సాక్షి, తిరుపతి: జిల్లాలో శుక్రవారం ఒక్క రోజే 25 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కోయంబేడు నుంచి వచ్చిన వారి ద్వారా 14మందికి సోకితే.. అజ్మీర్ నుంచి వచ్చిన వలస కూలీల్లో 11 మందికి పాజిటివ్ తేలినట్లు అధికారులు ప్రకటించారు. దీంతో జిల్లావ్యాప్తంగా నమోదైన మొత్తం కేసుల సంఖ్య 165కి చేరింది. అందులో ఆస్పత్రిలో చికిత్స పొంది ఆరోగ్యంగా ఇంటికి చేరిన వారు 77 మంది ఉన్నారు. (స్టీరింగ్ పట్టేద్దాం..)
నిన్న కోయంబేడు.. నేడు అజ్మీర్
ఢిల్లీ నుంచి వచ్చిన వారి ద్వారా కరోనా వైరస్ సోకిన వారంతా కోలుకునే సమయంలో చెన్నై కోయంబేడు మార్కెట్‌తో సంబంధాలు ఉన్నవారి ద్వారా మళ్లీ జిల్లాలో బాధితుల సంఖ్య పెరిగింది. తాజాగా అజ్మీర్ నుంచి జిల్లాకు చేరుకున్న వారికి వైద్యులు పరీక్షలు నిర్వహిస్తున్నారు. వారిలో కొందరికి పాజిటివ్ వచ్చినట్టు తేలింది.
ఇదిలా ఉంటే కోయంబేడు మార్కెట్‌కు వెళ్లి వచ్చిన వారితో సంబంధాలున్న వారిని గుర్తించడానికి ప్రభుత్వం తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే చాలామందిని గుర్తించి క్వారంటైన్‌కు పంపింది. మరోవైపు అజ్మీర్ నుంచి వచ్చిన వారంతా ఎవరినీ కలవకుండా అధికారులు క్వారంటైన్ కేంద్రాలకు పంపి పరీక్షలు నిర్వహిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment