డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికయ్యారని చెప్తే.. మొదట మేం నమ్మలేదు.. అఫ్ఘనిస్థాన్‌లో ఐదేళ్లపాటు తాలిబన్ చెరలో ఉండి.. గతవారం విముక్తి పొందిన కెనడియన్ దంపతులు చెప్పిన మాట ఇది. ఆఫ్ఘన్‌లో పర్యటిస్తుండగా కెనడాకు చెందిన జోషువా బోయ్‌లే, గర్భవతి అయిన ఆయన భార్యను తాలిబన్లు బంధీలుగా పట్టుకున్నారు. తాము బతికే ఉన్నామనే 'రుజువు' చూపించేందుకు ఇటీవల తమ వీడియోను తీశారని, ఆ సమయంలో ట్రంప్ అమెరికా అధ్యక్షుడు అయ్యారని తాలిబన్లు చెప్పారని బోయ్‌లే తెలిపారు. 'మొదట ఆ మాట నా మెదడు వినిపించుకోలేదు. అతను సీరియస్‌గానే చెప్పాడా? అనే డౌట్ కలిగింది' అని బోయ్‌లే తెలిపారు.
ఐదేళ్లు తాలిబన్ చెరలో ఉన్న బోయ్‌లే, అమెరికా పౌరురాలైన అతని భార్య కైట్లాన్ కోలెమన్, వారి ముగ్గురు సంతానాన్ని గత బుధవారం భద్రతాదళాలు కాపాడిన సంగతి తెలిసిందే. బోయ్‌లే కుటుంబం శనివారం స్వదేశం కెనడాకు చేరుకుంది. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన బోయ్‌లే.. బాత్‌టబ్‌లాంటి చిన్న సెల్‌లో తమను బంధించారని, తమకు బయటి ప్రపంచంతో ఎలాంటి సంబంధాలు ఉండేవి కావని, తాలిబన్ చెరలో తాము నరకం అనుభవించామని వివరించాడు.
Comments
Please login to add a commentAdd a comment