అపార్ట్‌మెంట్లే లక్ష్యం.. చోరీలే మార్గం
♦ ఇద్దరు నిందితుల అరెస్ట్
♦ 26 కాసుల బంగారు ఆభరణాలు స్వాధీనం
ఏలూరు (సెంట్రల్):
నగరంలోని అపార్టుమెంట్లే లక్ష్యం గా చోరీలకు తెగబడుతున్న ఇద్దరు నిం దితులను టూటౌన్ పోలీసులు అరెస్ట్‌చేశారు. వారి నుంచి 26 కాసుల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. స్థానిక టూటౌన్ పోలీసుస్టేషన్‌లో బుధవారం డీఎస్పీ గోగుల వెంకటేశ్వరరావు కేసుకు సంబంధించిన వివరాలను విలేకరులకు వెల్లడించారు. నగరంలోని టూటౌన్ పరిధిలోని తంగెళ్లమూడి, యాదవ్‌నగర్, బాలయోగి వంతెన, గన్‌బజార్, సెయింట్ థెరిస్సా స్కూల్ ప్రాంతాల్లోని ఆపార్ట్‌మెంట్లలో చోరీలు జరిగినట్టు పోలీసులకు ఐదు ఫిర్యాదులు అందాయి. పోలీసులు పాత నేరస్తులపై నిఘా పెట్టారు.
దీనిలో భాగంగా పాములదిబ్బకు చెందిన దాసరి పేతురు, హనుమాన్ జంక్షన్‌లో శేరి నరసన్నపాలెంకు చెందిన వల్లూరి సతీష్‌ను అదుపులోకి తీసుకుని విచారించారు. నగరంలోని పలుచోట్ల చోరీలకు పాల్పడింది వీరే అని విచారణలో వెల్లడైంది. వారి నుంచి 26 కాసుల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్టు డీఎస్పీ గోగుల వెంకటేశ్వరరావు తెలిపారు. నిందితులను అరెస్ట్ చేయడంలో చాకచాక్యంగా వ్యవహరించడంతో పాటు వారి నుంచి రూ.5 లక్షల విలువ చేసే బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకోవడంలో ప్రతిభ కనబర్చిన టూటౌన్ సీఐ జి.మధుబాబు, సిబ్బందికి ప్రోత్సాహం ఇవ్వాలని జిల్లా ఎస్పీని కోరనున్నట్టు డీఎస్పీ చెప్పారు. సమావేశంలో సీఐ మధుబాబు పాల్గొన్నారు.