ఆ సత్తా ఉంది | I can act glamorous too says Samantha | Sakshi
Sakshi News home page

ఆ సత్తా ఉంది

Published Tue, Aug 12 2014 11:47 PM | Last Updated on Tue, Aug 28 2018 4:30 PM

ఆ సత్తా ఉంది - Sakshi

ఆ సత్తా ఉంది

  తనకు గ్లామరస్‌గా నటంచగల సత్తా వుందని నటి సమంత తెలిపారు. సమంత ఇంతవరకు కుటుంబ కథా చిత్రాల్లోనే నటించారు. పాటల సన్నివేశాలలో అరకొర దుస్తులతో అభిమానులను అలరించారు. ఈ దృశ్యాలు ఇంటర్నెట్‌లోనూ విరివిగా పరుగులు తీస్తున్నాయి. పైగా ఈమె టాలీవుడ్‌లో గోల్డెన్ లెగ్‌గా పేరు తెచ్చుకున్నారు. సమంత నటించిన ప్రతి సినిమా హిట్టే అనే ప్రచారం టాలీవుడ్‌లో అధికంగా ప్రచారం సాగుతోంది. ఇప్పటికీ ఇటు తెలుగులోనూ, ఇటు తమిళంలోనూ బిజీగా ఉన్న ఈ భామ ప్రస్తుతంగా గ్లామరస్‌గా మారుతోంది.
 
 అందాల ఆరబోతకు ఏమాత్రం వెనుకాడకుండా సిద్ధం అంటోంది. తాను ఎలాంటి పాత్రకైనా నప్పుతానని నిరూపించుకోవడానికి శాయశక్తులా కృషి చేస్తానని చెబుతోంది.  మరి ఇంతకీ  గ్లామరస్‌గా మారడానికి కారణమేమిటని కొందరు ప్రశ్నించగా ఆమె బదులిచ్చారు. ఇప్పటివరకు తాను ఎక్కువగా కుటుంబ కథా చిత్రాల్లోనే నటించానని, అవన్నీ హిట్ కావడంతో, కుటుంబ కథా చిత్రాల్లో మాత్రమే తాను నటించగలనని, గ్లామర్ పాత్రలకు తాను సరిపడనని కొందరు భావిస్తున్నట్లు తెలిపారు.
 
 ఈ అభిప్రాయం సరికాదని, కుటుంబ కథా చిత్రాల ఇమేజ్ నుంచి తప్పుకోవాలనుకుంటున్నట్లు పేర్కొన్నారు. దీంతో అంజాన్ చిత్రంలో గ్లామరస్‌గా కనిపించానని తెలిపారు. అందుకే చిట్టి పొట్టి దుస్తులు ధరించడానికి సంకోచించలేదని స్పష్టం చేశారు.  తాను కూడా గ్లామరస్‌గా కనిపించగలనని ఈ చిత్రం ద్వారా నిరూపించానన్నారు. గ్లామరస్‌గా కనిపించడం సులభం కాదని, ఈ సందర్భంగా అటువంటి పాత్ర ల్లో నటించే తారలందరికీ హేట్సాఫ్ తెలుపుతున్నానన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement