చేపలు పట్టడమంటే.....
చేపలు పట్టడమంటే మనందరికీ మహా సరదా. కొన్ని ఎరలు, ఒకటి రెండు గాలాలు చేతపట్టుకుని చెరువుల చెంతకు చేరినవాళ్లమే. అయితే ఈ ఫొటోలో ఉన్నవారంతా కూడా చేపల వేటకే బయల్దేరారు. ప్రస్తుతం అదే పనిలో ఉన్నారు కూడా. మరిక్కడ చెరువుగానీ నదిగానీ లేవుగదా అని అనుకుంటున్నారా?.. వేలాది మంది నిల్చున్నది ఎక్కడోకాదండీ. గడ్డకట్టిన నది మీదనే.
గడ్డ కట్టిన నదిలో చేపలెలా పడతారనుకుంటున్నారా.. ప్రతి ఒక్కరూ చిన్న రంధ్రం చేసి చెమటోడ్చి చేపలు పట్టారు. కొందరైతే ఒట్టి చేతుల్తోనే ఒడిసిపట్టుకుంటారు. ప్రతి ఏటా నిర్వహించే ఐస్ ఫెస్టివల్‌లో భాగంగా దక్షిణ కొరియాలోని హాచియాన్ కౌంటీలోని ఈ ప్రాంతానికి దాదాపు పది లక్షల మంది ఔత్సాహికులు వస్తుంటారు.
శనివారం మొదలైన ఈ ఉత్సవం మూడు వారాలపాటు కొనసాగుతుంది. (ఇన్‌సెట్లో) శనివారం నది ఉపరితలంపై రంధ్రం చేసి చేప కోసం చూస్తున్న బాలుడు.