అమెరికాలో ఇక 'వాళ్లు' ఉద్యోగం చేయొచ్చు | US to provide work permits to spouses of H-1B visa holders | Sakshi
Sakshi News home page

అమెరికాలో ఇక 'వాళ్లు' ఉద్యోగం చేయొచ్చు

Published Wed, Feb 25 2015 10:09 AM | Last Updated on Thu, Apr 4 2019 3:25 PM

అమెరికాలో ఇక 'వాళ్లు'  ఉద్యోగం చేయొచ్చు - Sakshi

అమెరికాలో ఇక 'వాళ్లు' ఉద్యోగం చేయొచ్చు

వాషింగ్టన్:   హెచ్1  - B  వీసాలపై అమెరికా అధ్యక్షుడు ఒబామా తన హామీని నిలబెట్టుకున్నారు. హెచ్1 - B   కలిగి ఉన్న  వారి భాగస్వాములు అమెరికాలో  ఉద్యోగం చేసుకోవడానికి  అమెరికా ప్రభుత్వం నుండి ఆమోదం లభించింది. మే  26  నుంచి   ఇది అమల్లోకి రానుంది.  

 ఒబామా భారత పర్యటనలో హెచ్ 1B  అనుమతులపై ..సమగ్ర వలస సంస్కరణల్లో భాగంగా తాను పరిశీలిస్తానని  హామీ ఇచ్చిన నేపథ్యంలో   ఈ నిర్ణయం  తీసుకున్నట్టు తెలుస్తోంది. దీంతో అమెరికాలో ఉద్యోగం లేదా ఉపాధి అవకాశాలకు వెళ్లి అక్కడే స్థిరపడిన జీవిత భాగస్వామ్యులు(భార్య లేదా భర్త) అర్హతలు వుండి కూడా, నిబంధనల కారణంగా ఉద్యోగం చేసుకునే అవకాశం లేని భారతీయులకు  ఇక మంచి రోజులు వచ్చినట్టే.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement