వడోదరా : గుజరాత్‌లో బీహారీలపై దాడులు చేస్తున్న వారి వికృత చేష్టలు రోజు రోజుకు మితిమీరుతున్నాయి. తాజాగా మధుబని జిల్లాలో వడదోరాలో లుంగీ కట్టుకున్నారని ఓ ఏడుగురు బిహార్ కార్మీకులపై అక్కడి స్థానికులు దాడి చేశారు. వడదోర మున్సిపల్ కార్పోరేషన్ స్కూల్ నిర్మాణ సైట్‌లో పనిచేస్తున్న సివిల్ ఇంజనీర్ శత్రుఘ్న యాదవ్‌తో పాటు, ఆరుగురు ప్లంబర్స్‌పై ఈ దాడి జరిగింది. సోమవారం సాయంత్రం ఈ ఏడుగురు లుంగీలో కూర్చుని ఉండగా.. ముగ్గురు స్థానిక వాసులు వారి దగ్గరకు వచ్చి.. లుంగీలు కట్టుకోవడం ఏంటని, ఇదెక్కడి సాంప్రదాయమని ప్రశ్నిస్తూ దాడి చేశారు.
వెంటనే ఈ నగరం వదిలి వెళ్లాలని హెచ్చరించారు. స్వల్పంగా గాయపడ్డ బాధితులు ఈ దాడిపై ఫిర్యాదు చేయడానికి పోలీస్ స్టేషన్‌కు వెళ్లగా.. నిందితులు కాంట్రాక్టర్ బైక్, నాలుగు కుర్చీలను తగలబెట్టారు. పోలీసులు మాత్రం బీహారీలపై దాడి చేయాలని చేసింది కాదని చెబుతున్నారు. బాధితులు గత కొద్ది రోజులుగా లుంగీల మీద ఉండటంపై స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేశారని, హెచ్చరించారని కూడా తెలిపారు. ఈ నేపథ్యంలోనే వాగ్వాదం చోటుచేసుకుందన్నారు. ఈ ఘటనకు సంబంధించి నిందితులును అదుపులోకి తీసుకున్నామన్నారు. 14 నెలల పసికందుపై అకృత్యానికి పాల్పడిన ఓ బిహారీ యువకుడి కారణంగా గుజరాత్‌లో ఆగ్రహజ్వాలలు పెల్లుబికిన విషయం తెలిసిందే. బిహారీ వాసులు గుజరాత్‌ను విడిచి వెళ్లాలని వారిపై దాడులు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment