యోగాతో నడుమునొప్పి దూరం!
పరిపరిశోధన
యోగాతో ఉన్న ఉపయోగాల గురించి ఎంత చెప్పినా తక్కువే. అయితే యోగాతో నడుమునొప్పికి సైతం ఉపశమనం దొరుకుతుందని చెబుతున్నారు అమెరికన్ పరిశోధకులు. ఇటీవల నిర్వహించిన ఒక అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. నడుమునొప్పితో దాదాపు 12 వారాలకు పైగా బాధపడుతున్న 320 మంది వ్యక్తులను యోగా క్లాసులకు పంపించారు. వారికి 12 వారాల పాటు నిర్వహించిన యోగా క్లాసులకు పంపించారు. వారిలో చాలామందికి ఉపశమనం దొరికింది.
ఈ అధ్యయన ఫలితాలు ఇటీవలే ప్రతిష్ఠాత్మకమైన ఒక మెడికల్ జర్నల్‌లోసైతం ప్రచురితమయ్యాయి. ఇటీవల యోగాపై జరుగుతున్న పరిశోధనల్లో వెల్లడవుతున్న ఫలితాల నేపథ్యంలో నడుమునొప్పికి ఇచ్చే ఔషధరహిత చికిత్సల్లో (నాన్–డ్రగ్ థెరపీల్లో) యోగా ఒకటని, అది సమర్థంగా పనిచేస్తుందని అమెరికన్ కాలేజ్ ఆఫ్ ఫిజీషియన్స్‌కు చెందిన నిపుణులు సైతం సిఫార్సు చేస్తున్నారు.