పోలీస్‌స్టేషన్లు, క్యార్టర్లకు కొత్త కళ
నిజామాబాద్ క్రైం : తెలంగాణ ఏర్పడిన తర్వాత రాష్ట్రంలోని పోలీసులకు వరాల జల్లు కురిపించిన ప్రభుత్వం, ఇప్పుడు పోలీసులకు సకల సౌకర్యాలు కల్పించేందుకు సిద్ధమవుతోంది. దీనిలో భాగంగా జిల్లాలో పోలీస్‌స్టేషన్లు, నూతన క్వార్టర్ల నిర్మాణానికి త్వరలో గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. ఈ మేరకు జిల్లాలో శిథిలావస్థలో ఉన్న పోలీస్‌స్టేషన్లు, పోలీసు సిబ్బంది నివాసముండే క్వార్టర్లను అధికారులను గుర్తించారు.
ఎన్నో ఏళ్ల క్రితం నిర్మించిన క్వార్టర్లు ప్రస్తుతం శిథిలావస్థకు చేరుకుని కూలేందుకు సిద్ధంగా ఉన్నాయి. దీంతో ఈ క్వార్టర్లలో నివాసముండేందుకు సిబ్బంది భయాందోళన చెందుతున్నారు. ఇక వర్షం కురిస్తే సిబ్బంది పడే కష్టాలు చెప్పేవీ కావు. ఈ క్వార్టర్ల తలుపులు, కిటికీలు పూర్తిగా చెడిపోవడంతో మరమ్మతులు చేసినా ఉపయోగం లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో కొత్తగా కార్యాలయాలు, క్వార్టర్లు నిర్మించేందుకు రూపొందించిన ప్రతిపాదన జిల్లా పోలీసు శాఖ నుంచి ప్రభుత్వానికి నివేదికలు వెళ్లాయి.
ప్రస్తుతం పరిపాలనా పరంగా ఇబ్బందిగా ఉన్న కార్యాలయాలను తొలగించి వాటి స్థానంలో కొత్తవి నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. జిల్లాలో శిథిలావస్థకు చేరుకున్న నవీపేట్, ఎడపల్లి, జుక్కల్, మద్నూర్, సదాశివనగర్, కామారెడ్డి, దోమకొండ పోలీస్ క్వార్టర్లను తొలగించి వాటి స్థానంలో కొత్త భవనాలు నిర్మాణాలు త్వరలో చేపట్టనున్నారు. అలాగే ఇప్పటి వరకు నందిపేట్, భీంగల్, జిల్లా కేంద్రంలోని నాల్గవ టౌన్ పోలీస్‌స్టేషన్లకు క్వార్టర్లు లేవు. ఇక్కడ కూడా కొత్తవి నిర్మించేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు.
కొత్త కార్యాలయాలు ...
జిల్లాలో కొన్ని పోలీస్‌స్టేషన్లు పరిపాలనపరంగా బాగుండగా, మరికొన్ని ఇబ్బందికరంగా మారాయి. వాటి స్థానంలో కొత్తవి నిర్మించేందుకు అధికారులు సంక్పలించారు. ఆర్మూర్, ఎల్లారెడ్డి, నిజామాబాద్ రూరల్ పోలీస్ కార్యాలయాలు, బోధన్ డీఎస్పీ కార్యాలయాలు కొత్తగా నిర్మించేందుకు ప్రతిపాదించారు. ఇవి ప్రస్తుతం ఇరుకుగా ఉండటంతో సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారు. సర్కిల్ కార్యాలయాలు, డీఎస్పీ కార్యాలయాలు కొత్తగా నిర్మించేందుకు ప్రతిపాదనలతో కూడిన జాబితా కూడా ప్రభుత్వ చెంతకు చేరింది. తీసుకున్నట్లు ఉత్తర్వుల్లో కేంద్రం వివరించింది.
ప్రాణహిత అడవి లో కృష్ణ జింకలతోపాటు సాంబరు, తెల్ల మచ్చల జింకలు, నీలుగాయిలూ ఉన్నాయి. అప్పుడప్పుడు టైగర్ కూడా వచ్చి వెళ్తోందని స్థానికులు అంటుంటారు. ప్రాణహితకు అభయారణ్యం హోదా కల్పిస్తే అడవుల సంరక్షణ, అందులో ఉన్న జంతువుల సంరక్షణ కోసం కేంద్రం నుంచి ప్రత్యేక నిధులూ రానున్నాయి. మరోపక్క.. ఇప్పటికే కవ్వాల్ అభయారణ్యం ఉన్న జిల్లాలో మరో అభయారణ్యం ఏర్పడనుంది. జిల్లాలో దట్టమైన అడవులుండడం.. వాటిలో అరుదైన జంతువులు ఉండడంతో ఇప్పటికే పరిరక్షణ చర్యలు కొనసాగుతున్నాయి.