సార్వత్రిక ఫలితాలు వెలువడిన కొద్దిరోజుల్లోనే స్థానిక సమరానికి ఎన్నికల కమిషన్‌గ్రీన్ సిగ్నల్ ఇవ్వబోతుందా...ఓటర్ల జాబితాసిద్ధం చేయాలని ఆదేశించిన నేపథ్యంలోఔననే సమాధానం వినిపిస్తోంది. జిల్లాలోని
పురపాలక, నగర పాలక, పంచాయతీల్లోఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రాథమిక ఏర్పాట్లు చేయాలనిజిల్లా యంత్రాంగాన్ని ఇప్పటికే ఎన్నికలకమిషన్ ఆదేశించింది. గడువులోగా ఓటర్ల
జాబితా పూర్తి చేసేందుకు యంత్రాంగంనిమగ్నమైంది. మే 1వ తేదీన పురపాలకఓటర్ల జాబితాను డివిజన్లు, వార్డుల వారీగాప్రకటించేందుకు ఏర్పాట్లు చేస్తుండగా10వ తేదిన పంచాయతీల జాబితాప్రదర్శించేందుకు సిద్దమవుతోంది.రిజర్వేషన్లకు కూడా మరో వారం రోజుల్లోఖరారు చేసి ప్రభుత్వానికి, ఎన్నికలసంఘానికి సంబంధిత అధికారులుసమర్పించనున్నారు.
సాక్షి కడప : జిల్లాలో స్థానిక సమరానికి తెర లేవనుంది. పంచాయతీలకు ఎన్నికల సమరం మొదలు కానున్న నేపథ్యంలో పల్లెల్లో వేడి రగలనుంది. సార్వత్రిక వేడి తగ్గకముందే పల్లె పోరుకు సిద్ధం కావాలని ఎన్నికల కమిషన్ ఆదేశించింది. పంచాయతీల ఎన్నికలపై కసరత్తు మొదలైంది. ఓటరు జాబితాను సిద్దం చేసి మే10న ప్రకటించాలని ఎన్నికల కమిషన్ ఆదేశించింది. మార్గదర్శక సూత్రాలను విడుదల చేసింది. జిల్లాలో 790 పంచాయతీలలో 7,772 వార్డులు ఉన్నాయి. మరి కొన్ని చోట్ల అదనంగా పెరిగే అవకాశం కూడా లేకపోలేదు. సర్పంచుల పదవీకాలం 2018 ఆగస్టులోనే ముగిసింది. ఓటర్ల జాబితా ఆధారంగా వార్డుల రిజర్వేషన్ చేపట్టాలని సూచించిన నేపథ్యంలో అందుకు ఏర్పాట్లు మొదలయ్యాయి. సార్వత్రిక ఎన్నికల ఓటర్ల చేర్పుల జాబితాను పరిగణలోకి తీసుకుని వార్డుల వారీగా ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం ఓటర్లను గుర్తించాలి. వాటి ఆధారంగా రిజర్వేషన్లు ఖరారు చేసి మే 10న ఓటర్ల జాబితాను ప్రకటించాల్సి ఉంది. మండల స్థాయిలో డీఎల్‌పీఓ, ఈఓపీఆర్‌డీలు రిజర్వేషన్లు ఖరారు చేసే అవకాశముంది. ఓటరు జాబితాను పంచాయతీ, ఎంపీడీఓ కార్యాలయాల్లో ప్రకటించాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. అనంతరం పోలింగ్ కేంద్రాలను గుర్తించాల్సి ఉంటుంది. జూన్‌లో పంచాయతీ ఎన్నికలు జరిగే అవకాశముంది.
మున్సిపల్‘పోరు’కు సమాయత్తం
నగర పాలక సంస్థతోపాటు మున్సిపాలిటీల్లో ఎన్నికలకు ఎన్నికల కమిషన్ కసరత్తు ప్రారంభించింది. పక్షం రోజుల కిందట రాష్ట్ర ఎన్నికల సంఘం నుంచి ఆయా పురపాలక, నగర పాలక సంస్థ అధికారులకు ఈమేరకు ఉత్తర్వులు అందాయి. 2019 సార్వత్రిక ఎన్నికల ఓటర్ల జాబితాను రెవెన్యూశాఖ నుంచి తెప్పించుకుని నగర పాలక, పురపాలక పరిధిలోని ఓటర్లను వేరు చేస్తున్నారు. పట్టణాలు, నగరాల్లో సంబంధిత శాఖ అధికారులు కసరత్తు మొదలు పెట్టారు. సరిహద్దుల ప్రకారం ఇంటి నెంబర్ల ఆధారంగా ఓటర్లను ఆయా డివిజన్ల వారీగా విభజించే ప్రక్రియ కొనసాగుతోంది. ఫొటో ఓటర్ల జాబితా ప్రచురణ అనంతరం రాష్ట్ర ఎన్నికల సంఘం పురపాలక, నగర పాలక సంస్థల వార్డులు, డివిజన్ల వారీగా రిజర్వేషన్లు ఖరారు చేస్తారు. ఈ ప్రక్రియను సజావుగా చేపట్టాలని రాష్ట్ర ఎన్నికల సంఘం పురపాలక పరిపాలన శాఖను ఆదేశించనుంది. ఈ విధానం ముగిసిన తర్వాత ఓటర్ల సంఖ్య ఆధారంగా పోలింగ్ కేంద్రాలు ఖరారవుతాయి. ప్రస్తుతం పెరిగిన ఓటర్ల సంఖ్య, దానికి అనుగుణంగా పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు కానున్నాయి. మున్సిపల్ ఎన్నికలకు ఒక్కో అడుగు ముందుకు పడుతోంది. మే 1వ తేదిన ఫొటో ఓటర్ల జాబితాను ప్రచురించేందుకు మున్సిపల్ అధికారులు సిద్ధమవుతున్నారు. జిల్లాలో ఎనిమిది మున్సిపాలిటీలతోపాటు ఒక నగర పాలక సంస్థ ఉన్నాయి. రాజంపేటలో రిజర్వేషన్లకు సంబంధించిన వ్యవహారం కోర్టులో ఉన్న నేపథ్యంలో 2014లోనూ ఎన్నికలు జరగలేదు.
2014లో వైఎస్సార్ సీపీ హవా
జిల్లాలో పంచాయతీలతోపాటు నగర పాలక, మున్సిపాలిటీల్లోనూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హవా కనిపించింది. అధికభాగం సర్పంచుగిరీలను వైఎస్సార్ సీపీ మద్దతుదారులు కైవసం చేసుకున్నారు. పులివెందుల, ఎర్రగుంట్ల, రాయచోటి, జమ్మలమడుగు మున్సిపాలిటీలను వైఎస్సార్ సీపీ కైవసం చేసుకుంది. కడప నగర పాలక సంస్థలో 50 డివిజన్లు ఉండగా 42కి పైగా డివిజన్లను వైఎస్సార్ సీపీ గెలుచుకుని మేయర్ పీఠాన్ని దక్కించుకుంది. టీడీపీకి కేవలం ప్రొద్దుటూరు, మైదుకూరు, బద్వేలు మున్సిపాలిటీలను టీడీపీ గెలుచుకుంది. ఈసారి రాష్ట్ర మంతటా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం వీస్తున్న నేపథ్యంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైఎస్సార్ సీపీ స్వీప్ చేస్తుందని ఆ పార్టీ నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
జిల్లాలోని స్థానిక సంస్థల వివరాలు
జిల్లాలో నగర పాలక సంస్థ 01
మున్సిపాలిటీలు 08
జిల్లాలో పంచాయతీలు 790
జిల్లాలోని పంచాయతీల్లో వార్డులు7772
మున్సిపాలిటీల్లోవార్డులు200
కడప నగరంలోని డివిజన్లు50
Comments
Please login to add a commentAdd a comment