బొమ్మూరు (రాజమండ్రి రూరల్): ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశానికి కౌన్సెలింగ్ ఈనెల 12న ప్రారంభం కానుంది. ఈనెల 20 వరకు సర్టిఫికెట్ల పరిశీలన జరుగుతుంది. 14 నుంచి 21 వరకు విద్యార్థులు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చు. 22, 23 తేదీల్లో ఆప్షన్లు మార్చుకోవచ్చు. 26న సీట్లు కేటారుుస్తారు. సర్టిఫికెట్ల పరిశీలనకు జిల్లాలో నాలుగు హెల్ప్‌లైన్ సెంటర్లు ఏర్పాటు చేశారు. కౌన్సెలింగ్ బొమ్మూరులోని జీఎంఆర్ పాలిటెక్నిక్, కాకినాడలో జేఎన్‌టీయూ, ఆంధ్రా పాలిటెక్నిక్, మహిళా పాలిటెక్నిక్ కళాశాలల్లో జరుగుతుంది.
ఎస్టీ విద్యార్ధులు ఆంధ్రా పాలిటెక్నిక్‌లో కౌన్సెలింగ్‌కు హాజరుకావాలి. వికలాంగులు, ఎన్‌సీసీ, స్పోర్ట్స్, మాజీ సైనికుద్యోగుల పిల్లల సర్టిఫికెట్ పరిశీలనకు విజయవాడ ప్రభుత్వ పాలిటెక్నిక్‌లో ప్రత్యేక కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ప్రాసెసింగ్ ఫీజుగా ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.450, బీసీ, ఓసీ అభ్యర్థులు రూ.900 చెల్లించాలి. సర్టిఫికెట్ల పరిశీలన తర్వాత వెబ్ కౌన్సెలింగ్, ఇతర సమాచారాన్ని హెల్ప్‌లైన్ కేంద్రాల్లో తెలుసుకోవాలి. పూర్తి వివరాలకు జ్ట్టిఞ://్చఞ్ఛ్చఝఛ్ఛ్టి.జీఛి.జీవెబ్‌సైట్‌ను చూడాలని బొమ్మూరు జీఎంఆర్ పాలిటెక్నిక్ ప్రిన్సిపాల్, కౌన్సిలింగ్ కో ఆర్డినేటర్ విలియం క్యారీ తెలిపారు.
కావలసిన సర్టిఫికెట్లు..: సర్టిఫికెట్ల పరిశీలనప్పుడు విద్యార్థులు ధ్రువపత్రాలకు సంబంధించి రెండు సెట్ల జిరాక్స్ కాపీలను అందించాలి. ఇందులో ఎంసెట్ ర్యాంకు కార్డు, హాల్ టిక్కెట్టు, ఇంటర్ మార్క్స్ మెమో-పాస్ సర్టిఫికెట్, ఎస్‌ఎస్‌సీ లేదా తత్సమాన అర్హతలకు సంబంధించిన మార్కుల మెమో, ఆరో తరగతి నుంచి ఇంటర్ వరకు స్టడీ సర్టిఫికెట్, రెసిడెన్స్ సర్టిఫికెట్ (విద్యాసంస్థల్లో చదవని వారు), 2015 జనవరి ఒకటి తరువాత జారీ అయిన ఇన్‌కం సర్టిఫికెట్, ఆధార్‌కార్డు, కులధ్రువీకరణ పత్రం జిరాక్సు కాపీలను అందించాలి. వికలాంగులు తదితర ప్రత్యేక కేటగిరీల వారు ఆ ధ్రువపత్రాలను సమర్పించాలి.
సర్టిఫికెట్ల పరిశీలన తేదీలు
తేదీ = ర్యాంకు నుంచి = వరకు
12.06.2015= 1= 15,000
13.06.2015= 15,001= 30,000
14.06.2015= 30,001= 45,000
15.06.2015= 45,001= 60,000
16.06.2015= 60,001= 75,000
17.06.2015= 75,001= 90,000
18.06.2015= 90,001= 1,05,000
19.06.2015= 1,05,001= 1,20,000
20.06.2015= 1,20,001= చివరి వరకు
వెబ్ ఆప్షన్ల నమోదు తేదీలు
తేదీలు = ర్యాంకు నుంచి= ర్యాంకువరకు
14, 15= 1= 30,000
16, 17= 30,001= 60,000
18, 19= 60,001= 90,000
20, 21= 90,001= చివరి వరకు
రేపటి నుంచి ఇంజనీరింగ్ కౌన్సెలింగ్
Published Thu, Jun 11 2015 2:03 AM | Last Updated on Thu, Jul 11 2019 6:33 PM
Advertisement
Advertisement