హీరోగా రాజమౌళి వారసుడు..? | SS Rajamouli son SS Karthikeya To Turns As Hero | Sakshi
Sakshi News home page

హీరోగా రాజమౌళి వారసుడు..?

Published Wed, Nov 23 2016 2:23 PM | Last Updated on Mon, Sep 4 2017 8:55 PM

హీరోగా రాజమౌళి వారసుడు..?

హీరోగా రాజమౌళి వారసుడు..?

ఎస్ ఎస్ రాజమౌళి.. తెలుగు సినిమా రేంజ్ను అంతర్జాతీయ స్థాయికి చేర్చిన గ్రేట్ డైరెక్టర్. రాజమౌళి విజయం వెనుక ఆయన కుటుంబం అంతా ఉన్న సంగతి తెలిసిందే. అన్న కీరవాణితో పాటు ఆయన భార్య, వదిన, తమ్ముళ్లు ఇతర కుటుంబ సభ్యులు అంతా సినీరంగంలోనే ఉన్నారు. ముఖ్యంగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కే సినిమాలు ఈ కుటుంబం అంతా కలిసి సమిష్టిగా పనిచేస్తుంది. అయితే ఇంత మంది సినీ ప్రముఖులు ఉన్నా.., అందరూ తెరవెనుక పనిచేసేవారు. తన సినిమాల్లో రాజమౌళి చేసే చిన్న చిన్న రోల్స్ తప్ప పూర్తి స్థాయి నటులు ఈ కుటుంబం నుంచి రాలేదు.

అయితే త్వరలో జక్కన్న వారసుడు హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడట. ఇప్పటికే బాహుబలితో పాటు పలు చిత్రాలకు సహాయదర్శకుడిగా, కొన్ని సినిమాలకు పబ్లిసిటీ డిజైనర్గా పనిచేసిన రాజమౌళి తనయుడు, ఎస్ ఎస్ కార్తికేయ హీరోగా ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం నటనలో శిక్షణ తీసుకుంటున్న కార్తీకేయ తెరంగేట్రానికి సరైన ముహుర్తం కోసం  ఎదురుచూస్తున్నాడు. మరి ఈ స్టార్ వారసుడు తండ్రి దర్శకత్వంలోనే ఎంట్రీ ఇస్తాడా..? లేక ఇతర దర్శకులతో కలిసి పనిచేస్తాడా చూడాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement