భారతదేశాన్ని మంత్రగాళ్లు పాలిస్తున్నారుః మోడీ | Black magician ruling India, says Narendra Modi | Sakshi
Sakshi News home page

భారతదేశాన్ని మంత్రగాళ్లు పాలిస్తున్నారుః మోడీ

Published Thu, Apr 10 2014 3:53 PM | Last Updated on Mon, Oct 22 2018 9:16 PM

భారతదేశాన్ని మంత్రగాళ్లు పాలిస్తున్నారుః మోడీ - Sakshi

భారతదేశాన్ని మంత్రగాళ్లు పాలిస్తున్నారుః మోడీ

గత పదేళ్ల యూపీఏ పాలన మంత్రగాళ్ల పాలన అనిబీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ పరోక్షంగా యూపీఏను, దాని అధినేత సోనియాగాంధీని విమర్శించారు. భారతీయ జనతాపార్టీ ఓ మాంత్రికుడిని తెచ్చిందని, ఆయన రాత్రికి రాత్రే అంతా మార్చేస్తానంటున్నాడని తనను ఉద్దేశించి సోనియాగాంధీ చేసిన వ్యాఖ్యలను ఆయన జంషెడ్పూర్లో గురువారం జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రస్తావించారు.

యూపీఏ  పదేళ్లుగా ఈ దేశాన్ని పాలిస్తోందని, తత్ఫలితంగా ఉపాధి అవకాశాలు గల్లంతయ్యాయని, రైతుల కష్టాలు పెరిగాయని, సైనికుల తలలు తెగిపోతున్నాయని అన్నారు. ఈ మంత్రగాళ్ల పాలన వల్ల దేశం గత పదేళ్లుగా తీవ్ర దుస్థితిలో ఉందని, తనను తాను కాపాడుకోడానికి కాంగ్రెస్ పార్టీ ప్రజల జీవితాలను కష్టాల్లో పడేసిందని మోడీ మండిపడ్డారు. తాను చాలా పేద కుటుంబంలో పుట్టానని, అందువల్ల పేదల కష్టాలు తనకు తెలుసని, అదే నోట్లో బంగారు చెంచాతో పుట్టినవాళ్లకు పేదల కష్టాలు ఏం తెలుస్తాయని పరోక్షంగా రాహుల్ గాంధీని విమర్శించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement