కర్నూలు: రేషన్ల షాపుల్లోనూ పింఛన్లు పంపిణీ చేస్తామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. ఇంటి వద్దకే వచ్చి పంచాయతీ సిబ్బంది పింఛన్లు అందజేస్తారన్నారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గం కోటేకల్లు గ్రామంలో శనివారం ఆయన నీరు-చెట్టు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగసభలో సీఎం మాట్లాడారు. సభ ప్రారంభానికి ముందు మొక్కలు నాటి జేసీబీ ద్వారా చెరువుల్లో పూడికతీత కార్యక్రమం చేపట్టారు. కర్నూలు జిల్లాకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు.
కార్యక్రమంలో జలవనరుల శాఖ మంత్రి మంత్రి దేవినేని ఉమ, నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి, జెడ్పీ చైర్మన్ మల్లెల రాజశేఖర్‌గౌడ్, ఎమ్మిగనూరు, బనగానపల్లె ఎమ్మెల్యేలు బి.వి.జయనాగేశ్వరరెడ్డి, బి.సి.జనార్దన్‌రెడ్డి, కలెక్టర్ సి.హెచ్.విజయమోహన్ తదితరులు పాల్గొన్నారు. మద్యం ద్వారా ప్రభుత్వానికి ఆదాయం అవసరం లేదని సీఎం అన్నారు. అయితే ఈ సందర్భంగా ఆస్పరి మండలం బిలేకల్లుకు చెందిన వీరన్న అనే వ్యక్తి సభ మధ్యలో లేచి మా ఊర్లో అడుగడుగునా బెల్టు దుకాణాలు ఉన్నాయని తెలపగా...బెల్టు దుకాణాలు పగులగొట్టాలని సీఎం పిలుపునిచ్చారు.