గన్నవరం : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ శుభాకాంక్షలు తెలిపారు. నూతన రాజధాని శంకుస్థాపన సందర్భంగా ఆయన గురురవారమిక్కడ మాట్లాడుతూ ప్రపంచ స్థాయి నగరంగా అమరావతి వెలుగొందాలని ఆకాంక్షించారు. భవిష్యత్ లో అమరావతి అన్నివిధాలుగా ముందు ఉంటుందని దత్తాత్రేయ ఆకాంక్షించారు. రాజధాని అభివృద్ధికి కేంద్రం అన్నివిధాల సాయం అందిస్తుందని ఆయన తెలిపారు. అమరావతి శరవేశంగా అభివృద్ధి చెందాలని అన్నారు. చారిత్రాత్మక నిర్మాణా కార్యక్రమంలో పాల్గొనటం తన అదృష్టంగా భావిస్తున్నట్లు దత్తాత్రేయ తెలిపారు.
అమరావతి అన్నివిధాల ముందుండాలి
Published Thu, Oct 22 2015 10:32 AM | Last Updated on Sat, Jun 2 2018 2:56 PM
Advertisement
Advertisement