నల్లగొండ: మాజీ ప్రధాని నెహ్రో జయంతిని పురస్కరించుకుని కాంగ్రెస్ ఆధ్వర్యంలో నాగార్జున సాగర్ లోని విజయవిహార్ లో ఏర్పాటు చేసిన సదస్సు ప్రారంభమైంది. నెహ్రో యువకుడిగా ఉన్నప్పుడు స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొని చేసిన ప్రసంగాలు, ఆయన జీవితంలో ప్రముఖ ఘట్టాలను ఈ సదస్సులో నెమరువేసుకోనున్నారు. అలాగే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి కొత్త ఉత్తేజాన్ని ఇచ్చే విధంగా ప్రముఖులు ప్రసంగించనున్నారు.
అదేవిధంగా వరంగల్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధిని గెలిపించేందుకు అవసరమైన వ్యూహాలపై కూడా చర్చించనున్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య వక్తలుగా సాక్షి ఎడిటోరియల్ డైరెక్టర్ రామచంద్రమూర్తి, ప్రొఫెసర్ నాగేశ్వర్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు జైపాల్ రెడ్డి హాజరయ్యారు. కాంగ్రెస్ పార్టీ నాయకులతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా 500 మంది అతిధులు హాజరుకానున్నారు.