రహదారి పనుల్లో లోపిస్తున్న నాణ్యత | Road works quality less | Sakshi
Sakshi News home page

రహదారి పనుల్లో లోపిస్తున్న నాణ్యత

Published Tue, Feb 14 2017 10:42 PM | Last Updated on Tue, Sep 5 2017 3:43 AM

Road works quality less

  • ప్రత్యేక సబ్‌ డివిజ¯ŒS ఏర్పాటు
  • క్వాలిటీ కంట్రోల్‌ ఈఈ బ్రహ్మానందరెడ్డి
  • పెడపర్తి (అనపర్తి): 
    రహదారి నిర్మాణాల్లో నాణ్యతా ప్రమాణాలు లోపిస్తున్నాయని, ఏజెన్సీలో చేపట్టే పనుల్లో నాణ్యత మరింత లోపిస్తున్నదని  పంచాయతీ రాజ్‌ క్వాలిటీ కంట్రోల్‌ ఈఈ ఎస్‌.బ్రహ్మానందరెడ్డి తెలిపారు. మండలంలోని అనపర్తి, పెడపర్తి గ్రామాల్లో చేపట్టిన రహదారి నిర్మాణ పనులను మంగళవారం ఆయన తనిఖీ చేశారు. అనంతరం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ ఏజెన్సీలో చేపడుతున్న నిర్మాణ పనుల్లో నాణ్యత ప్రమాణాలు అధికంగా లోపిస్తున్న విషయాన్ని గుర్తించామన్నారు. అందువల్లే రంపచోడవరంలో ప్రత్యేకించి క్వాలిటీ కంట్రోల్‌ సబ్‌ డివిజ¯ŒS ఏర్పాటు చేసి అక్కడ ఒక డీఈఈ నియమించామన్నారు. తుని, కాకినాడ, అమలాపురం తదితర ప్రాంతాల్లో ఇటీవల నిర్వహించిన పనులకు సంబంధించి సుమారు రూ.25లక్షల మేర చెల్లింపులు నిలిపివేసినట్టు ఆయన తెలిపారు. ప్రతి 150 మీటర్లకు రెండు చోట్ల నమూనాలు తీసుకుంటామని, ఏ ఒక్కచోట నాణ్యత ప్రమాణాలు లోపించినా చర్యలు తీసుకుంటామన్నారు. రహదారుల నిర్మాణంలో సాధారణంగా 20 న్యూట¯ŒS ఫర్‌ ఎం.ఎం స్క్వేర్‌(ఎం20) నాణ్యత పరిగణలోనికి తీసుకుంటామన్నారు. అయితే ఎం17 ఉన్నప్పటికీ నాణ్యతగానే గుర్తిస్తామన్నారు. ఎం 15 నాణ్యత ఉంటే రికవరీకి ఆదేశిస్తామని, అంతకన్నా తక్కువ ఉంటే ఆ ప్రాంతంలో నిర్మాణానికి ఆదేశిస్తామన్నారు. అనపర్తి, పెడపర్తిలో నిర్మించిన ఆరు రహదారుల్లో నమూనాలను పరీక్షిస్తామన్నారు. ఆయన వెంట విజయవాడ జేఈఈలు శంకరప్రసాద్, సత్యనారాయణ, అనపర్తి డీఈ ఏవీ సూర్యనారాయణ, ఏఈ నాగేంద్రప్రసాద్‌లు ఉన్నారు. 
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement