సౌదీలో రాహత్‌నగర్‌ యువకుడు మృతి | district resident died in saudi | Sakshi
Sakshi News home page

సౌదీలో రాహత్‌నగర్‌ యువకుడు మృతి

Published Mon, Oct 3 2016 10:33 PM | Last Updated on Wed, Apr 3 2019 8:07 PM

సౌదీలో రాహత్‌నగర్‌ యువకుడు మృతి - Sakshi

సౌదీలో రాహత్‌నగర్‌ యువకుడు మృతి

భీమ్‌గల్‌ : భీమ్‌ల్‌ మండలం రాహత్‌నగర్‌ సౌడ తండాకు చెందిన మాలావత్‌ దేవేందర్‌ (28) పది రోజుల క్రితం సౌదీలో అనారోగ్యంతో మృతి చెందాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం దేవేందర్‌ మూడేళ్ల క్రితం బతుకుదెరువు కోసం సౌదీకి వెళ్లాడు. మధ్యలో రెండేళ్ల క్రితం స్వదేశానికి వచ్చి వెళ్లాడు. అయితే 20 రోజుల క్రితం తీవ్ర జ్వరంతో బాధపడుతూ అక్కడి ఆస్పత్రిలో చేరాడు. పది రోజుల చికిత్స అనంతరం గత నెల 24న మృతి చెందినట్లు కుటుంబసభ్యులకు సమాచారం అందింది. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. మృతుడికి భార్య జ్యోతి, ఇద్దరు కూతుళ్లున్నారు. మృతదేహం కోసం ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం మృతదేహాన్ని తెప్పించడంలో సహకరించాలని గ్రామస్తులు కోరుతున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement