పాక్‌ ప్రయత్నాలను ప్రశంసించాల్సిందే! | China Defends Pak on Terrorism Mark | Sakshi
Sakshi News home page

పాక్‌కు మద్దతుగా చైనా మళ్లీ...

Published Fri, Oct 27 2017 8:15 AM | Last Updated on Fri, Oct 27 2017 8:15 AM

China Defends Pak on Terrorism Mark

బీజింగ్‌ : చైనా మరోసారి తన నైజాన్ని బయటపెట్టుకుంది. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న  పాకిస్థాన్‌కు మద్దతుగా వ్యాఖ్యలు చేసింది. గురువారం ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది.

‘‘ఉగ్రవాదాన్ని అంతమొందించేందుకు(?) పాకిస్థాన్ తీసుకుంటున్న చర్యలు భేష్. ఇందుకోసం పాక్ గొప్ప త్యాగాలు కూడా చేస్తోంది’’ అని చైనా విదేశాంగ మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి గెంగ్ షువాంగ్ ప్రశంసించారు. చాలా ఉగ్రవాద సంస్థలకు పాకిస్థాన్ స్వర్గధామంగా మారిందన్న భారత్‌, అమెరికా ఆరోపణలకు షువాంగ్ స్పందిస్తూ.. పరస్పర సహకారంతో ఉగ్రవాదాన్ని అణచివేయగలమన్న ఆయన.. ఇందుకు పాక్‌, అమెరికాలను ఆహ్వానిస్తున్నట్టు చెప్పారు.

‘‘అమెరికా, భారత్, పాకిస్థాన్‌ సహా అన్ని దేశాలతో సత్సంబంధాల కోసం చైనా ఆహ్వానిస్తోంది’’ అని షువాంగ్ పేర్కొన్నారు. ఆయా దేశాలతో సత్సంబంధాల వల్ల ఈ ప్రాంతంలో శాంతి, సుస్థిరత నెలకొంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అంతేకాదు ఉగ్రవాదాన్ని అణచివేసేందుకు పాక్ తీసుకుంటున్న చర్యలను ప్రపంచం మొత్తం ప్రశంసించాల్సి ఉందన్నారు. అమెరికా కార్యదర్శి రెక్స్ టిల్లర్‌సన్ భారత పర్యటన నేపథ్యంలో పాకిస్థాన్‌కు హెచ్చరికలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు చేసిన కొద్దిగంటలకే చైనా ఇలా పాక్‌ను పొగడటం విశేషం.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement