విద్యార్థుల కోసం ఫేస్‌బుక్‌ కొత్త యాప్‌ | Facebook Launches Teens-Only App Lifestage | Sakshi
Sakshi News home page

విద్యార్థుల కోసం ఫేస్‌బుక్‌ కొత్త యాప్‌

Published Sun, Aug 21 2016 10:42 PM | Last Updated on Sun, Apr 7 2019 4:36 PM

విద్యార్థుల కోసం ఫేస్‌బుక్‌ కొత్త యాప్‌ - Sakshi

విద్యార్థుల కోసం ఫేస్‌బుక్‌ కొత్త యాప్‌

న్యూయార్క్‌: హైస్కూల్‌ విద్యార్థుల కోసం సోషల్‌ మీడియా సంస్థ ఫేస్‌బుక్‌ ‘లైఫ్‌స్టేజ్‌’పేరుతో కొత్త ఐఓఎస్‌ యాప్‌ను ప్రారంభించింది. ఇందులో... వినియోగదారుడు వీడియో రూపంలో ఇచ్చిన ఇష్టాయిష్టాలు, బెస్ట్‌ ఫ్రెండ్స్, అభిరుచులు, సంతోషం, బాధ కలిగించిన సందర్భాలు తదితర వివరాలను వర్చువల్‌ ప్రొఫైల్‌ వీడియోగా మార్చి ఈ నెట్‌వర్క్‌లోని ఇతర విద్యార్థులకు అందుబాటులో ఉంచుతారు. దీంతో తోటివారితో ఉన్న ఉమ్మడి ఆసక్తులు, కోరికల గురించి వారు మరింత తెలుసుకోవచ్చని శనివారం ఓ పోస్టులో ఫేస్‌బుక్‌ వెల్లడించింది.

21 ఏళ్లలోపు వారికే ఈ సౌకర్యం ఉంటుంది. ఎవరైనా తమ పేజీని అప్‌డేట్‌ చేసిన ప్రతిసారి దాన్ని చెక్‌ చేసుకునేలా ఇతరులకు ఫీడ్‌ వెళ్తుంది. యాప్‌లోకి లాగిన్‌ అయిన తరువాత స్కూల్‌ పేరు తెలపగానే ఇతరుల ప్రొఫైల్‌లను చూపుతుంది. ఒకే స్కూల్‌ నుంచి కనీసం 20 మంది ఇందులో నమోదై ఉండాలి. 21 ఏళ్లకు పైనున్న వారు కూడా ఈ యాప్‌తో ప్రొఫైల్‌లు తయారుచేసుకోవచ్చు. కానీ వీరికి ఇతరుల ప్రొఫైల్‌లను చెక్‌ చేసే అవకాశం ఉండదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement