ఆ హామీలు ఇచ్చి ఉంటే అధికారం మాదే!
రైతుల రుణమాఫీ అంశంపై టీఆర్ఎస్ సర్కార్ తీరును కాంగ్రెస్ ఎమ్మెల్యే డీకే అరుణ విమర్శించారు. ఆదిలాబాద్ పర్యటనలో ఉన్న ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ఒకేసారి రైతుల రుణాలను మాఫీ చేయకుండా, విడతల వారీగా రుణాలు మాఫీ చేస్తూ రైతులను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. ఇలాంటి తప్పుడు హామీల వల్లే కేసీఆర్ తెలంగాణకు సీఎం అయ్యారని డీకే అరుణ ఆరోపించారు. మోసపూరిత హామీలు ఇచ్చి ఉంటే కాంగ్రెస్ పార్టీనే నేడు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేదని ఆమె అభిప్రాయపడ్డారు.