మైనార్టీ భూములను దానం నాగేందర్ కబ్జా చేశారు | sharmila takes on danam nagender | Sakshi
Sakshi News home page

మైనార్టీ భూములను దానం నాగేందర్ కబ్జా చేశారు

Published Sun, Apr 20 2014 2:38 PM | Last Updated on Wed, Jul 25 2018 4:09 PM

sharmila takes on danam nagender

హైదరాబాద్:మాజీ మంత్రి దానం నాగేందర్ మైనార్టీ భూములను కబ్జా చేశారని వైఎస్సార్ సీపీ నేత షర్మిల విమర్శించారు. మంత్రిగా ఉన్న సమయంలో ఆయన తన నియోజకవర్గానికి చేసిందేమీ లేదని మండిపడ్డారు. జిల్లాలోని ఖైరతాబాద్ నియోజవర్గం ఎన్నికల రోడ్ షోలో షర్మిల ప్రసంగించారు. ఆయన అసలు ఖైరతాబాద్ నియోజకవర్గానికి చేసేందేమీ లేదన్నారు. ఆ దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ ఆశీస్సులతోనే దానం గెలిచిన సంగతిని షర్మిల గుర్తు చేశారు. వెన్నుపోటే పొడిచే నాయకులను ఎన్నుకోవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. బీఎస్ మక్తాలోని మైనార్టీ భూములను దానం కబ్జా చేశారన్నారు.

 

ఖైరతాబాద్ నియోజకవర్గం నుంచి వైఎస్సార్ సీపీ తరుపున పోటీ చేస్తున్న విజయారెడ్డిని గెలిపించి నియోజకవర్గ అభివృద్ధి సహకరించాలన్నారు. ఆమె గెలిచాక ఆ భూమిని మైనార్టీలకు అప్పగించే చర్యలు చేపడతామని షర్మిల  తెలిపారు.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement