అక్బరుద్దీన్ హత్యకు కుట్ర పన్నిన గ్యాంగ్ అరెస్ట్!
అక్బరుద్దీన్ హత్యకు కుట్ర పన్నిన గ్యాంగ్ అరెస్ట్!
Published Sun, May 18 2014 5:02 PM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM
హైదరాబాద్: ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఓవైసీ హత్యకు కుట్రను బెంగళూరు పోలీసులు భగ్నం చేశారు. అక్బరుద్దీన్ ఓవైసీ హత్యకు కుట్ర పన్నిన కే. గిరి, మరో ముగ్గురు గ్యాంగ్ స్టర్లను అనంతపురం జిల్లా హిందూపురంలో బెంగళూరు పోలీసులు పట్టుకున్నారు. పోలీసుల నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించిన వారిపై పోలీసులు కాల్పులు జరపడంతో గిరికి గాయాలయ్యాయి.
అదుపులోకి తీసుకున్న నిందితులను బెంగళూరుకు తరలించారు. నిందితుల వద్ద నుంచి భారీ ఎత్తున ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. అక్బరుద్దీన్ ను హత్య చేసేందుకు సుపారీ తీసుకున్నట్టు విచారణలో గ్యాంగ్ సభ్యులు ఒప్పకున్నారని పోలీసులు తెలిపారు. అయితే అక్బరుద్దీన్ హత్య చేసేందుకు పన్నిన కుట్ర వెనుక ఎవరు ఉన్నారనే విషయం వెల్లడికాలేదని పోలీసులు తెలిపారు.
నలుగురు గ్యాంగ్ స్టర్లు తలదాచుకున్నారనే సమాచారం అందుకున్న కర్నాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల పోలీసులు ఆదివారం జాయింట్ ఆపరేషన్ నిర్వహించారు. 2011లో హైదరాబాద్ లో ప్రత్యర్ధులు దాడి చేసి ఘటనలో అక్బరుద్దీన్ క తీవ్రగాయాలు కాగా, ఎమ్మెల్యే ఆహ్మద్ బలాలా అనుచరుడు మృతి చెందిన సంగతి తెలిసిందే.
Advertisement
Advertisement