సాక్షి, హైదరాబాద్: ఐఏఎస్‌కు దరఖాస్తు చేసుకున్నప్పుడు ఇచ్చిన శాశ్వత చిరునామా, స్థానికతను పరిగణనలోకి తీసుకొని క్యాడర్ కేటాయింపులు చేసేలా ఆదేశాలివ్వాలని ఇద్దరు ట్రెరుునీ ఐఏఎస్‌లు కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్ (క్యాట్)ను ఆశ్రరుుంచారు. ఈ మేరకు విజయనగరానికి చెందిన ఎల్.శివశంకర్, చిత్తూరు జిల్లాకు చెందిన శ్రీజనలు దాఖలు చేసిన పిటిషన్లను క్యాట్ సభ్యులు బీవీ రావు, మిన్నీమాథ్యూలతో కూడిన ధర్మాసనం బుధవారం విచారించింది.
ప్రత్యూష్ సిన్హా కమిటీ సిఫార్సుల మేరకు శాశ్వత చిరునామా, స్థానికత ఆధారంగా కేటాయింపులు చేయాల్సి ఉందని పిటిషనర్ల తరఫు న్యాయవాది తెలిపారు.సర్వీసులో చేరే ముందు ఇచ్చిన చిరునామా ఆధారంగా జరుగుతున్నాయని చెప్పారు.కేంద్ర ప్రభుత్వ తరఫు న్యాయవాది జయప్రకాష్‌బాబు అభ్యంతరం వ్యక్తం చేస్తూ తన వాదనలను వినిపించారు.ధర్మాసనం పిటిషనర్ల విజ్ఞప్తినీ పరిగణనలోకి తీసుకోవాలని ఆదేశిస్తూ విచారణను ముగించింది.