సల్మాన్ఖాన్పై హైదరాబాద్లో కేసు నమోదు
బాలీవుడ్ హీరో సల్మాన్ఖాన్పై హైదరాబాద్లోని ఫలక్నుమా పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. బిగ్బాస్ టీవీ రియాల్టీ షోలో ఆయన ముస్లింల మనోభావాలను కించపరిచేలా మాట్లాడారంటూ ఫిర్యాదు అందడంతో కేసు నమోదు చేశారు. ఆయనతో పాటు దర్శకుడు రజత్ రవాలీపై కూడా కేసు నమోదైంది.
మహ్మద్ ఫసీహుద్దీన్ అనే వ్యాపారవేత్త బిగ్బాస్పై కేసు నమోదు చేయాల్సిందిగా కోరుతూ ఆరో అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ను ఆశ్రయించారు. ముస్లింల మనోభావాలను కించపరిచేలా ఆ షో ఉందని ఆయన తెలిపారు. అందులోనే సల్మాన్ఖాన్, దర్శకుడు రజత్ రవాలీల విషయాన్ని కూడా ఆయన పేర్కొన్నారు. సల్మాన్ఖాన్ బిగ్బాస్లో పాల్గొంటున్నవారిని వారి ప్రదర్శన ఆధారంగా స్వర్గానికి, నరకానికి పంపుతాడని, ఆ రెండూ ముస్లింలకు చాలా పవిత్ర పదాలని తెలిపారు. దీంతో పిటిషన్ను విచారించిన కోర్టు, కేసు నమోదు చేయాలని ఫలక్నుమా పోలీసులను ఆదేశించింది.
తరచు వివాదాలతోనే కాలం గడిపే సల్మాన్ఖాన్.. ఎప్పటికప్పుడు ఏదో ఒక మాట మాట్లాడి ఎవరో ఒకరితో గొడవ పెట్టుకుంటూనే ఉంటాడు. చివరకు తన విషయంలో ఆయన చేసే వ్యాఖ్యలు కూడా పలు వివాదాలకు కారణం అవుతుంటాయి. హీరోలు, హీరోయిన్లతోనూ పలుమార్లు గొడవలు పెట్టుకున్న చరిత్ర సల్మాన్ఖాన్కు ఉంది.