ప్రధాని మోడీ పాలనలో అవినీతి: పవన్ కల్యాణ్ | corruption in Narendra modi government, says Pawan Kalyan | Sakshi
Sakshi News home page

ప్రధాని మోడీ పాలనలో అవినీతి: పవన్ కల్యాణ్

Published Sat, May 3 2014 6:18 PM | Last Updated on Fri, Mar 22 2019 5:33 PM

ప్రధాని మోడీ పాలనలో అవినీతి: పవన్ కల్యాణ్ - Sakshi

ప్రధాని మోడీ పాలనలో అవినీతి: పవన్ కల్యాణ్

హైదరాబాద్: 'నాకు కొంచెం తిక్కుంది కానీ దానికో లెక్కుంది' అంటూ గబ్బర్సింగ్ సినిమాలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తన స్టయిల్లో చెప్పిన ఈ డైలాగ్ కేక పుట్టించింది. సినిమాలకు వరకు అయితే ఫర్వాలేదు కానీ.. పవన్కు నిజంగానే తిక్కుందా? దానికి లేక్కలేదా? పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం  బహిరంగ సభలో ఆయన మాటలు విన్నవారికి ఈ సందేహం వస్తోంది.

నరేంద్ర మోడీని ప్రధానిని చేయడానికి బీజేపీ, టీడీపీ కూటమి తరపున కాలికి బలపం కట్టుకుని రాష్ట్రమంతా తిరుగుతున్న పవన్ ప్రచార సభల్లో రెచ్చిపోతున్నారు. ఎలాగంటే..  మోడీ ప్రధానిగా ఉన్న సమయంలో దేశంలో అవినీతి హెచ్చుమీరందంటూ పవన్ సెలవిచ్చారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న మోడీ ఇంకా ప్రధాని కానేలేదు. పోనీ పొరపాటుగా అన్నాడని కాస్త సర్దిచెప్పుకున్నా.. నీతి నిజాయితీ గురించి మాట్లాడే బీజేపీకి అవినీతి అంటగట్టడం ఏంటంటూ ఆ పార్టీ కార్యకర్తలు అవాక్కయ్యారు. ఇంతకీ పవన్కు తిక్కుందా లేక ఆవేశమా? ఆయనకే తెలియాలి..!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement