పిఠాపురం : పెళ్లయ్యి ఏడేళ్లు దాటినా సంతాన కలగలేదనే మనోవేదనతో ఓ ఇల్లాలు బలన్మరణానికి పాల్పడింది. తూర్పు గోదావరి జిల్లా పిఠాపురంలోని మిరపకాయల వీధిలో ఉండే అద్దంకి వెంకటలక్ష్మికి ఏడేళ్ల క్రితం వివాహం కాగా, ఇప్పటి వరకు పిల్లలు లేరు. ఆ బాధను తట్టుకోలేకపోయిన ఆమె సోమవారం తెల్లవారుజామున ఇంటివద్దే ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పటించుకుంది. తీవ్ర కాలిన గాయాలతో వెంకటలక్ష్మి అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ఘటన జరుతున్నప్పుడు మృతురాలి బందువులు నిద్రపోతున్నట్టు సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రొరంభించారు.
పిల్లలు పుట్టలేదని ఆత్మహత్య
Published Mon, Apr 27 2015 1:15 PM | Last Updated on Tue, Nov 6 2018 7:56 PM
Advertisement
Advertisement