స్కూలుకు వెళ్లి టీచర్ అదృశ్యం | school teacher disappeared | Sakshi
Sakshi News home page

స్కూలుకు వెళ్లి టీచర్ అదృశ్యం

Published Tue, Dec 8 2015 8:08 PM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM

school teacher disappeared

పాఠశాలకు వెళ్లిన ఉపాధ్యాయురాలు కనిపించకుండా పోయిన సంఘటన మల్కాజిగిరి పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్సై నాగేశ్వరరావు కథనం ప్రకారం... బాలసరస్వతీనగర్‌కు చెందిన అరవింద(27) మల్కాజిగిరి గీతానగర్‌లోని ప్రైవేట్ మోడల్ పాఠశాలలో టీచర్‌గా పనిచేస్తోంది. ఈ నెల 7వ తేదీన పాఠశాలకు వెళ్లిన ఆమె తిరిగి ఇంటికి చేరుకోలేదు. సెల్‌ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుండడంతో మంగళవారం ఆమె భర్త ముఖేష్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement