సాక్షి, కొత్తగూడెం:జిల్లాలోని రెండు పోలీస్ సబ్ డివిజన్లకు నూతన డీఎస్పీలను నియమిస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇల్లె్లందు డీఎస్పీగా పనిచేస్తున్న ఆర్.వీరేశ్వరరావును హైదరాబాద్ డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాల్సిందిగా ఆదేశించి, ఆయన స్థానంలో ఇంటెలీజెన్స్‌లో డీఎస్పీగా పనిచేస్తున్న ప్రకాశరావును నియమించింది. అలాగే జిల్లాల పునర్విభజన అనంతరం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నూతనంగా ఏర్పాటైన పాల్వంచ పోలీస్ సబ్ డివిజన్‌కు డీఎస్పీగా వి.శ్రీనివాసులును నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇక గత కొంతకాలంగా ఖాళీగా ఉన్న భద్రాచలం సబ్ డివిజన్‌కు మాత్రం ఎవరినీ నియమించలేదు. అయితే శాంతిభద్రతలు, ప్రొటోకాల్ పరంగా కీలకమైన భద్రాచలం పోలీస్ సబ్‌డివిజన్‌కు యువ ఐపీఎస్ అధికారిని నియమించాలనే యోచనతోనే సోమవారం నాటి డీఎస్పీల బదిలీలలో ఇక్కడి పోస్టును భర్తీ చేయలేదని పోలీస్ వర్గాలు భావిస్తున్నాయి. దాదాపు రెండు సంవత్సరాలపాటు ఇల్లె్లందు డీఎస్పీగా పనిచేసిన వీరేశ్వరరావు పలు కీలక కేసులను ఛేదించారన్న పేరు సాధించారు.
ఇక పాల్వంచ కొత్త పోలీస్ సబ్‌డివిజన్‌కు డీఎస్పీగా నియమితులైన వి.శ్రీనివాసులు ప్రస్తుతం హైదరాబాద్‌లోని సంతోష్‌నగర్ ఏసీపీగా పనిచేస్తున్నారు. శంషాబాద్ జిల్లా ఆమనగల్ మండలం ఆకుతోటపల్లికి చెందిన శ్రీనివాసులు 2012లో గ్రూప్–1 డీఎస్పీగా నియమితులయ్యారు. ఏసీపీగా తొలిపోస్టింగ్ సంతోష్‌నగర్‌లో ఇవ్వగా, డీఎస్పీగా తొలి పోస్టింగ్ పాల్వంచ కావడం విశేషం. ఇల్లెందు డీఎస్పీగా నియమితులైన ప్రకాశ్‌రావు పోలీస్ అధికారిగా ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సుపరిచితుడు. ఏన్కూరు ఎస్సైగా, ఖమ్మం టౌన్ ఎస్సైగా, సీఐగా విధులు నిర్వహించడంతోపాటు జిల్లాలోని పలు ప్రాంతాల్లో పనిచేశారు. డీఎస్పీల బదిలీలు పూర్తికావడంతో ఇక సీఐల బదిలీలపై ప్రభుత్వం కసరత్తు చేసే అవకాశం ఉందని పోలీస్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. జిల్లాలోని పలువురు సీఐలకు స్థానచలనం కలిగే అవకాశం ఉన్నట్లు భావిస్తున్నారు.
నేడో,రేపో బాధ్యతలు స్వీకరణ
ఇల్లెందు: ఇల్లెందు డీఎస్పీగా నియమితులైన జి. ప్రకాశరావు నేడో, రేపో బాధ్యతలు చేపట్టనున్నారు. కాగా, ఇక్కడి నుంచి బదిలీ అయిన వీరేశ్వరరావు 1985లో ఎస్‌ఐగా నియమితులై కల్లూరు, ఖమ్మం టూటౌన్, సత్తుపల్లి, భద్రాచలంలో విధులు నిర్వహించా రు. సీఐగా ఇదే జిల్లాలోని వెంకటాపురం, ఖమ్మం వన్‌టౌన్, ఇల్లెందు, అశ్వారావుపేట, కొత్తగూడెంలో విధులు నిర్వహించారు. కరీంనగర్, వరంగల్, హైద్రాబాద్‌లోని సైబరాబాద్ స్పెషల్ బ్రాంచ్ ఏసీపీగా విధులు నిర్వహిస్తూ ఇల్లెందు డీస్పీగా 2014 నవంబర్ 20న పోస్టింగ్ పొందారు.
జిల్లాకు ఇద్దరు కొత్త డీఎస్పీలు
Published Tue, Dec 13 2016 3:15 AM | Last Updated on Tue, Aug 21 2018 8:52 PM
Advertisement
Advertisement