చంద్రబాబుపై నిప్పులు చెరిగిన చిరంజీవి
విశాఖపట్నం: టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుపై కేంద్ర మంత్రి చిరంజీవి నిప్పులు చెరిగారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా చిరంజీవి ఇక్కడకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు స్వార్థపరుడు అన్నారు. బీజేపీతో పొత్తు దేశం కోసం కాదని, సొంత ప్రయోజనం కోసమే అని మండిపడ్డారు.
చంద్రబాబుకు అధికారం ఇస్తే బషీర్‌బాగ్ సంఘటనలు పునరావృతమవుతాయని హెచ్చరించారు. బీసీలకు, మహిళలకు ఇచ్చిన డిక్లరేషన్లు ఏమయ్యాయన్నారు. గుజరాత్‌లో నరేంద్ర మోడీ అభివృద్ధి మేడిపండేనని చిరంజీ విమర్శించారు.