విశాఖపట్నం , పీఎంపాలెం(భీమిలి): ప్రేమ పేరుతో యువతిని మోసగించి పెళ్లికి నిరాకరించిన ఓ వ్యక్తిని పీఎంపాలెం పోలీసులు అరెస్టు చేశారు. స్థానిక సీఐ కె.లక్ష్మణమూర్తి తెలిపినవివరాలిలా ఉన్నా యి. కొబ్బరితోట ప్రాంతానికి చెందిన ఓ యువతిని వాంబే కాలనీకి చెందిన ఎన్.బుజ్జీ ప్రే మిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని నమ్మించి శరీరకంగా దగ్గరయ్యాడు. కొన్నాళ్లు ఆమెతో సహజీవనం చేశాడు. పెళ్లి ఊసు ఎత్తేసరికి కా దు పొమ్మన్నాడు. మోసపోయానని గ్రహించి న ఆమె తనకు జరిగిన అన్యాయంపై పోలీసులను ఆశ్రయించింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నిందితుని అరెస్టు చేసి, రిమాండుకు తరలించామని సీఐ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment