మచిలీపట్నం (కృష్ణా జిల్లా) : మచిలీపట్నం మండల పరిధిలోని మంగినపూడి బీచ్‌లో స్నానం చేసేందుకు వెళ్లిన ఇద్దరు యువకులు సముద్రంలో గల్లంతయ్యారు. ఆదివారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. గుడివాడ పట్టణానికి చెందిన ఆరుగురు యువకులు బీచ్‌కు వెళ్లగా.. అందరూ సాగర జలాల్లోకి దిగారు. వీరిలో ఇద్దరు గల్లంతు కాగా, నలుగురిని మత్స్యకారులు కాపాడి ఒడ్డుకు తీసుకొచ్చారు. వారు అస్వస్థతకు గురి కావడంతో హుటాహుటిన మచిలీపట్నం ఆస్పత్రికి తరలించారు.