మాస్కో: రష్యాలో ఓ విద్యార్థి దారుణానికి పాల్పడ్డాడు. అతను చదువుకుంటున్న పాఠశాలలో ఉపాధ్యాయుడితో పాటు పోలీస్ను కాల్చిచంపాడు. మాస్కోలో సోమవారం ఈ సంఘటన జరిగింది.
నిందితుడు తుపాకీ తీసుకుని పాఠశాలకు వెళ్లాడు. విద్యార్థిని ఆపేందుకు స్కూల్ సెక్యురిటీ గార్డ్ ప్రయత్నించినా అతను పదో తరగతి గదిలోకి వెళ్లాడు. గార్డ్ స్కూల్ అలారమ్ బెల్ మోగించి అప్రమత్తం చేశాడు. కాగా నిందితుడు తరగతి గదిలో దాదాపు 20 మంది విద్యార్థులను బెదిరించి బంధించాడు. అతను ఓ టీచర్ను అక్కడే కాల్చిచంపాడు. తన పట్టుకునేందుకు వచ్చిన పోలీసులపైనా కాల్పులకు దిగగా, ఓ పోలీస్ మరణించాడు. పోలీసులు వెంటనే అతణ్ని అదుపులోకి తీసుకుని విద్యార్థులను రక్షించారు. అతని చెరలో ఉన్న విద్యార్థులెవరూ గాయపడలేదని పోలీసులు చెప్పారు.
స్కూల్లో టీచర్, పోలీస్ను కాల్చిచంపిన విద్యార్థి
Published Mon, Feb 3 2014 4:47 PM | Last Updated on Fri, Nov 9 2018 5:02 PM
Advertisement
Advertisement