‘వేములవాడ’ అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం
సాక్షి, హైదరాబాద్: యాదాద్రి తరహాలో వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానాన్ని అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. సోమవారం వేములవాడ దేవస్థాన ప్రాంతీయ అభివృద్ధి కమిటీ సీఈవోగా నియమితుడైన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి పురుషోత్తంరెడ్డి, వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ సీఎంను మర్యాద పూర్వకంగా కలిశారు.
వేములవాడ దేవస్థానం అభివృద్ధి కోసం రూ.100 కోట్లు కేటాయించినందుకు ఈ సందర్భంగా కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. కాగా, త్వరలో శృంగేరీ పీఠాధిపతి ఆశీస్సులతో దేవస్థాన అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టనున్నారు.