అనంతపురం న్యూసిటీ : నగరంలోని స్మాష్ బ్యాడ్మింటన్ ఇండోర్ స్టేడియంలో జిల్లా స్థాయి బ్యాడ్మింటన్ పోటీలు ఆదివారం ఆసక్తికరంగా సాగాయి. వివిధ విభాగాల్లో క్రీడాకారులు పోటాపోటీగా తలపడ్డారు. ముఖ్య అతిథి డీఎస్‌డీఓ బాషామొహిద్దీన్ క్రీడాకారుల బహుమతులనందజేశారు. ఈ సందర్భంగా డీఎస్‌డీఓ మాట్లాడుతూ గెలుపోటములు సమానంగా తీసుకుని ముందుకెళ్లాలన్నారు. బ్యాడ్మింటన్ సంఘం జిల్లా అధ్యక్షులు శ్రీనివాసన్ మాట్లాడుతూ ప్రతిభ చూపిన క్రీడాకారులు రాష్ట్రస్థాయి బ్యాడ్మింటన్ పోటీల్లో ఆడే అవకాశం ఉంటుందన్నారు. కార్యక్రమంలో బ్యాడ్మింటన్ సంఘం సభ్యులు కమతం శ్రీనివాసులు, జయరాజ్, తదితరులు పాల్గొన్నారు.
విజేతల వివరాలిలా...
అండర్ –17 బాలుర విభాగంలో బి.విజయ్ (యాడికి) విన్నర్, ఎంపీ ఆశిష్‌రెడ్డి (అనంతపురం) రన్నర్‌గా నిలిచారు. అండర్ 17/19 విభాగంలో విన్నర్‌గా శ్వేత నిలిచారు. అండర్ –13 బాలుర విభాగంలో విన్నర్‌గా రామ్‌గౌని సాకేత్, రన్నర్‌గా గణాదిత్య, బాలికల విభాగంలో ఎంఎస్ ఇషిత విన్నర్‌గా, వి. సృజన రన్నర్‌గా నిలిచారు.
ఆసక్తికరంగా బ్యాడ్మింటన్ పోటీలు
Published Sun, Jul 9 2017 11:31 PM | Last Updated on Fri, Jun 1 2018 8:39 PM
Advertisement
Advertisement