సబ్‌కలెక్టరేట్‌లోని గాంధీ విగ్రహం ఎదుట నిరసన తెలుపుతున్న విద్యార్థులు
స్కాలర్‌షిప్పుల కోసం విద్యార్థుల నిరసన
Published Wed, Sep 28 2016 11:13 PM | Last Updated on Thu, Apr 4 2019 5:45 PM
మదనపల్లె రూరల్: తమకు స్కాలర్‌షిప్పులు రావడంలేదని పేర్కొంటూ పీజీ చేస్తున్న ఓబీసీ విద్యార్థులు బుధవారం సబ్‌కలెక్టరేట్ ఎదుట నిరసన తెలిపారు. వారు మాట్లాడుతూ కళాశాలలో ఫిజిక్స్ గ్రూప్ విద్యార్థులకు స్కాలర్‌షిప్ వచ్చి ఇతరులకు ఇవ్వకపోవడంపై దారుణమన్నారు. స్కాలర్‌షిప్‌కు అవసరమైన అన్ని సర్టిఫికెట్లను జతపరిచి వెబ్‌సైట్‌లో వెళ్లి చూడగా పెండింగ్ అట్ కలెక్టర్ ఆఫీస్ అంటూ వస్తోందని తెలిపారు. చిత్తూరుకు వెళ్లి కలెక్టరేట్‌లో విచారించగా తమకేమీ సంబంధం లేదని పేర్కొంటున్నారని, విజయవాడలోని ఈబీసీ కార్పొరేషన్‌కు వెళ్లి కనుక్కోండంటూ చెబుతున్నారని వాపోయారు. ఇప్పటికే స్కాలర్‌షిప్‌లు రానివారు కళాశాల ఫీజులు చెల్లించాలని యాజమాన్యం ఒత్తిడి తెస్తోందని తెలిపారు. అనంతరం సబ్‌కలెక్టరేట్‌లో ఏవో సురేంద్రబాబుకు వినతిపత్రం సమర్పించారు. నిరసన తెలిపిన వారిలో ఏబీవీపీ నాయకులు భరత్‌రెడ్డి, భరత్‌చౌహాన్, ఖాజా, మస్తాన్, చందు పాల్గొన్నారు.
Advertisement