ఐపీ రైట్స్‌తో సంపదకు రక్షణ:గవర్నర్‌ | IP protection of property rights : Governor | Sakshi
Sakshi News home page

ఐపీ రైట్స్‌తో సంపదకు రక్షణ:గవర్నర్‌

Published Thu, Sep 8 2016 11:28 PM | Last Updated on Tue, Aug 21 2018 11:41 AM

ఐపీ రైట్స్‌తో సంపదకు రక్షణ:గవర్నర్‌ - Sakshi

ఐపీ రైట్స్‌తో సంపదకు రక్షణ:గవర్నర్‌

బంజారాహిల్స్‌: సమాజంలో వెనకబాటుతనం, పేదరికం నిర్మూలన, అభివృద్ధికి ‘మేధో సంపత్తి హక్కు’ల (ఇంటిలెక్చువల్‌ ప్రాపర్టీ రైట్స్‌–ఐపీ)ను వినియోగించాలని రాష్ట గవర్నర్‌ నరసింహన్ కోరారు. ప్రస్తుత డిజిటల్‌ సాంకేతిక యుగంలో అత్యంత కీలకమైన ఐపీ రైట్స్‌ను కేవలం వ్యాపార దృష్టితో మాత్రమే కాకుండా సామాన్యుల జీవన ప్రమాణాలు పెంచే దిశగా వాడాలన్నారు.

సీఐఐ, ఏపీటీడీసీన్ సంయుక్త ఆధ్వర్యంలో గురువారం బంజారాహిల్స్‌లోని ఓ హోటల్‌లో ‘మిప్‌కాన్–2016, మేనేజింగ్‌ ఐపీ అసెట్స్‌ ఫర్‌ బిజినెస్‌ అకడమిక్‌ కాంపిటెన్స్’ పేరుతో సదస్సు నిర్వహించారు. ఇందులో గవర్నర్‌ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. వెలకట్టలేని సాంస్కృతిక సంపద, యోగా, ఆయుర్వేదం, ప్రాణాయామం, వేద గణితం వంటి వాటికి మరింత పటిష్టమైన ఐపీ రక్షణ అవసరముందన్నారు.

ఈ దిశగా నిపుణులు దృష్టి పెట్టాలని సూచించారు. ఐసీ రైట్స్‌ ప్రాధాన్యతపై సామాన్యులకు సైతం అర్థమయ్యేలా మరింత ప్రచారం అవసరమని, సంక్లిష్టమైన విధానాలను మరింత సరళతరం చేయడానికి మేధావులు కృషి చేయాలని పిలుపునిచ్చారు. దళారుల దోపిడీ నుంచి పేద కళాకారులకు పూర్తిస్థాయి రక్షణ కల్పించాల్సి ఉందన్నారు.

ఈ సదస్సులో సీఐఐ సదరన్ రీజియన్‌ చైర్మన్ రమేష్‌ దాట్ల, నల్సార్‌ ఫ్రొఫెసర్‌ వివేకానందన్, సీనియర్‌ లీగల్‌ కౌన్సిల్‌ శిల్పి ఝా, ఇంటర్నేషనల్‌ అడ్వాన్స్‌ రీసెర్చ్‌ సెంటర్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ జి. పద్మనాభన్, ఏకే గార్గ్, ఎస్‌.చక్రవర్తి, మహేశ్‌ దేశాయ్‌ తదితరులు పాల్గొన్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement