భారీగా ఖైనీ స్వాధీనం | Khaini Packets Caught In Srikakulam | Sakshi
Sakshi News home page

భారీగా ఖైనీ స్వాధీనం

Published Tue, Oct 30 2018 7:42 AM | Last Updated on Tue, Oct 30 2018 7:42 AM

Khaini Packets Caught In Srikakulam - Sakshi

పోలీసులు పట్టుకొన్న మీరాజ్‌ ఖైనీ ప్యాకెట్లు

శ్రీకాకుళం, ఇచ్ఛాపురం: జాతీయ రహదారిపై అక్రమంగా రవాణా చేస్తున్న ఖైనీ ప్యాకెట్లను పోలీసులు పట్టుకున్నారు. వీటి విలువ సుమారు రూ.12 లక్షలు ఉంటుందని తెలిపారు. స్థానిక సీఐ భవానిప్రసాద్‌ తెలిపిన వివరాలు ఇలావున్నాయి. జాతీయ రహదారిపై పట్టణంలోని బెల్లుపడ టోల్‌ప్లాజా సమీపంలో పట్టణ ఇన్‌చార్జి రూరల్‌ ఎస్‌ఐ కోటేశ్వరరావు ఆధ్వర్యంలో పోలీసులు సోమవారం వాహనాలను తనిఖీ చేస్తున్నారు. ఈ క్రమంలో టోల్‌ ప్లాజాకు చేరిన ఐచర్‌ వ్యాన్‌ను పోలీసులు నిలిపి తనిఖీలు నిర్వహిస్తుండగా అందులో ఉన్న వాహన యజమాని సింహాచలం, డ్రైవర్‌ సుభలు పారిపోయేందుకు ప్రయత్నించారు.

పోలీసులు గుర్తించి వారిని పట్టుకొని వారితో పాటు సరుకులను అదుపులోకి తీసుకున్నారు. వీరిని విచారించగా ఒడిశాలోని బరంపురం ఉత్కల్‌ బస్టాండ్‌ వద్ద హరిప్రియ ట్రేడర్స్‌ నుంచి 200 బాక్సుల మీరాజ్‌ ఖైనీని వ్యాన్‌లో లోడ్‌చేసుకొని గుణుపూర్‌లోని నందికేశ్వరరావు అనే వ్యక్తికి సరఫరా చేస్తున్నామని తెలిపారు. మన రాష్ట్రంలో ఇటువంటి పదార్థాలు నిషేధం కావడంతో ఈ పదార్థాలు కొన్న వ్యక్తిని ఏ1గా, విక్రయించిన వ్యక్తిని ఏ2గా పరిగణించి కేసు నమోదు చేశామని ఇన్‌చార్జి ఎస్‌ఐ కోటేశ్వరరావు రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌ వద్ద ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో తెలిపారు. ఇందులో ఏఎస్‌ఐ నాగార్జున, చంద్రయ్య, పోలీస్‌స్టేషన్‌ సిబ్బంది పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement