- నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ
- హాజరుకానున్న 3.73 లక్షలమంది అభ్యర్థులు
సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) ఆదివారం జరగనుంది. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పేపర్-1, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పేపర్-2 పరీక్ష జరుగుతాయి. రెండు పరీక్షలకు కలిపి రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 3,73,494 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. అభ్యర్థులను నిర్ధేశిత సమయం కంటే అరగంట ముందే పరీక్ష హాల్లోకి అనుమతిస్తామని... ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించే ప్రసక్తే లేదని అధికారులు స్పష్టం చేశారు.
ఈ పరీక్షలు ప్రశాంతంగా జరిగేలా అన్ని ఏర్పాట్లు పూర్తిచేశామని విద్యాశాఖ ఉన్నతాధికారులు తెలిపారు. పేపర్-1 పరీక్షకు సంబంధించిన సెట్ కోడ్‌ను ఉదయం 6 గంటలకు సచివాలయంలో విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజీవ్ రంజన్ ఆచార్య విడుదల చేస్తారని... పేపర్-2 పరీక్ష సెట్ కోడ్‌ను ఉదయం 10 గంటలకు విద్యాశాఖ సంచాలకుల కార్యాలయంలో డెరైక్టర్ కిషన్ విడుదల చేస్తారని టెట్ కన్వీనర్ జగన్నాథరెడ్డి తెలిపారు.
నేడే టెట్
Published Sun, May 22 2016 4:11 AM | Last Updated on Thu, Jul 11 2019 5:01 PM
Advertisement
Advertisement