Movies
-
శోభితతో పెళ్లి.. జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నా: నాగచైతన్య
లవ్‌స్టోరీ సినిమా తర్వాత నాగచైతన్య (Naga Chaitanya), సాయిపల్లవి మరోసారి జత కట్టిన మూవీ తండేల్ (Thandel Movie). కార్తికేయ 2 ఫేం చందూ మొండేటి దర్శకత్వం వహించిన ఈ సినిమా ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. దాదాపు రూ.80 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ మూవీపై నిర్మాత అల్లు అరవింద్ ధీమాగా ఉన్నాడు. ఇటీవల ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో నాగచైతన్య ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. లైఫ్ ఎంజాయ్ చేస్తున్నా..వైజాగ్ తనకు స్పెషల్ అని.. అక్కడ సినిమా ఆడిందంటే ప్రపంచంలో ఎక్కడైనా ఆడాల్సిందే అన్నాడు. వైజాగ్ తనకు ఎంత క్లోజ్ అంటే వైజాగ్ అమ్మాయి (శోభిత)ని ప్రేమించి, పెళ్లి చేసుకున్నానని.. ఇప్పుడు తన ఇంట్లో రూలింగ్ పార్టీ వైజాగే ఉందన్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో చై.. వైజాగ్ రూలింగ్ పార్టీ గురించి మాట్లాడాడు. వైవాహిక జీవితం చాలా బాగుంది. ప్రస్తుతం లైఫ్‌ను ఎంజాయ్ చేస్తున్నాను. మా పెళ్లయి కొన్ని నెలలే అవుతోంది. ఈ సమయంలో ఇద్దరం ఓపక్క సినిమాలు చేస్తూనే మరోపక్క మాకంటూ ప్రత్యేక సమయం కేటాయించుకుంటున్నాం. (చదవండి: 93% సినిమాలు ఫ్లాప్.. వెయ్యి కోట్ల నష్టం.. నిర్మాతల కంట రక్తకన్నీరు!)అదే మమ్మల్ని ఒకటిగా..వర్క్ లైఫ్‌ను బ్యాలెన్స్ చేసుకుంటున్నాం. మా ఇద్దరికీ ఉన్న సేమ్ లక్షణాల్లో ఇదీ ఒకటి. అలాగే సినిమాపై మాకున్న ప్రేమ మాటల్లో చెప్పలేనిది. జీవితంపైనా మాకు ఎంతో ఆసక్తి ఉంది. అదే మమ్మల్ని ఒకటిగా ముందుకు నడిపించింది. మాకు ట్రావెలింగ్ అంటే కూడా ఇష్టం. భవిష్యత్తులో శోభిత, నేను ఒకే సినిమాలో కలిసి నటిస్తామా? లేదా? అన్నది నేనిప్పుడే చెప్పలేను. మంచి స్క్రిప్ట్ మమ్మల్ని వెతుక్కుంటూ వస్తే మాత్రం తప్పకుండా చేస్తాం అన్నాడు.గతంలో నాగచైతన్య.. సమంతను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. తర్వాత పొరపచ్చాలు రావడంతో ఆమెకు విడాకులు ఇచ్చాడు. గతేడాది హీరోయిన్ శోభితను రెండో పెళ్లి చేసుకున్నాడు.చదవండి: పెళ్లి తర్వాత నా భర్తనే మారిపోయాడు: వరలక్ష్మి శరత్ కుమార్ -
డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజైన హీరోహీరోయిన్లు లేని సినిమా
ఆర్ పి పట్నాయక్ దర్శకత్వం వహించిన తాజా చిత్రం "కాఫీ విత్ ఏ కిల్లర్"( Coffee With A Killer). సెవెన్ హిల్స్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై సతీష్ నిర్మించిన ఈ చిత్రంలో టెంపర్ వంశీ, శ్రీనివాసరెడ్డి, సత్యం రాజేష్, రవిబాబు, అంబటి శ్రీను, శ్రీరాప, జెమిని సురేష్ తదితరులు కీలకపాత్ర పోషించారు. నేటి నుంచి ఈ మూవీ ప్రముఖ ఓటీటీ ‘ఆహా’(AHA)లో స్ట్రీమింగ్ కానుంది.ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు ఆర్ పి పట్నాయక్ మాట్లాడుతూ...‘హీరో హీరోయిన్ లేకుండా ఒక సినిమా తీయాలి అంటే ఎలా అని ఆలోచనతో ఈ కథ మొదలైంది. కథ హీరో అయితే ఎలా ఉండబోతుంది అని ఈ కథ రాశాము. ఈ చిత్రానికి పనిచేసిన ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈ సినిమాను మొత్తం దగ్గరుండి చూసుకున్నది మా అన్నయ్య గౌతమ్ పట్నాయక్ గ. ఈ చిత్రంలోని కీలక పాత్ర విషయానికి వస్తే నాకు వంశీ మాత్రమే కచ్చితంగా ఈ కథకు, పాత్రకు పర్ఫెక్ట్ అని అనిపించింది. వేరే ఎవరిని నేను ఆ పాత్రలో ఊహించుకోలేకపోయాను. జెమిని సురేష్ క్యారెక్టర్ ప్రత్యేకమైనది. నా ఆలోచనలు అర్థం చేసుకునే తిరుమల నాగ్ కలిసి ఈ చిత్రం కోసం పని చేశాను. డిఓపి అనూష్ ఎంతో సౌమ్యుడు. ఎంతో టాలెంట్ ఉన్న వ్యక్తి. చిత్రంలో నటించిన నటీనటుల క్యారెక్టర్లు చూస్తే కొన్ని ఎంతో ప్రత్యేకంగా అలాగే కొత్తగా ఉంటాయి. శ్రీనివాస్ రెడ్డి గారికి ఆయన కాకుండా ఇంకా ఎవరు అంత బాగా చేయలేరు అన్నట్లు వచ్చింది. ఆయన టైమింగ్ ప్రత్యేకం అని చెప్పుకోవాలి. ఈ చిత్రం ఎంతో శ్రద్ధగా టీమ్ అంతా కలిసి టీం వర్క్ గా చేసాము. సినిమాలో హీరో హీరోయిన్ ఉండరు కానీ విలన్ ఉంటాడు. ఈ సినిమాను ఎంతోమంది థియేటర్లో విడుదల చేయమని నన్ను అడిగారు కానీ నేను ఈ సినిమా ఖచ్చితంగా ఓటిటి లోనే విడుదల కావాలి అని పట్టు పట్టి ఆహాలో విడుదల చేస్తున్నాం’అన్నారు.నటుడు శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ...‘కొన్ని కథలో మధ్య జరిగే కథలా ఈ చిత్రం ఉండబోతుంది. చూసి ప్రేక్షకులంతా ఎంతో ఎంజాయ్ చేస్తారు. ప్రతి సీన్ లోను ట్విస్టులు ఉంటాయి. డబ్బింగ్ కూడా ఎంతో బాగా వచ్చింది. ఆర్ బి గారితో పని చేయడమే కాదు ఆయన దగ్గర ఉండటం కూడా ఎంతో ఆనందకరం’ అన్నారు.టెంపర్ వంశీ మాట్లాడుతూ...‘ఆర్ పి గారు నన్ను ముఖ్య పాత్రలో ఒక సినిమా చేస్తున్నాము అని చెప్పగానే నేను నిజంగా ఆశ్చర్యపోయాను. నన్ను పెట్టి సినిమా తీయడం ఏంటి అని. ఆయన ఆలోచన చెప్పిన తర్వాత నాకు ఎంతో ఎక్సైట్ గా అనిపించింది. ఈ చిత్రానికి పనిచేసిన వారందరితో పనిచేయడం నాకు చాలా ఆనందంగా అనిపించింది. అందరూ తప్పకుండా ఆహలో ఈ చిత్రాన్ని చూడండి’అన్నారు. -
ఓటీటీకి మోస్ట్ వయొలెంట్ సినిమా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
గతేడాది రిలీజైన మోస్ట్ వయలెంట్ చిత్రం మార్కో(Marco). ఉన్ని ముకుందన్(Unni Mukundan) హీరోగా నటించిన ఈ చిత్రం మలయాళంలో బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. కేవలం రూ. 30 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించిన ఈ చిత్రం.. మలయాళంలోనే రూ.100 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. దీంతో బాక్సాఫీస్ వద్ద పలు రికార్డులు సృష్టించింది.అంతేకాకుండా మలయాళంతో(Malayalam Movie) పాటు తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ఈ సినిమా అంచనాలకు మించి వసూళ్లు రాబట్టింది. దీంతో ఈ చిత్రం ఓటీటీ(OTT) విడుదల కోసం సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్‌ను మేకర్స్ రివీల్ చేశారు. వచ్చేనెల 14న లవర్స్ డే సందర్భంగా స్ట్రీమింగ్ చేయనున్నారు. ఈ విషయాన్ని మార్కో ఓటీటీ రైట్స్ దక్కించుకున్న సోనీ లివ్(Sony Liv) సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది.మార్కో కథేంటంటే..?జార్జ్ (సిద్దిఖ్ఖీ) గోల్డ్ బిజినెస్ చేస్తుంటాడు. ఈ వ్యాపారంలో తనకు మించినవాళ్లు ఉండరు. సిండికేట్ ఏర్పాటు చేసి.. దాని లీడర్‌గా వ్యవహరిస్తుంటారు. అతని తమ్ముడు విక్టర్(ఇషాన్ షౌకాత్) అంధుడు. కానీ చాలా టాలెంటెడ్. విక్టర్ స్నేహితుడు వసీమ్‌ను ఓ ముఠా చంపేస్తుంది. దానికి సాక్షి ఉన్నాడని విక్టర్‌ను కూడా ఆ ముఠా దారుణంగా హత్య చేస్తుంది. విదేశాలకు వెళ్లిన జార్జ్ మరో తమ్ముడు(జార్జ్ వాళ్ల నాన్న పెంచిన వ్యక్తి) మార్కో(ఉన్ని ముకుందన్)కు ఈ హత్య విషయం తెలిసి వెంటనే వచ్చేస్తాడు. తను ప్రాణంగా ఇష్టపడే సోదరుడు విక్టర్ హత్యకు కారణమైనవారిని వదిలిపెట్టనని చర్చిలోనే ప్రమాణం చేస్తాడు. అసలు విక్టర్ని హత్య చేసిందెవరు? ఎందుకు చేశారు? చివరకు మార్క్ వారిని ఎలా మట్టుపెట్టాడు?అనేదే మిగతా కథ. View this post on Instagram A post shared by Sony LIV (@sonylivindia) -
పెళ్లి తర్వాత నా భర్తనే మారిపోయాడు: వరలక్ష్మి శరత్ కుమార్
దాదాపు 12 ఏళ్ల తర్వాత ప్రేక్షకుల ముందుకొచ్చిన చిత్రం మదగజరాజా. ఈ చిత్రంలో విశాల్, వరలక్ష్మి శరత్‌కుమార్ కీలక పాత్రల్లో నటించారు. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా కోలీవుడ్ ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. దీంతో ఈ మూవీని టాలీవుడ్ ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. తాజాగా ఈ చిత్రం జనవరి 31 తెలుగులో విడుదలైంది. ఈ నేపథ్యంలో వరలక్ష్మి శరత్‌కుమార్ ఓ ఇంటర్వ్యూకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. అదేంటో తెలుసుకుందాం.గతేడాది వివాహాబంధంలోకి అడుగుపెట్టిన వరలక్ష్మి తన భర్త గురించి ఆసక్తికర విషయాలు పంచుకుంది. పెళ్లి తర్వాత తన కోసం పూర్తిగా మారిపోయాడని తెలిపింది. నా కోసం ముంబయి నుంచి హైదరాబాద్‌కు షిఫ్ట్ అవుతున్నారని పేర్కొంది. ప్రతి విషయంలో నాకు ఫుల్ సపోర్ట్‌గా ఉంటారని వెల్లడించింది. నా కోసం ఆయన తన లైఫ్ స్టైల్ పూర్తిగా మార్చుకున్నారని వివరించింది.ఇంటర్వ్యూలో వరలక్ష్మి మాట్లాడుతూ..'నికోలయ్‌తో పెళ్లి తర్వాత నా జీవితం ఏమీ మారలేదు. నాకోసం అతని జీవితాన్నే పూర్తిగా మార్చుకున్నాడు. నా కోసం ఆయనే హైదరాబాద్ షిఫ్ట్ అవుతున్నారు. అంతేకాదు తన పేరును నికోలయ్ సచ్దేవ్ వరలక్ష్మీ శరత్‌కుమార్‌గా మార్చుకున్నారు. నా కెరీర్ పరంగా ఫుల్ సపోర్ట్‌గా ఉన్నారు. నాకు అసలు పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశం కూడా ఉండేది కాదు. వివాహం అనేది నాకు సెట్ కాదనుకునేదాన్ని. కానీ నికోలయ్‌తో పరిచయం తర్వాత నా జీవితానికి అతనే సరైన భాగస్వామి అని అర్థమైంది. అలా పెద్దల అంగీకారంతో వివాహాబంధంలోకి అడుగుపెట్టాం' అని చెప్పింది. సినిమాల విషయానికొస్తే కోలీవుడ్‌తో పాటు టాలీవుడ్లో సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది. వీరసింహారెడ్డి, కోట బొమ్మాళి, హనుమాన్ చిత్రాలతో తెలుగులో గుర్తింపు తెచ్చుకుంది. గతేడాది కన్నడలో కిచ్చా సుదీప్ హీరోగా నటించిన మూవీలోనూ కీలకపాత్ర పోషించింది.పెళ్లి తర్వాత నా కోసం మా ఆయన చాలా మార్చుకున్నాడు - Actress #VaralaxmiSarathkumar#NicholaiSachdev #MadhaGajaRaja #TeluguFilmNagar pic.twitter.com/doquPrV0ft— Telugu FilmNagar (@telugufilmnagar) January 31, 2025 -
93% సినిమాలు ఫ్లాప్.. వెయ్యి కోట్ల నష్టం.. నిర్మాతల కంట రక్తకన్నీరు!
రిలీజైన ప్రతి సినిమా హిట్టవదు. కంటెంట్‌లో దమ్మున్నవి మాత్రమే హిట్టు, సూపర్ హిట్టుగా నిలుస్తాయి. కథలో ఏమాత్రం పస లేకపోయినా సినిమాను నిర్దాక్షిణ్యంగా రిజెక్ట్ చేస్తారు. అలా తమిళ సినిమాలోనూ వందల సినిమాలను ప్రేక్షకులు తిరస్కరించారు. 2024లో తమిళ ఇండస్ట్రీలో విడుదలైన సినిమాలెన్ని? (Kollywood Box Office Report - 2024) లాభనష్టాలేంటి? అనేవి ఓసారి చూసేద్దాం..రూ.1000 కోట్ల నష్టంకోలీవుడ్ (Tamil Cinema Industry)లో గతేడాది 241 సినిమాలు రిలీజయ్యాయి. వీటికోసం తమిళ ఫిలిం మేకర్స్ దాదాపుగా రూ.3000 కోట్లు ఖర్చుపెట్టారు. ఖర్చుకు వెనకాడకుండా సినిమాలు తీసిన నిర్మాతలకు బాక్సాఫీస్ దగ్గ భంగపాటు ఎదురైంది. ఏకంగా 223 సినిమాలు బ్రేక్ ఈవెన్ కూడా అందుకోలేకపోయాయి. దీంతో వెయ్యి కోట్ల మేర నష్టం వాటిల్లింది. సూర్య, కమల్ హాసన్, రజనీకాంత్ వంటి హీరోల సినిమాలు సైతం చతికిలపడ్డాయి. రూ.350 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించిన కంగువా రూ.1000 కోట్లు రాబడుతుందనుకున్నారు. అతి కష్టమ్మీద రూ.100 కోట్లు!తీరా చూస్తే కేవలం రూ.106 కోట్లు మాత్రమే వసూలు చేసింది. నిర్మాతలకు కంటి మీద కునుకు లేకుండా చేసింది. అలాగే టాప్ డైరెక్టర్ శంకర్ డైరెక్షన్లో, కమల్ హాసన్ ప్రధాన పాత్రలో నటించిన ఇండియన్ 2 సినిమా (Indian 2 Movie)ను రూ.250 కోట్ల బడ్జెట్‌తో నిర్మించారు. చివరకు ఇది కూడా కంగువా బాటలోనే పయనించింది. రూ.150 కోట్లకంటే ఎక్కువ రాబట్టలేకపోయింది. రజనీకాంత్ వేట్టైయాన్ చిత్రాన్ని సైతం ప్రేక్షకులు ఇలాగే తిరస్కరించారు.చదవండి: పెళ్లి వద్దనుకుని 'కళార్పణ'కు అంకితమైన శోభన93% సినిమాలు ఫ్లాప్2024లో కేవలం 18 చిత్రాలు మాత్రమే హిట్టయ్యాయి. ఈ లెక్కన గతేడాది 93% చిత్రాలు ఫ్లాప్ లిస్ట్‌లో చేరిపోగా ఏడు శాతం మాత్రమే సక్సెస్ అయ్యాయి. ఆ సక్సెస్ జాబితాలో అమరన్ (Amaran Film), ద గోట్, రాయన్ వంటివాటితో పాటు లబ్బర్ పందు, గరుడన్, డిమాంటి కాలనీ 2, వాళై చిత్రాలూ ఉన్నాయి. 2025కి తమిళ ఇండస్ట్రీ శుభారంభం పిలికింది. మదగజరాజ, కుడుంబస్తాన్ చిత్రాలు హిట్లుగా నిలిచాయి. కానీ గేమ్ ఛేంజర్ డిజాస్టర్‌గా నిలిచింది.ఆశలన్నీ ఈ ఏడాదిపైనే!2023లో జైలర్, పొన్నియన్ సెల్వన్ 2 వంటి భారీ బడ్జెట్ చిత్రాలు కాసులవర్షం కురిపించాయి. కానీ 2024లో మాత్రం ఇండియన్ 2, కంగువా, వేట్టైయాన్ వంటి పెద్ద సినిమాలు బాక్సాఫీస్ వద్ద దారుణంగా చతికిలపడ్డాయి. ద గోట్, అమరన్, మహారాజా, రాయన్, అరణ్మణై 4 వంటి కొన్ని చిత్రాలు మాత్రమే హిట్టందుకున్నాయి. 2024 అత్యంత చెత్త సంవత్సరంగా నిలిచింది. 2025లో ఈ పరిస్థితి మారుతుందని ఆశిస్తున్నాం.- నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ జి. ధనాంజనేయన్చదవండి: Madha Gaja Raja Review: ‘మదగజరాజా’ మూవీ రివ్యూ -
అలాంటివి చేసుంటే పెద్ద స్టార్ అయ్యేవాడిని.. నేనే వదిలేశా!: సిద్దార్థ్
సిద్దార్థ్.. ఒకప్పుడు తెలుగులో టాప్ హీరో.. కానీ ఆ క్రేజ్‌ను అలాగే కాపాడుకోలేకోయాడు. బాయ్స్, బొమ్మరిల్లు, నువ్వొస్తానంటే నేనొద్దంటానా, .. ఇలా పలు చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను కట్టిపడేశాడు. ఇటీవలి కాలంలో కోలీవుడ్‌పైనే ఎక్కువ ఫోకస్ పెడుతున్నాడు. అయితే తన కెరీర్లో కొన్ని పనులు చేయకపోవడం వల్లే స్టార్ కాలేకపోయానంటున్నాడు.అలాంటివి రిజెక్ట్ చేశా..ఇటీవల హైదరాబాద్ సాహిత్య వేడుకకు హాజరైన హీరో సిద్ధార్థ్ (Siddharth) సినిమాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. నా దగ్గరికి చాలారకాల స్క్రిప్టులు వచ్చేవి. అమ్మాయిలను కొట్టడం, ఐటం సాంగ్స్ చేయడం, నడుము గిల్లడం.. నేను చెప్పినట్లుగా అమ్మాయిలు నడుచుకోవడం.. ఎక్కడికి వెళ్లాలి? ఏం చేయాలన్నది నేనే ఆదేశాలివ్వడం.. ఇలాంటి కంటెంట్‌తో కొన్ని కథలు వచ్చాయి. వాటిని నేను రిజెక్ట్ చేశాను. బహుశా అవి ఒప్పుకుని ఉంటే ఈరోజు నేను పెద్ద స్టార్ అయ్యుండేవాడినేమో! కానీ నేను నా మనసుకు నచ్చినవే చేసుకుంటూ పోయాను.ఆ సంతోషాన్ని, అభిమానాన్ని వెలకట్టలేంచాలామంది నా దగ్గరకు వచ్చి మీరు ఆడవాళ్లకు చాలా గౌరవం ఇస్తారని చెప్తూ ఉంటారు. మహిళలకే కాదు, పేరెంట్స్‌కు, పిల్లలకు.. ఇలా అందరికీ గౌరవప్రాధాన్యతలిస్తారని అంటుంటారు. అంతేకాదు వారి పిల్లలు పదిహేనేళ్లుగా నా సినిమాలు చూస్తున్నారని చెప్తుంటారు. ఇంతకంటే సంతోషకరమైనది ఇంకేముంటుంది? ఈ అభిమానానికి కోట్లల్లో కూడా వెలగట్టలేం. చాలామంది హీరోలు యాక్షన్‌కే ప్రాధాన్యత ఇస్తున్నారు. మగవాళ్లు బాధను బయటకు చూపించకూడదన్నట్లుగా ఉంటున్నారు. కానీ నేనలా కాదు.. స్క్రీన్‌పై ఏడవడాన్ని కూడా సంతోషంగా చేస్తాను అని చెప్పుకొచ్చాడు.(చదవండి: Madha Gaja Raja Review: ‘మదగజరాజా’ మూవీ రివ్యూ)చేసిందంతా చేసి సుద్దపూసలా..అయితే ఈయన మాటలపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. ఆట (Aata Movie), గృహం సినిమా (Gruham Movie)లో నువ్వు చేసిందేంటి? అని ప్రశ్నిస్తున్నారు. చేసిందంతా చేసి ఇలాంటి నీతులు చెప్పడం అవసరమా? అని సెటైర్లు వేస్తున్నారు. మరికొందరేమో.. ఈ మార్పు ఎప్పుడు మొదలైందో చెప్పుంటే బాగుండేది.. ఎందుకంటే గతంలో సిద్దార్థ్ కూడా హీరోయిన్స్‌తో హద్దుమీరి రొమాన్స్ చేసిన సందర్భాలు చాలానే ఉన్నాయని పెదవి విరుస్తున్నారు. పెళ్లి చేసుకున్నాక బుద్ధి వచ్చినట్లుంది.. అందుకే ఈ మార్పు అని పలువురూ కామెంట్లు చేస్తున్నారు.సినిమాసిద్దార్థ్ సినిమాల విషయానికి వస్తే.. 2023లో చిత్తా (చిన్నా) సినిమాతో హీరోగా, నిర్మాతగా విజయం అందుకున్నాడు ఈయన చివరగా ఇండియన్ 2, మిస్ యు మూవీలో యాక్ట్ చేశాడు. త్వరలోనే ఇండియన్ 3, టెస్ట్ చిత్రంలో భాగం కానున్నాడు. పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే హీరోయిన్ అదితిరావు హైదరిని గతేడాది పెళ్లి చేసుకున్నాడు. ఇద్దరికీ రెండో పెళ్లితెలంగాణలోని వనపర్తిలో 400 ఏళ్ల చరిత్ర కలిగిన రంగనాథ స్వామి దేవాలయంలో వీరి వివాహం జరిగింది. తర్వాత రాజస్థాన్‌లోని అలీలా ఫోర్ట్‌లో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకున్నారు. వీరికిద్దరికీ ఇది రెండో పెళ్లే కావడం గమనార్హం! ఇకపోతే వీరిద్దరికీ మహాసముద్రం సినిమా సమయంలో పరిచయం, స్నేహం ఏర్పడింది. కొంతకాలానికే ప్రేమలో పడ్డారు. దాన్ని పెళ్లితో ముందుకు తీసుకెళ్లారు.చదవండి: 19 ఏళ్ల వయసు..అలా చూపిస్తేనే థియేటర్‌కి వస్తారన్నాడు: హీరోయిన్ -
ఓటీటీలో 'హెబ్బా పటేల్' రొమాంటిక్ సినిమా
టాలీవుడ్లో భారీ తారాగణంతో గతేడాది నవంబర్‌లో విడుదలైన ‘‘ధూం ధాం’(Dhoom Dhaam Movie) సినిమా తాజాగా ఓటీటీలోకి వచ్చేసింది. చేతన్ కృష్ణ, హెబ్బా పటేల్ (hebah patel) జోడీగా నటించిన చిత్రాన్ని దర్శకుడు సాయి కిషోర్ మచ్చా ( Sai Kishore Macha) తెరకెక్కించారు. ఫ్రైడే ఫ్రేమ్ వర్క్స్ బ్యానర్‌పై ఎంఎస్ రామ్ కుమార్ భారీ అంచనాలతో నిర్మించారు. థ్రిల్లర్, పేట్రియాటిక్, స్కామ్ సినిమా కథలకు కాస్త కామెడీ యాడ్ చేస్తే ఎలా ఉంటుందో ఇందులో 'ధూం ధాం'గా చూపించారు. గతంలో శ్రీను వైట్ల దగ్గర పనిచేసిన డైరెక్టర్ సాయి కిషోర్ ఈ చిత్రంతో ప్రేక్షకులకు పరిచయం అయ్యారు. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ రిలీజ్ చేయడంతో కాస్త బెటర్‌గానే ఓపెనింగ్స్ వచ్చాయి.ఎలాంటి ప్రకటన లేకుండానే సడెన్‌గా అమెజాన్ ప్రైమ్‌లో ధూం ధాం చిత్రం స్ట్రీమింగ్ అవుతుంది. ఈ మూవీలో హెబ్బా పటేల్ కాస్త గ్లామర్ రోల్లో కనిపించి అందరినీ ఆకట్టుకుంది. మారుతి సినిమా 'రోజులు మారాయి'తో హీరోగా ఎంట్రీ ఇచ్చిన చేతన్ కృష్ణ ధూం ధాం అనేలా మెప్పించాడు. తండ్రీ కొడుకుల అనుబంధం కారణంగా నాయిక జీవితంలో ఒక అనుకోని ఘటన జరుగుతుంది. దాన్ని సరిదిద్దేందుకు హీరో ఎలాంటి ప్రయత్నం చేశాడు అనేది కథ. సినిమా సరదాగా మొదలై ఇంటర్వెల్ దాకా మంచి సాంగ్స్, లవ్ ట్రాక్ తో ప్లెజెంట్ గా వెళ్తుంది. ఇంటర్వెల్ నుంచి పెళ్లి ఇంట జరిగే సందడి మిమ్మల్ని హిలేరియస్ గా నవ్విస్తుంది. వెన్నెల కిషోర్ సెకండాఫ్ లో బాగా నవ్విస్తాడు.కథేంటంటే..రామరాజు(సాయి కుమార్)కి అతని కొడుకు కార్తిక్(చేతన్ కృష్ణ)అంటే చాలా ఇష్టం. కొడుకు సంతోషం కోసం ఏ పనైనా చేస్తాడు. అన్ని విషయాలు కొడుకుతో చర్చించుకుంటాడు. కార్తిక్ కూడా అంతే. నాన్నను చాలా ప్రేమిస్తాడు. అమ్మా నాన్న, స్నేహితులే ప్రపంచంగా బతుకున్న కార్తిక్ జీవితంలోకి సుహానా(హెబ్బా పటేల్) వస్తుంది. ఇద్దరు ఒకరినొకరు ఇష్టపడతారు. ఇంట్లో వాళ్లకి చెప్పి పెళ్లి చేసుకోవాలనుకుంటారు. అప్పుడు ఇరు కుటుంబాల్లో కొన్ని సమస్యలు వస్తాయి. అవేంటి? కార్తిక్, సుహానా కుటుంబాల మధ్య ఉన్న వైరం ఏంటి? తండ్రి కోసం కార్తిక్ చేసిన తప్పేంటి? అంతకు ముందు కొడుకు కోసం రామరాజు చేసిన మిస్టేక్ ఏంటి? ఆ తప్పు కారణంగా సుహాన ఫ్యామిలీ పడిన ఇబ్బందులు ఏంటి? ఈ కథలో వెన్నెక కిశోర్ పాత్ర ఏంటి అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. -
19 ఏళ్ల వయసు..అలా చూపిస్తేనే థియేటర్‌కి వస్తారన్నాడు: హీరోయిన్
సినిమా అనేది రంగుల ప్రపంచం. ప్రతి ఒక్కరు ఎంతో ఆశతో ఇండస్ట్రీలోకి వస్తారు. అవకాశాల కోసం ఎదురు చూసి..చాన్స్ వచ్చినప్పుడే తమను తాము నిరూపించుకుంటారు. ఇప్పుడు పై స్థాయిలో ఉన్నవారంతా ఒకప్పుడు ఎన్నో అవమానాలు, బాధలు భరించి వచ్చినవాళ్లే. ముఖ్యంగా హీరోయిన్లు అయితే చాలా ‘ఇబ్బందులను’ ఎదుర్కొవాల్సి వస్తోంది. అవకాశాల పేరుతో మోసం చేసేవాళ్లు కొంతమంది అయితే.. అవకాశం ఇచ్చి అవమానించే వారు మరికొంతమంది. ఇలాంటి వాళ్లను తట్టుకొనే ఈ స్థాయికి వచ్చానని అంటోంది గ్లోబల్ నటి ప్రియాంక చోప్రా(Priyanka Chopra). తన కెరీర్ ప్రారంభంలో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నానని, 19 ఏళ్ల వయసులోనే ఓ డైరెక్టర్ తన గురించి చెడుగా ప్రవర్తించాడని, ఆయన అన్న మాటలకు డిప్రెషన్లోకి వెళ్లాని చెప్పింది. నీచంగా మాట్లాడాడుతాజాగా జరిగిన ఫోర్బ్స్ పవర్ ఉమెన్స్ సమ్మిట్‌లో ప్రియాంక పాల్గొని కెరీర్ ప్రారంభంలో తనకు ఎదురైన అవమానాల గురించి చెప్పుకొచ్చింది. ‘19 ఏళ్ల వయసులో నేను ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాను. అప్పటికే చిత్ర పరిశ్రమలో ఎలా ఉంటారో కూడా తెలియదు. ఓ సినిమా కోసం సెట్లోకి వెళ్లాను. దర్శకుడిని కలిసి ఇప్పుడు నాకు ఎలాంటి దుస్తులు కావాలో ఒక్కసారి మా కాస్ట్యూమ్ డిజైనర్‌కి చెప్పండి’ అని అడిగాను. అతను నా ముందే స్టైలిస్ట్ ఫోన్ చేసి నీచంగా మాట్లాడాడు.అలాంటి దుస్తులే వేసుకోవాలిఆ డైరెక్టర్ నా స్టైలిస్ట్‌కి ఫోన్ చేసి.. ‘హీరోయిన్ లోదుస్తులు చూపిస్తేనే ప్రేక్షకులు థియేటర్‌కి వస్తారు. కాబట్టి ప్రియాంక ధరించే దుస్తులు చాలా చిన్నవిగా ఉండాలి. తన లోదుస్తులు కనిపించాలి. తను కూర్చోగానే లోదుస్తులు కనిపించాలి.. అంటూ పదే పదే ఆ పదాన్నే ఉపయోగించాడు. హిందీలో ఆ మాటలు విన్నప్పడు నీచంగా అనిపించిది. చాలా బాధ కలిగింది. డిప్రెషన్లోకి వెళ్లాను. మా అమ్మ దగ్గరకు వెళ్లి అతడు నన్ను అంత చిన్నచూపు చూస్తే నేను ఎప్పటికీ ఎదగలేను అని చెప్పేశాను. ఆ మరుసటి రోజే వెళ్లి నేను ఈ సినిమా చేయలేనని చెప్పాను. ఇప్పటికీ ఆ దర్శకుడితో నేను కలిసి పని చేయలేదు. నన్ను ఎలా చూపించుకోవాలని అనేది నా ఛాయిస్. దృష్టికోణం అనేది నిజం. నేను ఎలాంటి దృష్టితో చూస్తానో అదే నా ఐడెంటిటీగా మారుతుంది’ అని ప్రియాంక చెప్పుకొచ్చింది.మహేశ్‌కి జోడీగాబాలీవుడ్లో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన ప్రియాంక..పెళ్లి తర్వాత హాలీవుడ్‌కి తన మకాంని మార్చింది. 'క్వాంటికో' టెలివిజన్ సిరీస్‌తో హాలీవుడ్లో మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఆ తర్వాత బేవాచ్, ఏ కిడ్ లైక్ జాక్,లవ్ అగైన్,టైగర్, వుయ్ కెన్ బీ హీరోస్, ది వైట్ టైగర్ తదితర చిత్రాలలో నటించి అక్కడ అగ్ర హీరోయిన్ల లిస్ట్‌లో చేరిపోయింది. ఈ గ్లోబల్ బ్యూటీ ప్రస్తుతం రాజమౌళి-మహేశ్‌బాబు కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రంలో హీరోయిన్గా నటిస్తోంది. -
కొత్త హీరోయిన్‌కు ఆతిథ్యం ఇచ్చిన ప్రభాస్
టాలీవుడ్ డార్లింగ్ ప్రభాస్ భోజన ప్రియుడు అనే విషయం తెలిసిందే. సినిమా షూటింగ్లో ఆయన ఉన్నారంటే చాలు.. అక్కడ ఉన్న వారందరికీ భోజన ఏర్పాట్లను ప్రభాసే చూసుకుంటారు. ఈ క్రమంలో ఆయన ఇచ్చే ఆతిథ్యం గురించి ఇండస్ట్రీలోని స్టార్స్ అందరూ చాలా గొప్పగా చెప్పుకుంటారు. పాన్ ఇండియా స్టార్‌గా ఆయన ఎదిగినప్పటికీ చిత్ర యూనిట్ వారికి ఆతిథ్యమివ్వడం మాత్రం వదిలిపెట్టలేదు. ప్రభాస్ ఇంటి భోజనమంటే బాలీవుడ్ స్టార్స్ కూడా లొట్టలేసుకుని ఆరగించేస్తారు. అయితే, తాజాగా తన హీరోయిన్‌కు ప్రభాస్ ఇంటి నుంచి క్యారేజీ వెళ్లింది. ఇదే విషయాన్ని ఆమె తన ఇన్‌స్టా స్టోరీస్‌లో పోస్ట్ చేసింది.ఢిల్లీ బ్యూటీ ఇమాన్వీకి ప్రభాస్ ఆతిథ్యం ఇచ్చారు. తన ఇంటి నుంచి ఆమెకు క్యారేజీ పంపారు. భోజనం చాలా బాగుంది అంటూ ఆమె ఒక వీడియోను తన ఇన్‌స్టా స్టోరీస్‌లో పోస్ట్ చేసింది. ప్రభాస్ (Prabhas) హీరోగా.. హను రాఘవపూడి దర్శకత్వంలో (Hanu) ఓ పీరియాడికల్ యాక్షన్ డ్రామా సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ వారు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ పూజా కార్యక్రమం జరిగింది. షూటింగ్ పనులు కూడా ప్రారంభమయ్యాయి. భారీ బడ్జెట్‌తో తెరకెక్కనున్న ఈ చిత్రానికి 'ఫౌజీ' (Fauji) అనే టైటిల్‌ను ఫిక్స్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి.ఈ భారీ ప్రాజెక్ట్‌తోనే ఇమాన్వీ ఎస్మాయిల్ హీరోయిన్గా ఎంట్రీ ఇస్తుంది. ఇన్స్టాగ్రామ్ స్టార్‌గా నెటిజన్లకు ఆమె సుపరిచితురాలు. ఇన్‌స్టాలో ఆమె డ్యాన్స్ రీల్స్‌కు చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. అలా ఆమెకు సినిమా అవకాశం దక్కింది. ఈ సినిమానే ఆమెకు తొలి ప్రాజెక్ట్ కావడం విశేషం. కొత్త హీరోయిన్లకు కూడా ప్రభాస్ ఆతిథ్యం ఇవ్వడంతో ఆయన అభిమానులు సంతోషిస్తున్నారు. ఆయన ఎంత రేంజ్‌కు చేరుకున్నా కూడా ఇలాంటి విషయంలో ఏంత మాత్రం తగ్గడంటూ ప్రశంసిస్తున్నారు. View this post on Instagram A post shared by Imanvi (@imanvi1013) -
Artiste: చూస్తు చూస్తు చూస్తు నిన్నే చూస్తుండిపోయా
సంతోష్ కల్వచెర్ల, క్రిషేక పటేల్ జంటగా నటిస్తున్న సినిమా "ఆర్టిస్ట్"(Artiste Movie). ఈ సినిమాను ఎస్ జేకే ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై జేమ్స్ వాట్ కొమ్ము నిర్మిస్తున్నారు. రతన్ రిషి దర్శకత్వం వహిస్తున్నారు. "ఆర్టిస్ట్" మూవీ త్వరలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ రోజు ఈ సినిమా నుంచి 'చూస్తు చూస్తు..' పాటను విడుదల చేశారు.'చూస్తు చూస్తు..' పాటను మ్యూజిక్ డైరెక్టర్ సురేష్ బొబ్బిలి బ్యూటిఫుల్ ట్యూన్ తో కంపోజ్ చేయగా.. రాంబాబు గోసాల క్యాచీ లిరిక్స్ అందించారు. కపిల్ కపిలన్ ఆకట్టుకునేలా పాడారు. చూస్తు చూస్తు పాట ఎలా ఉందో చూస్తే...'చూస్తు చూస్తు చూస్తు నిన్నే చూస్తుండిపోయా, చూస్తు చూస్తు నేనే నీవై పోయా, చూస్తు చూస్తు నువ్వే చేశావే మాయ...చూస్తు గుండెల్లోనే దాచా చెలియా..' అంటూ హీరో హీరోయిన్స్ మధ్య సాగే అందమైన ఈ పాటను హోలీ పండుగ నేపథ్యంలో కలర్ ఫుల్ గా పిక్చరైజ్ చేశారు. -
టాలీవుడ్లో విషాదం.. 'మడత కాజా' నిర్మాత మృతి
టాలీవుడ్ ప్రముఖ నిర్మాత వేదరాజు టింబర్ (54) (Vedaraju Timber) కన్నుమూశారు. గతంలో ఆయన నిర్మాతగా పలు చిత్రాలను నిర్మించడమే కాకుండా కనస్ట్రక్షన్ రంగంలో కూడా రాణించారు. అయితే, కొంత కాలంగా సినిమాలకు ఆయన దూరంగా ఉంటున్నారు. ఊపిరితిత్తుల సంబంధిత సమస్యలతో బాధపడుతున్న వేదరాజు కొన్ని నెలల క్రితం చికిత్స కోసం హైదరాబాద్ ఏఐజీ ఆసుపత్రిలో చేరారు. కానీ, ఆయన ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించడంతో శుక్రవారం ఉదయం మరణించారు.కొంత కాలంగా సినిమాలకు బ్రేక్ ఇచ్చిన ఆయన కనస్ట్రక్షన్ రంగంలో బిజీగా ఉన్నారు. మళ్లీ చిత్ర రంగంలో రీఎంట్రీ ఇద్దాం అనే ఆలోచనలతో ఇప్పటికే పలు కథలను కూడా ఆయన రెడీ చేసుకున్నారు. వేదరాజు టింబర్ నెక్ట్స్ ప్రొడక్షన్ పేరుతో టీమ్‌ను కూడా రెడీ చేసుకున్నారు. అయితే, ఇంతలో ఇలా జరుగడంతో చిత్ర పరిశ్రమలో విషాద ఛాయలు అలుముకున్నాయి. హీరో అల్లరి నరేష్‌తో ‘మడత కాజా’ చిత్రంతో పాటు 'సంఘర్షణ' అనే మరోసినిమాను ఆయన నిర్మించారు. వేదరాజుకు భార్య, కూతురు ఉన్నారు. ఆయన మృతి పట్ల సన్నిహితులతో పాటు పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. ఆయన అంత్యక్రియలు శుక్రవారం సాయింత్రం జరగనున్నాయని కుటుంబసభ్యులు తెలిపారు. -
ఓటీటీలో రూ. 7 వేల కోట్ల ప్రాఫిట్ సినిమా
మోనా ఫ్రాంచైజీలో భాగంగా విడుదలైనా సీక్వెల్ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. మోనా-2 టైటిల్‌తో గతేడాదిలో నవంబర్ 27న ఈ చిత్రం విడుదలైంది. తాజాగా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. యానిమేటెడ్ అడ్వెంచర్ థ్రిల్లర్‌గా ఈ మూవీని డేవిడ్ డెరిక్ జూనియర్, జాసన్ హ్యాండ్, డానా లెడౌక్స్ మిల్లర్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం ముఖ్యంగా చిన్నపిల్లలను బాగా ఆకట్టుకుంది. సుమారు రెండు నెలల తర్వాత ఈ యానిమేటెడ్ థ్రిల్లర్ ఇండియాలో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతుండటంతో నెట్టింట వైరల్ అవుతుంది.అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతున్న మోనా 2 చిత్రాన్ని చూడాలంటే రెంట్ చెల్లించాల్సి ఉంటుంది. ఈ యానిమేటెడ్ మ్యూజికల్ అడ్వెంచర్ కోసం రూ. 389 చెల్లించాలని మేకర్స్ ప్రకటించారు. మోనా 2 (Moana 2) చిత్రాన్ని సుమారు రూ.1300 కోట్ల బడ్జెట్‌తో వాల్ట్ డిస్నీ యానిమేషన్ స్టూడియోస్ నిర్మించింది. అయితే, ఈ చిత్రం కేవలం 50 రోజుల్లోనే వరల్డ్ బాక్సాఫీస్ వద్ద రూ. 8500 కోట్లు రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. హాలీవుడ్లో అత్యధిక కలెక్షన్స్ సాధించిన టాప్ చిత్రాల లిస్ట్‌లో మోనా2 చేరిపోయింది. ఈ చిత్రం సుమారుగా రూ. 7000 కోట్లకు పైగానే లాభాలను గడించింది.మోనా2 మూవీలో డ్వేన్ జాన్సన్‌తో పాటు ఔలీ క్రావాలో, టెమూరా మోరిసన్, నికోల్ షెర్జింగర్ వంటి వారు తమ పాత్రలతో మరోసారి ప్రేక్షకులను మెప్పించారు. 2016లో వచ్చిన మోనా మూవీకి సీక్వెల్‌గా మోనా 2 చిత్రాన్ని తెరకెక్కించారు. సినిమాకు కాస్త మిక్సిడ్ టాక్ వచ్చినప్పటికీ బాక్సాఫీస్ వద్ద మాత్రం భారీ కలెక్షన్స్‌తో దుమ్మురేపింది. రెంటల్ కాకుండా ఉచితంగా ఈ చిత్రాన్ని అమెజాన్‌లో చూడాలంటే మార్చి 25 వరకు వేచి ఉండాల్సిందే. హాట్‌స్టార్‌లో తెలుగు వర్షన్ కూడా అదే సమయంలో రిలీజ్ కావచ్చు. -
Madha Gaja Raja Review: ‘మదగజరాజా’ మూవీ రివ్యూ
టైటిల్: మదగజరాజానటీనటులు:విశాల్, సంతానం, వరలక్ష్మి, అంజలి, శరత్ సక్సేనా, సోనూ సూద్, మణివణ్ణన్ (లేట్), నితిన్ సత్య, సడగొప్పన్ రమేష్, ఆర్. సుందర్ రాజన్, మొట్టా రాజేంద్రన్, మనోబాలా (లేట్), స్వామినాథన్, జాన్ కొక్కెన్, టార్జాన్, విచ్చు విశ్వనాథ్ తదితరులునిర్మాణ సంస్థ: జెమినీ ఫిల్మ్ సర్క్యూట్కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సుందర్ సితెలుగు విడుదల: సత్యకృష్ణన్ ప్రొడక్షన్స్సంగీతం: విజయ్ ఆంటోనిఎడిటర్: శ్రీకాంత్ ఎన్.బి.విడుదల తేది: జనవరి 31, 2025తమిళ స్టార్ విశాల్ 12 ఏళ్ల క్రితం నటించిన చిత్రం ‘మదగజరాజా’(Madha Gaja Raja ). కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ సినిమా విడుదల వాయిదా పడుతూ.. ఈ ఏడాది జనవరి 12 తమిళ్లో రిలీజై పెద్ద విజయం సాధించింది. చాలా కాలం తర్వాత విశాల్ సినిమా రూ. 50 కోట్ల కలెక్షన్స్‌ని రాబట్టింది. అయితే సంకాంత్రి బరిలో పెద్ద చిత్రాలు ఉండడంతో తెలుగులో రిలీజ్ కాలేదు. ఇప్పుడు అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని నేడు(జనవరి 31) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తమిళ్ మాదిరే ఇక్కడ కూడా ఈ మూవీ సూపర్ హిట్‌గా నిలిచిందా? మదగజరాజా తెలుగు ప్రేక్షకులను మెప్పించాడా లేదా? రివ్యూలో చూద్దాం.కథేంటంటే..?అరకు చెందిన మదగజరాజా( అలియాస్ ఎంజీఆర్(విశాల్)(Vishal) ఓ కేబుల్ ఆపరేటర్. తండ్రి స్థానిక పోలీసు స్టేషన్లో ఎస్సై. తండ్రికి తోడుగా ఉంటూ.. ఊర్లోనే ఉంటుంటాడు. ఓ కేసు విషయంలో అరకు వచ్చిన అగ్గిపెట్ట ఆంజనేయులు కూతురు మాధవి(అంజలి)ని చూసి తొలి చూపులోనే ప్రేమలో పడిపోతాడు. మాధవి కూడా ఎంజీఆర్‌ని ప్రేమిస్తుంది. కానీ ఓ కారణంగా ఆమె తండ్రితో కలిసి అరకు నుంచి వెళ్లిపోతుంది(Madha Gaja Raja Review)రాజా ఈ బాధలో ఉండగానే.. తన కూతురు పెళ్లికి రావాలంటూ చిన్నప్పుడు స్కూల్లో పాఠాలు చెప్పిన మాస్టార్ నుంచి ఫోన్ కాల్వస్తుంది. ఈ పెళ్లి వేడుకలో బాల్య స్నేహితులంతా కలుస్తారు. పెళ్లి అనంతరం తిరిగి వెళ్లే క్రమంలో తన స్నేహితులకు ఏవో సమస్యలు ఉన్నట్లు రాజాకు తెలుస్తుంది. ఈ సమస్యలకు మీడియా బలంతో పాటు రాజకీయ పలుకుబడి ఉన్న కాకర్ల విశ్వనాథ్(సోనూసూద్) కారణమని తెలిసి రాజా హైదరాబాద్ వస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది? మీడియాను అడ్డుపెట్టుకొని కాకర్ల ఎలాంటి అక్రమాలకు పాల్పడ్డాడు? తన స్నేహితులకు కాకర్ల చేసిన మోసం ఏంటి? చివరకు తన స్నేహితుల సమస్యలను తీర్చాడా లేదా? ఈ కథలో మాయ(వరలక్ష్మి శరత్ కుమార్) పాత్ర ఏంటి అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే.. ఈ సినిమా ఇప్పుడు తెరకెక్కించింది కాదు. 12 ఏళ్ల క్రితమే రూపొందింది. అప్పటికి ఇప్పటికీ వెండితెరపై చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. ప్రేక్షకుల మైండ్‌సెట్ కూడా మారిపోయింది. డిఫరెంట్ కంటెంట్, కొత్త పాయింట్ ఉన్న చిత్రాలనే ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. ఇలాంటి తరుణంలో మళ్లీ పాత సినిమాలను గుర్తు చేసింది మదగజరాజా. కథ, కథనంలో ఎలాంటి కొత్తదనం లేదు. కమర్షియల్ ఫార్మాటులో సినిమాలు తీయడంలో స్పెషలిస్ట్ అయిన సుందర్ సి. ఈ సినిమాను కూడా అదే పంథాలో తెరకెక్కించాడు. లాజిక్స్‌ని పట్టించుకోకుండా ఓన్లీ కామెడీని నమ్ముకొని ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. అదే సినిమాను నిలబెట్టింది. రొటీన్ కథే అయినప్పటికీ ఈ సినిమాలోని కామెడీ సన్నివేశాలను ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తారు. ముఖ్యంగా హీరో స్నేహితుడుగా సంతానం పండించిన కామెడీ థియేటర్స్‌లో నవ్వులు పూయిస్తుంది. కొన్ని చోట్ల కామెడీ కోసం వాడే సంబాషణలు ఇబ్బందికరంగా ఉన్నా.. ఓ వర్గం ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారు.కథగా చెప్పాలంటే ఇది చాలా చిన్న సినిమా. రాష్ట్ర రాజకీయాలను శాసించే ఓ వ్యక్తిని సామాన్యుడు ఎలా ఢీ కొట్టాడు అనేది ఈ సినిమా కథ. స్నేహితుల కష్టాలను తీర్చడం కోసం హీరో రంగంలోకి దిగడం కూడా పాత పాయింటే. అయితే అసలు స్టోరీ అంతా సెకండాఫ్‌లోనే ఉంటుంది. ఫస్టాఫ్‌లో అసలు కథేమి ఉండదు. కానీ ఎక్కడా బోర్ కొట్టదు. దానికి కారణం సంతానం పండించిన కామెడీనే. సంతానం వేసిన ప్రతి పంచ్ థియేటర్స్‌లో నవ్వులు పూయిస్తుంది. కొన్ని చోట్ల శ్రుతిమించినట్లు అనిపించినా సంతానం ట్రాక్‌ని బాగా ఎంజాయ్ చేస్తారు. ఇక సెకండాఫ్‌ని సీరియస్‌గా మార్చే అవకాశం ఉన్నా.. మళ్లీ కామెడీనే నమ్ముకున్నాడు దర్శకుడు. కాకర్లను బురిడీ కొట్టించేందుకు హీరో చేసే పనులు వాస్తవికానికి దూరంగా ఉంటాయి. మంత్రి సత్తిబాబు డెడ్‌బాడీతో హీరో, అతని గ్యాంగ్ చేసే హంగామా నవ్విస్తుంది. అయితే ఇవన్నీ సన్నివేశాలుగా చూస్తేనే బాగుంటుంది. కానీ కథగా చూస్తే అతికినట్లుగా అనిపిస్తుంది. సీన్ టు సీన్ కంటిన్యుటీ ఉండదు. ఫస్టాఫ్ కథకి సెకండాఫ్ కథకి సంబంధమే ఉండదు. ఇలాంటి లాజిక్స్‌కి పట్టించుకోకుండా కొంచెం అతి అయినా పర్లేదు భరిస్తామని అనుకుంటే.. ఈ చిత్రం మిమ్మల్ని అలరిస్తుంది. ఎవరెలా చేశారంటే..మాస్ యాక్షన్ సినిమాలు విశాల్‌కి కొత్తేమి కాదు. కెరీర్ ప్రారంభం నుంచి ఈ తరహా పాత్రలు చేస్తూనే ఉన్నాడు. మదగజరాజాలోనూ మరోసారి మాస్ పాత్రనే పోషించాడు. యాక్షన్‌తో పాటు కామెడీ కూడా బాగానే పండించాడు. ఈ చిత్రం కోసం ఓ పాటను కూడా ఆలపించాడు. తెరపై ఆయన చేసే కొన్ని పోరాట ఘట్టాలు ఆకట్టుకుంటాయి. ఇక వరలక్ష్మీ శరత్ కుమార్, అంజలీ ఇద్దరూ తెరపై అందాలు ఆరబోయడంలో పోటీ పడ్డారు. వారిద్దరి పాత్రలకు పెద్దగా ప్రాధాన్యత లేకపోయినా.. గ్లామర్ పరంగా మాత్రం మంచి మార్కులు కొట్టేశారు. సోనూసూద్ తనకు అలవాటైన విలన్ పాత్రలో ఒదిగిపోయాడు. తెరపై స్టైలీష్‌గా కనిపించాడు. సంతానం కామెడీ ఈ సినిమాకు చాలా ప్లస్ అయింది. ఆయన పండించిన కామెడీ మాస్ ప్రేక్షకులను అలరిస్తుంది. మనోబాలతో పాటు మిగిలిన నటీటనులు తమ పాత్రల పరిధిమేర నటించారు.సాంకేతికంగా సినిమా పర్వాలేదు. విజయ్ ఆంటోనీ అందించిన నేపథ్య సంగీతం, పాటలు 12 ఏళ్ల క్రితం వచ్చిన మాస్ కమర్షియల్ సినిమాలను గుర్తు చేస్తాయి. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ పర్వాలేదు. డబ్బింగ్ విషయంలో ఇంకాస్త జాగ్రత్తలు తీసుకోవాల్సింది. తెరపై ఒకచోట తమిళ పేర్లు..మరోచోట తెలుగు పేర్లు కనిపిస్తాయి. విశాల్‌తో సహా అందరి పాత్రలకు వేరేవాళ్లతో డబ్బింగ్ చెప్పించారు. విజువల్స్‌గా సినిమా బాగుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. -
బరువు తగ్గాలంటే..? సింపుల్‌గా ఈ చిట్కాలు పాటించండి: అక్షయ్ కుమార్
ఈమధ్య పదేళ్లలోపు పిల్లలు కూడా ఊబకాయం బారిన పడటం చూస్తున్నాం. ఊబకాయం వల్ల మధుమేహం, అధిక రక్తపోటు, గుండెజబ్బులు వంటి సమస్యలు చుట్టుముట్టేస్తున్నాయి. దీంతో మానసిక, భావోద్వేగ ఆరోగ్యం మీదా అధికబరువు ప్రభావం చూపుతుంది. దేశంలో చాలామంది ఇలాంటి ఆందోళన సమస్యలతోనూ సతమతమవుతుంటారు. ఇదే అంశం గురించి తాజాగా ప్రధాని మోదీ పలు వ్యాఖ్యలు చేశారు. దేశంలో ఊబకాయంతో బాధపడేవారి సంఖ్య పెరుగుతోందని ఉత్తరాఖండ్ పర్యటనలో అన్నారు. ఫిట్‌నెస్‌పై అందరూ దృష్టిసారించాలని ఆయన పిలుపునిచ్చారు. ఊబకాయం చాలా వ్యాధులకు మూలం అని ఆయన గుర్తు చేశారు. (ఇదీ చదవండి: నటి శోభన పెళ్లెందుకు చేసుకోలేదంటే..?)స్థూలకాయంతో బాధపడుతున్న వారి సంఖ్య దేశంలో బాగా పెరిగిపోతోందని, ఇది గుండె, మధుమేహం వంటి సమస్యలకు దారి తీయవచ్చని మోదీ అన్నారు. ‘ఫిట్ ఇండియా’ ఉద్యమం ద్వారా దేశంలోని నేటి యువత ఫిట్నెస్, ఆరోగ్యకరమైన జీవనశైలి గురించి పలు వ్యాఖ్యలు చేశారు. మోదీ (Narendra Modi) చేసిన ప్రసంగాన్ని ‘ఎక్స్’ వేదికగా బాలీవుడ్ ప్రముఖ నటుడు అక్షయ్ కుమార్ (Akshay Kumar) రీపోస్టు చేస్తూ.. మోదీపై ప్రశంసలు కురిపించారు. ఆపై బరువు తగ్గుదాం అనుకునే వారికి కొన్ని చిట్కాలను కూడా ఇచ్చారు.'ప్రధాని మోదీ చెబుతున్నట్లుగా ఊబకాయం వల్ల చాలా జబ్బులు వస్తాయి. ప్రధాని మోదీ చెప్పింది ముమ్మాటికి వాస్తవం. ఇదే విషయాన్ని చాలా ఏళ్ల నుంచి నేను కూడా చెబుతూనే ఉన్నాను. ప్రస్తుతం మోదీనే ఇదే విషయం చెప్పడంతో చాలామందికి రీచ్ అవుతుంది. దేశ ప్రజలు ఆరోగ్యంగా ఉండాలని ఆయన ఆశిస్తున్నారు. ఊబకాయం నుంచి మనం బయటపడాలంటే సరిపడ నిద్రదో పాటు స్వచ్ఛమైన గాలి తీసుకోవాలి ఉండాలి. సూర్యరశ్మి సమయంలో మనం అడుగులు వేయాలి. మన వంటకాల్లో తక్కువ నూనె వాడకం ఉండేలా చూసుకోవాలి. ఆపై దేశీ నెయ్యి విరివిగా వినియోగించాలి. ఊబకాయంతో పోరాడే దేశ ప్రజలందరికీ ఇవే పెద్ద ఆయుధాలుగా ఉపయోగపడుతాయి. ప్రతి ఒక్కరు మీ జీవితంలో వ్యాయామాన్ని భాగం చేసుకోండి. కచ్చితంగా రోజూ చేసేలా ప్లాన్ చేసుకోండి. ముమ్మాటికి ఈ విషయాన్ని నమ్మండి. ఈ చిట్కాలతో స్థూలకాయం నుంచి బయటపడొచ్చు.' అని అక్షయ్ తెలిపారు.How true!! I’ve been saying this for years now…love it that the PM himself has put it so aptly. Health hai toh sab kuchh hai. Obesity se fight karne ke sabse bade hathiyaar 1. Enough sleep2. Fresh air and Sunlight3. No processed food, less oil. Trust the good old desi ghee… pic.twitter.com/CxnYjb4AHv— Akshay Kumar (@akshaykumar) January 30, 2025 -
పెళ్లి వద్దనుకుని 'కళార్పణ'కు అంకితమైన శోభన
అలనాటి అగ్రతార శోభన బహుముఖ ప్రజ్ఞాశాలి. అంతేకాకుండా బహు భాషా నటి కూడా.. బాలనటిగా సినీ రంగప్రవేశం చేసిన ఆమె తెలుగులో హీరోయిన్గా నాగార్జున నటించిన ‘విక్రమ్’ సినిమాతో పరిచయం అయింది. ఆమె నటి మాత్రమే కాదు.. అద్భుతమైన క్లాసికల్ డ్యాన్సర్ కూడా.. లెక్కలేనన్ని ప్రదర్శనలు కూడా ఆమె ఇచ్చారు. తెలుగుతో పాటు తమిళ, మలయాళంలో సుమారు 400కు పైగా చిత్రాల్లో నటించిన శోభన కళారంగంలో చేసిన సేవలకు గానూ తాజాగా కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్(Padma Bhushan) పురస్కారాన్ని ప్రకటించింది. ఈ సందర్భంగా ఆమెకు సంబంధించిన పలు విషయాలు తెరపైకి వస్తున్నాయి. ప్రస్తుతం శోభన వయసు 54 ఏళ్లు. అయినా, ఆమె ఎందుకు పెళ్లి చేసుకోలేదనే ప్రశ్న చాలామందిలో కలుగుతుంది.తెలుగులో టాప్ హీరోలతో సినిమాలునాట్యంలోనూ, నటనలోనూ ప్రసిద్ధి చెందిన లలిత, పద్మిని, రాగిణిల మేనకోడలైన శోభన.. 1985లో నాగార్జున తొలి చిత్రం 'విక్రమ్'లో హీరోయిన్గా తెలుగు తెరకు పరిచయం అయ్యారు. చిరంజీవితో రౌడీ అల్లుడు,రుద్రవీణ బాలకృష్ణతో మువ్వగోపాలుడు, నారీనారీ నడుమమురారి ఆపై మోహన్ బాబుతో అల్లుడుగారు, రౌడీగారి పెళ్ళాం చిత్రాల్లో నటించింది. అభినందన,కోకిల, ఏప్రిల్ 1 విడుదల,దళపతి,రక్షణ,త్రిమూర్తులు లాంటి ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించి ప్రేక్షకుల్ని అలరించారు. ఇటీవలే ప్రభాస్ 'కల్కి' చిత్రంలో నటించిన శోభన చాలామందిని ఆకట్టుకున్నారు. తెలుగుతో పాటు మలయాళ, తమిళ, హిందీ చిత్రాల్లో నటించింది. చంద్రముఖి (రజనీకాంత్) చిత్రానికి మూలమైన మలయాళ చిత్రం ‘మణిచిత్రతాఝు’లో అద్భుతంగా నటించి ఉత్తమ నటిగా జాతీయ స్థాయిలో నిలిచారు.'కళార్పణ' పేరుతో శిక్షణ.. పెళ్లికి ఎందుకు నో చెప్పారంటేశోభన చాలా ఏళ్ల క్రితం నుంచే నటన కంటే నాట్యానికే అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. 1994లో 'కళార్పణ' అనే సంస్థకు ఆమె అంకురార్పణ చేశారు. ఈ సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం భరతనాట్యంలో శిక్షణ, భారతదేశమంతటా నృత్యవార్షికోత్సవాలు నిర్వహించడం. అదే విధంగా పలువురు పేద విద్యార్థులకు ఉచితంగా నాట్యంలో శిక్షణ ఇస్తున్నారు. నేటి తరానికి చెందిన ఎందరో కళాకారిణులు ఈమె దగ్గర నటనలోను, నాట్యంలోను శిక్షణ తీసుకుంటున్నారు. ఈమె సేవలకు గాను 2006లో అబ్దుల్ కలాం చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డును అందుకున్నారు. కాగా ఇటీవల కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ అవార్డును ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా నటన, నాట్యం కళారంగంలో విశేష సేవలందిస్తున్న శోభన వయసు 54 ఏళ్లు. కాగా ఈ గొప్ప నట కళాకారిణి అవివాహిత కావడం గమనార్హం. పెళ్లి ఎందుకు చేసుకోలేదన్న ప్రశ్నకు శోభన బదులిస్తూ తనకు పెళ్లి చేసుకోవడంలో ఇష్టం లేదని, వివాహ బంధంపై నమ్మకం లేదని చెప్పారు. ఈ జీవితమే సంతోషంగా ఉందని నటి శోభన పేర్కొన్నారు. -
హాలీవుడ్ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్!
ఓటీటీలో ఇది చూడొచ్చు అనేప్రాజెక్ట్స్ చాలా ఉంటాయి. ప్రస్తుతం స్ట్రీమ్ అవుతున్న వాటిలో హాలీవుడ్ చిత్రం బ్యాక్ ఇన్ యాక్షన్(Back in Action) ఒకటి. ఈ చిత్రం గురించి తెలుసుకుందాం.హాలీవుడ్ సినిమాలన్నీ ఏదైనా ఒక జోనర్‌కి సంబంధించనవి మాత్రమే ఎక్కువగా ఉంటాయి. అలాంటిది ఓ యాక్షన్ జోనర్‌ని ఫ్యామిలీతో కలిపి హాలీవుడ్లో సినిమా రావడమంటే అదో వింత. అదే ‘బ్యాక్ ఇన్’ యాక్షన్ సినిమా. నెట్‌ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమ్ అవుతోంది. తెలుగు వెర్షన్ కూడా లభ్యమవుతోంది. ఈ సినిమాకి సేత్ గార్డన్ దర్శకుడు . కేమరన్ డియాజ్, జెమీ ఫాక్స్ వంటి ప్రముఖ నటులతో పాటు జేమ్స్ బాండ్ సినిమాలలో సుపరిచితురాలైన గ్లెన్ క్లోజ్ ఈ సినిమాలో ఓ ప్రత్యేక పాత్రలో కనిపించడం విశేషం. ఇక కథ విషయానికొస్తే... అమెరికాలోని ప్రముఖ సీఐఎ సంస్థలో ప్రతినిధులుగా పని చేస్తున్న ఎమిలీ, మాట్ ప్రేమించుకుంటుంటారు. వారి ప్రేమకు ఫలితంగా ఎమిలీ గర్భవతి అవుతుంది. ఆ విషయాన్ని ఓ ఆపరేషన్‌లో భాగంగా మాట్కు చెబుతుంది ఎమిలీ. ఆ ఆపరేషన్ ఏంటంటే ప్రపంచంలోని ప్రముఖ పారిశ్రామిక, వాణిజ్య మరియు ప్రభుత్వ అధికార యంత్రాంగానికి సంబంధించిన ఓ డేటా డ్రైవ్‌ను తీసుకురావడం. ఈ దశలో ఇద్దరూ ఓ ఘోర విమాన ప్రమాదం నుండి తప్పించుకుంటారు. అలా తప్పించుకున్నవాళ్లు ఇక ప్రపంచానికి తమ ఉనికి తెలియకుండా దూరంగా పుట్టబోయే పిల్లలతో సంతోషంగా ఉండాలనుకుంటారు. అందుకే వాళ్లిద్దరూ 12 ఏళ్ళ దాకా అటు సీఐఎకి ఇటు ప్రపంచానికి తమ అసలు ఉనికి తెలియకుండా జాగ్రత్త పడతారు. ఈ 12 ఏళ్లలో వాళ్లకి ఇద్దరు పిల్లలు పుడతారు. తమ పిల్లలకు కూడా తమ అసలు ఐడెంటిటీ తెలియనివ్వరు. అయితే ఏ ఆపరేషన్ కోసం వీళ్లిద్దరూ అజ్ఞాతానికి వచ్చారో ఆ ఆపరేషన్ వల్లే మళ్లీ కథ మొదలవుతుంది. ఆ ఆపరేషన్‌లో శత్రువులకు దొరకకుండా ఉండాలని మాట్ తనతో పాటు ఆ డేటా డ్రైవ్‌ని ఎమిలీకి కూడా తెలియకుండా దాస్తాడు. ఆ డ్రైవ్ కోసం విలన్స్ వీళ్లిద్దరినీ మళ్లీ ట్రాక్ చేసి ఎటాక్ చేస్తారు. మరి విలన్స్ ఆ డ్రైవ్ చేజిక్కించుకుంటారా? తమ పిల్లలకు, సమాజానికి తమ ఐడెంటీటీని దాచి పెట్టిన ఎమిలీ, మాట్ విలన్స్ ఎటాక్ నుండి తప్పించుకున్నారా? లేదా అన్నది సినిమాలోనే చూడాలి. పైన చెప్పుకున్నట్టు ఇదో చక్కటి ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్. మంచి స్టంట్స్, విజువల్స్‌తో పాటు చక్కని కామెడీని ఈ సినిమాలో చూసి ఎంజాయ్ చేస్తారు. మరింకెందుకు ఆలస్యం... గ్రాబ్ యువర్ రిమోట్ టు ‘బ్యాక్ ఇన్ యాక్షన్’ ఫర్ వాచింగ్ దిస్ వీకెండ్.– ఇంటూరు హరికృష్ణ -
తెలుగులో క్వీనే వచ్చేను...
‘మామా మామా కమ్ అండ్ సింగు... క్వీనే వచ్చెను... నువ్వే కింగు...’ అంటూ మొదలవుతుంది ‘జాబిలమ్మ నీకు అంత కోపమా’(Jabilamma Neeku Antha Kopama) సినిమాలోని ‘గోల్డెన్ స్పారో...’ పాట. పవీష్, అనిఖా సురేంద్రన్, ప్రియా ప్రకాశ్ వారియర్, మాథ్యూ థామస్, వెంకటేశ్ మీనన్, రబియా ఖతూన్, రమ్యా రంగనాథన్ ప్రధాన పాత్రల్లో నటించిన తమిళ చిత్రం ‘నిలవుక్కు ఎన్ మేల్ ఎన్నడి కోబం’. ఈ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ మూవీకి హీరో ధనుష్ దర్శకత్వం వహించారు.ఆర్కేప్రోడక్షన్స్‌తో కలిసి ధనుష్(Dhanush) సొంత నిర్మాణ సంస్థ వండర్‌బార్ ఫిల్మ్స్ నిర్మించిన ఈ చిత్రం ఫిబ్రవరి 21న విడుదల కానుంది. ఈ మూవీని ‘జాబిలమ్మ నీకు అంత కోపమా..’ అనే టైటిల్‌తో తెలుగులో ఏషియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్ ఎల్ఎల్పి రిలీజ్ చేస్తోంది. తాజాగా ఈ మూవీలోని ‘గోల్డెన్ స్పారో’ పాట లిరికల్ వీడియోను రిలీజ్ చేశారు.‘గోల్డెన్ స్పారో... నా గుండెలో యారో... నువ్వు లేని లైఫు ఫుల్ శారో..,’ అంటూ సాగే ఈ స్పెషల్ సాంగ్‌లో పవీశ్, అనిఖాలతో పాటు హీరోయిన్ ప్రియాంకా మోహనన్(Priyanka Mohan) డ్యాన్స్ చేశారు. ఈ పాటకు రాంబాబు గోసాల లిరిక్స్ అందించగా, అశ్విన్ సత్య–సుదీష్ శశికుమార్–సుభాషిణి ఆలపించారు. ఈ సిని మాకు సంగీతం: జీవీ ప్రకాశ్‌కుమార్. -
డేట్ చేంజ్
జీవా(jeeva), అర్జున్ సర్జా(arjun sarja) హీరోలుగా, రాశీ ఖన్నా హీరోయిన్గా నటించిన తాజా చిత్రం ‘అగత్యా’(agatya). ప్రముఖ పాటల రచయిత పా. విజయ్ కథ అందించడంతో పాటు దర్శకత్వం వహించారు. వేల్స్ ఫిలిం ఇంటర్నేషనల్ పతాకంపై ఐసరి గణేశ్ నిర్మించిన ఈ చిత్రం తమిళ, తెలుగు, హిందీ భాషల్లో నేడు విడుదల కావాల్సింది.అయితే జనవరి 31 నుంచి ఫిబ్రవరి 28కి విడుదలని వాయిదా వేసినట్లు ప్రకటించారు మేకర్స్. ‘‘గ్రామీణ నేపథ్యంతో పాటు మంచి థ్రిల్లింగ్ కాన్సెప్ట్‌తో రూపొందిన చిత్రం ‘అగత్యా’. మన సంస్కృతి, అనుబంధాలను దర్శకుడు బలంగా చెప్పారు. అద్భుతమైన సీజీ వర్క్‌తో భారీ బడ్జెట్‌తో తెరకెక్కింది. వీఎఫ్ఎక్స్ కోసం మరికొంత టైమ్ కేటాయించాలని భావించి, విడుదల వాయిదా వేశాం’’ అని యూనిట్ పేర్కొంది. -
కెన్యా కాలింగ్?
మహేశ్‌బాబు(Mahesh Babu) హీరోగా రాజమౌళి దర్శకత్వంలో ఫారెస్ట్ బ్యాక్‌డ్రాప్‌లో అడ్వెంచరస్ యాక్షన్ మూవీ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా చిత్రీకరణ అతి కానుందని సమాచారం. హైదరాబాద్ శివార్లలో ఈ సినిమా కోసం భారీ సెట్ వర్క్ జరుగుతోంది. అలాగే గత ఏడాది అక్టోబరులో దర్శకుడు రాజమౌళి(Rajamouli) కెన్యా వెళ్లి, అక్కడి లొకేషన్స్‌ను పరిశీలించిన సంగతి గుర్తుండే ఉంటుంది.ముందుగా ఈ సినిమా షూటింగ్ కెన్యాలోనే ప్రారంభం అవుతుందని, ఆ దిశగా రాజమౌళి ఆల్రెడీ ఏర్పాట్లు పూర్తి చేశారని ఫిల్మ్‌నగర్ భోగట్టా. ఇక ఈ చిత్రంలో ప్రియాంకా చోప్రా ఓ కీలక పాత్రలో నటించనున్నారు. మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ ఓ లీడ్ రోల్ చేస్తారనే ప్రచారం ఎప్పట్నుంచో జరుగుతోంది. అయితే ఈ విషయంపై ఇంకా ఏదీ ఫైనలైజ్ కాలేదని, ఏదైనా ఉంటే మేమే చెబుతామని పృథ్వీరాజ్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. కేఎల్ నారాయణ నిర్మిస్తున్న ఈ చిత్రం 2027లో విడుదల కావొచ్చనే ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాకు కీరవాణి స్వరకర్త. -
ప్రభాస్ 'స్పిరిట్' ఆరంభం ఎప్పుడంటే..?
‘స్పిరిట్’(Spirit) సినిమా సెట్స్‌కు వెళ్లే సమయం ఆసన్నమైంది. ప్రభాస్(Prabhas) హీరోగా ‘అర్జున్ రెడ్డి, యానిమల్’ చిత్రాల ఫేమ్ సందీప్ రెడ్డి వంగా(Sandeep Reddy Vanga) దర్శకత్వంలో రూపొందనున్న చిత్రం ‘స్పిరిట్’. ఈ సినిమా ప్రీప్రోడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ సినిమా రెగ్యులర్ షూట్‌ను మేలో ప్రారంభించాలని యూనిట్ ప్లాన్ చేస్తోందని సమాచారం. ఈ చిత్రంలో ప్రభాస్ తొలిసారిగా పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించనున్నారు.దీంతో లుక్స్, ఫిజిక్ పరంగా స్పెషల్‌గా మేకోవర్ కానున్నారట. ‘స్పిరిట్’ చిత్రీకరణ అనుకున్న సమయానికన్నా కాస్త ఆలస్యం కావడానికి ఇదొక కారణమని ఫిల్మ్‌నగర్ భోగట్టా. ఇక ఈ సినిమాలో హీరోయిన్గా మృణాల్ ఠాకూర్, ఆలియా భట్, రష్మికా మందన్నా... ఇలా పలువురు తారల పేర్లు తెరపైకి వచ్చాయి. కానీ ఇంకా ఎవరూ ఫైనలేజ్ కాలేదట. టీ సిరీస్ భూషణ్ కుమార్, ప్రణయ్‌రెడ్డి వంగా (సందీప్‌రెడ్డి వంగా సోదరుడు) భద్రకాళి పిక్చర్స్ నిర్మించనున్న ‘స్పిరిట్’ చిత్రం 2026 చివర్లో విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ సినిమాకు సంగీతం: హర్షవర్ధన్ రామేశ్వర్. -
సందడిగా ఊరే కలిసేనయ్యా...
అజిత్(Ajith Kumar) హీరోగా నటించిన తాజా చిత్రం ‘విడాముయర్చి’(Vidaamuyarchi). త్రిష హీరోయిన్గా నటించిన ఈ చిత్రంలో రెజీనా, అర్జున్, ఆరవ్, నిఖిల్ నాయర్ ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. మగిళ్ తిరుమేని దర్శకత్వంలో లైకా ప్రోడక్షన్స్ పతాకంపై సుభాస్కరన్ నిర్మించిన ఈ చిత్రం ఫిబ్రవరి 6న విడుదల కానుంది. ఈ సినిమా ‘పట్టుదల’ టైటిల్‌తో తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది.తాజాగా ఈ మూవీ నుంచి ‘సవదీక...’ అనే పాట లిరికల్ వీడియోను విడుదల చేశారు. ‘సందడిగా ఊరే కలిసేనయ్యా... విడి విడిగా తిరిగే రెండు ఎదలు ఫ్యామిలీగా ఒక్కటయ్యాయయ్యా..’ అన్న లిరిక్స్‌తో ఈ పాట తెలుగు వెర్షన్ సాగుతుంది. ఈ పాటకు శ్రీ సాయికిరణ్ సంగీతం అందించారు. ఆంటోనీతో కలిసి ఈ చిత్రం సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ ఈ పాటను పాడారు. -
యాక్షన్ థ్రిల్లర్ కి సై
నెగటివ్ రోల్స్‌తో దూసుకెళుతూ, పాజిటివ్ క్యారెక్టర్స్‌లోనూ భేష్ అనిపించుకున్నారు వరలక్షీ శరత్‌కుమార్ (Varalaxmi Sarathkumar). కథ నచ్చినప్పుడుల్లా కథానాయికప్రాధాన్యం ఉన్న చిత్రాలు కూడా చేస్తుంటారామె. తాజాగా ఆ తరహా చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారామె. ఈ సినిమాకి ‘ఆదిపర్వం’ మూవీ డైరెక్టర్ సంజీవ్ మేగోటి(Sanjeev Megoti) దర్శకత్వం వహించనున్నారు.‘‘సంజీవ్ మేగోటి రాసుకున్న సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్ కథకి వరలక్ష్మి ఓకే చెప్పారు. ఈ మూవీలో ఆమె మెయిన్ లీడ్ చేయనున్నారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కించనున్న ఈ సినిమాలో పలువురు ప్రముఖ నటీనటులను తీసుకోనున్నాం. పూర్తి వివరాలు అతి త్వరలోనే ప్రకటిస్తాం’’ అని మేకర్స్ తెలిపారు. -
గ్రీన్ సిగ్నల్?
రవితేజ(Ravi Teja) ప్రస్తుతం ‘మాస్ జాతర’ మూవీలో హీరోగా చేస్తున్నారు. ఈ చిత్రం మే 9న రిలీజ్ కానుంది. ఈ చిత్రం తర్వాత రవితేజ నెక్ట్స్ మూవీకి ఎవరు దర్శకత్వం వహించనున్నారనే చర్చ జరుగుతోంది. కొంతమంది దర్శకుల పేర్లు తెరపైకి వచ్చాయి. కాగా ‘మ్యాడ్’ చిత్రంతో దర్శకునిగా హిట్ సాధించి, ప్రస్తుతం ‘మ్యాడ్ 2’ని డైరెక్ట్ చేస్తున్న కళ్యాణ్ శంకర్(Kalyan Shankar) ఇటీవల రవితేజకు ఓ కథ వినిపించారట.స్క్రిప్ట్ నచ్చడంతో రవితేజ కూడా ఈ సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని భోగట్టా. దీంతో స్క్రిప్ట్‌పై మరింత ఫోకస్ పెట్టారట కల్యాణ్ శంకర్. ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నిర్మించనుందని, అన్నీ కుదిరితే 2026 సంక్రాంతికి ఈ మూవీని రిలీజ్ చేయాలని రవితేజ అండ్ టీమ్ ప్రణాళికలు రెడీ చేస్తున్నారని సమాచారం. -
'కార్తికేయుడి'గా అల్లు అర్జున్.. కొత్త సినిమా కథ ఇదే
‘పుష్ప 2: ది రూల్’ సినిమాతో వసూళ్ల పరంగా సరికొత్త రికార్డులు సృష్టించారు అల్లు అర్జున్. ఆ సినిమా తర్వాత అల్లు అర్జున్ హీరోగా నటించనున్న కొత్త మూవీ ఏంటి? అనే ప్రశ్నకు అధికారికంగా జవాబు లేదు. కాగా ‘పుష్ప 2: ది రూల్’ తర్వాత త్రివిక్రమ్, తమిళ దర్శకుడు అట్లీలతో అల్లు అర్జున్ సినిమా ఉంటుందనే ప్రచారం జరిగింది. అయితే ఎవరితో ముందుగా మూవీ చేస్తారనే దానిపై స్పష్టత లేదు. తాజాగా త్రివిక్రమ్ దర్శకత్వంలోనే అల్లు అర్జున్ సినిమా చేయనున్నారని ఫిల్మ్‌నగర్ టాక్. ‘జులాయి’, ‘సన్నాఫ్ సత్యమూర్తి’, ‘అల.. వైకుంఠపురములో’ వంటి హ్యాట్రిక్ విజయాల తర్వాత ఈ ఇద్దరి కాంబోలో రూపొందనున్న నాలుగో సినిమా ఇది. ఈప్రాజెక్ట్ కోసం త్రివిక్రమ్ భారీ కాన్వాస్ ఉన్న వైవిధ్యమైన కథను సిద్ధం చేసినట్లు టాక్. శివుడి తనయుడైన కార్తికేయుడు యుద్ధ దేవుడిగా ఎలా మారాడు? తండ్రి అయిన శివుణ్ణి తిరిగి కలవడానికి కార్తికేయ బయలుదేరినప్పుడు అతని ప్రయాణం ఎలా సాగింది? అనే కథాంశంతో ఈ చిత్రం ఉంటుందట.సోషల్ మైథలాజికల్ ఫ్యాంటసీ నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించేందుకు త్రివిక్రమ్ కథని సిద్ధం చేస్తున్నారని టాక్. హారికా అండ్ హాసినీ క్రియేషన్స్ పతాకంపై రాధాకృష్ణ (చినబాబు), నాగవంశీ నిర్మించనున్న ఈ సినిమా షూటింగ్ ఏప్రిల్‌లో ప్రారంభం కానుందని సమాచారం. అల్లు అర్జున్ ఇప్పటివరకు చేసిన పాత్రలకి పూర్తి వైవిధ్యంగా కార్తికేయ పాత్ర ఉంటుందని తెలుస్తోంది. ఈ విషయాలపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. -
జోరుగా హుషారుగా షూటింగ్‌కి పోదమా...
‘జోరుగా హుషారుగా షికారు పోదమా...’ అంటూ అక్కినేని నాగేశ్వర రావు, కృష్ణకుమారి అప్పట్లో సిల్వర్ స్క్రీన్‌పై చేసిన సందడిని నాటి ప్రేక్షకులు ఎంజాయ్ చేశారు. ఇప్పుడు ఈ పాట ప్రస్తావన ఎందుకూ అంటే... జోరుగా హుషారుగా షూటింగ్‌కి పోదమా... అంటూ కొందరు కథానాయికలు డైరీలో నాలుగుకి మించిన సినిమాలతో బిజీ బిజీగా ఉన్నారు. ఆ హీరోయిన్లు చేస్తున్నసినిమాల గురించి తెలుసుకుందాం...రెండు దశాబ్దాలు దాటినా బిజీగా...చిత్ర పరిశ్రమలో రెండు దశాబ్దాలకుపైగా ప్రయాణం పూర్తి చేసుకున్నారు త్రిష. అందం, అభినయంతో తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ ప్రేక్షకులను అలరిస్తున్న ఆమె ఇప్పటికీ ఫుల్ బిజీ హీరోయిన్గా దూసుకెళుతున్నారు. అంతేకాదు.. అందం విషయంలోనూ యువ హీరోయిన్లకు గట్టి పోటీ ఇస్తున్నారు. ప్రస్తుతం త్రిష చేతిలో తెలుగు, తమిళ్, మలయాళంలో కలిపి అరడజను సినిమాలున్నాయి. ఆమె నటిస్తున్న తాజా తెలుగు చిత్రం ‘విశ్వంభర’. ఈ మూవీలో చిరంజీవికి జోడీగా నటిస్తున్నారామె.‘స్టాలిన్’ (2006) సినిమా తర్వాత చిరంజీవి–త్రిష కలిసి నటిస్తున్న చిత్రం ఇదే కావడం విశేషం. అలాగే మోహన్‌లాల్ లీడ్ రోల్లో డైరెక్టర్ జీతూ జోసెఫ్ తెరకెక్కిస్తోన్న మలయాళ చిత్రం ‘రామ్’లోనూ నటిస్తున్నారు త్రిష. అదే విధంగా అజిత్ కుమార్ హీరోగా మగిళ్ తిరుమేని తెరకెక్కిస్తున్న ‘విడాముయర్చి’, అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహిస్తున్న ‘గుడ్ బ్యాడీ అగ్లీ’, కమల్‌హాసన్ హీరోగా మణిరత్నం రూపొందిస్తున్న ‘థగ్ లైఫ్’, సూర్య కథానాయకుడిగా ఆర్జే బాలాజీ దర్శకత్వం వహిస్తున్న ‘సూర్య 45’ (వర్కింగ్ టైటిల్) వంటి తమిళ చిత్రాల్లో నటిస్తూ జోరు మీద ఉన్నారు త్రిష. తెలుగులో లేవు కానీ...తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో బుట్ట బొమ్మగా స్థానం సొంతం చేసుకున్నారు హీరోయిన్ పూజా హెగ్డే. నాగచైతన్య హీరోగా నటించిన ‘ఒక లైలా కోసం’ (2014) అనే చిత్రంతో తెలుగులో ఎంట్రీ ఇచ్చారీ బ్యూటీ. టాలీవుడ్లో పదేళ్ల ప్రయాణం పూజా హెగ్డేది. కాగా చిరంజీవి, రామ్‌చరణ్ హీరోలుగా నటించిన ‘ఆచార్య’ (2022) సినిమా తర్వాత ఆమె ఒక్క తెలుగు సినిమా కూడా చేయలేదు. కానీ, బాలీవుడ్, తమిళ చిత్రాలతో బిజీగా ఉన్నారు పూజా హెగ్డే.తమిళంలో స్టార్ హీరోలైన విజయ్, సూర్యలకు జోడీగా నటిస్తున్నారు. విజయ్ హీరోగా హెచ్. వినోద్ దర్శకత్వం వహిస్తున్న ‘జన నాయగన్’ అనే సినిమాతో పాటు, సూర్య కథానాయకుడిగా కార్తీక్ సుబ్బరాజ్ డైరెక్షన్లో రూపొందుతోన్న ‘రెట్రో’ మూవీస్‌లో నటిస్తున్నారు పూజా హెగ్డే. అలాగే డేవిడ్ ధావన్ దర్శకత్వం వహిస్తున్న హిందీ చిత్రం ‘హై జవానీ తో ఇష్క్ హోనా హై’ అనే సినిమాలో నటిస్తున్నారామె. షాహిద్ కపూర్ హీరోగా రోషన్ ఆండ్రూస్ దర్శకత్వంలో రూపొందిన హిందీ మూవీ ‘దేవా’. పూజా హెగ్డే హీరోయిన్గా నటించిన ఈ సినిమా నేడు విడుదలవుతోంది. హిందీ, తమిళ భాషల్లో బిజీగా ఉన్న పూజా హెగ్డే తెలుగులో మాత్రం ఒక్క సినిమాకి కూడా కమిట్ కాలేదు. జోరుగా లేడీ సూపర్ స్టార్ఇండస్ట్రీలో లేడీ సూపర్‌స్టార్‌గా పేరు తెచ్చుకున్నారు నయనతార. నటిగా రెండు దశాబ్దాలకు పైగా ప్రయాణాన్ని పూర్తి చేసుకున్న ఆమె ఇప్పటికీ వరుస సినిమాలతో దూసుకెళుతున్నారు. కథానాయికగా ఫుల్ క్రేజ్‌లో ఉన్నప్పుడే దర్శకుడు విఘ్నేశ్ శివన్‌తో 2022 జూన్ 9న వివాహబంధంలోకి అడుగుపెట్టారు నయనతార. వీరిద్దరికీ ఉయిర్, ఉలగమ్ అనే ట్విన్స్ ఉన్నారు. ఇక కెరీర్ పరంగా ప్రస్తుతం ఆమె చేతిలో ఏడు సినిమాలున్నాయి. తమిళంలో ‘టెస్ట్, మన్నాంగట్టి సిన్స్ 1960, రాక్కాయీ’ వంటి సినిమాలతో పాటు పేరు పెట్టని మరో తమిళ చిత్రం, ‘డియర్ స్టూడెంట్’తో పాటు మరో మలయాళ మూవీ, ‘టాక్సిక్’ అనే కన్నడ సినిమాతో ఫుల్ బిజీ బిజీగా ఉన్నారు నయనతార. అయితే 2022లో విడుదలైన చిరంజీవి ‘గాడ్ ఫాదర్’ తర్వాత మరో తెలుగు చిత్రానికి పచ్చజెండా ఊపలేదామె.అరడజను సినిమాలతో‘చూసీ చూడంగానే నచ్చేశావే.. అడిగీ అడగకుండా వచ్చేశావే... నా మనసులోకి’ అంటూ రష్మికా మందన్నాని ఉద్దేశించి పాడుకుంటారు యువతరం ప్రేక్షకులు. అందం, అభినయంతో అంతలా వారిని ఆకట్టుకున్నారామె. కన్నడలో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ ‘ఛలో ’(2018) సినిమాతో తెలుగుకి పరిచయమయ్యారు. ఆ తర్వాత తెలుగు, తమిళ, హిందీ సినిమాల్లో వరుస సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్లలో ఒకరిగా దూసుకెళుతున్నారు ఈ కన్నడ బ్యూటీ. ఓ వైపు కథానాయకులకి జోడీగా నటిస్తూనే.. మరోవైపు లేడీ ఓరియంటెడ్ చిత్రాల్లోనూ నటిస్తున్నారు. ప్రస్తుతం ఆమె చేతిలో అరడజను సినిమాలున్నాయి.వాటిలో ‘రెయిన్ బో, ది గాళ్ ఫ్రెండ్’ వంటి ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్స్ కూడా ఉన్నాయి. శాంతరూబన్ దర్శకునిగా పరిచయమవుతున్న ‘రెయిన్ బో’ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతోంది. అదే విధంగా ‘చిలసౌ’ సినిమాతో దర్శకుడిగా మారిన నటుడు రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘ది గాళ్ ఫ్రెండ్’. అలాగే విక్కీ కౌశల్ హీరోగా లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహించిన బాలీవుడ్ మూవీ ‘ఛావా’లో హీరోయిన్గా చేశారు రష్మిక. ఈ సినిమా ఫిబ్రవరి 14న విడుదల కానుంది.ఇక సల్మాన్ ఖాన్ హీరోగా మురుగదాస్ తెరకెక్కిస్తున్న హిందీ మూవీ ‘సికందర్’లోనూ రష్మిక కథానాయిక. అదే విధంగా నాగార్జున, ధనుశ్ హీరోలుగా శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్న తెలుగు, తమిళ చిత్రం ‘కుబేర’లోనూ హీరోయిన్గా నటించారు ఈ బ్యూటీ. మరోవైపు అమర్ కౌశిక్ దర్శకత్వం వహించిన ‘థామా’ అనే బాలీవుడ్ మూవీలోనూ నటిస్తున్నారు రష్మికా మందన్నా.ఏడు చిత్రాలతో బిజీ బిజీగా...మలయాళ, తెలుగు, తమిళ, కన్నడ సినిమాల్లో నటించి, ప్రేక్షకుల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు హీరోయిన్ సంయుక్తా మీనన్. ‘భీమ్లా నాయక్’ (2022) చిత్రంతో టాలీవుడ్‌కి పరిచయమయ్యారు ఈ మలయాళ బ్యూటీ. ‘భీమ్లా నాయక్, బింబిసార, సార్, విరూపాక్ష’ వంటి వరుస హిట్లను తన ఖాతాలో వేసుకున్నారు సంయుక్త. ప్రస్తుతం ఆమె చేతిలో ఏడు సినిమాలున్నాయి. వాటిలో తెలుగులోనే ఐదు చిత్రాలుండగా, ఓ హిందీ ఫిల్మ్, ఓ మలయాళ సినిమా కూడా ఉంది.నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా భరత్ కృష్ణమాచారి దర్శకత్వం వహిస్తున్న ‘స్వయంభూ’, శర్వానంద్ కథానాయకుడిగా రామ్ అబ్బరాజు డైరెక్షన్లో రూపొందుతున్న ‘నారి నారి నడుమ మురారి’, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కథానాయకుడిగా లుధీర్ బైరెడ్డి తెరకెక్కిస్తున్న ‘హైందవ’, బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్న ‘అఖండ 2: తాండవం’ సినిమాల్లో నటిస్తున్నారు సంయుక్తా మీనన్. అదే విధంగా తొలిసారి ఓ లేడీ ఓరియంటెడ్ సినిమాలోనూ నటిస్తున్నారామె.యోగేష్ కేఎంసీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా హైదరాబాద్‌లో ప్రారంభమైంది. అలాగే ఆమె నటిస్తున్న తొలి హిందీ చిత్రం ‘మహారాజ్ఞి–క్వీన్ ఆఫ్ క్వీన్స్’. ఈ మూవీకి చరణ్ తేజ్ ఉప్పలపాటి దర్శకత్వం వహిస్తున్నారు. అదే విధంగా మోహన్‌లాల్ లీడ్ రోల్లో జీతూ జోసెఫ్ దర్వకత్వంలో రూపొందుతోన్న మలయాళ చిత్రం ‘రామ్’లోనూ నటిస్తున్నారు సంయుక్తా మీనన్. ఇలా ఏడు సినిమాలతో ఫుల్ బీజీ బీజీగా ఉన్నారామె. హుషారుగా యంగ్ హీరోయిన్టాలీవుడ్లో మోస్ట్ సెన్సేషన్ హీరోయిన్గా దూసుకెళుతున్నారు శ్రీలీల. ‘పెళ్లిసందడి’ (2021) సినిమాతో తెలుగులో హీరోయిన్గా పరిచయమైన ఈ బ్యూటీ అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ రేంజ్‌ని సొంతం చేసుకున్నారు. రవితేజ హీరోగా నటించిన ‘ధమాకా’ (2022) సినిమాతో తెలుగులో తొలి హిట్‌ని తన ఖాతాలో వేసుకున్న శ్రీలీల వరుస చిత్రాలతో యమా జోరు మీదున్నారు. ప్రస్తుతం ఆమె చేతిలో మూడు తెలుగు సినిమాలతో పాటు ఓ తమిళ చిత్రం ఉన్నాయి.నితిన్ హీరోగా వెంకీ కుడుముల దర్శకత్వంలో రూపొందుతోన్న ‘రాబిన్ హుడ్’, రవితేజ హీరోగా భాను భోగవరపు తెరకెక్కిస్తున్న ‘మాస్ జాతర’, పవన్ కల్యాణ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ వంటి తెలుగు చిత్రాల్లో నటిస్తున్నారు శ్రీలీల. అదే విధంగా శివ కార్తికేయన్ హీరోగా సుధ కొంగర దర్శకత్వం వహిస్తున్న ‘పరాశక్తి’ అనే తమిళ చిత్రంలోనూ నటిస్తూ బిజీగా ఉన్నారామె.హిందీలోనూ...దుల్కర్ సల్మాన్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వం వహించిన ‘సీతా రామం’ (2022) సినిమాతో టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చారు మృణాళ్ ఠాకూర్. ఆ సినిమా మంచి హిట్‌గా నిలిచింది. మృణాళ్ నటనకి మంచి మార్కులే పడ్డాయి. ఆ తర్వాత తెలుగులో ‘హాయ్ నాన్న, ది ఫ్యామిలీ స్టార్’ చిత్రాల్లో హీరోయిన్గా నటించిన ఈ బ్యూటీ ప్రభాస్ ‘కల్కి: 2898 ఏడీ’ చిత్రంలో అతిథి పాత్ర చేశారు. ప్రస్తుతం మృణాళ్ ఠాకూర్ బాలీవుడ్లో బిజీ హీరోయిన్గా మారారు. ఆమె హిందీలో ‘పూజా మేరీ జాన్, హై జవానీతో ఇష్క్ హోనా హై, సన్ ఆఫ్ సర్దార్ 2’, తుమ్ హో తో’ వంటి చిత్రాలు చేస్తున్నారు. అదే విధంగా అడివి శేష్ హీరోగా తెలుగు, హిందీ భాషల్లో రూపొందుతోన్న ‘డెకాయిట్’ చిత్రంలో నటిస్తూ బిజీగా ఉన్నారు మృణాళ్ ఠాకూర్.రెండు తెలుగు... రెండు హిందీ ప్రేక్షకుల హృదయాల్లో అతిలోక సుందరిగా అభిమానం సొంతం చేసుకున్న దివంగత నటి శ్రీదేవి, నిర్మాత బోనీకపూర్ వారసురాలిగా పెద్ద కుమార్తె జాన్వీ కపూర్ హిందీలో ఎంట్రీ ఇచ్చారు. యూత్ కలల రాణిగా మారారు ఈ బ్యూటీ. ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వం వహించిన ‘దేవర: పార్ట్ 1’ (2024) సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు జాన్వీ. ప్రస్తుతం ఆమె చేతిలో కూడా నాలుగు సినిమాలుఉన్నాయి. వాటిలో రెండు తెలుగు కాగా రెండు హిందీ మూవీస్.రామ్‌చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందుతోన్న ‘ఆర్సీ 16’ (వర్కింగ్ టైటిల్) చిత్రంలో నటిస్తున్నారు. అలాగే ఎన్టీఆర్ ‘దేవర: పార్ట్ 2’ సినిమా కూడా ఉండనే ఉంది. అదే విధంగా హిందీలో ‘సన్నీ సంస్కారీ కీ తులసీ కుమారి, పరమ్ సుందరి’ వంటి సినిమాల్లో నటిస్తున్నారు. ఇలా నాలుగైదు సినిమాలతో బిజీ బిజీగా షూటింగ్స్ చేస్తున్న కథానాయికలు ఇంకొందరు ఉన్నారు. – డేరంగుల జగన్ మోహన్