చిరు పుట్టిన రోజుకు 150వ సినిమా స్క్రిప్టు | chiranjeevi Birthday 150th film Script | Sakshi
Sakshi News home page

చిరు పుట్టిన రోజుకు 150వ సినిమా స్క్రిప్టు

Published Wed, Jul 23 2014 12:00 AM | Last Updated on Fri, Jul 12 2019 4:28 PM

చిరు పుట్టిన రోజుకు 150వ సినిమా స్క్రిప్టు - Sakshi

చిరు పుట్టిన రోజుకు 150వ సినిమా స్క్రిప్టు

జి.మామిడాడ (పెదపూడి): సినీ హీరో, కేంద్ర మాజీ మంత్రి చిరంజీవి పుట్టిన రోజైన ఆగస్టు 22 నాటికి ఆయన 150వ సినిమా స్క్రిప్టు సిద్ధమవుతుందని ప్రముఖ సినీ దర్శకుడు వీవీ వినాయక్ అన్నారు. దానిని చిరంజీవికి చూపించి సినిమా షూటింగ్ ఖరారు చేస్తామన్నారు. ఈ సినిమాకు హీరో రామచరణ్ తేజ నిర్మాతగా వ్యవహరిస్తారని చెప్పారు. జి.మామిడాడలోని సూర్యదేవాలయంలో మంగళవారం ఆయన స్వామివారిని దర్శించుకుని పూజలు చేయించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ శ్రీలక్ష్మి నరసింహ ప్రొడక్షన్ బ్యానర్‌పై, నిర్మాత బెల్లంకొండ సురేష్ కుమారుడు శ్రీనివాస్ హీరోగా తీసిన ‘అల్లుడు శ్రీను’ సినిమా విజయవంతం కావాలని స్వామివారిని కోరుకున్నానన్నారు. ఆయన సన్నిహితులు కర్రి శేషారెడ్డి, చిరంజీవి యువత జిల్లా ఆర్గ్‌నైజింగ్ సెక్రటరీ ఆర్.నాగు, కర్రి భాస్కర శేషారెడ్డి, నిర్మాత మల్లిడి సత్యనారాయణరెడ్డి తదితరులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement