ఎడ్యూ న్యూస్: ఉన్నత విద్య కోసం అగ్రరాజ్యం అమెరికా కు విద్యార్థులను పంపిస్తున్న నగరాల జాబితా లో హైదరాబాద్ ప్రపంచంలో నాలుగో స్థానం దక్కించుకుంది. ఈ విషయంలో భారత్‌లోని మిగిలిన అన్ని నగరాల కంటే తొలిస్థానంలో నిలవడం గమనార్హం. అమెరికాకు చెందిన బ్రూ కింగ్స్ ఇన్‌స్టిట్యూషన్ నిర్వహించిన తాజా అధ్య యనంలో ఈ విషయం వెల్లడైంది. 2008 నుంచి 2012 వరకు విద్యాభ్యాసం కోసం అమెరికాకు న్యూఢిల్లీ, ముంబైల నుంచి వెళ్లిన విద్యార్థుల కంటే హైదరాబాద్‌నుంచి వెళ్లిన విద్యార్థుల సంఖ్యే అధికం కావడం విశేషం.
ఎఫ్-1 వీసాలపై అమెరికాకు వచ్చిన విదేశీ విద్యార్థులం దరిలో సగానికంటే ఎక్కువ మంది ప్రపంచం లోని 94 నగరాల నుంచే వచ్చారు. సియోల్, బీజింగ్, షాంగై, హైదరాబాద్, రియాద్ నగరాలు తొలి స్థానాల్లో నిలిచాయి. హైదరాబా ద్ నుంచి 26,220 మంది, ముంబై నుంచి 17,294, చెన్నై నుంచి 9,141, బెంగళూరు నుంచి 8,835, ఢిల్లీ నుంచి 8,728 మంది అమెరికాకు వెళ్లారు. విజయవాడ, విశాఖపట్నం నగరాలు కూడా బ్రూకింగ్స్ ఇన్‌స్టిట్యూషన్ జాబితాలో చోటు దక్కించుకున్నాయి. ముంబై, ఢిల్లీ, బెంగళూరు విద్యార్థులు అమెరికాలో బాగా పేరున్న విద్యాసంస్థల్లో చేరుతుండగా.. హైదరా బాద్ స్టూడెంట్స్ మాత్రం చిన్నాచితక సంస్థల్లో సైతం చేరుతున్నట్లు బ్రూకింగ్స్ పేర్కొంది.
జనవరి 4న ‘గ్జాట్’
జేవియర్ ఆప్టిట్యూడ్ టెస్ట్(గ్జాట్) రిజిస్ట్రేషన్ తేదీలను ప్రముఖ బిజినెస్ స్కూల్ ఎక్స్‌ఎల్‌ఆర్‌ఐ-జంషెడ్‌పూర్ ప్రకటించింది. ఈ పరీక్ష కోసం నవంబర్ 22లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. గ్జాట్‌ను వచ్చే ఏడాది జనవరి 4న నిర్వహించనున్నట్లు తెలిపిం ది. పెన్, పేపర్ ఫార్మాట్‌లో పరీక్ష జరుగుతుందని వెల్లడించింది. జూన్ 10, 2015లోగా గ్రాడ్యుయేషన్ పూర్తిచేసేవారు గ్జాట్ రాసేందుకు అర్హులు. ఈసారి దేశవ్యాప్తంగా 47 కేంద్రాల్లో ఈ పరీక్షను నిర్వహిస్తారు. వందకుపైగా బిజినెస్ స్కూల్స్ ప్రవేశాల విషయంలో గ్జాట్ స్కోర్‌ను పరిగణనలోకి తీసుకుంటున్నాయి.
వెబ్‌సైట్: www.xatonline.net.in
అమెరికాకు విద్యార్థులు హైదరాబాద్ నుంచే అధికం!
Published Wed, Sep 3 2014 12:14 AM | Last Updated on Sun, Apr 7 2019 3:35 PM
Advertisement
Advertisement