నయీం కేసుపై రెండు సిట్ల విచారణ | nayeem case is probing by two SITs | Sakshi
Sakshi News home page

నయీం కేసుపై రెండు సిట్ల విచారణ

Published Wed, Aug 17 2016 10:18 AM | Last Updated on Sun, Apr 7 2019 3:50 PM

నయీం కేసుపై రెండు సిట్ల విచారణ - Sakshi

నయీం కేసుపై రెండు సిట్ల విచారణ

విశాఖపట్నం: విశాఖపట్టణంలోనూ గ్యాంగ్ స్టర్ నయీం భూదందాలు చేసినట్లు బయటపడింది. ఈ నేపథ్యంలో రెండు రోజుల క్రితం విశాఖ రైల్వే స్టేషన్లో సీసీ ఫుటేజ్ను సిట్ అధికారులు పరిశీలించారు. రిటైర్డ్ రిజిస్ట్రార్, సబ్ రిజిస్ట్రార్తోపాటు రిటైర్డ్ రెవిన్యూ అధికారులను కూడా విచారిస్తున్నారు.

టీఎస్ సిట్ తో పాటు మహారాష్ట్రకు చెందిన సిట్ కూడా విశాఖపట్నంలో దర్యాప్తు ప్రారంభించింది. పలువురు రౌడీ షీటర్లను నగర పోలీసులు ఇప్పటికే విచారిస్తున్నట్లు సమాచారం. డాక్యుమెంట్ రైటర్స్ను కూడా సిట్ విచారించినట్లు సమాచారం. మరోపక్క, షాద్ నగర్లో నయీం భార్య హసీనా, అక్క సలీమ, వాచ్ మెన్ మతిన్, అతడి భార్య ఖలీమను ఏడు రోజులపాటు కస్టడీలోకి తీసుకోనున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement