్‌లోనే మ్యాగ్జిమమ్ షూటింగ్. ముంబై, వికారాబాద్ అడవుల్లో కొంత షూటింగ్ చేశారు. ఎమ్మెస్ నారాయణది కీ రోల్! ధర్మవరపు సుబ్ర హ్మణ్యంది చిన్న క్యారెక్టర్! కానీ రోజూ లొకేషన్కొచ్చి తేజతో కూర్చునేవాడు. ఇద్దరూ జోక్స్ చెప్పుకుంటుండేవారు. ఆయనలోని కామెడీ టింజ్కి తేజ ఫ్యాన్ అయిపోయాడు. అక్కడేమో ఎమ్మెస్ ఫుల్ బిజీ. కాల్షీట్లు కూడా టైట్. దాంతో, ఎమ్మెస్ క్యారెక్టర్ తగ్గించేసి, ధర్మవరపుది పెంచేశాడు. శోభన్‌బాబు రింగ్‌లా క్రాఫ్ సెట్ చేసి, ధర్మవరపు రోల్లో బాగా ఎంటర్టైన్మెంట్ చేర్చేశాడు. ‘తెలంగాణ’ శకుంతలది ఫుల్ నెగిటివ్ పాత్ర. ఆమె ఇంతకు ముందు అలాంటివి చేయలేదు. ఎంతవరకూ పండుతుందోనని తేజకే డౌట్. అందుకే ఆమెను పక్కన పెట్టేసి, ‘బెంగళూరు’ పద్మను పిలిపిం చాడు. ఆమెతో ఒకరోజు షూటింగ్ కూడా చేసేశాడు. ఇది తెలిసి తనికెళ్ల భరణి ఫీలైపోయారు. తేజతో ఆయనకు బాగా చనువు. ‘‘ఆమె సీనియర్ ఆర్టిస్ట్. పైగా డ్రామాల నుంచి వచ్చింది. ఇలా పక్కన పెట్టేయడం కరెక్ట్ కాదు’’ అని చెప్పారు భరణి. తేజ ఇంకేం మాట్లాడలేదు. తర్వాతి రోజు మళ్లీ ‘తెలంగాణ’ శకుంతల రంగంలోకి దిగారు. పరుచూరి రఘుబాబు నాటకోత్సవాల్లో సూటూ బూటూ వేసుకుని నటించిన వైజాగ్ ప్రసాద్‌ను హీరో తండ్రి పాత్రకి తీసుకున్నారు. చాలామంది ఇది రాంగ్ డెసిషన్ అన్నారు. తేజ వినలేదు. ఈ సినిమాలో 11 పాటలు. అన్ని అంటే చాలా కష్టం. తేజ మాత్రం అలాంటి లెక్కలు పెట్టుకోలేదు. పాటలు బాగుంటే.. కథలో ఇమిడిపోతే.. ప్రేక్షకుడు ఎన్నయినా పట్టించుకోడనేది తేజ సిద్ధాంతం. వెంకటేశ్ స్క్రిప్టు కోసం చేసిన రెండు పాటలూ ఇందులోకి షిఫ్ట్ చేశారు. ‘గాజువాక పిల్లా...’ యాజ్‌టీజ్. ‘తుమ్మెదా...’ పాటకు మాత్రం లిరిక్స్ మార్చేసి ‘ప్రియతమా... ఓ ప్రియతమా...’ అని సెట్ చేశారు. ‘గాజువాక పిల్లా’ అవుట్‌పుట్ సరిగ్గా రాలేదని మూడుసార్లు రీషూట్ చేశారు. ‘నా గుండెలో నీవుండి పోవా’ పాట పూర్తయిన రెండు నిమిషాల గ్యాప్కే ‘నాకు నువ్వు నీకు నేను’ అంటూ చిన్న సాంగ్ బిట్ పెట్టారు. ఇలా వెంట వెంటనే పాటలంటే ఓ రకంగా రిస్కే. కానీ తేజ మంచి ఫ్లోలో ఉన్నాడు. ట్రాక్ తప్పుతాడని అనిపించడం లేదు. వైజాగ్ ప్రసాద్ తన కొడుకుని, తన ప్రియురాలి కూతురుకిచ్చి పెళ్లి చేయాలనే ప్రపోజల్ సీన్‌కు ఆర్.పి., కులశేఖర్ బాగా అపోజ్ చేశారు. తేజ వినే మూడ్‌లో లేడు. కోటీ 63 లక్షలతో సినిమా రెడీ. ఎవ రికీ ఎలాంటి హోప్సూ లేవు. ఈ సినిమా హిట్టయితేనే తేజ ఉంటాడు. లేకపోతే అవుట్. అయినా తేజ టెన్షన్ పడలేదు. ఈ సినిమాతో మళ్లీ హిట్ సాధిస్తున్నానని మనస్సాక్షి ముందే చెప్పేసింది. ఫస్ట్‌డే మార్నింగ్ షోకే బ్లాక్ బస్టర్ టాక్. ఎక్కడ చూసినా యూత్. థియేటర్లన్నీ కాలేజీ క్యాంపసుల్లా మారిపోయిన ఫీలింగ్. ఇప్పుడు తేజ స్టార్ డెరైక్టర్... ఉదయ్ కిరణ్ స్టార్ హీరో... ధర్మవరపు స్టార్ కమెడియన్... ఆర్.పి.పట్నాయక్ స్టార్ మ్యూజిక్ డెరైక్టర్. సినిమా ఎంత హిట్టయ్యిందో, పాటలూ అంతకన్నా హిట్టయ్యాయి. ముఖ్యంగా ‘గాజువాక పిల్లా’ ఒక ఊపు ఊపేసింది. ‘నువ్వు యూత్ ఏంట్రా’, ‘మూసుకు కూర్చోరా పూలచొక్కా’, ‘మీ పెద్దోళ్లున్నారే’ లాంటి డైలాగులు బాగా పేలాయి. చాలా సాదా సీదా ప్రేమకథను టైట్ స్క్రీన్‌ప్లేతో, ఎమోషనల్ డెప్త్‌తో తేజ బాగా మేనేజ్ చేశాడు. మేజిక్ చేశాడు. 21 కోట్ల వరకూ కలెక్ట్ చేసిందీ సినిమా. మళ్లీ కాలేజీ సినిమాలు, లవ్స్టోరీల హవా మొదలైంది. తేజ కూడా ఇంకో లవ్‌స్టోరీ పనిలో ఉన్నాడు. ఓ కొత్తబ్బాయిని హీరోగా ఇంట్రడ్యూస్ చేసి ఘనవి‘జయం’ సాధించాలి. తేజ నిజంగా తలచుకుంటే ఏదైనా సాధించగలడు! * ఐదారు సీన్స్‌లో ఉదయ్‌కిరణ్ డబ్బింగ్ నచ్చక, మళ్లీ రీ-డబ్ చేయించా లనుకున్నారు. కానీ అతను ‘మనసంతా నువ్వే’ షూటింగ్లో బిజీ కావడంతో అలానే ఉంచేశారు. * క్లైమాక్స్‌లో వచ్చే ‘చినుకు చినుకు’ పాటను చివరి నిమిషంలో యాడ్ చేశారు. మిక్సింగ్ టైమ్‌లో తేజ అక్కడో పాట పెడితే బావుంటుందనుకున్నారు. అప్పటికప్పుడు కులశేఖర్తో పాట రాయించి పెట్టేశారు. * హిందీలో తుషార్ కపూర్‌తో ‘యే దిల్’ పేరుతో రీమేక్ చేశారు తేజ. -
హీరో అవ్వాలంటే నేనున్నా...
విజయవాడ : కామన్ మ్యానే నా సినిమాలో హీరో. తాత.. తండ్రులు... వారి పిల్లలు ఇలా ఎవరికి వారి కుటుంబాలకు చెందిన వారే హీరోలుగా వస్తే సామాన్యుడికి అవకాశం ఎలా వస్తుంది. అందుకే నేను అంతా కొత్త వారికి అవకాశాలు ఇచ్చి వారితో సినిమాలు చేస్తున్నా.. ఇకపై చేస్తానని సినీ దర్శకుడు తేజ అన్నారు. ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న కనకదుర్గమ్మను తేజ దర్శించుక ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా తేజకు ఆలయ అధికారులు అమ్మవారి ప్రసాదాలను అందజేశారు. అనంతరం వీఐపీ ల్యాంజ్లో మీడియాతో ముచ్చటించారు. తేజతో ముచ్చట్లు మీ కోసం.. ప్రశ్న : హోరా హోరీ ఏలా ఉండబోతుంది..? జవాబు : సినిమా అంతా కొత్త వారితో చేశాం. మీ విజయవాడ నుంచి ఓ కొత్త కుర్రాడు చైతన్యను విలన్‌గా ఈ సినిమా ద్వారా పరిచయం చేస్తున్నా. అంతేకాదు చైతన్య ఈ సినిమా కృష్ణాజిల్లాకు డిస్టిబ్యూటర్ కూడా. ప్రశ్న : తేజ సినిమా వచ్చి చాలా కాలం అయినట్లు ఉందీ..? జ : డబ్బులు కోసం సినిమాలు చేయడం తేజకు ఇష్టం ఉండదు. మూడ్ వచ్చినప్పుడే మంచి సినిమాను చేయాలనే భావన కలుగుతుంది. సంతృప్తిగా ఉంటే సినిమా చేస్తా. ప్రశ్న : సినిమా గురించి...? జ : హోరాహోరీ సినిమా దాదాపు 80 శాతం వర్షంలోనే షూటింగ్ చేసుకుంది. హీరోగా దిలీప్, హీరోయిన్గా దక్షలను పరిచయం చేస్తున్నాం. ఇక ప్రపంచంలోనే అత్యధిక వర్షపాతం ఉన్న కర్ణాటకలోని ఆగుంబే అనే ఊరిలోనే చిత్రీకరించాం. ఇక మ్యూజిక్‌ను కోడూరు కళ్యాణ్ చాలా బాగా చేశారు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగా వచ్చింది. సినిమా ప్రేక్షకులకు తప్పక నచ్చుతుందని అనుకుంటున్నాం. ప్రశ్న : మీ తదుపరి సినిమా...? జ : అడ్వాన్స్ సైన్స్‌తో భవిష్యత్తు ఎలా ఉంటుందనే దానిపై సినిమా చేస్తున్నాం. మైండ్‌తో మెటల్‌ను ఏ విధంగా కంట్రోల్ చేయవచ్చుననేది ఈ చిత్ర కథాంశం. ఈ సినిమాలోనూ అంతా కొత్త వారే. ప్రశ్న : అంతా కొత్త వారికే ప్రాధాన్యత ఇస్తారెందుకు...? జ : తాత హీరో, మనవడు హీరో.. ఇలా అయితే కామన్ మేన్ ఎప్పుడు హీరో అవుతాడు. హీరో అవ్వాలంటే నేనున్నా. మామూలు మనుషులను కూడా హీరోలను చేస్తా. టాలెంట్ ఉన్న వారికి ఛాన్స్ ఇవ్వాలి. నా ద్వారా ఇప్పటి వరకు వెయ్యి మందిని పరిశ్రమకు పరిచయం చేశా. ప్రస్తుతం ఏ చిత్రం చేసినా నేను పరిచయం చేసిన వారు ఉన్నారు. జబర్దస్త్ వంటి కార్యక్రమాల్లోనూ ఉన్నారు. ప్రశ్న : బాహుబలి వంటి సినిమాను ఎప్పుడు చేస్తారు...? జ : బాహుబలి లాంటి సినిమాలు చేయాలంటే చాలా బడ్జెట్ కావాలి. బడ్జెట్ కావాలంటే 7, 8 హిట్స్ కావాలి. నాకు హిట్లు లేవు కదా.. హిట్ వచ్చాక చేస్తా. బాహుబలి రాజుల కాలం పౌరాణిక తరహా ఉంటే నా రాబోయే సినిమాలో అడ్వాన్స్ కథ ఉంటుంది. 2096వ సంవత్సరానికి వెళ్లి ప్రస్తుత కాలం నాటికి వస్తుంది. ప్రశ్న : రాజధాని ప్రాంతంలో సినిమా పరిశ్రమ..? జ : ప్రభుత్వం ఇచ్చే రాయితీలపై ఉంటుంది. హైదరాబాద్‌లో సినీ పరిశ్రమ నాగేశ్వరరావుతో వచ్చి బాగా నిలదొక్కుకుంది. శివ సినిమాతో అక్కడ నుంచి హైదరాబాద్‌లో సినీ రంగం నిలదొక్కుకుంది. అలాగే విజయవాడలో సినిమా షూటింగ్‌లకు అన్ని సదుపాయాలు కల్పిస్తామని అధికారులు, ప్రభుత్వం చెబుతుంది. త్వరలోనే ఇక్కడ పరిశ్రమ నిలదొక్కుకునే అవకాశాలు ఉన్నాయి. -
దుర్గమ్మ గుడిలో తేజ ప్రత్యేక పూజలు
విజయవాడ : తాను తీసే సినిమాలలో సామాన్యుడే హీరో అని టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు తేజ తెలిపారు. తన సినిమాల్లోకి జనాల్లో నుంచే హీరోని తీసుకుంటానన్నారు. అంతకుముందు శుక్రవారం విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై శ్రీదుర్గమల్లేశ్వర స్వామి వారి దేవాలయంలోని కనక దుర్గమ్మని ఆయన దర్శించుకున్నారు. అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ తర్వాత ఆయనకు ఆలయ పూజార్లు తీర్థ ప్రసాదాలు అందజేశారు. తేజ దర్శకత్వంలో వచ్చిన పలు టాలీవుడ్ చిత్రాలు సూపర్ డూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. కానీ ఆయన దర్శకత్వంలో వచ్చిన నీకు నాకు మధ్య డాష్ డాష్ చిత్రం ప్లాప్ అయిన విషయం విదితమే. ఆ తర్వాత ఆయన దర్శకత్వంలో చాలా రోజుల తర్వాత హోరాహోరీ చిత్రం తెరకెక్కింది. ఈ చిత్రం నేడు విడుదల అయింది. -
తేజతో హోరాహోరీ నిజమే!
‘‘తేజ వర్కింగ్ స్టైల్ ఇబ్బంది అని పించింది. మా ఇద్దరి మధ్య మనస్పర్థలొచ్చిన మాట నిజమే. కానీ, టెక్నీషియన్స్‌తో ఎలా పని చేయించు కోవాలో తెలిసినవాడు. అవన్నీ గుర్తొ చ్చినప్పుడు తనతో మళ్లీ ఇంకో సినిమా చేయాలనిపిస్తుంది. కానీ, గొడవలు తలుచుకుంటే మాత్రం వద్దు అనిపిస్తుంది’’ అని సంగీత దర్శకుడు కల్యాణి కోడూరి చెప్పారు. దిలీప్, దక్ష జంటగా శ్రీరంజిత్ మూవీస్ పతాకంపై తేజ దర్శకత్వంలో కె.ఎల్. దామోదర ప్రసాద్ నిర్మించిన ‘హోరాహోరీ’కి ఆయన పాటలు స్వరపరిచారు. త్వరలో విడుదల కానున్న ఈ చిత్రం గురించి కళ్యాణి కోడూరి విలేకరులతో మాట్లా డుతూ - ‘‘ఇందులో పాటలు కొత్తగా ఉంటాయి. నాకు తెలిసినవారు, తెలియని వారు అందరూ ఫోన్ చేసి అభినందించారు. నేను మా అన్నయ్య కీరవాణి సినిమాకు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌కు సహకరిస్తానని అంటూ ఉంటారు. కానీ అది బ్యాడ్ గాసిప్. కేవలం సౌండ్ సూపర్విజన్ చేస్తూ ఉంటా. నేను నేపథ్యసంగీతం ఇచ్చేంత దౌర్భాగ్యం అన్నయ్య కీరవాణికి పట్టలేదని నా ఫీలింగ్’’ అన్నారు. -
సరికొత్త తేజం హోరాహోరీ
కొత్తవాళ్లతో ప్రేమకథ తీసి బాక్సాఫీస్‌ను గెలవడం తేజకు వెన్నతో పెట్టిన విద్య. అదే పంథాలో ఆయన చేసిన తాజా ప్రయత్నం - ‘హోరా హోరీ’. దిలీప్, దక్ష హీరో హీరోయిన్లుగా పరిచయమవుతున్నారు. కేఎల్ దామోదరప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం సెప్టెంబర్ 11న విడుదల కానుంది. కథ విని ఇంప్రెస్ అయిన అగ్రనిర్మాత డి. సురేశ్‌బాబు ఆఖరి నిమిషంలో ఈ చిత్రంలో భాగస్వామిగా చేరడం విశేషం. ఊహించని మలుపులతో కూడిన కథాకథనం, ఆసక్తిదాయకమైన చిత్రీకరణతో ‘హోరాహోరీ’ నవతరం సినిమాకు సరికొత్త నిర్వచనం చెబుతుందని తేజ నమ్మకంగా చెబుతున్నారు. ఉదయ్‌కిరణ్, నితిన్, నవదీప్, సదా తదితరులతో పాటు ఎందరో కొత్త తారలకు జీవితాన్నిచ్చిన తేజ ఈ సినిమాతో కొత్త హీరో దిలీప్‌కు బ్రేక్నివ్వనున్నారు. ఈ సినిమాతో తేజ పూర్వవైభవం సాధించడం ఖాయమనే భావన పరిశ్రమలో నెలకొంది. తేజ కూడా ఈ సినిమా విషయంలో కాన్ఫిడెంట్‌గా కనిపిస్తున్నారు. -
ఓ అరుదైన రికార్డ్!
ఒక భాషలో ఒకేసారి ఒక సినిమా తీయడమే కష్టం. అలాంటిది ఏకంగా నాలుగు భాషల్లో తీయడం అంటే మాటలు కాదు. కానీ, పక్కా ప్రణాళిక ఉంటే తీయొచ్చని ‘రెడ్ అలర్ట్’ బృందం నిరూపించింది. హెచ్.హెచ్. మహదేవ్, రవి, అమర్, తేజ, అంజనా మీనన్ ముఖ్య తారలుగా చంద్రమహేశ్ దర్శకత్వంలో పీవీ శ్రీరామ్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఏకకాలంలో రూపొందిన తొలి సినిమాగా ‘ఇండియన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’ గుర్తించింది. చిత్రదర్శకుడు చంద్రమహేశ్ను అభినందిస్తూ, ఇండియన్ వరల్డ్ రికార్డుకు సంబంధించిన సర్టిఫికెట్‌ను అందజేసింది. చంద్రమహేశ్ మాట్లాడుతూ - ‘‘ఎన్నో వ్యయప్రయాసల కోర్చి ఈ చిత్రం చేశాం. ఈ రికార్డ్ ద్వారా మా కష్టానికి తగ్గ ప్రతిఫలం లభించింది. ఇప్పటికే కన్నడ వెర్షన్‌ను విడుదల చేశాం. అక్కడ సూపర్ హిట్ కావడం మరో ఆనందం. అలాగే, మలయాళ చిత్రం కూడా మంచి టాక్‌తో ముందుకెళుతోంది. తమిళ వెర్షన్‌ను దసరాకు విడుదల చేయాలనుకుంటున్నాం. తెలుగు వెర్షన్ పాటలను ఈ నెలాఖరున, చిత్రాన్ని వచ్చే నెలలో విడుదల చేయాలనుకుంటున్నాం’’ అని చెప్పారు. ఈ చిత్రానికి సహనిర్మాత: శ్రీమతి శ్రీరామ్ పిన్నింటి సత్యరెడ్డి, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: కె. జైపాల్‌రెడ్డి. -
నాపై అలాంటి స్టాంప్ వేసేశారు - తేజ
‘‘తేజ సినిమా చేయడం మొదలుపెడితే హోరాహోరీగా పోరాడతాడు. అతను పరిచయం చేసే హీరో హీరోయిన్లు, ఆర్టిస్టులు కూడా అంతే హోరాహోరీగా ఉంటారు. ఈ సినిమాతో పరిచయమవుతున్న దిలీప్ గొప్పగా ఎదుగుతాడని పిస్తోంది’’ అని సీనియర్ దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి అన్నారు. దిలీప్, దక్ష జంటగా తేజ దర్శకత్వంలో శ్రీరంజిత్ మూవీస్ పతాకంపై కె.ఎల్. దామోదర ప్రసాద్ నిర్మిస్తున్న ‘హోరాహోరీ’ చిత్రం పాటల వేడుక బుధవారం రాత్రి హైదరాబాద్‌లో జరిగింది. కల్యాణి కోడూరి స్వరాలందించిన ఈ సినిమా పాటల సీడీని హీరో సుమంత్ అశ్విన్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా దర్శకుడు గుణశేఖర్ మాట్లా డుతూ - ‘‘తేజ ఎప్పుడు ఏ సినిమా డెరైక్ట్ చేసినా పరిశ్రమలోకి కొత్త నీరు వస్తుంది. తేజకు స్టార్స్ అవసరం లేదు. నేను, తేజ రెండేళ్లు రూమ్మేట్స్గా ఉన్నాం. తనెప్పుడూ నాకు వండర్గానే అనిపిస్తాడు’’ అని చెప్పారు. ఛాయాగ్రాహకుడు ఛోటా కె. నాయుడు మాట్లాడుతూ, ‘‘తేజ తెలివితేటల్లో యాభై శాతం నాకు ఉంటే వంద సినిమాలు డెరైక్ట్ చేసేవాణ్ణి. తేజ ఒక అద్భుతం. నిర్మాత దాము నాకు ఆత్మబంధువు’’ అని చెప్పారు. ఈ సినిమా ప్రచార చిత్రం చూస్తుంటే ‘జయం’ గుర్తుకొస్తుందని దర్శకుడు వీవీ వినాయక్ పేర్కొన్నారు. తేజ మాట్లాడుతూ, ‘‘నేను ఏ సినిమా తీసినా అందరూ ‘జయం’తో పోలుస్తున్నారు. నేను వేరే తరహా సినిమాలు చేసినా తేజ లవ్‌స్టోరీలే తీస్తాడనే స్టాంప్ వేసేశారు. గత పదేళ్లుగా కాస్త సెలైంట్‌గా ఉన్న నేను మళ్లీ అగ్రెసివ్‌గా మారాను. ఈ సినిమాలో కూడా నా అగ్రెసివ్నెస్ కనిపిస్తుంది. లైట్లు, మేకప్ లేకుండా ఈ సినిమా చేశాం. కల్యాణి కోడూరి సూపర్ హిట్ సాంగ్స్ ఇచ్చాడు’’ అని చెప్పారు. దామోదరప్రసాద్ మాట్లాడుతూ - ‘‘కర్ణాటకలో 53 రోజులు షూటింగ్ చేశాం. మా నాన్నగారి స్ఫూర్తితో నా కుటుంబ సభ్యులు, స్నేహితుల అండతో నిర్మాతగా ఎదుగుతున్నాను’’ అని తెలిపారు. తొలి చిత్రాన్నే ఓ టాప్ డెరైక్టర్‌తో చేస్తున్నందుకు హీరో దిలీప్ సంతోషం వెలిబుచ్చారు. ఈ వేడుకలో అచ్చిరెడ్డి, ‘జెమినీ’ కిరణ్, బసిరెడ్డి, ఇంద్రగంటి మోహనకృష్ణ, గోపీచంద్ మలినేని, జీవిత, భీమనేని, నాగశౌర్య, ఆర్పీ పట్నాయక్, ప్రతాని రామకృష్ణ గౌడ్, పెద్దాడ మూర్తి తదితరులు పాల్గొన్నారు. -
ఇంకుడు గుంతలో పడి ఇద్దరి చిన్నారులు మృతి
విజయనగరం: ఇంకుడు గుంతలో పడి ఇద్దరి చిన్నారులు మృతి చెందిన సంఘటన దెంకాడ మండలం సింగవరం గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. ఇంకుడు గుంతలో పడి విమల(6), తేజ(6) అనే ఇద్దరు చిన్నారులు మృతిచెందారు. ఇటీవల ఏపీ ప్రభుత్వం 'నీరు-చెట్టు' కార్యక్రమంలో భాగంగా గ్రామాల్లో ఇంకుడు గుంతలు తవ్వించింది. అరదులో భాగంగా గ్రామంలోని పాఠశాల ఆవరణలో సుమారు 10 అడుగుల లోతు గుంత తవ్వించారు. ఇటీవల వర్షాలకు గుంత నిండా నీళ్లు చేరాయి. ఆడుకోవటానికి వెళ్లిన చిన్నారులు కనిపించక పోయేసరికి తల్లిదండ్రులు వెతకటం ప్రారంభించారు. చిన్నారులు ఇంకుడు గుంతలో విగతజీవులై ఉండటం గమనించి తల్లిదండ్రులు దిగ్భాంతికి గురయ్యారు. (దెంకాడ) -
బస్సు కిందపడి ఎనిమిదేళ్ల బాలుడి మృతి
పటాన్చెరు : ప్రైవేటు బస్సు కింద పడి ఓ చిన్నారి మృతి చెందింది. ఈ సంఘటన మండలంలోని ఇస్నాపూర్ తేజ కాలనీలో శనివారం చోటు చేసుకుంది. వివరాలిలా.. కందుకూరు సమీపంలో చీమలపేటలో నివాసముంటున్న ఆదం, తల్లి మరియమ్మ దంపతల కుమారుడు నాని (8)కి సెలవులు కావడంతో ఇస్నాపూర్ తేజ కాలనీలో ఉంటున్న మేనత్త లక్ష్మమ్మ ఇంటికి వచ్చింది. ఇదిలా ఉండగా.. ఓ పరిశ్రమకు చెందిన బస్సులను కాలనీలోని ఖాళీ స్థలం వద్ద పార్కింగ్ చేస్తారు. అయితే వీరు బస్సులను పరిశ్రమకు తీసుకె ళ్లే ముందు కాలనీకి చెందిన పిల్లలను సరదాగా ఓ రౌండ్ తిప్పుతారు. అందులో భాగంగా శనివారం కూడా పిల్లలు తమను బస్సులో తిప్పాలని కోరారు. అయితే డ్రైవర్ ఇందుకు నిరాకరిస్తూ బస్సును ముందు తీశాడు. ఈ క్రమంలో నాని బస్సును అదుపు తప్పి కిందకు పడ్డాడు. దీనిని గమనించని డ్రైవర్ అలాగే వెళ్లడంతో నాని బస్సు వెనుక చక్రం కింద పడి అక్కడికక్కడే మృతి చెందాడు. దీం తో కాలనీలో విషాదం నెలకొంది. ఈ మేరకు కేసును దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
కొత్త యాక్టర్స్‌ను కొడతాడన్నా, కొట్టడన్నా...
కొత్త నటీనటుల్ని వెండితెరకు పరిచయం చేయాలంటే చాలా గట్స్ ఉండాలి. అలాంటి పవరున్న అతికొద్దిమంది దర్శకుల్లో తేజ ఒకరు. ఆయన వెన్నుతడితే చాలు ఎలాంటివారైనా స్టార్ కావల్సిందే. దర్శకత్వ శాఖలోనే కాదు మల్టీ టాలెంటెడ్ పర్సెన్‌గా పేరుతెచ్చుకున్న తేజ తాజాగా అందరూ కొత్త నటీనటులతో ‘హోరాహోరీ’ అనే చిత్రం తెరకెక్కిస్తున్నారు. ఆ సినిమా షూటింగ్లో భాగంగా విశాఖపట్నం వచ్చిన ఆయనతో చిట్‌చాట్.... నాకు సినిమాలు అంటే చాలా ఇష్టం. ఆ ఇష్టంతోనే రాంగోపాల్ వర్మ దగ్గర శివ సినిమా అసిస్టెంట్ డెరైక్టర్‌గా చేరాను. ఆ సినిమాకు వాళ్లు చేసిన పోస్టర్స్ నాకు నచ్చలేదు. అందుకే పబ్లిసిటీ డిజైనర్ దగ్గర కూర్చుని ఇలా కావాలి, అలా కావాలి అని చెప్పి డిజైన్ చెప్పి చేయించుకున్నాను. అవే అందరికీ నచ్చి ఆ డిజైన్స్ మార్కెట్లోకి వచ్చాయి. శివ, క్షణక్షణం, శివ (హిందీ) మూడింటికి డిజైనర్, అసిస్టెంట్ డెరైక్టర్, స్టోరీ,స్క్రీన్‌ప్లేలలో వర్క్ చేశాను. తర్వాత వర్మ డైరక్షన్లో వచ్చిన రాత్రి, అంతం, మనీ సినిమాలకు సినిమాటోగ్రఫర్‌గా చేశాను. అంతకు ముందు నాకు అసిస్టెంట్ సినిమాటోగ్రాఫర్‌గా ఎక్స్పీరియన్స్ ఉంది. ఆ యాటిట్యూడ్ బావుంటుంది నేను సినిమాటోగ్రఫర్‌గా ఉన్నప్పుడు ‘తేరా మేరే సప్నే’ అనే ఒక హిందీ సినిమా చేశాను. ఆ సినిమా షూటింగ్లో భాగంగా ఫస్ట్ టైం విశాఖపట్నం వచ్చాను. చాలా బాగా అనిపించింది విశాఖపట్నం. బేసిక్‌గా వైజాగ్ వాళ్లకు సెన్సాఫ్ హ్యూమర్ ఎక్కువ. ఏం చెప్పినా సరే తమాషాగా తీసుకుంటారు. అంత త్వరగా సీరియస్ అవ్వరు. అన్నింటికి నవ్వుతారు. మన మీద జోక్స్ వేస్తారు. మనం ఏం అన్నా సరే జోక్‌గానే తీసుకుంటారు. ఆ యాటిట్యూడ్ చాలా బావుంటుంది. వైజాగ్‌లో ఉన్న నా థియేటర్ చాలా బాగా నచ్చిన ప్లేస్. సినిమా వాళ్లకు థియేటర్లే గుడి. అందులో ఆడియన్స్ దేవుళ్లు. లొకేషన్స్ చాలా బాగుంటాయి వైజాగ్‌లో షూటింగ్ చేసేందుకు మంచి లొకేషన్స్ ఉన్నాయి. అందుకే నేను తీసిన సినిమాలో మొత్తం విశాఖ ఉన్న ప్రధాన ఏరియాలను టచ్ చేస్తూ పాట ఒకటి చేశాను. ప్రస్తుతం 1904లో కట్టిన వైజాగ్‌పట్నం క్లబ్లో షూట్ చేస్తున్నాం. ఇలాంటివి ఇంకా చాలా ఉన్నాయి ఇక్కడ. ఈ లొకేషన్లో ఒక్క రోజు షూట్ అనుకుని వచ్చాను. కానీ లొకేషన్ నచ్చి ఇంకో రోజు ఎక్స్టెండ్ చేశాను. విశాఖపట్నం వారికి కళాభిమానం, కళాపోషణ ఎక్కువ. అలాగే ఎంతోమంది కళాకారులు కూడా ఇటువైపు నుంచి వచ్చిన వారే. సినిమాలే ముఖ్యం షూటింగ్ లేని సమయంలో ఇంట్లోనే ఉండాల్సి వస్తే సినిమాలు ఎక్కువగా చూస్తాను. కథలు రాసుకుంటాను. టీవీ మాత్రం అసలు చూడను. నా మీద టీవీలో ఎలాంటి న్యూస్ వచ్చినా సరే పట్టించుకోను. ఎలాంటి రియాక్షన్ ఉండదు. కొత్త యాక్టర్స్‌ను కొడతాడన్నా, కొట్టడన్నా నేనేం పట్టించుకోను. నేను కొన్ని కారణాల వలన మాకు తెలిసిన వాళ్ల ఇంట్లో ఉండాల్సి వచ్చింది. అప్పుడు వంట నేర్చుకోవలసి వచ్చింది. సో ఇంట్లో అప్పుడప్పుడు వంట చేస్తుంటాను. కానీ నాకు ఫుడ్ మీద పెద్దగా ఇంట్రస్ట్ లేదు. ఏది ఉంటే అదే తింటాను. నాకు నా ఫ్యామిలీ కన్నా సినిమానే ముఖ్యం. మా పిల్లలు ఏం చదువుతున్నారో కూడా నాకు తెలియదు. అన్నీ నా వైఫ్ శ్రీవల్లి చూసుకుంటుంది. ప్రయోగాలు చేస్తా నేను సినిమాలలో ప్రయోగాలు ఎక్కువ చేస్తుంటాను. అందుకే కొత్తవాళ్లతోనే చేస్తాను. వాళ్లు అయితే నేను చెప్పినట్టు చేస్తారు. స్టార్ హీరోలు అయితే ఇలాంటి స్టోరీలు చేయడం కష్టం. రిస్క్ నేను ఫేస్ చేస్తాను గానీ స్టార్స్ ఫేస్ చేయడానికి ఇష్టపడరు. అందరూ కొత్తవాళ్లతోనే తీసే నేను మహేష్‌బాబుతో ‘నిజం’ చేశాను. అతను ఒక స్టార్ హీరోగా కాకుండా డెరైక్టర్ ఏం చెబితే అదే చేస్తారు. కొత్త వాళ్లతో చేయడం అలవాటైపోయింది. ఫస్ట్ టేక్ ఎప్పుడూ ఓకే అయ్యేది కాదు. ఓ పది టేకులు వరకు చేసేవాడిని. కానీ మహేష్‌బాబు చేస్తుంటే సింగిల్ టేక్‌లో ఓకే అయిపోయేది. త్వరలో ఒక సైన్స్ ఫిక్షన్ ఫిల్మ్ చే స్తాను. -
మృత్యువులోనూ..వీడని ‘చిన్నారి స్నేహం’
విజయనగరం క్రైం: ఆ ఇద్దరు చిన్నారులు వరుసకు బావాబావమరుదులు. కలిసి ఆడుకోవడం, కలిసి పాఠశాలకు వెళ్లడం చేసేవారు. ఎక్కడికి వెళ్లినా ఒకరిని విడిచి ఒకరు ఉండేవారు కాదు. ఆ చిన్నారి స్నేహాన్ని చూసిన విధికి కన్నుకుట్టిందేమో? కోనేరు రూపంలో వాళ్లిద్దరినీ మృత్యుఒడిలోకి లాగేసింది. ఆ చిన్నారులిద్దరూ బంధువులు కూడా కావడంతో ఆ రెండు కుటుంబాల్లో అంతులేని విషాదం అలముకుంది. నిన్నటికి నిన్న మండలంలోని గుంకలాం గ్రామంలో చెరువులో పడి ముగ్గురు మహిళలు మృతిచెందిన సంఘటన నుంచి ఇంకా తేరుకోక ముందే తాజాగా ఆదివారం ఈ మరో హృదయ విదారక సంఘటన జరిగింది. సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. విజయనగరం పట్టణంలోని కె.ఎల్.పురం కొండపేట చందకవీధిలో చందక శ్రీను కుటుంబ సభ్యులు నివాసం ఉంటున్నారు. చందకశ్రీనుకు భార్య రామయ్య మ్మ, కుమారులు దిలీప్, తేజ (10)లు ఉన్నారు. కె.ఎల్.పురం కొండపేటలో మండల మారునాయుడు కుటుంబ సభ్యులు నివాసం ఉంటున్నారు. మారునాయుడుకు భార్య రమణమ్మ, సతీష్ (14), చెల్లెలు హరిత ఉన్నారు. ఆదివారం మధ్యాహ్నం మండల కోనేరు సమీపంలో గేదెలు కాస్తున్న రైతు శ్రీనుకు మధ్యాహ్న భోజనం అందించేందుకు తేజ, సతీష్‌లతో పాటు కార్తీక్ అనే మరో విద్యార్థి కలిసి రెండు సైకిళ్లపై వెళ్లారు. శ్రీనుకు భోజనం అందించి వీరు రెండు సైకిళ్లను ఒక దగ్గర స్టాండ్ వేసి మండల కోనేరు మదుం వద్దకు చేరుకున్నారు. వారిద్దరూ మదుంపైనుంచి నీటిలోకి దూకినట్లుగా తెలుస్తోంది. దూకే సమయంలో ఎక్కువ లోతు ఉన్న ప్రాంతానికి ఇద్దరూ వెళ్లడంతో నీటిలో కొట్టుకుంటున్నారు. ఆ సమయంలో స్నానానికి దిగిన కార్తీక్ కూడా మునిగిపోతుండగా కేకలు వేయడంతో సమీపంలో గేదెలు కాస్తున్న శ్రీను వెంటనే వచ్చి కార్తీక్‌కు కాపాడి ఒడ్డుకు చేర్చాడు. రైతు శ్రీను తక్షణమే స్థానికులకు సమాచారం అందించగా వారు పట్టణ అగ్నిమాపక కార్యాలయం సిబ్బందికి, వన్‌టౌన్ పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సమాచారం మేరకు అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి వచ్చి చెరువులో ఉన్న తేజ మృతదేహాన్ని బయటకు తీశారు. విషయం తెలుసుకున్న వన్‌టౌన్ సీఐ కె.రామారావు, ఎస్సై బి.రమణయ్య సంఘటనాస్థలానికి చేరుకుని మృతికి గల కారణాలను తెలుసుకున్నారు. మృ త దే హాలను జిల్లా కేంద్రాస్పత్రికి తరలించారు. తేజ 6వ తరగతి చదువుతుండగా, సతీష్ ఏడో తరగతి చదువుతున్నాడు. తేజ తండ్రి శ్రీను జూట్ మిల్లు కార్మికుడు కాగా, సతీష్ తండ్రి పాల వ్యాపారం చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. మిన్నంటిన రోదనలు.. ఆ చిన్నారుల తల్లిదండ్రుల రోదనలతో సంఘటనా స్థలం మార్మోగింది. ఎప్పుడూ భోజనాలు పట్టుకుని వెళ్లేవాడని కాదని, మృత్యువు కోసమే కోనేరు వద్దకు వెళ్లాడని తేజ తండ్రి భోరున విలపించాడు. సోమవారం నుంచి పాఠశాల ప్రారంభమవుతున్నట్లు సెల్ఫోన్లో మెసేజ్ కూడా వచ్చిందని.. పాఠశాల సెలవుకాకపోతే బతికేవాడని రోదించాడు. పిల్లాడిని ప్రాణంలా పెంచుకుంటున్నామని ఇంతలోనే కోనేరు మృత్యువు రూపంలో మింగేసిందని సతీష్ తల్లి రమణమ్మ గుండెలవిసేలా విలపించింది. బాధితులను పరామర్శించిన నాయకులు కోనేరులోపడి ఇద్దరు విద్యార్థులు మృతి చెందారన్న విషయం తెలుసుకున్న కౌన్సిలర్లు మైలపల్లి పైడిరాజు, కోండ్రు శ్రీనివాసరావు సంఘటన స్థలానికి చేరుకుని కుటుంబ సభ్యులను పరామర్శించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు టి.వై.దాసు, తాళ్లపూడి శ్రీను కేంద్రాస్పత్రికి వచ్చి మృతుల తల్లిదండ్రులను పరామర్శించారు. -
‘అమ్మానాన్న ఊరెళితే’ స్టిల్స్
-
యువతే లక్ష్యంగా...
సిద్దార్థ్‌వర్మ, విజయ్, మధు, తేజ, సాయిభవానీరాజు, మహి, శిల్పశ్వి ప్రధాన పాత్రధారులుగా, రూపొందిన చిత్రం ‘అమ్మానాన్న ఊరెళితే’. ‘7/జి బృందావన కాలనీ’ ఫేం సోనియా అగర్వాల్ ప్రత్యేక పాత్ర పోషించిన ఈ చిత్రానికి అంజి శ్రీను దర్శకుడు. వీరవెంకట దుర్గాప్రసాద్ అనగాని, నాగమణి అనగాని నిర్మాతలు. ఈ చిత్రం విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దర్శకుడు మాట్లాడుతూ- ‘‘యువతను లక్ష్యంగా చేసుకొని కుటుంబ ప్రేక్షకులు మెచ్చే కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. పనిచేసిన అందరూ చక్కగా సహకరించారు. వచ్చే నెల రెండోవారంలో కానీ, మూడో వారంలో కానీ సినిమాను విడుదల చేస్తాం’’ అని తెలిపారు. యువతకు కావాల్సిన సందేశంతో ఈ చిత్రం రూపొందిందని సహ నిర్మాత సత్యనారాయణ అన్నారు. ఇంకా యూనిట్ సభ్యులు మాట్లాడారు. -
టాలీవుడ్ దర్శకుడికి కమల్ గ్రీన్‌సిగ్నల్
సినిమాను కొత్తపుంతలు తొక్కించిన నటుడు కమలహాసన్. పద్మశ్రీ, పద్మభూషణ్ వంటి అవార్డులకే అలంకారంగా మారిన ఈ కళాపిపాసి కొత్తవారిని ప్రోత్సహిచడంలో ముందుంటారు. ప్రతిభను గుర్తించడంలో ఆయనకు ఆయనే సాటి. ఈ విషయంలో తనపర భేదమే చూపరు. అలాంటి విశ్వనాయకుడు తాజాగా టాలీవుడ్ దర్శకుడి చిత్రంలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారన్నది తాజా సమాచారం. ఆ దర్శకుడెవరో కాదు చిన్న చిత్రాలతో పెద్ద విజయాలు సాధించిన తేజ. వీరిద్దరి కలయికలో ఒక మాస్ ఎంటర్టైనర్ చిత్రం తెరకెక్కనుందనే ప్రచారం జరుగుతోంది. తేజ ఇంతకు ముందు సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో చిత్రం చెయ్యాలని ప్రయత్నించారు. ఆయన కోసం మంచి కథను కూడా సిద్ధం చేశారు. కారణమేమైన ఆ చిత్రం సెట్‌పైకి రాలేదు. కానీ ఇప్పుడు సకల కళావల్లభుడు కమలహాసన్‌తో చిత్రం ఖాయం అయినట్లు సమాచారం. ఈ చిత్రం డిసెంబర్ లో ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ఎన్నో రకాల పాత్రలకు జీవం పోసిన కమల్‌హాసన్ కోసం తాను కొత్తగా పాత్ర క్రియేట్ చేసే స్థాయిలో లేనని అందుకనే ఆయన మైండ్‌లో ఉన్న కథల్లో కొన్నింటి గురించి కమల్‌హాసన్‌తో చర్చించి ఒక కథను ఎంపిక చేసినట్లు దర్శకుడు తేజ వెల్లడించారు. ఇది ఆయన ఇంతకుముందు నటించిన నాయకన్, ఒరు ఖైదీ ఇన్ డైరీ చిత్రాల తరహాలో పలు ఆసక్తి కరమైన అంశాలతో కూడిన యాక్షన్ కథా చిత్రంగా ఉంటుందని తెలిపారు. ఈ చిత్రానికి కమల్‌హాసన్ స్క్రీన్‌ప్లే సిద్ధం చేస్త్తున్నారని తాను సంభాషణలు రాస్తున్నానని తేజ తెలిపినట్లు ఆంగ్ల పత్రికలో వార్తలు వెలువడుతున్నాయి. -
వర్షంలో హోరాహోరీ
తెలుగుతెరపై దర్శకునిగా తేజది ఓ ప్రత్యేకమైన సంతకం. కొత్త ప్రతిభను తెరకు పరిచయం చేయడంలోనూ తేజ ఎప్పుడూ ముందుంటారు. ఆయన పరిచయం చేసిన తారల గురించి చెప్పాలంటే... పెద్ద లిస్టే అవుతుంది. ప్రస్తుతం మరో యంగ్ టాలెంట్‌ని తెరకు పరిచయం చేసే పనుల్లో బిజీగా ఉన్నారు తేజ. ‘హోరా హోరీ’ పేరుతో ఓ చిత్రాన్ని ఆయన స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా దిలీప్ అనే యువ నటుణ్ణి హీరోగా పరిచయం చేయనున్నారు. విశేషం ఏంటంటే.. కథ రీత్యా ఈ చిత్రం ఆసాంతం వర్షంలోనే ఉంటుంది. అందుకే సన్నివేశాలు సహజంగా ఉండటం కోసం వర్షాకాలంలో ఈ సినిమా షూటింగ్ చేయనున్నారు. -
తేజ దర్శకత్వంలో కమల్‌హాసన్ త్రిభాషా చిత్రం?
కమల్‌హాసన్‌కి కథ చెప్పి ఒప్పించడం అంత సులభసాధ్యం కాదంటారు. కానీ మన తెలుగు దర్శకుడు తేజ చెప్పిన కథకు సింగిల్ సిట్టింగ్‌లోనే కమల్ ఓకే చెప్పేశారట. తేజ దర్శకత్వంలో మూడు భాషల్లో సినిమా చేయడానికి ఆయన పచ్చ జెండా ఊపారట. చెన్నై పాండీ బజార్లోనూ, హైదరాబాద్ ఫిలిమ్నగర్లోనూ ఈ వార్త హల్చల్ చేస్తోంది. ప్రస్తుతం బెంగళూరులో ‘ఉత్తమ విలన్’ షూటింగ్లో కమల్ బిజీగా ఉన్నారు. ఈ సినిమా తర్వాత ఆయన ‘దృశ్యం’ తమిళ రీమేక్‌లో నటించనున్నారు. ఈ రెండు చిత్రాల తర్వాత తేజ ప్రాజెక్ట్ పట్టా లెక్కనుందని సమాచారం. చిత్రం, నువ్వు-నేను, జయం లాంటి బ్లాక్ బస్టర్లు తీసిన తేజకు ఇటీవల కాలంలో సరైన విజయాలు లేవు. కమల్ సినిమాతో మళ్లీ తన పూర్వవైభవం సాధించుకునే దిశగా తేజ కసరత్తులు చేస్తున్నట్టుగా సమాచారం. హాలీవుడ్ సాంకేతిక నిపుణులతో భారీ ఎత్తున ఆ చిత్రం తెరకెక్కనుందట. -
కమెడియన్‌కి మైనస్‌లే ప్లస్సులు!
సంభాషణం నవ్వడం తేలికే. కానీ నవ్వు పుట్టించడం అంత తేలిక కాదు. దానికి ప్రతిభ ఉండాలి. హాస్యం అనేది అణువణువునా నిండివుండాలి. అలాంటివారే అందరినీ నవ్వించగలరు అంటారు సుమన్‌శెట్టి. విభిన్నమైన లుక్‌తో, వైవిధ్యభరితమైన హావభావాలతో కడుపుబ్బ నవ్వించే ఈ కమెడియన్‌తో మాటా మంతీ.... ఈ మధ్య కాస్త తక్కువ కనిపిస్తున్నట్టున్నారు...? కెరీర్ కొంచెం డల్ అయిందిలెండి. ఎందుకలా? కొత్తవాళ్లు వస్తున్నారు. పోటీ పెరిగింది. అలా అని మరీ డల్లేమీ కాదు. తెలుగుతో పాటు తమిళ, కన్నడ భాషల్లో కూడా నటిస్తున్నాను కాబట్టి ఫర్వాలేదు. ఇక్కడ చాన్సుల్లేవని అక్కడికెళ్లారా? అలా ఏమీ లేదు. ‘జయం'లో చేసిన పాత్ర తమిళ వెర్షన్లో కూడా నేనే చేశాను. దాంతో అక్కడ కూడా మొదట్నుంచీ అవకాశాలు బాగానే వచ్చాయి. ఇప్పుడు కన్నడంలో కూడా వస్తున్నాయి. ఇప్పటికి ఎన్ని సినిమాలు చేశారు? తెలుగులో మూడొందల పైనే చేశాను. తమిళంలో అరవై వరకూ చేశాను. అన్నిట్లోకీ బెస్ట్ అనుకునే పాత్ర...? ఎప్పుడూ ఫస్ట్ చేసిందే బెస్ట్ అవుతుందని నా అభిప్రాయం. ఎన్ని రకాల పాత్రలు చేసినా... నన్ను నటుడిని చేసిన ‘జయం' సినిమాలో పాత్ర అంటే నాకు ప్రత్యేమైన ఇష్టం! అలాగే ‘7/జి బృందావన్ కాలనీ’లో చేసింది కూడా! ఇన్ని సినిమాలు చేశారు. రావలసినంత గుర్తింపు వచ్చిందంటారా? దర్శకులు పిలిచి అవకాశాలు ఇస్తున్నారంటే గుర్తింపు వచ్చినట్టే. కానీ తృప్తి కలిగించేటి రోల్స్ చేయలేదంటే ఇంకా గుర్తింపు రావలసి ఉన్నట్టే! ఇంత కాంపిటీషన్ మధ్య నిలబడటానికి మీకున్న ప్రత్యేకతలేంటి? నా మాడ్యులేషన్! కొండవలస గారిని తీసుకోండి... ఆయన మాట్లాడినట్టు వేరేవాళ్లు మాట్లాడలేరు. ప్రయత్నించినా రాదు. నాదీ అంతే. ఓ డిఫరెంట్ మాడ్యులేషన్. అదే నాకంటూ ఓ గుర్తింపునిచ్చింది. నన్నిక్కడ నిలబెట్టింది. మరి మైనస్ పాయింట్స్...? అవి నేను కాదు... నన్ను చూసేవాళ్లు చెప్పాలి. అయినా నెగిటివ్ పాయింట్స్ హీరోలకు మైనస్ అవుతాయి. అదే కమెడియన్‌కి అయితే మైనస్‌లే ప్లస్ అవుతాయి. (నవ్వుతూ) నన్ను చూడండి... నా రూపం చూస్తేనే నవ్వొస్తుందంటారు అందరూ. అంటే మైనస్ ప్లస్ అయినట్టేగా! మీ రోల్‌మోడల్ ఎవరు? పద్మనాభంగారంటే నాకు చాలా ఇష్టం. కమెడియన్‌గా ఎంత నవ్వించారో... హీరో దగ్గర్నుంచి నెగిటివ్ రోల్స్ వరకూ అన్ని రకాల పాత్రలూ చేసి అంతగానూ అలరించారాయన. అలాగే రేలంగిగారు, రాళ్లపళ్లిగారు అన్నా ఎంతో ఇష్టం. ఫలానా దర్శకుడితో చేయాలి అన్న కోరికేమైనా ఉందా? అలా ఏం లేదు. తేజ నన్ను పరిచయం చేశారు. ఇప్పటి వరకూ తన ప్రతి సినిమాలో చాన్స్ ఇస్తూనే ఉన్నారు. అలాగే మిగతా దర్శకులు కూడా నాకు సరిపోయే పాత్ర ఉంటే పిలిచి ఇస్తున్నారు. అలాంటప్పుడు ఒక్క దర్శకుడి పేరు ఎలా చెబుతాను! నాకు అందరూ ముఖ్యమే. ఎవరన్నా గౌరవమే. అందరూ నన్ను ప్రోత్సహించి నడిపిస్తున్నవారే కదా! మీ డ్రీమ్ రోల్...? ఎప్పుడూ నవ్విస్తూ ఉండే నాకు ఓ మంచి నెగిటివ్ రోల్ చేసి... నాలోనూ ఓ సీరియస్ నటుడున్నాడని చూపించాలని ఉంది. చాలామంది కమెడియన్లు హీరోలవుతున్నారు. మీకూ అలాంటి కోరికేదైనా...? అస్సలు లేదు. ఉన్నదాంతో తృప్తిపడే తత్వం నాది. మధ్యలో అవకాశాలు తగ్గి ఓ సంవత్సరం గ్యాప్ వచ్చినప్పుడు కూడా నిరాశపడలేదు. ఈసారి వచ్చే అవకాశాల్ని సద్వినియోగం చేసుకుని, మళ్లీ ఒక్కో మెట్టూ ఎదగాలనుకున్నాను. నేనేది చేయగలనో, నాకేది తగునో అవే చేస్తాను తప్ప ఎక్కువ ఆశలు పెట్టుకోను. - సమీర నేలపూడి -
కొత్తగా 'తప్పు' చేయబోతున్న తేజ !
-
‘తప్పు’ చేస్తున్నారు!
అవును... తేజ ‘తప్పు’ చేస్తున్నారు. ఇక్కడ ‘తప్పు’ అంటే ఇంకేదో అనుకునేరు. ఆయన స్వీయ దర్శకత్వంలో నిర్మించబోతున్న కొత్త సినిమా టైటిల్ ‘తప్పు’. అంతా కొత్తవాళ్లతో ఆయన ఈ సినిమా చేయబోతున్నారు. ప్రస్తుతం నటీనటుల ఎంపిక ప్రక్రియ జరుగుతోంది. చాలా విరామం తర్వాత తన సొంత నిర్మాణ సంస్థ ‘చిత్రం మూవీస్’లో తేజ ఈ సినిమా చేయబోతున్నారు. కల్యాణీ కోడూరి స్వరాలందిస్తున్నారు. పెద్దాడమూర్తి పాటలు రాస్తున్నారు. పక్కా యూత్‌ఫుల్ ఫిల్మ్‌గా తేజ దీన్ని తీర్చిదిద్దబోతున్నారు. ‘‘సమాజానికి కొన్ని సరిహద్దులుంటాయి. ఆ హద్దులతో చెలగాటమే ఈ సినిమా. అంతకుమించి వివరాలు చెప్పను’’ అని తేజ చెప్పారు. -
నెగెటివ్ టైటిల్స్ ను నమ్ముకుంటోన్న డైరెక్టర్
-
తేజకు ఐదు వికెట్లు
జింఖానా, న్యూస్‌లైన్ : వాకర్ టౌన్ బౌలర్ తేజ (5/15) తన బౌలింగ్‌తో ప్రత్యర్థి జట్టును బెంబేలెత్తించాడు. దీంతో ఆ జట్టు 9 వికెట్ల తేడాతో సత్య సీసీ జట్టుపై విజయం సాధించింది. హెచ్‌సీఏ కిషన్ ప్రసాద్ వన్డే నాకౌట్ టోర్నీలో భాగంగా బుధవారం జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన సత్య సీసీ 75 పరుగులకే కుప్పకూలింది. అన ంతరం బరిలోకి దిగిన వాకర్ టౌన్ వికెట్ కోల్పోయి 80 పరుగులు చేసి గెలిచింది. పాండు (45) మెరుగ్గా ఆడాడు. మరో మ్యాచ్‌లో విజయానంద్ జట్టు 119 పరుగుల తేడాతో సన్‌షైన్ జట్టుపై గెలుపొందింది. మొదట బరిలోకి దిగిన విజయానంద్ 6 వికెట్ల నష్టానికి 222 పరుగులు చేసింది. నాయక్ (70) అర్ధ సెంచరీతో రాణించగా... తిలక్ (44), అభిషేక్ (37), విక్రాంత్ (30) ఫర్వాలేదనిపించారు. సన్‌షైన్ బౌలర్ కళ్యాణ్ సాత్విక్ 4 వికెట్లు పడగొట్టాడు. తర్వాత లక్ష్య ఛేదనకు దిగిన సన్‌షైన్ 103 పరుగులకే చేతులెత్తేసింది. విజయానంద్ బౌలర్ నరేష్ 3 వికెట్లు తీశాడు. ఇతర మ్యాచ్‌ల స్కోర్లు అగర్వాల్ ఎస్ఆర్: 174 (ఫరూఖ్ 45, అబ్దుల్లా 30; మునాఫ్ సుబానీ 3/32); కల్నల్ అక్రిలిక్: 175/5 (మొసిన్ ఆరిఫ్ 51, మహ్మద్ ఆసిఫ్ 30). లాల్ బహదూర్: 272/7 (గఫార్ ఖాన్ 50, జైచందర్ 65, సుషీల్ 56 నాటౌట్, పవన్ 33); ఇన్కమ్ ట్యాక్స్: 273 (మారుతీ ప్రసాద్ 40, హిమాన్షు 67, రాజశేఖర్ 73). కాంకార్డ్: 131; రోహిత్ ఎలెవన్: 135/7. -
తారాన్వేషణలో...
అందరూ కొత్తవాళ్లతో సినిమాలు తీయడం తేజకి కొత్త కాదు. ఉదయ్‌కిరణ్, నితిన్, ప్రిన్స్, అనిత, కాజల్ అగర్వాల్, నందిత.. ఇలా పలువురు హీరో హీరోయిన్లతో పాటు కేరక్టర్ ఆర్టిస్ట్‌లను కూడా ఆయన పరిచయం చేసిన విషయం తెలిసిందే. తాజాగా, అంతా కొత్తవాళ్లతో తేజ మరో సినిమా చేయబోతున్నారు. ఇటీవల తేజ దర్శకత్వంలో ‘1000 అబద్ధాలు’ చిత్రాలు నిర్మించిన ప్రభాకర్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ప్రస్తుతం నటీనటుల ఎంపిక జరుగుతోంది. మరోవైపు మ్యూజిక్ సిట్టింగ్స్ కూడా జరుగుతున్నాయి. కథ సిద్ధమైంది. వచ్చే నెల ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్‌ని ప్రారంభించాలనుకుంటున్నారు. -
తేజ ప్రేమకథ
ప్రేమకథలు తీయడంలో తేజకు ఓ ప్రత్యేకమైన శైలి ఉంది. ‘చిత్రం’, ‘నువ్వు-నేను’, ‘జయం’ లాంటి సినిమాలతో ఆయన బాక్సాఫీస్ రికార్డులను తిరగరాశారు. మళ్లీ తన శైలిలో ఓ ప్రేమకథ చేయడానికి ఆయన సన్నాహాలు చేస్తున్నారు. ఇటీవలే ఆయన దర్శకత్వంలో సాయిరామ్‌శంకర్ హీరోగా ‘1000 అబద్ధాలు’ నిర్మించిన శ్రీ ప్రొడక్షన్స్ సంస్థ, తేజ దర్శకత్వంలోనే మరో సినిమా చేయబోతోంది. ఆ విశేషాలను నిర్మాత సునీత ప్రభాకర్ పాలడుగు తెలియజేస్తూ -‘‘ప్రేమలోని గాఢతను ఆవిష్కరిస్తూ తేజ ఈ సినిమా చేయబోతున్నారు. ప్రస్తుతం హీరో హీరోయిన్ల ఎంపిక జరుగుతోంది. పాత, కొత్త తారాగణమంతా ఇందులో నటిస్తారు. సెప్టెంబర్‌లో షూటింగ్ మొదలుపెట్టి, 30 రోజుల్లో సినిమా పూర్తి చేయడానికి తేజ సన్నాహాలు చేస్తున్నారు’’ అన్నారు. -
1000 అబద్ధాలు ప్రేక్షకులు నమ్మారు
‘‘మా సినిమా సూపర్‌హిట్ అయ్యిందని నేను అనను. చూసిన వాళ్లందరూ మెచ్చుకుంటున్నారని మాత్రం చెప్పగలను’’ అని తేజ అన్నారు. సాయిరామ్‌శంకర్ కథానాయకునిగా తేజ దర్శకత్వంలో పాలడుగు ప్రభాకర్ నిర్మించిన చిత్రం ‘1000 అబద్ధాలు’. ఈ నెల 15న విడుదలైన ఈ చిత్రం సక్సెస్‌మీట్ శనివారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ సందర్భంగా తేజ మరిన్ని విషయాలు చెబుతూ -‘‘ఒకేరోజు నాలుగు సినిమాలు విడుదలవ్వడంతో వసూళ్ళను ఈ నాలుగు సినిమాలు పంచుకోవడం జరిగింది. ఈ రోజు మాత్రం మా సినిమా వసూళ్లు పెరిగాయి. దీన్ని బట్టి సినిమా ప్రేక్షకులకు రీచ్ అయ్యిందని తెలుస్తోంది. కేవలం మౌత్ పబ్లిసిటీతో జనాలు థియేటర్లకు వస్తున్నారు. కుటుంబ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యిందీ సినిమా. ముఖ్యంగా టవర్‌స్టార్‌గా నాగబాబు కామెడీ బావుందంటున్నారు’’ అన్నారు. సినిమా చూసిన వారందరూ బాగా ఎంజాయ్ చేస్తున్నారని సాయిరామ్‌శంకర్ ఆనందం వ్యక్తం చేశారు. మంచి పాత్రను ఇందులో పోషించానని కథానాయిక ఎస్తర్ చెప్పారు. ఈ సినిమాలో తామూ భాగమైనందుకు నటుడు సామ్రాట్, నవీన్ ఆనందం వ్యక్తం చేశారు. -
తేజ దర్శకత్వంలో వస్తున్న చిత్రం ‘1000 అబద్ధాలు’
వెయ్యి అబద్ధాలు ఆడైనా సరే ఒక పెళ్లి చెయ్యాలంటారు పెద్దలు. మిగతా విషయాల్లో అబద్ధాలు ఆడడం కరెక్ట్ కాదు కానీ, పెళ్లి విషయంలో మాత్రం పెద్దలు ఓ భారీ వెసులుబాటు ఇచ్చేశారు. అందుకే ఈ అబద్ధాలను నమ్ముకుని ఓ కుర్రాడు తన ప్రేమను పెళ్లి వరకూ ఎలా తీసుకు వెళ్లాడన్నదే ‘1000 అబద్ధాలు’ సినిమా నేపథ్యం. తేజ దర్శకుడు. సాయిరామ్‌శంకర్, ఎస్తర్ హీరోహీరోయిన్లు. చిత్రం మూవీస్ సమర్పణలో శ్రీ ప్రొడక్షన్స్ పతాకంపై ప్రభాకర్ పాలడుగు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 9న విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ- ‘‘తేజ సినిమాల్లో రొమాన్స్ ఎంత బావుంటుందో, ఎంటర్టైన్మెంట్ అంతకన్నా బావుంటుంది. ఈ సినిమాలో కూడా రొమాన్స్ ఉంటుంది కానీ, వినోదానికే పెద్ద పీట వేశారు. సినిమా ప్రారంభ సన్నివేశం మొదలుకుని శుభం కార్డు వరకూ నవ్వుతూనే ఉంటారు ప్రేక్షకులు. అంత బాగా పండింది కామెడీ. ఓ రకంగా వేయి నవ్వుల విందు ఇది. దర్శకునిగా తేజ విశ్వరూపం కనిపిస్తుంది ఇందులో. సాయిరామ్శంకర్లోని కొత్త కోణాన్ని తేజ బాగా ఆవిష్కరించారు. రమణగోగుల స్వరపరిచిన పాటలు ఇప్పటికే ప్రజాదరణ పొందాయి. రసూల్ ఛాయాగ్రహణం ఈ సినిమాకు మెయిన్ పిల్లర్. కథానాయికగా పరిచయమైన ఎస్తర్‌కు ఈ చిత్రం మంచి పునాదిగా నిలుస్తుంది’’ అని తెలిపారు.