ఎమ్మెల్యే సండ్రకు తప్పిన ప్రమాదం | MLA Sandra Venkata Veeraiah Car Road Accident In Khammam District | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్యే సండ్రకు తప్పిన ప్రమాదం

Published Mon, Jun 3 2019 6:38 AM | Last Updated on Mon, Jun 3 2019 9:17 AM

MLA Sandra Venkata Veeraiah Car Road Accident In Khammam District - Sakshi

కాల్వలో ఇరుక్కుపోయిన ఎమ్మెల్యే కారు, వాహనాన్ని బయటకు తీస్తున్న దృశ్యం

ఖమ్మంక్రైం: సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యకు ఆదివారం తృటిలో ప్రమాదం తప్పింది. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా పోలీస్‌ పరేడ్‌గ్రౌండ్‌లో జరిగిన కార్యక్రమానికి హాజరై తిరిగి వెళుతుండగా పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్‌ సమీపంలో శివాలయం వద్ద ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయిన ఎమ్మెల్యే డ్రైవర్‌ పక్కనే ఉన్న కాల్వను గమనించకపోవటంతో వాహనం టైరు కాల్వలో ఇరుక్కుపోయింది.

వాహనం ఒక పక్కకు ఒరిగి పోతుండగా డ్రైవర్‌ సమయస్ఫూర్తితో వ్యవహరించటంతో బోల్తా పడకుండా ఆగిపోయంది. వెంటనే సండ్ర, ఆయన గన్‌మెన్‌లు కిందకు దిగారు. ఈలోపు ఆ ప్రాంతంలో ఉన్న స్థానికులు అక్కడకు చేరుకొని వాహనాన్ని బయటకు తీసారు. ఆ సమయంలో గుడి ముందు ఎవరూ లేకపోవటంతో ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఆ శివుడే తనకు ఎటువంటి ముప్పు కలిగించకుండా కాపాడాడని సండ్ర అంటూ కారెక్కి హైదరాబాద్‌ వెళ్లిపోయారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement