వీఆర్వో, వీఆర్‌ఏ పోస్టులకు 14లక్షల దరఖాస్తులు | 14 lakhs applications received for VRO, VRA posts | Sakshi
Sakshi News home page

వీఆర్వో, వీఆర్‌ఏ పోస్టులకు 14లక్షల దరఖాస్తులు

Published Mon, Jan 20 2014 2:54 AM | Last Updated on Sat, Sep 2 2017 2:47 AM

14 lakhs applications received for VRO, VRA posts

రాయవరం, న్యూస్‌లైన్ : గ్రామ రెవెన్యూ అధికారులు (వీఆర్వో), రెవెన్యూ సహాయక (వీఆర్‌ఏ) పోస్టులకు 14 లక్షల దరఖాస్తులు వచ్చినట్లు భూ పరిపాలన శాఖ చీఫ్ కమిషనర్, రాష్ట్ర ప్రభుత్వ అదనపు ముఖ్య కార్యదర్శి డాక్టర్ ఐవైఆర్ కృష్ణారావు తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా రాయవరం మండలం వెదురుపాకలో ఆదివారం విలేకరులతో మాట్లాడారు. సుమారు ఆరువేల పోస్టులను ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ చేయనున్నట్టు చెప్పారు. ఈ పోస్టులకు రాష్ట్ర వ్యాప్తంగా ఫిబ్రవరి 2న పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు. వచ్చేనెల 10 నుంచి 25 వరకూ రాష్ట్రవ్యాప్తంగా రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నామని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement