అభినవ శబరి... శ్రీలక్ష్మి | abhinava sabari sri lakshmi | Sakshi
Sakshi News home page

అభినవ శబరి... శ్రీలక్ష్మి

Published Mon, Jan 9 2017 10:42 PM | Last Updated on Tue, Sep 5 2017 12:49 AM

అభినవ శబరి... శ్రీలక్ష్మి

అభినవ శబరి... శ్రీలక్ష్మి

  • ఆస్తిని రామాలయానికి దానం చేసిన భక్తురాలు
  • ప్రభుత్వం నుంచి వచ్చే పింఛ¯ŒS సొమ్ములు
  • ఆలయాలకు విరాళాలు
  • అమలాపురంలో శ్రీరామ సేవకురాలికి ప్రజల సత్కారం
  • అలనాడు పరమభక్తురాలైన శబరి శ్రీరాముని దర్శనం కోసం జీవిత కాలం వేచి చూసి చివరకు ఆయన దర్శనంతో తరించింది. శబరి మాదిరిగానే అమలాపురానికి చెందిన ఓ వృద్ధురాలు తన జీవితమే రామమయం అంటూ తన యావదాస్తిని, తనకు వచ్చే పింఛ¯ŒS సొమ్మును కూడా రాముని సేవలకే వినియోగిస్తోంది. రామయ్యా... నీ భక్తులరాలిని ఎప్పుడు నీ వద్దకు తీసుకువెళతావు...అంటూ శ్రీరామ స్మరణతో గడుపుతోంది ఆ పరమ రామభక్తురాలు తిరువీధి శ్రీలక్ష్మి. 
    – అమలాపురం టౌన్‌ 
     
    అమలాపురం శ్రీరామపురానికి చెందిన తిరువీధి శ్రీలక్ష్మి (81) ఆ ప్రాంతంలో గల రూ. 20 లక్షలు విలువ చేసే ఇంటిని అదే వీధిలోని రామాలయానికి రాసి తన రామభక్తిని చాటుకుంది. అంతటితో ఆగకుండా రాముడికి రాసిన ఇంట్లో తాను ఉండకూడదని తక్షణమే ఆ ఇంటి నుంచి తప్పుకుని అద్దె ఇంట్లోకి మారింది. రాముడికి చెందిన ఆ ఇంటిని అద్దెకు ఇచ్చి తద్వారా వచ్చే ఆదాయంతో రోజూ రామాలయంలో ధూప దీప నైవేద్యాలు పెట్టే ఏర్పాట్లు చేసింది. ప్రభుత్వ ఉద్యోగి అయిన భర్త మరణం తర్వాత తనకు వస్తున్న రూ.20 వేల పింఛ¯ŒS సొమ్ములు 80 శాతం వరకూ ప్రతి నెలా పొదుపు చేస్తూ రాష్ట్రంలోని వివిధ విశిష్ట దేవాలయాలకు విరాళాలుగా ఇచ్చేస్తోంది. భద్రాచలం రామన్నకు రూ.లక్ష, తిరుపతి వెంకన్నకు రూ.లక్ష, అన్నవరం సత్తెన్నకు రూ.1.50 లక్షలు, అయినవిల్లి వినాయకుడికి రూ.50 వేలు వంతున తన పింఛ¯ŒS సొమ్ములను పోగేసి విరాళాలుగా అందజేసింది. జీవితాంతం రామ స్మరణంతో బతికే ఆమెను ఈ ప్రాంత వాసులంతా శబరితో పోల్చుస్తుంటారు.
    శ్రీలక్ష్మి విధివంచితురాలే
    శ్రీలక్ష్మి భర్త, ఏకైక కుమారుడితో సాఫీగా సాగిపోతున్న కుటుంబం. భర్త ప్రభుత్వ ఉద్యోగి. కుమారుడికి 30 ఏళ్లు వచ్చాయి. ప్రయోజకడయ్యాడు. పెళ్లి చేద్దామనుకునే సమయంలో ఆనారోగ్యంతో మృతి చెందాడు. ఆ తర్వాత ఏడాదే భర్త చనిపోయారు. దీంతో శ్రీలక్ష్మి ఏకాకి అయింది. తన బంధువులు ఉన్నా అప్పటికే రామభక్తురాలైన ఆమె పూర్తిగా ఆధ్యాత్మిక బాటలో పయనించారు. పదేళ్లుగా శ్రీరాముని పరమభక్తురాలిగా మారిపోయి రామ సేవలోనే తరిస్తున్నారు.
    బంధువులకూ ఆస్తులు రాసేసిన ఔదార్యం
    శ్రీలక్ష్మి తన ఆస్తులను దేవుళ్లు, ఆలయాలకే కాదు.. తన బంధువులకు రాసేసిన ఔదార్యం ఆమెది. కొన్నేళ్ల కిందటే తనకు చెందిన రాజమహేంద్రవరం గోవర్దన పేటలో గల రూ.కోటి విలువైన స్థలాన్ని తన ఆడపడుచుకు, అమలాపురంలో ఓ దుకాణ గదిని తన చిన్నాన్న కుమారిడికి రాసేసింది. నేను నమ్ముకున్న రాముడే నాకు తోవ చూపిస్తాడని శ్రీలక్ష్మి అంటున్నారు. 
    శ్రీలక్షి్మకి పౌర సత్కారం
    రూ.లక్షలు విలువ చేసే తన ఇంటిని రామాలయానికి రాసి ఇచ్చిన స్థానిక మద్దాలవారిపేట, శ్రీరామపురం ప్రజలు అదే రామాలయంలో శ్రీలక్షి్మకి ఆదివారం రాత్రి ఘనంగా పౌర సన్మానం చేశారు. శ్రీలక్ష్మి బాగోగులు తామంతా చూసుకుంటామని పేర్కొన్నారు. వైఎస్సార్‌ సీపీ నాయకుడు, కౌన్సిలర్‌ వాసంశెట్ట సత్యం, పార్టీ యువజన విభాగం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి వాసంశెట్టి సుభాష్‌ ఆధ్వర్యంలో జరిగిన ఈ సత్కార సభకు పట్టణ సీఐ వైఆర్‌కే శ్రీనివాస్‌ ముఖ్య అతిథిగా పాల్గొని ఆమెను సన్మానించారు. శ్రీలక్ష్మి భక్తిపరమైన సేవలు ఆదర్శనీయమని కొనియాడారు. మద్దాలవారిపేట, శ్రీరామపురం పెద్దలు రాయుడు సత్యరుషి, బొంతు శేఖర్, కుడుపూడి శ్రీరామ్, గుబ్బల నాగబాబు తదితరులు సత్కరించారు.  
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement