దళితులపై వివక్ష
సర్కార్‌పై రఘునందన్‌రావు ధ్వజం
కరీంనగర్ సిటీ: నేరెళ్ల నుంచి గూడెం ఘట న వరకు రాష్ట్ర ప్రభు త్వం దళితులపై చూ పిస్తున్న వివక్ష బట్ట బయలవుతోందని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎం.రఘునందన్‌రావు ఆరోపించారు. మంగళవారం కరీంనగర్‌లో బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధులు బండి సంజయ్, మాధవి చౌదరితో కలసి ఆయన విలేకరు లతో మాట్లాడారు.
నేరెళ్ల ఘటనలో అసలు దోషి అయిన ఎస్పీని వదిలిపెట్టి ఎస్సైని సస్పెండ్ చేశారన్నారు. గూడెం ఘటన లోనూ గూడెం వీఆర్‌వోను శిక్షించి ఎమ్మెల్యేకు క్లీన్‌చిట్ ఇస్తున్నారని ధ్వజ మెత్తారు. ఇసుక మాఫియా ఆగడాలపై స్పందించడం లేదన్నారు. టీఆర్‌ఎస్ నేతలకు సంబంధించిన వారు ఉండటం తోనే మౌనం వహిస్తున్నారా? అని రఘునందన్‌రావు ప్రశ్నించారు.